పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఒకరినొకరు కౌగిలించుకోవడం కాదు, ప్రేమంటే; అవన్నీ కేవలం ఆనందబంధాలు అవి అంతర్గతంగా ఇమిడివున్న పదార్ధభావాలు ప్రేమంటే నిజానికి ఒక అధిభౌతికసంబంధం నిజమైన ప్రేమ ఆవిష్కరింపబడాలంటే అంతరంగంలో అదైహిక భీజం నాటబడాలి మనసు లోలోపల ఆకాశపు వేర్లు పుట్టి తపస్వితపుటాలోచనల్లో జీవవృక్షమై పెరగాలి జీవితం ఎదిగి స్వర్గంతో పెనవేసుకోవాలి హృదయం మమతతో నిండిపోయి గుండె ఆగిపోయినా జీవించగలగాలి ప్రేమే జీవితమై ప్రేమే జ్ఞానమై ప్రేమే మోక్షమై జీవితం ఒక పరమమూలకమై నిలిచిపోవాలి 20Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8l3gj

Posted by Katta

Sriramoju Haragopal కవిత

తడిరాత మాటలకు భాష కొదువే ఎంత మాట్లాడినా గుండె గొంతుకలో కొట్లాడే మాటలల్లాడుతూనే వుంటయి భాషే అక్కరలేని ముక్తభాషణ కావాలి అపుడీ పలకరింతల కొరకు పలవరింతలుండవు చూపులతోనో, చేతులతోనో మాటలతోనో, ఇంత అన్నంతో కడుపునింపో, దుఃఖాన్ని దుఃఖంతో తుడిచో, బాధల బాటల్లో వెంట నడిచో భుజం మీద చేయేసో, గదువపట్టి బుదగరించో, ఒళ్ళో చేర్చి ఓదార్చో అది ఆత్మీయతాస్పర్శ-- అయితే చాలు కలలనౌకాభంగాలుండవు కలవరింతలుండవు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8l2bY

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbDjB4

Posted by Katta

Krishna Prasad కవిత

EMBEZZLE - EMBITTER అమ్మకాలూ కొనుగోళ్ళ అభివృద్ధి సంతలో కళ్ళుబయర్లుకమ్మి దేవులాడుకొంటూ కేస్ట్రేట్ చేసిన దిశమొలతో కంపెనీకెదురుగా నిలుచొని కాస్త వీర్యవృద్ధి చెయ్యమని అర్ధిస్తూ ఏడుస్తుంటాను . నా పుంసత్వం దొంగిలించిన మత్తులో మైమరచి నవ్వుతుంది వేడుకగా . శవాలు కాలుతున్న పెంపుడువనం ఎదురుగా బాసీపట్టువేసి నా ఒక్కొక్క అంగాన్నీ కరకరా నములుతుంటాను . అది జగన్మోహిని రూపెత్తి నెరజాణలా నవ్వుతూ అమృతభాండం బద్దలుకొడుతుంది వంచిన నా శిరస్సుమీద . నేపధ్యంలోంచి ఓ అసంబద్ధ గీతం . 27/10/2007.

by Krishna Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHK2S6

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || కల నిజమైనవేళ|| ============================= నా కళ్ళల్లో దోబూచులాడుతున్న స్వప్నాన్ని రాత్రంతా నిదుర లేకుండా కనుపాపల్లో బంధించాను నీ ప్రేమ కోసం ... ప్రతిరోజు కనురెప్పల సవ్వడిలో నిద్రలేపుతూ స్వప్నాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తున్నా నీ దరి కోసం ... నా కళ్ళల్లో నీ రూపం నిత్యం నాకు ప్రతి రూపమై అనుక్షణం ఊహల తుంపర్లతో తడిపేస్తుంది నీ వలపుల తలపుల కోసం ... నా రెటీనాలో దాగిన నీ రూపం నిత్యం నా కళ్ళముందే కదలాడుతుంది నా కన్నుల్లో ముత్యమై నీ వెలుగు కోసం ... వర్షించే కళ్ళు అందమైన భాష్పాలు విదులుస్తున్నాయి ఆనంద భాష్పాలై నీ స్పర్శ కోసం... నా కల నిజమైనవేళ ఆకాశం పందిరయ్యింది భూలోకం కళ్యాణ వేదికయ్యింది ఇద్దరం ఒక్కటయ్యాం నా కళ్ళల్లో నువ్వు... నీ కళ్ళల్లో నేను కనుపాపల్లో మనమిద్దరం !!! ================== మార్చి 20/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHK24x

