కవిత్వంతో ఏడడుగులు 30 . అందరికీ చిన్నతనం ఎందుకు అంతనచ్చుతుందంటే, అప్పుడు మనం మనంగానే ఉండి, ఏ ముసుగులూ మనం ధరించి ఉండం గనక. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు, మనం బడికెళ్ళి నేర్చుకునేది అంతా గతం గురించిన సమాచారమే తప్ప, భవిష్యత్తుకి పనికొచ్చేది ఏదీ ఉండదు. అందుకని మనకు తెలియకుండానే సందర్భానికి తగ్గ ముఖం ... ఎడ్వర్డ్ డి బోనో చెప్పిన 6 Thinking Hats లాంటివి (ఆయన లక్ష్యం వేరనుకొండి. సామ్యం అంకెలవరకే)... ధరించడం నేర్చుకుంటాం. మనసహజ ప్రకృతికి భిన్నంగా ఉంటుంది కనుకనే మన హిపోక్రిసీ (ఆత్మవంచన) బాగా తెలుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఈ ముఖాలుధరించడం అలవాటైపోయి, అదే మన సహజప్రవృత్తి అయిపోతుంది. దాలిగుంటలో కుక్క కూర్చుని జీవితాన్ని అవలోడనం చేసుకుంటూ, ఇంకెప్పుడూ తప్పుడుపని చేసి దెబ్బలు తినకూడదని నిర్ణయంతీసుకుని క్షణంలో మరిచిపోయినట్టు, రాత్రి ఎప్పుడో ఏకాంతంలో మనజీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు, మనం కాసేపు బాధపడినా, ఉదయం లేవగానే మళ్ళీ యధాప్రకారం మనజీవితంతో, మన ముఖాలెరువుతెచ్చుకోవడంతో రాజీ పడిపోతుంటాం. మన విలువలుకూడా కఠినమైన పరీక్ష ఎదురుకానంతవరకు నిలకడగానే ఉంటాయి. నిజమైన పరీక్షకి నిలబడి విలువలు పదిలంగా కాపాడుకునేది ఏ కొద్దిమందో. సింహావలోకనాన్ని ఒక సాధనంగా తీసుకుని చేస్తున్నపని తప్పని పరోక్షంగా విమర్శించడం ఒక సాహిత్య ప్రక్రియ. క్రిందటివారం గేబ్రియల్ ఒకారా చెప్పినంత సమర్థవంతంగా, ఫాతిమా అల్ మతార్ ఈ కవితలో చెప్పగలిగింది. . వదనం . ఓ నా వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాము! నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు విశాలమైన కన్నుల్లో అమాయకత్వాన్ని కూడా విడిచిపెట్టావు వదనమా! నీ వెనక దాక్కోడం ఎంత హాయిగా ఉంటుందో! నిన్ను నా వయసుని మోయనియ్యడం ఎంత తేలికగా ఉంటుందో! నా పిచ్చి పిచ్చి ఆలోచనల్నీ, ప్రతి సంతోషాన్నీ, ఆవులింతల్నీ, ప్రతి అసహ్యాన్నీ, నా నిరాశాలనీ, అయిష్టాల్నీ, అవమానపు నిట్టూర్పుల్నీ నువ్వు ప్రకటించేలా చేశాను. వదనమా! వయోభారాన్ని నీమీద మోపి, జీవితపు భయాల్నీ, అంతులేని కన్నీళ్ళనీ నీ మీద రుద్ది, నీకు ఎన్నో ఆకారాలూ, పేర్లూ, వ్యక్తిత్వాలూ ఆపాదించేను. ఇప్పుడు ఒకసారి ఫొటోలలోకి చూస్తుంటే, మరోసారి ఫొటోలలోకి తొంగి చూస్తుంటే నాకు అనిపిస్తోంది నీకు నిజంగా నవ్వాలని అనిపించనపుడు నిన్ను నేను నవ్వమని అనకుండా ఉండాల్సింది; నిన్ను చిరాకుపరిచే వెక్కిరింతల్ని నేను తుడిచి ఉండాల్సింది. చిట్లించిన నీ కనుబొమలు ఒకసారి అవధిలేని నీ అహంకారాన్ని నువ్వు మరిచిపోయేలా చేసాయి; నిష్కారణమైన ఆ కనుబొమల చిట్లింతల్ని విరమించుకో. నిన్ను కలిసిన ప్రతిసారీ, ప్రతిబింబంగా అనుకోకుండా తారసపడినపుడూ, లేదా, మరొకరి కనుపాపల్లోంచి నువ్వు నన్ను తేరిపారిచూసినపుడూ నాకు నిన్ను గుర్తుపట్టడానికి ఒకటి రెండు క్షణాలుపడుతుంది. నా ఆశలకీ, నీ యవ్వనపు కవోష్ణరుచి ఎన్నటికీ మారదనుకునే నా గాఢమైన అమాయకపు నమ్మకానికీ విరుద్ధంగా, నువ్వెంత మరిపోయేవు! వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాం! ఈ పెదాలకీ, ఈ నయనాలకీ మధ్యన నిర్విరామంగా మనం ఎన్ని కథలు చెప్పుకున్నామని! ఎన్ని మరువలేని ప్రేమలు! ఎన్ని క్షమించరాని అబద్ధాలు! వదనమా! నిజానికి నీకు ఇవన్నీ ఎలా చెప్పాలో మప్పింది నేనే ... నువ్వు తు. చ. తప్పకుండా అలాగే చెప్పావు. నేను నిన్ను కపటంగా నటించమని ఆదేశించినపుడు నాకు విధేయతతో, విశ్వాసంతో, నడుచుకున్నావు. . ఫాతిమా అల్ మతార్ సమకాలీన కువైటీ కవయిత్రి . Hear the poem in her voice here: http://ift.tt/1jl121e . Face . Face, how we’ve grown, you and I You’ve shed your baby cheeks, Abandoned your innocent wide eyes As I quickly learned to use you as my disguise Face, it was so comfortable hiding behind you So easy letting you carry my age I made you convey my every whim, my every pleasure My every loathing despise, my yawns, My despairs, my detesting belittling sighs, Face, I burdened you with years And etched upon you life’s fears, and endless tears And gave you shapes and names and persons Looking at the photos now Looking at the photos now I wish I didn’t make you smile when you didn’t really want to I wish I wiped off your resentful sneers Your knotted brows made you once forget your relentless vanity Loosen your unjustified frowns Every time I met you, in some unexpected reflection Or found you staring back at me through someone else’s eyes It always takes me a second or two to recognize you How you’ve changed against all of my wishes My naive solid belief that the warmth of your youth Would never really someday fade. Face, how we’ve grown you and I And in between these lips, and these eyes, We’ve told incessant stories Unforgettable loves unforgivable lies Face, I was the one who taught you how to say And indeed you have said And when I commanded you to dishonestly express You very faithfully, very obediently, said yes. . FATIMA AL MATAR, Contemporary Kuwaiti Poetess
by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVCaPn
Posted by
Katta