పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Sanjeev Goud కవిత

SANJEEVANAN/ SANJEEV GK జీనా హైతో మర్ న సీఖో కదం కదం పర్ లడ్ న సీఖో అని నిన్నటి వరకూ తెలియని అమాయకత్వాన్ని దాచుకుని నాకు నేను సమర శీలున్నని నా జబ్బలు నేనే చరచుకుని నా తొడలు నేనే కొట్టుకుని నేను ఏది నా జీవ గమ్యమో ఏది నా తిక్క పైత్యమో ఆలోకనం చెయ్ లేక అవగతం చేస్కో లేక బావిమడుగు లో ఒంటరి మండూకమై భవితవ్యాన్ని శూన్య లోచనాల మాటున చిద్ర పరదాల చాటున కప్పెట్టుకుని ఉన్మాదమో....ఉతేజమో వినోదమో..విషాదమో నిర్వికార ద్రష్టనై... నిశ్చేష్ట స్రష్ట నై కదిలే కాలాని కి కుదురైన సాక్షి నై వెలిసిపోతున్న నాకు.... పునర్ జీవితేచ్చ పూర్ణ జరో చికిత్చ ముఖ పుస్తకం ద్వారా మీరే ఇస్తున్నారు నా నవ్య మిత్రులారా!! భవ్య ప్రదాత లారా !!! మీకు వందనం...!!!!! శుభాభివందనం.....!!!!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PMeqCJ

Posted by Katta

Sanjeev Goud కవిత

SANJEEVANAM/ ఒంటరి తనం ఆనందం లో ఏకాంత వాసపు ఆహ్లాదంలో ఊహల జగతి కైపు లో నన్ను నేనే స్నేహిస్తూ కలల సామ్రాజ్యపు మజా లో నాలో నేనే ప్రవహిస్తూ నా స్వర్గపు అంతః పురంలో నాతో నేనే విహరిస్తూ గుండె లో గూడు కట్టుకున్న మమతానురాగాల వెల్లువ చెలియలికట్ట దాటనీకుండా గిరి గీసుకున్న ఈ సంజీవుడు ......! మన వాడెవడు పర వాడేవాడు అని బుడు బుడి దీర్గాలు తీసి తీసి కడివెడు కన్నీళ్ళు దాసి దాసి సుమను మనువాడే సమయానికి సుజనుడై ఆగమనం చేస్తోన్న మనవడి కోసం వాడి తాతా అనే పిలుపు కోసం వాడి తన్నుల కోసం!!పిడి గుద్దుల కోసం !! అయ్యారే!!!! ప్రొద్దున్నే ఇంకా తీయని లిక్కర్ షాపు ముందు ఫుల్ బాటిల్ మందు కోసం అంగలార్చుతున్న వెంగలప్పలా అయ్యాడే ??

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PMena8

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు //ఎందుకంటావ్...// మల్లెలచాటున సూర్యుడా ... ఎందుకీ సంధ్యా మాటలు మురిపించే ముచ్చట్లు భావ తరంగాలు పిల్లల పాటలు కిలకిల నవ్వులు దోసిట ముత్యాలు రాలిన పూవుల రాగాలు ప్రియమైన విన్నపాలు పల్లకి చాటున గుసగుసలు కరుణాకటాక్ష వీక్షణలు వశీకరణ మంత్రాలు అర్ధ నిద్రావస్తల పదాలు మధుపాత్రల మురిపాలు మరి ఎందుకంటావ్.... ? Date:06/04/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mPQjOV

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!!నేటి రాజకీయం !! ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు మొన్నటిదాకా ఒక పార్టీ దానికోసమే బ్రతుకుతున్నట్లు నటన నిన్నటి దాకా దొంగల పార్టీ నేడు దొరల పార్టీ అవుతుందా పార్టీ చేసిన తప్పేమిటి చేసింది మనుషులేగా వాళ్ళు ఎక్కడ ఉన్నా తప్పే కదా ప్రతివాడికి సింహాసనం కావాలి దానికి ఎ గడ్డి అయినా కరుస్తారు ప్రతి వాడు జీవించాడు మనకోసమే అన్నట్లు ఇప్పుడు తప్పు వాల్లదు కాదట సిగ్గు లేదు కనీసం జవాబు దారి తనం లేదు వీళ్ళను మోసే బజన గాళ్ళకు తక్కువలేదు ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనకు మంచి రోజులు లేవు .... రావు !!పార్ధ !!6apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mPQj1c

Posted by Katta

Kavi Savyasaachi కవిత

//సయామి కవలలం// 06/04/2014 నెత్తురు ఇంకని స్థలమేది కన్నీరు తడవని చెలమేది యుగాలెన్ని మారినా.. కాలమెంత కరిగినా... కళ్ళముందె దౌర్జన్యం కరడుగట్టినా దుర్మార్గం నీ ముందే నిరంతరం జరుగుతున్న దౌర్భాగ్యం ఎక్కడుంది చలనం నీలో ఒక్కసారి మదితెరిచి చూడు లోలో చైతన్యమంటె రక్తపు నది హోరు గుండెనిండ ఉదయించే సూర్యుడి జోరు మనిషిని గుర్తించలేని మానవత్వమెందుకు మదినిండా కుళ్ళుతో మరుమల్లెల దుర్ఘంధం నీ అణువణువున దాగున్న మలినాలను వెలికితీయ్ లోపలున్నదాన్ని ముందు ప్రక్షాళన చెయ్ ముందుతరం భవితకు పూదారులు పరచవోయ్ ఎవడేదో వాగేస్తే మనకెందుకు తుడిచెయ్ పిచ్చిపువ్వులను చూస్తూ వగపెందుకు వదిలెయ్ మలినంలోనే మరి తామర వికసించదా మదిలోన ఫ్రెముంటె మరందమే కురవదా ప్రాంతాలువేరైనా ఫ్రేమ చెరిగిపోవునా గోడలుకట్టెసినా గుండెలు విడిపోవునా ప్రవహించే తెలుగు వెలుగు రక్తమొకటేగా గుండె గుండెనూ కలిపిన తెనుగు దారమొకటేగా విశ్వభావనే విరులు కావాలందరికీ ప్రేమామృతధారలే కురియాలి మదిలోకి కలిసుంటె కలదు సుఖం...ఇదివరలో విడివడినా సయామీ కవలలమే మనం

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q97w61

Posted by Katta

Viswanath Goud కవిత

*మంటలు* కడుపు రేకుల షెడ్డులా కాలుతోంది ఆకలి మిట్టమద్యాహ్నంలా మండుతోంది ఓ రొట్టెముక్క మేఘంలా అంటుకున్న ప్రేగులను చల్లారిస్తే బాగుండు పోనీ ఏ అన్నపూర్ణ దేవో అన్నం వండి వంచుతున్న ఓ గ్లాసుడు గంజినీళ్ళలో మునిగితేనయినా ఈ వేడి చల్లబడుతుందేమో చూడాలి ఎవరో ఎక్కువై పాడేసిన సద్దిముద్దను సాయమడగాలి తానయినా మంచుముద్దై పస్తుల పూటను కరిగిస్తుందేమో ****************** ఎదురుచూపుల ఋతువులలో వేసవి ఆకలిమంటల కాలాలు తరగకున్నవి చల్లారని ఆకలిమంటలు దావాలనంలా నీరసాన్ని శరీరమంతా వ్యాపింపజేసి గుండెను అగ్ని గోళంగా మార్చాయి కడుపు కాలిన ప్రతిపూట ఏ తల్లో కురిపించే ఓ పట్టెడు మెతుకుల చినుకుల కోసం చకోర పక్షిలా ఎదురుచూడటం అలవాటే మండకుండా, ఎండకుండా ఏ దేవుడో నీరు పెట్టే ఎడారి మొక్కను నేను నా మొలకకు కారణమయిన రైతెవరో తెలియదు మరి నాకు అనాథ జాతి అంటుమొక్కలు అనాదిగా అంటుకుంటూనే ఉన్నాయిగా ఆకలి మంటలు చేలరేగుతూ దహిస్తుంటే ఈ కట్టె కాలుతూనే ఉండవలసిందే ఇంక మండటానికి,కాలడానికి ఏం లేకుండా ఈ కాయం భూడిదయ్యేవరకూ.! విశ్వనాథ్ 06APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QTtbop

