పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Krishna Mani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Krishna Mani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Krishna Mani కవిత

దయనీయమైన కాలమాయే దయలేని వరుణుడికి కళ్ళు మూతలాయే ! అందుకే తిరిగి నా బాధను వ్యక్తపరుస్తున్నాను .అడ్మిన్ వారు సహకరించగలరని విన్నపం . సుక్క బొట్టు _________________________కృష్ణ మణి మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవిరాజుల బలముదిగి జింకపిల్లల చెలిమిలాయే నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! కృష్ణ మణి I 15-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywVFO

Posted by Katta

23, జూన్ 2014, సోమవారం

Krishna Mani కవిత

సాగరం ______________________కృష్ణ మణి ఆకాశపు అంచున ఆరేసిన కొంగుపై మెరిసే కాన్తులెన్నో చూసివద్దామా నేస్తం చెదిరిన మనసున చీకటి కుంపటిలో మిణుగురులని వదిలి వద్దామా ! కమిలిన చోట తెల్లని కణాలను ఇచ్చి మత్తున నిద్రపుచ్చి వద్దామా నేస్తం గతాల గుద్దులాటలో గతించిన ప్రేమ గుర్తులను గుర్తు చేసి గుదిబండలను జరిపి వద్దామా ! ఎంతకాలం ఇలా గీతలనడుమ గోతుల తీసి గోడల కట్టడం ? నడువు లోకాన్ని కలుపుతూ కొత్త దారిలో నేలపై గీతలను నీటిపై రాతలుగా మార్చుదాం దింపుదాము అందరిని చేపలుగా తలచి హద్దులేని ప్రేమసాగరంలో తారతమ్యాలు చెరిపి ! కృష్ణ మణి I 23-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pZRrnO

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

Krishna Mani కవిత

నమో ఆంధ్ర మాత _____________________కృష్ణ మణి నమో ఆంధ్ర మాత గత వైభవానికి చిరునామా రాయల రాజసమా వెంకన్న దర్శనమా అమరావతి స్తూపమా తెలుగు పలుకు స్వరమా ! పొట్టి శ్రీరాములు త్యాగ నిరతికి తార్కాణం భారతావనిలో పువ్వై విరిసిన నవ రాష్ట్రం సాగరగతీరం బహుముఖ లాభం కాటను దొర ప్రసాదం నిండిన మాగానం ! శ్రీశైలం మల్లన్న బెజవాడ దుర్గమ్మ అరసవెల్లి సూరన్న కాళహస్తి లింగన్న ఏరికోరి వెలిసిరి ఎల్లరులకు ఎదురులేదు పలు దిశల కీర్తిపరులు తలదించని నీ బిడ్డలు ! రాయలసీమ పౌరుషం కోనసీమ అందం అరకు కొండ చలువ గుంటూరు కారం కృష్ణ గోదవరి తుంగభద్రల పరువల్లతో పరుగుపెట్టు తోబుట్టులలో అడుగు ముందు పెట్టు ! కృష్ణ మణి I 22-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVtIBT

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Krishna Mani కవిత

పోరాటం ____________________కృష్ణ మణి పొట్ట విచ్చుకొన ఆకలాకలంటూ అలసిన విత్తుల బిత్తర చూపు తడసిన తనవున పొట్టపగిలి నార తేలి మురుగుతున్న సమయం ! దాహం ఎరుగని పచ్చ రంగు పిచ్చి రంగుగా మారే తరుణం తనలోనే తాను కుమిలి కమిలే ఆకు అలముల మూగ రాగం మొదలు తడువా అడ్రస్సు తెలువక ఉన్న చోటే ఎండుతున్న మొద్దులు ! కంటిచూపుకు కనబడు మడుగుల బురదలో ఆడ కాళ్ళు లేని చిటారు కొమ్మల చిట్టి చేతుల ఆరాటం నింగిలో దిక్కులు ఉంచి అడుగున అలుపెరగని పోరాటం చినుకు రాల్చి చూడు చిందులేస్తానంటున్న ఆకలి తిప్పలు వరద ఒంపి చూడు ఉరుముతో రంకెలేస్తామంటున్న కప్పలు ! కృష్ణ మణి I 20-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rds0fU

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Krishna Mani కవిత

(స్కెచ్ కవిత ) పేగు బందం ____________________కృష్ణ మణి ఏమయ్యా గురువయ్య ? ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ? చెయ్యాలనే ఉంది కనకయ్య సదువుతున్నపిల్ల కదా పూర్తి కానీ సబందాలోస్తున్నై ఇప్పుడే వద్దంటుంది ! బాగుంది వరస అమ్మాయి వద్దంది అయ్యానెమో ....సర్లే అసలే రోజులు బాగాలేవు పైగా పట్నంలో ఉంది ,వస్తా ! ఏమండీ.. ఎందుకే గావు కేక ? అమ్మాయి ఫోన్ చేసింది...ఔనా ఏంటటా ? మన బిడ్డ, మీరెవరు అందండీ ? నీకు పిచ్చెక్కిందా ఏంటి ? సాగర్ అంట అమ్మాయి సీనియర్ పిల్లాడు . అయితే ఏంటే ? ఒప్పుకుంటారా లేక ఎల్లిపోనా అంటుంది ! గుండె పట్టుకొని కూర్చున్న తండ్రి మూలన కొంగు మూతికి పట్టి కారే కన్నీటిని ఆపలేని అశక్తురాలు ! ఈ మాట ఎవరితో చెప్పుకోము ? ఏమని నిన్దిన్చుకోము ? ఆలోచన లేని చింతలో రాత్రి గడించింది ! పదవే పట్నం పోయి పిల్లతో కలిసి ఆరా తీద్దాం ఎవరో ఏమైంది అని అడిగే లోపే , మన పరువు మర్యాద గంగలో కలిసే లోపే ! ధైర్యం చెప్పి బయలు దేరిన చింత ! పట్నం వెళ్లి హాస్టల్లో చూడగా అమ్మాయి లేదు అయ్యో భగవంతుడా ? అనే లోపే వచ్చారు పోలీసులు మేజర్ అమ్మాయికి మీరు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మీ అమ్మాయి కంప్లేంట్ ఇచ్చింది , పదండి స్టేషన్ కి నోరు లేవని స్తితిలో తల్లితండ్రులు ! మీరోప్పుకోరని ఇలా ముందడుగేసం నాన్న ! కూతురి మొహం ఎలా చూడాలో అర్థం కానీ తండ్రి ఏమని తిట్టాలో అని ఆవేశంతో తల్లి ! ఏమని సమర్దిన్చుకోవాలో అని అబ్బాయి ! ఇంతలో అబ్బాయి తరుపు పెద్దలు మా వాడికి మందుమాకు పెట్టి వలలో వేసుకుందని నింద! వారించ అశక్తుడైన అబ్బాయి మౌనమ్ ! తల ఎత్తి కూతురిని చుసిన తండ్రి మాట బట్టక అబ్బాయిని నిలతీసిన అమ్మాయి ధైర్యంగా ఉండు మా వాళ్ళతో మాట్లాడుతా ? ఇంతకాలం ఎం చేసినట్లు అనాలని ఉన్న నోరు రాని బేల ! ముగిసిన మంతనాలు రమ్య , మనం తప్పు చేసాం ! నువ్వు మీ వాళ్ళు చెప్పినట్లు విను నేను మా వాళ్ళు చెప్పినట్లు వింట ! నన్ను అమెరిక పంపుతారంట ! వయసు పెరిగిన తెలివి పెరగని అమ్మాయిని చూస్తూ తల్లి '' కని పెంచింది , నిన్ను కష్టపెట్టడానికా ? నచ్చిన తిండి నచ్చిన బట్ట నచ్చిన నగ వద్దన్నా మారం చేస్తే పట్నం చదువు ఇదేనా మేం చేసిన పాపం '' పదవయ్య పోదాం ఇంకా ఎం మిగిల్చింది ! భుజం తట్టిన తండ్రి ''గుండెలపైన ఆడావని గుండెల తంతే ఎట్లమ్మ ? వేరేవాన్ని నచ్చుకొని చెప్పు ఆఫ్రికా ఆదిమానవుడైన సరే'' మేం వస్తాం ! ఏమయ్యా గురువయ్య ? ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ? చెయ్యాలనే ఉంది కనకయ్య సదువుతున్నపిల్ల కదా పూర్తి కానీ ....... కృష్ణ మణి I 17-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1slClKY

