Mario Puzo మరో నవల Fools Die గూర్చి చెప్పుకుందాం రమారమి 473 పేజీల ఈ నవల గురించి ఏదోకొద్దిలో రాసెయ్యడం సమంజసం కాదేమో అనిపించింది.సరే..సాధ్యమైనంత వరకు ముఖ్య సన్నివేశాలని చెప్తూ బ్రీఫ్ గా మననం చేసుకుందాం.70 వ దశకంలో రాయబడినది ఇది.మొదలు పెట్టడమే పుస్తకాన్ని తను మాట్లాడుతున్నట్లుగా మొదలు పెడతాడు.ఒక మనిషి గురించి మీకిపుడు చెబుతాను..అతని కి స్త్రీలపై గల ప్రేమ గురించి చెబుతాను. అలా ఒక ఉరవడిలో...కొన్ని కఠిన వాస్తవాలను చెబుతాను..అంటూ రచయితే ముందు పేజీల్లో మాట్లాడుతాడు. I will make you feel the painful beauty of a child,the animal horniness of the adolescent male,the yearning suicidal moodiness of the young female. దీంట్లో ప్రేమ గురించి ఉంటుంది. అయితే ప్రేమ గురించి మాత్రమే దీనిలో చెప్పలేదు.ఇది ఒక యుద్దానికి సంబందించినది కూడా..!Let me get to work.Let me begin and let me end. అంటూ రచయిత 1 వ భాగాన్ని ముగిస్తాడు. రెండవ భాగం లో సీను డిఫరెంట్ గా మొదలవుతుంది.లాస్ వెగాస్ లోని కేసినో ల గురించి బాగా అద్యయనం చేసి రాసినట్లు అనిపిస్తుంది.మొత్తం జూద గృహాల మద్య జరుగుతుంది ..ఈ లాస్ వెగాస్ లోని ఓ ఖరీదైన హోటల్ కం కేసినో Xanaddu.దీన్ని Gronevelt నిర్వహిస్తుంటాడు.గాడ్ ఫాదర్ ముందు చూపువల్ల లాస్ వేగాస్ లో జూద గృహాలు చట్టబద్దమయ్యి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తుంటాయి.దేశం లోని నలుమూలనుంచి,ఇతరదేశాలనుంచి బాగాడబ్బులున్నవాళ్ళు ఇక్కడికొచ్చి కేసినో ల్లో బ్లాక్ జాక్ లాంటి రకరకాల గేంబ్లింగ్స్ లో కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడే మన ప్రధాన పాత్రలు కొన్ని తారసపడతాయి. వాళ్ళెవరంటే Merlyn,Jordan,Cully ఇంకా Diane. ఈ మెర్లిన్ ఒక రచయిత.హాలివుడ్ సినిమాలకి పనిచేసి బాగాడబ్బులు ,పేరు సంపాదించాలనేది ఇతని కోరిక.జోర్డాన్ లాస్ ఏంజల్స్ నివాసి.ఇక కల్లీ Xanadu లో ఉంటూంటాడు.అలాగే Diane అనే ఈ అమ్మాయి ఆ కేసినో shill గా పనిచెస్తుంటుంది.Provocative గా డ్రెస్ వేసుకొని ఆ ఆటగాళ్ళకి పక్కన ఉంటుంది.ఒక మాటలో చెప్పాలంటే ఒక సారి వచ్చినవాణ్ణి నాలుగుసార్లు వచ్చేలా చేయడం వీళ్ళ డ్యూటి.చిప్స్ అందివ్వటం ఇంకా కొంత జాబ్ చార్ట్ ఉంటుంది లెండి. వీళ్ళంతా ఆ హోటల్ లో Baccarat టేబుల్ దగ్గర కలుస్తూ ఫ్రెండ్స్ అవుతారు.కేసినోల్లో ఆడేవారికి ప్రత్యేకంగా గదులు కూడా ఉంటాయి. హాయిగా ఆడినన్నాళ్ళు ఆడి వెళ్ళవచ్చు. వీళ్ళలో జోర్డాన్ చాలా బాగా ఆడి డబ్బులు బాగానే సంపాదిస్తుంటాడు.అయితే ఇతని భార్య కాపురం చేసిన తర్వాత 20 ఏళ్ళతరవాత ఇంకొకరిని చేసుకొని వెళ్ళిపోతుంది.వీరి ముగ్గురు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నప్పుడు కూడా ఆమె గురించి కోపం వ్యక్తం చేయడు.ఇతనికి మళ్ళీ ముగ్గురు సంతానం కూడా..! బంధాలని గౌరవించరని అనలేను గాని అసహాయంగా బంధాలమధ్య నిలబడి అర్ధించడం వారిలో ఉండదనిపించింది.నిజం చెప్పాలంటే ఎంత గొప్ప ప్రేమ అయినా ఒక ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది దానికి....గొప్ప వేదాంతి అయినా అయి ఉండాలి లేదా అల్టిమేట్ ప్రాక్టికాలిటీ అయినా ఉండాలి.రెండు ఒక చోట అవి షేక్ హేండ్ ఇచ్చుకుంటాయి. ఆ..సరే...ఈ జోర్డన్ కేసినో లో గేంబ్లింగ్ రాత్రి పగలు ఆడి విపరీతంగా ఆడి బాగా సంపాదిస్తుంటాడు.అప్పుడు ఆ యజమాని Gronevelt కి అనుమానం వస్తుంది.వెంటనే Cully ని పిలుస్తాడు.ఏమిటి ఆ జోర్డాన్ బాగా లాభాలు తీస్తున్నాడు.అతణ్ణి ఏదో కరణం చెప్పి బయటికి పంపించే ఏర్పాటు చెయ్యి అంటాడి.ఇంతకు విష్యమేమిటంటే ఈ Cully అనేవాడు జూదగాళ్ళతో కలిసి తాను ఆడుతూనే యాజమన్యానికి Spy లా పనిచేస్తుంటాడు.అంటే బాకరెట్ టేబుళ్ళదగ్గరున్న వర్కర్స్ గాని ఇంకొకళ్ళుగాని ఏమైనా సీక్రెట్ డీలింగ్స్ చేసుకొని యాజమన్యాన్ని బురిడీ కొట్టిస్తున్నారా అని చూస్తుంటాడన్నమాట. అయితే ఉన్నట్టుండి జోర్డన్ ఆత్మహత్య చేసుకుంటాడు. తెల్లారిన తర్వాత ఈ వార్త కల్లీ ,మెర్లిన్ కి బాధగా చెబుతాడు. 'He blew his head off.He beat the house for over four hundred grand and he blew his fucking brains out.' ఆ తర్వాత కధ వచ్చేసారికి చూద్దాం.
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vaiiOF
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vaiiOF
Posted by Katta