పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Vydehi Vydehi కవిత

|VYDEHI| ||HOW TO SAY SORRY...?|| The sign of silence chasing and hunting ... Behind the silence hearing a sharp voice with a sword of words ... Rebound the shadows makes revealing the loneliness ... A small question arising like a flame with frustration ... Explain the feelings is a crime? I have more to say but not know the way ... This time is so rough and tough the level of pain is so high ... Atlast how can I tell a sorry with clear.......full of tears ... date: 08/02/2014

by Vydehi Vydehi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ldy5Gy

Posted by Katta

Sasi Bala కవిత

దైవాన్ని చూడలేము కలకూజితాలను చూడలేము పరిమళాలను చూడలేము తెమ్మేరలనూ చూడలేము ఈ సృష్టిలోని ఎన్నిటినో చూడలేకున్నా ఆరాధించమా దైవాన్ని ఆస్వాదించమా ఆనందాల్ని నిను వలచిన హృదయం అంతే నీ పై నా ప్రేమా అంతే......... శశి బాల.....8 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkMK7z

Posted by Katta

Swatee Sripada కవిత

వద్దనుకుంటూనే ఎందుకో వద్దనుకుంటూనే ఎందుకో ఆశపడుతూనే ఉంటాను సుడిగుండమై లాగేసుకు౦టున్న నిద్ర వలయంలో నీపాట పూదోట పరిమళ శ్వాస నును వెచ్చగా పలకరించాలని ఎక్కడానీ జ్ఞాపకాల మజిలీలో నాకేమాత్రం చోటు లేనట్టు అలా ఎవరెవరి వెనకో దాక్కుంటూ పిల్లమేఘంలా అయిష్టంగా కదలిపోతూ చూసే నీ చూపు ఉదయరాగంలో అరుణిమనై వేగుచుక్కలా వెలుగులు వెదజల్లాలని అయినా ఎంత దాచాలనుకున్నా ఏసందు గు౦డానో సాగి వచ్చే పగటి వెన్నెల్లాటి మెరుపు ఇక్కడ నామనసుచెక్కిళ్ళపై రంగులద్దుతూ ............. 2. ఇంకా మసక చీకటి శిశిరం మంచు వాన ఆగక మునుపే తొ౦దరపడి రెక్కలు మొలిచిన అడవి వన్నెలు పేనుతూ ఒక్కొక్క ఊహనూ హరివిల్లు ముక్కలకు కట్టి గాలి పటాలుగా ఎగరేసుకుంటూ కూని రాగపు కులుకు నవుతాను నన్ను నేను నీ చుట్టూ అల్లుకునే గురివింద పొద నవుతాను ౩. ఎప్పుడో ఊహకందని తలపుల్లో ఎక్కడో పారేసుకున్న నీ ఉనికి ఇలా తీగలు తీగలుగా కురుస్తున్న ఈ విప్పపూల విభ్రా౦తిలో రాతి’కన్న కఠీనమైన పల్చని పరదాల వెనక దాగుడు మూతలాడుతూ క్షణం అదృశ్యంగా క్షణం సదృశ్యమై ఎందుకీ సయ్యాటలు 4. చివరకు వాలిసోలిన కనురెప్పలపై వణికే పెదవుల ఆర్తి ఊపిరి వేణువు పాటకు గొంతు కలుపుతూ అణువణువునూ నిమిరే సుగంధ పరిమళ మై

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecFYFY

Posted by Katta

Jagadish Yamijala కవిత

వాటిని ఎప్పుడు ఇస్తావు ...? ------------------------- నేనిచ్చిన అన్నింటినీ తిరిగి ఇచ్చేసానని అందరితో చెప్తున్నావా మరి నేను ఇచ్చిన ముద్దులను ఎప్పుడు ఇస్తావు ...? -------------------------- యామిజాల జగదీశ్ 8.2.2014 -------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bchUsk

Posted by Katta

Rama Murthy Panuganti కవిత

కవితలకు ఆహ్వానం(చివరి తేదీ. 28/02/2014) DR.POREDDY RANGAIAH TEJA ART CREATIONS, ALERU DIST:NALGONDA tejaarts06@gmail.com CELL NO:99480 49864 "కవిత్వం" అనే అంశం వస్తువుగా సంకలనం తీసుకురావాలని సంకల్పించాం. ఇంతకుముందు మా అమ్మ, నిత్య చైతన్య శీలి సినారె మున్నగు బృహత్ సంకలనాలను వెలువరించాం. కావున కవిత్వమే ప్రధాన వస్తువుగా పద్య , గేయ,వచన ప్రక్రియల్లొ దేనిలోనైనా కవితను పంపించవలసిందిగా కోరుతున్నాం. మీచే గతంలో ఎక్కడ ప్రచురించబడినదైనా లేదా కొత్తగా రాసి ఐనా పంపవచ్చు. మీ కవితలను ఈ మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చు. tejaarts06@gmail.com CELL NO:99480 49864 చిరునామా డా. పోరెడ్డి రంగయ్య ఇం. నం14-215/5 స్ట్రీట్ నం. 3 బస్టాండ్ దగ్గర ఆలేరు; జిల్లా: నల్లగొండ 508101

by Rama Murthy Panuganti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bchRN4

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

|| సభ సాక్షిగా...|| ' అధ్యక్షా' అనే గౌరవవాచకం స్పీకర్ పోడియం వద్ద బేఇజ్జత్ కు గురౌతుంటది గంటలు గంటలు హైజాక్ చేయబడి గడియారం ముళ్ళు గుండెల్లో గుచ్చుకుంటయి ప్రజాస్వామ్య వేదిక పదే పదే ఆర్డర్ తప్పుతూ పరిహాసపదమై రికార్డుల్లోకి ఎక్కుతూ వుంటది రూలింగులు, నోటీసులు, తీర్మానాలు సొంత వ్యవహారమై దూసుకొస్తయి జీరోఅవర్ ఆరవవేలై ఊరిస్తూ శూన్యహస్తంలా మిగిలిపోతుంటది ఎత్తి బయట పడేసే పవిత్రకార్యాన్ని ఒక్క నీతిబద్ద మార్షల్సే చేస్తుంటరు మీడియా పాయింట్ దగ్గర పంజా విప్పుతది, చేతకానితనం గాంధీ విగ్రహం ఒక చెంప కొడితే రెండో చెంప చూపడానికి సిద్ధంగా వుంటది గెలిపించి పంపిన ప్రజల రుణం తీరకుండనే అసెంబ్లీ వాయిదా పడుతది నిరవధికంగా ...నిర్లజ్జగా... 8-2-2014

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LHwGuF

Posted by Katta

Rama Murthy Panuganti కవిత

కవితలకు ఆహ్వానం DR.POREDDY RANGAIAH TEJA ART CREATIONS, ALERU DIST:NALGONDA "కవిత్వం" అనే అంశం వస్తువుగా సంకలనం తీసుకురావాలని సంకల్పించాం. ఇంతకుముందు మా అమ్మ, నిత్య చైతన్య శీలి సినారె మున్నగు బృహత్ సంకలనాలను వెలువరించాం. కావున కవిత్వమే ప్రధాన వస్తువుగా పద్య , గేయ,వచన ప్రక్రియల్లొ దేనిలోనైనా కవితను పంపించవలసిందిగా కోరుతున్నాం. మీచే గతంలో ఎక్కడ ప్రచురించబడినదైనా లేదా కొత్తగా రాసి ఐనా పంపవచ్చు. మీ కవితలను ఈ మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చు. tejaarts06@gmail.com CELL NO:99480 49864 చిరునామా డా. పోరెడ్డి రంగయ్య ఇం. నం14-215/5 స్ట్రీట్ నం. 3 బస్టాండ్ దగ్గర ఆలేరు; జిల్లా: నల్లగొండ 508101

by Rama Murthy Panuganti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJ5sNC

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। మట్టిగాజులు ।। ---------------------- గుప్పెళ్ళు అప్పుడప్పుడే విప్పుకుంటున్నప్పుడు ఆటలు నేర్పించటం మొదలుపెట్టాయి అమ్మ చేతికున్న ఆ మట్టిగాజులు. కాళ్ళతో తన్నుతున్నప్పుడు విరిగిన గాజుముక్క గాయం చేసిందేమోనని అమ్మ ఆత్రం పడుతుంటే చిలిపిగానే గిచ్చాయి. అవి వెలిసిపోయి వున్నట్టు గుర్తు కానీ నా పెదవులకు ఒక్కోసారి పాలిండ్లై కమ్మని రుచిని పంచేవి. మగత నిద్రలోకి జారుతున్నప్పుడు మత్తురాగం పాడుతూ జోలపుచ్చేవి చిరు సవ్వడులతో మేనిని తాకుతూ ... అవి నా చేతికి చిక్కినప్పుడల్లా బొంగరంలా తిరుగుతూ రంగురంగుల వర్ణాలు పూయించేవి నా కళ్ళల్లో .. నాతోపాటే స్నానమాడేవి ,నాతోడే ముస్తాబయ్యేవి , నా నీడే కోరేవి తోడబుట్టిన తొబుట్టువుల్లా ... కానీ వాటికీ వయసు మీదబడిందేమో ఒక్కొక్కటిగా విరిగిపోయి మట్టిలో కలసిపోయాయి ఓ రోజున నా మనసుని మట్టిముద్ద చేసి ! (08-02-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eBfhkg

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

य़े मेरी जहाँ.... ------------------ श्रीनिवासु गद्दापाटि -------------------- अक्सर मेरी कानों में एक दर्दभरी गीत गूँजती रहतीहै जो सदियों से..... मेरे बाप, दादा... परदादों की जीवन के साथ-साथ अब मेरी भी नींद हराम करती है जमाना बदलती है रात होती है... सुबह निकलती है फिर भी वह दर्दभरी कहानी वही जिंदगी वही माहौल ऐसा क्यों होताहै...? मेरी ही जहाँ मै गर्व के साथ कह नही सकता य़े मेरी जहाँ फिर भी य़े कैसी जहाँ..? मुझे अपनों में पराय़ा मेहसूसी.. सारे जहाँ से अच्छा.... हिंदुस्था हमारा.