Posted by Katta

Anil Dani కవిత

అనిల్ డ్యాని //రెండు సిద్ధాంతాలు// మబ్బు పట్టిన నింగి క్రింద రాలుతున్న చినుకులకి చిత్తడౌతున్న నేలకు మధ్య పక్క పక్కనే రెండు శరీరాలు కాదు కాదు ఒకరినొకరు ఎదుర్కున్న రెండు సిద్దాంతాలు ఎందుకంత ఆత్రుత కామ్రేడ్ కలిసేవెళదాం కాలానికి ఎదురెళ్ళిన మనం మరణానికి వెళ్ళలేమా? నీ వివేకం లేనితనాన్ని వీర మరణంతో పోల్చుకోకు నేను కామ్రేడ్ ను కాను,నీ సహచరుడ్ని అసలే కాదు నీ విప్లవాన్ని ఎదుర్కొని, ఎదురురొమ్ములో తూటా దింపగల వీర సైనికుడిని ఐనా ఎరుపు కొడవలికి ఇనుపసుత్తికి,తుపాకీ గొట్టానికి ఇప్పుడు మారకపు విలువల్లేవ్ చేతగాని తనంతో పాత పాటెందుకు పాడతావ్ పచ్చని ఆకులమధ్యన మా వెచ్చని నెత్తుటితో మీ నోరు పుక్కిలించడం వీరమా?విడ్డురమా? మా శవాలమీద చిల్లరకోసం, కళ్ళకు గంతలు చేతులు వెనక్కి కట్టి,మా ఒట్టి మొలపై పేలిన నీచచ్చు తూటా చప్పుడు ఇంకా మా చెవుల్లోనే ఉంది కౌంటర్ ఇచ్చే చేవలేక ఎంకౌంటర్ చేస్తావా జవానూ? నిజమా? ఐతే కోర్టు మెట్లెక్కని కోవర్టు ఖాతాలెన్ని? కళ్ళముందే కూలిన కల్వర్టులెన్ని? ఆబగా తింటున్న ఆఖరి అన్నం ముద్దలో నువ్వు కలిపిన విషమెంతా? తప్పొప్పుల తక్కెడేస్తే నీ తప్పులెన్ని , తప్పుకు పొవడాలెన్ని? ఐదారు లక్షల రివార్డ్ కోసం ఆయుధాన్ని అమ్ముకున్న నీ బేలతనమెంత నిబద్దతకి, జీతానికి సరితూకం చేయకు నేను పస్తు పడుకున్న రొజుల్లో నీకు మస్తు పైసలొస్తయి అయినా నీ నెలజీతం నాకొచ్చే ఒక్క లాల్సలాంతోసమానం చచ్చుబడుతున్న శరీరాలు చివరిమాటలకై శక్తి పోగేసుకుంటున్నాయి రాలుతున్న చినుకుల సాక్షిగా నెత్తురంటిన ఈ తడిసిన ఆకులు నా నెత్తురు పారిన సెలయేరు సాక్షిగా నా దేశంకోసంనేనెప్పుడైనా మరణిస్తాను నేనుసైతం నా దేశంకోసం నా ఆశయం కోసం అమరుడనౌతాను కాని నేను మళ్ళీ పుడతాను ఊపిరున్న చోటనే విప్లవముంటుంది ********************************************* ఓ నాల్రోజుల తర్వాత ఓ సిద్దాంతం గంధపు చెక్కల మధ్య వెచ్చగా తగలబడుతుంటే మరో సిద్దాంతం ఎర్రజెండా కప్పుకుని లాల్సలాం అందుకుంటుంది సిద్దాంతాలు ఓడిపోవు..........వాదించుకుంటాయ్అంతే మళ్ళీ కొన్నాళ్ళకి ఓ అడవిలో రెండు సిద్దాంతాలు ఎదురై పలకరించుకుంటున్నాయి... మళ్ళీ అడవంతా ఎర్రబడింది తేది : 20-03-2014

by Anil Dani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4qFH

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

-----కవిత్వం సహజ ఇంధనం...20.3.14. కవిత్వం కేవలం మాటలసందోహం కాదు మనసు నుంచి మనసుకు ప్రవహించే రస గంగా ప్రవాహం. కవిత్వం చదువుకున్న మెదళ్ళ ఛందోదర్పణమే కాదు చెమట చుక్కల సేదతీర్చే జానపద శీతపవనం .కవిత్వం ఊహాపోహల పోహళింపు కాదు నిజ జీవిత రథాన్ని నడిపించే సహజ ఇంధనం . కవిత్వం మనిషికి ప్రకృతి పెట్టిన అక్షర భిక్ష కావాలి అది నిరంతరం చరాచర జగద్రక్ష .

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4nK3

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ //రైనా బీతి జాయే ...!! ~~~~~~~~~~~~~~~~~~ ఎందుకొస్తారు ఎవరైనా .. ఆకాంక్షలని అదిమిపెట్టి, జీవితానికి స్తేపిల్ గా గడిపేస్తున్న, వ్యగ్ర మోహ ప్రపంచంలోకి , అనుభూతులని తాకట్టు పెట్టి , ఎంత సంతోషంగా ఉన్నామో అని , దుఃఖంగా మురుసుకునే ముసిరిన మనసుల్లోకి .. ఎందుకు రావాలి ఎవరైనా .. నీ జ్ఞాపకాల నీడల్లో సేదదీరుతూ.. అనుభూతుల్లో నాని , నాని చిరునవ్వుగా కన్నా మేలాంకలిక్ గా మారిన నీ దగ్గుత్తికని నువ్వంత ప్రేమిస్తున్నప్పుడు .. చోటులేని తనంతో ఉక్కిరిబిక్కిరి అవరా .. జ్ఞాపకాలు అవమేమో అని బెంగేట్టుకుంటున్న నీ ప్రస్తుత శకలాలు ..? ఎవరో ఆపే ఉంటారు.. కన్నీరు తోనో, నిస్సహాయత తోనో, కరుణ తోనో... ఇవేవీ కాకుండా ..విడిచిన బట్టల్లా మరచిపోయే మొహంతోనో.. స్వైరత్వం మరణం కన్నా మహాపాపమనే సాంప్రదాయవాదం తోనో.. విషయం ఏదన్నా .. ఆగటం ఖాయం.. నువ్వు రావన్న వార్త మాత్రమే నా వచనానికి వర్తమానం అన్నది కూడా నిశ్చయం .. జ్ఞాపకం కాలేని తెలివైన ప్రియతమా .. నేనిప్పుడు జ్ఞాపకాలు లేని మనిషిని.. విరహాన్ని విరజాజి మల్లే అనుభవించే అస్కలిత రాధను .. నీ ఆభద్రతని మోసే కుబ్జని కానందుకు.. మాసిన జ్ఞాపకాల మంగళ స్నానం చేసినంత సంతోషం .. నీ భవిష్యత్ భయాల అష్టావక్రాలు మోయనందుకు నా మనసు ఉల్లాస విశుద్ధం పంజరమే ఒక ప్రపంచం... చిన్ని పిట్టా.. ఎగరటమే స్వేచ్ఛ కాదు ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iH4nJU

