పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sasi Bala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sasi Bala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మే 2014, శనివారం

Sasi Bala కవిత

జీవి విలువ ......... శశిబాల .................................... తనువులోన జీవుడున్నంత వరకేర తనువ విలువ తనువున్న మనిషి విలువ రవ్వంత ధూళైన సోకనివ్వని మేను కడలోన మట్టిలో కలిసెను చూడరా ఎన్ని రాజ్యాలైన ఏలేటి మహారాజు ఆరడుగులే చాలు చాలంటు పండేరా ఇది మాయ జగమురా పెనుమాయ లోకమురా పదవుల్లో చదువుల్లో పల్లకెక్కిన బ్రతుకు ఆరిపోయిన పిదప పాడే చేరును కదర తరగనీ భాగ్యాల తెలియాడిన కూడ కొనలేవురా వుసురు .....తేలేవురా ప్రాణం 31 may 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEXpK6

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Sasi Bala కవిత

పవిత్రత ..........శశిబాల ---------------------------------- ప్రత్యూష కాలం లో భూపాల రాగం లా మనసుని తట్టి లేపేది ఆప్యాయత దీనికి ఎన్నెన్ని పేర్లో ......... మనసు మనసు కలుపుకొని .... మాటా మాటా కలుపుకొని .... ఎద నిర్మలంగా ... పరమ పవిత్రం గా సాగె ప్రేమలు....అదే అభిమానాలు ...ఆప్యాయతలు .. కళ్ళున్న గుడ్డి మనుషులకు అర్థం కావు అంతే మరి ...మనం ఏ దృష్టి తొ వుంటే అదే మనకు ఇతరులలో కనబడుతుంది ప్రతి మనిషి ..ఎదుటి మనిషిని విమర్శించే ముందు ముందుగా తనను తాను ప్రశ్నించుకోవాలి ఎందుకు ....అని .ఆ ప్రశ్నకు బదులుంటే ఇక ఏ ప్రశ్నలూ రావు యుక్త వయసులో వచ్చే ప్రేమ పొంగే పాల వంటిది కోరిక తీరగానే అణగారిపోతుంది వైఫల్యాలకు దారి తీస్తుంది కాని పరిణతి చెందిన ప్రేమలో ...స్వచ్చత వుంతుంది ...ధర్మం వుంటుంది అలా కానిది ప్రేమే కాదు వుదయకాలాన విరిసిన పుష్పాల పరిమళాల తాజాదనం తొ కలిసినది స్వచ్చమైన ప్రేమ నాకై నీవు నీకై నేను ..అనిపించేది ప్రేమ పచ్చటి ప్రకృతి పై చిలికిన మంచు పుష్పాల వలె కల్మషం అంటనిది ప్రేమ ఈ ప్రేమకు ఎవరు పేరు పెట్టినా అది వారి మనో భావాన్ని ప్రతిఫలిస్తుంది 18 MAY 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sFMBIZ

Posted by Katta

17, మే 2014, శనివారం

Sasi Bala కవిత

గడ్డిపువ్వు ఆర్తనాదం ..................శశిబాల ------------------------------------------------- గల గల పారే నీ జీవన స్రవంతి అలలపై తేలియాడిన గడ్డి పువ్వును నది వురవడికి కొట్టుకు పోతున్న నన్ను నీ చేతిలోకి తీసుకొని ...ఆప్యాయంగా స్పృశించావు .. ప్రేమ మీరా తడిమి నీ ఆలంబనను వ్యక్తపరిచావు లేని పరిమళాన్ని అద్ది ..కొత్త ఆశలు సృష్టించావు అలసిన మనసుతో నీ దరి చేరి సేదదీరాను తడిసిన నా రెక్కలు ఆర్చుకున్నాను కానీ ..... రెక్కలు ఆరగానే చిరుగాలికి ఎగిరిపోయాను నీకు దూరమయ్యాను . తిరిగి నిన్నందుకొనే క్షణం కోసం ఎగురుతున్నాను అవిశ్రాంతం గా గాలిలో తేలుతూ అలా ......అలా .............అలా 17 MAY 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sCZDXD

