పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Madala Venu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Madala Venu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2014, శనివారం

Madala Venu కవిత

సామరస్యపు సమ శల్యపు పెనుగులాటలో అప్పటి వరకు అణిగివున్న ఆవేదననంతా ఈ అర్ధరాత్రీ తనే అందుకుంది. పాల సముద్రుడి నురగలో, తేనె ప్రబుద్దుడి తరగలో, మల్లె వర్ణపు తాలికలను ప్రకృతికి ఇప్పించి పురుషుడిని సూరుణ్ణి చేస్తుంది. అలజడులన్నీ అణిచివేసే ఈ రాతిరి అందరి అగాదాలను ఆవహించుకొని నల్లటి రంగులోకి మారుతుంది ఇలా ప్రతీ రాత్రి .

by Madala Venu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d8ZZna

Posted by Katta

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

మాదాల వేణు || ఈ ఉదయం||


అరుణ కిరణ ఉదయంతో నా రుదిరకాంతి మెరవాలి
నా ఉహల విరితోటలో వర్షధార కురవాలి
సకల కళా సమ్మేళన భూతల వేదికపై శాంతి కోరు వైతాళిక గేయం నే కావాలి
నా జాతి పదిలపరుచుకున్న అజరామర పీఠికలో
ఆది పలుకులన్నీ నా ఘంటమే రాయాలి
శ్రవణమాస మయురమై నా అమ్మ ప్రేమ మురవాలి
అంబారానికేగసే నా ఆశల రెక్కలకు ఆ సాంతం సహకారం ఈ ఉదయం కావాలి.....
1.09.12