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cYZ2fb

Posted by Katta

Nirmalarani Thota కవిత

పెళ్ళంటే .. . .? తంతేనా . . ! పెళ్ళంటే పూల పందిళ్ళూ. . సందళ్ళూ మంత్రాలు... మంగళ వాద్యాలు విందులూ. . వినోదాలు అంతేనా . . ? ? ? ఇంకా . . సన్నికల్లు . . మూడు ముళ్ళూ ఐరేని కుండలూ . . ఏడు అడుగులు . . ఈ తంతేనా. . అంతేనా . . ? ? పెళ్ళంటే ఒక మహా యజ్ఞానికి ఆరంభం . . ! ప్రేమనురాగాలే ప్రమిదలు అహంకారాలే సమిధలు . . ! మగవాడికి . . . స్నేహాల్ని కుదించి బయటి సమయాన్ని కుచించి సంపాదన పెంచుకొని బరువు బాధ్యతలకై భుజాలను సమాయత్తం చేయాల్సిన సమయం . . ! తనువులో మనసులో మమతలో బ్రతుకులో అర్ధభాగం అర్ధాంగికి అంకితమివ్వాల్సిన తరుణం . .! ఆడదానికి . . . అమ్మ నాన్నల నీడని పుట్టి పెరిగిన పరిసరాల్ని వదలి ఇంటి పేరునూ ఇంటినీ మార్చుకొని ఇల్లాలయ్యే దక్షిణాయనం . . కాపురపు ముంగిట్లో మరుల ముగ్గుల్ని మగడి గుండె గుడిలో ప్రేమ దీపం పెట్టాల్సిన పర్వం . . అలసిన పతికి ఒడి తానై ఆలంబన అవ్వాల్సిన ఆత్మీయపు రస కావ్యాంకురం ..! ఒంటరి శిశిరపు "నా " అంతర్ధానమై " మా" అవతరించే నవ వసంతాగమనం . . ! ఒక సహనం ఒక సుగుణం సంసారం చేసినపుడే . . ఒక మార్దవం ఒక ధీరత్వం కలిసి కాపురమైనపుడే . . ఒకరు మండు వేసవైతే మరొకరు మల్లెల సౌరభమై . . ఒకరు ప్రచండ భానుడైతే మరొకరు మలయ సమీరమై. . ఒకరు మౌనపు పర్వతమైతే మరొకరు మాటల జలపాతమై . . జంట కన్నుల చూపు ఒకే వింటి శరమై . . పలికే గొంతుకలో ప్రతి స్వరమూ ఇద్దరిదై . . అవగాహన ఒరలో ఇమడలేని ఆత్మాభిమానాల కత్తుల్లా కాక . . ఆత్మీయపు పొదరింట్లో అద్వైతమై ఒకే గుండె గూటిలో ఒదిగిన గువ్వల్లా. . బాధ్యతల్ని భరించే వాడు భర్తగా. . భర్తను సర్వావస్థల్లో భరించేది భార్యగా . . సరాగాల సహజీవన యానం సాగిన నాడే " పెళ్ళి" కి సాకారం . . సు సృష్టికి శ్రీకారం . . ! ! ( ఈ రోజు ప్రపంచ వివాహ దినోత్సవం అటగా . . ? !! ) నిర్మలారాణి తోట [ తేది: 08. 02. 2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbWDPy

Posted by Katta

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIkgvX

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | హంసగీతి ------------------------ లోయ గోడలు బీటలు పడ్డాయి పైనుండి జారే పిలుపుకి ప్రతిధ్వని కొదవైంది ఏ పిట్ట నోటికూడు విత్తులుగా నేలపాలైందో వేళ్ళాడుతున్న వెర్రి చెట్ల జాతరల్లే ఉంది కిక్కిరిసిన వేర్లు గోడ మీద బల్లుల్లా పాకుతున్నాయి వెన్నెల పిల్లలు కొందరక్కడ దాగుడు మూతలాడుతున్నారు చీకటి చేతులకి అందకుండా పరుగులు తీస్తున్నారు గుట్టుచప్పుడు కాకుండా ఆవాసం ఉన్న సరస్సు లోయలో అలలు ఉగ్గబట్టుకుని ఉంది ఇన్నాళ్ళకి హంస గీతి ఒకటి పైకి ఎగిసింది ఉలికిపడ్డ సరస్సులో వెన్నెల ఊయలూగింది చెదిరిపడ్డ ఆకుల పక్క మీద చిందిన చివరి కూత ఏనాటి అనుబంధం కొరకు ఎదురుచూపు సాగుతుందో మరణాన్ని సైతం పారద్రోలుతూ మిన్నంటిన చరమ గీతం హర్షోన్మత్త విషాదమే రాగంగా కట్టిన ఆ బాణీలో సంద్రాలు సైతం కంటనీరు పెడుతున్నాయి (Cygnus olor,Swan Song ని గూర్చి చదివినపుడు ఎపుడు నిగూఢంగా దాగిందో ఈ ఊహ, అక్షరాలలో నిదురలేచిందిలా!) 06/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e6lNJC

Posted by Katta

Prabhakar Rudraraju కవిత

Kavithanjalulu.

by Prabhakar Rudraraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eBtgox

Posted by Katta

Smitha Tati Smitha కవిత

hai how r u all I&B Minister Shri Manish Tewari's byte at ICAI function http://ift.tt/1d4XsZg

by Smitha Tati Smitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4XsZg

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు// Dt. 08-2-2014 మనవడి స్కూల్ బాగ్ లో తాతగారి అనుభవాల పుస్తకానికి చోటులేదు భవిష్యత్తంతా నిండి పోయింది ప్రపంచంలో ప్రేమించి మోసగింప బడిన యువతుల కన్నీటితో సముద్రం ఏర్పడిందట అందుకే నీళ్ళన్నీ ఉప్పన కుప్పతొట్టి పొత్తిళ్లలో అనాధ శిశువు వానతల్లి చినుకు పాలను తాగుతోంది

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzVKVf

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ నిన్న నేను ఆత్మహత్య చేసుకున్నాను ॥ అవును, ఎవరికోసం బ్రతకాలి హరివిల్లువంటి ఉనికి లేని ప్రేమ కోసం, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎంతం కాలం ఎదురుచూడాలి నమ్మకమనే కనిపించని కొక్కానికి జీవితాన్ని ఎన్నిసార్లు వ్రేలాడదీయాలి ఎండమావిలా ఊరించే సంతోషం కోసం ఎంత దూరమని పరుగులు తియ్యాలి అడుగడుగునా ఎదురయ్యే అవమానాల్ని సమాజపు అంగడిలో కొనుక్కుని మరీ ఈ దేహానికి ఎందుకు తగిలించుకోవాలి మనసుని ఎందుకు అయినకాడికి అమ్ముకోవాలి తనది కాని కాంతిని దొంగిలించి వెన్నెల సృష్టికర్తనని ప్రగల్భించే చంద్రుడిలా లేని గొప్పల్ని డప్పు కొట్టి వినిపించే మూర్ఖులతో కలిసి ఎందుకు సహవాసం చెయ్యాలి గింజలు చూసి వచ్చి వలలో చిక్కి వేటగాడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పక్షిలా తియ్యని కబుర్లు చెప్పే మోసగాళ్ళ నయవంచనకి బలై చచ్చిన మనసుతో ఎందుకు జీవచ్ఛవమై బ్రతకాలి గెలుపు నావ నెక్కితే చప్పట్ల జడివాన కురిపించిన ఈ జనం ఓటమితో మునిగిపోతున్నప్పుడు రాళ్లు విసురుతుంటే ఎలా తట్టుకోవాలి ఉరుకులు పరుగులు పెట్టే తెల్లని మేఘాల వంటి ఈ మనుషులు విసిరే జాలి చూపుల చినుకుల కోసం ఎదురుచూస్తూ ఒంటరితనపు దాహార్తితో ఎంతని అలమటించాలి అందుకే చచ్చిపోయాను ఆరిపోయిన దీపం విలువ చీకటి చూపించినట్టు ప్రాణాన్ని నింపుకున్న నా దేహం గొప్పతనాన్ని నా శవమైనా చెబుతుందని ఏమీలేని శూన్యాన్ని కౌగిలించుకునేలా చేసిన ఈ క్రూర జీవితం మరో హత్య చేసేముందైనా మరికాస్త ఆలోచిస్తుందని వెలుగు మీద పిచ్చి భ్రమతో ఆత్మార్పణ చేసుకున్న దీపపు పురుగులా కాస్తంత ఆదరణ కోసం మరణాన్ని నిర్భయంగా హత్తుకున్న నేను.... మీరు ఈ రోజు కార్చే కన్నీటి కాలువల్లో పడి కొట్టుకుపోతున్న ఆ శరీరంలో.... లేనే లేను !!!! (వ్రాసిన తేదీ 09.01.2014) (మాలిక ఈ మాగజైన్ లో వచ్చిన నా కవిత )

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LGTZou

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

- చిరాశ // 13. కాలచక్ర౦ // ********************************* కదిలే కాలానికి ఇ౦త కాఠిన్యమె౦దుకో...?! క్షణమైనా నిలువలేని ఇ౦త చా౦చల్యమె౦దుకో...?! గాఢ నిద్రలో కమ్మని కలలు క౦టూ హాయిగా విహరిస్తు౦టే... రాతిరి దుప్పటి లాగి వెలుగుల కళ్లాపి మొహాన చల్లి హఠాత్తుగా నిద్రలేపుతు౦ది ప్రగతి కా౦క్షతో ఆకలి దప్పులు మరిచి అహరహ౦ శ్రమిస్తు౦టే నిశీధి పమిట ముఖాన కప్పి నను నిద్దుర ఒడిలోకి లాగేస్తు౦ది కదిలే కాలానికి ఇ౦త కాఠిన్యమె౦దుకో...?! క్షణమైనా నిలువలేని ఇ౦త చా౦చల్యమె౦దుకో...?! ************************************ {06/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b5cFdP

Posted by Katta

Bharathi Katragadda కవిత

అన్వేషణ 08.02.14 నేను అన్వేషిస్తున్నాను అసలైన మానవత్వం కోసం! పరితపిస్తూ అన్వేషిస్తున్నాను మాయామర్మపు పొరలులేని సున్నితమైన మనసు కొరకు! ఎంత అన్వేషించినా మోసం,దగా కుట్రలతో కూడిన భయంకర ప్రపంచమే నన్ను వెక్కిరిస్తుంది! బాంబులు,హత్యలూ చిద్రమైన శరీరాలూ వరదలైన రక్తకన్నీరూ నన్ను జలదరింపజేసింది! మనుగడ కోల్పోయిన మతాలు ఈ పుణ్యభూమిని మరుభూమిగా మారుస్తుంటే నివ్వెరపోయాను! ఈ మానవలోకంలో మానవత్వానికే ఉనికీ లేదు,రూపమూ లేదు రక్తదాహం తప్ప అయినా అన్వేషిస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ఏ అల్లానో,జీససో ఏ రాముడో,బుధ్ధుడో కనిపించకపోతారా అని అన్వేషిస్తున్నాను! ఎవరు కనిపించినా మాకు మానవత్వాన్ని ప్రసాదించమని వేడుకుంటారు కదూ!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cdNd0t

Posted by Katta

Challa Ssj Ram Phani కవిత

నిర్నిద్ర వ్యూహం నేలమీద జారిపడ్డ నిర్లిప్త పదాల గోళీల మీద కాలేసి జారిపడతాం! ఓ వెర్రి నవ్వు వెనక హిపోక్రటిక్ శిఖరాలను దాచుకుంటాం! అక్షర శతఘ్నుల దాడికి దాక్కునే దారి శూన్యం! శబ్ద నదుల ఘోషకు లాకులు మూసేసి స్వర ప్రవాహాల్లో జలకాలాటలకు వెంపర్లాడతాం! ఉత్తేజించే ఆరాధనా వ్యూహంలో అతలాకుతలం! నిర్నిద్ర జపాలు చేస్తూ నిబద్ధీకరణకు నీళ్ళొదులుతాం! అబద్ధాలకు ఆయువు పోసి ఆత్మవంచనల ఇనుప కచ్చడాల్లో దాక్కుంటాం! ఆత్మరక్షణకు అజ్ఞానమే అవరోధం! దు:ఖీకరించాల్సిన భావాలకు అక్షరాలు కరవు! చిత్తచాంచల్యాన్ని విత్తీకరించుకునే విఫల యత్నం! నోటి జైల్లో ఖైదీ అయిన శబ్ద విముక్తికి చేపల మార్కెట్టైన బతుకు! విధించుకున్న విధి నిషేధాలని అధిగమించే ఒడుపు తెలియనితనం! ఓడిపోవడానికి ఒప్పుకోలేని ఉడుకుమోత్తనం నిద్రమాత్రలుగా మింగి, నిర్నిద్ర వ్యూహాలకు తెర దించి ఆత్మను నిద్రపుచ్చే యత్నంలో అలసిపోయి ఒళ్ళు వాలుస్తాం!

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbsrnK

Posted by Katta

Challa Ssj Ram Phani కవిత

మరణించిన మాట స్మృతిలో... మాటలు కత్తులుగా మలచి కుత్తుకలు తరగడానికి కడుపులో ఎవడెన్ని శబ్దాలు దాచుకున్నాడో! ఎవడెన్ని శబ్దాలను మాటలుగా సైతం మలచలేక కడుపులోనే దాచుకుని నిలువెత్తు కన్నీటి బొట్టయ్యాడో! * * * కాలచక్రంలో కాళ్ళ కింద చీమల్లా నలిగిపోయి నేల రాలి రోడ్డు ప్రమాదాల్లో ఆవిరైపోయిన కోట్లాది బిలియన్ల మాటల ఆత్మశాంతి కోసమే నేనిది రాస్తున్నాను! మనిషితనం మలిగిపోయి హృదయం మాయమైన మాట మన చుట్టూ దయ్యమై తిరుగుతుంటుంది! ఏ కిరీటాలు, ఆర్భాటాలు లేని మాటల నగ్నత్వం నన్ను మరణంలా ఓదారుస్తుంది! మాటలకు ఆత్మను తొడిగే వ్యర్ధ యత్నంలో మైకు ఖద్దరు టోపీ తొడుక్కుని కూడలిలో కురిపించే వాగ్దానాల మూటలే తార్రోడ్డులోంచి తన్నుకొచ్చిన కంకర్రాళ్ళు! ఇరానీ హోటల్లో మాటలు చాయ్ లో మలాయ్ లా తేలుతూ చెరువులో జలకాలాడే పశువు మీద పరచుకున్న నాచులా నానుతుంటాయి! పాన్ షాపు చెట్టుకి పూసే మాటలు - నోటి డ్రైనేజీలో ఎర్ర బురద అవుతాయి! భజంత్రీవాడి అంగడిలో మాటలు కత్తెర్ల అరుపులలో సెన్సారైపోయి ఏడుకొండలవాడి ఖాతాకు ఎగుమతి అయ్యే తలనీలాలవుతాయి! ఆత్మకు అంటని మాట హృదయాన్నైనా చేరలేక జేబులోంచే జారిపోయి అకాలంలో రోడ్డెక్కి లారీ కింద పడ్డ పిచ్చి కుక్క మెదడులా చితికి నజ్జు నజ్జవుతుంది! ఆత్మ లేని మాట ఆశలు మోసులెత్తకుండా బతుకు గాడిపొయ్యిలో అడుగంటిపోయిన బాల్యం! పసిగుడ్డుకు పాలిచ్చే వేళ రొమ్ము దాచుకోవడానికి జానెడు గుడ్డ చేతికందక కలవరపడే తల్లి! సిగ్గు దాచుకోవడానికి చీరముక్కైనా దక్కని దేశంలో పుట్టిన చెల్లి! ఆత్మీయతల రక్షణ కవచంలా ఆత్మను హత్తుకోలేని మాటలకు శ్రాద్ధంపెట్టి తిలోదకాలొదిలి ఎలిజీ రాసేశాను! ఏడవకండి! మాట మరణిస్తే కన్నీళ్ళు పెట్టకూడని మాటల అక్షయపాత్రలం మనం! మాటలు నిధుల్లా దాచుకున్న నడిచే సముద్రాలం మనం! ఆప్యాయతల దేహంతో అనురాగాల ఉడుపులు తొడుక్కుని ఆత్మతేజంతో బూడిదలోంచి ఫినిక్స్ లా మళ్ళీ పుడుతుంది మాట! సృష్టిలోని నగ్నత్వాన్ని తొడుక్కుని పసిపాప బోసినవ్వులా మళ్ళి పుడుతుంది మాట! అప్పుడు మానవత్వపు హరివిల్లు మనసు నింగిలో స్వయంభువు!

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbsrnz

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

నిశ్శబ్దఘోష సుతిమెత్తటి తడినితాపే రాయి రాయిఒడిలొ చేతులుచాచి నుంచునీ రాయిపొట్టమీద ఆడుకుంటూనూ ఆకుపిల్లలు నోరారానిండుగా గలగలానవ్వేశిల ఆకుపిల్లలచేతుల్లో అల్లిబిల్లిసీతాకోకలు ఆకుపిల్లలకళ్లనిండా ఆనందపు చంద్రకళలు అడవి నిమురుతుందిశి లశిరోజాలనుప్రేమగా రాయికితలదువ్వి జడవెయ్యడం ఒక్కఅడవికేసాధ్యం ఆకుపచ్చనికాంతిలో తలంటుస్నానం చేసినశిలలు లోయలోకి ధవళజలపాతాన్నిఅంజలిస్తూ ఆకునుంచి శిలనుంచి జలపాతంతోసహా అందరిదీ ఒకే నిశ్శబ్దసాగరఘోష ఓమ్‍మ్‍మ్‍మ్‍మ్‍..........శివోహం .............వసీరా గిరులూఝరులూ తరులూవిరులూ నిరతము నీ నామగానమే సంత్‍ తుకారామ్‍ ఈకవితకు ఈవాక్యాలుస్ఫూర్తి ఈలైన్లువిన్నప్పుడు చెట్లూపుట్టలూ దేవుణ్ణిస్మరించడవేమిటనినవ్వుకున్నాను. నాగురుదేవులకృపవల్ల ఒకానొకక్షణంలో తుకారామ్‍హృదయం .నాకుఈవిధంగా అనుభూతంఅయ్యింది అదిమీతోపంచుకోవడం...ఆనందంగాఉంది వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbpAes

Posted by Katta

Krishna Mani కవిత

అంగడి ఆదివారం నాడు దుమ్ము ఆకసమంటే మాఊరి అంగడిల ! నాలుగూర్ల కష్టజీవులు ఒక్కటైన దినాన ఎడ్లబండ్లు దింపి కుప్పలన్ని పేర్శి నడితోవ్వల కూసుందురు పొద్దెక్కనియ్యని కాయదొరలు ! జనం నిండెను సూడు బ్యారం మాడే సోట ! అన్నా అని పడతి ఇంతకిమ్మని మారం రాదు షెల్లే అని గుండె ఒంపిన ప్రేమ పొగరు మాటా రాని చెమట చిందిన దాత ! సుట్టమేమో కలిశే పానమైన పలుకు కష్టసుఖము మాట అలకగైన బరువు ! తిండి తిప్పలు మాని మూటలన్నీ పోంగ మిగిల్నయాటిని చూసి కంట్ల నీరే నిండె ! పొద్దు ఒయే యాల తిరుగు బండ్లను కట్టి పానమలసిన జీవి కడుపున కళ్ళు ఓషి ఇంటి తొవ్వ వట్టె పెండ్లాంపిల్లలు ఎదురుసూడ ! కృష్ణ మణి I 08-02 -2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LGnc2Z

Posted by Katta

Babu Koilada కవిత

బాబు //సిరాబుడ్డి// ఎప్పుడో తాతయ్యగారి చేతిలో చూసిన గుర్తు చిట్టాపద్దులు రాయడం కోసం పాళీని సిరలో ముంచి కలంలో కుస్తీ పట్టే సమయాన ఎన్నెన్నో భావవీచికలు కనిపించకనే కనిపించాయి నాకు ఆ స్పందించని మోముపై చిన్నప్పుడు ఇప్పుడు ఆ గత స్మృతులను గుర్తుకు తెచ్చే చిహ్నాలేవి నికార్సైన సిరా చుక్కలకు కాలం చెల్లింది సిరాబుడ్డిని చూసి చాలా రోజులయ్యింది కలం తన రూపాన్ని మార్చుకున్న వేళ కాలంలో కూడా ఎన్నో నవీన పద్దతులు చొచ్చుకొస్తున్నాయి ఠీవిగా తమ ఉనికిని చాటుకోవడానికి నేడు తన రూపాన్ని మార్చుకున్న కలం చేయకనే చేస్తుంది ఎన్నెన్నో గమ్మత్తులు విద్యార్థులకు సిరాబుడ్డి అవసరం తీరింది ఎన్నో హంగులున్న నేటి కలాలు కొత్త సృజనకు ఆవిష్కరణలు చేస్తూ జాతీయాన బహూళ జాతీయాన సంతకాలు చేస్తూ చేయిస్తూ నవ్వులు చిందిస్తూనే ఉన్నాయి కాగితాలకే విలువ తెచ్చే స్థాయికి నేటి కలాలు ఎదిగి పోతున్నాయి సిరాబుడ్డి వాటి ముందు వెలవెలబోయింది కొత్త సిరలు చేస్తున్న విచిత్రాల ముందు పాత "సిరాబుడ్డి" కథ ఎవరికి అవసరం అయినా "సిరాబుడ్డి" ఒక గొప్ప ప్రతీకే గతానికి కొత్త సిరలతో రేపు కొత్త రాతలు రాసేవారు కూడా కనుమరుగవుతారేమో భవిష్యత్తు ఒక ప్రశ్న సిరాచుక్కలతో పొటీ పడి బాల్ పాయింట్ సంస్కృతిని దాటి "టైప్ రైటర్" ని మించి తన పంథాలో దూసుకుపొతున్న "కంప్యూటర్ కీబోర్డ్" చేసే విన్యాసాలు మాత్రం తక్కువా? 06.02.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXDxb6