Posted by Katta

3, మే 2014, శనివారం

Sasi Bala కవిత

''కృష్ణా తరంగాలు '' లో నన్ను విజేతగా నిల్పిన నా కవిత ...........శశిబాల ------------------------------------------------------------------------------- మనసు శరీరం అలసి నిదురించినప్పుడు మన ఆత్మ నిదురలోచూస్తుంది .. మునుపెరుగని లోకాలెన్నో ... వింత వింత అనుభూతులు ఎన్నో ఎన్నడు చూడని తావులు ..ఎప్పుడు చూడని మనుషులు వింత వింత అనుభవాలు ...విచిత్ర సంబంధాలు భువి దిగిన స్వర్గాలు ...దరిచేరే నూతన వ్యక్తులు ఎవరో ...ఏమో ...ఎక్కడో ..ఎప్పుడో ఏమిటీ పరిస్థితి ....భ్రమలో వుండే స్థితి ఎవరు వారు ..?ఎచటి వారు ..?ఎక్కడవీ ఆ ప్రాంతాలు ...ఎప్పటివీ ఆ పరిస్థితులు ఏడిపిస్తాయి ..నవ్విస్తాయి ...భయపెడతాయి ...ఓదారుస్తాయి ఒక్కొక్కసారి నిజమేమో అని భ్రమ కాదు కలేగా అన్న వాస్తవం ఏదేదో వింత భావనలు ...ఎదలోతుల తెలియని ప్రకంపనలు ఏమిటీ విచిత్రం ..... గత జన్మపు స్మృతి విలాసమా ఈడేరని కోర్కెల సమహారమా . వాస్తవం కాని స్వప్నం ...స్వప్నమని తెలిపే నిజం ... 3 MAY 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rZrin4

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

Sasi Bala కవిత

స్వప్నం ...వింత లోకం ..........శశిబాల ---------------------------------------------------- మనసు శరీరం అలసి నిదురించినప్పుడు మన ఆత్మ నిదురలోచూస్తుంది .. మునుపెరుగని లోకాలెన్నో ... వింత వింత అనుభూతులు ఎన్నో ఎన్నడు చూడని తావులు .. ఎప్పుడు చూడని మనుషులు వింత వింత అనుభవాలు ... విచిత్ర సంబంధాలు భువి దిగిన స్వర్గాలు ... దరిచేరే నూతన వ్యక్తులు ఎవరో ...ఏమో ...ఎక్కడో ..ఎప్పుడో ఏమిటీ పరిస్థితి ....భ్రమలో వుండే స్థితి ఎవరు వారు ..? ఎచటి వారు ..? ఎక్కడవీ ఆ ప్రాంతాలు ... ఎప్పటివీ ఆ పరిస్థితులు ... ఏడిపిస్తాయి ..నవ్విస్తాయి ... భయపెడతాయి ...ఓదారుస్తాయి ఒక్కొక్కసారి నిజమేమో అని భ్రమ కాదు కలేగా అన్న వాస్తవం పల్లకిలో వూరేగినట్లు .. వరదల్లో మునిగినట్లు .. ఏదేదో వింత భావనలు ... ఎదలోతుల తెలియని ప్రకంపనలు ఏమిటీ విచిత్రం ..... గత జన్మపు స్మృతి విలాసమా ఈడేరని కోర్కెల సమహారమా ...ఏమో ఇది ఏమో వాస్తవం కాని స్వప్నం ... స్వప్నమని తెలిపే నిజం .. . 28APRIL14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isF8qx

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sasi Bala కవిత

గమ్యం ..వైపు పయనం .......శశిబాల ----------------------------------------------- సాగిపోవు జీవితాలు ...ఏ దరికైనా వీదిపోవు బంధనాలు.... ఎన్నటికైనా బ్రతుకు మాయ సమరంలో బందీలై ఉన్నాము గాలిబుడగ జీవితమని తెలియలేకున్నాము ఎవరురా నీ వారు .. ఎవరురా నీ తోడు .. పుట్టినపుడు కూడ రారు పోవునపుడు వెంట పోరు నడికడలిని నావలా .. దిక్కేదో దరి ఏదో తెలియని అగమ్య స్థితిలో దైవ బలమే తోడుగ సంకల్పమే ఊపిరిగ సాగిపో మానవుడా పరమాత్మను చేరుకో 25APRIL14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcnKeQ

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Sasi Bala కవిత

''మా ఆసరా చిత్ర సౌరభాలు'' లో విజేతగా నిలిపిన నా కవిత అన్న ..మనసు ......శశిబాల (23 ఏప్రిల్ 14 ) ------------------------------------ అమ్మా నాన్నా ఎవరూ లేని అనాథలం... దిక్కూ మొక్కూ లేని విధి వంచితులం విధి ఆడిన వింత ఆటలో గెలుపెరుగని పావులం ..దీనమైన శిశువులం నీతో పుట్టిన అన్నయ్యను నేనే ...నిను కాపాడే కన్నయ్యను నేనే చిన్నదైనా ,పెద్దదైనా నీతిగా సంపాందించి నీ కడుపు నింపుతా కన్నవారు మనలను వదిలి అనంతలోకాలకు వెళ్ళినా ..నీకు తోడు నీడగా నన్నుంచారు నీ కంట నీరు రానీనమ్మా ....నా కంటి పాపవు లేమ్మా గుండెలపై నిను మోస్తాను ...గుండె నిండ నిను దాస్తాను నీ దారిని పువ్వులు పరవకున్నా ..కరకు ముళ్ళు తాకనీయను అమ్మనై నిను లాలిస్తా ...నాన్ననై నిను పోషిస్తా సమాజపు రక్కసి కోరలనుండి అనుక్షణం నిన్ను కాపాడుతా

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jKlAAv

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Sasi Bala కవిత

ఒక చిన్ని ఓదార్పు !!!.....................శశిబాల ------------------------------------------------------ నిరంతర నీ ఆరాధనలో అలిసిపోయాను ...... సేదదీరడానికి నీ గుండె అరువీయవూ.... అనంతమైన నీ ప్రేమ వారాశి లో కొట్టుకుపోతున్నా ఒక చిన్ని ఆధారం ....కలకాలం నీతో వుంటాననే చిన్ని మాట అది చాలదా నన్ను కడ చేర్చడానికి ఎందుకీ తపన...ఎందుకీ ఆరాటం ... అలుపెరుగని జీవన పోరాటం ... చిన్ని జీవితం ... అంతకన్నా చిన్ని హృదయం .. వున్నంతలో ఎందుకు ప్రేమను పంచలేరు .. ఆప్యాయతను అందించలేరు ... మనిషిని పీడిస్తే ఏమి వస్తుంది .. ఆ మనసుని పంచుకుంటే వస్తుంది నిజమైన శాంతి ఒక చిన్ని చిరునవ్వు చాలు ... నీ బాధను దూరం చేయడానికి ఒక చిన్ని ఓదార్పు చాలు ... భారమైన గుండెను తేలిక జేయడానికి ఒక చిన్ని చేయూత చాలు .. కష్టాలలో వాటిని తట్టుకొనే ధైర్యం ఇవ్వడానికి ఇవి ఇవ్వడానికి కూడా ఎందుకొ ఆ సంశయం మనిషిగా ఉండటానికి కూడా పనికిమాలిన సందేహం...20 ఏప్రిల్ 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gXhiXQ

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Sasi Bala కవిత

ప్రతీక్ష .....................................శశిబాల (19 april 14 ) ...................................................... నీకై ఎదురుచూపులో మదిలోని ఆరాటం అలజడులు రేపుతుంటే కనురెప్పల మాటున దాగిన భావాలు వెలికిరానంటుంటే మనసు మాటుభావాలు పెదవి దాటి రానంటే నీతో గడిపిన మధుర క్షణాల్ని నెమరువేసుకుంటూ మౌనంగా వున్నా మనసులోని భావం కడలిలా హోరెత్తుతుంటే పైకి సముద్రంలా గంభీరంగా వున్నా ఎదలోతుల్లో ఎన్నెన్ని భావ పోరాటాలో రాబోయే జీవన సమరానికి శంఖం ఊదుతూ అలలై పొంగే కన్నీటిని అణచుకొంటూ ఆశల ఊపిరిపోసుకొంటూ ప్రతీక్షిస్తున్నా నీ రాకకోసం ...మన కలయికకోసం

