పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Viswanath Goud కవిత

ఒంటరి బ్రతుకులు/విశ్వనాథ్ పైత్యం ప్రకోపించినట్లుగా మధం మత్తెక్కిన రెండు మృగాల అనుసంధాన ప్రక్రియలో ఉద్భవించిన శిశువులు వారు.. మురిపాలు,ముర్రుపాలంటు ఎరుగరు. మిగతా వారిలా మమకారాల రుచి కూడా తెలియదు. పుడుతూనే కుప్పతొట్లకి దత్తతెళ్ళిన కుంతీపుత్రులు. అమ్మలాగే ఆదరించిందది, తనకొచ్చిన రెండు ఎంగిలాకులాలలో సగం కుక్కలకు, సగం వారికి పంచుతూ, మాతృత్వం, మానవత్వం నశించిన మనుషుల కంటె మిన్నగా ప్రేమ పంచుతూ. అప్పుడప్పుడూ మంచినీటి నల్లాలే నాన్నలవుతుంటాయి.. తిండి దొరకని నాడు నేనున్నానంటూ నాలుక తడిపి ఆసరగా నిలుస్తూ. గాలికి ఎగిరిపడ్డ విస్తరాకుల్లా రోడ్డున పడ్డ జీవితాలు. అనురాగం పిల్లగాలిలా కొంచెం తగిలినా పరవశించిపోతూ, బంధాలను తెంపి చుట్టచుట్టుకుపోయిన విధి సుడిగాలిపై ఆక్రోషం వెళ్ళగక్కుతూ... తడబడుతూనే సాగే పయనం తడుస్తూనే ఉన్నా చిరకాలం నయనం. వారి జీవితాన్ని తులాభారం వేస్తే కన్నీళ్ళు ఓ కడివెడు,ఆనందభాష్పాలు ఓ చెంచాడు తూగుతాయి. షాపులు మూసిన షట్టర్ల బయట శయనం... ఎవడే కర్కశుడి రూపంలో వచ్చి తన్ని లేపుతాడో అనుకుంటూనే కలతనిద్ర. దొరికితే పిడికెడు ఎంగిలి మెతుకులు ఎంగిలిపడుతూ... దొరకనప్పుడు గుక్కెడునీళ్ళతో ఎంగిలి తడారినివ్వకుండా తడుపుకుంటూ... ప్రతిరోజు ఇదే దినచర్య... తావులేదు ఇంకో ప్రతిచర్య. ఒక్కటంటే ఒక్కటే బట్ట... కట్టింది విడువరు విడిస్తే కట్టేందుకు ఇంకోటిలేదు. నూలుపోగెరుగని చర్మమే దేహాన్ని అంటిపెట్టుకుండే కవచం. చూసేవారికి వివస్త్రం లేనివాడికదే చిరగని వస్త్రం. దాపరికం దరిదాపుల్లో లేని వీది బ్రతుకులు దాచుకోవడానికి వీలులేని రహస్యాల జీవితాలు. దారం తెగినా ఎగురుతూనే ఉంటుంది ఈ గాలిపటం గాలి ఉన్నంతవరకు.. నేల చేరేవరకు... ఏ ముళ్ళ కొమ్మకో చిక్కనంతవరకు.. జీవితం చిల్లులుపడి చిరిగిపోయే వరకు. కొనసాగుతూనే ఉంటుందీ పరంపర ఆగనంతవరకు మృగాల విచ్చలవిడి కామక్రీడ. బ్రతుకుతూనే ఉండాలి... అంతిమంగా మళ్ళీ అనాధగానే పోయేవరకు.. ఏ మురికి కాలువలోనో శవమై తేలేవరకు..!! 19MAR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0XrqL

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eStfcY

Posted by Katta

Venkatesh Manchala కవిత

కన్యాషులకం! వరవిక్రయం! తులాభారం! పేరేదైతేనేం పిల్లనై, కల్పవల్లినై కన్నెనై, కన్న తల్లినై జీవించేది, జీవిస్తు మరనించేది నేనేగా నాన్న!

by Venkatesh Manchala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hBducs

Posted by Katta

Balu Vakadani కవిత

బాలు వాకదాని||ఆనందనవనం|| చుటూ కొండలు, ఎత్తు పల్లాలు, కొంత మైదానం, మరి కొంత సెలకలు అందంతో ఆకట్టుకొనే పేర్లు తెలియని మొక్కలు, చెట్లు, పిట్టలు, వాటి శబ్ధాలు రంగులన్నీ అద్దుకున్న ఆ ప్రాంతం బాహ్య ప్రపంచాన్ని మరిచేలా చేస్తుంది వన్యప్రాణులతో, వనములికలతో అదో అందమైన ఆనందనవనం ఫాల్గుణమాస మధ్యాహ్న ప్రయాణపు అలసట కాముడి పున్నమి రాకతో వెన్నలలో కలిసిపోయింది మోహన రూపమైన పున్నమి రాత్రి, ‘రాజు’ల నాటి నుంచి నేటి కళ్యాణవైభోగం వరకు స్పృశించి తాటికల్లు పాస్వర్డ్ తో మనసు తెరుచుకొని పాట‘నందు’కుంది, కంజర తాళమేస్తుంది ఎండిన గడ్డి పరకలకందుకున్న నిప్పు పిడకలకు, ఆపై మొద్దులకంటుకొని మా దేహాలపై ఎర్రటి కాంతిని వెదజల్లుతుంది పరిసరాల చల్లదనం, పండు వెన్నల, పైపైకి పోతున్న సంద్రుడు కరుగుతున్న కొవ్వత్తి , మండుతున్న కాముడు, ఆవిర్లు కక్కుతున్న కాఫీ గుడిసలో దీపం, మసక చీకటి, కట్లపోయిపై వండిన బువ్వ కాంతమ్మ, వెంకటయ్యల అభిమానం, రాము శివల స్నేహం, వావ్ వాట్ ఏ బ్యూటీ ఫుల్ నైట్ ‘గురూ’.. బాలు వాకదాని 19-03-2014

