------మహిళ------ అమ్మగా ఆలిగా, కూతురిగా కోడలిగా, ఆడపిల్లగా ఆడపడుచుగా, ఎన్నో పాత్రల ఏకైక రూపం "మహిళ", ఇన్ని పాత్రల కలబోత ఐన మహిళ , ఒక మగాడి జీవితంలో మాత్రం ఎప్పుడూ రెండు ముఖ్య పాత్రలు పోషిస్తుంది అవే "అమ్మ, ఆలి", మన జీవితంలో ఈ రెండు పాత్రల యొక్క ఆవశ్యకత,ప్రాధన్యత ఎంతుందో అని తెలిపే చిన్న ప్రయత్నమే నా ఈ "కవిత" , చదివి ఆనందించ నన్ను ఆశీర్వదించ ప్రార్ధన........ ***అమ్మ*** చనుబాల నుండి మొదలు ఉన్నాయా ఆమె ప్రేమకు హద్దులు?? తొమ్మిది నెలల తన పదవీ కాలంలో ఏనాడు తన విధి పట్ల కాని, తన ఏకైక భాత్యతైనా నీ పట్ల కాని, ఏ మాత్రం నిర్లక్ష్యత చూపించదు, పాలల్లో కుంకుమ పువ్వు ఎరుపు నీ కోసమే, సమపాలల్లో తినే ఆహరము నీ కోసమే, రోజు ప్రతి రోజు నీ ఎత్తేమైనా పెరిగిందేమోనని అద్దంలో తన మోముని చూడడం పూర్తిగా మరచి నీ ఆకారాన్నే తనివి తీర తన కనులారా చుస్తూ కబుర్లెన్నో చెప్తుంది నీకు మాత్రమే వినిపించేలా తన మనసు నీకు తెలిసేలా, తన గర్భాశయం యొక్క ఏకైక ఆశయం అందమైన నీ రూపం, తన ఎదురుచూపుల ఏకైన గమ్యం మృదువైన నీ దేహం, చిన్న చిన్నగా నువ్వు తనని తన్నుతున్నా వని తెలిసి ఎంత మురిసిపోతుందో పిచ్చి"తల్లి", బహుశా ఈ విశ్వంలో "తనకు గాయమైనా నీకు ఉపశమనమిచ్చే" ఏకైక జీవి "అమ్మే" అయ్యుండచ్చు, ఎముకలిరిగిపోతున్న నొప్పుంటుందని తెలిసినా ఏ మాత్రం నిన్ను తనకొద్దు అననుకోని ఒకే ఒక్క ప్రాణి "అమ్మ", విధాతే నీ రాత రాసింది కానీ ఆ రాతకొక రూపమిచ్చింది మాత్రం అమ్మనే ఈ "ప్రదాత" , జాబిల్లి రావే పాటను, చందమామ,బాలమిత్ర కథలను, బడి గంటను, గోరుముద్దలను, గడపకు కట్టిన ఉయ్యాలను, నూనె పెట్టి నలుగు పామిన లాలను, ఆకాశవాణి పాటను, అందమైన రోజును, ఊహించగలరా "అమ్మ" లేకుండా?????? అమ్మా , నీ పాద సేవేగా కోటి పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం, వేల ఉపవాశాల పుణ్యఫలం, ఏమిచ్చి తీర్చుకోను నీ ఋణం..... ***ఆలి*** "" కార్యేషు దాసి, కరనేషు మంత్రి, భోజ్యేషు మాత, షయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు ధాత్రి, సత్కర్మ నారి, కులధర్మ పత్ని "" శయ్యపై అందాల రాశిగా, సేవలో తానే ఒక దాసిగా, కని పెంచిన కన్నవాళ్ళ కడుపు తీపి నీకు పంచాలని , నువ్వు వేసిన మొదటి ముడికి తన మనసుని, రెండో ముడికి తన తనువుని, మూడో ముడికి తన బ్రతుకుని, నీకిచ్చి, హోమం చుట్టూ నడిచే ఏడడుగుల మొదలు నూరేళ్ళ తన జీవన మార్గమంతా నిన్ను వెనకుండి నడిపిస్తూ, తనూ నీ వెంటే నడుస్తూ, నువ్వు పంచుతున్న ప్రేమతో తన దారికి రంగులద్దుకుంటుంది, నీ జీవితాన సగమై, నీ ప్రేమను పసుపుగా మార్చి, నీ రూపాన్ని సింధూరంగా చేసి, పసుపు కుంకుమల మేలి కలయికలో తన తనువును ఎప్పటికప్పుడు శోభాయమానంగా అలంకరిస్తూ నీ ఉనికే తన అలంకారమని చెప్పకనే చెప్తుంది, నీవే తానుగా, తానే నీవుగా, తన రూపంతో నీ స్వభావాన్ని చూపుతూ నీతో ఏకమై, నీలో మమేకమై, తనహాసపు సుమాలను నీ పూజ కోసమే వెచ్చిస్తూ, తన హృది చేసే శబ్ధంలో నిన్నే ధ్యానిస్తూ, తన జీవన గమనాన్ని నీతోనే నిర్దేశిస్తూ, తన ఆయువు నీదిగా, నీ సంతోషమే తను పీల్చే వాయువుగా, నీ భాధలు తన కంట రాల్చే అశ్రువులుగా, పగలంతా గృహిణి పాత్రలో ఒదిగిపోతూ, రాత్రయితే నీ ఎదపై వాలిపోతూ , నువ్వు తనతో ఉన్న సమయాన్నే గఢియారంలో గుర్తించేంతంగా నీలో నీకే తెలియని నువ్వై నీ నవ్వై "ఆలి", తన వాలుజడను వేరు చేసి జాజి మల్లెను చూడగలరా?? తను లేని పానుపుపై పరువాల కలబోతను కల్పించగలరా?? గజిబిజి రోజులో ఒక్క గడియయినా గల గల పలికే తన ముద్దు ముద్దు మాటలు లేకుండా ఉండగలరా??? మీ మీ విధులకు వెళ్తున్న వేళ ఆరు బయటికొచ్చి మీ చొక్క గుండీకున్న దారాన్ని లాగుతూ గోముగా "సందేలా త్వరగా వచ్చెయ్యండే" అనే పలుకులు వినకుండా ఉండగలరా??? మహిళ మానవ జాతికి సృష్టికర్త, తను లేని మనం లేము ఉండబోము..... మహిళలందరికి మనస్పూర్వక మహిళాదినోత్సవ శుభాకాంక్షలు ......
by Sri Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRWFax
Posted by
Katta