_లోకంతల_ ప్రస్తుతం ఒక తలకాయలో ఈ లోకం పనిచేయుట లేదు మరియు లేదు లోకమాచూకి పట్టే భాద్యతలో తల మునకలేస్తూ కళ్ళు తెరవాలనే కనీస తలంపు కూడా లేకుండా కనిపించట్లేదంటూ కదలకుండా కునక్కుండా కల్పించుకోకుండా కిమ్మనకుండా ఉంటే ఎదురొచ్చిన చీకటి కనురెప్పల్ని తట్టిందట!! పాపం తట్టేదెవరో ఏంటో తెరవకుండా తెలుస్కోడానికి రెప్పలకు peephole లేక లోకమేనేమోనన్న సందేహం కూడా లేకుండా రెప్పలు తెరిచేంతలో చప్పుడాగిపోయిందట!! చప్పుడేమయిందో కూడా తెలుస్కోవాలని లేకుండా కళ్ళు తెరిచేసాక అసలు తెరిచినట్టే లేని చీకట్ని చూసి లోకాన్ని చూడలేని తలకు కళ్ళెందుకనుకుని పీక్కోకుండా చీకట్నే చూస్తుంటే వెనకనుంచి తలమీద ఫాట్మని కొట్టిందెవరో ఏంటో వెనక్కు తిరిగి చూస్తే వెలుగు!! ముందు చీకటి , వెనక వెలుగు లోకం కనిపించని చీకటైనా వెలుగైనా ఒకటేనని అర్థం చేస్కోకుండా వెలుగునే చూస్తున్న ఆ తలకి రెప్పలు తట్టింది చీకటా వెలుగా అన్న సందేహం కుడా రాలేదట!! వెనక్కి తిరిగి చూడకుండా వెలుగునే చూస్తూ లోకాన్ని వెతకాలో వెనుతిరిగి చీకట్లో చీకటే లోకమనుకోవాలో పాపం ఆలోచించలేని తల తప్ప ఏమి లేని ఆ శరీరానికి కళ్ళే దిక్కు!! మొండెం దొరక్కపోయినా పర్లేదు లోకం దొరికితే చాలన్న సంకల్పం కూడా లేకుండా పడున్న దాన్ని చూసి వెలుగు చీకట్లు జాలి చూపకపోయినా, లోకానికే ఆ తలనెత్తుకుని తిరగాలని ఎప్పుడనిపిసస్తుందో..దానికి ఎప్పుడు కనిపిస్తుందో.. కనీసం రెప్పలు తట్టింది లోకమేనేమోనన్న మొదటి సందేహమొచ్చినా చాలు తలా తోకా లేని లోకాన్ని ఆ తలే చూస్కుంటుంది________(31/3/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gU8Fyx
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gU8Fyx
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి