పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Satya Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satya Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Satya Srinivas కవిత

పూల రెక్కలోని చిత్రం నేను ఓ చెట్టుని కౌగలించుకున్నప్పుడు నాలోని వృక్షత్వం నింగిలో తటాకమవుతుంది నేను మటుకు సదా పూల రేకుల్లా... ఎండుటాకుల్లా... వేర్ల మొదళ్ళలో రాలుతూనే వుంటా ఆమె అరికాళ్ళ రేఖలు నా మీదుగా పయనించినప్పుడు తొలకరికి మట్టి చిట్లి వివిధ రంగుల్లో విచ్చుకుంటుంది ఆకాశం తన రంగుల వస్త్రాన్ని ఆరేసుకున్నట్లు తడి మట్టి రాట్నం మీద హస్తరేఖల్లా ముద్రితమవుతున్న చిత్రం అంకురిస్తుంది (9-6-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ptOPL6

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Satya Srinivas కవిత

కనుపాప కుండీ ఇద్దరం కలిసి మొలకల్ని నాటుతున్నప్పుడు ఇరువురి కౌగిలింతప్పటి చేతి వేళ్ళ మధ్యన ఖాళీలో చీకటి వెలుగు ఒకటవ్వడానికి చోటు ఆవిర్భవిస్తుంది సాంగత్యపు చూపులోని మౌన గీతం ఎప్పటికీ మట్టిలో జీవకణంలా మిగిలిపోతుంది (9-6-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqyMf

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Satya Srinivas కవిత

చాకలి కల నది తడిని ఆరేసిన రంగు బట్టల రేవు అయ్యాఅమ్మల మధ్య పిల్లల్లా తెరచాప పడవ బట్టలారినంత సేపు పట్టలేదు నది ఎండిపోవడానికి నది మరకలు కనిపించని బోడెద్దుల చాకిరి రేపు ఇప్పుడు రంగు లేని చాకలి కల బట్టలు పద్దు లేని రంగు కాయితాలు (తుంగభద్ర, కర్నూలు, గోదావరి-రాజమండ్రి) సెప్టెంబర్‌, 2001

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss62JE

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Satya Srinivas కవిత

నీటి మొహం చెరువులో ఎవరో రాయి వేస్తే ఏర్పడ్డ వలయాల్లా గుంటాయి మొహాలు నవ్వుతూ ... నవ్విస్తూ ... ఏడుస్తూ ... ఏడ్పిస్తూ ... తడి ఎండుతున్న నీటిలా .. . చెరువులో ఆకులా రాలితే బాగుండు నీటి మొహంలాగుంటుంది బతుకు 29 అక్టోబర్‌ 2000 హైదరాబాద్‌

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tzy04b

Posted by Katta

21, మే 2014, బుధవారం

Satya Srinivas కవిత

రొట్టమాకుల తెప్ప ఉదయం దీప స్థంభం పైన వాలిన పావురాళ్ళు గమ్యం నిర్దేశించుకున్నాయి ప్రయాణం ఆద్యంతం సరంగు పాటల్లాంటి కబుర్లు ప్రయాణపు బడలిక తీర్చిన ఆకాశ గంగ రొట్టమాకు వాగులో మజిలీ ఓ మోనోలిత్ చుట్టూ రాలిన ఎండుటాకుల మీద సహచరుల్మంతా పాదముద్రల దస్తూరిని వదిలి రెక్కలకు ఊరి మట్టి లేహ్యానద్దుకుని తిరిగి గూటికి చేరాం అప్పటికే నిశాచర రోడ్లకి వెలుతుర్లని పొదిగి పావురాళ్ళు నిష్క్రమించాయి మర్నాడు ఉదయం పసుపచ్చని ఆకుల్లా పావురాళ్ళు నగర గాలికి పచ్చిరొట్ట కబుర్లందించాయి నింగి పాదాలకి పారాణి రంగంటుకుంది తాజా తీర్మానం... ప్రయాణం గమ్యానికి, మొదటి, చివరి అడుగుల నడుమ అయిస్కాంతపు రేఖల గగనం రండి ఊరెండుటాకుల వ్యోమగామిలో పయనించి వద్దాం (రొట్టమాకు ప్రయాణంలో దారిపొడవున సహచరులైన వారందరికి) (21-5-17)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lP9kQk

