పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Krishna Mani కవిత

ఒడువని ముచ్చట __________________కృష్ణ మణి ఎవలుల్లా ….! కొమరయ్యింటికాడ కయ్యమైతునట్లుంది కోడలు నోరు జోరుమీదున్నదీ ! ఎందుకు జెయ్యదు మల్లక్క చేతికందిన పంట పురుగు పాలు పెయ్యి మీది బంగారం బ్యాంకు పాలు ! అమ్మగారింటికి పెండ్లికి పోవల్నంట ఏం జేస్తది పాపం పెండ్లైనుండి పోరు వడుతుంది ఏరువడుతనని మర్దలి పెండ్లికి సగం భూమినమ్మే మర్ది సదువుకు మామ ఇంకింత అమ్మే ! పిల్లల ఆకలి సూడలేక అడుగు బయటబెడుతనంటే మొగుడొద్దంటడు ఓపలేని కోపాన ఎదురంటే ఏమైతది ఈబ్బలిగె అమ్మగారొచ్చే ఏముంటది ఒడువని ముచ్చట ! అందరిల్లుల్ల ఉన్న గతే కదక్క ! కృష్ణ మణి I 12-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l559DI

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

9 జూన్ 2014 నాడు త్యాగరాయ గానసభలో "నమో భరతమాత" - కవిసమ్మేళనం జరిగింది. ప్రముఖ కవి "సుధామ" గారి అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో "డా. జె. బాపురెడ్డి", "డా. ఉండేల మాలకొండారెడ్డి", "డా. ముదిగొండ శివప్రసాద్", "డా. సి.భవానీ దేవి", "డా. వెనిగళ్ళ రాంబాబు" మొదలైన వారితోబాటు నేను పాల్గొన్నాను. ఆనాడు నేను వినిపించిన నా పద్య కవిత . శక్తివంత భారతం రచన: "కవి దిగ్గజ" డా. ఆచార్య ఫణీంద్ర తలపై హిమాద్రి మకుటము; గళమున హారములు పుణ్య గంగా, యమునల్; జలధి త్రయ సంధి స్థలి పలు వన్నెల పాదపీఠి - భారతి నీకౌ! క్రొత్త దనము నిండె - క్రొంగొత్త కాషాయ వర్ణశోభిత మయె భరతభూమి! కడచి పోయిన కడగండ్లు - గతము గతః స్వర్ణ యుగము లింక వరలు గాక! నాడొక "నరేంద్రు" డుదయించి, నాటి విశ్వ వేదిపై భారతీయ తాత్త్వికత చాటె! నేడొక "నరేంద్రు" డుదయించె - నిలుపు గాక భరత దేశమ్ము నుత్తుంగ పదము పైన!! ఇరువ దెనిమిది రాష్ట్రాల కింక తోడు కంటివి నవ శిశువు, "తెలంగాణ" పేర - పచ్చి బాలెంతరాల! మా భరత మాత! ప్రీతి లాలించి, పాలించి పెంచుమమ్మ! అన్ని రాష్ట్రము లిక అభివృద్ధి పథములన్ తురగ వేగ గతిని పరుగు లిడుత! అచిర కాల మందె అవనిపై భరతాంబ అమిత శక్తివంత దేశ మగును గాక! --- && ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qAAk96

Posted by Katta

Pusyami Sagar కవిత

వెలిసిన చిత్రం ________ పుష్యమి సాగర్ సూరీడు కాన్వాసు రోడ్డు పై దేవుళ్ళ నృత్యం !! కాసుల గల గలలు కలలు కనే పిచ్చి కళ్ళు ..!! తెగిపడిన కాళ్ళు నరకబడ్డ ఆలోచన బతుకు చిత్రం రంగుల లో ....!! జూన్ 12, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iqE87P

Posted by Katta

Arcube Kavi కవిత

దరియ్యి ____________ఆర్క్యూబ్ పిడాతనో తాత్పారంగనో ఎనుకసీరి ముచ్చట ముసురే పెడుతవో ముంతలే కుమ్మరిస్తవో అటెనుక సంగతి పత్తి గింజలు వట్టిపోతున్నయి మొక్క జొన్న చేల్లు తాళ్ళు పేనుతున్నై నువ్వుజేండ్లు కుట్టువడి పోతున్నై నారు ముదిరి పోతంది పస్కవడక పశురం ఔగోళిస్తంది ఒక్క దమ్ము పడూ.. " మీదెండంది లోపట నానది ఆకిళ్ళల్ల నాచు అట్టి దుబ్బురు " అనం పేర్నాల పెట్టం సానుపు లెక్కనే పడు దంచి కొడితే మంచిదే ఇత్తనం నిలిస్తే అందరికి మంచిదే కురూ కురిస్తనే పేరు- నీకైనా నాకైనా ___ *___