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

Link: http://ift.tt/1kfCZ9l

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfCZ9l

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\బ్లెయిర్ ఇక లేడు\\ కారు రేడియో స్పీకర్ ఆ రోజు నా చెంపమీద ఛెళ్ళున చరిచింది. బ్లెయిర్ ఇక లేడు. మా నగరపు మహాకవి ఇక లేడు. మైకు ముందు గొంతు విప్పితే ఎలుగెత్తిన శాక్సొఫోన్‌లా ధ్వనించే బ్లెయిర్ ఇక లేడు. కడలి తరగలా, ఝంఝామరుతంలా మహోత్సాహంతో మహాశక్తితో సంచలించే బ్లెయిర్ ఇక లేడు. రోడ్డు పక్కన ఒక ఖాళీ పార్కింగ్ లాట్‌లోకి కారుని ఆపి అలా కూర్చుండి పోయాను. రేడియో ఆపేశాను. చుట్టూ నిశ్శబ్దం. నిశ్శబ్దమే మిగిలింది. బ్లెయిర్ ఇక లేడు మరి. బ్లెయిర్ అనే ఒక్క పేరుతో ప్రఖ్యాతుడైన డెట్రాయిట్ ముద్దు బిడ్డ, డేవిడ్ బ్లెయిర్, విశేషణాలకి అతీతుడు. ముద్రల చట్రాల్లో ఒదగనివాడు. కవి, గాయకుడు, కళాకారుడు, సంగీతదర్శకుడు, శిక్షణ ఇచ్చే గురువు, ఉద్యమనాయకుడు, ఇంకా ఫలానా అని పేరు పెట్టలేని ఎన్నో కార్యకలాపాల్లో మునిగితేలేవాడు. అన్నిటినీ మించి గొప్ప మనిషి. తోటి మానవుల్ని నిర్ద్వంద్వంగా ప్రేమించ గలిగిన మానవత్వం ఉన్న మనిషి. బ్లెయిర్ 1967 లో న్యూజెర్సీ రాష్ట్రంలో పుట్టాడు. కానీ డెట్రాయిట్‌ని తన నివాసం చేసుకుని ఈ నగరంతో మమేకమయ్యాడు. తన కార్యకలాపాలకోసం అమెరికా దేశమంతా, ప్రపంచమంతా తరచూ పర్యటిస్తూ ఉన్నా, అతని గుండె చప్పుడు మాత్రం డెట్రాయిట్‌నే పలవరించి కలవరించింది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఎన్నో రికార్డులు రిలీజ్ చేశాడు. తన పాటలు తనే రాసుకునేవాడు. అతని పాటలకి లెక్క లేనన్ని ఎవార్డులు పొందాడు. కానీ ఏనాడూ ఎవార్డులకోసం అతను పనిచెయ్యలేదు. ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతుడైనా, ఎప్పటికప్పుడు ఆ క్షణాన చేస్తున్న పనిలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి పూర్తిగా దానిలోనే లీనమై ఆ పనిని అత్యంత ప్రతిభావంతంగా పూర్తిచెయ్యడం బ్లెయిర్‌కి మజ్జాగతమైన లక్షణం. కవిత్వంలోనూ అనేక ఎవార్డులు గెలిచాడు. 2010లో ప్రతిష్ఠాత్మకమైన కెలలో ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అతను కవిత్వాన్ని పైకి చదవడానికి బాగా ఇష్టపడేవాడు. అనేక సార్లు Poetry Slam అనే కవితాపఠన పోటీలో విజేతగా నిలిచాడు. అతని కవిత్వం కూడా బాలడ్ అనే ప్రక్రియలో, గేయాలకి దగ్గరగా ఉంటూ వచ్చింది. పైకి చదవడానికి, ప్రదర్శించడానికి అనువుగా ఉంటుంది. బ్లెయిర్‌ది కొద్దిగా జీరతో కూడిన బలమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పైగా భావస్ఫోరకంగా కవిత చదవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకని అతనే ఆ కవిత్వాన్ని చదివి వినిపించినప్పుడు గొప్ప శక్తితో శ్రోతలని కుదిపేస్తుంది. రెండు సార్లు ప్రత్య్క్షంలో అతను కవిత్వం చదవడం విన్నాను. గొప్ప అనుభూతికి లోనైనాను. ఒకసారి అతను డెట్రాయిట్ గురించి రాసిన కవిత While I was away చదివినప్పుడు నా పక్కన కూర్చున్నామె వెక్కి వెక్కి ఏడవసాగింది. "మీరు బానే ఉన్నారా?" అని ప్రశ్నించాను. ఆ కన్నీళ్ళలోనుంచే చిన్న నవ్వు నవ్వి, It is so beautiful అన్నారామె. నాకు ఎప్పుడో పదేళ్ళ కిందట ఒక సాయంత్రం పూట హైదరాబాదులో ఒక మేడ పై అంతస్తులో డాబా పైన ఆరుబయట కూర్చుని గోరేటి వెంకన్న పాట విన్న అనుభూతి గుర్తొచ్చింది. బ్లెయిర్ చాలా ప్రతిభావంతుడైన అధ్యాపకుడు కూడా. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది - ఏదైనా పని చెయ్యడం బాగా తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఆ పని ఎలా చెయ్యాలో ఇతరులకి నేర్పే అధ్యాపకులవుతారు అని. కానీ ఏదైనా కళారూపాన్ని నేర్చుకోవడానికో నేర్పడానికో ప్రయత్నించిన ఎవరికైనా ఇది నిజంకాదని అనుభవం చెబుతుంది. ఎంతో గొప్ప కళాకారులైనా అందరూ గురువులు కాలేరు. ప్రతిభావంతులైన గురువులు చాలా కొద్దిమందే ఉంటారు. బ్లెయిర్ అట్లాంటి అధ్యాపకుడు. ఏదో ఒక బడికో, సంస్థకో అంకితం కాలేదు. అంకితం కావడమంటే కట్టుబడి ఉండడం, పరిధులకి లొంగి పోవడం - అది అతని స్వభావానికే విరుద్ధం. ప్రాథమిక పాఠశాలల దగ్గర్నించీ మహా విశ్వవిద్యాలయాల దాకా, చర్చిలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, సమ్మర్ కేంపులలో - ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం. ఎదురుగా ఉన్నది పదిమందైనా, వందమందైనా బ్లెయిర్ బోధనలో పెల్లుబికే శక్తితరంగం ఒకటే. నేర్పేది ఒకే ఒక్క పాట అయినా, లేక ఒక సెమెస్టర్ అంతా బోధన చెయ్యబోతున్నా ఆ బోధనకి అతని కమిట్‌మెంట్ ఒకటే. అసలే మనుషుల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిత్వం. అందులోనూ పిల్లల్ని బాగా ప్రేమించే వాడు. ఏ వయసు పిల్లల్తో అయినా చాలా సులభంగా కబుర్లు కలిపేసి, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ అభిమానం చూరగొనేవాడు. నగరంలోని ఒక పేద పేటలో ఒక చర్చి నిర్వహిస్తున్న సమ్మర్ కేంప్‌లో ఈ వేసవి ఒక మగపిల్లల బృందానికి పాడడం నేర్పుతూ ఉన్నాడు. అతను వాళ్ళకి పరిచయం చేసి నేర్పుతున్న పాట పూర్తికాక ముందే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బ్లెయిర్ సంస్మరణ సభలో ఆ పిల్లల బృందం అతనికి నివాళిగా ఆ అసంపూర్తి పాటనే పాడారు - అద్భుతంగా. ఒక బ్లెయిర్, ఒక బాలగోపాల్ - ఇలాంటి వ్యక్తుల్ని మరణం గెలిచిందంటే నమ్మడం కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఎప్పటికప్పుడు పెల్లుబుకుతూ ఉన్న జీవశక్తి అంత గొప్పది. వాళ్ళ జీవితాన్ని, ఆ జీవితంలో గొప్పదనాన్ని తల్చుకుని ఉత్తేజితులమవుతూ మనకి చేతనైన పద్ధతిలో, చేతనైన మేరకి వాళ్ళని అనుసరించడమే మనమివ్వగలిగిన నివాళి. తాజాకలం: బ్లెయిర్ కవిత చదువుతున్న దృశ్యాన్ని ఈ కింది యూట్యూబు లంకెలో చూడవచ్చు. http://ift.tt/1oEeftf POSTED BY NARAYANASWAMY S. 5-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

నేను కాని నేను అధ్దం ముందు నిలిచి ఉన్నాను నా ఎదురుగా ఎవరో అపరిచితుని రూపం నా హవబావల్ని అనుకరిస్తూ నన్ను అవహేలన చేస్తుంది నన్ను నిదురకు వెలివేసి నా మనశ్శాంతిని తొలచివేస్తుంది ఎందుకంటే ఆమె వెళ్ళిపోయింది నేను అతికించుకున్న కృత్తిమమైన చిరునవ్వుల్ని వేలెత్తి చూపుతుంది నా లోని ప్రాపంచిక పోకడల్ని స్వప్రయోజనాల్ని ప్రశ్నిస్తుంది. నేను కప్పుకొన్న ముసుగును తొలగించమని శాసిస్తుంది నన్ను క్షణ క్షణం నిందిస్తుంది. నాలోని సహజమైన ప్రేమతో నన్ను మేల్కొలుపుతుంది మా ఇద్దరి మద్య సంది కుదిరింది నన్ను నేనుగా నిలిపే సాహసం చేస్తుంది నా స్వగతం నా అంతరాలలో అంతర్లీనమైపోతుంది. ఉమిత్ కిరణ్ ముదిగొండ

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PLmvYm

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\రచయిత రచన భాష\\ ---------------------- ప్రతి కళలోనూ కళాకారుడికి కొన్ని పనిముట్లు ఉంటాయి. చిత్రకారుడికి కుంచెలూ కేన్వాసు, శిల్పికి ఉలి సుత్తి. రచయితకి కూడా ఉన్నై పాత రోజుల్లో అయితే గంటాలు, భూర్జపత్రాలు, తరవాత ఇంకు పెన్నులు కాయితాలు, ఈ రోజుల్లో అయితే కంప్యూటర్లు. అసలు సరుకంతా ముడిపదార్ధంలో ఉన్నది. శిల్పికి చెక్కనో శిలనో ఎలాగో రచయితకి భాష అలాగు. ఐతే ఒక మౌలికమైన భేదం లేకపోలేదు. రచయితకి ముడి సరుకైన భాష, శిలలాగానో కేన్వాసులాగానో ప్రాణం లేనిది కాదు, అది సజీవమైనది. చరిత్రని పొట్టనిండా నింపుకుని సంస్కృతిని సాంప్రదాయాన్ని వేళ్ళకొసల్లో కనుకొలుకుల్లో తొణికిస్తూ ఉంటుంది. తన జాతి చైతన్యంతో అది నవనవలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ. భాషతో వ్యవహారం ఆషామాషీ కాదెప్పుడూ. ఇలా సజీవమైన ముడిసరుకుతో కుస్తీ పట్టే రచయితని చూస్తే నాకు చెవులుకుట్టే వాళ్ళూ, పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ గుర్తొస్తారు. పచ్చబొట్టు పొడిచేవాడు అసమర్ధుడైతే, వాడి ముడిసరుకునైన నేను వాడి చేతిలో నరకం చూస్తాను గద! ఆ బాధలో వాడీ గొంతునులిమి చంపెయ్యలేక పోవచ్చును గానీ కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను గద! అటూ ఇటూ మెలికలు తిరుగుతాను గద! ఇంతా చేసి చివరికి ఆ పచ్చబొట్టు నానాకంగాళీ అవకతవగ్గా తయారవుతుందని వేరే చెప్పాలా? ఆ మచ్చని - మనకి నచ్చనిదైనా - చెరిపేసుకోలేను గద! అసమర్ధుడైన రచయితచేతిలో భాష కూడా ఇలాంటి పాట్లే పడుతుంది. విజ్ఞుడైన రచయిత భాష పట్ల గౌరవంగా ఉంటాడు. ప్రాణానికి జీవానికి మనమిచ్చే ఒక మౌలికమైన గౌరవమది. జ్ఞాన నిధులైన పండితులకిచ్చే గౌరవమది. అది తెలిసి మసలుకునే రచయితని భాష కరుణిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ కూడా అవుతుంది. ఆ కరుణలో ప్రేమలో తడిసి పునీతుడైన రచయిత ఆ భాషకి నగిషీలు చెక్కి అందాలు అద్దుతాడు. POSTED BY కొత్త పాళీ LABELS: భాష Link: http://ift.tt/1fRMjMi 5-4-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRMjMi

Posted by Katta

Sri Venkatesh కవిత

***ప్రకృతి విరుద్ధం*** పడమటి సూర్యోదయం తూర్పున ప్రొద్దుక్రుంకే సూరీడు రంగు లేని పూలు నడిచే పక్షులు ఎగిరే మనుషులు మొదలు లేని అంతం దారి తప్పిన గాలి తీరం చేరని కెరటం పొరలు లేని మెదడు నిజం చెప్పే అబద్ధం కొండనాలుక పై దురద కర్ణభేరిని చంపేసిన నిశ్శబ్ధం కాంతిని పట్టుకున్న హస్తం నీడను హత్తుకున్న ఆకారం కమ్మటి కన్నీటిచుక్క చేప తినేసిన మొసలి వృత్తకారంలో భూమధ్యరేఖ ఆకాశంతో సముద్రుని కరచాలనం ఆకలి నెత్తురు తాగిన దాహం నీళ్ళు చీమ కక్కిన విషం !!! "Sri Venkatesh" 06/04/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2CJYP

Posted by Katta

Sasi Bala కవిత

వైకల్యం మనిషికా ...మనసుకా .......శశిబాల అంగ వైకల్యాన్ని లెఖ్ఖ చేయక ,ఆత్మస్థైర్యం తో మనోబలం తో ,కాళ్ళే కరములుగా మలచుకొని చిత్రాన్ని విచిత్రం గా చిత్రీకరించి ... కాళ్ళు చేతులున్న వారికంటే నీవే మాత్రం తీసిపోవని నిరూపించిన పాపా ! ఎవరికమ్మా అంగ వైకల్యం చేతులుండీ పని చేయని సోమరిపోతులు కన్నా అప్పనం గా వచ్చే ఆస్తులకై అర్రులు చాచే రాబందుల కన్నా దేవుడిచ్చిన అంగ భాగ్యాన్ని వృధా చేసి ... అడుక్కు తినే నిష్ట దరిద్రులకన్నా ఎవరికన్న నీవు అల్పం నీ స్ఫూర్తి అనల్పం అసమానం నీ స్థైర్యం సంకల్పమే నీకు బలం .... నిన్ను చూసి గేలి చేయు సమాజానికి సవాలుగ ... నీ దీక్షను సాగించు ....నీ వైకల్యాన్ని అధిగమించు కళామతల్లి నుదుటన నీ పట్టుదల కుంకుమను దిద్దు ..... (6 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfiY2o

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవిత: ....|| నాట్య మెరుగని వాళ్లు ॥ .... 'నేను నర్తించే దెలా?' అన్నాడో వికలాంగుడు. 'ఆడనీ హృదయాన్ని' అన్నాం మేము. ' నేను పాడే దెలా?' అన్నాడో నిస్త్రాణు డు. 'పాడనీ హృదయాన్ని' అన్నాం మేము. 'ఎలా చేసేది నేనూ నాట్యం?' అంది ఓ శుష్క తృణలేశం. 'తేలిపోనీ గాలిలో హృదయాన్ని' అన్నాం మేము. 'మరి,నేనెలా దిగిరాను దివినుండి భువికి?' అన్నాడు దేవుడు పైనుండి. 'ఈ వెలుగులో నర్తించు మాతో మమేకమై' అన్నాం మేము. అపుడు లోయ లోయంతా ఒక బృంద నాట్యకేళి! జత కలువని ఎడద ధూళి లో ధూలి! --మూలం:గేబ్రియాల్ మిస్ట్రాల్ (చిలీ దేశ నోబెల్ గ్రహీత )కవిత 'those who donot dance' కు నా స్వేచ్చానువాదం.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2ve3Z

Posted by Katta

Sravana Saineni కవిత

ఆమె రాకపోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది ఉరి తీసినట్టు ఆ దారి బోసిగా వేళ్ళాడటమే బాగుంది ఆమె సగం పాడి వెళ్ళిపోయిన పాటను గుండెలకు హత్తుకొని మైకంలో తిరగటమే బాగుంది వాన కాలువలా అల్లరి చేసే పిల్లల నడుమ సన్నని గరిక పోచలాగా పచ్చటి జ్ఞాపకమై ఆమె ఒదిగిపోవటమే బాగుంది అప్పుడే కట్టిన పుష్ప గుచ్ఛంలాంటి ఆ పిల్లల బస్సులో తడి మెరుపై ఆమె గుర్తుకు రావటమే బాగుంది పసుపు రంగులో ముంచి ఎత్తిపట్టుకున్న లక్ష కుంచెల సూర్య పూల తోట ఎప్పుడు వెళ్ళినా ఆమెను గీసిపెట్టడం బాగుంది ఆమె కురులపరిమళాల్ని నింపుకున్న ఈ గాలులు బుసలు కొడుతున్న నాగులై నన్ను పగబట్టడం బాగుంది ఇటువైపు ఆమె రాకపోవటమే బాగుంది ఆ మలుపు మీది గోగుపూల వనాలు నేను ఎదురుపడ్డప్పుడు ఆమె బుగ్గల పూసిన సిగ్గులు కావడం బాగుంది అది దారి కాదు ఆమె జ్ఞాపకచిత్రాల ఆర్ట్ గ్యాలరి ఏమీ మాట్లాడకుండా ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది చేతిలోంచి సీతాకోకచిలుక ఎగిరిపోయింది వ్రేళ్ళ కొసలమీద మిగిలిన రంగురంగుల రెక్కల ముద్రల్ని ఇలా చూసుకోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది "శ్రవణ సాయినేని" "ఆమె రాకపోవటమే బాగుంది" ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది ఉరి తీసినట్టు ఆ దారి బోసిగా వేళ్ళాడటమే బాగుంది ఆమె సగం పాడి వెళ్ళిపోయిన పాటను గుండెలకు హత్తుకొని మైకంలో తిరగటమే బాగుంది వాన కాలువలా అల్లరి చేసే పిల్లల నడుమ సన్నని గరిక పోచలాగా పచ్చటి జ్ఞాపకమై ఆమె ఒదిగిపోవటమే బాగుంది అప్పుడే కట్టిన పుష్ప గుచ్ఛంలాంటి ఆ పిల్లల బస్సులో తడి మెరుపై ఆమె గుర్తుకు రావటమే బాగుంది పసుపు రంగులో ముంచి ఎత్తిపట్టుకున్న లక్ష కుంచెల సూర్య పూల తోట ఎప్పుడు వెళ్ళినా ఆమెను గీసిపెట్టడం బాగుంది ఆమె కురులపరిమళాల్ని నింపుకున్న ఈ గాలులు బుసలు కొడుతున్న నాగులై నన్ను పగబట్టడం బాగుంది ఇటువైపు ఆమె రాకపోవటమే బాగుంది ఆ మలుపు మీది గోగుపూల వనాలు నేను ఎదురుపడ్డప్పుడు ఆమె బుగ్గల పూసిన సిగ్గులు కావడం బాగుంది అది దారి కాదు ఆమె జ్ఞాపకచిత్రాల ఆర్ట్ గ్యాలరి ఏమీ మాట్లాడకుండా ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది చేతిలోంచి సీతాకోకచిలుక ఎగిరిపోయింది వ్రేళ్ళ కొసలమీద మిగిలిన రంగురంగుల రెక్కల ముద్రల్ని ఇలా చూసుకోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది 6-4-14

by Sravana Saineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PAICkz

Posted by Katta

Viswanath Goud కవిత

*చెట్టు తల్లి* కడుపు రేకుల షెడ్డులా కాలుతోంది ఆకలి మిట్టమద్యాహ్నంలా మండుతోంది ఓ రొట్టెముక్క మేఘంలా మాడుతున్న ప్రేగులను చల్లారిస్తే బాగుండు పోనీ ఏ అన్నపూర్ణ దేవో అన్నం వండి వంచుతున్న ఓ గ్లాసుడు గంజినీళ్ళలో మునిగితేనయినా ఈ వేడి చల్లబడుతుందేమో చూడాలి వడ్డించిన విస్తరిలోని వేడివేడి వంటలు చద్దిపడ్డాక విసిరేస్తారు, కనీసం వాటిని తీసుకెళ్ళైనా కడుపుపై కప్పుదామనుకున్నా అపుడైనా మంట చల్లబడుతుందేమోనని ఎంత ప్రయత్నించినా ఆకలిమంట తీరే ఏ ప్రయత్నం ఫలించలేదు అలసిపోయి ఓ చెట్టు కిందకు చేరా చల్లటి చినుకుల్లా ఓ రెండు ఫలాలను రాల్చి ఆకలిని చల్లార్చడంతో పాటే తన నీడ ఒడిలో నాకు సేదతీర్చింది ఆ పూటకు తనే నాకు అమ్మయింది.! విశ్వనాథ్ 06APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mP2w6s

Posted by Katta

Amar Pasha కవిత

కళ్ళు ..! ఒకరికి కలల -సమిధలు వేరొకరికి కన్నీటి -కాలువలు..!!

by Amar Pasha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e22LuZ

Posted by Katta

Kavi Yakoob కవిత

Nauduri Murty గారి మాటలు 'కవిత్వం' గురించి.... "కవిత్వం ఒక ఆవేశం. ఒక రకంగా చెప్పాలంటే Aberration of Emotion. మనుషులందరికీ నచ్చినవి కవికి నచ్చకపోవచ్చు. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలని, పనికిమాలినవిగా వదిలేసినవి చిన్నపిల్లాడిలా కవి పట్టించుకోవచ్చు. అసలు కవిత్వం మనలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందోకూడా తెలీదు. అదొక వైరస్ లాంటిది. అదిపట్టిందంటే అమ్మవారు పూనినట్టుంటుంది. అది వదుల్చుకునేదాకా, కాగితమ్మీద ఆ కవితావేశాన్ని ఒలికించేదాకా ఈతరానివాడు ఒక సుడిగుండంలో చిక్కుకుని బయటపడడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది. ఇది సహజ స్థితి. కాని కొంత అలవాటైన తర్వాత, ఈతవచ్చినవాడు నూతిలోనో, చెరువులోనో చేసే విన్యాసంలా ఉంటుంది కవిత్వం. అంటే కేవల ఆవేశం నుండి కొంత సమర్థతలోకి వస్తుంది. ఇరవై ఏళ్ళవయసు వచ్చిన తర్వాత జీవితానికి అర్థం ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించినట్టు, ఇప్పుడు ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అని కవికి అనిపించవచ్చు. (ఈ సందర్భం వారి వారి వ్యక్తిగత సంస్కారాన్ని బట్టీ, పరిస్థితుల అనుకూనలతనుబట్టి మారుతుంటుంది). ఒక రకంగా కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అన్నదానికి సమాధానమే కవి మేనిఫెస్టో. మన సానుభూతిని బట్టి మనకు కొందరు కవులు నచ్చుతారు కొందరు నచ్చరు. కాని, మనం అలవరచుకోవలసినది, మన ఇష్టాయిస్టాలతో సంబంధంలేకుండా, ఎక్కడ కవిత్వాంశ ఉందో దాన్ని పట్టుకోవడం. అంటే ,వోల్టేర్ చెప్పినట్టు " I do not agree with what you say, but I defend to death that you have every right to say it అన్న Democratic స్ఫూర్తి అలవరచుకోవడం. పంకంలోంచి పంకజం వచ్చినట్టు వ్యక్తిత్వంలేని కవిలోంచికూడా మంచికవిత్వం రావొచ్చు అన్నసత్యం మనం గుర్తుంచుకోవాలి. కవీ కవిత్వమూ ఒకటిగా జీవిస్తే, జీవించగలిగితే అది ఆదర్శం. అవి చాలా అరుదైన వస్తువులు."

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e22JmQ

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

పిల్లలూ.. కవులూ... కనిపించని పూలగుత్తులతో పిల్లలు ఎదురుచూస్తుంటారు అభిమానం కొంత ఆరాధన కొంత కళ్ల నిండుగా పరిమళిస్తుంటుంది కవుల ఆలోచనలచేతుల్లోనూ కనిపించని శ్రమ సౌందర్యపు పూలుంటాయి కరచాలనం చేసినా కౌగిలించుకున్నా కళ్ల ఆర్ధ్రమేఘాల బిందువులు దేహం నుంచి దేహంలోకి ప్రవహిస్తాయి కవులూ పిల్లలూ ఏ దేశానికైనా ప్రాణవీచికలు ! రచనా కాలం : 4 ఏప్రిల్ 2014 Time : 7 pm

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q5YgkN

Posted by Katta

Padma Bikkani కవిత

** భావుకత్వం అంటే !? ** భరించలేని వ్యథను అక్షరాలతో అనుసంధానం చేయటం భావుకతనా !! ?? ఓటమి గుండె పొరలను తవ్వుతుంటే ఉబికి వొచ్చే కన్నీటికి వంతెనలు వేయలేక అక్షర ప్రవాహంలో కొట్టుకు పోవటం భావుకతనా !! ?? సంతోషం లో విసిరే అక్షరాల కన్నా వేదనా భరితమైన అక్షరాలే భావుకతనా !! ?? నాది నీది అని సంబరపడిన క్షణాలు ఆవిరై గుండె గొంతును నులిమేసి నాలోనే ఇంకిపోయే ఆవేదనా!! లాలనకి చిన్ని పాపయి లా ఒదిగిపోయే మనసు వేదన ప్రకంపనలకు చిగురాకులా వణికిపోవటమా !! ? కడలి ఘోషలా ఎగిసి ఎగిసి పడే హ్రుదయ ఘోష భావుకత్వమా !!? పద్మ

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDKJDV

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//డప్పులు// ఏటెళ్ల కాలం ఇదే తంతంటే ఇసయం తెలవంది ఎవల్లకి కర్చు తగ్గ డప్పులు మంచులో మోగుతాయా! ఇంటానికి ఇమానం మోత రేడియోలో బానే ఉంటది పెయాణం చెత్తేనేగాందా దూది అవసరమవుద్ది పోనీ ఒక్క తూరైనా నా మాట ఆలకిత్తావా.. డబ్బుకీ గుణం అబ్బాలి ఎంచేతంటే డబ్బుకి జబ్బుకి తుమ్మకిజిగురంత సావాసం మరి యాపారానికి డబ్బవసరమే డబ్బుకోసం చేసే సావాసాలన్నీ యాపారాలే రంగులు నీకు నువ్వే కడుక్కోవాలి రంగనాయకి ఏసాలు మానేయ్ పొద్దొడిచాక నెతుక్కుంటే అద్దంలో డప్పులే అగుపడతాయ్.....02.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcqGQ

Posted by Katta

Abd Wahed కవిత

ఎన్నికలు – వాహెద్ కనీసం మేకలు మేయడానికి నాలుగు పోస్టర్లయినా దొరికాయి.. నాల్రోజులు నాయకులు కళ్ళకు కనిపిస్తారు ఐదేళ్ళపాటు గుండెల్లో గునపాల్లా దాక్కుంటారు ఓటు బరువు మోసి మోసి వంగిన నడుం లేస్తుందా? కంటిలో నిరాశల నెత్తురు చూపుల పెనుమంటకు చమురునిస్తుందా? మానిపోయిన గాయంలా పాత హామీలే మళ్ళీ చిగురిస్తున్నాయి... బండిచక్రంలా తిరుగుతుంది అధికారం కందెనలా నలుగుతుంది సగటు ప్రాణం జెండాకొయ్యలు గాలివాటును మార్చేదెప్పుడు? ప్రాణంలా ప్రేమించిన ప్రేయసి చిరునవ్వులా ఎన్నికలు పంజరంలో చిక్కుకున్న పావురంలా ఫలితాలు...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k7odkO

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఎదురుచూపు... నువ్వు నాకోసం ఎదురు చూసే క్షణాన, నన్ను నేను ఖాళీ చేసి ఉంచుతాను. నా నుండి నేను వీడిపోయి నువ్వెప్పుడు నాలో నిండుకుంటావని శూన్యమై వేచిచూస్తాను. నా హృదయాన్ని అద్దంలా పరచి, నేనైన నిన్ను నాలో ఒంపుకుంటాను. నీ ఎదురుచూపుల్లో నన్ను కౌగిలించుకున్న కాలాన్ని పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను. స్వచ్చమైన నా మనసుని దోసిలిపట్టి నీవైన నన్ను నేనే అభిషేకిస్తాను. 04-04-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcruo

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! రైలు పట్టాలు !! సుదీర్ఘ ప్రయాణం లో కొన్ని సార్లు నీకు సహచరులు ఎప్పటికి కలవని సమాంతర దారులు మన గమ్యానికి మనల్ని చేర్చే మార్గ దర్సినులు నిర్మానుష్య మార్గం లో నిరంతర సహచరులు ఎన్నో ఘోరాలకు ప్రత్యక్ష సాక్షాలు చాలా నేరాలకు సజీవ సాక్షులు కాకూడదు మీరు దంపతులకు ఉదాహరణ ఎప్పటికి కలవని రహదారులు లాగా

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkP0Xr

Posted by Katta

Nirmalarani Thota కవిత

పగలంతా ప్రచండుడై సాయంవేళ చల్లగా పడమటి ఒడి చేరుతాడు సూరీడు ! అమావాస్యకీ పున్నమీకీ మధ్య రోజు రోజుకీ రూపం మారుస్తాడు నెలరాజు ! ఒక సారి గ్రీష్మం . . ఒక సారి వసంతం .. మాటి మాటికీ రంగులు మారుస్తుంది కాలం ! సాగరానికి ఆటు పోట్లు ప్రతి రోజుకూ రాత్రి పగలు . . అన్నింటికీ అలవాటుపడ్డ నేను నీలో మార్పుల్నెందుకు అంగీకరించను ? బహుశా.. అవన్ని అందరివీ నువ్వు మాత్రం నా ఒక్కడివే అనే భావన కాబోలు..! అర్ధం చేసుకోవూ . . . ! !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hhOcEf

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి ||నిశిరాతిరి మెలకువలో..|| గాలిని తురుముతోంది రెక్కలతో గదిలో..ప్రాణం లేని పంకా జుయ్ - జుయ్ ల కవ్వపు చిలకరింపులు పలకరింపేనా!! నన్నే!! లేదాఇది దేనికైనా సమాధానమా!! నా చెవులేమైనా అడిగాయా!! టక టక లాడుతుందేంటి.. మది తడవ-తడవకూ!! కిటికీలోంచి తొంగిచూస్తుంది ఆకాశంలో చుక్క.. విసిరి నిద్రపుచ్చాలని ఆరాటంలో జలతారు గాలితెర తినకుండా పడుకున్నా కదా!.. పేగులు అరుస్తున్నాయి నీళ్ళు తాగి నడుం వాల్చా.. నా చూపు లోకప్పును చీల్చాలని చూస్తుందా!! రోజంతా కళ్ళముందు కదుల్తోంది కొత్తగా వచ్చిన బెంగేంకాదు బాల్యంలా ఇప్పుడిక లేదన్నదే!! आजा बचपन एक बार फिर ..देदे अपनी निर्मल शांति .... అమ్మ చెప్పిన పాఠాన్ని జ్ఞప్తికి తెస్తుంది.. ఈ ఫ్యాను చేసే శబ్దమేనా!! ఏమో! ఆలస్యమైంది.. ముద్ద కతికి పడుకోవాలి.. జోల పాటకి గాలి మర రెడీ.. అంతరంగమా!! వెన్నెల కబుర్లకి కాలం చెల్లినా ఈ గాలి గోల... ఎంత బాగుందీ రాత్రి.. ఒంటరితనానికి తోడు దొరికిందిలే ఉండుండు.. మరో పాటో.. పాఠమో.. గుర్తుకొస్తుంది... 4.4.14== 12.06 am

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxDyx5

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (4)|| సరేలే ఒక "వేలైతే" చూపించగల్గావు ....మరి మిగిలిన నాలుగు సంగతేంటో ? ఆర్కే ||బుంగలు (4)||20140404

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFtsnN

Posted by Katta

Panasakarla Prakash కవిత

మనలో దీప౦ ఇప్పుడు నా చుట్టూ ఎవరూ లేరు నాలోకి నేను ప్రవహి౦చడానికి ఇదే సరైన సమయ౦ అ౦దని ఆకాశ౦ కి౦ద ఎ౦దుకు పచ్ఛని చెట్టు కి౦దే కళ్ళు మూసుకుని నా లో౦చి నేను పరిమళిస్తాను గాలి ఆధార౦గా ఉచ్చ్వాస నిశ్వాసనై రోజువారీలా కాకు౦డా ఈ రోజు ప్రత్యేక౦గా నాలోకి నేను ప్రసరిస్తాను ఒ౦టరి తనమ౦టే మన చుట్టూ ఎవరూ లేరని దు:ఖి౦చడ౦కాదు మనలో ఉన్నదెవరో గ్రహి౦చడ౦... ఒ౦టరితనమ౦టే దేహ౦ రూపుదిద్దుకున్న తరువాత‌ ఊపిరిని వెలిగి౦చిన జ్యోతిని దర్శి౦చడ౦ ఒ౦టరితనమ౦టే నీవనే అగాధ౦లో వెలిగే దీపాన్ని జ్ఞాన౦తో గుర్తి౦చడ౦ ఒ౦టరితన౦ దొరికినప్పుడల్లా అలా నీలోకి నువ్వు ప్రవహిస్తూ ఉ౦డు ఎ౦దుక౦టే...... ఏది శాశ్వతమో తెలిసినప్పుడు అశాశ్వతమైన దు:ఖ౦ అక్కడితో ఆవిరైపోతు౦ది..... పనసకర్ల‌ 4/04/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jJjy5P

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -2 హైవానియత్ (పశుత్వం) - - - - - - - - - - - - - - - - - - - - - స్కైబాబ 'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా దూస్రీబార్ బచీ జాన్‌ తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా' (మొదటిసారి అన్నీ మిగిలాయి రెండోసారి ప్రాణాలు మిగిలాయి మూడోసారి పేరూ ఆనవాళ్ళూ చెరిపేయబడుతుంది) - గుజరాత్ గోడ మీది వాక్యాలు జన్మకు ఆరని అలజడి వెన్నంటి వచ్చింది లయ తప్పిన వేలగుండెల ధ్వని నా గుండెలో వేల ముఖాల వేలవేల చీకట్ల తర్జుమా నా మొఖం కన్ను మలుగుత లేదు కనుపాపలమీద పరుగులు పెడుతున్న పాదాలు దూసుకొస్తూ త్రిశూలాలు కరవాలాలు బరిసెలు పొడుచుకొచ్చిన కన్ను తెగిన కాలూ చెయ్యి తల నెత్తురు కారుతున్న మర్మాంగాలు అంతా రక్తం ఆకు పచ్చని రక్తం ధ్యాసెక్కడిది ముండ్లా పురుగూ పుట్రలా రాళ్ళా కొండలా చీకటా అడ్డం పడి ఉరుకుతూ అడవినో ఎడారినో కాళ్ళకింద పరుగెత్తిస్తూ వెలుగు కావాలి నమ్మకం కావాలి నెలవంకల వెలుగు కావాలి కుడికన్ను చూస్తుండగానే ఎడమకన్ను పెరికివేత భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు యోనుల రక్తస్రావంలో మునిగిపోతున్న నా దేశం ఎడమకాలు వెంట కుడికాలు ఉరికొస్తుందన్న నమ్మకమేది? ముసలి తల్లిదండ్రులు పసిబిడ్డలు నిండు చూలాల్లు పచ్చి బాలింతలు ఎవరున్నారో ఎవరు లేరో చెల్కల్లో తగలబడి ఉన్న బూడిద కుప్పల్లో ఎన్నెన్ని ముఖాలు వెతుక్కోవాలి పండు ముడతల అమీనా బీబీ ప్రతి ముడతా సాపిస్తున్నది కవాబులా ఉడికిన ఈ పసిదేహం పేరెవరు చెప్తారు చేపలా చీల్చిన ఆ యువతి శవం కథ ఎవరు చెప్తారు పతా తెలీకుండా మాడిన ప్రతి దేహమూ సాపిస్తున్నది 'తరాల మా నమ్మకాల్ని తగలబెట్టేసిన పాపం ఊరికేపోదు' 'అల్లా హమే లేలియాతో యే జహన్నుమ్‌సే భీ అచ్ఛా హోతా' సరీఫా బాను ఏడుస్తున్నది భూమితల్లి ఏడుస్తున్నది తన గుండెల మీదే ఆడిన తన బిడ్డల్ని తన ఒంటిమీదే నగ్నంగా ఉరికిస్తూ ఆడుకున్న రామ సంతతి అకృత్యాలు చూసి- నగ్నంగా పడేసి సామూహిక బలాత్కారాలు చేసిన అకృత్యాలు చూసి- భూమి తల్లి ఏడుస్తున్నది అవాళ సీత కష్టాలు చూసి ఏడ్చి ఏడ్చి పగిలిన భూమితల్లి ఆమెను అక్కున చేర్చుకున్నట్లే ఇవాళ రామ సంతతి అకృత్యాలకు బలైన తన బిడ్డల్ని అక్కున జేర్చుకుంది *** కన్ను మలుగుత లేదు కన్ను మలిగితే చీకటి చీకట్లో చెల్లా చెదురైన ఊరు తుంపలు తుంపలుగా *** కన్ను మలిగితే ఏడేళ్ల ఇమ్రాన్‌ కెవ్వున అరుస్తూ... అదే చీకటి చీకట్లో ఒక్కో అమానుష దృశ్యం శకలాలు శకలాలుగా మీదికి రాల్తూ పసి దేహాల్ని గాల్లోకి ఎగరేసి చంపిన అమానవీయం పసి చేతులకు కరెంట్ పట్టిచ్చిన అమానవీయం పెట్రోలు తాపి పసిపెదాలకు అగ్గిపుల్ల అంటిచ్చిన అమానవీయం కన్ను తెర్వక ముందే పసిగుడ్డును శూలం గుచ్చి మంటల్లో మాడ్చిన అమానవీయం పసి కళ్ళల్లో బొమ్మకట్టిన అమ్మీ అబ్బాలు అవమానించబడ్డ అమానుషం మానభంగించబడ్డ అమానుషం ముక్కలుగా నరకబడ్డ అమానుషం కళ్ళముందే తగలబెట్టబడి కళ్ళలో మంటలుగా నిలిచిపోయిన అమానుషం పసి దాహాలకు గుక్కెడు నీళ్ళు నిరాకరించబడిన సంఘంలో ఒకరి మూత్రాన్ని మరొకరికి తాపించుకున్న నిస్సహాయత పసి ఆకల్లకు నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో పుట్ట మన్నులో నీళ్ళు కలిపి తినిపించుకున్న నిస్సహాయత... చితికిన గుండెకు మనిషితనపు లేపనంతో ఓదార్చుకుంటున్న ముసల్మాన్‌లను ముట్టుకొనొచ్చాను జన్మకు మానని మనసు గాయాన్ని మోసుకొచ్చుకున్నాను పరిణామ క్రమంలో జంతు దశలో ఆగిపోయిన జీవులు కొన్ని ఇప్పుడు మనషుల్ని చంపుతూ... 'ముసల్మానోంకో మారో - కాటో - జలావో' 'జిస్‌ మొహల్లేమే అల్లా హోగా వో మొహల్లా జలేగా' 'హిందుస్తాన్‌మె రహెనా హోతో హిందూ బన్కే రహో' 'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా దూస్రీబార్ బచీ జాన్‌ తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా' విరిగిన గోడలమీది నినాదాల్ని కూల్చి రాయాల్సింది కొత్త నినాదం: 'హిందూ హిందీ హిందుస్తాన్‌' నహీ– వో హిందూ బనే ఇన్సాన్'! (అలాంటి 'హిందువులు' మనుషులుగా మారాలి)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7oJww