Posted by Katta

Babu Koilada కవిత

//కొయిలాడ బాబు// రొట్టె ముక్క రోటీ కపడా ఔర్ మఖాన్ ఈ మూడూ చాలు మనిషి బ్రతకడానికి అని ఎవరో సూక్తులు చెపుతుంటే వినే రోజుల్లో వచ్చిన ఆలోచనల ప్రవాహం మనసు వీధుల్లో సంచరిస్తుంటే అడగకనే అడగమన్నాయి ఎన్నో ప్రశ్నలు నా అంతరంగపు పొరలు సాయీబాబాకి చపాతీని నైవేద్యంగా పెట్టి కోరికలు కోరుతూ చక్కంగా ఆఫీసుకు పోతూ మళ్ళీ దేని కోసం ఆ ప్రయాణం అని ఆలోచించే వేళ ఆ ఆసామికి నెలవారీ వచ్చే జీతం రాళ్ళతో పాటూ ఇంకేదో ఆశ మనసు చంపుకుని ఏదో ఉద్యోగం వచ్చేదాకా మార్కెటింగ్ చేస్తున్న ఆ సగటు ఎగ్జిక్యూటివ్ కి ప్రతి మధ్యాన్నం ఏ పరోటానో, చపాతీనో గతి రోజంతా బలాదూర్ తిరిగి ఏ అపరాత్రో హాస్టల్ కి వచ్చే వెర్రినాగన్నలు కాలే కడుపుకి బ్రెడ్డు అండ్ జాం తో కుస్తీ పడాలేమో రొట్టేముక్క మరో కొత్త రూపం కోసం కసరత్తు చేస్తుంది కొత్త కొత్త టెక్కులు హైటెక్కులతో మారకనే మారిపోయింది సాఫ్ట్ వేర్ అమ్మాయి పిజ్జాహట్ లో బర్గర్ తింటుంటే బయట మార్వాడి సోదరుడు పావ్ బాజి వండే ఎన్నో షెహర్లలో రొట్టెముక్క తన ప్రాధాన్యతను తను సంతరించుకుంది అయినా ఆ రొట్టె విరిగి ఇంకా నేతిలో పడలేదు రొట్టె రొట్టె గానే ఉంది మనుష్యులు సైతం మనుష్యులుగా గుర్తించక వెలివేసాక రోడ్డు పై పడుతున్న అభాగ్యులు,ఆపన్నులు చేయి చాచి తిండికై దేహీ అని అడుక్కుంటున్న సందర్భంలో ఆ రొట్టె విలువ వెయ్యి రెట్లు పెరిగి అక్షయపాత్రే అవ్వాలేమొ ఆ సమయాన ఈ అల్పసమాజంలో (చర్లపల్లి బాయ్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఓ అపరాత్రి దిక్కూ మొక్కూ లేని ఒక ముసలావిడ వచ్చి కాస్తా తిండి పెట్టమని, ఆకలికి తాళలేకున్నానని,వార్డెన్ ని ప్రాధేయ పడిన సందర్భం గుర్తుకు వచ్చి) 20.03.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHJZFM

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbDjB4

Posted by Katta

Sasi Bala కవిత

ఆహా!!! అట్టురా ...పెసరట్టురా స్వర్గానికి.. అది తొలి మెట్టురా కూడా ఉప్మా వుంటే ...వదలవు నీమీదొట్టురా అల్లం పచ్చి మిర్చి జీలకర్ర వేసేసి ... నెయి వేసి కాలిస్తే ..ఘుమ ఘుమలాడదా మరీ కొబ్బరి చెట్నీతో అల్లం పచ్చడితో ....... మునగ సాంబారుతో వడ్డించి చూడండి .. అమెరిక ప్రెసిడెంటు కూడ..దా ..సో ..హం .. అంటాడండీ దోసెలు ఎన్నున్నా పెసరట్టే కింగూ నలభీములైనా సరే పెసరట్టేయాల్సిందే ముందూ ప్రమోషన్ కావాలా ..పార్టీ మార్చాలా అయితే వెయ్యండీ ప్లేట్లో పెసరట్టూ వేరే ఏది కూడ తీసికట్టె దీని ముందు శశిబాల

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKAYOk

Posted by Katta

Kushagari Yanganna కవిత

gud evng...........

by Kushagari Yanganna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVrjQQ

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఉంగిడి ^^^^^^^^^^^^^^ రావెల పురుషోత్తమరావు మా వూరికి ఉంగిడొచ్చినట్టుంది నాముపంటను నాకేసి దొక్కలెగరేసే గొడ్డులా ఎగిరెగిరి పడుతుంది. ఎంత చింతపండును పిసికి పులుసులాజేసి గొంతులో బొంగు గొట్టంతో దిగబోసినా వాగొడ్దును ఎక్కలేక కళ్ళు రెండింటినీ తేలేస్తూ ఉక్కిరిబిక్కిరై పోతున్నది. ఎన్నిక సమయంలో మన్నికైన అభ్యర్ధిని ఏకంగా ఎన్నుకోలేని చవటలా ఎగాదిగా దిక్కులెంట జూస్తూ ఏబ్రాసి ముఖమేసుకుని ఏవో పిచ్చిలెక్కలతో మనాదితో మనువాడిన మనిషిలా నాగొడ్డుగూడా నాదిగాకుండా పోతుందేమోనని నా సదసత్సంశయం ********************************************20-3-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiXy

Posted by Katta

Padma Sreeram కవిత

నటభూషణుడికి..... నా..... అశ్రునివాళి || Padma Sreeram|| అనంతమైన ఆకాశం నల్లని దుప్పటినే కప్పుకొంది నువ్వు చూడని హోలీ రంగులు తనకూ వలదనుకొందేమో....... వసంతం రాబోతోందన్న ఆనందం కోకిల చూపకుంది నీ స్వరమిక లేదని తన రాగాలని మూగగా మలచుకొందేమో...... మల్లెపూలు పరిమళాన్ని మరచి రిక్తంగా వికశిస్తూనే ఉన్నాయి... దిగంతాలు చేరిపోయిన నీ నవ్వుల పూలు తలచుకొనేమో........ ఉగాది రాకున్నా వేపపూలు నేలరాలి వెతుకుతూనే ఉన్నాయి నువ్వు ఏ అణువులోనైనా తిరిగి పుట్టావేమో అనేమో....... అందమైన ప్రకృతి తనను తాను మరచి విలపిస్తోంది తన అందానికి దీటుగా నిలిచిన నటభూషణం అవని దాటిందనేమో.... గోదావరి సైతం తన పరవళ్ళు మరచి నిస్తేజ అయింది..... రాజమహేంద్రానికి ఎన్ని ప్రత్యేకతలున్నా నువ్వు లేని లోటు తెలిసినందుకేమో....... ఇన్నీ ఇన్ని త్యాగాలు చేస్తున్నా , నువ్వీ అవని విడిచి ఏడాదైనా నా కనుల తోటలు మాత్రం నిరంతర పుష్పాలను స్రవిస్తూనే ఉన్నాయి నా మది తన గానాలు మరచి శిలగా మారి పలకకుంది హుస్సేన్ సాగర్ లో నిలిచిన చెదరని సిద్ధార్థునిలా నియంతలాంటి విధి నిశీధివైపు నడిచిపోతూనే ఉంది తన కర్తవ్యం ముందు కళాకారులైనా , కలలకారులైనా బద్ధులే అని...... (తన భవిష్యత్తును తానే నిర్వచించుకోగల నిబద్ధత కలిగిన శోభన్ బాబు వర్థంతి సందర్బంగా , ఎంతటివారినైనా తన ఇంటికి అతిథిని చేసి తీసుకొని పోయే కరాళమృత్యువు కఠిన హృదయం తలచి అశేష అభిమానులందరి తరఫున నటభూషణుడికి నా..... అశ్రునివాళి) 20March2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiH9

