పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మే 2014, శుక్రవారం

Sky Baaba కవిత

aahwaanam-qushaamadeed..!!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpK713

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

చందమామ కన్ను కొట్టె సంద్యవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ మంచె కాడుంది రారా పంచదార మాపటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ అందమంత ఆరపెట్టి పైట జారే కోడె గాలి కొట్టగానె కోక జారే నాలో పడలేని ఆరాటం జాజి మల్లె మంచు నాకు జల్లుకోరా కొత్త నాగమల్లె తీగలాగ అల్లుకోరా

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meI0ge

Posted by Katta

Ramakanth Vengala కవిత

భాగస్వామ్యం ---------------- మేఘాన్నై వర్షించి చిరుచినుకై.. స్పర్షించి నీ పులకరింత సెగకి.. ఆవిరై మన ప్రేమను నింగికి చేర్చాలనే నా తపన నెరవేర్చే తపస్సులో.. భూమి ..భాగస్వామ్యం కోరింది!! నీ పాదధూళి పరిమళాన్ని.. నాతో పంపుతానంది! మన ప్రేమలో.. మట్టి వాసనను నింపుతానంది!! -Ramu

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2Mzee

Posted by Katta

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు ||కొన్ని అజ్ఞానాలు...||... గాయాలను పూడ్చుతూ పరుచుకునే చర్మంలా కొన్ని సమయాలు చారికలు కట్టిన జ్ఞాపకాలు రాల్చేసేందుకు మనసొప్పదు చీములా ఉబుకుతున్న ఓ సందిగ్ధం తీపి లోంచి వెగటెలా పుట్టిందో అతి...మధురమయ్యిందేమో అలవాటుకి... నునుపు చెదిరిన పల్లమెటో ఒరిగింది.. మరో హృదయాన్వేషణకి... భావబంధనపు ముగింపులివి... మార్పుకి మరుపుని చేర్చకపోతే జ్ఞాపకం ఓ అసుఖమే... 23-05-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2I5EH

Posted by Katta

Padma Arpita కవిత

గీతలు-రాతలు గీతలకేం తెలుసని చేస్తాయి గీతోపదేశాలు!! అరచేతి గీతలుచూసి అఖండ సౌభాగ్యమని అర్థంకాక అలికిన గీతల్ని అహా ఓహో అని హస్తరేఖలతో జీవితాన్ని ఏం అంచనా వేస్తావు చేతుల్లేక జీవిచడంలేదాంటే వెర్రిముఖం వేసేవు గజిబిజిగీతలకేం ఎరుక గాడితప్పిన గమ్యాలు!! నుదుటిపై గీతల్లో భవిష్యత్తు అంతా భవ్యమని ఆకతాయిగా తిరిగి అదే అందిన ఆనందం అని కష్టాల్లో కలిసిరాదని నుదుటిరాతనే నింధించేవు ప్రయత్నం ఏం చేయకనే ఫలితాలని ఆశించేవు సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!! నేలపై నిలువు అడ్డంగా గీతలేగీసి సరిహద్దులని స్వార్ధసంస్కరణల చిందులనే విజయమనుకుని విరిగిన మనసులకు మాటల లేపనమే పూసేవు అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!! పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు!! అనురాగాల తులాభారమేసి ఆపలేవు అడ్డుగోడని పైకంతో వారధి కట్టి కాంచలేవు మమతల కోవెలని అనుబంధమే తెగితే ముళ్ళు లేకుండా అతకలేవు అంతరంగపు అడ్డుగోడలతో అందరిలో ఒంటరి నీవు 23rd May 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2I5ob

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

.....॥ ఇరు పార్శ్వాలం ॥..... చీకటి నుండి చీకటి కి నా ప్రయాణం వెలుతురు ధారగా ప్రవహించడం నీ నైజం మనం రేపవళ్లం ! అనుదిన అనివార్య దిన పార్శ్వాలం ! శైవల మౌన శిలల మీద నా నడక ఎగసిపడే ఏటి పాట నీ నడత . నేను అసహన అగ్ని గోళమై బద్దలౌతుంటాను నీవు నిర్లక్ష్య తుహిన తుషారంలో తడుస్తుంటావు . నేను అసంబద్ధ జడధారిని ! నీవు అతివ్యాప్త చైతన్య ధునివి ! మృత్యువుకు మృత్యువుకు మధ్య సాగే మన దైనందిన జీవనయానంలో ఇరువురం ఇరుసంజల ఇరుకు దారులం నీవూ నేనూ ప్రతినిత్యం అంతుపట్టని జీవన మరణాలం ! Dt:23.05.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k1CLMc

Posted by Katta

ShilaLolitha Poet కవిత

అనగనగా ఓ ఇల్లు ........*** ********************************* ఉదయం ----------- అతడు- ప్యాంటు చొక్కా తొడుక్కొని వెళ్తాడు ఆమె ఇంటిని కూడా తొడుక్కుని వెళ్తుంది. ఆమెనడుస్తున్న ఇల్లులా ఉంటుంది. పొగచూరిన పొయ్యిలా ఉంటుంది. మధ్యాహ్నం ------------------ ఫోన్లూ,సిగరెట్లు పరామర్శల' టీ' ల మధ్య పని చెయ్యకుండానే చేసి నట్లుండే అతను- అన్ని సీట్ల వర్కు ఒక్కతే చేసి పెత్తనాల మధ్య ,బాక్సులో చల్లారిన అన్నాన్ని కుక్కుకుంటూ అలసటతో ఆమె- సాయంత్రం ------------------ సీడీలు,మల్లెపూలతో రిలాక్స్ కోసం బడ్జెట్లు, బాధ్యతలు, చిట్టా విప్పనియ్యని అతను- కూరలు,తినుబండారాలు,నిస్సత్తువతో లగేజీలా ఆమె - కామా పెట్టిన పనులూ,పిల్లలూ, కల్లలు కావంటూ ఆమె- అతడు ------------ ఛి ! నువ్వేప్పటికి నా ప్రియురాలివి కాలేవు. ఛా! నువ్వెప్పటికీ నా చెలికాడివి కాలేవు. హు- ఈ అమ్మా నాన్నలు 'బిడ్డల శిక్షణ,' నెప్పుడు నేర్చుకుంటారో???

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oo600W

Posted by Katta

Pratapreddy Kasula కవిత

మాటలు - కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడాల్సినవేవీ మాట్లాడకూడదు అసలు మాటలు లోన తెట్టె పెడుతూ ఉంటయి ఎజెండాలు వేరై, పలుకులు పాడైపోతుంటయి చిలుకా పలుకువే, నెమలీ ఆడవె అంతా రహస్యమే, ఏదీ బట్టబయలు కాదు అనుకుంటాం గానీ మనుషులు బయట పడరు మాటలు రహస్య యుద్ధసామగ్రి ఎదుటివాడిని గెలిచేందుకే వాడుతుంటం అప్పుడప్పుడు భుజం మీద చేయి వేసి మరి కొన్నిసార్లు చేతిలో చేయేసి మాటల ముల్లె విప్పుతుంటవు నీ శరీరం నిటారుగానే నిలబడుతది ఆత్మ లోలోన వంకర్లు తిరుగుతుంటది మనసునూ మాటలనూ వేరు చేసుకోలేనివాడు కాలం పుటల మీద కన్నీటి నెత్తుర్లు ఓడుతడు అయ్యా, ఆర్యా! ఓ నా మిత్రమా!! కొండ మీది కోతిని పట్టేవాడా! నమ్మకం మీద వేటు వేసినవాడా!! విశ్వాసం బలహీనత కాదు మనిషి కోసం దేవులాటలో ఒక పనిముట్టు బాతు బంగారు గుడ్డు పెట్టదు డబ్బులకు హృదయం ఉండదు ఒక్కో నోటు మరో నోటును కంటది మాటల మాయా మాంత్రికుడా! పెదవుల వంకర్లు నీ అందం కాదు ద్రోణాచార్యుడు నేర్పని యుద్ధవిద్య పిట్టను జోకొట్టి నిద్రపుచ్చుకో! నెత్తురోడడం నాకు కొత్త కాదు ఏదీ మొదలు కాదు, ఏదీ అంతం కాదు దేహాల మీద మరకలుండడం తప్పేమీ కాదు మనసులకు చురకలంటడం అబద్ధం కాదు నింగి మీదా నేల మీదా నేనొక్కడ్నే నగరం చేరినా నాగరికత అంటనివాడ్ని నేనేమిటో తెలిశాక నీ పిట్ట లేస్తూ వుంటది నీకొక్కటే భయం పాదాల నుంచి నెత్తి దాకా పాకుతుంటది బీరిపోయి, భీతిల్లి నా మీద బురద చల్లుతవు అయ్యా, నాయనా, నా ముద్దు స్నేహితుడా!! ప్రతి రాత్రీ తల్లి పాలు తాగుతున్నవాడ్ని తల్లి గర్భంలోకి చొరబడి తిరిగి జన్మిస్తున్నవాడ్ని నీవేవీ నాకంటవు గాక అంటవు

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocWmRn

Posted by Katta

Kapila Ramkumar కవిత



by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2mEn9

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m1qvy2

Posted by Katta

Kapila Ramkumar కవిత

||కార్టూన్‌ కవిత్వం -|| చేరా || పత్రికలో కార్టూన్‌లు /పడటం చూళ్ళేదూ?/పద్యం ఆ మాదిరి పద్ధతి వీల్లేదూ ? - శ్రీశ్రీ - 1953 - తెలుగు స్వతంత్రలో అన్నారు. కార్టూన్‌ కవిత్వం తెలుగులో ఎప్పుడు ఆరంభమయిందో తెలియదు. అంతకు ముందు 1950 లో అప్పటి రాజకీయ పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ నండూరి రామమోహనరావు గారు ఆంధ్ర వార పత్రికలొ అంత్యప్రాస నియమంతో లిమరిక్కులు రాసేవారు. చాలామంది అనుకుంటున్నట్టుగా అభ్యుదయ కవిత్వంతో సహా సాహిత్య ప్రక్రియలు చాలా వాటికి శ్రీశ్రీ ఆద్యులు కాకపోవచ్చుగాని చాలా క్షేత్రాలను చదునుచేసి చక్కని బాట వేశారు. అన్నీటికీ ఆద్యుడు కావటమే గొప్పకాదు. ఆ మార్గాన్ని పటిష్టం చేయడంకూడ గొప్పే. ఆ తర్వాత ఆ మార్గంలో నడిచిన ప్రసిద్ధులు చాలమందివున్నారు. భావకవిగా అరుదుగా గేయాలు, అధికంగా పద్యాకు రాసిన సీనియర్ కవి నాయని సుబ్బారావు గారు మారు కలం పేరుతో (సౌ వీరభద్రుడు) కార్టూన్‌ కవిత్వం రూపంలో ప్రద్హానంగా వచన కవిత కంటే ముక్త ఛందం అనాలి, అదే ఔచిత్యంకూడా. అది ఫ్రెంచ్‌ వెర్స్‌ లిబేరే అని అంటారు. వచన కవితను వెర్స్‌లీబ్ర అని ఫ్రెంచ్‌లోనూ, ఫ్రీవెర్స్‌ అని ఆంగ్లంలోనూ అని అనుకుందాం. ఈ రెండూ కవితా రూప పరిమాణంలో రెండు దశలు. మొదటిది లయ విముక్తం అయే ప్రయత్నమే కనిపిస్తుంది. కాని లయ స్ఫూర్తి అనియతంగా వుంటుంది. రెండవ దశలో లయ స్ఫురణ అసలేవుండదు. ప్రస్తుతం తెలుగు కవిత రెండవ దశలోవుంది. ఈ దృష్ట్యా నాయని సుబ్బారావు గారి కార్టూన్‌ కవితా రూపాన్ని ముక్తచ్ఛందం అంటున్నారు. వారు రాసిన ఆ కవిత్వానికి ఆధారమైన వార్తను కవితా ఖండిక కింద తెలుగులో సూచించేవారు. కొన్నింటికి ఆధారాలైన వార్తా కత్తిరింపులుఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి తీసుకున్నవి. అవి సౌవీరభద్రుడు పేరుతో ' అభ్యుదయ ' పత్రికలో రాశారు. వాటి వివరాలు మాత్రం దొరకవు. కాని 1965 ఆగస్టు నుండి ఆంధ్రప్రభలో అప్పుడప్పుడు ' క్షేత్రజ్ఞుడు ' అనే మారుపేరుతో ప్రకటించిన వాటి వివరాలు మాత్రం దొరుకుతాయి. అభ్యుదయలో రాసిన శైష్యోపాధాయిక, నా.గ.' జీవస్త్రోత్రం ' అనేవి లభ్యమవుతాయి. --'' ఎన్ని తుపానులు లేచినా, చేయదల్చుకున్న పనిక ఆగలేదు మేం ప్రకాశం దగ్గర తయరైనవాళ్ళంకదా’ విజయవాడలో ఆర్‌.