by Balu Vakadani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUyGR7

Posted by Katta

Venkatesh Manchala కవిత

కష్టాల్లొ ఉన్నప్పుడు నా కన్నీటి ధారల్ని వ్రుధా చేయను రేపటి నా జీవన సమరంలొ సాధించబోయె విజయాలకై ఆనంద భాష్పాలుగా పొంగి పొర్లించడానికి పదిలంగా దాస్తున్నా!!!

by Venkatesh Manchala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hBdvx4

Posted by Katta

Kushagari Yanganna కవిత

gud evng.............

by Kushagari Yanganna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDyuqm

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక || ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె. గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగిం చాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం ద్వారానే సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం. ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two అందులో ఒకటి primary రెండోది secondary . ఆకారమును చూసి మోసపోకూడదని అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం. స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు. చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్‌ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు. ఊహించటం, అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు. చర్చపై సునంద, సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి, శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు. /////19.3.2014 సాయంత్రం 4.50

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OwbE4f

Posted by Katta

Katika Manohar కవిత

మను #హోలీ # రంగుల లోకం మరింత రంగులమయం కదిలే రంగవళ్లుల రమణీయ దృశ్యం భువి పై పరుచుకున్న ఇంద్రవన్నెల అందం వర్ణించలేని వర్ణాలేవో శరీరాలపై శోభితం ఆనవాళ్ళు మరచిన మనుషుల ముఖం ముఖాలపై విరిసిన నవ్వుల పుష్పం ప్రతి చేయి కుంచెగా మారిన క్షణం చిత్రాకారుడు చిత్రించని చిత్రమేదో ఆవిష్కృతం జాతి తేడాలను చెరిపేసిన రంగుల వనం మనుషుల అసలురంగు తుడిచేసిన వైనం ఇది చరిత్రకు అందని చిత్రవైభవం కలకాలం నిలిచేనా ఇలాంటి సంబరం 19\03\14.

by Katika Manohar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OwbDNP

Posted by Katta

Sarada Kotra కవిత



by Sarada Kotra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ot6x1A

Posted by Katta

Sarada Kotra కవిత



by Sarada Kotra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ot6x1A

Posted by Katta

Kapila Ramkumar కవిత

సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య by gdurgaprasad 'రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.' 'మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.' కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ వెలువరించాడు. ఆయన రాసిన అన్నపూర్ణ, రాజీవం నాటకాలు విశేష ప్రజాదరణ పొందాయి. దువ్వూరి రామిరెడ్డి గురించి రాసిన 'కవికోకిల', గురజాడ గురించి రాసిన 'మహోదయం' రచయితల జీవిత సాహిత్య వ్యక్తిత్వాలను విశ్లేషించే పద్ధతికి మార్గదర్శకంగా నిలవదగిన నమూనాలు. ఇవన్నీ ఒకెత్తు అయితే, 1950ల నుండి 1998 జనవరి 15న శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకూ- దాదాపు అర్థ శతాబ్దం పాటు- కెవిఆర్ రాసిన సాహిత్య వ్యాసాలు ఒకెత్తు. ఇవి సంఖ్యాపరంగా 300లకు పైగా ఉండడమే కాదు, మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఒరవడికి మంచి ఉదాహరణలు. ఇంకా చరిత్ర, రాజకీయ, సామాజిక వ్యాసాలతోబాటు, మూణ్ణెల్ల ముచ్చట, డిటెన్యూ డైరీలు ఆయన జైలు జీవిత విధానానికి, ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య చరిత్రతోపాటు ఆయన సాహిత్య దృక్పథం కూడా స్పష్టమవుతుంది. వర్తమానంలో గతమూ, భవిష్యత్తూ రెండూ ఉంటాయనీ, గతాన్ని తిరస్కరించి భవిష్యత్తును చూడగలగడమే ప్రజాస్వామ్య సోషలిస్టు రచయితల దృక్పథంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. సంఘ విమర్శ లేని సాహిత్య విమర్శ గాలి కసరత్తు లాంటిదంటాడు. తత్వస్పర్శ లేని విమర్శకు కనుచూపు ఉండీ లేనట్టేనంటాడు. భూ స్వామిక సంస్కృతి నుండి పూర్తిగా బయటపడకుండానే భావికవిత్వం వ్యక్తి స్వేచ్ఛా భావంతో ఆత్మాశ్రయ వైఖరిని అవలంబించిదని కెవిఆర్ అభిప్రాయం. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో కూడా ప్రజాకవులుగా ఉండి రచనాగానం చేసినవారు తెరమరుగైపోయారనీ, మధ్యతరగతి విద్యా సంస్కారాలతో, కళా ప్రమాణాలతో ప్రజాఘోషను కావ్య వస్తువుగా మార్చుకోగలవారే నిలబడగలిగారనే విషయాన్ని కెవిఆర్ గుర్తించారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమం తాలూకు లోపాన్ని సూచించడంతో బాటు, పునాది వర్గాల నుండి వచ్చిన నాయకత్వం లేకపోవడాన్ని కూడా తెలియజేస్తుందని అంటాడు. సాహిత్య సంబంధమైన ఒక వాస్తవాన్ని గుర్తించి, కెవిఆర్ దాన్ని అంతటితో వదిలెయ్యడు. ఆ వాస్తవం వెనకగల నేపథ్యాన్ని తరచి చూస్తాడు. దాని ఆధారంగా ఒక సూత్రీకరణ చేస్తాడు. కవిత్వానికీ, వచనానికీ ఆకర్షణ విషయంలో గల తేడాను చెప్పే సందర్భం దీనికి మంచి ఉదాహరణ, కెవిఆర్ ఇలా అంటాడు- 'కవిత్వానికి గల ఆకర్షణగానీ, మన్ననగానీ, వచనానికి లేకపోవడమనేది, ఒక సమాజం వెనుకబాటుతనానికే నిదర్శనం.' ఈ సూత్రీకరణతో కెవిఆర్ సునిశిత దృష్టి వ్యక్తమవుతుంది. దీనికొక ఉపపత్తి కూడా ఆయనకు అందుబాటులోనే ఉంది. కవిగా శ్రీశ్రీకి ఎంతో గౌరవం వచ్చింది. కాని ప్రజాస్వామిక యుగంలో వచనానికి ఉండాలి గౌరవం. కవిత్వానికి ఇంత గౌరవం ఉండడం ఆదిమ యుగ అవశేషం అంటాడు. కవిత్వం ఒక మలుపు తిరగాలంటే కచ్చితంగా అది ఆదిమ యుగ స్వభావమైన 'మాయ'తో జతగూడాల్సిందే. శ్రీశ్రీ కవిత్వంలో ఈ శక్తే అందరినీ ఆకిర్షించడానికి కారణం. దీని ఆధారంగానే కెవిఆర్ కవిత్వానికొక మంచి నిర్వచనం ఇస్తాడు. కవిత్వం హేతుబుద్ధికి వ్యతిరేకం కాదు. తర్కానికి శత్రువూ కాదు. కానీ అందులో ఒక ఐంద్రజాలిక గుణం ఉంది. హృదయోద్రేక లక్షణం ఉంది. ఈ రెండిటికీ లొంగకపోవడమే కవిత్వానికున్న విశిష్టతగా కెవిఆర్ గుర్తిస్తాడు. వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు నుండి విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల దాకానే కాదు; చలం, కుటుంబరావు, తిలక్‌లతో ఆగలేదు సరికదా, చాసో, రాచమల్లు, కుందుర్తి, దాశరథి, బంగోరె, చెరబండరాజు, అల్లం రాజయ్య- ఒకరేమిటి? తనకు ముందుతరం, తనతరం, తన తర్వాతితరం రచయితలను కూడా విశ్లేషించి అంచనా వెయ్యగలిగిన సత్తా తనకుందని రుజువు చేసుకున్నాడు కెవిఆర్. 'రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.' 'వస్తుప్రాధాన్యం శిల్పాన్ని పూర్తిగా నిరాకరించేది కాదు.' 'వ్యక్తిత్వం సాహిత్య వ్యక్తిత్వాన్ని విలక్షణం చెయ్యకమానదు.' 'మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.' సాహిత్యలోకం గుర్తుంచుకోదగిన ఇలాంటి పదునైన వాక్యాలు కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో కోకొల్లలు. -వి.చెంచయ్య (ఈ నెల 23న విజయవాడలో 'కె.వి.ఆర్. సాహిత్య వ్యాసాలు' 2, 3 భాగాల ఆవిష్కరణ జరుగనుంది. పి.రామకృష్ణ, శివారెడ్డి, కాత్యాయని విద్మహే పాల్గొంటారు.)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2s0iU

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఆమె --------------------------- ఈరోజు ఆమె మళ్ళీ నవ్వింది నిశ్శబ్ధంగానే నాకు వినబడేలా కళ్ళతోనే అచ్చులు పోసింది ఇక్కడంతా రాతి గుహల్లో అట్టకట్టిన బూజులా నేను తననే చూస్తూ ఈ మధ్య చాలా దూరం నడిచాను ఆమెతో తెగిపడిన ఊహలను అనుసరిస్తూ తన చూపులు చెట్టు మొదళ్ళు నాలో దిగబడినప్పుడు స్వచ్చ మైన ఊపిరితో ముఖం కడుక్కుంటాను మరోసారి తన వక్ష సంద్రంలోకి నన్ను అదుముకున్నపుడు నాలో రేగే కోరికలకు ప్రతీకలా కొన్ని ప్రక్షాళనలు మళ్ళా ఒక ప్రేమ తివాచీ మీదుగా ఇంకొన్నాళ్ళు నడవాలి ఆమెతో దేహం కోసం కాదు కొంచం సహవాసాన్ని రాబట్టడానికి తనలోని పచ్చదనం చూసినపుడు మళ్ళీ పుడతాను చాలాసార్లు కొంచం కొత్తగా తనతోపాటు సరళంగా ఇప్పుడు వెతుక్కోవాలి ఓసారి ఆ నవ్వును నేను నిశ్శబ్ధంగా తిలక్ బొమ్మరాజు 19.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gOcU9u