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత



by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4pGDs

Posted by Katta

Kks Kiran కవిత

O LethaRekkala VanaBaalaa !!! Nee Gaanam Vintu - Nannu Mruthyuvuki Vadhilesi Neetho kalisi Payaninchanaa……!!! - John Keets

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MztG4i

Posted by Katta

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ **మిత్రమా..! ఏమంటావూ..?** తనువును సాకే వృత్తిలానే బహుశా మనసూ ప్రవృత్తి పోషణలో.. ఒకవేళ ప్రవృత్తీ వృత్తిగా మారితే మనసూ నెమ్మది నెమ్మదిగా కేవలం దేహమైఘనీభవిస్తూ .. అట్లాకాక ఉల్టాగా వృత్తి ప్రవృత్తి ఐపోతే రాను రాను తనువంతా హృదయమై విప్పారుతుందంటావా...? 6/2/14

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZpzuw

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||నీవు ..ఏ నీవువో || ఒకానొక ప్రపంచంలో లోపలా బయటా నిర్మించబడి నీవు.....అనబడతావు................ మరో ప్రపంచంలొ జలపాతం కింద రాయిలా కొత్త రాగంతో రంగరించబడతావు ఇంకో ప్రపంచంలో లోపలిని బయట బయటిని లోపలా తిరగేసి తొడుక్కొని బతికేస్తుంటావు ............ ఒకప్రపంచం లో మాత్రం లోపలికి బయటకు సారూప్యతలు లెక్కించబడి నగిషీలు చెక్కబడి ......... జ్నాపకంగా ముద్రించబడతావు ....... నీవు పారే అలవు ....మారుతున్న కలవు .... నిన్ను నీలోకి వొంపుకోలేవు ...నిన్ను నీనుండి తెంపుకోలేవు ... లోపలికి బయటకు తేడాలు చెరిగిపోయేనాటికి ...నీ చిరునామా చెదరిపోతుంది ... నీవు ....ఏ నీవువో చివరికి ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRecDN

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || అది ప్రేమేనేమో ....? || నిదురించాలనే విఫల ప్రయత్నం .... నిశ్చల సమాధి లో తపస్వి లా, నీ ఎద లో, నిదురెరుగని ఆ నిశ్శబ్ద స్మశానం లో, పరావర్తనం చెందని .... ఆ కాంతి రహిత ప్రస్థానం లో, అల్లుకునున్న ఆ చీకటి పొగమంచు ముసుగులో, నిద్దురలో .... ఎవరో .... గీసి సృష్టించిన రూపాన్ని లా, పూసిన చిత్రవిచిత్ర రంగుల కలయికను లా, ఆ నక్షత్ర కిరణాల వడపోసిన కాంతిని లా, వెండి వెన్నెల మెరుగుని లా కావాలని, సుగంద పుష్ప వృక్ష విశేష లతనులా, బూడిద రంగు సంరక్షణ కవచంను లా .... ఏ జీవన అర్హ అనర్హాలను విశ్లేషించని, కేవలం నీ గురించిన భావనలతోనే అల్లుకునున్న అనురాగ సారం ను లా, నీ నీడనులా, నీవు, నన్నూ .... నా లోని ప్రకాశకతత్వం ను కప్పేసినట్లు, విచక్షణా జ్ఞానం ను కోల్పోయి .... నా ప్రాణం, ఆత్మ, ఆలోచనల పరిబ్రమణం నీ చుట్టే కావడం ను, ఆకర్షణే అని అనుకోలేమేమో? 2014, ఫిబ్రవరి 06, గురువారం సాయంత్రం 06.30 గంటలు

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c6FIZ2

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll అపురూపమే ll మెరిసే గాజుల గల గలలతో చిరు చేపల నయనాలతో సిరి మువ్వల సవ్వడితో బుడి బుడి నడకలు... అపురూపమే కోకిలమ్మల స్వరానుకరణలతో తుమ్మెదల వెంట పరుగులతో బుజ్జాయిల సయ్యాటలతో యెదలో నిదురిస్తున్న జ్ఞాపకాలన్నీ.... అపురూపమే పంట కాలువల్లో చేపపిల్లల ఈదులాటలు లేత రెక్కలను విరుచుకుంటున్నగువ్వపిల్లల ముద్దు మోములు కోడిపిల్లల మధ్య కీచులాటలు లేగదూడల గెంతులాటలు ..అపురూపమే తెల్లారకముందే వినవచ్చే హరిదాసుల పాటలు రంగవల్లుల మధ్యన గొబ్బెమ్మల ముచ్చట్లు ఇంటింటా బసవన్నలు చేసే సందళ్ళు గాదెలు నిండిన కొత్త పంటలు ..అపురూపమే తోబుట్టువుల పండుగలు పరిమళించే మమతల కోవెలలు పసుపుకుంకుమల దీవెనలు ప్రేమతో పొంగే అన్నదమ్ముల హృదయాలు ..అపురూపమే చెమ్మ చెక్కా చేరడేసి మొగ్గా అందాల అక్కా చక్కని చుక్కా పొగడపూలదండలెన్నో నీకై తెచ్చానంటూ చెల్లి మోమున విరిసిన అభిమానపు కుసుమాలు ....అపురూపమే అమ్మ చీరను చుట్టి తడబడిన అడుగులన్నీ తూలిపడిన వేళలన్నీ అన్న నవ్వుల్లో జాలువారిన ముత్యాలన్నీ నాన్న ప్రేమలోని మురిపాలన్నీ ..అపురూపమే మందారాలే అరచేత గోరింటలై పూస్తే సింధూరాలే పారాణిలై పండితే మొగలిరేకులే పూలజడలై పరిమళిస్తే అమ్మ కంట వెలిగిన కోటి దివ్వెల కాంతుల మెరుపులన్నీ ..అపురూపమే గవ్వల పోగేతకై వెదికిన తీరాలు నెమలి పింఛమంటే(కన్నులు)మోజులు బళ్ళో చదువులంటే బేజారులు ఈత పళ్ళకై రువ్విన రాళ్ళు ..అపురూపమే నవవధువుల నోములంటూ కాలువలో కరిగే పసుపు గౌరమ్మలంటూ గోమాతలకు కుంకుమ పూజలంటూ అట్ల తద్దె ఊయలలంటూ..మురిసిన రోజులన్నీ ..అపురూపమే వాననీటి తడిని విదిలించుకునే పక్షి పిల్లలు జల్లుల భారంతో తలవాల్చిన పూబాలలు చూరులవెంట దారలుగా జారే వాన బిందువులు అమ్మ స్పర్శలో వెచ్చగా వదిగిన ముద్దు కూనలు..అపురూపమే జెండా వందనాలంటే తెలియని రోజులు మిఠాయిలకై వేచిన గడియలు జైహింద్ లకై ఎదురుచూపులు బడిగంటలు కొట్టక ముందే ఇంటికి పరుగులు ..అపురూపమే వేసవి సెలవుల్లో పల్లెలకు పయనం ఏటివడ్డుకు చేరిన పరుగుల ప్రస్తానం చెరువుగట్ల చుట్టూ ప్రదక్షిణం పిల్లగాలులతో ఆడిన వైనం ..అపురూపమే సెలవంటూ ..మరి రానంటూ సాగిపోయిన బాల్యం పసితనపు జ్ఞాపకాలనే దాచుకున్న స్మృతిపధం తుళ్ళి తుళ్ళి పడి జారిపోయిన చిరుప్రాయం పదిలమై నిలిచే ప్రతి క్షణం ..అపురూపమే బాల్యంలోనే ఆగిపోవాలంటూ అన్ని గడియలు పసి(డి)తనమే కావాలని నూరేళ్ళు ముక్కోటిదేవతలకు ఎన్నెన్నో మ్రొక్కులు జన్మంతా పసిప్రాయానికై ఎదురుచూపులు మరుజన్మకైనా తీరేనా నా ఆశలు ... ll సిరి వడ్డే ll 06/02/2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c6FIZb

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

కాశి రాజు ||చలిజరం|| గచ్చకాయలు రుద్దీ రుద్దీ గాజులు చేసే గోలని అలాగే ఇన్నప్పుడు ఏమీ తెలీలేదు పనుల్లేని రోజుల్లో మనమంతా ఏమ్చేసాం అరుగుమీద సుద్దతో గీసేసి అష్టాచెమ్మ ఆడేసి నడుములాగి ఒల్లో తలవాల్చామ్ అమ్మ ఒల్లో నువ్వూ, నేను అలాగే పడుకుందామని తీర్మానించుకున్నాక నాన్నా ఏళ్ళు గడుస్తున్నాయ్ రా జరమొచ్చిందని పొద్దెక్కినా లెగకపోతే మంచం చుట్టూ తిరిగావు ఎందుకూ అనడిగితే ఎప్పుడూ సెప్పిందిలేదు ఊళ్లోకెళ్ళి బిల్లలట్రా అన్నప్పుడు గబగబా ఎల్లి, వొచ్చేసరికి అమ్మ ఒల్లో నువ్వు బార్లీ నీలు కాసి, వడకట్టి తెచ్చిచ్చాక కూలబడి కుచ్చున్న నిన్ను సూత్తే జరమొచ్చింది అమ్మకేనా అనిపించింది ఒల్లెవరదైనా బాధ నీదే ఎందుకైందో తెలడానికి సేన్నాల్లు పట్టింది . నాకిప్పుడు జరమొచ్చి చలేస్తుంటే వేడి కోసం మెడచుట్టూ మీ చేతులున్నాయనిపించేట్టు నానా నా వేలికి నీ ఉంగరముంది.

by కాశి గోవిందరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXoka8

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | శుక్రవారం Forough Farrokhzad Farsi కవితానువాదం సందడిలేని శుక్రవారం బావురుమంటున్న శుక్రవారం ఇరుకైన పాతసందుల్లా వ్యాకులపెట్టే శుక్రవారం నలతపడ్డ సోమరి తలపుల శుక్రవారం చీదరపెట్టే వంకరటింకర కొనసాగింపుల శుక్రవారం అపేక్షించని శుక్రవారం అణకువ కలిగిన శుక్రవారం ఖాళీ గృహం ఏకాంతగృహం పడుచుదనపు తాకిడికి తాళం పెట్టిన ఇల్లు సూర్యుని కల్పనలు, చీకట్లు ఒదిగిన ఇల్లు ఒంటరితనం, శకునం, డోలాయమానాల లోగిలి తెరలు, పుస్తకాలు, బీరువాలు, పఠాల లోగిలి అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది, లోతుగా పారే ప్రవాహంలా అటువంటి పాడుబెట్టిన నిశ్శబ్ద శుక్రవారాల ఆత్మగుండా అటువంటి ఉత్సాహరహిత ఖాళీ గృహపు హృదయంగుండా అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది Friday | originally translated from Farsi to English by Ahmad Karimi-Hakkak Quiet Friday deserted Friday Friday saddening like old alleys Friday of lazy ailing thoughts Friday of noisome sinuous stretches Friday of no anticipation Friday of submission. Empty house lonesome house house locked against the onslaught of youth house of darkness and fantasies of the sun house of loneliness, augury and indecision house of curtains, books, cupboards, picture. Ah, how my life flowed silent and serene like a deep-running stream through the heart of such silent, deserted Fridays through the heart of such empty cheerless houses ah, how my life flowed silent and serene. ఈమె నాకు చాలా నచ్చే కవి (కవయిత్రి అనటం నాకు నచ్చదు కనుక). ఎక్కడో గుండెల్లో ఒక నాడి, నాళం ఆమెది నాదీ ఒకటేననిపించేంత సామ్యం ఉంది మాకు. 07/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlEZ6

Posted by Katta

Mohan Rishi కవిత

టాపిక్ ఈజ్ ఓవర్! లేటైనవు తండ్రీ నువ్వు- ఆగిపోవాల్సిన చోట ఆగిపోకుండ ఉర్కాల్సిన కాడ ఉర్కకుండ పైకి పైకే చూడకుండ ఎనక ముందులు సోచాయించకుండ మాటలెంత మోసమైనయో తెల్సుకోకుండ బాటలెంత బట్టెబాజ్ వో సోయి లేకుండ నమ్మకాన్ని మించింది నాశ్నం చేసేది ఇంకోటి లేదని ఎర్క లేకుండ టైముని బట్టి మనిషి మారాలన్న కమస్కం గ్యానం లేకుండ అవుట్ డేటెడ్ సుభాషితాలు చెప్పుకుంట ఎక్స్ పైర్ అయిన గోళీల్ని ఏసుకుంట సిలబస్ చుట్టే శెక్కర్లు కొట్టుకుంట "ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడ్తుంది" అనే ప్లాస్టిక్ మాటలు నమ్ముకుంట... లేటైనవు తండ్రీ నువ్వు..! ***** అమ్మ అయ్య చెప్పంగ, సోపతిగాడు తిట్టంగ ఇష్టం లేకపొయినా కాష్టం తప్పదనుకుంట శినిగిన బట్టలు, తెగిన చెప్పులు, పెరిగిన గడ్డం, మన్ను మన్ను జుట్టు, దెబ్బల కాట్ల కాళ్ళు చేతులు, ఏడుస్తున్న గుండె, వొగిరిస్తున్న కళ్ళు... ఒక్కటిగూడ పట్టిచ్చుకోకుండ లెక్క తేల్చుకుందామని, జనంల కలుద్దామని వచ్చినవుగానీ - లేటైనవు తండ్రీ నువ్వు! 10.12.2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlH7t

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

Little Drops of Love Dr. Varanasi Ramabrahmam 8-2-2014 Little drops of love make Mighty ocean of togetherness Love is like rain It pours Love is like full-moon light It delights Love is like sunshine It lights up and warms hearts And life-giving, Life-sustaining; Makes life lively, cheerful and youthful! When it is raining The drops you collect Is how you miss me; The drops that miss you Is how I miss you We need each other as we need air We need each other as we need water We need each other as we need food We need each other as we need sensual pleasure So dear Let's breathe each other Let us drink each other Let us have each other Let us savor each other Let us be cheerful Blissful, peaceful, Silent in Love, Together... Now, Ever, Always

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4bU3H

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

**ఊరు** కాస్త పచ్చదనం కనిపించినా పారే నది కనిపించినా గుబురు పొదలపై గుత్తులుగా పూసిన పూలు కనిపించినా కాస్త వెన్నెల ఎప్పుడైనా తడిమినా కొంచెం చల్లని గాలి ఎప్పుడైనా గుసగుసలాడినా మెత్తటి తడి మట్టి ఎప్పుడైనా పాదాలను ముద్దు పెట్టుకున్నా గుడి గంటలు లీలగా వినిపించినా ఆకాశం నిండా చుక్కలు చూసి చాలాకాలమైందనిపించినా గుంపులు గుంపులుగా ఎగురుతున్న పిట్టలు కనిపించినా ఎవరి మాటల్లోనైనా కాస్తంత మొరటుతనం మంచితనం కనిపించినా నీకు తెలీకుండా నీ కంట్లో ఉబికిన తడి నీ చెంపలను తడిపితే నీలో నీ ఊరు ఇంకా సజీవంగానే ఉన్నట్టు http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు! శ్రీనివాసా..ఓ తిరుమలేశా! 8.2.14 ఏడేడు కొండలెక్కి ఎదురుగా కూచున్నావు! అందాలకొమ్మకు మా అలమేలుమంగకు.. కందిరీగనుబోలు,కరిమబ్బులను బోలు కాఠిన్యమేలేని నీ హృదయవని యందు హిరణ్మయిగా మారి తిరముగానూ నిలిచె హిరణ్యగర్భ...ఆ..హిరణ్యాక్షి తాను! "హరి"వి మాత్రమే నీవు "శ్రీహరి"వైనావు సిరులు కురిపించు మా సిరి "శ్రీ" కరముబట్టీ.. అపురూపదాంపత్య మరయుచుంటిరి మీరు నిత్యకల్యాణం పచ్చతోరణంబుగా.. తన సిరుల సిగ్గులంప నా తల్లి నీకడకు నడిరేయి నడిఝాము వడివడి దిగి వత్తువంట కపిలముని తీర్థమ్మున వూర్థ్వభాగంబున అందాల "వనదేవి" మీకు శయ్యగా నమర రమించి,కామించి కామితంబులు తీర్ప వెలసినావు ఇల శ్రీ, శ్రీనివాసుగా.. దయతోడ మమ్మేలు మా తిరుమలేశుగా!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bES3XI

Posted by Katta

R K Chowdary Jasti కవిత

Angel With many curves of her muzzle She greets me and kisses my eyes And tickles my heart and soothes my soul And with her color of love That’s so radiant and pleasant She paints her crimson touch on my life With which I look so unique to myself And what else I need as she enlivens me In her horizon where there’s only the life And not any strife whatsoever Of the life on this earth! © R K Chowdary 07.02.14@9.17AM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l9qLvz

Posted by Katta

Srinivas Vasudev కవిత

ఫ్రెండ్స్, రెండువారాల క్రితం షేప్ పొయిట్రీ గురించి సోదాహరణంగా కొంత వివరణ ఇక్కడ చదివారు. ఈ వారం అదే షేప్ పొయిట్రీ గురించి మరికొన్ని వివరాలు ఇంకొన్ని ఉదాహరణలు చూడండి. Two weeks ago we saw what shape poetry was and I’d like to continue with more info and a few poems on the same topic this week too. Interestingly, Concrete poetry—sometimes also called ‘shape poetry’—is poetry whose visual appearance matches the topic of the poem. The words form shapes which illustrate the poem’s subject as a picture, as well as through their literal meaning. The name “Concrete Poetry,” however, is from the 1950’s, when a group of Brazilian poets called the Noigandres held an international exhibition of their work, and then developed a “manifesto” to define the style. The manifesto states that concrete poetry ‘communicates its own structure: structure = content’

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iEiK00

Posted by Katta

Ajay Kumar Kodam కవిత

ఎవడున్నాడీ లోకంలో../ అజేయ్‌ కుమార్‌. తెలీకడుగుతున్నా.. ఎవడున్నాడీ లోకంలో.. ప్రాంతీయ పక్షపాతి కానివాడు. నువ్వెవరంటే.. విశ్వమానవుడినని చెప్పగలిగే ధీరుడు. కులమో, మతమో.. ఇజమో.. గిజమో... ఒక చట్రంలో చిక్కని వాడెవ్వడు.. ముస్లింలకు అల్లా.. క్రైస్తవులకు జీసస్‌.. హిందువులకు.. రాముడో, కృష్ణుడో ముక్కోటిదేవతలో.. పరమాత్ములనే “మత”పరిమితం చేసేశాంగా.. పరిధులు గీసి.. పంచుకున్నాంగా.. ఇప్పటికైనా.. మతం మాకొద్దని అనగలమా..? ‘మన’వాళ్లన్న మాట మానముగా?.. ఇంకెందుకు.. ఈ సెక్యూలర్‌ తొడుగులు మేధావుల ముసుగులు విశాల హృదయపు ఫోజులు..