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TNMXTC

Posted by Katta

Yessaar Katta కవిత

.. ఆగష్టు 2012 పదిహేనున హైదరాబాదు “ఇఫ్లూ” లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' మన కవిసంగమం ప్రయాణంలో ఓ మలుపురాయి. ఆ పండుగ సంబురాలలో నేనూ పాలుపంచుకున్న సంతోషం నాలోన నిలిచేవుంది. కవిసంగమం అపూర్వ సమ్మేళనంలో నాలో కలిగిన కొన్ని అనుభూతుల్ని అప్పుడే కవిత్వంలా రాసుకున్నా యిది అందరితో పంచుకోలేదు. ఎందుకంటే నేను రాసింది ఆధునిక వచన కవిత్వంలో కాదు. ఆరు కందపద్యాల్లో నాటి నా అంతరంగాన్ని జోడించి రాసుకున్నవి. మన కవిసంగమంలో చేరిన కొందరు క్రొత్త మిత్రులతో ఆనాటి అనుభవాల్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంగానే యిపుడు పోస్ట్ చేస్తున్నాను. సురెక || పంద్రాగష్టు 2012 .. ||కం||కవనం కవనం ఐనది కవిజనమంతా మిళింద కటకము కాగన్ కవియించిన రాగాలతొ కవగొనిరానాడు పండుగ దినము జేసీ ! .. ||కం||అలరించిరి గానాలతొ తొలకరి భావాల వాన తొలుకగ బాగా చెలరేగిరి వారందరు ఒలికిన ఆలోచనమ్ము లొడికము కాగన్! .. ||కం||కురిపించిరి రాగాలను మురిపెము జారన్ కవిత్వముదిరము నుండీ విరచించిన గేయాలను పరితము లాగా నుతించి పటిమను జూపీ ! .. ||కం||కవిసంగమమే కోరగ చవిగొని మన్నించె వారు చతురిమ జూపీ కవిమాన్యులు తామందరు కవితల గూర్చీ గణించి కడుగొనిరెంతో! .. ||కం||పదిహేనవ ఆగస్టున కదలిరి వారందరెంతొ కలితము కాగన్ ముదలించిరి వారెంతయొ మదిమది తోనే కవనమ్మలరగ నాడున్ ! .. ||కం||అనురాగముతో కూడిరి అనువును చూపీ కవితల అమరికచేసీ తునికోలగ వారందరు అనఘపు గేయాల మత్తు అనువుపడంగన్! .. (12/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v3AR6a

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్‌/Thread Way మళ్ళీ ప్రయాణించడం పాతరోడ్డుపై నన్ను నడిపించుకుంటూ మట్టిలో మునిగిన నౌక ఒకటిప్పుడు గాయాల తెరలకు కొట్టుకుపోయిన జ్ఞాపకం దిశాబాణాలు ఓ చివరన తమ కళ్ళను పదును పెట్టుకుంటున్న శరాలు కూర్చున్నచోటే నీకు కొన్ని నిర్దేశాలు కళ్ళకు అడ్డుపడుతూ తలక్రిందులుగా చెట్టు భుజాలకు వ్రేలాడుతూ సన్నని ఆకుదేహాలు ఇంకో దారం నీ చిన్న చర్మానికి గతుకులు కుడుతున్న శబ్ధం ఆకరుకంటా రెండు రహదారులు నా ముందు ఖాళీ ముఖంతో ఇంకా తడారాలి పచ్చికపై ముద్రలు నా కళ్ళలో అతుక్కోవడానికి తిలక్‌ బొమ్మరాజు 12/06/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lijzit

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఋతులాస్యం రావెల పురుషోత్తమ రావు నేలంతా పూల వర్షంతో పులకితమౌతున్నది నూత్నమర్యాదంజెందుతూ చివురు జొంపాలతో పుడమి మాత పురుడుపోసుకుంటూండడం అంతా వసంతుని లీలా విలాసమేగదా. అవనిమీద నీరంతా క్షణాలలో ఆవిరై యిగిరిపోతున్నది బహుశా ప్రచండభానుని గ్రీష్మతాపం తీరుస్తున్నదేమో ప్రకృతి పరాన్ముఖత పాలవకుండా జాగ్రత్త పడుతున్నది పగుళ్ళ నేలను చూసి గుండెలవిసేలావిలపించిన మేఘం తూనీగలతో దారులు గట్టి వర్షదేవతను మట్టి పరీమళ సౌరభాలతో అద్ది శుభస్వాగతం పలుకుతున్నది పూలరెక్కలన్నింటి పైనా హేమంతపు తుషార బిందు రత్నాలు దివ్యకాంతులతో విరాజిల్లుతూ హరివిల్లుల ననంతంగా అణువణువునా ప్రతిబింబింపజేస్తూ అమందానంద కందళిత సుందర హృదయానందయౌతూ వికసిస్తున్ననేపధ్యమది . నిగారింపులతో పాలకంకులు పాడి పంటల పసిడి తళుకులు, జున్నుమీగడ తరగల్లా మెరిసిపోతున్న పాడి పశువులు పొదుగుకున్న పసిడి కాంతుల ధగధగలు . శరత్ జ్యోత్స్నల సరిగమల ధవళ ధావళ్యాలు. ఆశనిరాశలమధ్యన ఊగిసలాడే నీరవనిశ్శబ్దాలు నిట్టనిలువునా వణికించే నిరాశా నిస్పృహల నిడుగాడ్పులు శిశిర ఝంఝల్లో రాలిపడే నిస్తబ్ధ తరంగాలు ఈ శీర్ణ పత్రాలు. **************************************** 12-6-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lidPW0