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Krishna Mani కవిత

ఏమయ్యింది నాకు ? __________________________కృష్ణ మణి ఏమయ్యింది నాకు ? ఇందాకనే చాయి తాగి పేపర్ చూస్తున్న నా శరీరం నేన్జెప్పినట్లు ఇనుటలేదు ఏమయ్యింది నాకు ? ఏమే ! ఎకడున్నావు ఒక్కసారి ఇలా రా .. అని అందామంటే నోరుకుడా లేవట్లేదు ఏమయ్యింది నాకు ? నా చుట్టూ నా వాళ్ళు చేరారు హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నన్ను అని చెప్పాలని ఉంది ,కాని ఎలా ? కళ్ళలో కన్నీరయిన రావట్లేదు నోరు తెరుచుకుంది ,పెదవి ముయలేక పోతున్న ఏమయ్యింది నాకు ? వాకిట్లో పడుకోపెట్టారు అయ్యో హాల్లో నైన ఉంటె బాగుండు కనీసం ఫ్యాన్ ఉండేది నన్ను చూసి ఏడుస్తున్న వాళ్ళతో ఏడవకండి అని అనలేక పోతున్న నా భార్య నాపై పడి పడి ఏడ్చి సోమ్మసిల్లింది ఆ ప్రేమను తట్టుకోలేక పోతున్న తనకెవరయిన కాస్త చాయి తాపండి అని ఆనాలనుకుంటున్న నన్ను అర్థం చేసుకున్నట్టున్నారు నా ఆలికిచ్చారు ! నా పిల్లలు నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఇంతకు ముందెప్పుడూ ఇలా జరుగలేదు ఒక్కసారి రండిరా అంటే తీరిక లేదు అనే వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టనేమో ! అయ్యో నా బందు జనం ఊరు వాడ వచ్చారు అందరు కుశలమేనా ? ఎందుకు అందరు జాలిగా చూస్తున్నారు నేను చలించట్లేదనా ,నన్ను హాస్పిటల్ కి పంపట్లేదు నేనెప్పుడు భాగు పడతాను ? అదేంటి బాజాలు , కట్టెలు , తెల్ల బట్ట , పూలు ఇదేమి విడ్డూరం నాకు స్పర్శ లేదని వేల్లగోడతారా ? వద్దు వద్దు నన్నెత్తొద్దు నాకోసం ఇంతమంది జనాలా ? ఒక పక్క గర్వంగా ఉంది కాష్టలగడ్డ వచ్చింది , దేవుడా ఒకసారి కదిలే శక్తినివ్వు నేను బతికే ఉన్నానని చెప్పడానికి ప్చ్ ! దయలేని వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు ! కట్టెల నడుమ పిడకలు పిడకల నడుమ నేను మంటల్లో కాలుతూ మసిబారిన చర్మం నా కాయం మాయం అయ్యింది నా అనే ఆనవాలు కనుమరుగయ్యింది ఇప్పుడేమి చెయ్యను ? ఇప్పుడేమి చెయ్యను ? ఇప్పుడేమి చెయ్యను ? ''' ''' ''' కృష్ణ మణి I 16-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lxImPs

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Krishna Mani కవిత

పేదవాడా ! _________________________కృష్ణ మణి పేదవాడా ! నా మనసును దొంగలించిన పిరికివాడ నీ చూపు సోకినప్పుడే అగుపించెను నీ అభిమతం కొసరి కొసరి మాటల మర్మం ఎరుగనా పిచ్చివాడ ! ప్రేమ జల్లులో తడిసింది హృదయం వినిపించావు విరహవేదన అగుపించావు చిగురించిన పువ్వులా మదిలో ఎదో మంత్రం నిన్ను నాలో కలుపుతుంది మాయమర్మం తెలిసిన మాంత్రికుడా విహంగనయన వీక్షకుడా ! నీ రాకకై ఎదురు చూపులు యవ్వనం దాల్చిన క్షణము నుండి ప్రేమపల్లకిలో కొంటె చూపును దోపిడీ నేర్చిన దొరవు బంటువై నా స్వేదామృతం అద్దుకొన వచ్చిన దీరుడా అగ్గిలో మగ్గదలచిన యోధుడా ! అందుకో జారిన మనసును పొందుగ దాచుకో కడవరకు నీ గుడిలో దేవతను నిరంతరం నీ శ్వాసను నీ కలల రాణిని నీ తోడు వీడిన మీదటే నా శ్వాస ఆగు ఇదేరా నీ చెలి బాస ! కృష్ణ మణి I 13-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TSQ9gJ

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Krishna Mani కవిత

ఒడువని ముచ్చట __________________కృష్ణ మణి ఎవలుల్లా ….! కొమరయ్యింటికాడ కయ్యమైతునట్లుంది కోడలు నోరు జోరుమీదున్నదీ ! ఎందుకు జెయ్యదు మల్లక్క చేతికందిన పంట పురుగు పాలు పెయ్యి మీది బంగారం బ్యాంకు పాలు ! అమ్మగారింటికి పెండ్లికి పోవల్నంట ఏం జేస్తది పాపం పెండ్లైనుండి పోరు వడుతుంది ఏరువడుతనని మర్దలి పెండ్లికి సగం భూమినమ్మే మర్ది సదువుకు మామ ఇంకింత అమ్మే ! పిల్లల ఆకలి సూడలేక అడుగు బయటబెడుతనంటే మొగుడొద్దంటడు ఓపలేని కోపాన ఎదురంటే ఏమైతది ఈబ్బలిగె అమ్మగారొచ్చే ఏముంటది ఒడువని ముచ్చట ! అందరిల్లుల్ల ఉన్న గతే కదక్క ! కృష్ణ మణి I 12-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l559DI