టి.సి. బస్సుల ప్రారంభోత్సవ సందర్భంలో '' శ్రీసంజీవరెడ్డి '' అనే నోట్ శైష్యోపాధ్యాయిక కవిత కింద వుంది. '' ప్రకాశంగారి శిష్యులం మేము / పరమానందయ్య శిష్యులం కాము ‘‘.. అని ప్రారంభమై 22 లైన్ల కవితలో సంజీవరెడ్డి వర్గాన్ని పరమానందయ్య శిష్యులతో పోల్చారు సుబ్బారావు గారు. అందులో చివరి ఆరు లైన్లు చతురశ్ర గతిలో యిలా నడిచింది '' ఎన్ని తుపానులు రేగినా ఎన్ని అవాంతరాలు మూగినా చేరుస్తాం దులాన్ని మా గమ్యం శిష్య వాక్యమిది చిన్మయ రమ్యం అయితే స్వామీ అప్పటిదాకా సూది పదిలమేనా? - చూడు మజాకా'' మచ్చుకు మరొకటి నాన్‌ గెజిటెడ్ ఉద్యోగుల గురించి రాసింది '' ఇప్పుడు కూడా కష్టపడి పని చెయ్యమనండి వారిని యన్‌.జి.వోలను పొగడ్డాని సిద్ధంగానేవున్నాం. శాసన సభలో బెజవాడ గోపాలరెడ్డి గారు చేసిన ప్రకటనపై కవిత: '' అర్థికమంత్రి పొగిడి నిన్నంట ఆకాశానికెత్తుతాడంట ఇంత అదృష్టం పండించావా ఎంత ధన్యుడివు ఎన్‌.జీ.వా? '' అని మొదలై సాగుతుందీ కవిత '' ఆలస్యం కాకూండా జావో ఆఫీసుకు యన్‌.జీ.జీవో ఐదుగంటలదాకా కుర్చీకంటిపెట్టుకుని పనిచెయ్! ఫైళ్ళ దొంతరలన్నింటినీ పటాపంచలుచేయ్! ''... అదే కవితలో ముక్తాయింపుగా చతురశ్ర గతిలో '' వ్యర్థ మనర్థం తక్కినతందా సార్థకమైందొకటే అది ఆర్థిక మంత్రి పొగడ్త - అదే పురు షార్థమ్‌ - చరితార్థమ్‌! పరమార్థమ్‌ '' ..అంటారు .. రెండవ దశలో 1969 లో క్షేత్రజ్ఞుడు కలం పేరుతో రాసినకవితల్లో పాద సంఖ్య నిర్దిష్టం. నాలుగు పాదాల మూడు చరణాలు ) స్టాంజాలు) ప్రతి కవితలో. మొత్తం అచ్చయినవి 17. 22.8.1965 నాటి ఆంఢ్రప్రభ అచ్చయిన ' ఏనుగు ఏడ్చింది ' బ్రాకెట్లో కార్టూన్‌ కవిత్వం అని పేర్కొనబడటం విశేషం. ఆగస్టు 4 ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లోని వార్త ఆధారంగా రాసినది '' ఎందుకు లేదు తమ్ముడూ! ఇది ప్రజా యుగం1 ప్రజా తంత్రంలొ ప్రజా సంక్షేనం కోసం పగలనక, రాత్రనక మన ప్రజా ప్రభువులు ముద్దు ముద్దుగా కార్చడంలేదూ మొసలి కన్నీరు! '' తెలంగాణాలో మద్య నిషేవణం, ఆంధ్ర ప్రాంతంలో మద్య నిషేధం వున్న కాలంలో రాసినది 19.9.65 నాటి ఆంధ్రప్రభ '' ఆంధ్రా కల్లు కొంత గుటకాయస్వాహా అక్కణ్ణే కానీ సాధు సుబ్రహ్మణ్యులకిది సంతాపకరమైతే కానీ తెలంగాణా కల్లు పాకల్లో త్రిశంత్కోటీ విలాసాలతో అందాలొలకబోస్తుందిక ఆంధ్ర సురాభాండేశ్వరి '' అని చమత్కరించారు. 