Posted by Katta

Sky Baaba కవిత

సూఫీ దేవుడు `````````````` అబ్బాజాన్ నవ్వుతున్నడు చిన్న పిలగాని లెక్క చిటికెన వేలందించి నాతో తప్పటడుగులు వేయించిన అబ్బా ఇయాల నా చెయ్యి పట్టుకొని అడుగేస్తానికే తడబడుతుండు పక్షవాతపు ఒళ్ళు తూలినప్పుడల్లా నవ్వుతున్నడు అబ్బాజాన్ పసి పిలగాని లెక్క * * నిండైన గడ్డం - టోపీ పెట్టి తెల్లని లాల్చీ - లుంగీ కట్టి కదిలొస్తుంటే అచ్చం ఆ సూఫీ దేవుడే ... ... ! పీర్ల ముందూ నువ్వే కందూర్ల ముందూ నువ్వే పుంజునో పోతునో హలాల్ చెయ్యాలన్నా ఫాతెహా లియ్యాలన్నా నువ్వే తేలు కరిసినా పురుగు ముట్టినా నీ మంత్రమే కావాలె పసి కందులకు నీ అంత్రమే కట్టాలె ఏ ఇంట్లో ఏ ఆపదొచ్చినా - నొప్పొచ్చినా గుర్తొచ్చే మొదటి దేవుడా ! నీ మాట చాలు - నీ ఆభయమే 'మేలు' ! సుక్క పొడవక ముందే ఎన్ని ఇండ్లల్లో పలికేదో - నీ పేరు 'మదారు సాబు కాడికి తోల్క పోవాలె ' మదారు సాబును పిల్సుక రావాలె ' మాల మాదిగలూ సూదర్ల బారు ! * చేతులెత్తి నువ్వు దువా చేస్తే ఊరందరికీ కొండంత అండనిపించేదే.. మరి మన ఇల్లెందుకు అబ్బాజాన్ పడావు పడ్డది దువా చదివి నువ్వు జుబా చేస్తే ఆ ఇంటిల్లాదులకూ కందూరు పండుగయ్యేదే.. మరి మన ఇంటోళ్ళ కెందుకు అబ్బాజాన్ ఉపాసముండని రోజు లేకుంటయ్యింది మనకు చేలేందుకు లెవ్వో - చెల్క లెందుకు లెవ్వో పొల మెందుకు లేదో - తల మెందుకు లేదో చేతిలో ఆరె ఎందుకు లేదో ఇంటి ముందు సారె ఎందుకు లేదో ఇంట్లో మగ్గం ఎందుకు లేదో ఏనాడూ చింత చెయ్యవైతివి అబ్బా రిజర్వేషన్ మాటెత్తితే సర్కారు బిచ్చం మనకెందుకురా అంటివి గొంతెత్తి పాడేటోనివి - నిర్వేదంగా.. 'యే దునియా యే మహెఫిల్ మెరే కామ్ కీ నహీ మెరే కామ్ కీ నహీ..' * చేతులెత్తి నువ్వు దువా చేస్తుంటే భూగోళమే మెల్లమెల్లగా చిన్నదై నీ కాళ్ళ కింద చేరి చిన్నబొయ్యేది ఊరందరి నోట్లో నాలుకైన నువ్వు ఇంటి పరేశాన్లకు బైటివాడివైతివి 'భద్రత' తెలియని నిరంది సొంతానికీ.. కుటుంబానికీ.. అంతా బేగం మీద వోదిలేసే బేచింత ! నువ్వే అదృష్టవంతుడివేమో అబ్బా అందరిలా ఏదో ఇంకేదో సంపాయించాలనే యావేదీ లేకుండా బేఫికర్ గా బతికినవ్ ఎవరేమనుకుంటే నీకేంది అది నీ తత్వమో - 'నసల్ ' నైజమో మాక్కూడా నీలాగే బతకాలని ఉంది జర గా ఉపాయం చెప్పరాదే ! * * అబ్బాజాన్ నవ్వుతున్నడు నిర్వేదంగా... అబ్బాజాన్ నవ్వుతనే ఉన్నడు మారని మమ్మల్ని చూసో... మారిన లోకాన్ని చూసో...

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s7WLXM

Posted by Katta

Jagadish Yamijala కవిత

స్నేహం --------------------- స్నేహమనేది సూర్యుడిలా .... అన్ని రోజులూ పూర్ణమై ఉంటుంది స్నేహమనేది సముద్ర కెరటంలా .... ఎల్లప్పుడూ విరామమెరుగక వెంటే ఉంటుంది స్నేహమనేది అగ్నిలా.... అన్ని చెడులను నాశం చేస్తుంది స్నేహమనేది కనీరులా ..... ఎందులో పోసినా ఒకే స్థాయిలో ఉంటుంది స్నేహమనేది భూమిలా.... అన్నింటినీ సహనంతో భరిస్తుంది స్నేహమనేది గాలిలా.... అన్నిచోట్లా వ్యాపించి ఉంటుంది ---------------------- తమిళంలో కవి వైరముత్తు అనుసృజన - యామిజాల జగదీశ్ 12.6.2014 -----------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpzcod

Posted by Katta

Pranayraj Vangari కవిత

ప్రణయ్ || 4 || దారుణం || వాళ్ల ఆనందం... దేవుని కన్నుకుట్టిందేమో.... వాళ్ల పరవశం.... ప్రకృతి కుళ్లుకుందేమో.... ఫలితం.... ఒక దారుణం ***** చదువులమ్మ చల్లని ఒడిలో నిద్రించాల్సినవాళ్లు మృత్యుకౌగిలిలో నిర్జీవులై పడున్నారు.... చిలకాల గుర్తులుగా ఉంచుకోవాల్సినవాళ్లు చివరి గుర్తులుగా మిగిలారు..... చుట్టున్న అందమైన లోకంలో విహరిస్తూ అందరాని లోకానికి వెళ్లిపోయారు.... ***** ఇరవైఐదు సంవత్సరాల ప్రాయంలో నూరేళ్లు నిండాయేమో.... మృత్యువు తమని కబలిస్తుందని తెలిసి ఆ పసి హృదయాలు ఎంతగా తల్లడిల్లాయో.... ఎవరైనా తమని రక్షిస్తారని ఎంతగా ఎదురుచూశాయో.... ఆ చీకటి ప్రవాహంలో చివరి శ్వాసవరకు ఎంతగా రోదించాయో..... ***** కళ్లముందే సన్నిహితుల్ని జలప్రళయం మింగేస్తున్న ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితి నరకంకాక మరేమిటి... ఇలాంటి అనుభవం పగవారికి కూడా రాకూడదు ఏనాటికీ..... (10.06.2014. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో జరిగిన సంఘటనకు చలించి)