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Krishna Mani కవిత

బలిరాజు __________________కృష్ణ మణి హోటల్ ముందు చేతులెత్తిన ఎండిన మొహంతో పసి మొగ్గ చిల్లర జల్లెడలో చిన్నబోయిన చిట్టికన్నులు పసితనపు ఛాయలు మరచిన బతుకుజీవి బతుకు కోసం బతుకుతూ బతుక నేర్చిన అతుకుల చెడ్డి ! గుడి మెట్లు నాయేనంటాడు దర్గా మెట్లు నాయేనంటాడు నలుగురు కలిసే చోటు ఏదైనా కల్మషం లేని బిక్కచూపుతో ! ఆకలికేకల ఆరాటం చిల్లర అలికిడితో చిద్విలాసం నెత్తిన పేనుల పరుగులు చేయ్యిచాచి బతిమాడు అడుగులు ! నిండిన రోజున మహారాజు ఎండిన రోజున బలిరాజు కులం మతం ఎరుగని కుసుమం భాష వేశం తెలియని కనకం ! నాకెవరు లేరని చింతరాని చిరుప్రాయం అందరూ నావారని కుక్కలతో సహవాసం చిల్లర అందిన క్షణాన దిగులు మరచినవైనం నడిరోడ్డుపై కళ్ళముందు కరుగుతున్న బాల్యం ! కృష్ణ మణి I 09-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1muIrAc

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Krishna Mani కవిత

నా ఏడుపు ____________________________కృష్ణ మణి ఆకాశం అట్లనే ఉంది మొన్న జూసినట్లు చుక్కలు మెరుస్తునే ఉన్నాయి తెప్పలు తిరుగుతునే ఉన్నాయి కాని పచ్చని పంట పొలాల నా ఊరు ఇప్పుడు పట్నమై ఏడుస్తుంది ! నాగరికత నా చెట్లను మింగింది నా నేలను మింగింది నా గాలిని గలీజ్జేసింది కంపనీల మన్నువడ నీళ్ళను మింగి ఇషం ఇడుస్తుంది రుపాయిబెట్టి నీళ్ళు తాగితే పానమంత కలకల ! అడుగున గుంత కొట్టి ఆకాశానికి మెట్లుగట్టినట్లుంది ఆకరికి పక్షుల జాగలనుగిట కబ్జా చేసిన్రు ఇప్పుడు నా ఊరిల అడుగు పెడతలేను మీద పరిశిన సిమెంటు రోడ్డు మీదే మిషీను ఉందని సంకలుగొడుతున్రు కరెంటు కనుమరుగైతెగాని కండ్లు తెరువరీ పిచ్చికాకులు ! బర్లను తోలుకుదిరిగిన రోజులకేమాఎనో మ్యాకలు గొర్లు గోడ దుంకి ఏండ్లు గడుస్తున్నయి సుద్దమంటే జూపార్క్ పోవలెనేమో భూములకు రెక్కలొచ్చి జీవుల డొక్కలు దేలినయి ఇప్పుడు కప్పలు కూడా కండ్లవడుతలేవు ఎడ్లబండి కనిపిస్తే వింతగ సూస్తున్రు మా పిల్లలు ! నీళ్ళు లేక బోర్ల పోక్కలెండేకాడికి వచ్చింది లోకం ఆప్పట్ల ఏడ సూడు బొందలల్ల అద్దం ఉంటుండే వాగోస్తే పర్కపిల్లల వేట ఉంటుండే సలోస్తే చిత్తలకాయల కాల్చుడు ఉంటుండే ఎండొస్తే తాటిముంజల ఆకలున్టుండే ! నడూర్ల కూసోని మంచి చెడ్డ మాట్లాడుతుండే ఇప్పుడు ఎవడన్న కూసుంటే ఎక్కిరిస్తున్నరు కాముని కాల్చేకాడ కరువైన జనాలు గణేశులకాడ భజనలు చేసి చాన దినాలైతుంది పాడుదమంటే పక్క పాడేటోడు గతిలేడు ! గతిలేని గావరాలా మరి బలిషిన బలుపా ఊర్ల మనషుల్ని కలువాలంటే బోనాలకో లేక బతుకమ్మకో అదిగూడ ఇంకెన్ని రోజులో సూడాలే ! కృష్ణ మణి I 06-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pXiWLz

