పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ravinder Vilasagaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ravinder Vilasagaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Ravinder Vilasagaram కవిత

నానీలు ~~~ మతం మత్తుమందు నిజం కదూ ? మనసులు కలిస్తేనో అది చిత్తు కదా ! ¤¤¤ నిన్నటి దాకా చెమట ధారలు నేడేమో మేఘామృత ధారలు! ¤¤¤ మీ కరెంటూ మీదే మీ బొగ్గూ మాదే ? మరి రొండు చెయ్యిల బాముడేనా ? 22.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWe1KQ

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Ravinder Vilasagaram కవిత

్ నివాళి -------- మూడు తరాల నాయకుడు మృదుభాషి నడుస్తున్న చరిత్రను వయ్యిల రాసి వలసపాలకుల వివక్షను ఎరుకజేసిన వైతాలికుడు తెలంగాణ సోయిని ప్రతి గుండెలో వెలిగించిన వాడు శత్రువు ఎంత భలవంతుడయినా తిరగబడ్డ ధీరుడు తెలంగాణ సిద్ధంతకర్త తెలంగాణ పెద్ద సార్ ప్రొ కొత్తపల్లి జయశంకర్ సార్ 21.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wcAabb

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Ravinder Vilasagaram కవిత

మతం మత్తుమందు పాత మాట మనసులు కలిస్తే మతం చిత్తు! 19.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nilz7r

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Ravinder Vilasagaram కవిత

నిన్నటి దాకా చెమట ధారలు నేడేమో మేఘామృత ధారలు ! 18.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDTVZe

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Ravinder Vilasagaram కవిత

చెయ్యెత్తిన చోట ఆర్టీసీ బస్సే కాదు సిఎం కాన్వాయ్ కూడా ఆగుతుంది! 17.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n7hCCD

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Ravinder Vilasagaram కవిత

ఆత్మీయత అమ్మతో తెలిసింది అనురాగం నాన్నయౌ వెలిగాడు

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mZbyMe

Posted by Katta

29, మే 2014, గురువారం

Ravinder Vilasagaram కవిత

అడవి తల్లి ఆవేదన ~~~~~~~~~~~~~~~ అందాల కల్పవల్లిన ి ఆనందాల హరివిల్లును భూమాత వొడిలో విరిసిన తరులతల పచ్చని బంగారాన్ని... పక్షుల కిలకిల రావాలతో పండువెన్నెల వెలుగులతో అందాలన్నీ ఒలకబోసిన వయ్యారాల సింగారాన్ని గోదారి జలధార మధువు తాగి గుట్టలపై విరిసిన గుబురువనాన్ని రామయ్య అడుగులలో పూసిన రమణీయ పుష్పవనాన్ని సీతమ్మ పాదాల పారాణి తాకి మధుర ఫలాలనిచ్చే వృక్షజాలాన్ని జంతువుల వలపు కుటీరాన్ని విహంగాల విహార కేంద్రాన్ని ఆదివాసులకు ఆత్మబంధువును గూడెపుజనుల గుండె గొంతుకను అలాంటి నన్ను రక్షస రాజకీయ క్రీడలో స్వార్థం మీరిన కాంక్షతో అమానుషంగా అమానవీయంగా చెరబడుతున్నారు తరాల సంపద తరలించే ఏర్పాట్లు కుటిల మానవుడి కుయుక్తులు విషపుకోరల వింత నాటకాలు ఆర్డినెన్సుల ఉరితాళ్ళు అడవిని ముంచి ఆత్మను చంపి ఆదివాసుల్ని తరిమి తరిమి కొడతారు గూడెపు వాసుల గొంతుల్లొ గునపాలు దించుతారు విహంగాల ముక్కుల్ని తూములుగా చేస్తారు! వేలవేల ఏళ్ళ ప్రాచీన వృక్షలాన్ని కాలువలుగా కడతారు!! ధరిత్రిని సస్యశ్యామలం చేస్తారట!!? కొందరి వరాల కోసం పోల'వనాన్ని' పోలవరంగా ముంపులో ముంచుతారట అపురూప సంపదను అసంఖ్యాక జీవరాశిని అమాయకపు ఆదివాసులను శాపగ్రస్తం చేస్తారా?