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NhCDQV

Posted by Katta

Kavi Yakoob కవిత

జయహో ! ****** కవిసంగమం - ఫేస్-బుక్ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. కవిత్వసృజన,కవిత్వపఠనం,కవిత్వ సంబంధిత అంశాలు -ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా 'కవిసంగమం'సీరీస్ సభలు 'పోయెట్రీ వర్క్ షాపు'ల్లా జరుగుతున్నాయి..వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్ వాల్ మీద పోస్టు చేయడం,నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గంలో సాగుతోంది . ***** కవిసంగమం గురించి రాసిన ఈ రెండు కవితలు చూడండి : Raghava Reddy రాసిన "నువ్వొక పచ్చని చెట్టువైతేను..'' అనే కవిత . రెండేళ్ళక్రితం ఇక్కడొక మొక్క మొలిచింది పచ్చని చెట్టై ఎదిగింది.. పిట్టలన్నీ వాటంతటవే వచ్చివాలాయి పాటలెన్నో పాడాయి పాడుతూనే వున్నాయి పాటలెన్నో విన్నాయి వింటూనే వున్నాయి పాటపాటకూ పదునెక్కుతోన్న గళాలు పదిమందికీ పంచుతోన్నకవన పరీమళాలు భావార్ద్ర మేఘాలై సంచలిస్తున్నాయంతటా.. ఉత్తమాభిరుచి గల ఏ శీతల పవనమో భుజం తట్టినపుడు ఎదురైన ఏ అనుభవమో అనుభూతి సాంద్రమై మెరిసినప్పుడు వ్యవస్థ చేసిన గాయమేదో ఓపలేనంతగా సలిపినప్పుడు.. ఆనందమో విషాదమో ఆవేశమో ఆగ్రహమో ఆలాపనో ప్రేలాపనో వెన్నాడినపుడు వేటాడినపుడు కదిలించినపుడు కరిగించినపుడు.. భావమేఘం బరువెక్కుతుంటేను కొత్తకవితై ఇల జారుతుంటేను.. సృజనదేవి పెదవులపై చిరుహాసమొచ్చేను.. నువ్వొక పచ్చని చెట్టువైతేను పిట్టలు వాటంతటవే వచ్చివాలేను- -(కవి సంగమం లో రాస్తున్నవాళ్ళకు,కవిసంగమాన్ని చూస్తున్నవాళ్లకు,కవిసంగమాన్నిలా చేస్తున్న వాళ్ళకు..) ***** వొరప్రసాద్‌ రాసిన మరో కవిత "కవి ఒక సమూహం అనే ఒక కవి సంగమం" ఫేస్‌బుక్‌ కవిసంగమంలో కవితాక్షరాల కవాతు తెలుగు అక్షరాలు అలవోకగా ఇంటర్నెట్‌లో ఒదిగిపోతూ వేలకోట్ల నక్షత్రాలను పుట్టించబోతున్నాయి అక్షరాలంటే ఐక్యతా ప్రతీకలు ఒంటరిగా ఏ అర్థాన్నీ ఇవ్వవు అక్షరాల కలయిక ఒక అనివార్యం అక్షరాలకు అర్థం కల్పించేవాడు కవి అక్షరాలతో ఆలోచనలను పండించేవాడు కవి అక్షరాలను ప్రేమతో ఆర్తితో అలంకరించి నెత్తిన పెట్టుకుని లోకమంతా తిరిగేవాడు కవి తను పరవశించి పలవరించి అందరిలో ఐక్యమయ్యేవాడు కవి ఈనాటి కవి సాంకేతికుడయ్యాడు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కవితా పతాకాన్ని ఎగరేస్తున్నాడు కవి సంగమం కొత్త ను హత్తుకుంటున్న తెలుగు కవితా సంతకం ఆధునిక కవితా యాత్ర నాగరికతా శిఖరాన మెరుస్తున్న తెలుగు అక్షర వెలుగు సంకేతం కవి ఒక సమూహం కవి సంగమం ఒక ప్రతిబింబం కవిత్వాన్ని పండించే ఆధునిక సంగమం కంప్యూటరూ... కవితా సేద్యం ఈనాటి సందర్భం అంతరంగాల సముద్రాలకు అనంతభావాల కలబోతకు ఆధునిక వేదిక ఫేస్‌బుక్‌ కవిసంగమాన్ని ఆనందంగా అందరం ఆలింగనం చేసుకుందాం! **** ఈ కవితల్లో 'కవిసంగమం ' ఉద్దేశించిన అనేక అంశాలు అవగతమవుతాయి. వారంలో ప్రతిరోజూ కవిత్వం గురించిన విభిన్న అంశాల గురించి 'శీర్షికలు' రాయించడం ; అలాగే గ్రూప్ లో రాస్తున్నవారికి ఇలా సూచనలు ఇస్తూ ,వారిని మరింతగా కవిత్వసృజన గురించి అవగాహన చేసుకోవడానికి పురికొల్పడం జరుగుతోంది.~ "మిత్రులారా !'కవిసంగమం'లో రాస్తున్న కవిత్వం చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది. # కవిత రాయగానే వెంటనే పోస్ట్ చెయ్యకండి.కొంచెం మరొక్కసారి చూసుకుని ,ఏమైనా మార్చాలనిపిస్తే లేదా ఎక్కడైనా భావం చెప్పేటప్పుడు అది పాఠకుడికి చేరే దశలో అర్థం సరిగా చేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించి తిరగారాయండి. # కవిత్వంలో గాఢత అవసరం. మనలోకి ప్రసరించిన అనేక విషయాలను వడపోసి ,చిక్కబరిచి చెప్పే ఒకానొక ప్రక్రియ. వ్యర్థపదాలు,పునరుక్తులు లేకుండా ఒక భావాన్ని అనుభూతిప్రధానంగా చెప్పే ప్రక్రియ.కాబట్టి కవిత్వనిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనబరచండి. # కవిత్వం విరివిగా చదవండి. కవిత్వ సంకలనాలు సంపాదించి చదవండి.కవిత్వానికి సంబందించిన పుస్తకాలు చదవండి.అధ్యయనం చాలా అవసరం. # ఎవరైనా మీరు రాసే కవిత్వం పైన తగు సూచనలు చేస్తే,వాటిని వినమ్రంగా స్వీకరించండి. అది మీ ఉన్నతికి,కవిత్వ ఎదుగుదలకు ఉపకరిస్తుంది. [మేం ఏం రాసినా అదే గొప్ప, దీనిపై ఎవరూ ఏం చెప్పక్ఖర్లేదనే భావనను పెంపొందించుకోకండి .కవి ఎంత ముఖ్యుడో ,పాఠకుడూ అంతటి ముఖ్యుడే.పాఠకుడు లేకపోతే కవిత్వం చేరేదేక్కడికి? కవి ~కవిత్వం~ పాఠకుడు =ఇది గుర్తుంచుకోవాలి ] # కవికి తనదైన ఒక సొంత గొంతు,మార్గం ఉంటుంది.దానిని వీడకుండా మీదైన ఒకానొక ప్రత్యేక పద్ధతిలోనే మీరు రాయండి.మీరు మరొకరిలాగా రాయకండి. ఒకే వస్తువును ఏ ఇద్దరూ ఒకలా రాయరు. ప్రతి ఒకరికీ తమదైన శైలి ఉంటుంది. # ఫేస్ బుక్ లో 'కవిసంగమం' చేస్తున్న పని - ప్రతి ఒక్కరిలో ఉన్న కవిత్వం రాయాలన్న కాంక్షను గౌరవించి, వారి రాతలకు వేదికలా నిలబడటం. అలా రాస్తూ రాస్తూ కవిత్వసృజనలో పరిణతిని సాధిస్తూ ఉండటాన్ని ,నిండుమనసుతో స్వాగతించడం ,సంతోషించడం. 'కవిసంగమం' చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం కవిత్వం మీదున్న ఇష్టమూ, అభిమానం వల్లనే. ! అందువల్ల 'కవిసంగమం' నుండి ఏవైనా సూచనలు,అభిప్రాయాలు చెబుతున్నప్పుడు ,వాటిని గౌరవిస్తూ పాటించడానికి ప్రయత్నిచండి. ఇదంతా మనందరి కవిత్వం కోసం, కవిత్వం రాసే మీ కోసం ! జయహో ! 'కవిత్వం కావాలి కవిత్వం !! " కవిసంగమం ప్రయాణం -కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్ ................................................................. Feb'9,2012- కవిసంగమం మొదలయ్యింది.ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్ బుక్ కవితావేదికగా నిలబడింది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందఱో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు,-వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్ చేసుకున్నారు. చేసుకుంటున్నారు.ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది. ఆగష్టు2012 పదిహేనున ఇఫ్లూ లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' ఒక గొప్ప ప్రయోగం.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్ ,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా,ఒక ప్రయోగంగా 144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం వెలువడింది . ఇందులో తొట్టతోలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ఈ ప్రోత్సాహంతో ముందు ముందు ఇంకా మెరుగైన కవిత్వం రాస్తారని ఆకాంక్ష. *** బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆమధ్య వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కు కొనసాగింపుగా 2013లో మొదలుపెట్టిన మూడుతరాల కవుల 'లామకాన్ లో కవిసంగమం' కార్యక్రమం.! ఆరు కార్యక్రమాలు అక్కడ ముగించుకున్నాక 'గోల్డెన్ త్రెషోల్డ్'లో మిగతా సీరీస్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం ~ * కొత్తగా రాస్తునవాళ్ళు ప్రత్యక్షంగా సీనియర్ కవులను కలవడం, * వారి కవిత్వానుభావాల్ని వినడం, కవిత్వ రహాస్యాలను తద్వారా అవగతం చేసుకోవడం ; * అలాగే తామూ చదవడం,రాయడం ,*కవిత్వం వినడం ,*కవిత్వం చదవడం *కవిత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవడం * తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడం , * పాల్గొంటూ,వింటూ నేర్చుకోవడం - ఇప్పటికే 2013 లో 'కవిసంగమం' కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి.*నెల నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇతర కవులతో కలవడం,కవిత్వ వాతావరణంలో గడపడం - వంటి ఈ కవిసంగమం 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు. 1. ఒక ప్రముఖ కవి. 2.ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, 'కవిసంగమం'లోనూ రాస్తున్న కవి. 3.ముగ్గురు ప్రవర్థమాన కవులు. ఈ సంరంభంలో పాల్గొన్న కవులు ~ వేదిక :లామకాన్ జనవరి 27- నగ్నముని | వసీరా | కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ . ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్,జయశ్రీనాయుడు,క్రాంతి శ్రీనివాసరావు మార్చి 9 - విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు,శాంతిశ్రీ ,చాంద్ ఉస్మాన్ ఏప్రిల్ 13 -వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డానీ,మెరాజ్ ఫాతిమా,నరేష్ కుమార్ మే 11 - దేవిప్రియ |కోడూరి విజయకుమార్ | సివి సురేష్,వనజ తాతినేని,బాలు వాకదాని జూన్ 8 - అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు,రాళ్ళబండి శశిశ్రీ ,తుమ్మా ప్రసాద్ వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్ ' జూలై 13 - శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై,సొన్నాయిల కృష్ణవేణి,కృపాకర్ పొనుగోటి ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశిరాజు,పూర్ణిమా సిరి,శ్రీకాంత్ కాన్టేకర్ సెప్టెంబర్ 14 -దీవి సుబ్బారావు |కుమారవర్మ|భాస్కర్ కొండ్రెడ్డి,భార్గవి జాలిగామ ,పోతగాని అక్టోబర్ 5 -[మొదటి శనివారం]-పాపినేనిశివశంకర్ | శ్రీ నివాస్ వాసుదేవ్ |వర్చస్వి, రమాసుందరి,నాయుడుగారి జయన్న నవంబర్ 9 -నందిని సిధారెడ్డి |జాన్ హైడ్ కనుమూరి |మోహన్ రావిపాటి ,కవితా చక్ర ,బాలసుదాకర మౌళి కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి అనేక కొత్త గళాలతో 'కవిసంగమం'-'నువ్వొక పచ్చని చెట్టైతే ,పక్షులు వాటంతటవే వచ్చి వాలేను'అన్న మాటను నిజం చేసి చూపింది. గత సంవత్సరం 'ఇఫ్లూ' లో జరుపుకున్న 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్'లా 2013లో కూడా డిసెంబర్ 15 న జరుపుకుంది. ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొ.శితాంషు యశస్చంద్ర గారు పాల్గొన్నారు.ప్రారంభసభలో సంపాదకులు కే.శ్రీనివాస్,ఎం.వి.ఆర్.శాస్త్రి,10tv సి.ఇ.వో అరుణ్ సాగర్,అనురాగ్ విద్యాసంస్థల రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొనగా ,ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ** కవిత్వానికి ఒక వేదికగా 'కవిసంగమం' ఉండేలా, ఫేస్బుక్ లో రాస్తున్న ఔత్సాహిక కవులకు ఇదొక 'పోయెట్రీ వర్క్ షాప్'లా ఉపయోగపడేలా ఇన్నాళ్ళుగా ఇది పనిచేస్తూ వచ్చింది.. ఇలా నిర్మించడంలో ఎంతో ఓపిక, సమయమూ వెచ్చించి కష్టతరమైన పనిగానే ఇన్నాళ్ళలో అన్పించినా, కవిత్వానికి ఇదొక వేదికగా నిలబడాలి,ఎందరికో ఇదొక వేదికగా ఉండాలి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eX524x