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mLwOVO

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

జీవితం అశాశ్వతం అంటే మాట బాగుంటుంది అనుభవిస్తే తెలుస్తుంది జీవితం విలువ ఉన్నపుడు మనకు దాని విలువ తెలియదు లేనపుడు ఎంత వేదన చెందినా తిరిగి చూడలేం ఆడుతూ పాడుతూ సరదాగ్ విహారానికి వెళ్ళిన విద్యార్ధులు ఏమి ఘోరం చేసారని అన్యాయం గతం లో కేదార నాధ్ లో జల ప్రళయం సాముహిక మృత్యు కేళి ... విధి విలాసం ఎక్కడ ఎక్కడో పుట్టారు ఒక్కసారే ఒక్కచోటే కలసి మృత్యు కౌగిలి లోకి వెళ్ళారు దురదృష్టం కాకపొతే శివుడి ఆజ్ఞ అపుడే అవ్వాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రానున్నది రాకమానదు పోనున్నది పోక మానదు అన్నట్లు జరుగుతున్నాయి అంతా మనమంచికే అని ఎలా అనుకోవాలో అర్ధం కావటం లేదు కడుపు కోత తో రోదించే కన్న తల్లుల వేదన ఎలా తీరేను చావు కోసం ఎదురు చూసే వారికి అది రాదు నిండు భవిష్యత్ వున్న చిన్నారుల బలి గొన్న విధి ఎంత కటినాత్మురాలు !!పార్ధ !!12/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpYeiu

Posted by Katta

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ చెరువు ॥ 1 నిన్న సాయంత్రం చెరువు ముందు చేతులు కట్టుకుని నిలుచున్నాను నన్ను చూడగానే తనలో ఒక కదలిక నా కేరింతల బాల్యం తను కలిసి ఆడుకున్నాం కలిసి అల్లరి చేసాం తను నాకు ఈత నేర్పింది నేను తనకు నాట్యం నేర్పాను నేను ఈదినంతసేపూ తను నాట్యం చేస్తూనే ఉండేది కాంక్రీట్ సంద్రాలకు అలవాటుపడి ప్రవాహంలో కొట్టుకుపోవటమే జీవితం అనుకుంటూ నేనే ఈదటం మర్చిపోయాను తను మాత్రం మారలేదు 2 నిన్న సాయంత్రం చెరువు ముందు తలొంచుకుని దోషిగా నిలుచున్నాను ముఖం చెల్లక మౌనంగా నిలుచున్నాను 3 ఎంతైనా చిన్ననాటి ప్రేయసి కదా తనే చనువు తీసుకుంది దోసిళ్ళు దొసిళ్ళుగా జ్ఞాపకాల కిరణాల్ని ముఖమ్మీద చల్లింది చొరవగా నెట్టింది చిలిపిగా తోసింది నిలువెల్లా తడిపేసింది గతం గతః అంటూ కలువలతో తలంటి స్నానం చేయించింది 4 మళ్ళీ ఎప్పటికొస్తానో అని ఆప్యాయంగా నన్ను ముద్దాడింది చల్లటి తడి నవ్వులతో నన్ను సాగనంపుతుంటే ఒక్కసారిగా నా గుండె చెరువయ్యింది నా లోపల వలయాలు వలయాలుగా ఏదో బెంగ, ఏదో ఆనందం, ఏదో మార్పు 12-06-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpUjCh

Posted by Katta

Humorist N Humanist Varchaswi కవిత

//వర్చస్వి//బియాస్// - - - - - - - - - - - - - అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే ఉల్లాసపు వెల్లువకు ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది! చూస్తుండగానే కంటిలో చలమలు చిన్నగా చిలవలు పలవలై విరుచుకు పడ్డ వరదై కనీళ్ళ చితిని పేరుస్తుంది. కోల్పోయిన లేత కలల్ని వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు- నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి ! రోజులు దొర్లాక దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ చుక్కలు చుక్కలుగా కాసింత కుదుట పడిపోతుంటాయి. పగిలిపోగా మిగిలిన గుండెల్ని స్మృతులుగా శృతిచేసుకుని జాలిగా నేమరేసుకుంటాయి ! ఎప్పటిలా దీటైన యంత్రాంగం తనపని తాను చేసుకు పోతూ ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది! కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’ పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి. ‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను చిన్న నలుసైనా పడకుండా రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం- రేపటి స్కూలు సిలబస్ లో ‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది! //12.06.14//