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Krishna Mani కవిత

ఎటో _______________________కృష్ణ మణి పరిగెత్తే పసి వాగుల గమ్యమెటో రెప్పమాటునా కారే నీటి ఊటలెన్నో రోడ్డుపై పవళించే మొగ్గవాడే బతుకులెటో మాసిన గుడ్డలతో పోరాడే చెదిరిన జుట్టెటో కుప్పలపై కుళ్ళిన కాయల చూపులెటో ! అటో ఇటో ఎటో తెలియని పిల్లగాలుల పయనమెటో కనికరం లేని కసాయి చూపుల కత్తుల అంచున తెగుతున్న మొగ్గలెన్నో ! గత్యంతరం లేని కావడి నడక ముందు వెనక బాదలు బందాలు ఇష్టమయిన పాయసం కానీ పాచిన తిండే కరువు నడిచే దారుల్లో నవ్వే పువ్వుల చూసి మురిసే ఆకలి కేకలు దొంగలుగా మారుస్తున్న దొరల అహంకారం దొంగలుగా రాజ్యదోపిడి చేసి పసి కాంతులను మసి చేసే గుడ్డి సూదులు ! గగనానికి నిచ్చేనలేసే గుండెల్లో రగులుతున్న మంటలు మేమేక్కడికెల్లాలని ప్రశ్నిస్తున్న కరుగే ఐస్ బర్గులు ! ఆ ఊహలకు రూపం ఇస్తే నిత్య సుందర సీతాకోకచిలకలే ఆ చేతులకు పెన్నులనిస్తే అమ్మవాస్య పొద్దు మిణుగురులే ! కృష్ణ మణి I 04-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9iPsm

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Krishna Mani కవిత

పూర్ణానందం _______________కృష్ణ మణి మేఘాల మాలలో మెరిసే వెండికొండల జాతర ఎత్తులో రారాజు ఎవరెస్టు కాక ఇంకెవరు ఎవరెస్ట్ ను మించిన అహంభావం మన సొత్తు ఎక్కనా ఆ కొండ ? భూలోకాన్ని శాషించే సూర్యున్నై పెట్టనా ఆ అడుగు ? అని కలలు కన్నా కనులెన్నో ! ప్రపంచమే తొంగి చూసిన క్షణం పెట్టిన అడుగు పట్టిన జెండాను చూసిన మదిలో పొందిన ‘పూర్ణానందం’ అంతా ఇంతా కాదు సుమీ ! హిమ శిఖరం అ ఎత్తు జీవితంలో మరో ఎత్తు ఎదిగిన కొద్ది ఒదిగే గిరిజన గులాబీలు మన తెలుగు బిడ్డల సాహాసానికి ఆరంభం మా చావుకు మేమేకారణం అని చేసిన సంతకం తిరిగొచ్చిన క్షణాన కన్న కడుపులు పొందిన ఆనందసాగరం ! Krishna mani I 02-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p0qQnA

Posted by Katta

30, మే 2014, శుక్రవారం

Krishna Mani కవిత

అడవి బిడ్డలం _______________కృష్ణ మణి అయ్యా దొరలూ ! అడవి బిడ్డలం ఆకలేస్తే అడివమ్మ పెడుతది ఎంగిలి ఎప్పుడన్న అడిగినమా కడుపులెండినాయని ఎన్నడన్న చెయ్యి జాపినమా ? మనషుల్ని ముంచుడు మీకలవాటేమో కోటక్క జీవరాశేమ్మన్నది ? తేనెపట్టు దోషినమని దొంగలమా ? విప్పపువ్వు ఎరినమని ఎక్కిరింపులా ? అడవి జాతర్లో ఆది బిడ్డలం నాగరికత మీదైతే జులూమా ? అనాగారికులమైనా మనసున్నోళ్ళం ! తీరొక్క జీవాలను బొందబెడతరా ? సిగ్గు శెరం లేదా ? ఊరవతల గుడిసేలేసుకోవలనా ? మీ బిచ్చానికి చాటబట్టాలెనా ? మమ్ముల ముంచి గింజలు పండిస్తరా ? ఆకలైతే అడుక్కోవాలెనా ? మీ అయ్యల జాగిరెమ్మన్నా మా అయ్యలకిచ్చినరా ? లేక అప్పు రాసుకున్నరా ? రాముడు మా దేవుడన్నరు ఇందుకేనా ? మీతోనే ఉంటామని మూసుకున్నం అప్పుడు నమ్మినోన్ని నట్టేట్ల ముంచుడమేనా మీ నీతి ? ఆకులలాలు తినుకుంట మంచిగున్నం మా ఉసురు తీయకున్డ్రి నోరుందని అడుగుతున్నం నోరు లేని అమాయకపు కన్నులకేమి తెలుసు బతికేది మూన్నాలని ! అడుగుతున్నం కాళ్ళకు మొక్కి కనికరముంచమని కసాయిగా నడుస్తే బుల్డోజర్ల కింద పండుతం మా బిడ్డల కోసం ఆ జీవుల కోసం మా జీవినిస్తం ! అడవి వేటలో అడుగు తెల్సినొళ్ళం అయితదేమో కాని కొత్త ‘అవతార్’ మొదలైతది మాటలేకున్న రోషముంది ! 30-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPF0al