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। బానిసను కాను ।। ----------------------- ఏందిరా నీ జులుం ?ఏందిరా నీ అహం ? గాడూ గీడూ అనటానికి కాదురా నేను నీ నౌకర్ని అరేయ్ గిరేయ్ అని పిలవటానికి కాదురా నేను నీ బానిసను. బీరువాల్లో లెక్కలేనన్ని మురిగే పచ్చనోట్లు నీవి సాటి మనిషికి రూపాయి దానం చేసే దానగుణం నాది. గోదాముల్లో ,గొని సంచుల్లో పురుగులు పట్టి ముక్కుతున్న ధాన్యరాశులు నీవి పక్కవాడికి పట్టెడన్నం పెట్టే దయాగుణం నాది. నెర్లు తీసి ,నోళ్ళు తెరిచి బీడులైన వందలాది ఎకరాల భూములు నీవి వెన్ను విల్లుగ మార్చి వొళ్ళు వొంచిన కాయకష్టం మెతుకులు నావి. చెదలు పట్టి చిరిగిపోయే పచ్చనోట్లు నీవి చెమట వాసన వస్తున్నా నా శ్రమ ఇచ్చిన పది నోటు నాకు పదివేలు. నువ్వు రాజువైతే కావొచ్చు నేను బానిసను కాను ! (06-02-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eX510D

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మౌన రాగం ----------------- రావెల పురుషోత్తమ రావు *** కల కలగానే మిగిలిపోతే నిద్రించే కనులకు విలువుంటుందా! కల యన్నది కల్లగా మారిపోతే బ్రతుకు బండి సజావుగా సాగ గలదా! నిద్రరాని కనులకు స్వప్న సాక్షాత్కారం జరుగదు మౌనం నింపిన మనసుకు శబ్దాల సౌందర్యం వినపబడదు గాయాలతో అలమటించే గుండెకు అనురాగాల ప్రస్థానం అవగతమవదు బాధలతో ముసురుకున్న జీవితానికి సాఫల్య పురస్కారం విలువ తెలియదు. మౌనాన్నశ్రయించిన మహర్షులకు దైవ చింతన తప్ప మరో ధ్యాస చిగురింవదు ======================================= 06-02-2004

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxyT5m

Posted by Katta

Mohan Ravipati కవిత

మోహన్ ॥ బోధి వృక్షం ॥ ఐదేళ్లకోసారి భోది వృక్షం మొలుస్తుంది నిర్వాచనసదన ప్రాంగణంలో. చిత్రంగా బుద్దావతారాలన్నీ బద్దకం వదిలించుకొని కదనరంగానికి పరుగులెడతాయి హస్తిన విడిచి. వస్తుకానుకలు ఉచిత ప్రసాద వితరణల బాట పడతాయి. మూజువాణిలు, మేజువాణీలు జతకడతాయి. మోజు మాత్రం ఆసనం మీదే. శాసనాలనిండా, కాసుల వర్షాలు కురుస్తాయి చితికిన బతుకలన్నిటికీ అతుకులేస్తామని కోతలు కూస్తుంటాయి ద్రవం, ద్రవ్యం దరిద్రమంతై వీధివీధికి సంచరిస్తుంటాయి బొట్లు, జాకెట్లు, లాకెట్లు, కనికట్టు చేస్తుంటాయి ఓట్లడుగుతుంటాయి, అట్లా అట్లా అధికారం కోసం అఱులు చాస్తుంటాయి తపస్సు అయిపోతుంది బుద్దావతారాలు సమాధిలోకెళ్ళిపోతాయి బోదివృక్షం కూలిపోతుంది ఏలిన వారి దయ కోసం చూస్తూ కూలిన చెట్టుతో పాటు కూలీలా నువ్వు ఖాళీగా మిగిలిపోతావు 06/02/14

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivdCLI

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఎప్పటికీ ---------------------------- గగనపు వీధిన నీ పేరు లిఖించనా నాపై వెల్లువై కురిసేలా కడలి కెరటపు అంచులపై నిన్నుహించనా ఉవ్వెత్తున నా ఒడిలో ఎగసిపడేలా నీలి ముంగురులు నిశిరాతిరి సోయగాన నీవైతే పిల్ల తెమ్మెరలు నీ పలుకులలో చేరినట్టు నీ కనుచూపులతో శాసించే ఈ హ్రుదయ మందిరాన నీ ప్రేమలో బంధీనై బ్రతుకీడుస్తున్నా నీవు పవళించే వేళ చిక్కటి రాత్రిని నీపై కురిపిస్తుంటాను నా బాహువులలోనె మూలాలేవొ నీ మెడ ఒంపులలో మెలికలు తిరిగినట్టుగా అల్లుకున్న లతలు నా చేతివేళ్ళు ఎన్ని రాత్రులైనా మరణిస్తాను నీతో కలిసి గడిపే ఒక్క క్షణం కోసం కలలోనైనా... తిలక్ బొమ్మరాజు 06.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b4vm1l