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWBJFT

Posted by Katta

Sharada Sivapurapu కవిత

దీర్ఘాయుష్మాన్ భవ // శారద శివపురపు కనులు తెరిచి చూడగ ఈ శుభోదయాన చీకటి పరదాల అంచుల వెంబడి తొంగి చూసిన పుత్తడి వెలుగులు తట్టీ లేపెనేవో సుదీర్ఘ నిద్రలోనున్న బంగరు భవితల ఆశలు గుర్తుకు తెచ్చెను లేత మావి చిగురులు చూసినంతనే కుహూ కుహు మన్న కోకిలమ్మల సన్నాయి పాట విన్నంతనే చిలిపి ఊహల తేలియాడిన కన్నెపిల్లల తలపించెను నవ వధువు మోమున చిగురించిన బంగరు చిరునవ్వుల అనిపించెను మెత్తని మేఘాల తేరుపై వెడలి చందమామను ముద్దాడినటుల నింగినుండే రంగుల హరివిల్లు వాకిలి ముందే నిలచినటుల పన్నీరు నింపుకున్న మేఘమేదో మెల్లగ మేను తాకినట్టుల నిన్న కాదు మొన్న కాదు గత జన్మల జ్ఞాపకాల గాయాలు వెంటాడిన అంతులేని చీకటి రాత్రులు తెలవారనీకు దేవుడా అని మౌనంగా రోదించిన రాత్రులు తెలవారనిరేయిన దీపమెట్టి సూర్యుని వెదకిన రాత్రులు కుత్తుకకానించిన కత్తులవలె ముప్పిరిగొన్న భయాలు మెత్తగ తొలగించిన వెలుగు పూల పరిమళాలు ఎదలో ఎపుడూ గుచ్చుకున్న ముళ్ళ జ్ఞాపకాలే మరి ఎపుడు పూసెనీ గు భాళించు ఎర్ర గులాబీలు ఎన్నినాళ్ళకీ మనసున వెలుగులు నిండగ ఎంత హాయి తోచె బ్రతుకున ఈ పండగ కనులు తెరిచి చూడగ ఈ శుభోదయాన కలిగిన ఈ భావనకి దీర్ఘాయుష్మాన్ భవ 12/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3C0sx

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు *************** బడిసందడి ********** వళ్ళువిరుచుకున్న గంట నీరసంగా మోగుతుంది మళ్ళీ బడిసందడి మొదలైంది షరామామూలుగా ఇంటిమీది అల్లరిబుట్టలను బడికి చేర్చి తేలికపడ్డారు పెద్దాళ్ళు రిలీఫ్ నుండి రిలీవై సరహద్దుజవాన్ లా హడావిడిగా పయనమయ్యారు పంతుళ్ళు కొత్తబట్టలేసుకున్న తరగతిపుస్తకాలు కళకళలాడుతున్నాయి పిల్లల కళ్ళల్లో పిడికెడుపిండిలో బండెడు రొట్టెలు చేయడానికి అరకొరవసతులతో కార్పోరేట్ పాఠశాలలను మించడానికి బైరాగిచిట్కాలు అన్వేషిస్తూ అధికారులు కోడీకలతో శిల్పాలెలా చెక్కవచ్చో వివరిస్తూ మేథావులు క్రితందాకా వెలవెలబోయినగదుల్లో రణగొణల మంత్రాలు తర్వాతి సెలవుకోసం కాలెండర్ ముందేసుకుని ఆరాతీస్తూ హోంసిక్ బాధితులు నడ్డివిరిచే భారంతో మనసునిండిన వత్తిడితో విద్యార్థుల మళ్ళీ బడిజైలుకు ****************(21) 12-6-2014) ************

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1og7spE

Posted by Katta

Rajeswararao Konda కవిత

మంచి మనసుని కష్టపెడితే మీకు మనశ్శాంతి కరవవుతుంది..!! మంచి మనిషిని ఇష్టపడితే మీకు కష్టలు దూరమౌతాయి నేస్తమా ...!!! @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipOUve

Posted by Katta

Chi Chi కవిత

_మెతుకు_ ఇల్లొదిలేది ఇంటికోసమే విల్లొదిలే బాణంలా!! సందులు గొందులు ఎత్తుపల్లాలు వింతలు విద్యలు చుట్టూ బాణాలతో గురులు తప్పకుండా చేదించేది గుప్పెట్లో మెతుకులేసే యుద్దాన్నే.. బాణాలు బాణాలకు రాస్కుంటే రాలే మెతుకులు కూడా బాణాలకే.. విల్లు మళ్ళీ పిలుస్తుంది ఇల్లొక విచిత్రం!! యుద్ధం సందిస్తుందిప్పుడు ఇళ్ళమీదకి ఇదింకా విచిత్రం!! ఇళ్ళకి యుద్దానికి మద్య యుద్దంలో మెతుకుని గెలుస్తూ ఉంటేనే బాణానికి విల్లు ఇరువైపులా!! లేదంటే యుద్దాలుండవ్ ముద్దలుండవ్ ఇళ్లుండవ్ బాణాలుండవ్!! _____________________________(12/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qxHdIr

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | ఊయల నిద్రపోయింది ............................................. ఈ నిద్ర నాకు శాపం. ఊహల కుంచెలో ఊయల నిలవడం లేదు. గొంతులో శబ్దం పెగలడం లేదు . ఎక్కడ్నుంచో నిండా ముసుగేసుకుని చిన్ని పాదాలతో నడకల మెట్లెక్కుతూ ,పసినవ్వుల్ని కురుస్తూ ఒక కాలపుచుక్కలా రాలిపడ్డాను . నా అడుగుల సవ్వడి విని ఆకాశం నవ్వింది బోసిగా- * నా రాక కోసం చూసి చూసీ చూపుల మీద కత్తుల్ని పెర్చుకున్నావ్ ! తొమ్మిది నెలలకలల్ని కడుపులో దాచుకున్నావ్ ,కానీ ఈ భూమి నన్ను మరో క్షణానికే వెలివేసింది. తొమ్మిదో నెలవంక రాలిపోయింది. దీర్ఘనిద్రలో ఎన్నో స్వప్నాల మెరుపులు * అమ్మా - ఊయల ఊపకు. నాకు నిద్రొస్తుంది. ఈ జన్మకిక ఉంటాను -సెలవు ! # *పాతవాచకం .