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iyy7c9

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Sasi Bala కవిత

కరుణ లేని కాలం !!!!.....శశిబాల (16 ఏప్రిల్ 14 ) ------------------------------------------------------- ఎందుకు కాలమా ! నీకింత నిర్దయ నా నేస్తానితో వున్నప్పుడు మాత్రం ఎందుకంత పరుగులు తీస్తావు అతనికై నిరీక్షణలో మాత్రం క్షణమొక యుగం లా అనిపిస్తావు నా వళ్ళంతా కళ్ళు చేసుకొని నా నేస్తానికై నేను చూసే ఎదురు చూపు నీకు ఎగతాళిగా అనిపిస్తున్నదా నీ గర్భం లోకి ... ఎన్నో రాజ్యాలు ,ఎన్నో శకాలు , ఎందరో రాజులు , మహారాజులు, సామాన్యులు జాతి బేధం ,మతం బేధం ,కులం బేధం అంతస్తుల బేధమన్నది లేకుండా కలిపేసుకున్నావు వారి కష్టనష్టాలను , దాచుకున్నావు గుండెలోవారి సుఖదుఃఖాలను ఏరీ వారేరీ ? ఏమై పోయాయి ? వారి హోదాలు ..వైభవాలు పేదల పట్ల వారు చూపిన నిర్లక్ష్యపు నిరసనలు ..కానరావే మనిషి ఎంత ఎదిగినా ..నీ కడుపులో ఒదిగి ఉండాల్సిందే అని నిరూపించావు ...

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzy4so

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Sasi Bala కవిత

'' మమతల లోగిలి '' ........శశిబాల --------------------------------------------- (కృష్ణా తరంగాలు లో నన్ను విజేతగా నిల్పిన నా కవిత ) అనుబంధాలు ఆత్మీయతలు ... దేవుడు వే( చే )సిన మమతల మణి హారాలు ఏవీ... ఎక్కడివీ ...ఏమై పోయాయి ఆ ఆప్యాయతానుబందాలు ? ఎప్పుడు వుంటామో తెలియదు ...ఎప్పుడు పోతామో తెలియదు బుద్బుదమైన ఈ చిన్ని జీవితాన పొంగించుకోవలసిన మధుర ప్రేమలు పండుగంటే తెలియని ....వెన్నెలంటే చిత్రమని తలచే బూటకపు బ్రతుకులు అతికించిన చిరునవ్వులు ..పనికి రాని ప్లాస్టిక్ బంధాలు అన్నదమ్ముల ప్రేమ ...ఆలు బిడ్డల మమత .. తల్లిదండ్రుల కరుణ ...బంధుమిత్రుల స్మరణ ... ఏ లోటూ లేని అనురాగాల కోవెలలు .. అనుబంధాల మల్లెల పొదరిళ్ళు ... ఇదే గదా భారతీయత ..ఇదే కదా సౌశీల్యత ... వసుధైక కుటుంబానికి .ఇదే కదా ముచ్చటైన ప్రతీక ఏమిస్తే కలుగుతుంది మహి (ది )లో ఇంతటి అనుభూతి ఏమిస్తే ఏర్పడుతుంది ఋణానుబంధాల వారధి (15 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGcTdH

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

Sasi Bala కవిత

మీకు తెలుసా ! మిత్రులారా !!!!! .................శశిబాల -------------------------------------------------------- భూగోళమంటే శివ స్వరూపం .అగ్ని పర్వతాలే శివుని మూడవ కన్ను . మన్మథుడంటే ప్రకృతి శోభ .అతను చాలా అందగాడు .అతని అస్త్రాలు మరులుగొలిపే మల్లి,జాజీ మొగ్గలు ...అతను వచ్చే ముందు వసంతుడు వస్తాడు.అంటే వసంత శోభ అన్నమాట .ఆ కాలం లో వుందే తీయని చెరుకుగడే ..అతని విల్లు ...లేలేత చిగుళ్ళు తింటూ కొమ్మల్లో ఊయలలూగే చిలుకే మన్మథుని వాహనం ..ఇదీ మన్మథ రూపం ...శివుడు కళ్ళు తెరవగానే.(శివుని మూడో కన్ను ఐన అగ్ని పర్వతం.) ప్రకృతి నాశనం అవుతుంది ..అదే మన్మథ దహనం శశిబాల(12 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEXdJK

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sasi Bala కవిత

మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు .......sasibala చేల గట్లపై పరుగులు తీస్తూ లేగ దూడతో పోటీ పడిన క్షణాలు .. కోడె దూడతో పోటీగా గోమాత పొదుగును చేరి తాగిన గుమ్మపాల కమ్మని రుచులు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు పండు వెన్నెల్లో ఒకే పళ్ళెం లో వెన్న ముద్దలూ ,పాల బువ్వలూతింటూ బామ్మ చెప్పేటి కమ్మని కథలను అన్నదమ్ములూ అక్క చెల్లెళ్ళు అందరు కలిసీ ఆస్వాదించిన ,ఆరగించిన ... ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా పండుగంటే చవులు ఊరించు నవకాయ పిండి వంటలతో పంచ భక్ష్య పరమాన్న విందులు లొట్ట లేసుకుని లాగించిన ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా వెన్న చిలికే మహారాణి.. అమ్మ కడకొంగున దూరి నేతి బూరేలకు,చిట్టి గారెలకు మారాం చేసిన .. మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆరు బైలలో ..పచ్చని చెట్ల నీడలో మదతమంచాల పాన్పులపై బడి , నింగి వీధిలో ఊరేగే తారా చంద్రుల ఊసులెన్నో మరి ఊహలెన్నో కథలు కథలుగా మననం చేసిన మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా నడవను గూడా ఖాళీ లేని వింత జగతిలో పరుగుల బరిలో యంత్రాల లోకం లో ..డబ్బు మహా ప్రపంచంలో ప్రేమలు పోయి ..మమతలు పోయి ఆప్యాయతలకు సున్నం వేసి కనబడని మాయలో ..కొట్టుకుపోతూ ,కూరుకు పోతూ అమ్మనాన్న బంధాలన్నది లేక అన్నదమ్ములూ ,అక్క చెల్లెళ్ళ మమకారాలు కరువైన నరకం లో ఊపిరి(పోసే ???) తీసే విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే శ్వాస నిశ్వాసల నడుమ దైవ నిర్ణయాల కతీతంగా .. మనిషి సృష్టించు మారణకాండల నడుమ బ్రతుకుతున్నామో ...చస్తున్నామో అర్థం కాని త్రిశంకు స్వర్గంలో ఉంటున్న ..మనుగడ సాగిస్తున్న మనం వున్నట్లా ..లేనట్లా మీరే చెప్పండి ..తీర్పును మీరే ఇవ్వండి గడచిన కాలం తిరిగి రాదు .. ఇక మానవ జీవితాన రావేనాటికీ ఆ మధుర క్షణాలు (11 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gfxJer

Posted by Katta

Sasi Bala కవిత

యామినీ పూర్ణ తిలక సౌందర్య గరిమ ..............శశిబాల (11 ఏప్రిల్ 14 ) ------------------------------------------------------- ( మా నాన్నగారు శ్రీ మానారావు విరచిత '' యామిని '' లోని ఒక మహత్తరమైన పద్యం ఇది .ఇది గేయ గీతం గా కూడా మీ ముందు ఉంచుతున్నా ) శరదిందు బింబమో ! పరిఫుల్ల పద్మమో ! ముకురంపు బిళ్ళయో ! ముద్దు మొగమో ! కంజదళంబులో ! గండు మీనంబులో ! సూనాస్త్రు శరములో ! సోగకనులో ! చక్రవాకంబులో ! స్వర్ణ కుంభంబులో ! కుసుమ గుచ్చంబులో ! కుచయుగంబొ ! క్రొమ్మించు రేకయో ! కొనబు మేల్తీవయో ! తరళ నక్షత్రమో ! తరుణి రతియొ ! విశ్వవిభ్రమ మొనరింప వేడ్క గలిగి తనదు సృష్టి నైపుణ్యంబు ఘనత దెలియ బ్రహ్మ రచియించెనేమొ యీ వర శుభాంగి గాక యే రీతి గలిగే నీ కలికి జగతి http://ift.tt/1kaZae2

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaZae2

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Sasi Bala కవిత

మట్టి (గట్టి )మనుషులు : ----------------------------------------- మట్టి మనుషుల బురద బ్రతుకులు ఎండిన హృదయానికి (మట్టికి ) నీటిని (కన్నీటిని ) జోడించి హృద్యమైన రూపాలను , వండుకునే కుండలను మలిచీ ,నిప్పుల కాచీ అందించే మానవుడా !!!! అలుపెరుగని శ్రామికుడా !!!! ఎన్ని చేస్తే తీరుతుంది నీవు పడే దారిద్ర్యం ఎంత నీరు (కన్నీరు )నింపితే నిండుతుంది మనం (మనసు ) పెళ్లి నుండి చావు దాక లేదు ఏ కార్యము నీ కుండ లేక చితికిన ఆశలు కొలిమిలో కాలుస్తూ ..బూడిద చేస్తూ నీ ఊహలు ఇటుకల నడుమ పూడుస్తూ సమాథి చేస్తూ సాగిపోవు బాటసారీ ..... లేదూ నీకిక వేరు దారి ..... శశిబాల (10 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enbKr0

Posted by Katta

Sasi Bala కవిత

మట్టి (గట్టి )మనుషులు : ----------------------------------------- మట్టి మనుషుల బురద బ్రతుకులు ఎండిన హృదయానికి (మట్టికి ) నీటిని (కన్నీటిని ) జోడించి హృద్యమైన రూపాలను , వండుకునే కుండలను మలిచీ ,నిప్పుల కాచీ అందించే మానవుడా !!!! అలుపెరుగని శ్రామికుడా !!!! ఎన్ని చేస్తే తీరుతుంది నీవు పడే దారిద్ర్యం ఎంత నీరు (కన్నీరు )నింపితే నిండుతుంది మనం (మనసు ) పెళ్లి నుండి చావు దాక లేదు ఏ కార్యము నీ కుండ లేక చితికిన ఆశలు కొలిమిలో కాలుస్తూ ..బూడిద చేస్తూ నీ ఊహలు ఇటుకల నడుమ పూడుస్తూ సమాథి చేస్తూ సాగిపోవు బాటసారీ ..... లేదూ నీకిక వేరు దారి ..... శశిబాల (10 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enbI2r

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Sasi Bala కవిత

వైకల్యం మనిషికా ...మనసుకా .......శశిబాల అంగ వైకల్యాన్ని లెఖ్ఖ చేయక ,ఆత్మస్థైర్యం తో మనోబలం తో ,కాళ్ళే కరములుగా మలచుకొని చిత్రాన్ని విచిత్రం గా చిత్రీకరించి ... కాళ్ళు చేతులున్న వారికంటే నీవే మాత్రం తీసిపోవని నిరూపించిన పాపా ! ఎవరికమ్మా అంగ వైకల్యం చేతులుండీ పని చేయని సోమరిపోతులు కన్నా అప్పనం గా వచ్చే ఆస్తులకై అర్రులు చాచే రాబందుల కన్నా దేవుడిచ్చిన అంగ భాగ్యాన్ని వృధా చేసి ... అడుక్కు తినే నిష్ట దరిద్రులకన్నా ఎవరికన్న నీవు అల్పం నీ స్ఫూర్తి అనల్పం అసమానం నీ స్థైర్యం సంకల్పమే నీకు బలం .... నిన్ను చూసి గేలి చేయు సమాజానికి సవాలుగ ... నీ దీక్షను సాగించు ....నీ వైకల్యాన్ని అధిగమించు కళామతల్లి నుదుటన నీ పట్టుదల కుంకుమను దిద్దు ..... (6 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfiY2o