12.12.1965 ఆంధ్రప్రభలో మళ్ళీ గోపాలరెడ్డిగారి మీద చమత్కార కవిత: '' పశ్చిమ జర్మనీ ' బ్లండు ' పిల్చేని కామరాడను కంప కందళించేని క్షేమాన పోయిర్ వచ్చేవు లాభాన పోయిరా జర్మనీ పోయిరావయ్య! ఇంకోటి ముక్దుం మొహియుద్దీన్‌ చేసిన ఒకానొక ప్రకటనపై 21.11.1965 ఆంధ్రప్రభలో కంద పద్యం వ్యగ్యంగా రాసారు '' కిలో గోష్‌ ఖరీదైదు రూపాయలల్లా కిలో మచ్చిదామందులో నర్థమల్ల మసాలా మజాయింత పట్టింతమంటే హరా మిర్చి ' అమ్లీ పలండూల్‌ పప్పుల్‌ మహమ్మేరు వంతల్‌ ఖరీదుల్‌ గదల్లా ప్రభుత్వమ్ము ఢంకా బజాయించి చాటే నినాదమ్మహా నేతిబీరాయెసల్లా ప్రయిస్‌లైను శాసించు ఫార్సెల్ల నల్లా '' విశ్రాంత ఉపాధ్యాయులకు ఫించన్‌ మంజూరు ఉత్తర్వులు శరవేగం రాబోతున్నాయని ఎగువసభలో ప్రకటనకు స్పందిస్తూ 5.12.1965 ఆంధ్రప్రభలో ఓ కవిత: '' రిటైరైన టీచర్లలో కొందరు రిటర్న్‌ టిక్కెట్‌ లేని ప్రయాణం శీఘ్రమేవ చేయనున్నారని చెప్పారు గనుకనే కొంతలో కొంత ఆర్థిక వ్యవస్థ కుదిరేపని ఆశిస్తే ' మాజీ కాసుమంత్రి, ఆధునా ముఖ్యమంత్రి చచ్చిపోతే ఫించన్‌ శాంక్షన్‌ చేస్తారా వాళ్ళకు అమాయకంగా అడిగి సభలో హాసం పలికించాడు భద్ర సింహానస్థుడు, సదా బ్రహ్మానందభరితుడు పండిన కాంగ్రెస్‌ కాలజ్ఞాని, బ్రహ్మయాధ్యక్షులు జరూరుగా వుత్తర్వులు జారీ అవుతున్నాయనె హలం పుచ్చిం కలం కొన్న ఆ బలరామాత్య అయ్యలూ! స్టేట్‌మెంట్ల ఆజ్యంతో ఆశలు పొంగించుకోండి అలసిపోయి ప్రాణాలు ' హరీ ' అనేంతవరకూ! (కాసు బ్రహ్మానందరెడ్డిపై సెటైర్‌ ఇది) అంతటి చేయి తిరిగిన నాయని సుబ్బారావు గారి వ్యంగ్య కవితలను జనవరి 1966 మొదటివారంలో ప్రచురణ కావలసినవాటిని కొన్ని రాజకీయ కాఋఅణాలవల్ల ప్రచురించలేకపోతున్నామని తిప్పి పంపుతూ, ఎప్పటిలాగా రాస్తూవుండమని తెలియ చేసారు పత్రికా యాజమాన్యంవారు. దర్మిలా నాయని సుబ్బారావు గారు కాటూన్‌ కవిత్వం రాయలేదు. భావ కవులు సామాజిక సమస్యల నుంచి పరిపోతారనే వారంలో ఏమంత నిజం లేదని నాయని సుబ్బారావుగారి కార్టూన్‌ కవిత్వం మరొకసారి నిరూపిస్తున్నది. ఈ కవిత్వంలో ప్రజా సమస్యల పట్ల సకాల స్పందన, సానుభూతి వ్యక్తమవుతున్నాయి. పదునైన హాస్యాన్ని ఆయుధంగా వాడుకున్న తీరూ కనిపిస్తుంది. తన కార్టూన్‌ కవిత్వాన్ని పద్యంగా, గేయాంగా, వచన కవితగా వాడారు. పద్యాన్ని] ఆధినికం చేయటంలో సుబ్బారావు గారి పాత్రవుంది. వచన పద్యాన్ని కార్టూన్‌ కవిత్వానికి అన్వయించటం అప్పటికి అంత ప్రాచుర్యంలో లేదు ( అసలు లేదేమో కూడ) మధ్యలో ఆగిపోకపోతే మరిన్ని ప్రయోగాలు వచ్చివుండేవి. ఇప్పుడు మిగిలినవైనా వచన కవిత్వ రూప పరిణామంలో వారి పాత్ర బహుముఖమైనది. **- రింఛోళి నుండి (పేజి 119 నుండి 125 ) (- ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం 1994 డిసెంబరు 5 - చే.రా) 23.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SrDh0l