Posted by Katta

Krishna Mani కవిత

భూ’తాలు’ ********** నాలోని ప్రతి కణం పంచభూతాల సంగమం అమ్మ ఈ ప్రసాదాలతో కూర్చింది కడుపున అందుకే అందురేమో పంచభూతాల సాక్షి ! ధరణి పై కాలు మోపి ఉచ్వాస నిశ్వాసలతో ఆటలాడి నింగికి చేతులెత్తి తారలతో పాటపాడి వర్షంతో సరసమాడి తుదకు మంటల్లో పెనుగులాడి ఇందులో పుట్టి ఇందులో పెరిగి ఇందులోనే లయం ఇదే కదా ధర్మం ! బహుశా ! ఆ ధర్మాన్ని అతిక్రమణ జరిగిందేమో ఇంతింత రా నాయన అంటే ఇల్లంత వచ్చిండని ప్రకృతి ఒడిలో రాగానే మనిషి పంచాభూతాలపై పెత్తనం మొదలుపెట్టాడు ! వనాలను నరికి కొండల్ని వంచి అణు అగ్గితో ఆటలాడుతూ పైత్యమేక్కి ప్లాస్టిక్ను పరిచి గొట్టాల్లో కంపుని నింగిలో జల్లి ఓజోన్ను తెంపి కాంతి మలినాన్ని దింపి పాపం ఎరుగని జీవుల బతుకు చెరిపి మంచుకొండలను మాడగొట్టి మురికిని నీటిలో కలిపి వాగుల వంకల ఆరబెట్టి కల్మషంతో కడలిలో స్మశానం సృష్టించి ధరణిని దగ్ధం చేస్తున్నాడు ! తల్లిని దిక్కరించి ఒంటినిండా గాయాలు చేస్తే ఉండునా ఓర్పుతో ఎంతనీ ? రుద్రతాండవం చేస్తుంది చూడు ! బడబాగ్ని రాలంగ కాలం కాలిన కట్టెలే గాలి కౌగిలిలో సమస్తం తెగిన పటాలే జడసిన భూమి పగులును పక్కున ఉప్పొంగును అగ్ని స్రావం బిక్కు బిక్కుమనే దిక్కుతోయని జీవజాలం కడలి కెరటాల పొంగులో కడతేరే భయ కన్నులెన్నో ! గొడుగు లేని లోకం గగన శకలాల వర్షంలో ! ‘’అహంకారమే అంతానికి ఆది బిందువు ‘’ తెలివి నా సొత్తని విర్రవీగే మానవ కాకులు పంచభూతాలకు పట్టిన భూతాలు లోకాన్నేలే రాజులమని పులిపై స్వారి చేస్తే ఎందుకు పట్టదు అధోగతి ? ఎందుకు కూలదు జీవజాతి ? కృష్ణ మణి I 19-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2fUq2

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

ఎన్నికల ప్రస్థానం-8 మున్సిపాల్టీల్లో ముగిసింది నామినేషన్ల ఉపసంహరణ.. నువ్వానేనా అంటుంటిరి ప్రచార సమరాంగణాన.. ఆశపడి సీటురాని అభ్యర్థులు అంతటా.. ఎగరేస్తారేమో అంటున్నారు తిరుగుబాటు బావుటా.. \19.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzFIUN

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||వింత వేడుక || విరహం విచ్చుకత్తుల మొనపై నాట్యమాడే వెన్నెల తరగ విసుగుకు విరుగుడు మందేసి ఆఖరి మెట్టెక్కే అనుభవం వేదన వీపుపైనెక్కి ఆడే ఉప్పుమూట లాట విరహం ఖైదీ జైలుగదిలో ఆత్రంగాఆరగించే విడుదలకు ముందురోజు విరహం అనంత దూరాల మధ్య అవిశ్రాంతంగా నిర్మించబడుతున్న రహదారి విరహం మౌనం కడుపులోకాస్తున్న మహాద్భుత శబ్ధానికి కవలపిల్ల విరహం తెరిపిలేకుండా కురిసే రసఝరి సయుతం తలవంచుకు వెళిపోయే తన్మయత్యపు కౌగిలి విరహం అప్పుడప్పుడూ గాలి కన్నాల లోంచి ప్రకృతి ఆలపించే విలయగీతపు సంగీతం...... విధ్వంసం లోంచి మొలచే వింత అనుభూతి ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OvbES1

Posted by Katta

Sravanthi Itharaju కవిత

స్రవంతి ఐతరాజు "సౌగంధిక జాజరలు" 19.3.14 మల్లెల్లో మహాలక్ష్మి... మల్లెల్లో మహాలక్ష్మివి మందారాల్లో మహంకాళివి సంపెంగల్లో శ్రీమహాసరస్వతివి ఓ పెద్దమ్మా! శ్రీ పద్మావతమ్మా.. నీ వదనమొక బింబ పద్మం నీ అక్షులు పద్మరేకులు వెరసి నీ నాసిక ఓముకుళిత పద్మం నీ పెదవులు పద్మవర్ణ తొటిమలు నీ చల్లని ధృక్కులు పద్మసుగంధాలు చిలుకరింపగరావె మాదు లోగిళ్ళందు పారద్రోలి మా అజ్ఞానపు అహంకారపు కనుల పొరల దొంతరలు కురిపింపగరావె నీ చైతన్య స్రవంతులు అష్టలక్ష్ములై అష్టదిక్కుల మము అష్టైశ్వర్యాల ముంచి ఆనందాల అలరింపజేయుచూ అభాగ్యుల ఆదరించ మా మనములరంజింపగరావె వ్రేడెద నా మనోపద్మమును నీ పాదపద్మముల భక్తితో సమర్పించుచూ గైకొనుమమ్మ మా అమ్మలగన్నయమ్మ.. దయతోడ మము పరిపాలింపగ రమ్మా..