Posted by Katta

29, మే 2014, గురువారం

Krishna Mani కవిత

దాహం _________________కృష్ణ మణి కదలిపోరా చెదిరిపోరా మసలిపోరా ఆ కంటినీరులో కొట్టుకుపోరా ! ఒంగిన నడుములు తిరిగిన చేతులు కాళ్ళు మరగుజ్జుల ఆటలో మూటగట్టిన ఒళ్ళు పసి ఆటలు మానిన అమాయక చూపులు ముసలి వారైన పెళ్ళికాని కొడుకులు ! తల్లికావలిసిన పడతి చంటి పిల్లోలె పాకుడు గుండె రాయిగా చావని తనాన బతుకులేని సాకుడు ! కడుపుతీపి మధురం అది చెరగని సత్యం కన్నవారే ముసలితనాన ముడ్డికడికే దుఃఖము ఎవడన్నం గుంజారో ఈ నరకంలో పడ్డారు ఏ పాపం చేసారో ఈ గడ్డపై పుట్టారు మానవత్వం లేని రాజకీయ కొజ్జాల కోలాటంలో కృశించిన తనవులు విషనాగుల ఎంగిలి నీళ్ళే గతని తెలిసినా తప్పని దాహపు కడుపులు ! కృష్ణ మణి I 29-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmiWai

Posted by Katta

28, మే 2014, బుధవారం

Krishna Mani కవిత

(14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ? అని అడిగిన విలేఖరితో ఓ పాకిస్తాన్ మహిళ చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగం . తర్జుమా చేసి స్కెచ్ కవితగా మార్చే ప్రయత్నం చేశాను ) 14 ఆగస్ట్ ________________కృష్ణ మణి విలేఖరి :14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ? 14 ఆగస్ట్ నాకు గుర్తు లేదు ఎలా జరుపుకుంటాం ? ఆ అవును జరుపుకునే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు శవాలను మోస్తున్నాం ఇప్పుడంతా ఈ ప్రాంతంలో ఇక్కడ కాకపొతే పక్క వీధిలో అరుపులు కేకలు వింటున్నాం తెలుస్తది రోడ్డుపై ఎవరో చనిపోయారని వినవస్తది ఇక్కడ ఎవరో ఎవరినో చెంపెసినట్టు కేవలం ఇదే జరుపుకుంటున్నాం ఇప్పుడు ! కేవలం ప్రభుత్వ వైఫల్యాల అగౌరవ సంబరాలు చేసుకుంటాం ఇక్కడ ఆకలితో నగ్నంగా పడిఉన్నారు జనాలు ! వాళ్ళు ఆకాశంలో చక్కర్లు కొడుతుంటారు అదే జరుపుకుంటాం ఇక్కడ , ఇంకా జరుపుకోవడానికి ఏముంది ? ఎక్కడి స్వతంత్ర దినోత్సవం ? అవును వాళ్ళు జరుపుకుంటారు ఎవరి వారైతే తనువు చాలించారో ముందుగా అన్ని దుఖాలనుంచి అన్ని కష్టాలనుంచి స్వతంత్రులైనందుకు దేవునికి ప్రియమైనందుకు ! పాకిస్తాన్ ఇందుకోసం తయారు చెయ్యలేదు తమ్ముడూ చెప్పండి వాళ్లకు ఎవరైతే హాయిగా తిరుగుతున్నారో చాల గొప్పగా నగ్న హృదయాలతో వారికి ఏమి పట్టదు ఏం జరుగుతుందో ? ఏం చేస్తున్నారో ? అందరు చావాలి అందరు పోవాలి ఒకరోజు ! పాత్రికేయుడు :ఆ రోజు ఏదైనా దేవునికి దీపం వెలిగించడం లాగా ..... ఎలాంటి దీపం వెలిగించను ? ఎందుకు వెలిగించను ? నా తోటి వారి ఇండ్లలో శవాలు లేస్తుంటే అసలు ఏమని జరుపుకొను ? చుట్టుపక్కల మంచిగా ఉండి , జనులెవరు ఆకలితో చావకుంటే మన భోజనం మంచిగనిపిస్తుంది కదా . వాళ్ళు చేసుకుంటారు ఎవరికైతే మనసు ఉండదో మనసున్న వాళ్ళం మావల్ల కాదు ! పాత్రికేయుడు : స్వతంత్రం ....... మల్లి స్వతంత్రమంటారు ఇక్కడ మనషులు వరదల్లో కొట్టుకుపోతున్నారు ఇక్కడ జనం నడిరోడ్లో బాంబు పేలుల్లకి శవాలవుతున్నారు విలేఖరి :అలా కాదు మీరు ఒకసారి పాకిస్తాన్ జిందాబాద్ అనండి పాకిస్తాన్ జిందాబాద్గానే ఉంటుంది మనమున్న లేకున్న ఖాళి ప్రాంతంగా ఈ ప్రజలు దిన దినగండంగా పోతునే ఉంటారు ! కృష్ణ మణి I 28-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAno3f