Posted by Katta

16, మే 2014, శుక్రవారం

Satya Srinivas కవిత

ఆవరణ పొద్దున్నే దేవగన్నేరు ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులో పిట్ట స్నానం చేస్తోంది ఆమె నా మదిలో ఈత కొడుతున్న సవ్వడి కొమ్మలపైన ఆకుల నీడల మీద పిచుకల జంటల కేరింతలు ఆకుల తంత్రుల నుండి ప్రవహించే లేత పచ్చని వెలుతురు పాటలు ఇదంతా నా ప్రహరీ గోడ వెలుపల వాయుగుండం పిదప ఏర్పడిన వాతావరణం మరి సముద్రపు తీరప్రాంతంలో... తలలు వాల్చేసిన వరి చేలు సముద్రపు అంచున పుట్టిన నేల కలయిక,విడిపోయే పక్షి గూటి చూపు నింగి అలల నావ నీటి మట్టి సారం ఇదంతా దేవగన్నేరు ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులో పిట్ట స్నానం చేసేలోపే రెక్కల సవ్వడి గాలికి ఏర్పడిన శ్వాస నిట్టూర్పు (10-5-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVipJx

Posted by Katta

Satya Srinivas కవిత

ఆవరణ పొద్దున్నే దేవనగరి ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులొ పిట్ట స్నానం చేస్తోంది ఆమె నా మదిలొ ఈతకొడుతున్న సవ్వడి కొమ్మలపైన ఆకుల నీడల మీద పిచుకల జంటల కేరింతలు ఆకుల తంత్రులనుండి ప్రవహించే లేత పచ్చని వెలుతురు పాటలు ఇదంతా నా ప్రహారి గోడ వెలుపల వాయుగుండం పిదప ఏర్పడిన వాతావరణం మరి సముద్రపు తీరప్రాంతంలో... తలలు వాల్చేసిన వరి చేలు సముద్రపు అంచున పుట్టిన నేల కలయిక,విడిపొయే పక్షి గూటి చూపు నింగి అలల నావ నీటి మట్టి సారం ఇదంతా దేవనగరి ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులొ పిట్ట స్నానం చెసేలొపే రెక్కలసవ్వడి గాలికి ఎర్పడిన శ్వాసనిట్టుర్పు (10-5-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGgYxU

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Satya Srinivas కవిత

Whirl Mid afternoon heat Frenzy red flowers A mild breeze sprays Tender colors On the naked earth Like left over water drops on her body After the bathe The floor beneath my lone thoughts Expands and compresses Painting orange color in the sky Slowly I enter the abode A night borne in ecstasy Silence of the dawn dispel With song of the bird My sight branches out With dew drops on red flowers Spread across between us

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iyFcp3

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Satya Srinivas కవిత

చౌకి రాత్రి రెండు గంటలకు చెట్లని చూస్తునప్పుడు పట్నం నుండి వస్తున్న అభివృద్ధి నియోన్ కాంతి అడవి గూటిని పెకలించడానికి వచ్చే ఎలక్షన్ మ్యానిఫెస్టో నాలుకలాగుంది ఆ మాయదారి నాలుక గాలి తాకకుండా సదా పహరా కాసే నిశాచర జీవాల్లా చెట్లకల్లుకున్న పక్షి జంటలు కూస్తూనే వున్నాయి అందుకే రాత్రప్పుడు అందుకే రాత్రప్పుడు పక్షి కూతలు వినపడతాయి (21-4-14) (27-4-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fky9p0

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Satya Srinivas కవిత

అద్దాల మేడలో ఉషోదయం అద్దంలో పున్నమి చంద్రుడు ఇంట్లో సాంబ్రాణి ధూపంలా ఆరుబయట నేను కళ్ళలో అరికాళ్ళు పెట్టుకుని పడుకుంటా ---- చిట్లిన అద్దంలో ఉషోదయం దూరంగా రహదారులెంట ఇసుకలారీల్లో ఆవిరైపోతున్న తడిలా చంద్రుడు ఒక్కో చుక్కా రాల్చుకుంటూ రోడ్లకి టైర్లముద్రల ముగ్గులేస్తూ ప్రాణంలేని గాలిబుట్టల నగరాల వైపు పయనిస్తున్నాడు ఓ ప్రాణం లేని కంటిలో కనుపాపైపోడానికి --------- నేను కిటికి తెరిచినప్పుడు ఆరుబయట పచ్చటి పొదలో నల్లటి పిట్ట కంట్లొ తెల్లటి పాటలా పిల్లకి బువ్వపెడుతూ కూస్తాడు (18-4-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjHoCN

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Satya Srinivas కవిత

నీడ ఆకుపచ్చ రంగులు పాము తలకాయున్న గొంగళి పురుగు ఆకులపై డొల్ల ముఖచిత్రాల్ని గీస్తూ వుంటుంది ఆ ముఖచిత్రాలనుండి ప్రసరించే సూర్య కిరణం తాకిన నేల కాంతి విస్ఫోటనం నుండి మొలకెత్తిన సీతాకోక చిలుక నాకళ్ళలోని ఆకాశానికి రంగులద్దుతూ పయనిస్తుంది (18-3-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSko0v

Posted by Katta

20, మార్చి 2014, గురువారం

Satya Srinivas కవిత

శిశిర పిచుక- కనిపించని తల్లి పిలుపు కళ్ళగొంతుకల దాహార్తిని తీర్చే గూడు (20 మార్చ్ - అంతర్జాతీయ పిచుకల దినోత్సవం)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODa6VZ