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1wuZ9

Posted by Katta

నరసింహ శర్మ మంత్రాల కవిత

గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయకుహరాన్ని ఛేధించుకొని మరీ ఎగసి ఉప్పోంగుతున్న జలధార. మునుపెన్నడూ గ్రోలి ఎరుగని ఈ నవీన సజీవధారను ప్రశ్నించాను ఓయి! జలధారా! చెలియలు కట్టిన ఏ రహస్య మార్గాల వెంబడి మీరు ఇలా నాదిశగా ప్రవహిస్తూన్నారు? గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరంగ మధుకోశానికి కూర్చిన మరిన్ని నూతన శ్వేతవర్ణపు కుహరములందు ఆ స్వర్ణవర్ణపు మధూకరములు నా గత జీవితపు వైఫల్యాలనుంచి సైతం స్వారించి మరీ పూతేనియల్ని నింపుతున్నాయి! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరస్ధ నిశీధి లోనికి చొచ్చుకొని వచ్చెడు ఉష్ణమాలికా వీచికలు నా భావనలో వెచ్చటి కొలిమి సెగల వోలె తోచుటకు, అవి తమ తోడుగూడి గొనివచ్చెడి స్ఫూర్తి ప్రదములగు సూర్యకాంతి పుంజములేనని గ్రహించిన నా కనుదోయి చెమ్మగిల్లినది! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతఃకరణలో ఆ పరమాత్మాంశనే నేను సాక్షాత్కరింప జేసుకున్నాను! Last Night As I Was Sleeping అనే అంటినియో మచాదో స్పానిష్ కవితకి తెలుగు అనువాదం. -- నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1wjx0

Posted by Katta

Renuka Ayola కవిత

//చక్రాల కుర్చీ // రేణుక అయోల నిన్నటి దాక నన్ను పట్టుకున్న గోడల చేతులు నేల చేతులు కొత్త అతిధిని చూసి దాచేసుకున్నాయి నిన్ననే శరీరాన్ని చక్రాల కుర్చీలోకి మార్చాలన్నప్పుడు అవి చేతులు దాచేసుకున్నాయి ఈ బండీ రీమోటుతో తిరుగుతుందిట మారుమూలకి నన్ను తోసేస్తూ ఎన్ని జాలి కళ్ళని తిరస్కరించినా లోపలి కళ్ళు జాలిని వదిలి పెట్టావుగా ఉడుములా ఒక్క సారిగా కెరటంలా వచ్చిన ఈ అనుభవంతో నిద్ర సముద్రంగా మారిపోయింది మెలకువ వేకువ ఇసుక తిన్నెల రెప్పల మీద ఆగిపోయాయి ఇంక నేలని తాకలేని పాదాలు పరుగులు పెట్టలేని పాదాలు శరీరంలో కరిగిపోతాయి జ్జాపకాలు లోపల శిలగా మారుతున్నాయి శిలలో తడి కరిగి వేడి ఆవిరి అవుతోంది శిలలో రక్తం మరుగుతోంది శిలలో యవ్వనం గుస గుసలు చేస్తోంది ఇప్పుడు చక్రాలు చప్పుడు చేస్తున్నాయి కాలికి కట్టుకున్న మువ్వల్లా గల్లుమంటున్నాయి గల్లుమన్నప్పుడల్లా నీళ్ళ కుండలని దాచేస్తూ గోడలని నేలని చూస్తూ తిరుగుతున్నాను రేప్పోదునుంచీ అందరితో చక్రాలు కట్టుకుని మాట్లాడాలి చిరునవ్వుని నోటీసు బోర్డులా అతికించుకోవాలి .....