Posted by Katta

కాశి రాజు కవిత

||బద్దెమంచం|| దు:ఖానికున్న దారుల్ని మూయలేమని చెప్పింది నువ్వేగా మొకందాచేసి ముక్కుతుడుసుకుంటుంటే తెలిసిపోతావ్ నువ్వునన్ను సాగనంపినపుడల్లా గుండెతడి గొంతులో ఆపేసి దుఖాన్ని గుటకలేస్తున్నపుడు నానా నీ గొంతే గుండెలా కనిపిస్తది నీ కొడుకుని నేనూ అంతే. దుఖాన్ని దాస్తాను ఒకదానికొకటంటుకున్న రెప్పవెంట్రుకలు తడిగా నన్ను నీకు సూపించాక వొచ్చేసేముందురాత్రి కుక్కడిపోయిన బద్దెమంచం బిగిస్తున్నపుడు కాళ్ళుతన్నిబెట్టి బద్దిలాగి , తెగిపోయి, పడిపోయి ఆకాశం నేలా ఏకమయ్యేలా నువ్వుకుందంతా వొదులైపోయిన బందాన్ని బిగించినందుకే గుర్తు తెచ్చుకుంటే దు:ఖానిది బరువొకసారి నాన్నా నవ్వేసి దుఃఖాన్ని తేలిక చేద్దాం. 4-04-2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mORbG6

Posted by Katta

Vinjamuri Venkata Apparao కవిత

ఆంధ్ర భాషోధ్ధారక శ్రీ CP Brown.

by Vinjamuri Venkata Apparao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mORd0L

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఏటు??????|| మననుండి మనం జారిపోవడం మనలోకి మనం జారిపోవడం.. వేరువేరు సున్నా అయిపోవడం సుడిగుండంలో చిక్కడం.... వేరువేరు అయినా సరే ఏంజరిగినా ఒక్క దీర్ఘశ్వాశతో మనసును ఖాళీ చేయడం సాధ్యమా? గతాన్నంతా ఇనుపగోళ్ళతో వొలుచుకొని కొత్తపల్లవి ఎత్తుకోవడం సాధ్యమా? సాధ్యమే అనుకొన్నా......... మరక మంచిదే అనుకొనే వాడిని మారుమనసు పొంది మనువాడాలనుకొన్నప్పుడు రంగు వెలిసిపోక తప్పదుకదా అటుపై ఎన్ని గుంజీళ్ళు తీస్తేమాత్రం ఏంప్రయోజనం?

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OgZNGD

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే..నేస్తమా..! @ రాజేష్ @ రామోజీ...! నిజంగా మీది జర్నలిజమా..? అవకాశవాదమా...? ఉన్మాదమా...? ఉద్యమమా..? వీటిలో ఏదో తెలియక ప్రజలు పడుతున్నారు తికమక..! మీకు తోచిందే రాసేసి మీకు కావాల్సిందే చేసేసి మీరనుకున్నదే ప్రజలమీద రుద్దేసేదే జర్నలిజమా..! ప్రజల అభిప్రాయంతో లేదా మీకు సంబంధం అంతా బ్యూరోక్రాట్లతోనేనా మీకు అనుబంధం..! గతంలోని మీ అంతరంగం ఎంతోమందికి ఓ సందేశం ఇప్పుడు మీరాడుతున్న చదరంగం మీ ఉనికికే ప్రమాదకరం..! ఎందుకిలా మీ జీవితం మారిపోయింది..? మీలో ఎందుకు నిస్వార్ధం తగ్గిపోయింది..? దేనికోసం అధికార దాహం పెరిగిపోయింది..? ఎవరి కోసం ఈ పోరాటం మీరు చేస్తుంది..? ఎప్పుడూ ఎదుట వాడికి నీతులు చెప్పేనీవు నీది కాని ఆస్తుల కోసం ఆశపడి భంగపడ్డావు అవస్తవాన్ని వాస్తవం చేసేందుకు కష్టపడ్డావు నిజమేదో కోర్టులు చెబితే కంగారు పడ్డావు ఎందుకిలా మారిపోయావు ఎవరికోసం దిగజారిపోయావు ఏమయ్యాయి నీలో విలువలు చేసుకోకు జీవితం చిలవలు పలవలు...!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kec11E

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || కేంద్ర బిందువు || నిన్నో మరెవరినో నువ్వే నా కేంద్ర బిందువు అని ముద్రవేసి ఆ బిందువును ఆనుకుని చుట్టూ వృత్తాన్ని గీసుకొని అందులో నన్ను నేను దాచుకొని తన చుట్టూ తిరుగుతూ తన తలంపులు, ఊసులు, ఊహలు, చుట్టుకొలతగా పోగేసుకొని నా ఉనికిని కోల్పోయిన క్షణాన వృత్తాన్ని దాటలేక అందులో దాగాలేక అప్పుడు అంటాను జీవితం నాకు నచ్చినట్లు లేదు అని ******* ఇప్పుడు నేను ఒక ఒంటరి బిందువును ఇక ఇప్పుడైనా మొదలుపెడతాను ఒక వృత్తాన్ని నన్ను అనుకొని గీయడం అందులో నన్ను నేను నింపుకోవడం ఏ వృత్తంలోనూ నేను లేకపోవడమే నన్ను ఒక కేంద్ర బిందువును చేసిందనుకుంటా మీ చాంద్ || 06.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mOfvVK

Posted by Katta

Prakash Mallavolu కవిత

ఏది శాశ్వతం....?? || సుష@4U4ever@ ---------------------------------------------------- వేకువ ఝామున వికసించి వాసన్లు వెదజల్లే సుమం..... వాడకపోదు... నేటి కన్నీటి కొలనులో రేపటి ఆనంద పు(భా)ష్పం ... పూయకపోదు.... చీకటి మింగిన చూపులో వెలుతురు చుక్క .... ఉదయించకపోదు... వెలుతురున్న చోటు వెలితి రాదన్న ... ఢోకా లేదు... నిశ్చలమైన అండం.... చలనాన్నిస్తుందన్న నమ్మకం లేదు ... చలనమున్న నేడు... రేపు విగతమవదన్న భరోసా లేదు ... నేను ... నా ... అ(నుకు)న్న మదిలో ... ఏది శాశ్వతం ...?? అనుకునే రోజు రాకపోదు.... శోధించే మెదడుకు ..... తుది లక్ష్యమై అచ్యుతుడు కన్పడక పోడు....06APR14

by Prakash Mallavolu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mOfvFo

Posted by Katta

Radha Manduva కవిత

నిజం కదా.... ----------- రాధ రాజశేఖర్ ______________________________________________________________ ఎదుటి వ్యక్తి మనసులోంచి సూటిగా తాకిన అభినందన 'చేతన' ని కుదుపుతుంది ఎడతెగకుండా మాట్లాడుతున్న విదూషకుడు హఠాత్తుగా మౌనం వహిస్తాడు క్షణాల్లోంచి వింత వింత సుమాలు పూస్తాయి శరీరం ఎవరిదో అన్నట్లుగా ఉంటుంది 'నా' గురించి ఏవో వివరాలు అడుగుతున్న స్వరం ఎప్పుడూ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ముగించుకుని వెళ్ళాల్సిన దానిని పెంచుకుని వెళుతున్నానన్న ఆశ్చర్యం ఆనందంగా మారుతూ ఉంటుంది ఒక్క మనిషి చూపించిన అభిమానం దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది మనుషుల మీద నమ్మకం మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది ***

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pvn1cU

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -1 కాలీ దునియాఁ --------------- -షాజహానా బుర్ఖా వేసుకున్నప్పుడు ప్రపంచం నల్లగ అవుపించేది బుర్ఖాలను చీల్చేసి... శరీరాల్తో సహా తగలబెడ్తున్నప్పుడు బిత్తరపోయిన ప్రాణాలకు ఒక్కసారిగా ఈ దునియాఁ మొత్తం నల్లగా... ఎండిన రక్తం ముద్దలా ఇప్పుడు బుర్ఖా వేసినా వేయకున్నా ప్రపంచమంటే - కాషాయశిల...! కత్తి మొన...! పొడుచుకొచ్చిన పురుషాంగం...! ఇంత క్రూరత్వం దాగుంటుందనే గదా మమ్మల్ని బైటికి రానివ్వడం లేదంటున్నారు ఈ భయానక నిజం స్వప్నమైతే కళ్ళు... బూసుల్ని దులుపుకున్నట్లు తుడిచేసేవి ఇంతింతగా మోసపోవటం అబద్ధమైతే... ఖుషీలో మునిగి తేలేవి... మనసులు! కానీ నిజం నిప్పై కాల్చింది నీరై ముంచింది కాషాయమై... దింపుడు గళ్ళెం లేకుండా చేసింది! ప్రపంచం 'మాయిపొర'లో ఇరుక్కుని ఉమ్మనీరు తాగి ఇవ్వాళ కాషాయం కక్కుతోంది...! మా కాళ్ళ సందుల్లోంచొచ్చి మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారే... నీ ఇంట్లో ఆడది కూడా రహస్యంగా మా కోసం కన్నీళ్ళు కార్చి ఉంటుంది! మగ నాకొడుకుల ఊపిరి బయటికి రాకుండా నొక్కేస్తే పీడా పోతుందని ఒక్కసారైనా మీ అమ్మ అనుకునే ఉండాలి ఈ మగజాతంతా ఇంతకంటే ఏం చేయగలరు? స్త్రీకి పురుషుడి నగ్నత్వం ఎంత పాతో అరాచకం అమానుషం క్రూరత్వం అంతే పాత! సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా? గుండెల్ని పెకిలించి పొట్టలు చీల్చి యోనుల్లో ఆయుధాలు పొడిచి ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు కానీ 'నన్ను' హత్య చేయలేవు అనంతంగా సాగే జీవనదిని నేను బతకడమే కాదు నిన్ను పుట్టించి బతికించేది నేనే...! అయినా స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు? ఎప్పటికీ ప్రపంచం నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే...! ( ఆదివారం 'వార్త' 'అజాఁ' గుజరాత్‌-ముస్లిం కవిత్వం- 2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fQTYXS