Posted by Katta

11, మార్చి 2014, మంగళవారం

Satya Srinivas కవిత

మోదుగ చంద్రవంక అర్ధచంద్రాకార కిటికీ అద్దం రాలిన చుక్కతో పడుకున్న నేను ఆకులు పూలైన మోదుగ వనంలా ఓ నగ్నాకాశం నేల వాంఛల పచ్చని పున్నమి వెన్నెలదారుల కలయిక మనస్సు చూచుక కళ్ళలో ఒకే దృశ్యమైన కనుపాప బీజం (నా ప్రయాణంలో వెన్నంటే వుండి, వచ్చిన మోదుగ పూలకి)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nF4VkH

Posted by Katta

3, మార్చి 2014, సోమవారం

Satya Srinivas కవిత

ఎండుటాకుల మది ఒక్కోసారి మనస్సు కాలం అర్ధరాత్రిలోని ఆసుపత్రి గది కంటి చికిత్స తర్వాతో గుండె పోటు తర్వాతో ఆద మర్చి పడుకున్న తల్లికో, తండ్రికో తోడుగా మేలుకున్న క్షణం కిటికి బయటున్న చింతమానుతో మాట్లాడుకున్న ఘడియలు బయటకు వచ్చి పెదవులపై తగలెట్టిన కాష్ఠం పొగలు పొగలుగా వైతరణిలో అస్తికలు ప్రవహించిన ఆనవాళ్ళు ఇప్పుడు అటువైపుగా వెళుతున్నప్పుడు కొద్దిసేపు ఆగి చూస్తాను మానులు లేని ఆ ప్రదేశాన్ని టీ పొగలు లేని శూన్యపు ఉదయాన్ని తల్లిదండ్రుల మనోవేదన గీతాన్ని వింటూ భార్యాపిల్లాడిని తలుచుకుంటూ రంగు కాగితం లేని జేబులగుండా గుండెని తడుముకుంటూ చింతాకుల వర్షం లో తడిసిపొతు ఎండుటాకుల మదిలో పాదముద్రలు లేని అడుగుల సవ్వడిలా ఛివరొక్కసారిగా కదిలిపోతాను (28-2-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i6upZk

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Satya Srinivas కవిత

Some Times… Sometimes dying is a beautiful pain Leaving the nature of sharing behind us Some Times… Resting in peace Growing again and again Some Times… Blossoming In the innocent eyes Budding at eternal moments Some Times… Looking at dawn sprouting with nascent images And floating with closed eyes Some Times… Flying with winged dreaming eyes Coupled with the viewer and the entity Some Times… Placing aspirations in the tender foot steps marks Building foundations for heaven on earth Some Times… Embracing the soul once for ‘all’ Traversing with transient colors of joy Sometimes… Sitting on a shore of a still pond throwing pebbles And observing the ripples with in oneself Sometimes… Dying is a beautiful pain Rather breathing like a living dead corpse everyday and hour @satyasrinivas.G. (10-2-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f39ti7

Posted by Katta

1, నవంబర్ 2012, గురువారం

Satya Srinias ||ప్రతిబింబం (సీక్వెల్)||


పక్షులు
ముక్కున తీసుకున్న
గరిక పరకల్లా

నేను
రోజూ
కొన్ని అక్షరాల్ని
ఏరుకుంటా
ఇంటిని
అక్షర మాలగా
కూర్చాలని
ప్రయత్నం
చేస్తుంటా
వాటి కాలం వేరు
పరిణతి చెందినవి
నా మటుకు
తరచు
చేయాల్సిందే
అందుకే
పెరటి నిండా
మొక్కలే
ఇంట్లో కూడా
అవి ఇంటి సభ్యులవ్వాలని
మా యత్నం
సదా కొనసాగే
అలవాటుగా
మారాలని
ఎప్పటికైనా
ఇల్లుని
కవిత్వ పొదరిల్లుగా
అమర్చాలని.
రోజూ
ఉదయం
పిట్టలు
బయటకు
వెళ్ళే
ముందు
కిటికీ
తట్టి
మరీ
గుర్తు చేస్తాయి
లోనా
బయటా
నేల చీరని
పచ్చగా
అమర్చమని
గూళ్ళని
కళ్ళలో
పెట్టుకుని
చూడమని

6, సెప్టెంబర్ 2012, గురువారం

సత్య శ్రీనివాస్॥గువ్వ గూడు॥



గూళ్ళూ
ఖాళీగానే
మిగులుతాయి
జీరెండిన
స్వర పేటికలా
మళ్ళీ
మధుమాసంలో
అదే కొమ్మకు
పూసిన
మరో
గూడు
కలలను
కనే
తీగ
పూల గువ్వ
నీడలా..

29, జులై 2012, ఆదివారం