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Krishna Mani కవిత

దొర ________________________కృష్ణ మణి పల్గార తోని పల్లుతోమంగ బంకమన్నుతీసి పెయ్యితోమంగా నలుపుగాని తెలుపు పంచల మెరిశె మల్లిగాడు ! సుట్టం పెండ్లికి తువాలు భుజానికేశి సూడముచ్చటగా నడవవట్టే ఎన్నడులేని షోకుల మెడలుతిప్పే రోషగాల్లు సూడ బావోచ్చిండని పల్కరించి పరాష్కమాడిన పావురాలు ! గుండెల బరువుదించి అల్కగైన పానాన పెండ్లిగాంగానే ఎర్రచద్దర్ల బగారన్నం కూరనీళ్ళ డాల్చ కడుపునిండ కానిచ్చి కల్లుదుక్నం దేవులాడి ముంతకల్లుకి మురిశిన మొటుకశ్టాలు ! చెట్లనీడల కునుకు తీసి పోద్దుదిగంగనే పోయోస్త బామర్దని మొకమింత జేసుకొని పలానోని కార్యంల కలుస్తనని తిరుగు బండెక్కిన మనసున్న దొర ! కృష్ణ మణి I 25-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ml1PSW

Posted by Katta

22, మే 2014, గురువారం

Krishna Mani కవిత

స్కూల్ పిల్లలు ___________________ కృష్ణ మణి లేలేత బొక్కల మీద ఏనుగుల మోత సదువులేమోగాని స్కూల్ డ్రెస్సుల రోత కనికరం లేని కాన్వెంటు స్కూల్ కోత మెదడున A B C D ఎలుకల వేట ! హోంవర్క్ చెయ్యలేదని గుడ్లెర్రజేసిన సారులు బిక్కచూపుల లేత మొగ్గల కండ్లళ్ళ వాగులు ఆటలంటే అలవని పసి తనపు తనువులు ఆనాటి అల్లరి పిల్లల ముద్దుల బిడ్డల నవ్వులు ! అంతుచిక్కని గజి బిజీ పజిల్ పరుగులు బతుకు నేర్పు నేర్వ భుజాన బరువు మోసి బుడి బుడి నడకల ఆడే ఆటలో పాడే పాటలు అలసి అమ్మజేరి ఒడినాడు మెరిసే కన్నులు ! కృష్ణ మణి I 22-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1peXIbz