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xLS0Uh

Posted by Katta

Si Ra కవిత

ఆర్మేనియన్ జినోసైడ్ ------------------------ జినోసైడ్ అంటే- ఒకసమూహాన్ని ప్రణాలికాబద్దంగా నిర్మూలించటం. 20వ శతాబ్ధంలో మొట్టమొదటి జినోసైడ్ ఇది. రెండు కోట్లమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఫలితంగా ఆర్మేనియన్ ప్రజలు వారి చారిత్రాత్మక జన్మభూమిని కోల్పోయారు . మూడు వేల సంవత్సరాల నుండి ఆర్మేనియన్లు మెడిటరెనియన్ సీ, బ్లాక్ సీ మరియు కస్పియన్ సీ ల మద్యలొ, తూర్పుభాగం లో, ఐరొపా, ఆఫ్రిక, ఆసియా ఖండాలు కలిసేచొట నివసించేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అనటొలియ అంటున్నాం. యెప్పటినుండో ఇక్కడి వాసులు వారి అస్థిత్వాన్ని,సంస్కౄతి ని కాపడుకుంటూ వొచ్చారు. 11వ శతాబ్ధంలో, టర్కులు ఆర్మేనియపై దాడి చేసి ఆక్రమించారు. 18వ శతాబ్ధానికల్లా, టర్కులు మెల్లగా బలహీనమయ్యారు. బాగా చదువుకున్న ఆర్మేనియన్లు రాజకీయ సంస్కరనలపై ప్రభుత్వం మీద వొత్తిడి పెట్టారు. కిరాతకుడైన టర్కు సుల్తాన్ లక్ష మంది ఆర్మేనియన్లను చంపించాడు. కాని సుల్తాను రొజులు దెగ్గర పడ్డాయి. "యంగ్ టుర్క్స్" అనే ఒక సంస్కరనా- ఆలొచనలు ఉన్న టుర్కు జాతియవాదులు సుల్తాన్ని ఎదిరించి అందరికీ కనీస హక్కులను కల్పించారు. కాని ఈ జాతియవాదమే తిరిగి ఆర్మేనియన్లను పొట్టనపెట్టుకుంది. ఈ జాతియవాదులు తమ రాజ్యాన్ని, తమ జాతిని విస్తరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వల్లకు అడ్డు ఉన్నది 10% కూడా లేని రెండు కొట్ల ఆర్మేనియన్లు. అప్పుడు వొచ్చిన మొదటి ప్రపంచ యుద్దం లో, టర్కులు సెంట్రల్ పవర్స్ (జర్మని మరియు ఆస్ట్రియ-హంగెరి) వైపు యుద్దం చేసారు. 1909 నుండి 1918 మద్య కాలంలో జరిగినదే ఈ జెనోసైడ్. టర్కుల జాతియవాద దాహం దీనికి మూలం. ప్రభుత్వం అత్యంత కిరాతకంగా రెండు కొట్ల మందిని చంపించింది. చిన్నా, పెద్దా లెకుండా, ఆడా మొగా తెడా లెకుండా అందర్ని ఘూరంగా చంపెసారు. చరిత్రలో మొట్టమొదటి సారి, ఆధునిక టెక్నొలజి , సైన్సె ఎంత మారనకాండ స్రుశ్టించగలవో తెలిపినది ఆర్మేనియన్ జేనొసిడె. అందుకే దీన్నే మొట్టమొదటి ఆధునిక మారనఖాండ అనికుడా అంటారు. --- సియమంటో (1878- 1915) బాగా చదువుకున్నాడు. ప్రపంచంలోని ఎన్నో ప్రదేషాలని చూసాడు. 1909 లో ఆర్మేనియన్ల మొదటి జెనోసిడ్ జరిగినప్పుడు, "నా స్నెహితుడు నుండి రక్త కబురు" అనే కవిత్వ పుస్తకాన్ని రచించాడు.రాజకీయ కార్యకర్త. ఆప్రిల్ 24, 1915 మిగిలిన ఎందరో కార్యకర్తలు, మెధావులు, రచయితలు, కలాకారులతో పాతు, ప్రభుత్వం హత్య చెసింది. వారిలో సియమంటో ఒకడు. నా కన్నీల్లు నా ముత్తాతలు నడిచిన చోట, స్వచ్చమైన రెక్కలున్న కలతో, ఒంటరిగా నేను; అందమైన జింకవేసే తేలికైన అడుగులు నావి, సంతొషంతో హౄదయం పులకరిస్తోంది; ఆ పాతరోజుల గొప్ప వెలుగు లో, నీలాకాషాన్ని గొంతువరకూ తాగి గంతులేశాను, స్వర్నాలతోనూ, ఆశలతోనూ నిండాయి నా కళ్ళు,నా ఆత్మ దైవత్వంతో వెలిగిపొయింది. మా తోటలోని చెట్ల నుంచి,ఎన్నెన్నో బుట్టల పండ్లను ఎండాకాలం నాకు బహుకరిస్తుంది- ప్రతి పండూ మా ప్రాంతం లో పెరిగేది. అందమైన, రాగవంతమైన, సన్నని చెట్టు నుండి, నిషబ్ధంగా కొమ్మని తెంచేస్తాను,వెణువుతో పాటలు తయారుచేసుకొవటానికి. నేను పాడుతాను; రత్నాల వెలుగులు, పాత ఇంటినుండి వొచ్చిన పిట్టలు, పగల్లు, రాత్రులనూ నింపే స్వర్గలొకపు బావులనుండి వస్తున్న రాగాలూ, నా సోదరి కౌగలింతలాంటి చల్లటి వుదయపు గాలులు, అన్నీ నా అనందంతో పాలుపంచుకున్నాయ్, నాతో పాటి పాడాయ్. ఈ రోజు రాత్రి కలలో , మల్లి నా తీయటి వేణువుని తీసుకున్న; నా పెదవులపై అది ఒక ముద్దు పెట్టింది, పాతరొజులకి చెందిన ముద్దు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకురాగానే, నాకు వూపిరి ఆడటం ఆగిపొయ్యింది, పాటల బదులు, కన్నీల్లు ఒకొక్క బొట్టుగా జారి కాలువలుకట్టాయి . ---- నాట్యం ఆర్మెనియన్ల ప్రాణాలు ఇంకా పూర్తిగా పోని రోజులవి బూడిదతో నిండిన మైదానంలో ఒక జర్మన్ మహిల,కన్నీల్లని అనిచిపట్టుకొని ఆమె చూసిన ఘొరం గురించి ఇలా చెప్పింది- “ఇదిగో, చెప్తున్నాను కదా ఈ విశయం, దీన్ని నా సొంత కల్లతో చూసాను. వెనక ఉన్న నరకపు కిటికీ లోంచి, పల్లని గెట్టిగా బిగబెట్టుకొని, చూసాను నా కరుణలేని కల్లతో: బార్డేజ్ పట్టణం బూడిద కావటం. చెట్టంత ఎత్తుగా పరచబడ్డ శవాలను. నీల్లలో, కొలనుల్లో, కాలువల్లో నిత్యం చెప్పుడు చేసే ఆర్మేనియన్ ల జాతి రక్తం నాకు ఇంకా వినిపిస్తొంది. భయపడకు, నేను ఏం చూసానో ఇంకా చెప్పనేలేదు, ఒక మనిషి ఇంకొక మనిషికి ఎంత ఘోరం చెయగలడొ ఇంకా చెప్పాలి. అంతా స్మశానం అవ్వటానికి రెండు రోజుల ముందు జరిగిన సంఘటన.. కత్తితో పొడచబడ్డ ఒక పాపను చూస్తూ, నా గదిలో రాత్రి నుండి పగలుదాక, కన్నీటితో చావును తడుపుతూ గడిపాను. అకస్మికంగా దూరం నుండి- బూతు పాటలు ద్రాక్ష తోటలో ఇరవయ్ మంది వధువులపై, కొరడా జులిపిస్తున్న, ఒక నల్లటి సమూహం. మెల్లగా ప్రానాలు వదులుతున్న ఆ గదిలోని పాపని గడ్డి పరుపుపై వొదిలేసి, బాల్కని కిటికీ దెగ్గరకు వెల్లాను అప్పటికే ఆ సమూహం చెట్ల గుబురుగా, అయ్యింది. వాల్లలొని ఒక మానవ మౄగం అరిచాడు- “నువ్వు నాత్యం చేసి తీరాల్సిందే మా డప్పుల శబ్దానికి నువ్వు ఆడాల్సిందే”నని. ఆ స్త్రీల చర్మం పై కొరడాలతో కొడ్తారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఆ వధువులందరూ సర్కిల్-డాన్స్ చెయ్యాలంటారు. అప్పుడు, నాకు అసూయ పుట్టింది, ఇంట్లో చనిపొతున్న ఆ పాపను చూసి, తను, చిన్నగా గొనిగినట్టూ ప్రపంచాన్ని తిట్టేసి తన ఆత్మని నక్షత్రాలకు ఇచ్చేసింది. నేను మాత్రం ఏమి చేయలేక నిలుచుండిపొయాను. “ఆడు” అని అర్చారు వాల్లు, “చచ్చే దాక ఆడు,జాతిలేని దానా మాకోసం నవ్వుతూ ఆడు, నీ స్తనాలు ఎగిరేలా! మిమ్మల్ని ఎవరూ పట్తించుకోరు ఇప్పుడు, నగ్నమైన బానిసలు మీరు మేమందరం ఎదురుచూస్తున్నాం, అందుకే ఆడండి, ఫక్కింగ్ స్లట్స్. ఆ ఇరవై అందమైన వధువులూ నేలకొరిగారు. “లెయ్యండి,” ఆ మంద అర్చింది వారి కత్తులతో భయపెడుతూ. అప్పుడు ఎవడో కిరొసిన్ తెచ్చాడు. మానవ ధర్మమా, ఇదిగో నీ మొహం పై నెను ఉమ్మేస్తున్నను. ఆ వధువులపై కిరొసిన్ పోసారు. “ఆడండి” వాల్లు గెట్టిగా అరిచారు అరేబియలో ఏ మూల వెతికినా ఇంత సువాసన దొరకదు” అంటూ ఒక కాగడాతో వారి నగ్న దేహాలను అంటించారు. ఆ కాలుతున్న దేహాలు పొర్లి పొర్లి చావులొకి జారిపడ్డాయి. వెంటనే కిటికీని మూసెసి ఇంట్లో చనిపోయిన పాప దెగ్గరకు వెల్లి అడిగాను- “నా కల్లని నేను ఎలా తవ్వాలి ఇప్పుడు ?” అని ---

