kb ||సమైక్యత Vs అనైక్యత|| ఫేటేల్మని పాంజియా పగలకపోతే, ఖండాలకి రూపుండేదా ? ఈ జగతికి కళ వుండేదా ? సమైక్యతని ఏడ్చేవారో, అనైక్యతని అరిచేవారో ఎవరూ లేని ఆది కాలమది. ** రోడ్డెమ్మట నడిచేవానికి, ప్రతిక్షణానికి దిక్కుమారదు నడిసంద్రంలో ఈదేవానికి, భూభాగాల జాడే దొరకదు ఓపికలేక అద్దం పగిలితే, ఎవడి ముక్కలో వాడి ముఖాలే ఎన్ని వదిలినా, కొన్ని కలిపినా, కష్టం - కనుమరుగై పోదు రాజ్యం - రమణీయం కాదు ** సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే కూలిన గోడల దేశాన్నొకటి మొన్ననే చూశామే ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా ? గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా ? అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా ? నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా ? బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా ? గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా ? విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు. ఏ స్వార్థంతో లురేషియా ముక్కలైపోయిందో, ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగశాయో,. ఎత్తులు, పై ఎత్తులలో - అరువుబతుకులా ఆకలుండదు, ఆకలే లేని రోజున, ఆమరణ దీక్షకు విలువ వుండదు. గందరగోళపు వ్యాఖ్యానాలు, ఉత్తకూతల ప్రేలాపనలు జగడం ప్రాణసంకటం, నిబద్దతే ప్రశ్నార్థకం. ** జీడిపాకమై సాగే కథలో చివరి మలుపులో ఏముందో రెండు పిల్లుల కలహపు కథలో లబ్ధిపొందిన కోతేదో విడిపోయే రోజొకటొస్తే, ఆనందంగా విడిపోదాం / విద్వేషంతో కొట్టుకు చద్దాం కలిసుండటమే తప్పనిసరైతే అన్నదమ్ములుగా జీవిద్దాం / రాష్ట్రం రావణకాష్టం. **** రాజ్యలక్ష్మికి మనసు వుండదు కష్టజీవికి రాజ్యముండదు. కరుకు గుండెలో కవితలుండవు కవుల కలాలకు కుట్రలుండవు. Feb 2013 Note: 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి, దాన్ని పాంజియా అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది. అవి గోడ్వానాలాండ్, లురేషియా. 50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా, ఆసియా ప్రాంతాన్ని ఢీ కొట్లడం వలన హిమాలయాలు ఏర్పడాయి ( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం) ------------------------------------------20/2/2014
by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTVks1
Posted by
Katta