Posted by Katta

Yasaswi Sateesh కవిత

Yasaswi readings... ||నిర్నిద్రం|| చీకటనీ వెలుతురనీ రెండుంటాయంటాం కానీ ఉండేది చీకటే వెలుతురు వచ్చి వెళుతుంది శబ్దాన్ని నిశ్శబ్ద్దాన్ని వేరుపరుస్తాం కానీ ఉండేది నిశ్శబ్దమే దాన్ని భగ్నం చేస్తే శబ్దం పుడుతుంది నిద్దురనీ మెలకువనీ రెండు స్థితులు చెబుతాం కానీ ఉండేది నిద్దురే ముందు నిద్ర వెనుక నిద్ర చిరంతన నిద్ర ఆద్యంతాలు లేని నిదురలో జీవితం ఒక ఉలికిపాటు : కొప్పర్తి మాస్టారి కవిత్వం ‘యాభై ఏళ్ళ వాన’ నుంచి 23.5.2014

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TBAjr0

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | రియాలిటీ చెక్ | “చే “మరణం నిన్ను కదిలించిందా ? భగత్ సింగ్ మరణం కి బాధ పడ్డావా ? అల్లూరి ని మిస్ అవుతున్నావా? రోజు వారి కనిపించకుండా జరిగే ఎన్కౌంటర్స్ కి ఫీల్ అవుతున్నావా ? ఉద్యమాల నినాదాల్లో కలిసిపోయిన ప్రాణాలు గుర్తుకోచ్చాయా ? ప్రభుత్వం చంపిన ప్రతి పోరాట యోధుడి వెనక వెకిలి నవ్వులు నవ్వుతున్న మొహాలు చూసి ఒకసారి మనసులోనే "థూ" అని ఉమ్మేయాలి అనుకుంటున్నావా? ఒకసారి కార్పొరేట్ ముసుగు వేసుకున్న నయా మత వాదులని చూడు ప్రతి మొహం వెనక కనిపిస్తున్న ఆ క్రూరమైన నవ్వు ని గమనించు మట్టి మనుష్యుల కోసం ప్రాణాలు వదిలే ధీరులను దేశ ద్రోహులుగా భావిస్తూ రాజుల కు చెంగులు పరుస్తున్న భావి తరాలు కనిపిస్తున్నాయా ? ఇన్నాళ్ళు డబ్బు మొహం వేస్కొని తిరిగిన కరడుగట్టిన కసాయితనం ఈ రోజు మతం మూర్ఖత్వాలు కూడా తగిలించుకొంది రండి నాయనా రండి ఫ్రీ షో . ... నెమ్మదిగా తెరలు తెరుచుకుంటున్నాయి .. కళ్ళు విప్పుకొని బాగా చూడండి .. మన మధ్య , మనలో మనమే అయి తిరుగుతున్న ఆ విష సర్పాన్ని బాగా చూడండి . కనిపించక పోతే ఇంటికెళ్ళి అద్దం లో వెతకండి ... హక్కుల మాట అడిగినా , స్వేచ్చ కావాలి అని గొంతెత్తినా నోటి నిండా ఇంత విషం నింపుకొని కసిగా కాటేయ్య డానికి సిద్ధం అయిన మన క్రూరత్వమే అన్ని చోట్లా , కనిపించిందా ? ఇదే ఇదే అల నాడు సోక్రటీసు విషపాత్ర వెనక దాగున్న మొహం కూడా సరిగ్గా అదే . Welcome to the new reality !! నిశీ !! 23 /05/14 * ** సారి సర్పం గారు మీరు మా అంత విషపురుగు కాదు కానీ వాడుకోవటం అలవాటు అయిన జాతి కదా మాది సో వాడేసుకుంటున్నాం క్షమించేయండి .