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xLS0DL

Posted by Katta

Ramasastry Venkata Sankisa కవిత



by Ramasastry Venkata Sankisa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1g0QZ

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||గాయం|| ఎంత కాలం కలసున్నా కొన్ని క్షణాలు మనవి కావు, దేన్నీ ఆపలేని సంజాయిషీలు అక్కరకు రావు. ఆడుకున్న ఆటలు, ఏరుకున్న కాంతులు చీకటైన దారులు, విచ్చుకున్న మల్లెలై జ్ఞాపకాలై రమిస్తాయి,. గాయమై స్రవిస్తాయి. ఏ కాలాలకు ఇక్కడ ఏకాంతం సత్యం కాదు. కళ్లముందే నువ్వు కొట్టుకుపోయాక, చివరి గమ్యమెప్పుడూ కల్లోలమే,. ఇంకొంత సందిగ్థమే. కావాలో, వద్దో తెల్సుకోవడమే జీవితం అనకు. ( నందకిషోర్ కవితకు స్వేచ్ఛానుసరణ,. 11/6/14 చాలా కాలం తరువాత నాలుగు అక్షరాలు రాసేందుకు స్ఫూర్తినిచ్చిన నందుకి కృతజ్ఞతలతో)

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2VzRH

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

కొండల కొలిమిలో కాలుతున్న ఇనుపగోళం సూర్యుడు 12.6.2014

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfjYT1

Posted by Katta

Rajeswararao Konda కవిత

తుంటరి చూపులతో నన్ను పలకరిస్తావు - నా మదిలో చేరి గోల చేస్తావు /12.06.14/ @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l1ZVIW

Posted by Katta

Chi Chi కవిత

_పెళ్లి _ అంతవరకూ లేని స్పృహ!! పక్కనే ఉండే జీవితం ఒక మనిషిలో ఒక మనిషితో.. ప్రపంచానికో సాక్ష్యంగా ఇద్దరినీ బందించే విడుదల!! ఒకరికి రెండు మనసులవుతాయ్ అవ్వాలి!! అదో వీడ్కోలు ఎన్నో విప్పలేని ముడులకి.. అదో స్తిరత్వం ఎన్నో గోచరించని గమ్యాలకి.. అదో సమాదానం ఎన్నో సందేహాల మర్మానికి.. అదో అర్థం ఎన్నో అనర్థాల ప్రశ్నలకి!! హక్కు రెండు దేహాలకి .. దిక్కు మనిషి మానానికి.. జోకు పెటాకులకి.. సాకు విడాకులకి!!____(11/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkN85W

Posted by Katta