Posted by Katta

Sasi Bala కవిత

పుట్టినదాదిగా మట్టిని నమ్మి ,రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకున కండలు పిండి చేసి ,నెత్తురు చెమటను చేసి .. పట్టెడు మెతుకులకోసం ,పొట్ట నింపు దారికోసం పండిన పంటను కావడి తట్టలో భుజమున మోసి ఎండనకా వాననకా ..పగలు రేయన్నది లేక దళారీల మోసాలకు రక్తం మట్టిన పడితే నష్టపడుతుంటే కాలికి నెత్తికి ఏదీ రక్షణ లేక .. ముళ్ళ దారి ,అడవి దారి ..గతుకుల రహదారుల్లో గమ్యం లేని రైతన్నా ..నీ జీవన గమ్యం ఏదన్నా సూరీడుని నీ తండ్రిగ ..అమ్మ ధరణి నీ తల్లిగ రెక్కలతో ,ఎండిన డొక్కలతో పలుగు పూని పార పూని ఆశను బాసట బూని పట్టణాల దిక్కు సాగి బతుకు బండి నడిపించే బహుదూరపు బాటసారి కనబడెనా నీకు దారి శశిబాల (6 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lBYJJu

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sasi Bala కవిత

నిశ్శబ్ద గీతం ......................శశిబాల (3 ఏప్రిల్ ) ------------------------------------- నిశ్శబ్దం రాజ్యమేలే వేళ ........ పగిలిపోయిన గుండెను అతికించుకుంటూ నిదురించే జ్ఞాపకాలను హత్య చేస్తూ కన్నీటి కుండలను కంటి కావడిలో మోస్తూ అశ్రు ధారలతో ఎండిన బుగ్గలను నీ పలకరింపుల పన్నీటితో కడగాలని ప్రయత్నిస్తూ నీకై ఎదురు చూసే కళ్ళలో ఆశల గులాబీలు పూయిస్తూ తీగలు లేని మానస వీణకు నా హృదయ తంత్రులనేసి మీటుతూ చూస్తున్నా ...ఎదురు చూస్తున్నా వెన్నెల కోసం చకోరిలా ఎడారిలో పాడే కోయిలలా ఆశ చావక నీ కోసం రాని వసంతం కోసం మొండిగా ..మొండిగా ఎదురు చూస్తున్నా నిదుర కాస్తున్నా

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3xPWH

Posted by Katta

Sasi Bala కవిత

వసంత హొయలు .......................శశిబాల ----------------------------------------------- వర్ణ వర్ణ శోభితమైన కుంకుమ వన్నెలతో వసంత లక్ష్మి బాలభానుని ఎర్రని కాంతిని పెదవులకు అద్దుకొని ఆధరాలు పూపరాగ మధువులనుకొని తుమ్మెదలు వాలుతుంటే తెమ్మెరలతో వాటిని తరమాలని ప్రయత్నిస్తున్నది కోయిలలను గారాం చేస్తే అవి గునగున లాడుతూ ముద్దుగా కూని రాగాలు తీస్తున్నాయి చిగురాకు ఊయలలూగే చిలుకలు చేసే శ్రావ్యమైన మేజువాణీలు ఎదలో మధుర భావనలు రేకెత్తిస్తున్నాయి కళకళలాడే కలువ కన్నెలు వసంత లక్ష్మి పాదాలకు పారాణి శోభలందిస్తున్నాయి చిలుకలు కొరికిన అరమగ్గిన జామపండ్లు తళుకులీనే ఆమె బుగ్గలను గుర్తు చేస్తూ మదిలో అలజడి సృష్టిస్తున్నాయి కోకిలలు ఆలపించే రాగాలు మదిలో మోహన గీతాలై పులకింతల గమకాలై పూలతలను కదలించి జలజలా నేలకు విరులను రాలుస్తున్నది అందాల రతి రాణి ముత్యాల పలువరుస వసంత కన్య కంఠసీమలో ముత్యాల సరమై ప్రకాశిస్తున్నది మన్మథుని విలంబానికి (ఆలస్యానికి ) అలిగిన ఆమని మోము కెంజాయ వర్ణాలను సంతరించుకొని వింత కాంతులను ప్రతిఫలిస్తున్నది ఆహా ఎంత మనోహర మీ వసంత శోభ (4 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OgvkbL

Posted by Katta