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzrZ0q

Posted by Katta

Sriramoju Haragopal కవిత

జబర్దస్తీ పచ్చటి కలలన్ని రేపటి పంటలే పొలానికిన్ని నీళ్ళు పోసి మొలకలు చల్లితే చాలు పచ్చటి నెలపొడుపులే పొలంనిండా మట్టిసుగంధాల పల్లె పిల్లలకిన్ని అక్షరాల సాలు పోస్తే చాలు చదువుల పంటలై చేతికొస్తారు కలయికలే పండుగలుగా చేసి ఇంత నిస్వార్థ స్నేహలు పంచితే మనుష్యులబంధాలు అమరాలౌతాయి నవ్వులు పరిమళింపజేసే సహజీవన పాఠాలు నేర్చితే దుఃఖం లోకం వొదిలిపోతుంది ఎన్ని నేర్చినా ఈ రాజకీయాలకు ప్రజలకొరకు నిలబడలేని అవిటితనం రేపటి కలల్ని కుప్పలో తగలబెడుతుంది ఉద్యమాల్ని ఉద్వేగాల్ని పదవులకమ్మే పెద్దమూర్ఖనాయకుల చేతులకిస్తే మనబతుకులు మళ్ళీ చెత్తపాలే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1GRdq

Posted by Katta

Kancharla Srinivas కవిత

సర్వ సత్తాక పతాకమై స్వతంత్రంగా ఎగరాలని ఉంటే బలవంతపు బ్రాహ్మణిక బంధాలను తెగతెంచాలనుకుంటే అగ్ర రాజ్య ఆంక్షలైనా అమెరికా ఘర్జనైనా బేఖాతర్ ఉక్రైన్..నిర్భంధపు కట్లు, బానిస చీకట్లు చీల్చుకున్న సింధూరం క్రెమియా మందారం పెద్దన్నా.. పువ్వులు నీ పెదాలపై అసహజ నవ్వులేం కాదు నువు శాసిస్తే పూయటానికి రష్యా ఎర్ర తొటలో విరిసిన అరుణాన్ని చూడు....

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1GTC4

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నా రెప్పలు వెనుక || మరువలేని కల వాడు నా రెప్పలు వెనుక ఉదయిస్తాడు ఎన్నో మరెన్నో ఊసులున్నాయంటూ కనులు తెరువనీయడు గుండెలు నిండా నిండి పొర్లుతూ నా పెదాల పై చెరుగని నవ్వులా మారాడు వాడు వాడని పువ్వు నాకు అందంగా అలంకరింపబడ్డాడు కనిపించే నాలో కనిపించని జీవం వాడు నేను వెలుగుతున్నంత కాలం నా కన్నుల్లో ఆరని దీపం వాడు అందుకే వాడు కల కాదు కల లాంటి నా జీవితంలో ఒకే ఒక్క నిజం మీ చాంద్ || 18.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1GTBO

Posted by Katta

Annavaram Devender కవిత

ఈ రోజు నా 'తొవ్వ 'తప్పింది ......ఎన్నికల విధుల్లో మునిగిన ..మల్ల వారం తోవ్వలకు వస్తా .......

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OAnlXe

Posted by Katta

Padma Sreeram కవిత

ఒకటి - ఒంటరి అంకె || పద్మా శ్రీరామ్|| అష్టదిక్కులున్నాయి అయినా.... అవని ఒంటరిదే సూర్య చంద్రులున్నారు - అమాసలో ...ఆకాశం ఒంటరిదే సప్తసముద్రాలున్నాయి.. నావికుడికి మాత్రం- దప్పిక తప్పదు నాకూ ప్రేమించే నేస్తాలెందరో - కానీ.....నువ్వు లేని లోటు .....తీరదు పున్నమి చుక్కల మాలలెన్ని తురుముకొన్నా మనసైన చంద్రుడికోసం చూపులు తప్పవన్నట్లు నా చుట్టూ ఎందరున్నా - మనసెరిగిన నువ్వు లేక నా కనులకలత వీడదు అందుకే నీకోసం ఎదురు చూపునైతిని నువ్వు వీడిన ఒక మజిలీనైతిని మనం కలిసున్నపుడు కలబోసుకొన్న చిరు నవ్వులు ఇప్పుడు అర(కొర)నవ్వులైనాయి నేస్తమా అందుకే మనమొక్కసారి కలుద్దాం మన అనుభూతులు కలబోసుకొందాం అవనిపై ఉన్న మన ఆనందాన్ని అంబరమంతగా ఎగరేసుకొందాం ఒక్కసారి రావూ - నా జీవితాన్ని చూసిపోవూ??? అంకితం : పెళ్ళితో విడిపోయిన నా చిన్ననాటి స్నేహితురాలు "లలిత" కు జన్మదిన శుభాకాంక్షలతో ప్రియ నెచ్చెలి "పద్మం" పలికే అనురాగాల పల్లవి 19 Mar 2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1GSOx

Posted by Katta

Chi Chi కవిత

_ఆనందం_ అదొక ప్రశ్నే!! ఒంటరై అందరిలో అన్నిట్లో వెతుక్కుంటూనే లేదనుకోవడంలో ఉందేమో.. కనిపించదు కాబట్టి లేదనుకోవాలా!! తనలో తానై అన్నీ తాననే అదోగతంలో ఉందనుకోవడంలో లేదేమో.. అనిపిస్తుంది కాబట్టి ఉందనుకోవాలా!! అనర్థాల కోరల్లో చిక్కి అంతం వెతుక్కునే అంధత్వానికి తెలీదు ఆనందానికర్థం వయసు పోకడలేసే అందాల కుయ్యో ముర్రోలలో కరిగిపోయేదా అది!! మన పైకప్పు తంటాలతో లోనున్న పెంట కప్పి తిరుగుతూ అద్దాల సాక్షిగా పొందే ఆనందంలో, శునకాలకు తీసిపోమేమో అయినా అద్దం చెప్పేది చాలదే.. ఊరంతా మొరగాల్సిందే మట్టి సిరులు చూసి!! మరందుకే (నేను)అనేది మనిషికున్నది రెండు కళ్ళు కావు మనుషులందరి కళ్ళు ప్రతి మనిషివీ అయున్నాయని.. చూస్కో!! బతికి, బతుకిచ్చి,బతకనిచ్చి,బతికే ఉన్నా చంపి,చచ్చి,చావనిచ్చి,చంపుకుంటూనే ఉన్నా తీర్చి,తీర్చుకుని,తీర్పులిచ్చి,తీట పెంచుకున్నా దైనందినానందం కోసమే!! అవికాదానందమనే వారికి మాత్రమే అవికాదానందం మరి వారికేదానందం? అవి కాదనటమే వారానందం.. lol!! ధ్యానం ,మౌనం,శూన్యం,జ్ఞానం,దైవం ఇంకా!! మా బొంద మాకేం తెలుసు..అవి try చెయ్ వస్తే ఆనందం , పోతే ఆరోగ్యం అని అన్ని మటాల్లో , మతాల్లో మనుషులు(?) మొత్తుకోడం చూసి వాళ్ళతో కలిసి వాళ్ళ భజనే చేస్కోడం తప్ప ఆనందమనే సమస్యకు సమాధానం మాత్రం పొందలేం.. hehe నిజానికి భజన చేసే భక్తులుండటమే మటాలకి ,మతాలకి ఆనందం లేదంటే వాళ్ళక్కూడా ఆనందమో సమస్యే _/\_ సుఖసంసారం గురించి ఎందుకులే సుఖం కోసం సంసారమో , సంసారమే సుఖమో ,సుఖమో సంసారమో బంధమే ఆనందమో , ఆనందం కోసం బంధమో , ఆనందమో బంధమో out of my coverage area!! సర్లే!! ఆనందమనే సమస్యకు ఆనందమే సమాధానమనర్థమైతే సమాధయ్యేదాక సమాజంతో సమస్యలుండవేమో_________Chi Chi (19/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCf5WK

Posted by Katta

Kapila Ramkumar కవిత

Truth Fle fro the pres, and dwelle with sothefastnesse, Suffise thin owen thing, thei it be smal; For hord hath hate, and clymbyng tykelnesse, Prees hath envye, and wele blent overal. Savour no more thanne the byhove schal; Reule weel thiself, that other folk canst reede; And trouthe schal delyvere, it is no drede. Tempest the nought al croked to redresse, In trust of hire that tourneth as a bal. Myche wele stant in litel besynesse; Bywar therfore to spurne ayeyns an al; Stryve not as doth the crokke with the wal. Daunte thiself, that dauntest otheres dede; And trouthe shal delyvere, it is no drede. That the is sent, receyve in buxumnesse; The wrestlyng for the worlde axeth a fal. Here is non home, here nys but wyldernesse. Forth, pylgryme, forth! forth, beste, out of thi stal! Know thi contré! loke up! thonk God of al! Hold the heye weye, and lat thi gost the lede; And trouthe shal delyvere, it is no drede. [L'envoy.] Therfore, thou Vache, leve thine olde wrechednesse; Unto the world leve now to be thral. Crie hym mercy, that of hys hie godnesse Made the of nought, and in espec{.i}al Draw unto hym, and pray in general For the, and eke for other, hevenelyche mede; And trouthe schal delyvere, it is no drede. Geoffrey Chaucer 19.3.14 ఉదయం 5.47

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gMFxEe

Posted by Katta

Abd Wahed కవిత

గగనాన్నే పట్టుకుని ఇంటిలోన పెంచుకునే ఆశా రహదారిని చేయిపట్టి మనతోనే ఉంచుకునే ఆశా ప్రయాణమే ముఖ్యమైతె గమ్యంతో పనేలేదు మనకూ మనలోపలి దారుల్లో దూరాలను దాటుకునే ఆశా నీడలాగ పెరుగుతున్న వయసులోని చీకట్లను చూసీ చిన్నప్పటి చిరుదీపం వెలుగులనే దాచుకునే ఆశా రాత్రిపగలు గోడల్లో పునాదిగా నిలబడడం మానీ రెక్కవిప్పి కాలంతో వేగాన్నే పంచుకునే ఆశా నెత్తుటిలో ప్రతిబొట్టూ నిప్పురవ్వగా మారేదెపుడో ఎండుగడ్డి దేహంలో మంటలు రగిలించుకునే ఆశా దారిలోన దోపిడైన సాహసాల సంపదలను వెదికీ మరోసారి ప్రమాదాన్ని వెదికిమరీ పట్టుకునే ఆశా చింతిస్తే లాభమేమి లోపాలను తలచి వగచి వగచీ లోటుపాట్లు బలాలుగా దియామనం మార్చుకునే ఆశ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gDxXzt

Posted by Katta

R Rama Krishna కవిత

: మిత్రులకు మనవి: అచ్చయినయీ, కానియీ..కొన్ని నాకు మాత్రమే నచ్చినయీ, కొన్ని ఎక్కువమందికి నచ్చినయీ ఓ యాభయ్యో ఎనభయ్యో యేరి అచ్చేద్దామనిపిస్తుంది. ఏదైనా పేరు సూచించరూ? :

by R Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ifB7sS

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నా గుండెలో అలజడి ఎవరు తెల్సుకుంటారు || -------------------------------------------------------------------------- గుండె గదుల్లోనుంచి నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం.. విస్ఫోటనం చెంది .. నిశ్శబ్దం మౌనంగా విచ్చిన్నమౌతోంది పగిలి ముక్కలైన హృదయాన్ని ఇంకా ముక్కలు చేస్తూనే ఉంది మది తలపులను తాకిన జ్ఞాపకాలు విచ్చుక కత్తులై గుచ్చుకుంటూన్నాయి ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే నా గుండెలో అలజడి నీవు కాకపోతే ఎవరు తెల్సుకుంటారు నన్ను నీవు కాకపోతె ఎవరు అర్దం చెసుకుంటారు అయినా నా పిచ్చిగాని .. నన్ను ఎప్పుడో మర్చిపోయావు ఇంకా నేను గుర్తుంటానా అని ఎందుకు నాకీ కలవరింత నీలో నుండి నన్ను కాదని నన్ను ఒంటరిని చేసి విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక మిగిలేది సుదీర్ఘ మౌనం అదీ చేతకాని క్షనాల్లొ నాకు మిగిలేది శాశ్విత నిశ్శబ్దమేగా

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ifB941

Posted by Katta

Buchi Reddy కవిత

3-18-2014 *********** దోరాల పాలన పోవాలి--ధ లీ త పాలన రావాలి--దేశం లో-- రాష్ట్రం లో మార్పు అవసరం ****************** రాజ్యాంగ రీత్యా--- ప్రజా స త్తా క సౌ ర్వ బౌ మీ క సో షి లిస్ట్ లౌకిక రిపబ్లిక్ దేశం గా వి రా జిల్ళు తున్నా మన దేశం లో స్వాత౦త్రం వచ్చి 60 ఏళ్లు ధాటి నా నాటి నుంచి--- నేటి ధా క ఎక్కువ శాతం దేశాన్ని--రాష్ట్రాన్ని పాలిస్తుంధీ--- కొన్ని కుటుంభాలు ఆ గ్ర కులాలు--- దొర లు--- ఉన్నొళ్ళు బాపన దొర లు కమ్మ దొర లు వెలమ దొర లు రెడ్డి దొర లు కాపు దొర లు దొర లు--అక్కడున్నా--ఇక్కడ ఉన్నా అమెరికా అయినా అమలాపురం అయినా ఎక్కడ అయినా అవకాశ వాధులు ఊస ర వెల్లులు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రంగులు మార్చగలరు జెండాలు మార్చ గలరు అజెండా లు మార్చగలరు ఏ క్షణం లో న యీ నా ఏ ఘడియా లో నయనా పోజు లెక్కువ-- పోకడలు ఎక్కువ వాళ్ళ కు కావలిసింధీ ఆధిపత్యం-- రాజరికం ఒక మెట్టు మీ ధ ఉండాలి ఏ రోజు అయినా---ఎక్క్డ డయినా వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ ప్రాబల్యం కోసం ఎన్ని గారడీ ఆటలు అయినా ఆడ గలరు ఆడించ గలరు నమ్మించ గలరు మాటలు మార్చ గలరు మోసగించగలరు ఎంత కై నా తెగించగలరు దేశం-- రాష్ట్రం --ప్రాంతం నీతి--న్యాయం-- సమా న త్వం రాజ్యాంగం-- వీటితో పని లే ధు వాళ్ళకు కావలిసింధీ రాజకీయ పరం గా ఆర్థిక పరం గా ఏధుగుతూ పెరుగుతూ---- సుపేరియారీ టి--అమెరికా పోలీస్ పెత్తనం లా--- అమెరికా అయినా అమలాపురం అయినా రాసుకున్న రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి-- ఒక్కలు-- ఇద్దరు --పెత్తనాలతో కుల పిచ్చి తో-- గోకుడు తో నా-- మన ల తో నడుస్తున్న అమెరికా భాష సంగాలు ఫోరమ్ లు--ఫెడరేషన్ లు ఏ దేశమేగినా--ఎంధుకాలిడినా దొర ల నై జ౦ మార ధు పోకడ మార ధు-- అన్ని౦ట్లో అరితెరులు అన్ని రకాల ఇక మతులు చేయగలరు దొర లు -మకుటం లేని మహా రాజులు నాడు--- నేటివరకు దొర లు-- ఉన్నొళ్ళు డబ్బులు--ఆస్తులు కాపాడుకోడానికి పెంచుకోడానికి రాజకీయం-- అధికారం వారసత్వంగా అంటిపెట్టుకుని ఉంటూ జీవిస్తూ --???? దొర ల పాలన--- ఎంతకాలం ఇంకెంతకాలం ?????????????????? దొర లు లెనొళ్ల-- ధ లీ తుల జీవన గమనాల గమకాల ను గుర్తించ రూ ధారిధ్యం తో నాధా న్ బ తుకుతో బ త క లేక ఛా వ లేక ఆంధోలన ల తో అక్రంధనల తో కులం-- మతం పేరుతో అణిచీవేతలకు అవమానాలకు గురి అవుతూ సమానత్వం లేక ఏళ్లతరబడి సమాజం లో అభివృద్డిలో--అధికారం లో ఆర్థికం గా-- రాజకీయాం గా సామాజికం గా వెనుకబడిన వారు వెనుక్కి నెట్టి వెయబడినవారు--ధ లీ తుళు ఇక మార్పు అవసరం ధ లీ త శకం రావాలి ధ లీ త పాలన రావాలి ఇంతకాలం దేశం లో--రాష్ర్టం లో రాజకీయాలు నడుపుతున్నధి రాజకీయవేత్తలు--ధో ర లు--ఉన్నొళ్ళు నాయకులు కారు we only have politicians- not leaders నిజం అయినా నాయకులు కావాలి లాల్ బహద్దూ ర్--న౦ధా-- జయప్రకాష్ పుచ్చలపెల్లి-- వావిలాల-- రావి లాంటి నేతలు రావాలి మళ్లీ పుట్టాలి మార్పు రావాలి-- తేవాలి మార్పు రావాలంటే సామాజిక న్యాయం పునాధి గా గల రాజకీయం అవసరం అధికారాన్ని--రాజరికాన్ని అగ్రకులాల చేతినుండి ధ లీ త బహుజన చేతుల్లో కి మారినప్పుడే---అధె నిజమయనా సామాజిక న్యాయం ప్రజాసామయం ఆ రోజు రావాలి కొత్త రాష్ట్రం లో కొత్త పిలుపులతో కొత్త ఆలోచనలతో కులాతీత మాతాతీత వ ర్గాతీత సమాజం నిర్మించు కుంధాం ధ లితు లూ కదలండి ముంధుకు నడవండి చరిత్ర ను న డు పించడానికి మార్పు తెండి రాక మాన ధు ఆ రోజు రాక పోధు ఆశిద్దాం -------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OtvBZD

