పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, మార్చి 2014, ఆదివారం

Abd Wahed కవిత

తేనెకన్న తీయనైన ఆ రోజులు గుర్తున్నాయా అమ్మ ఒడిన నేర్చుకున్న ఓనమాలు గుర్తున్నాయా చింతబరికెతో టీచరు నేర్పించిన ఎక్కాలెన్నో చింతచెట్టు పంచుకున్న ఆ పులుపులు గుర్తున్నాయా గిల్లికజ్జ కోట్లాటలు తాయిలాలు కాకెంగిళ్ళూ కారంలా చురుక్కుమనె జ్ఙాపకాలు గుర్తున్నాయా పై చదువులు, కొత్త కొలువు, అమ్మకంట ముత్యాల్లాగే జారిపడిన ఎడబాటుల ఉప్పునీళ్ళు గుర్తున్నాయా తొలిప్రేమలు తొలిఆశలు ప్రయత్నాలు వైఫల్యాల్లో పడుచుదనం చవిచూసిన పొగరువగరు గుర్తున్నయా చేజారిన కాలంలో చేయలేని సంకల్పాల్లో చేదురుచిని తలచలేని మతిమరుపులు గుర్తున్నాయా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dGd1c4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి