కవిత్వంతో ఏడడుగులు 21 . పీట్ హైన్ జీవితం చాలా కుతూహలం రేకెత్తిస్తుంది. నాజీలు నెదర్లాండ్సుని ఆక్రమించినపుడు అతను రాసిన ఒక "గ్రక్ (Grook)" (అతను కనుగొన్న ఒక డచ్చి కవితా రూపం) నాజీల పరిశీలనను తట్టుకునిమరీ ప్రచురించబడింది. కారణం వాళ్లకి దాని అంతరార్థం బోధపడక పోవడమే. [CONSOLATION GROOK Losing one glove is certainly painful, but nothing compared to the pain, of losing one, throwing away the other, and finding the first one again. ఓదార్పు . ఒక గ్లోవ్ పోగొట్టుకోవడం బాధాకరమే. కానీ, అంతకంటే బాధాకరమైనది రెండో గ్లోవ్ ని కూడా విసిరేశాక మొదటిది దొరకడం. (ఇందులో సందేశం, మీరు తాత్కాలికంగా స్వాతంత్ర్యాన్ని కోల్పోయినా (మొదటి గ్లోవ్), మీరు నాజీలతో చేతులుకలిపి మీ దేశభక్తిని పోగొట్టుకోవద్దు (రెండో గ్లోవ్ విసిరెయ్యడం). ఎందుకంటే, మీకు మళ్ళీ రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీరు చింతిస్తారు. అని)] అందులో అతను స్వాతంత్ర్యాన్నీ, దేశభక్తినీ, ఆత్మగౌరవాన్నీ సంకేతరూపకమైన ఉపమానంతో పొల్చి చెప్పేడు. అది డచ్చి ప్రజలకి అర్థం అయింది. కుంబెల్ (సమాధి రాయి) అన్న కలం పేరుతో పీట్ హైన్ 7 వేలకు పైగా "గ్రక్స్" రాసేడు. ఈ కవితలో అతను చమత్కారంగా చెప్పిన భావన: మనం నిజంగా ఎటూ నిర్ణయించుకోలేని సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. మనకి కొన్ని తెలిసో తెలియకో ఇష్టాయిష్టాలు ఉంటూనే ఉంటాయి. నిజంగా నాణెం ఎగరేసి దానిద్వారా మనం నిర్ణయించుకోవాలని అనుకున్నా, నిజంగా అటువంటి పరీక్షకి పెట్టే వేళకి మనకి తెలిసిపోతుంది.... మనకి ఏది కావాలో ఏది అక్కరలేదో. ఎందుకంటే, నాణెం ఎగరేయ్యగానే మనకి ఇది పడితే బాగుణ్ణనో, ఇదిపడకపోతే బాగుణ్ణనో మనసులో అనుకుంటాము. ఆ ఫలితం యొక్క అవసరాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించడమో, మొక్కులు మొక్కుకోవడమో చేస్తాము కూడా. ఆ ఒక్క క్షణంలో ఎంతవేగిరం మన మనసు ఇష్టాయిష్టాలు తేల్చేసుకుంటుందో ఆ మానసిక స్థితిని ఆయన బాగా చెప్పాడు. . బైరాగి చిట్కా... పీట్ హైన్, డచ్చి కవి . మీరెప్పుడైనా తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు ఏ అభిప్రాయమూ లేక ఏది నిర్ణయించుకోవాలా అని సతమతమౌతున్నపుడు ఈ సందిగ్ధనివారణకి ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక నాణెం ఎగరేసి బొమ్మో బొరుసో కోరుకోవడమే చెమటతుడుచుకుంటూ ఏది పడుతుందా అని మీరెదురు చూస్తుంటే సంభవత మీ సమస్య తీరుస్తుందనికాదు నా ఉద్దేశ్యం; ఒక సారి మీరు గాలిలోకి అలా నాణెం విసరగానే, అకస్మాత్తుగా మీ రేది పడాలనుకుంటున్నారో మీకు తెలిసిపోతుందనే. . పీట్ హైన్ (16 December 1905 – 17 April 1996) డేనిష్ కవి , శాస్త్రజ్ఞుడు, గణితశాస్త్రవేత్త, రచయిత, పరిశోధకుడు, ఆవిష్కర్త, రూపశిల్పి. . A Psychological Tip . Whenever you're called on to make up your mind, and you're hampered by not having any, the best way to solve the dilemma, you'll find, is simply by spinning a penny. No - not so that chance shall decide the affair while you're passively standing there moping; but the moment the penny is up in the air, you suddenly know what you're hoping . Piet Hein (Kumbel) (16 December 1905 – 17 April 1996) Danish Scientist, Mathematician, Inventor, Designer, Author, and Poet. His biography makes very interesting reading. Read it here: http://ift.tt/MAZYvP
by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d6o5Nq
Posted by
Katta