Posted by Katta

Vani Koratamaddi కవిత

మురిపిస్తావా... చందమామనే చుస్తుంటా.. చెదిరిన చిరునవ్వులను చిలుకరిస్తుందేమోనని చుక్కలనే చుస్తుంటా.. మిణుకు మిణుకున తారల్లో మెరుస్తున్నావేమోనని మనసంతా నీకోసమే .... మరో ప్రపంచంలో కనిపిస్తావేమోనని తినిపించా గోరు ముద్దలు చందమామని చూపిస్తూ.... కల్పించిన కధలు చెప్పి జోలపాడి మైమరిచా... అమ్మగా లాలించి గుండెలపై నిదురపుచ్చిన రోజులే జ్ఞాపకం మధురస్మ్రుతులు గుర్తొస్తే మరల నీకోసం నేనలా.. తపించి తలపించాలని వొస్తావా మళ్ళీ.. మురిపిస్తావా... వాణి కొరటమద్ది 20/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiqr

Posted by Katta

Jyothirmayi Malla కవిత

|| జ్యోతిర్మయి మళ్ళ || గజల్ మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా తమలపాకులంటు కళ్ళకద్దుకుంటె పదములు ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా అమృతమంటు మధువు అంటు అధరముల పొగిడితే పరవశించి పెదవి విప్పి పిలవాలని ఉండదా నవ్వుముఖము దుఃఖములకు ఔషధమని తలచితే సర్వమోడియైన నువ్వే గెలవాలని ఉండదా ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే మరలమరల ఈ నేలనే మొలవాలని ఉండదా (20-3-14)

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qZ6Enw

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి||ఊరపిచ్చుక || చూడచక్కని ఊరపిచ్చుక ఎచ్చటికో ఎగిరిపోయింది ఖాళీఅయిన పల్లెల్ని చూడలేక ఇరుకైన నగరాల్లో ఇమడలేక వడ్లగింజల్ని చకచకా వలిచే నైపుణ్యం ఏ రైతుకీ తెలుపకుండా గూడుకట్టటంలో తన ప్రావీణ్యం ఏ ఆర్కిటెక్కుకీ నేర్పకుండా కిచకిచల పాట ఏ గాయకుడికి కంటస్తా వచ్చేలా నేర్పకుండా తుమ్మచెట్టు కొమ్మలకీ జమ్ముగడ్డి రెమ్మలకీ చెప్పకుండా హటాత్తుగా మాయమైపోయింది ..... అద్దంలో తనని చూసుకుని కాళ్ళతో తన్నుతూ అల్లర్లు వడ్లకంకులపై వాలుగా వాలుతూ గింజలు పీకుతూ కుస్తీలు చూర్లలో చెక్కర్లు కొడుతూ చూపరులకు కనువిందులూ చేసే చూడచక్కని ఊరపిచ్చుక ఎచ్చటికో ఎగిరిపోయింది ఏదీ అనుకునేలోపే ఇక లేదమో అనుకునేలా బహుసా ఏ కామందుడి కోరికలో పెంచడానికి లేహ్యంగా మారుంటుంది టెక్నాలజీ పేరుతో మనిషి చేస్తున్న దారుణాలకి ఏ బలిపీఠమో ఎక్కుంటుంది లేక తనపై సెల్ టవర్ బహ్మస్త్రం వేసావేం స్వామీ అంటూ ఏ దేముడినో అడగగానికి వెళ్ళుంటుది .... (ప్రపంచ పిచ్చుక దినోత్సవం సందర్భంగా ......మన బాల్యంలో భాగమైన నిత్య బంధువును దూరంచేసుకున్న భారమైన హృదయంతో ...) posted in Dec'12

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS47b1

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll ఎంత స్వచ్చమైనదంటే నీమనసు ll పచ్చకోక చుట్టుకున్న మా కోనసీమ పరువమంత తెల్లవారే తొలిసంధ్యలోన తుళ్ళిపడే పల్లెపడుచు ప్రాయమంత మమతలు అల్లుకున్న పల్లెసీమ మనసులంత ప్రతి లోగిలిలో దిద్దుకున్న రంగవల్లుల సోయగమంత అమ్మవడిలో కొసరి కొసరి తిన్న పాలబువ్వంత చదువులమ్మ బడిలో పట్టి పట్టి విద్యను నేర్పిన గురువులంత పెదవులపై పదిలమై నిలిచిన ఆత్మీయపు చిరునవ్వంత మదిలో నింపుకున్న నిండైన నీ ప్రేమంత మాపంట చేలపైన వీచే పైరగాలంత ఏటి అలలపై ఊయలూగే తెరచాప నావ అంత సెలఏటిపై తేలియాడే తరగల పాల నురుగులంత ఇసుకతిన్నెలతో కట్టుకున్న గుజ్జనగూళ్ళంత మా పల్లె పరవశించి పాడుకునే జానపదమంత చిగురుటాకుపై జారిపడే మంచుబిందువంత నాన్న ప్రేమలోని బాధ్యతంత అమ్మ మనస్సులోని స్వచ్చతంత అన్నదమ్ముల అనురాగమంత అక్కచెల్లెళ్ళ అభిమానమంత పాపికొండల మాటున తొంగి చూసే జాబిలంత అంబరాన వెలిగే తారా దీపమంత హరివిల్లులోని వర్ణమంత హంసల్లలే తేలియాడే తెలిమబ్బులంత. గుమ్మపాలు తాగి గెంతులేచే లేగదూడలంత గున్నమావి కొమ్మపైన గూడులల్లిన బుల్లిగువ్వలంత మధువులకై వేటాడే తుమ్మెదల మురిపమంత రెమ్మన ఊయలలూగే కమ్మని పాటల కోయిలమ్మలంత మా పెరటిలోన ముద్దు పూబాలలంత మా ఇంటి గడప తోరణమంత మా ఇంట పెరిగే బుజ్జి కూనలంత మా ఊరి కోవెల గంటల సవ్వడంత గోధూళివేళ సింధూర వర్ణమంత ఆమనిలో పూవని అందమంత తొలకరి పరిమళమంత మలయమారుతాల చల్లని స్పర్శంత ధరణిని చీల్చుకువచ్చే చిట్టి అంకురమంత వెన్నెల్లో గోదారి అందమంత కొనేట విరిసిన కలువభామ సౌందర్యమంత "సిరి"మల్లెలోని తెల్లదనమంత గరికపూలతో చెలిమి చేసే చిన్ని క్షీరదమంత అలుపెరుగక గూడునల్లే సాలీడు నేర్పంత వయారంగా అల్లుకుపోయే కుసుమలతలంత పిల్లగాలితో ఊసులాడే వరికంకులంత నీ నవ్వులకు దొర్లే ముత్యమంత నీ కన్నుల మెరిసే నీలమంత నీ చెక్కిలిపై జారిపడే కెంపులంత నీ పదాలకు మురిసే పగడమంత మచ్చలేని జాబిలంత వెచ్చగ తాకే తొలి కిరణమంత పసిపాపల బోసినవ్వులంత వసివాడని పూవులంత. ll సిరి వడ్డే ll 20-03-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qYxbkR