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8L6AP

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పచ్చీసాట కన్నీటి గవ్వలతో కాలం పచ్చీసాడుతున్నది నన్ను నీతో పోటీకి దింపి తెగ నవ్వుకుంటున్నది నా పందేలన్ని దూగ,తీని,చారీలే సంపుడు పందెంలేదు, పెద్ద పందెంలేదు నేను తనంత చెయ్యి తిరిగిన ఆటగాణ్ణి కాదు పడక పడక పందెం పడ్డా బతుకు పంటగడి చేరకుండనే గుండెల పండుగాయలు చస్తున్నయి ‘ఎన పచ్చీసు’ గెలుపు మంత్రం ఎన్ని సార్లన్నా గవ్వలు నవ్వుల్లెక్క తెల్లగ పడ్డదెన్నని, పడితే పనికిరాని ఏకాంతం చౌదానో, ఒంటరితనం చెక్కనో ఆటొప్పుకున్నంక తప్పదు మాటల్లో, మహిమల్లో నీతో గెలవనని నాకెరికే నీ చేతుల గవ్వలు నీవనుకున్నంత పందెం పలుకుతయి నీవనుకున్నట్టె గెలుపులన్ని నీ ఇంట్లనే దస్సో, పచ్చీసో, త్రీయీసో నీ రెండువేళ్ళమధ్య నీ ఇష్టం గవ్వ నీవన్నట్లు నీషరతుకు పడతయి నాకు నీ చేతిల ఓడిపోవుడు కొత్తనా నీ బనాయింపులే కొత్త కాయలెత్తెటపుడు, పచ్చీసు మూట కట్టేటపుడు గుస గుస ‘నీవెందుకు ఓడిపోతవో నా కెరుకే’ నీ చిన్ననవ్వులో పరిచయ పరాచికం నాకేం తెలుసు ఆడినా ఆడకున్నా నువ్వంటే నాకు ఇష్టభయసందోహం నన్ను ఆడించేది నువ్వే, ఆటను నేను నువ్వు ఓడించే గెలుపును నేను

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1htU3Ap

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hb6qqQ

Posted by Katta

Viswanath Goud కవిత

జీవితం-నిప్పుల కొలిమి ప్రాణదీపం కొడిగడుతుంది మనసుకు తన స్మృతుల ఆజ్యం అందనపుడు ఆరిపోవడానికి,వాడిపోవడానికి నీ జీవితం గాలిలో దీపం కాదు, పూసిన ఒక్కరోజుకే మాసిపోయే మల్లె కూడా కాదు. మనసులు మళ్ళీ అతుక్కుంటాయి మమతానురాగాలు బంకలాంటివి కొన్ని వాక్కులు పేలుతాయి మౌనాలు ముక్కలై సమయంలో శిథిలమవుతాయి నీకోసం కొన్ని రాత్రులు ఏడుస్తాయి కొన్ని చుక్కల్ని నేల రాలుస్తాయి చీకట్లు వెన్నెలను వెంటబెట్టుకొస్తాయి నీ కళ్ళలో వెలుగునింప చూస్తాయి మది నది ఇంకిపోతుంది లావాలా పొంగే గుబులును చల్లారుస్తుంది నీ గుండె ఆక్రోశం విని కొండాకోనలు ప్రతిద్వనిస్తాయి సెలయేరులు కన్నిటి జలపాతాలై పారతాయి ఓదార్పు ఊరడింపునివ్వదని ఊహలన్నీ వాస్తవాలు కావు వాస్తవాలన్ని కాలే కట్టెలే పట్టిన చేతికే ఆ గాయమంటూ ఏ చెట్టుకొమ్మనో ఆశ్రయిస్తావు మెడకు ప్రశ్నల తాడు తగిలించుకుని జవాబుకై ఊపిరిని ఊపుతూ.... ఆపుతూ.... గాలిలో ఊయలూగుతావు ఒడ్డు చేరక సుడిగుండంలోనే సుడులు తిరిగి కలసిపోయే కడలికెరటం అవుతావు తీరంలోనే గొయ్యి తీసి పాతేసిన అలవవుతావు ఎవడి కాలికిందో నలిగి అంటుకుపోయే మట్టవుతావు గాలి నీ ఆత్మకు పల్లకీ అవుతుంది నిన్ను అనంతలోకాలకు చేర్చే విహంగమవుతుంది ఆకాశం నిప్పుల కొలిమి తిరిగి రాజేసుకుంటుంది ఈసారింకా బాగా సానపట్టి దైర్యం ఆకురాయిపై నూరి మరీ నిన్ను భూమ్మీదకు విసిరేస్తుంది జీవితపు లోతుల్ని ఈ జన్మలోనయినా తలంచి తరచిచూసి తరించి జీవితపు చివరంచు వరకు పరిశీలించమని పరిశోదకుడవై విజయసాదకుడవై శిఖరాగ్రాన నిలువమని... నువ్వు బ్రతకడంలో ఓడిన ప్రతిసారి గెలిచే వరకు పైనుండి తోసేయబడుతూనే ఉంటావు.! విశ్వనాథ్ 04APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmNb7Y

Posted by Katta

Sree Kavita కవిత

!! ఓ దార్పు!! 'శ్రీ కవిత' 04.04.2014 ఓ చెలీ.!!..నా మది కోవెలలో కొలువున్న ఓ దేవి..!! నా కనుపాపల మీద తెలాడే నీ రూపము నీ తనువు ఆకృతి, నీ సుందర మోము వర్ణించలేని పోల్చలేని ఇంద్ర జాలం ..!! ప్రియ సఖి!! మన పరిచయం మనోవాంచా ఫలం పంచుకున్న అనుభూతుల ప్రపంచం రసరమ్య మాధుర్యం ప్రపంచంలోని ప్రతి కదలిక మన చతుర్నయనాలకు మాత్రం వింతలే ..!! చింతలేని మన వలపుల వలయములో ఏర్పడిన అపార్ధాలు వీడని గ్రహణంలా మదిని కుదిపేస్తూ,.భావాల ప్రవాహమై, ఆక్రందనతో విరహ గీతాల రాగం చివరకంటూ వచ్చి గొంతు మూగ బోయింది స్వర పేటిక నిశబ్ద గీతాన్నీ ఆలపించింది..!! ప్రియ వర్షిణి ..!! ఒక్కసారి ఆలోచించు ఘనత లన్నీ మరచిపోయి, సాకులేన్చితివి నీ ,నిరాదరణతో నా శక్తి యుక్తులు సన్నగిల్లెను గతము కలవలె కరిగిపోగా , నిదురలేని నిర్భాగ్యుడిలా .సొమ్మసిల్లితినే !! ప్రేమ వర్షం కురిపించలేవా ..??..!! హిమ వర్షిణి.!! నా పెదవులపై ఓలలాడే చిరునవ్వు నువ్వు .నిర్ధయతో నాకు దూరము చేసిన నిరుపామానమైన నా చిరునవ్వు జీవకలని హరించింది, నిట్టూర్పులు నిలువెల్లా ఆవరించగా అసంతృప్తి అణ్వస్త్రమై అంతరంగంలో అణువణువు విస్పోటనాల మయమై .స్థిమితానికి తెర పడి మతి చెడి ఎద సడి అడుగులు తడబడి కుమిలి పోతున్న !! చిరునవ్వు తిరిగి ఇవ్వలేవా..?? !! .ప్రియధామిని..!! బలము కరువై బ్రతుకు బరువై ఆశలు నీర్వీర్యమై, నిసృహతో క్షణాలు సైతం యుగాలుగా గడుపుతున్నా భీతి పెరుగుటతో..!! మురిపించ రాలేవా.??.!! కానులార్పితే నా కనుపాపల నుండి నీ రూపము కన్నీరుల జారిపోతుందని, మది రగిలినా యెద పగిలినా నీ !! ఓ దార్పు!! కోసం వేచి ఉన్న...ఉంటాను...!!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pv10ea

Posted by Katta

Arcube Kavi కవిత

మోదుగు పూల రంగు సీసాల యుద్ద నౌక ----------------------------- ఆర్క్యూబ్ ప్రభూ.. అతని గజ్జె కట్టిన పాదం మీద ఎంక్వైరీ పెట్టినం పాద పాదాన జనం దండు కట్టి కదులుతున్నది ప్రభూ.. గట్టి పాటకు ఇంధనమేదో తెల్సింది ఆడి పాడెటోనికి ఎవడైనా సలాం కొట్టాల్సిందే ప్రభూ.. ఇంకా అర్థం కాలేదా ? మీ శిక్షలేవీ కాల పరిక్షకు నిలబడలేక పోయాయి కథ అడ్డం తిరిగింది హోలిక వంటి మీ రాజ్యం తగలబడుతున్నది తూటా లోకి పాట దూసుకుపోతున్నది...

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PIlal1

Posted by Katta

Kavi Yakoob కవిత

వడ్డెర చండీదాస్ ' హిమజ్వాల ' కవిత్వం లోని కొన్ని పంక్తులు : ' కాలం మీంచి నడిచిపోయేది కవిత్వం పాడుకాలానికి ఎదురీదేది కవిత్వం యుగ యుగాలుగా పంజరం పై పక్షి చేస్తున్న యుద్ధం కవిత్వం '

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCY5jO

Posted by Katta

Sita Ram కవిత

☼uday☼ నీచూపుల స్పర్శ తాకింది నన్నే తెలియనీ వింతనే నాకు చూపే తెలియునా!నీకు తెలియునా!! కనుముందు కనిపించు స్వప్నము ఏదో సరికొత్తగా మారింది నేడే తెలియునా!ఎందుకొ నీకైన తెలియునా క్షణమైనా కునుకేలే క్షణమే నే నాతో లేనే ప్రతిక్షణమూ నువు తలంపుకొస్తుంటే కనిపించని మాయే ఏదో తలపించే ధ్యాసే ఏదో నను నీవైపే నడిపిస్తూఉంటే నాలో నేనే లేలని అంటూ నీలోనేనొదిగున్నానంటూ నీవద్దకే నామదిపోయిందే 04-04-2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pq5tPO

Posted by Katta

Manjunadha Reddy కవిత

చిలుక పలుకులు పలుకుతున్న చిలిపిచేష్టలు చేస్తున్న మాయమాటలు చెప్పుతున్న మత్తు మందు చెల్లుతున్న నన్ను చేరగా రావెంటిరా పురుసోత్తమా! చెంత చేరుతూ చెలిమి చేస్తున్న జత కట్టి జాతర చేస్తున్న జాబిలమ్మవై హాయ్ నిస్తున్న అవకాశాలను ఆశరగా తిసుకొవెంటిరా పురుషోత్తమా! సరదాగా సరసమైన మాటలు చెప్పుతున్న మధురంగా మంత్రాల గారడిచేస్తున్న మగువ మనస్సు ఎరుగని సోమరివైయవెంటిరా పురుసోత్తమా అలకపై ఉన్న నన్ను అందముగా హద్దు అంటూ కద్దు చేస్తావెంటిరా కళ్ళలో నిన్ను పెట్టుకొని కమ్మని కళలు కట్తున్న అమ్మగా ఉన్న నన్ను కమ్మగా పాటపాడి నన్ను పిలవవెంటిరా పురుషోత్తమా @ 07/04/2014

