యాభైఆరేళ్ల అమెరికన్ తపస్వీ, మౌనీ, ఎమిలీ డికిన్సన్ Emily Dickinson (December 10, 1830 – May 15, 1886). ఓ ప్రత్యేక ఫిలాసఫీతో జీవితాన్నీ, కవిత్వాన్నీ నడుపుకున్న యువతి. ఎవర్నీ లెఖ్ఖచేయని మనస్త్వత్వం, ఎప్పుడూ తెల్లబట్టలే వేసుకుని స్వచ్చతనీ, నిజాయితినీ వెదుక్కుంటాననే మొండితనం, ఇంటికొచ్చినవాళ్లని పలకరించకూండా తన గదికే పరిమితమై, తనలోపలికే తనుచూసుకుంటూ తనని తనే కవితా వాక్యాలద్వారా పైకి వ్యక్తపర్చుకునే ప్రయత్నమే ఎమిలీ డికిన్సన్. తను రాసిన సుమారు 1800 కవితల్లో కేవలం ఎనిమిది మాత్రమే ఆమె బతికుండగానే ప్రచురణకి నోచుకున్నాయంటే ఆమెకి పబ్లిషింగ్ పైనానూ, పబ్లిసిటీ పైనా ఆమె ధృడమైన అభిప్రాయాలు సుస్పష్టం. "ప్రచురణా? అది ఓ వ్యక్తి శీలం వేలంపాట కదా?" అని ఓ కవితే రాసుకుంది అప్పట్లో (1850) (Publication – is the Auction, "Publication – is the Auction Of the Mind of Man" ). ఆమె ప్రతీ రచనలోనూ ఓ పదునైన మెసేజ్ ని చాలా అలతి పదాల్లో అందిస్తూ రాసుకుంటూ వచ్చింది. కానీ ఆమె కవితల్లో మనందరికీ నచ్చేదీ, నచ్చి చదివించేదీ ఒక్కటే-- రాతల్లో ఈజ్! సుత్తిలేకుండా సూటిగా చెప్పదల్చుకున్నది చెప్పటం. అనవసరపు మాట ఒక్కటీ ఉండదు. అదెలా సాధ్యమో తెల్సుకోవాలంటే ఆమె కవితలన్నింటీనీ చదవాల్సిందే! కనీసం కొన్నైనా! ఆంగ్ల సాహిత్యంలోనే కాదు ప్రపంచపు చాలా భాషల్లో, చాలా కవితల్లో--మన తెలుగు కవితల్లో కూడా-- ఇంకా సాధించాల్సింది ఇదే. మాట విరుపు! వాక్యాన్ని ఎక్కడ ఆపాలి అన్న విజ్ఞత!! నిజమే, ఈ రోజు వచన కవిత్వంలో రకరకాలైన ప్రయోగాలు జరుగుతున్నయి. రకరకాలుగా రాస్తూ ఇదెందుకు కవిత్వం కాదనే స్థాయికి కొంతమంది "కవులు" బయల్దేరారు. ఆఖరికి వీరికందరికీ ఎమిలీ ఓ బలమైన జవాబు కాగలదు, ఆమె కవిత్వాన్ని చదవగలిగితే, ఆమె స్పెక్టకల్ నుంచే చూడగలిగితే కవిత్వ తత్వం అర్ధమయితే మనందరి శైలీ బహుశా మారిపోతుందేమేనన్న భయమూ నాకు లేకపోలేదు. ఆశ కూడా ఉందన్న విషయం మీకు తెలిసిందే. ఆమె రాసిన చాలా కవితల్లో ప్రాముఖ్యత సాధించిన కవిత " స్నేక్". అయ్యో అది "ది స్నేక్" కాదు. చెప్పానుకదా ఆమె అనవసరంగ ఒక్క పదమూ వాడడు. ఇంటికొచ్చినవాళ్లల్లొ తనకి తెలీని వాళ్లని పలకరించటమే అనవసరం అనుకునే ఆమె తన కవితకి శీర్షికకి "స్నేక్" కి ముందు "ది " అని కూడా రాయదల్చుకోలేదు. ఆమె అమెరికన్ ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవయిత్రి ఎమిలీ డికిన్సన్! భేషజాల్లేకుండా రాసే కవ్వెవ్వడు ఈ ప్రపంచంలో.. ఈ రోజుల్లో! విషయాన్ని సూటిగా చెప్పే దమ్మున్న కవెవ్వడు ఈ వచనకవిత్వ రోజుల్లో! ఇదిగో ఈమె ఒక్కర్తే నాక్కనడుపుతోంది. మీకూ నచ్చొచ్చు. చదివి చూడండి. తన వ్యక్తిత్వాన్ని తన కవిత్వంలో ఇంత బలంగా చెప్పగలిగిన కవయిత్రి ఈమె మాత్రమే..నాకింకెవరూ తెలీదు! మీకు తెలిస్తే చెప్పండి ఇక్కడె… ఆమె రాసిన పద్దెనిమిది వందల కవితల్లోకి ఆణిముత్యంలాంటి "స్నేక్" కవితని చదువుదామా? Snake ------- A narrow fellow in the grass Occasionally rides; You may have met him, -did you not? His notice sudden is. The grass divides as with a comb, A spotted shaft is seen; And then it closes at your feet And opens further on. He likes a boggy acre, A floor too cool for corn. Yet when a child, and barefoot, I more than once, at morn, Have passed, I thought, a whip-lash Unbraiding in the sun, - When, stooping to secure it, It wrinkled, and was gone. Several of nature's people I know, and they know me; I feel for them a transport Of cordiality; But never met this fellow, Attended or alone, Without a tighter breathing, And zero at the bone. Translation isn’t my cup of tea. One needs to read this poem in original and enjoy. Nevertheless, we welcome its translation by anyone of you. ===Vasudev
by Srinivas Vasudevfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS0anr
Posted by
Katta