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ సూర్యుడు @ పొద్దున్నే సూర్యుడు బర్త్ డే చేసుకున్నాడు కిరణాల కత్తులతో చీకటి కేకును కోసి దిన చర్యను మొదలు పెట్టమని సూర్యున్ని పైకెత్తే కొండలు అలసిన సూర్యున్ని ఎదపై వాలిపోమ్మనే చెరువు గట్టు లక్ష చేతులున్న సూర్యుడు ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుని నిద్ర లేపుతున్నాడు. అందుకే, ఓ...సూర్యుడా ! చేతులెత్తి మొక్కుతున్నాను నీ కిరణాల చేతులకు. _ కొత్త అనిల్ కుమార్ 20 / 3/ 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS44ft

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----।। వీధి దీపం ।।--- చుట్టూరా జన సంచారమున్నా ఏకాకి జనజీవన స్రవంతికి వెలుగురేఖ జన వనానికి అమావాస్య చీకట్లు పారద్రోలి పున్నమి కిరణాల ప్రసరణి . విధిలేని బ్రతుకుల్ని వీపున మోసే ఆపద్భాంధవి విలువైన భవిష్యత్తుల మార్గగామి . వెలిగే చిరువెలుగు వేల కళ్ళు మెరిసేలా గ్రామ గ్రామాన్ని దిక్కు కాచే దివిటీలా . ఆకాశ మెరుపుల తళుకుల మిలమిల అవని అందాల జిలుగుల కళకళ నీవిచ్చిందే కదా ఈ వెన్నెల . కొంత కాంతి ముద్దను దాచుకున్న వైనం కోవెలలో ద్వజస్థంభంలా జనుల ముంగిట వెలిగే వీధి దీపం తరాలు మారినా ఆరిపోని నిత్యదీపం తనువే వెలిగే త్యాగదీపం ! 20-032014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS43YT

Posted by Katta

Jayaramaiah Kappaganthu కవిత

My kavitha on Andra jyothi...

by Jayaramaiah Kappaganthu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ja3dFe

Posted by Katta

Vani Koratamaddi కవిత

మరో రూపంలో ...... వికసించవు రాలిన మొగ్గలు చిగురించవు ఎండిన కొమ్మలు అతకలేదు పగిలిన అద్దం వెతకలేము కన్నీటిని నదిలో తిరిగిరాదు పోయిన ప్రాణం తరిగిపోదు నాలో దు:ఖం అడుగులు ఆలస్యంగా వేశావు ఆత్రంగా జీవితాన్ని ముగించేశావు నీ స్పర్స దూరం అవడం నిజం మనసంతా నీవన్నది వాస్తవం నిజాయితీ నిబద్దత కలిగిన నీ భావాలు అవినీతీ స్వార్దం మద్యన సర్దుబాటు కాలేవు మదిలో నీ రూపు చెరిగిపోదెప్పటికీ మరో రూపంలో వస్తావు ముమ్మాటికీ వాణి కొరటమద్ది 20/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJoerc

Posted by Katta

Sasi Thanneeru కవిత

20/3/2014 ఎందుకో మరి కవిత్వమై ఒక్కోసారి .... ఎందుకో తెలీదు తొలి కిరణపు ముందటి గాలినై నిద్ర మబ్బులో ఉన్న మొగ్గల్ని లేపుతుంటాను సంజె వెలుగుతో చేరి పక్షుల ముక్కులపై కువ కువలాడుతుంటాను నల్లమబ్బు నుండి జారే తొలి చినుకులా తుళ్లి అలలపై చేరి ఆటలాడుతుంటాను అవమానిత ఎద గాయపు మంటనై ఆగ్రహపు సెగలు కక్కుతుంటాను అబలల ఆక్రందనలు మోసుకు తిరిగే కన్నీటి చుక్కనై నేలకు రాలుతుంటాను దైన్యాన్ని కప్పుకొని నాలోకే ఒదిగి మౌన తపస్వినిగా మారుతుంటాను తలపులను విదిల్చి కలపు రెక్కలు కదిల్చి అక్షరాలను వెదజల్లుతుంటాను అవధుల్లేని ఆకాశాన్ని తాకి నా హద్దులు మరిచి విశ్వానికి ఊపిరులు ఊదుతుంటాను నా ఉనికికి ప్రపంచానికి మధ్య రేఖ ను కానక నేనే అది అదే నేను అయిన విశ్వాత్మగా నిలిచిపోతుంటాను .... కవిత్వమై కదిలిపోతుంటాను .... ఒక్కోసారి .... ఎందుకో తెలీదు .

by Sasi Thanneeru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9OgCZ

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||కాబోలు || కాలం పుప్పొడి వనాల మధ్య నుండి చివరిదాకా పరుగులు తీస్తునేఉంటాం కేవలం ఎటునడవాలో తెలుసుకొనేందుకే సుమా .... చెక్కెర తలపులు విరియకున్నా...అప్పుడప్పుడూ కాసిన్ని నవ్వులు పువ్వుకొంటాం...బతుకు సిగలో ...బతికున్నామని చెప్పేందుకు నిర్హేతుక ప్రయాణమైనాసరే తెలియకుండానే బడలికవొంకతో విశ్రాంతి తీసుకొంటాం ..... యుగాంతాల విశ్రాంతికి రిహార్సల్ చేసేందుకు ...... వెలిగి మలిగే మిణుకు జీవితంలో.... ఒక్కసారి కూడా మిణుగురుల మూలం వైపు చూడలేం మాయామోహిత మణిమమయ కాంతులను నర్తింపజేసే మట్టిపాటలుగానే మిగిలిపోతాం ... రాలిపడుతున్న పూల సౌందర్యం నీకెంత ఇస్టమో ....నీవువచ్చిపోయే దృశ్యమే ప్రకృతిని పులకరిస్తుంది కాబోలు ..............