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h20zmx

Posted by Katta

Sasi Bala కవిత

పుట్టినదాదిగా మట్టిని నమ్మి ,రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకున కండలు పిండి చేసి ,నెత్తురు చెమటను చేసి .. పట్టెడు మెతుకులకోసం ,పొట్ట నింపు దారికోసం పండిన పంటను కావడి తట్టలో భుజమున మోసి ఎండనకా వాననకా ..పగలు రేయన్నది లేక దళారీల మోసాలకు రక్తం మట్టిన పడితే నష్టపడుతుంటే కాలికి నెత్తికి ఏదీ రక్షణ లేక .. ముళ్ళ దారి ,అడవి దారి ..గతుకుల రహదారుల్లో గమ్యం లేని రైతన్నా ..నీ జీవన గమ్యం ఏదన్నా సూరీడుని నీ తండ్రిగ ..అమ్మ ధరణి నీ తల్లిగ రెక్కలతో ,ఎండిన డొక్కలతో పలుగు పూని పార పూని ఆశను బాసట బూని పట్టణాల దిక్కు సాగి బతుకు బండి నడిపించే బహుదూరపు బాటసారి కనబడెనా నీకు దారి శశిబాల (6 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lBYJJu

Posted by Katta

Pusyami Sagar కవిత

అటకెక్కబోతున్న పఠనా సాహిత్యం - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243 19/08/2013 ఒక సాహితీవేత్త చెప్పిన విషయాన్ని వెంటనే పాఠక లోకం గ్రహించి ఆహా, ఓహో అంటూ తల మీద పెట్టుకొని ప్రచారం చేస్తారనుకోవడం పొరపాటు. పాఠకుడు పఠనానంతరం, తననుతాను దుఃఖ భరిత సందర్భాల్లోనుంచి విముక్తి చేసుకోడానికి నూతన అనుభవాన్ని పొందడానికి ఎంతవరకు చదివిన అంశం ఉపయోగిస్తుందో లోన మనస్సు అంచనా వేస్తుంది. మనస్సులో కదలిక మొదలైతే ఆలోచనలు మొదలవుతాయి. ....................... సాహిత్య రంగంలో రాసేవారికి, చదివే వారికి వున్న సంబంధం చాలా గొప్పది. వీరిమధ్య అవగాహనా లోపం ముదిరేకొద్దీ సాహిత్యం విలువలు తరుగుతూ వుంటాయ. దీన్ని సవరించుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం అటు సాహితీవేత్తల మీద, యిటు పాఠకుల మీద కూడ ఉంటుంది. ఈ బాధ్యతని ఖచ్చితంగా చెప్పాలంటే పాఠకుల మీదకంటే సాహిత్య సృజనకారులమీదనే ఎక్కువగా ఉంటుంది, ఉండాలి అనేది నిర్వివాదాంశం. సాహిత్య సృజన ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక ఉన్నతమైన ఉదాత్తమైన త్యాగనిరతి, అకుంఠిత దీక్ష దక్షత, అనే్వషణ, శాస్ర్తియ దృక్పథం, హేతుబద్ధమైన ఆలోచనా విధానం రచయితలో చోటుచేసుకోవాల్సిన అవసరం వుంది. సాహిత్యం సృజనాత్మకతా భావంగానే కాకుండా సమాజానికి దర్పణంగా కూడా వున్నప్పుడే వాస్తవికతకు దగ్గరగా వుంటుంది. పాఠకుడు అప్పుడే తననుతాను అందులో వెతుక్కోడానికి వీలుంటుందనే నమ్మకంతో సాహిత్యం యెడల ఆకర్షితుడవుతాడు. సాహిత్యంలో ఇది ప్రజాప్రక్రియ, ఇది కాదు - అనే మీమాంసతో వాదోపవాదాలు చెలరేగి కాలహరణ చేసిన రోజులు గతించాయి. ఎందుచేతనంటే ఏ వొక్క ప్రక్రియను సమాజమంతా ఏకత్రాటిమీద ఆమోదిస్తున్న పరిస్థితి ఉంటుంది అనకోవడమే పెద్ద అబద్ధం. ఏ ప్రక్రియలో సాహిత్యం నడిచినా అది సామాజిక విధ్వంసక మూలాలను ఎత్తిచూపేదిగా ఉండాలి. నడుస్తున్న వ్యవస్థ తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకొని తప్పుదారులను ఎత్తిచూపుతూ, వ్యవస్థ సుఖశాంతులతో వర్ధిల్లే దార్శనికశక్తిని తనదైన శైలితో, తనదైన ప్రక్రియలో చదివించే శక్తిని కలిగించే సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. మార్క్స్‌యిజం మూల సూత్రమైన ఉత్పత్తి సంబంధాల మీదనే ఆర్థిక నిర్మాణ చట్రం ఏర్పడుతుందని, అదే సమాజ నిర్మాణానికి నిజమైన పునాదిగా ప్రజాసాహిత్యం భావించాల్సి వుంది. అయితే ప్రజాసాహిత్యం ఇటు ఆధ్యాత్మికపరంగాను మరోవైపు భౌతికపరంగాను వెలువడుతుంది. రెండూ ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. మూఢ విశ్వాసాలకు మూలం కాకూడదు. తప్పుడు బోధనలకు తావివ్వకూడదు. నేడు ఆధ్యాత్మిక సాహిత్యం దాని ప్రయోజకతను తప్పుదారి పట్టిస్తూ మతం ముసుగులో శ్రామికవర్గాన్ని అజ్ఞానంలో వుంచేందుకు ప్రయత్నిస్తోంది. మూఢనమ్మకాలను, విశ్వాసాలను ప్రోత్సహిస్తూ సోమరితనానికి పెద్దపీట వేస్తోంది. అభూతకల్పనలకు ఆజ్యం పోస్తోంది. మతంలోని తర్కజ్ఞానాన్ని తస్కరిస్తుంది. ఉపరితల రంగాల భావాలు భౌతికమైనవిగా తుచ్ఛమైనవిగా, హేయమైనవిగా, తృణప్రాయమైనవిగా ప్రబోధిస్తూనే, కేవలం తలతో పనిలేని ఉపరితల విన్యాసమైన భజనలకు అనుకూలంగా భజన చేస్తుంది. ప్రజా ఉద్యమాలమీద ఈ సాహిత్యం అణచివేతకు బాగా చేయూతనిస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పాలక వర్గాలు పనికట్టుకొని ఇతోధికంగా ప్రోత్సహిస్తుంటారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసి ఈ సాహిత్యాన్ని ముద్రిస్తుంటారు. అణచివేతను, ఎవరో ఒకరు వేలెత్తి చూపందే మనకు అర్థం కావడం లేదు. అణచివేత ప్రకృతి సిద్ధంకాదు. కర్మఫలం కాదు. అది మానవ కల్పితంగా తెలియజెప్పే సాహిత్యం మనకు కావాలి అనే చైతన్యాన్ని కలిగించే సాహితీవేత్తలు రావాలి. సామూహిక చేతనను సామూహిక శక్తిగా చైతన్యపరచేదే ప్రజాసాహిత్యం. ప్రపంచం పోకడ తెలియాలంటే సాహితీవేత్తలు ఎంతో లోతుగా ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. అందులోంచి మన సమాజానికి పనికివచ్చే విషయాన్ని పసిగట్టి మనదైన నుడికారంలో చెప్పడానికి ప్రయత్నించాలి. నేడు మానవ స్థితిగతులు, అంతరాలు, అన్యాయాలు, రాజకీయాలు, ఆర్థిక విధానాలన్నింటితో సాహిత్యం ముడివడి వుంటుంది. ఈ భూమీద మనిషి మనిషిగా బతకాలంటే భౌతిక వాదపు పునాదుల లోతులు తెలిసి వుండాలి. సర్వ భ్రమలనుంచి, సర్వ భయాలనుంచి, మనిషి విముక్తి కావాలి. కుల మత వర్గ జాడ్యాలనుంచి విముక్తుణ్ణి చేసి, జీవితానికి సరికొత్త చూపును ప్రసాదించే సాహిత్యం రావాలంటే సాహితీవేత్తలు ఏ ప్రక్రియలోనైనా ఎంతగా శ్రమించాలో, భావపరంపరను ఆకర్షణీయంగా చెప్పాలంటే ఎంతగా భాష యెడల పట్టు సంపాదించాలో గ్రహించాలి. సిద్ధాంతాల మూసలో ఎంత లోతుల్లో కెళ్లినప్పటికీ సమాజంలో నడుస్తున్న వర్తమాన పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోండి, చారిత్రక ధర్మాలతో అన్వయించుకోండి - ప్రజలు దాన్ని స్వీకరిస్తారనుకోవడం పొరపాటే. సైద్ధాంతిక పోరాటాల్లోనూ మార్పులు తీసుకవస్తేనే నేటి సామాజిక సుస్థిరతకు దృఢమైన పునాదులు వేయడానికి వీలుంటుందనేది గ్రహించాలి. వస్తు వాస్తవికత, నవ్య రూపం, కవిత్వంలో ఆకర్షణీయమైన అంశాలుగా నేడు భావించబడుతున్నాయి. అన్నింటికంటే నిబద్ధతే కొలమానంగా అంతర్లోకాలను ముట్టడించే నైపుణ్యం సాహితీవేత్తల్లో కలగాలి. ఒక ఆర్తి, ఒక స్ఫూర్తి, ధైర్యం, మొండితనం, నిర్దయత్వం, స్పష్టత, సూటిదనం, కవిత్వం పదునెక్కడానికి దోహదపడే అంశాలుగా భావించాలి. ఒక సాహితీవేత్త చెప్పిన విషయాన్ని వెంటనే పాఠక లోకం గ్రహించి ఆహా, ఓహో అంటూ తల మీద పెట్టుకొని ప్రచారం చేస్తారనుకోవడం పొరపాటు. పాఠకుడు పఠనానంతరం, తననుతాను దుఃఖ భరిత సందర్భాల్లోనుంచి విముక్తి చేసుకోడానికి నూతన అనుభవాన్ని పొందడానికి ఎంతవరకు చదివిన అంశం ఉపయోగిస్తుందో లోన మనస్సు అంచనా వేస్తుంది. మనస్సులో కదలిక మొదలైతే ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి సాహిత్యం మీద ఆసక్తి పెంచుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియకు కాల నిర్ణయమంటూ వుండదనేది నా భావన. పలాయనవాద సాహిత్యం, వ్యాపార విలువలతో కూడిన సాహిత్యం, కాలక్షేపంతోను, ఆర్థికాపేక్షతోను ముడివడి వుంటుంది. రాజీలతో రాజ్యమేలే వ్యవస్థకు యిటువంటి సాహిత్యాలు దోహదపడుతుంటాయి. కాని ఇవి సామాజిక సమూల మార్పుకు బద్ధశత్రువులుగానే పరిగణింపబడతాయి. ఏ ప్రక్రియలో రాసినా ప్రజా రచయితల ధ్యేయం, దోపిడి, పీడన, అణచివేత, వివక్ష వంటి అప్రజాస్వామిక రుగ్మతల నుండి సమాజాన్ని చైతన్యపరచడమే. సమాజంలో పాలకులు, ప్రజలు వున్నట్లే పాలకవర్గ సాహిత్యం, ప్రజాసాహిత్యం ఉంటుంది. వాటి ఆంతర్యాన్ని ఆలోచనా విధానాల్ని, క్షుణ్ణంగా తెలుసుకోకుండా కొందరు రచయితలు అటూ ఇటూ కాలు పెడుతుంటారు. కవులు/ రచయితలుగానే వారు చలామణి అవుతుంటారు. దానివలన ప్రయోజనం లేదు. పఠనా సాహిత్యానికి పాఠక లోకం తరగడానికి ఎలక్ట్రానిక్ మీడియా ఓ ప్రధానమైన కారణంగా అనుకొంటుంటాము. ఆ భావనను పూర్తిగా ఆమోదించలేము. నేటి సాహితీవేత్తల పాత్ర కూడా వుందనేది అక్షర సత్యం. కొన్ని అంశాలను సాహితీవేత్తలు కూడా తిరిగి ఆలోచించాల్సిన అవసరం వుంది. అగ్ర దేశాలు వేసిన ఆర్థిక సంకెళ్లు సాధుపదాలుగా దర్శనమిస్తున్నాయి. మేధావుల్ని సైతం నమ్మిస్తున్నాయి. బడుగు బలహీన దేశాల మీద బలవంతంగా రుద్దబడుతున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, అగ్ర దేశాల సామ్రాజ్యవాద పన్నాగాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. వాటి ప్రయోజనం బడుగు బలహీనవర్గ దేశాల ఉద్ధరణే అనడంలోనే అవాస్తవం దాగుంది. వీటి లోతుల్లోకి వెళ్లకుండా సమకాలీన సాహిత్యం పరిపుష్టమవుతుంది అనుకోవడం యదార్థం కాదు. నేటి మానవ మనుగడకు సహకరించినట్లుగానే, ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాలను, అస్తిత్వపు హక్కులను కాలరాయడంలోని ఆంతర్యాన్ని ఎత్తిచూపే రచనలు వస్తున్నాయా? అస్తిత్వపు హక్కులకోసం పోరాడే అట్టడుగువర్గాల వార్ని ఆదివాసీలను ఏ విధంగా ప్రభుత్వాలు హింసించి అణచివేస్తున్నాయో గమనిస్తున్నామా? సాహిత్యంలో వారి వెతలు, బాధలు కనిపిస్తున్నాయా? అవి తీరే మార్గానే్వషణకు సాహిత్యం దోహదపడుతున్నదా? అధికార వర్గానికి తొత్తులుగా మారి, ప్రజాకర్షణ సంస్కరణలను వారి విజయాలుగా, విరోచిత సంస్కరణలుగా, చరిత్ర పుటల్లోకి ఎక్కించడం సాహిత్య లక్షణమా? ఈ విధానం భవిషత్ తరాన్ని మిస్‌గైడ్ చేయడం లేదా? మనిషి ఆర్థిక వ్యసనలోలుడై మనుగడకోసం తనకు తెలియకుండానే సంపన్న వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోతున్నాడు. సమస్యలు తీర్చుకునేందుకు పెట్టుబడిదారిని ఆశ్రయించి సరికొత్త సమస్యల్లోకి జారిపోతున్నాడు. వెట్టికి బలైపోతున్నాడు. రాజకీయ నాయకుల్లాగానే సామాన్య ప్రజానీకం కూడా కపట నీతిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాల మీద లోతుల్లోకి వెళ్లి పరిశీలించి రాసి వెలువరించే సాహిత్యకారుల శ్రమను గుర్తించకపోడానికి కారణాలేమిటి? అవి ఎందుకు ప్రజల్ని చేరడం లేదు! ప్రజాసాహిత్యం మీద వున్న అణచివేత రూపం ఎలా వుంది? ఎన్ని కోణాల్లో విస్తృతిస్తుంది? నేడు విద్యావిధానంలోకి కాలిడి గెలుపు సాధిస్తున్నట్లు ఫోజు పెడ్తున్న కార్పొరేటెడ్ వ్యవస్థ ఎటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుందో పరిశీలించాలి. ప్రజాసాహిత్యానికి విద్యార్థులను దూరం చేస్తుంది. పాశ్చాత్య సాహిత్యం మీద మోజు పెంచుతుంది. అందునా భావ పటిమలేని సాహిత్యాన్ని ‘రైమ్స్’ రూపంలో పిల్లలకు బోధిస్తుంది. మనిషి ఎందుకు పరారుూకరణ పొందుతున్నాడు? దీనికి గల మూలమేమిటి? సాహిత్యం నేడు ఆలోచించాలి. ప్రకృతితో, సమాజంతో అన్యోన్యతా సంబంధం గల సాహిత్యం సృజనాత్మకత కలిగి వున్నట్లయితే, సాహిత్యం వైపు మనిషి పరుగెడతాడు. అసలైన జీవితం తెలుసుకోవాలనే విశ్వాసం జనంలో కలుగుతుంది. పఠనా సాహిత్యం కుప్పలుతెప్పలుగా వెలువడుతోంది కాని అందులో సరుకు ఉండడం లేదు కనుకనే పాఠకులు కరువయ్యారు. సాహిత్యం మీద సద్భావన తొలిగిపోయింది. కనుకనే చదవడం మానేశారు. పఠనాసక్తిని పెంపొందించే చైతన్యవంతమైన సాహిత్య కృషికోసం సాహితీవేత్తలు నడుం బిగించాలి. పఠనా సాహిత్యానికి పాఠక లోకం పట్టం గట్టే దశ రావాలి! (SOURCE: ANDHRABHOOMI DINAPATRIKA)...