Posted by Katta

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ వాడో నవ్వుల దీపం ॥ వాడెప్పుడూ అలా నవ్వుతూనే వున్నాడు బాల్యం నుండి ఈ రోజు వరకు వాడెప్పుడూ అలా వెన్నెలలా తెల్లగా నవ్వుతూనే వున్నాడు దేహమంతా నరాలుదేరి కొవ్వన్నదే పట్టని పక్కటెముకలతో నల్లగా నిగ నిగ లాడుతూ వాడెప్పుడూ అలా ఇరిడి బొమ్మలా నవ్వుతూనే వుంటాడు మట్టిని పిసికి మట్టిని పీల్చి మట్టిని తిని మట్టితోనే బతుకంతా పెనవేసుకుంటూ వాడెప్పుడూ అలా మట్టి దీపంలా నవ్వుతూనే వుంటాడు నాతో పాటుగా వాడి వయసూ పెరుగుతూనే దూరంగా పోతున్న నన్ను చూసి వాడు అలా నిటారుగా ఆకుపచ్చ చందమామలా నవ్వుతూనే వున్నాడు వాడలా నవ్వుతూ వున్న సమయమే నాకెప్పుడూ మరో వసంతాన్ని హామీ యిస్తూ వాడితో పాటు నేనూ నవ్విన క్షణం నాలో వేయి దీపాలను వెలిగిస్తాడు (తే 18/03/2014 దీ 10.20 PM)

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OtvBJ4

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు ఎవరికీ పుడతామో అసలు తెలియదు ఆకలితో కడుపు నేప్పితో అడగటం తెలియదు ఎవరిని చూస్తున్నామో అసలు తెలియదు ఎవరు ఏమౌతారో చెపితే కానీ తెలియదు ఐదేళ్ళ ప్రాయం లో బడికి ఎలా వెళ్ళాలో తెలియదు పక్కన వాళ్ళతో ఎలా మెలగాలో తెలియదు చదువు అయిపోతే ఏమి చెయ్యాలో తెలియదు ప్రతిదీ అమ్మ నాన్న చూస్తుంటే నేను ఏమి చెయ్యాలో తెలియదు వంద మంది ముందు కూర్చోబెట్టి చూపులు అంటే తల ఆడించటం వాళ్లకు కావలసిన అంశాలు వుంటే ఆ అపరిచితునితో వివాహం అంతా తెలిసిన నా వాళ్ళ నుండి ఎవరు తెలియని కొత్త కుటుంబం లో క్రొత్త పరిచయాలు , పరామర్సాలు తెలుసుకోవాలి అప్పటి దాకా నాకోరకై వున్నా వాళ్ళు బంధువులు గా మారితే నాది అనుకున్న ఇంటిలో నేనే పరాయినై పొతే కొత్త మనుషులతో సర్దుబాటులు సరిచేసే మనుషులు లేక చావా లేక బ్రతకలేక ఇమడ లేక ఉండలేక చెప్పలేక అర్ధం కాని జీవితం అనుభవించే కంటే నా ఇల్లే మంచిది భావన తో వివాహబందం తెగతెంపులు చేసుకుంటే నా ఇంట్లోనే నాకు శత్రువులు , నా వాళ్ళే నాకు అపరిచితులు నిన్న నవ్వినా నా మోమే నేడు వేదన అనుభవిస్తే నా ఇంట్లోనే నా వాళ్ళ మధ్య ఒంటరి జీవితం ఇదీ ఒక నరక భావనే కదా .. ఈ నరకం కంటే అక్కడ మరణం మేలా లేక ఇలా జీవచ్చవం లా జీవించడం న్యాయమా ... దీనికి పరిష్కారం వున్నదా ... నా బాధలో న్యాయం ఉందా !!పార్ధ !!18mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1LH5P

Posted by Katta