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJdSYv

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

శర్మ సీహెచ్., ||వెన్నెలరేడు|| ఆకాశవీధిలో ఓ నిండుచందమామ నీతో మాకు బంధుత్వం లేదుసుమా అడుగో మామ..అటుచూడంటూ అమ్మ నిన్ను చూపిస్తేనే చిన్నప్పుడు అన్నంముద్ద తిన్నానట నువ్వు నాకే కాదు.. మా పిల్లలకూ మామవే.. వాళ్లూ నిన్ను చూస్తూనే అన్నం తింటున్నారిప్పుడు చల్లనిరాజా ఓ చందమామ నా మనసు చిరాగ్గా ఉన్నప్పుడు.. అయినవారెవరూ దగ్గరగా లేనప్పుడు డాబాపై పడుకుని నిన్నే చూస్తూ గడుపుతా నీ చల్లని స్పర్శ నను తాకినంత తనువులోని అణువణువూ పులకింత అందుకే వెలుగులు పంచుతున్నావు జగమంత.. \20.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJdTLV

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/స్వగతం ---------------------------- నీలో కొన్ని గతాలు స్వగతాలుగా నానుతూ ఉంటాయి నువ్వు లేనప్పుడు మనసు శిధిలాల్లో నువ్వు ఇంకిపోయావెప్పుడో కెరటాల కింద కరగని మట్టిలా నిన్ను కడుక్కోలేని నీ చేతులు నీకెదురైనప్పుడు ఓ శూన్యం నీ చుట్టూ గంభీరంగా కొన్ని పలాయనాలు పవిత్రంగా తాగుతావు నువ్వు జ్ఞాపకాల తలుపుల వెనుకగా చిన్నప్పుడు నీ గుప్పిట మిగిలిన కొన్ని గోళీల్లా అక్కడక్కడా గుర్తులు మిగిలే ఉంటాయి పువ్వులకు కొన్ని సాక్షాలుగా ఈ తోట ఇప్పుడు మళ్ళీ వికసించింది ఇంకొన్ని చెరపని గీతలు అర్థం కానివీనూ నువ్వు రాసుకున్నవీనూ మళ్ళీ స్వగతం మొదలు. తిలక్ బొమ్మరాజు 20.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9Oeeg

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6c3Ig

Posted by Katta

Sriramoju Haragopal కవిత

మనసులో ఏముంది మనుషులు చీమలై పోతే బాగుండునని బతకడం బతికించడం తెలిసొచ్చునేమోనని చివికి జవచచ్చిన మానవబంధాల్ని కొంచెమన్నా బతికిచ్చుకుందురేమోనని పూసినపుడల్లా మకరందకలశాలయ్యే పువ్వుల్లా తడిగాలి తాకగానే జల్లున చల్లగా కురిసే మేఘాల్లా తడిమట్టిలో చల్లగానే పంటకలలై మొలకెత్తే విత్తుల్లా చన్నిచ్చి రక్తాలు పాలుగా మమతల బంగారుతల్లిలా మనుషులు మనుషుల్లా మారుతారేమోనని మానవీయతతో ఇకనన్నా ఎదుగుతారేమోనని విత్తనంలోని మొలకవాగ్దానాలను మబ్బులోని చినుకు తడులను మట్టిలోని బతికించే గుణాలను పూవుల్లోని మెత్తని పరిమళాలను ....ధరించిన మనుషులే నిండిన చారిత్రక ధరిత్రి కావాలని అంతరాలు తొలిగించుకున్న మానవత్వపు ఆంతర్యాల మనుషులే కావాలని... వుంది మనసులో... ఊరికే పనికిమాలిన భయాలచారిత్రక గాయాలు మోసేదెందుకు? ఊరికే ఉనికిమలిపే భయానకముఖాల జంతువుల్లా బతకాలెందుకు??

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iipotG

Posted by Katta

Sahir Bharathi కవిత

| ఒక ప్రయాణం ........................................ స్నేహితురాలిగా దగ్గరయ్యావు నాకు తెలియని ప్రపంచం ఉందని నీ అడుగులతో దాన్ని పరిచయం చేసావు నేను ఇంకో ఆత్మకు దగ్గరైనా ఆకాశమంత బాధని నీ గుండెలో కప్పేశావు ఒకరోజున నీ అడుగులలో అడుగులువేసి భూమిపైనే కాదు,జీవితంలో నడిచేలా చేసావు ఆకర్షణకి నా ఆలోచనలకి విభిన్నంగా ప్రేమ ఉంటుందని తెలియజేశావు అమ్మచేతి వంటనే మధురమనుకున్న నాకు నీ చేతితో ఆకలిని తీర్చావు కులమతాలు వేరైనా ,సరిహద్దులు మింగి నన్ను నీవాడిలా చూసావు నా ప్రతి శ్వాసకీ నువ్వు ఊపిరి తీసుకున్నావు ఇక,నీ బాటలో నా అడుగులకి స్థానం లేదని ఎగిరిపోయావు జీవితంలో ఏదో ఒక బాటలో మరల మన అడుగులు కలిసి ప్రయాణం చేస్తాయని ఎదురుచూస్తు…………………………sahir bharati.