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q6na22

Posted by Katta

Kapila Ramkumar కవిత

వొరప్రసాద్‌||, ||వయసుడిగిన జీవితం Posted on: Fri 04 Apr 23:33:02.41489 2014 అలసిన శరీరం పటుత్వం కోల్పోయి పగుళ్ళు బారిన బీడుభూమిలా మారుతుంది యవ్వనాన్ని కోల్పోయిన వెన్నెముక ధనుస్సులా వంపు తిరిగి గరిమనాభిని దారి తప్పిస్తుంటుంది వయస్సు కోల్పోయిన శరీరాన్ని నేలపై నిలబెట్టడానికి ఊత కర్రతో ప్రయత్నిస్తుంటారు శరీర నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంటే అయినవారి నిరాదరణ ఆత్మగౌరవాన్ని నిత్యం పరీక్షకు పెడుతుంటుంది గడిచిన యవ్వనపు జీవిత విజయాలు మరుగునపడిన జ్ఞాపకాలై వెక్కిరిస్తుంటాయి పెరిగిన ధరలు అసమానతల పోటీ ప్రపంచం కుటుంబాల్లో మానవత్వాన్ని కబళిస్తుంటే వయసుడిగిన శరీరాలు ఇంటిచూరుకి భారంగా వేలాడుతుంటాయి నిరుత్సాహం కమ్ముకుని వ్యక్తిత్వం కోల్పోయి నిర్జీవులుగా మసులుతూ అప్పుడప్పుడూ దగ్గుతూ ఇంట్లో ఉనికిని చాటుకుంటారు ఆత్మీయుల పలకరింపులకు నోచుకోని వృద్ధాప్యం మనిషిని ఓడించడం ఓ వర్తమాన విషాదం - 9490099059 .http://ift.tt/1ht7CzY?

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ht7FvG

Posted by Katta

Madhu Eruvuri కవిత

మరువలేని ఓ మధుర జ్ఞాపకం * * * * * * * * * * * * * సుదూరాల సాయంత్రం సుగందాలు వీచంగా... తారలన్ని చేరు దోసిట మల్లెల మొగ్గలై వాటినెట్ట కూర్చేది నడిరేయి కాడ ముని గోటితో తెంపి మూరదారమియ్యవే పూలమ్ముకొస్తున్న ఓ పూలమ్మి! ||మధు ఇరువూరి||06-04-14||

by Madhu Eruvuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jPdbOw

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 28 కాలం చాలా వింత పదార్థం. చేతికి చిక్కదు. మార్పుకులోనవుతుంది. మనల్ని మార్పుకి గురిచేస్తుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో, రెప్పపాటులో, కరిగిపోతుంటుంది. దానంత ఊరించే (Teasing) వస్తువు బహుశా సృష్టిలో మరోటి లేదేమో! అందుకే కవులందరికీ కాలం అంటే అంత మోహం. Time Flees అంటాడు షేక్స్పియర్. కాలాన్ని గూర్చి చెప్పిన మరో మంచి కవిత ఇది. ఈ కవిత చదివేక నాకు నండూరి సుబ్బారావు గారి "ముందుగతి" కవితలోని "ఎన్నాళ్ళు మనకోలె ఈ సుఖములంటె, కంటతడిపెట్టింది జంట నా యెంకి" అన్న పదాలు గుర్తొచ్చాయి. కాలం నిలకడలేనిది. మనప్రమేయం లేకుండా మనలో మార్పులు తెచ్చిపెడుతూ, మనకు నచ్చినవాటిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వకుండా దానికి తోచినపుడు మనదగ్గరనుండి లాక్కునే మహా పెంకిది. ఏ ప్రార్థనలకూ, వేడికోళ్లకూ కరగని మొండి ఘటం. అయినా, సరే, ప్రతివారికీ భయంతో కూడిన ఆశ. ఆశతోకూడిన భయం వదలవు. ఆశకీ, వేదనకీ మధ్య గాలిచొరలేని సందున్నా, మధ్యలోంచి జారిపోగలిగింది కాలమే. కవులు తాము చెప్పదలుచుకున్నవాటిని సూటిగా, పాఠం చెప్పినట్టు చెప్పడం కంటే, కవిత్వంలో వచ్చిన సందర్భాన్ని అనుకూలంగా వాడుకోగలిగితే సౌలభ్యంతోపాటు సౌందర్యవంతంగా ఉంటుంది. . అనంతకాల గీతిక… సిడ్నీ లేనియర్, . ఒక రోజు రాత్రి మా దివాణం తోటలో నేనూ, నా ప్రేయసీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాం… ఏ గ్రహచారం వల్లనైనా, మా ఇద్దరికీ ఎడబాటు సంభవిస్తుందేమోనని బాగా దిగులుపడుతూ. . అకారణంగా దుఃఖపడుతున్న నా ప్రేయసి, మా మీద నక్షత్రకాంతి పడకుండా అడ్డుగా ఉన్నతీగమీది ఒక ఆకుని చేయి జాచి, పక్కకి తప్పించింది. . ఆమె దుఃఖాన్ని గమనించిన ఒక తారక ఆకు తొలగించిన మార్గంలోనే సూటిగా ప్రకాశిస్తూ, అద్దంలో ప్రతిబింబంలా,ఆమె కనుకొలకుల చివర వేలాడుతున్న అస్రుకణంలో ప్రతిఫలించింది. . అప్పుడు నేనన్నాను: “ఆశకీ వేదనకీ మధ్య ఎవరో విలపించే కన్నీటి బొట్టు కాలమంటే… మెరుస్తున్న గోళంవంటి ఈ చిన్న భాష్పకణం లోనే చుక్కలలోచుక్క మన కైవల్యం ప్రకాశిస్తోంది.”అని. . సిడ్నీ లేనియర్ (February 3, 1842 – September 7, 1881) అమెరికను కవీ, సంగీతకారుడూ A Song Of Eternity In Time . Once, at night, in the manor wood My Love and I long silent stood, Amazed that any heavens could Decree to part us, bitterly repining. My Love, in aimless love and grief, Reached forth and drew aside a leaf That just above us played the thief And stole our starlight that for us was shining. A star that had remarked her pain Shone straightway down that leafy lane, And wrought his image, mirror-plain, Within a tear that on her lash hung gleaming. “Thus Time,” I cried, “is but a tear Some one hath wept ‘twixt hope and fear, Yet in his little lucent sphere Our star of stars, Eternity, is beaming.” . Sidney Lanier (February 3, 1842 – September 7, 1881) American musician and poet. Further Reading: http://ift.tt/Az348n

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kz3emE

Posted by Katta