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCwHj6

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Ravinder Vilasagaram కవిత

మనిషి - మనీషి ************ మనిషి బతికున్నోడు నాలుగు రాళ్ళు వెనకేసుకునెటోడు బతికున్నోల్లను గద్దలా పీక్కుతినెటోడు పైసలుంటేనే పలుకరిచ్చెటోడు మనీషి మరణించినా బతికున్నోల్ల మనసుల ఉన్నోడు రాయిలా మారినా దేవుడైనోడు గతించినా భవిష్యత్తంతా బుక్కెడు బువ్వపెట్టెటోడు లేనోల్ల కోసమే బతికి కంటనీరు తుడిచెటోడు కండ్లల్ల నిలిచినోడు ************ ఏప్రల్ 14,2014 అంబేద్కర్ జయంతి

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRM9Jb

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

మనిషి - మనీషి ************ మనిషి బతికున్నోడు నాలుగు రాళ్ళు వెనకేసుకునెటోడు బతికున్నోల్లను గద్దలా పీక్కుతినెటోడు పైసలుంటేనే పలుకరిచ్చెటోడు మనీషి మరణించినా బతికున్నోల్ల మనసుల ఉన్నోడు రాయిలా మారినా దేవుడైనోడు గతించినా భవిష్యత్తంతా బుక్కెడు బువ్వపెట్టెటోడు లేనోల్ల కోసమే బతికి కంటనీరు తుడిచెటోడు కండ్లల్ల నిలిచినోడు ************ ఏప్రల్ 14,2014 అంబేద్కర్ జయంతి

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRM9sF

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Ravinder Vilasagaram కవిత

పంచుడు ?????? పంచుడు పంచుడు పంచుడు ఏ వీధిలో చూసినా ఏ ఇంటి ముందు చూసినా ఏ ఇంటి వెనక చూసినా లెక్కలన్ని పక్కగా చేసి, ఆ చిత్రగుప్తునికి కూడా సాధ్యం కాని వేగంతొ యుద్ధప్రాదికంగా ప్రత్యర్థ వ్వూహాల్ని చిత్తు చేస్తూ నిఘానేత్రాల్ని పరిహాసం చేస్తూ దాచిందంతా పంచేస్తున్నారు నిన్నటి దాకా నిండు కుండలా నిగనిగలాడిన పెట్టెలన్నీ రాత్రికి రాత్రి ఖాళీ అయి ఓటర్ల చుట్టు పేదలై తిరుగుతున్నాయి! తెల్లారితే గానీ తెలియదు ఈవీఎం లన్నీ నిండుకుంటాయో లేదో!! ప్రజాస్వామ్యం పరి సమాప్తమవుతుందో కాదో !!! ??????? మార్చి 29, 2014 మున్సిపోల్సు ముందు రాత్రి.

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLHuV7

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Ravinder Vilasagaram కవిత

\u003Cపావలా వెలుగులు> పావలాకు విలువేముందాటారా ? నిన్న చుసాను నేను వేయి చంద్రుల వెలుగును! కోటి సూర్యుల కాంతిని!! 15మార్చి2014 (2005లో రాసిన చిన్న కవిత, ఒకరోజు కిరాణ దుకాణంలో చిల్లర లేక ఒక వక్కపొట్లం ఇవ్వడం జరిగింది. అది చూచిన మా మూడేళ్ళ పాప ముఖంలో కనబడిన ఆనందపు వెలుగుల స్పందనే ఈ కవిత.ఇప్పుడు ఆ పావలాలే కనుమరుగయ్యాయి!)

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWtpEM

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Ravinder Vilasagaram కవిత

కళ నిజమాయె *********** అరవై ఏళ్ళ కళ సాకారమైన వేళ అమరుల ఆశయాలు నెరవేరిన వేళ ప్రజాస్వామ్యం పండిన వేళ ప్రజా ఉద్యమం గెలిచిన వేళ తెలంగాణ పాట ఉప్పాంగిన వేళ తెలంగాణ రాష్ట్రం పురుడుపోసుకున్న వేళ అరవై ఏళ్ళ కళ సాకారమైన వేళ అమరుల ఆశయాలు నెరవేరిన వేళ ...................... ******** 20.02.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OepFUt

Posted by Katta