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iipodb

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | ఉనికి -------------------- దగ్ధ వృక్ష శిలాజాలు వజ్రకాంతులుగా విముక్తి పొందుతాయి స్తబ్ద దిగుళ్ళు విడిచి మెరుపుకలలు పలుకరిస్తాయి ఉరిమే మబ్బును చూసి కప్పపిల్ల కిలకిలా నవ్వుతుంది విఘాతాల విధ్వంసం కసిరితే ఆశ ధిలాసాగా విచ్చుతుంది పువ్వు విప్పారినపుడు చిరుగాలి మేను జాజర జడిలో జలదరిస్తుంది మనసు పొంగినపుడు అనుభూతి పరవశంగా పరిమళిస్తుంది భూమ్యాకాశ గతుల్లో, ఋతు సంక్రమణముల తాకిడితో ప్రకృతి నిరంతర ప్రవాహం స్థితిగతుల్లో జీవనం, మౌక్తిక సృజనలో మునిగితేలే సాగరం 19/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hE3QG7

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

ఆవరణం ___________________ మాట్లాడుకోవడానికి చీకటికంటే సత్యవాక్యం ఏముంటుంది ఆ ఒడ్డున అంతపొడుగునా సత్తువగా నడవడానికి వ్యూహాలేర్పరుస్తాం గాని. నడకని భయపెడుతున్న నిశ్శబ్దం వెనుక ఎంత చీకటి ఉందో చిక్కిన కాస్త వెలుతురుని నమ్ముకుని అడుగుల్ని కదుపుతాం కాని వెనకే నడుస్తూ చీకటి కప్పేస్తుంది కప్పల బెకబెకైనా..చిమ్మెటల కేకలైనా కీరవాణి సంగీతాన్నించిగాక రాత్రిరక్తం నుంచి అనుభవించగలమా ? పిచ్చిగానీ.. లైటార్పసి చీకటంటే ఎలా.? చుట్టుతా ప్రపంచమంతా ఏళ్లుగా చీకట్లోనే ఏడుపంతా తడిస్పర్శగా అనుభవంలోకి వచ్చిందిక్కడే ఎన్నాళ్లని భరించలేని వెలుక్కింద నలిగిపోతాం నిన్ను నువ్వు చిదిమేసుకుని వచ్చేయ్ ఏ వెలుక్కీ చీకటిని చూసే ధైర్యం లేదు.

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hE3Q8Z

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నినుకలిసే క్షణం కోసం గొడవపడుతూ గడుపుతున్నా నాతో నేను || --------------------------------------------------------------------------- లిపిని మరిచిన భాష మనసును మరిచిన జ్ఞాపకం నిజాన్ని దాచినా అబద్దం ఎవరికవి నటిస్తూనే ఉన్నాయి అన్ని బ్రమలౌతుంటే .. నమ్మలేని నిజాలు ఎదురుగా వికటాట్ట హాసం చేస్తుంటే నిజాన్ని మరచి నేను అయోమయంగా ఆకాశంకేసి చూస్తుంటే అక్కడ నాకై తెరచిన ద్వారం రమ్మని పిలుస్తుంఅగా మార్గం తెలీని మనసు నెమ్మదిగా జ్ఞాపకాల పొరల్లోకి చూస్తూ పరిశొధన చేస్తుంటే భారమైన బరువు కన్నీటి రూపమైంది. నా మనస్సు నిన్ను గురుతుకు తెస్తుంటే నేను ప్రశంతంగా ఎలా ఉండగలను భారమైన గుండె బరువు మోయలేకపోతుంటే రూపంలేని భావాలు యుధ్ధానికి సిద్ధమవుతుంటే నాలో నాకు జరిగే యుద్దంలో కూడా నేనే ఓడిపోతుంటే . ఇక గెలుపనేది కనుచూపుమేరలో కానరాకుండా నన్ను వేక్కిరిస్తుంటే ఏమని చెప్పను ఎవరికి చెప్పుకోను అసలు నిజాన్ని కలలెన్నో కన్న కళ్ళు కన్నీరన్న నిజం చూసి భయపెట్టే ఊహలనే ప్రేమ లేఖలుగా రాస్తుంటే సునామీలెన్నిటికో చెదరని సంద్రమంటి గుండెకేమో కన్నీటి పిల్లకాలువ దాచుకోని బరువౌతున్న గుండెను ఏమని సర్దిచెప్పుకోను ... ఏమౌతున్నానో అర్దంకాక సగం నువ్వు సగం నేనని భాదలోనూ మరవకున్నా ప్రత్యుత్తరంలేని ప్రశ్నలతో సతమతమై చస్తున్నా పడమటింటికి వెళ్ళమని సూరీడుని తొలిపొద్దునుండే పోరుపెడుతున్నా రోజులకే విసుగుతెచ్చే గంటలతో గంటలకే విసుగుతెచ్చే నిమిషాలతో నిమిషానికి విసుగుతెచ్చే సెకనులతో నినుకలిసే క్షణం కోసం గొడవపడుతూ గడుపుతున్నా నాతో నేను

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODa7ch

Posted by Katta

Satya Srinivas కవిత

శిశిర పిచుక- కనిపించని తల్లి పిలుపు కళ్ళగొంతుకల దాహార్తిని తీర్చే గూడు (20 మార్చ్ - అంతర్జాతీయ పిచుకల దినోత్సవం)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODa6VZ

Posted by Katta

Sasi Bala కవిత

అశ్రుతర్పణం .....................................................శశిబాల (20.march .14 ) బ్రతుకంతా మనం తోడై నీడై వుండాలనుకున్నాము కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చిన్ని చిన్ని అలకలు .చిరునవ్వుల కొసరింపులు ఏవీ ..అవేవీ ....నీతో పంచుకున్న ఆ అపురూప క్షణాలు నీ నిష్క్రమణం లో అవి మధుర జ్ఞాపకాలై నాలో ( నాతో ) మిగిలి పోయాయి శూన్యమైన గుండె గోడలు నీవులేని అసంపూర్ణ చిత్రాలతో బోసిపోయి మిగిలాయి వినబడటం లేదా నీకు నా గుండె చప్పుళ్ళు ఎద మీద ఎదబెట్టి విన్న తుళ్ళింతల ఊసులు నీతో స్వేచ్చగా ఊహా గగనం లో విహరించిన నా ఆశలు రెక్కలు తెగిన పక్షులై నిస్సత్తువగా ,నిరాశగా మొండి కుడ్యాల (గోడల ) నడుమ .. కర్కశమైన ఏకాంతాన్ని మిగిల్చి వెళ్ళిపోయాయి నిన్నోదిలి నేనుండలేను ..ప్రియబాంధవీ నింగికెగసిన నీ ఆత్మతో నా ఆత్మను మిళితం చేసుకొని తీసుకుపో రా !! రా మరీ !!!! వదిలిన నీ ఊపిరి నన్ను చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది రా ప్రియా !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j5D7HJ

Posted by Katta

Nvn Chary కవిత

ఎన్నికలు -ఏలికలు ఎన్. వి. ఎన్. చారి 20-03-2014 పార్టీలు మారినా పోటీలు చేసినా ఫోటోలు మారునా ఫోజులు మారునా జండాలు మారినా ఎజండాలు మారునా నిన్న బూతులు తిట్టి నేడు ఉత్తముడన్నచో ఉత్త ముండవు నీవె అందురు నల్ల తోలుకు తెలుపు రానె రాదు చింత జచ్చిన పులుపు చచ్చునె ఓటరా చూడు నేడొక జాతరా వేటాడు పక్షివి సోదరా మంచి (ఓ)వేటు వేసి చూడరా