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJE6dP

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

అక్షరాలైన అభాగ్యుల వెతలు - కె.వరలక్ష్మి కథలు ఒక గొప్ప పుస్తకం చదవడం ముగించి రసావేశానికి లోనై నిదురకు దూరమైన రాత్రులు, మరుసటి రోజు మామూలు మనిషి కాలేక పోయిన సందర్భాలు సాహితీ రసజ్ఞులైన పాఠకులకు కొత్తేమీ కాదనుకుంటాను. ఆ కోవకు చెందినవే కె.వరలక్ష్మి గారి కథా సంకలనాలు. పఠనీయత పుష్కలంగా ఉన్న ఒక్కో కథా సంకలనం చదవడానికి రెండింతల సమయం పట్టిందనడం విరోధాభాసం (paradox). కాని, కె.వరలక్ష్మి గారి కథా సంకలనాల చదువరికి ఈ అనుభవం తప్పదు. చదువుతున్నంత సేపు పరుగులెత్తించిన కథాంతం మరో కథను ప్రారంభించనివ్వదు. ఆలోచనల అలజడి ముందుకు కదలనివ్వదు. ఈ లక్షణం ఒక మంచి రచనకు గీటురాయని నేను భావిస్తాను. కె. వరలక్ష్మి గారి కథాసంకలనాలు మూడు-- జీవరాగం(1996), మట్టి-బంగారం (2002), అతడు-నేను (2007). ఈ మూడు సంకలనాలలోని కథల సంఖ్య 47. ఈ కథలన్నీ అరుదైన ఆణిముత్యాలు. వీటిలో చాలావరకు స్త్రీ ఇతివృత్త కేంద్రంగా స్త్రీ చుట్టూ తిరిగిన అట్టడుగు అబలల దయనీయ జీవన దృశ్యాలు. ఈనాటికీ సమాజం లోని సగటు స్త్రీ అనుభవించక తప్పని అనేక వాస్తవ సమస్యల సమాహారాలు. స్త్రీసున్నితమైన జీవరాగాల సందడి! ఈ కథలలో అణగారిన నానాజాతి స్త్రీల దైన్యజీవితాలు చదువరులను కలవర పరుస్తాయి. కుటుంబ హింసను, సామాజిక హింసను భరిస్తున్నామన్న స్పృహే లేని వెనుకబడిన స్త్రీలు నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతూ కలతను రేపుతుంటారు. ఎరుకల, చాకలి, గొల్ల, మేదర, తప్పెటగుళ్ళ, పొడ పోతల, భోగం, కోయ, గిరిజన నిరుపేద స్త్రీలు దీనంగా కళ్ళముందు నిలిచి నిలదీస్తారు. ఇన్ని రకాల జీవితాల చీకటి లోతులను ఇంత దగ్గరగా తరచి చూడడం, దయనీయమైన వాస్తవ జీవితాలను ఇలా మమేక మానవీయ దృక్కోణంలో దర్శించడం పరిశీలను మించిన పరిశోధన! వరలక్ష్మి గారు ఒక 'కథా బీజాన్ని' ఎన్నుకొని, స్థూలంగా ఒక 'కథా చట్రాన్ని' మనసులో నిలుపుకొని, కేవలం ఒక 'రూప స్పృహ'తోనే కథను ప్రారంభిస్తారేమోననీ, 'క్లుప్తత', 'అంతస్సూత్రత','శైలీ శిల్ప విన్యాసం', 'ఉత్కంఠత, 'కథా సంవిధానం', కొసమెరుపులను ఆవిష్కరించే 'అద్భుతాంశ' వంటి ప్రక్రియాపరమైన కథానికా లక్షణాలు వాటంతటవే 'కథా కథన' గమనంలో ఒదిగిపొతాయనీ నాకెందుకో అనిపిస్తుంటుంది. ఆమె కథలు రాస్తున్నట్టుగా కాకుండా, స్వతసిద్ధ మైన సహజ ప్రతిభతో అలవోకగా వినిపిస్తున్నట్టుగా ఉండటం అందుకు కారణం కావచ్చు.'ఎత్తుగడ' తోనే ఆమె కథా సరిత్సాగరం లోకి లాగబడిన పాత్రోపస్థిత శ్రోత అయిపోతాడు పాఠకుడు ! ఇక కథల్లోకి వస్తే --'జీవరాగం' ఉత్తమ పురుషలో రాసిన ఒక చిన్న కథ. 'అమ్మపోయింది, కూతురు ప్రేమించిన వాడితో రిజిష్టర్ మారేజ్ చేసు కుంది.చచ్చి పోవాలని అనిపిస్తుంది' అంటూ ఎంతో బాధతో సత్యమూర్తి రాసిన ఉత్తరం అందుకున్న శృతి హుటాహుటిగా బయలుదేరింది. తీరా అతని ఇల్లు చేరే సరికి కూతురు పెళ్ళి ఘనంగా చేసే పనుల్లో పెళ్లి పందిట్లో తలమునక లౌతుంటాడు అతడు.తల్లి చావును మరచిపోయి ఎక్కడ చూచినా తనేఅయి హుషారుగా నవ్వుతూ తిరుగుతుంటాడు.ఇతనేనా అంత ఆర్తితో రాసిన మనిషి! 'ఒక్క బ్రేక్ తో ట్రెయిన్ కదలి స్పీడందుకుంది .ఉత్తరం చింపి బయటకు విసిరేశాను'. ఇవి ముగింపు వాక్యాలు. మూర్తి ప్రాక్టికల్ మనిషి అని కథ మధ్యలో రచయిత్రి సూచించి వదలుతుంది. అది 'నాందీ-ప్రస్తావన' అని కథాంతానికి గాని అవగాహనలోకి రాదు. ప్రాక్టికాలిటీ ముసుగు కప్పుకున్న హైపోక్రటిక్ మనిషి నేటి సగటు సంఘజీవి అని చెప్పడం రచయిత్రి ఉద్దేశమై ఉంటుంది. ఇలాంటి వాళ్ళెందరో తన కథల్లో ఉన్నందువల్లే సంకలనానికి 'జీవరాగం' అని పేరు పెట్టిందనుకుంటాను. 'మట్టి-బంగారం' మాండలికంలో సాగిన మరోసంకలనంలోని మరో కథ. గొల్లల పండుగ పబ్బాల, వ్రతాల, ఆచారాల పల్లె వాతావరణం. అయోద్ది రాముడు గొర్రెలను అమ్మి పెంకులు తయారు చేసే మిల్లులో వాటావుంటానంటే 'ఎవడన్నా పేణం ఉన్న జీవాలమ్ముకొని పేణం లేని మిల్లు కొనుక్కుంటాడట్రా ?'అని ముసల్ది మందలిస్తుంది. అయినా ఖాతరు చేయకుండా ఫాక్టరీ కొనేస్తాడు. తన గుడిసె పక్కనున్న మరో మూడు గుడిసెలు కొని పడగొట్టించి పెద్ద మేడ కట్టిస్తాడు. ఆ మేడ 'మందలో తలెత్తి నిలిచిన కొమ్ముల పొటేలులా ఉందని' సంబరపడిపోతుంది అక్క శ్రీలక్ష్మమ్మ. ఆడంబరాలకూ డాబులకూ పోయి దివాలా తీస్తాడు అయోద్ది రాముడు. మిల్లుకు తాళం పడుతుంది. ఇల్లు అమ్ముడై పోతుంది.' మన అయోద్ది రాముడు మట్టిలో పుట్టిన మాణిక్కంరా, ఆడు మట్టట్టుకుంటే బంగారవై పోద్ది' అన్న పెద్ద గొల్లతాత 'బంగారాన్ని మట్టి సేసేవురా అయోద్ది రాముడూ' అంటూ వాపోతాడు.కథ పొడుగునా వస్తువుకు తగిన శైలీ, ప్రాంతీయ గొల్లల జీవనాన్నిప్రతిబింబిస్తూ గొల్లయాసలో సరళంగా సాగిన అరమరికలు లేని సంభాషణలూ, వాళ్ళ ఆలోచనలకూ స్వభావాలకూ అనుగుణమైన వర్ణనలూ కథకు చక్కని 'అనుదాత్తత'ను సంతరించి పెట్టాయి. ఉదయాన్ని పరికిస్తున్నశ్రీలక్ష్మమ్మకు 'తూరుపు మేకపాలు ఒలకబోసినట్టు'గా తోస్తుంది. తనను ఒంటరిని చేసి తమ్ముడూ, మరదలూ పట్నానికి వెళ్ళిపోతుంటే బస్సు కదలే వరకు ఉండిపోతుంది. 'ఎప్పుడు కట్టుతెంచుకుందో మేకపిల్ల, దాన్ని అపురూపంగా గుండెకు హత్తుకుంది. ఇకమీద ఇదే కదా తనకి తోడు!'. ఈ ఆఖరి వాక్యాలు కథకు చక్కని ముగింపు. 'అతడు-నేను' మూడవ సంకలనం లోని మొదటి కథ. వేపచెట్టు చిరుచేదు సుగంధం, నీలి ఆకాశంలో రూపులు మార్చుకుంటూ హటాత్తుగా మాయమైన మబ్బుతునక, సగంతెరచిన కిటికీలో రెపరెపమంటున్న'ఇండియా ఇన్ స్లో మోషన్'పుస్తకం--ఆమె జీవన నేపథ్యానికి సరిపడే వర్ణన. అతడు పెరాలిసిస్ స్ట్రోక్ తో మంచాన పడిన ముక్కోపి. అతడు ఏనాడూ తనను ప్రేమించలేదని తెలిసీ,పిల్లలు కలుగ లేదన్న నెపంతో మరోదాన్ని కట్టుకొని విడిపోయిన అతన్ని నిర్లిప్తంగా నైతేనేమి అటవీ జన సంప్రదాయాన్ని, భార్యా ధర్మాన్ని ఆమె నిర్వర్తిస్తూ సర్వసపర్యలు చేస్తుంటుంది. అతని వైద్యానికి ఉన్న ఇల్లును అమ్మి సేవాశ్రమాన్నిఆశ్రయిస్తుంది. తనను తిట్టిపోసే అతని తల్లికి చచ్చే వరకు సేవ చేస్తుంది.'అవును,అతను నీకు ఏం చేశాడని నువ్వింతగా సేవలు చేస్తున్నావు'అన్న షరీఫా కు జవాబుగా ఆమె 'మనం జీవించడానికి ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ. ఇతరులను జీవింప జేయడానికి కావలసినది నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్నీ, మనుషుల్నీ నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదమైంది' అంటుంది. సందేశాత్మకంగా ముగిస్తుంది కథ. ఇలాంటి అపురూపమైన కథా తోరణాలు 'కె.వరలక్ష్మి కథలు'. రైల్వే స్టేషన్లో అడుక్కుతినే బాలిగాడికి దొరికిన తప్పిపోయిన పాప జాలికథ 'పాప'. పడుపు వృత్తి లోని పసిడి బొమ్మల సున్నిత కథాంశం 'పిండి బొమ్మలు'. భూమి గల్లంతు కథ 'దగా'. మూఢ ఆచారాలు, నిస్సహాయ స్త్రీలు -మనసును పిండేసే ఉదంతం 'సుహాసినీ పూజ'. నన్ను ఆకట్టుకున్న అద్భుతమైన కథలు 'గాజు పళ్ళెం','మంత్రసాని', 'ఖాళీ సంచులు', 'ప్రత్యామ్నాయం','ప్రస్తానం', 'ప్రయాణం', 'నిరసన', 'ప్రత్యామ్నాయాలు' మచ్చుకు కొన్ని.'గాజు పళ్ళెం'-కూలీల దుర్భర బ్రతుకుల అద్భుత చిత్రీకరణ. ప్రతీతాత్మకమైన శీర్షిక. ఇతివృత్తానికి అమరిన రచనాత్మక కళా సృజన అద్వితీయం. కథాంతంలో 'అద్భుతాంశాన్ని' అత్యంత దయనీయంగా ఆవిష్కరించిన తీరు అమోఘం! గత్యంతరంలేక తన ఆకలినీ తనకడుపు లోని బిడ్డ ఆకలినీ తీర్చగల అంతిమ నిస్సహాయతకు లొంగిన గంగ 'వెన్నులో ఘటిల్లుమని ఏదో చిట్లినట్టయింది.పదిలంగా గుండెకు హత్తుకున్న గాజు పళ్ళెం విరిగి వెయ్యి ముక్కలయింది'. మనసును ముక్కలు చేసే ముగింపు. గాజు పళ్ళెం ఒక గొప్ప కథ. కె.వరలక్ష్మి గారి కథా సంపుటి 'క్షత గాత్ర'(2014), కవితా సంపుటి 'ఆమె'(2005), నాలుగు నవలికలు, రేడియో నాటికలు, వ్యాసాలు నేనింకా చదువవలసిన వారి రచనలు.వారు పొందిన అవార్డులు: చాసో స్పూర్తి, రంగవల్లి, విమలా శాంతి, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా, తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి, రంజని, పులికంటి,ఆర్.ఎస్.కృష్ణమూర్తి, అజో- విభో, ఆటా, తానా, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి మొదలగు అవార్డులు. 2013 సుశీల-నారాయణరెడ్డి ఉత్తమ రచయిత్రి పురస్కారం వరలక్ష్మి గారిని వరించడం అభినందనీయం. 'ఆమె కథలలోని పరిసర పరిశీలనలను చూస్తుంటే ప్రాచీన కవులలో శ్రీకృష్ణదేవరాయలు, ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ గుర్తుకొస్తారు' అన్న చేరా గారి అభినందన అర్హమైన అమూల్యమైన కితాబు. వరలక్ష్మి గారు ముందు ముందు మరింత ఉత్తమ సాహిత్యాన్ని అందించ గలరని ఆశిద్దాం. -నాగరాజు రామస్వామి. (కె.వరలక్ష్మి గారు జనవరి 17,2014 న ప్రతిష్టాత్మక "సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం అందుకున్న సందర్భంగా-)

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MyncTc

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

చాంద్రాయణం చెడు గుడులు -------------------------- రావెల పురుషోత్తమరావు పిల్లలకేమో కార్టూన్ల చానెల్ వైపు బాణం ఇంటావిడకు డైలీ సీరియల్సు అంటే ప్రాణం ఇంటాయనకు అప్పిసెం న్యూస్ కోసం వెంపర్లాట పనిమనిషికి కొత్త సినిమా పాటల పీకులాట అమ్మాయికేమో లవ్ సినిమాలపై ప్రేమ అబ్బాయిగారికి క్రీడాభిరామం ఇష్టం ముసిలి తల్లిదండ్రులకు మిడ్ నైట్ మసాలాల శృంగారం పై గారాము అందరి చూపులూ వేలికొసలమీద నర్తించే రిమోట్ కై ఎదురుచూపులు . దేశానికి తమ తప్పొప్పులు గమనించని సోమరులైన ఇలాంటి పౌరులే కావాలి యే దేవుడూ రక్షించలేని దశకు దగ్గరౌతున్న దౌర్భాగ్యం నేటి మన భారతంపు భాగోతం అని అందరం గుర్తెరగాలి కలిపురుషుని కందకుండా అస్తి నాస్తి అనుకుంటూ బ్రతకగలగాలి ==========================07-02-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MyncCS

Posted by Katta

Padma Arpita కవిత

నా అస్త్రాక్షరాలు క, చ, ట, త. ప లు కౌగిలించిన అక్షరాలను డు, ము, వు, లు విభక్తులు ఏవనడిగాయి... వియ్యమొందాలనుకున్న ద్విత్వ అక్షరాలను గుణింతములు గుణగణితము ఎక్కడన్నాయి... సంధికార్యమిది అనుకున్న సంయుక్తాక్షరాలను సమాసాలు సమాధానంగా ఛంధస్సుని కోరాయి... సంస్కృతంటూ సిగ్గుపడుతున్న సంశ్లేషాక్షరాలను ప్రకృతి-వికృతులు పకపకనవ్వుతూ ప్రశ్నించాయి... భాషాభాగాలని బరిలోదింపిన మహాప్రాణాక్షరాలను వత్తులే కాదు లింగములు లేవంటూ విడదీసాయి... అలంకారాలు అందంగా అద్దలేదని నా అస్త్రాక్షరాలను భావవ్యాకరణమేకాదు తెలుగుభాషలేని కవితన్నాయి! 7th Feb 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/My24MV

Posted by Katta