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Krishna Mani కవిత

పటేలా ! _________________________కృష్ణ మణి మొగులుమీదినుండి దిగొచ్చిన సందమామలెక్కున్నవు పటేలా ఈ తెల్ల బట్టలల్ల ఏడ లేడు నీయసొంటి దొర నడుస్తే పెద్దేనుగులు పందికోక్కోలె ఉరుకుతయి సందులెంట బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుత ! మాలెసపొద్దుకు ముందే మీ గడీల తల దించెటోళ్ళం పటేలా మాతోలు పీకి చెప్పులు కుట్టిస్తం దొర శేరు గుంజాలకు గులాంలము పటేలా పేరుకు మల్లయ్యను మీకాడ మాదిగి మల్లిగాన్ని దొర ! కడుపుకి కష్టం దప్ప ఇంకేమిలే మాదొర మీ సుఖాలను జూసుడే మా సుఖం పటేలా ! దేవునివి పటేలా నీ బండి సప్పుడికి చెప్పులిడిషి నెత్తి ఒంచుతం పటేలా ! నీకన్ను బడితే పక్క పాన్పులే దొర కన్నేర్రజేస్తే కాటికే పోతం పటేలా ఒగనికష్టం ఇంకోగరం సేప్పుకుబతుకుతున్నం దొర పగాని ముచ్చటలేని పసిపోరాలం పటేలా ! పాట పాడి ఆటలాడుతాం దొర సగంల నువ్వొస్తే అలసిన పానాన మల్ల మొదలైతాది పటేలా నువ్వు జెప్పిందే ఏదం నువ్వు అన్నదే నాయం దొర లోకం ఎరుగని ఎడ్డి గోర్రెలం పటేలా ! అని పల్వరించే మా తాత నిద్రమత్తుల మరువని మచ్చలు యాదికొచ్చి కుములుతున్నడు ఆ రోజుల్ల నేనుంటే తేజాబ్ కత్తినైతుంటి ! కృష్ణ మణి I 20-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naH1RJ

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Krishna Mani కవిత

ఉడుకు ______________కృష్ణ మణి ‘’ దక్కనులో దుక్కులు అయ్యా మీరు ఎత్తులో ఉన్నారు మీ పైన పారేనీరు కిందకు దిగుతుంది మీరు పదెకరాలు పారిస్తే కింద మూడొందల ఎకరాలు పారించోచ్చు ధాన్య ఉత్పత్తి కావాలి మీ చావులు అక్కరలేదు కేంద్రానికి ‘’ అని పలికిన మిత్రుడి చిత్రానికి ‘’మా చావులు మీకక్కరలేదు ధాన్య లాభం కేంద్రానికా లేక మీ కోటలకా ? కరెంటుతో నీటిని ఎత్తి ప్లోరైడ్ ను కడగొచ్చు గతిలేని కాడ మీకు కరెంటు నీళ్లాని కుంటి నవ్వులు ఇదే కదా దశాబ్దాలుగా మా వెతలు ఇదే కదా చావలేని తనాన దుబాయి నడకలు ఇదే కదా చచ్చి రగల్చిన బొగ్గుల కొలిమిలో పత్తి గింజలు ! మీరు మీరే మీది మీదే మాది మీదే ఆగని కన్నుల దారల వాగులో ఆటలాడే తుంటరులు మీ ఉద్యమం సరైనదే అంటారు మరి అంత ఉలుకెందుకు ? ఉడుకెందుకు ? పగిలింది మోసపు అద్దం పోయింది గ్రహచారం అయినా చింత చచ్చిన పులుపు చావని తనం ! మానవత్వం మరచిన మనసుల మంచి కోరే మిత్రులం పొందిన విజయానికి చిరుమందహాసాలు మీకు వికటాట్టహాసాలనిపిస్తే మా తప్పు కాదు అనగని మీ అహంకారానికి సూచకం ‘’! కృష్ణ మణి I18-05-2014 note : ఓ మిత్రుడి సంభాషణతో మనస్తాపానికి గురి అయి రాసిన చిన్న కవిత , అన్యదా భావించవద్దు

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRtEU

Posted by Katta

15, మే 2014, గురువారం

Krishna Mani కవిత

కష్టకాలం _______________________________కృష్ణ మణి ‘’ పక్కోడి కళ్ళలో కష్టాల్ని చూసాను అవి నాకేసి నవ్వుతున్నాయి నాకున్న వాటితో పోల్చితే ఇంకా పెద్దవని అహం వాడిని ఓదార్చి ఓదార్పు పొందాను ’’ ! చిరిగిన బట్టల్లో నలిగిన మనసులు పురుగుల మందులతో పార్టి చేసుకొనే మొనగాళ్ళు పుస్తకాల చెలికాడి పిచ్చి ముదిరిన మాటలు పెంటకుప్పలపై పసికూనల కూతలు ! చిల్లర దక్కని బిచ్చగాడి బిక్క చూపులు సిగ్నల్ పడ్డా అమ్ముడుపోని జాతర పట్ట పగలైనా ఖాళి కాని ఇడ్లి గిన్నెలు స్కూల్ గేటు పక్కన ఎండిన సంత్రాలు ! ఎత్తైన భవనంపై అలసిన ఇసుక సంచులు ఫారిన్ బూట్లకు కుట్లు వెయ్యలేని సూది తిరగని చక్రం కదలని కుండలు బొగ్గుల కొలిమిలో నిండిన దుమ్ము ! కష్టానికే కడుపోస్తే పుట్టేది ఏంది ? కృష్ణ మణి I 15-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T5zoPm

Posted by Katta