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctwNj

Posted by Katta

Kapila Ramkumar కవిత

వీనస్… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి by NS Murty ఓ వీనస్! పగలు గతించింది మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే! ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది దివా రాత్రాల కలయిక వేళ పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! వినీలాకాశంనుండి మిణుకుమంటున్న నీ కాంతికిరణం అలసిన బాటసారికి తోవచూపిస్తూ నేలని మన్నించేలా చేస్తుంది. . జాన్ క్లేర్ 13 జులై 1793 - 20 మే 1864 ఇంగ్లీషు కవి. . John Clare, English Poet . Hesperus Hesperus the day is gone Soft falls the silent dew A tear is now on many a flower And heaven lives in you Hesperus the evening mild Falls round us soft and sweet 'Tis like the breathings of a child When day and evening meet Hesperus the closing flower Sleeps on the dewy ground While dews fall in a silent shower And heaven breathes around Hesperus thy twinkling ray Beams in the blue of heaven And tells the traveller on his way That earth shall be forgiven John Clare 13 July 1793 – 20 May 1864 English Poet [Notes: Hesperus: evening star. Hesperus or Vesper (a planet, usually Venus) seen at sunset in the western sky] NS Murty | March 20, 2014 at 12:30 am | Tags: 19th Century, English, John Clare | Categories: అనువాదాలు, కవితలు | URL: http://wp.me/p12YrL-3hb

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://wp.me/p12YrL-3hb

Posted by Katta

Chi Chi కవిత

_ Pawan senA _ మూన్నాళ్ళ ముచ్చట తీరడానికి ముచ్చటగా ముగ్గుర్ని కట్టుకున్నా ఇంటిపేరు నిలబెట్టే ముగ్గురిలో మొనగాడనుకున్నా ఇరవై సినిమాల్లో పది పేలినా పవర్ స్టార్ పదవిచ్చిన అభిమానులున్నా ప్రపంచాన్ని మలుపు తిప్పినవారి బొమ్మలెనకేసుకున్నా ప్రజాకాంక్షతో పనిలేకుండా తన పని తాను చేసుకుంటున్నా ధనాపేక్ష లేకున్నా,జనాకర్షణుoదని జవాబు లేని ప్రశ్నలతో దగాల గుండెలెక్కాలని అన్న చేతినొదిలి అందరికోసమనొస్తే సుస్వాగతమే!! తమ్ముడూ సిద్దార్థ రాయ్!! ఆంధ్ర సీడెడ్ నైజాం and ఓవర్సీస్ లలో ఫస్ట్ వీక్ టిక్కెట్ల కోసం కొట్టుకునే వాళ్ళే assembly మెట్లకు అడ్డంగా పడుకుంటే నిన్ను తొక్కేసెక్కుతారు ఎందుకంటే సినిమా టికెట్ కి వోట్ కి ఉన్న తేడా అలాంటిది మరి వోట్ కొనుక్కోవాలి , టికెట్ అమ్ముకోవాలి నమ్మకం రాజుని చేసే రోజులా ఇవి!! దిన దిన climax లాంటి దీనజనోద్దరణంలో నీకందే పాళ్ళు నీకున్నా, నువ్వు తప్ప ఎవ్వరడగని ప్రశ్నలు కానీ నీకు తప్ప ఎవరికీ దొరకని జవాబులు కానీ ఇక్కడ లేవు..నిజం!! నువ్వుద్దరించాలనుకునే జనాల్లో బలమైన జనం లేరు బలమున్నోల్లకి నీ జనబలంతో పనిలేదు వెంట నడిచే వాళ్ళు వెనకే ఉంటారు ముందుండి కాదు!! వీలైతే వెనక్కు తిరిగి నీ వెంటున్నోల్లని ప్రశ్నించు!! ప్రజా ప్రతినిధులంతా ఒకరినొకరు నిందించుకుంటూ వాళ్ళని కాస్తున్న ప్రజల్ని మభ్యపెడుతుంటే నువ్వూ ఒక చెవిలో పువ్వుగాడిలా మిగిలిపోతావ్.. నిజం!! తరిమి తరిమి కొట్టు వెనకొచ్చేవాళ్ళని నువ్వు తిట్టే ప్రతి నాయకుడిని,పార్టీని ఎన్నుకున్నది వాళ్ళే!! నీ నిస్వార్థం , నిగర్వం మడిచి నీ పెళ్ళాల దగ్గర personalగా ప్రదర్శించు publicకి గడ్డి పెట్టే వాడే ప్రపంచాన్ని మార్చగలడు!! చేతకాకపోతే(ofcourse కుదరదు lol) నటన తెర వరకే పరిమితం చేస్కో!! Jai JanamisM___________________________Chi Chi (20/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQFCLe

Posted by Katta

Abd Wahed కవిత

గజల్ అన్న పదానికి ’’ప్రేయసితో సంభాషణ‘‘ అనే అర్ధమే ప్రచలితమై ఉన్నది అని రాశారు గజల్ సౌందర్య దర్శనంలో పెన్నా శివరామకృష్ణగారు. Traditionally Gazal deals with one subject...love, unattainable love. The love may be divine (Ishq E Haqiqi) or earthly (Ishq E Majazi). సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ఈ స్వభావానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. మొదటి విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ఈ చీకటి రాత్రంతా సౌందర్యము లాగున్నది నీలికురుల సుతిమెత్తని లావణ్యము లాగున్నది ఈ దారిన ధూళికణాలన్ని మెరిసె తారకలే పాదాలను ముద్దాడిన పరవశము లాగున్నది చిరుగాలిలొ సంతోషం వీస్తున్నది హుషారుగా విన్నదేమొ నీ నవ్వును తాదాత్మ్యము లాగున్నది సూర్యులిద్దరుదయిస్తే చూశారా ఎప్పుడైన కనురెప్పలు తెరచినపుడు చూడలేదు లాగున్నది అమావాస్య రాత్రి కూడా వెన్నెల్లా ఈ వెలుగులు జాబిలిలా నీ నుదుటిదె ప్రకాశమూ లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0HQrv

Posted by Katta