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0Xz9C

Posted by Katta

Sriarunam Rao కవిత

సాహిత్య సంస్కృతి కలానికీ కాలానికి వివాహం నిశ్చయమైతే... తెల్లనికాగితపు కాన్వాసుపై పొర్లాడే అక్షరాలే వారి తొలిరేయి ఙ్ఞాపకాలు. జీవితకొక్కాలకు తగిలించేసిన ఆశల బూజు దులిపి తెల్లారినా తరగని కావ్యకచేరీ చేస్తూనేవుంటారు. గతజన్మలో వదిలేసిన గమకాలనూ ఏరుకొచ్చి అనుభూతుల కోనేరుగట్టున..... అనురాగపు మట్టిబొమ్మలను తయారుచేస్తుంటారు. అంతస్థులచూరు పలకరిస్తున్నా... తాటకులగుండెల్లోకి తొంగిచూస్తుంటారు, అమృతంలో ఏముందంటారు? గంజినీళ్ళతోనే ఘీంకరిస్తుంటారు, శూన్యాన్ని అద్దంలో నింపేసి ప్రపంచంతో వాజ్యాన్ని మొదలెడతారు, చందమామ సాంగత్యాన్నీ కాదని... సూర్యుని భూజాలకెక్కాలని ప్రాకులాడుతుంటారు, కర్ణున్నీ కృష్ణున్నీ కాదని... మద్యలో లేచిన వికర్ణునిపై పుంఖానుపుంఖలు రాసిపడేస్తుంటారు, భావాలను ఎక్కడ దొరుకుతాయో... అక్కడకు పదాల అణుబాంబులను మూటలుగా భూజాన్న వేసుకుని ప్రపంచవీదులన్నిటినీ ఊహల విమానాలతో చుట్టేస్తుంటారు, కన్నీళ్ళు వారి కలానికి ఇంధనం నోబుళ్ళూ, ఙ్ఞానపీఠ్ లూ వారి సాంగత్యానికి వారసత్వాలు కక్షలలో బంధించబడిన కాంక్షలను సమాజానికి శుద్దిచేసి అందించే వసుధైక కుటుంబానికి వారిద్దరే నిజమైన అమ్మా నాన్నలు. శ్రీఅరుణం విశాఖపట్నం-530001 సెల్ = 9885779207 e mail = sssvas123in@rediffmail.com

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vQuHaT

Posted by Katta

నరసింహ శర్మ మంత్రాల కవిత

Has my heart gone to sleep? Has my heart gone to sleep? Have the beehives of my dreams stopped working, the waterwheel of the mind run dry, scoops turning empty, only shadow inside? No, my heart is not asleep. It is awake, wide awake. Not asleep, not dreaming— its eyes are opened wide watching distant signals, listening on the rim of vast silence. ------Antonio Machado పై కవితకు నా స్వేచ్ఛానువాదం. నా హృదయం జోగుతున్నదా? ఈ నిశీధి నిశ్శబ్ద తరంగజనిత స్తబ్దతావృతములందు చిక్కుబడిన నా హృదయ సంవేదనలు జోగుతున్నాయా? నా స్వప్నమాధుర్యాలు శలవతీసుకున్నాయా? నా నిరంతర చైతన్యపూరిత భావనా స్రవంతులు ఎండి పొడిబారుతున్నాయా? నా యోచనా దొన్నెల చయనిక నిండుకున్నదా? లేదు, నా హృదయం జాగృతమై ఉన్నది మెలకువగానే ఉన్నది, పూర్తి చైతన్యముతో జోగుట లేనేలేదు, కలలు అసలే లేవు నా అంతఃచక్షువులు విప్పారి చూస్తున్నవి ఆ నిశీధి నిశ్శబ్ద తరంగ సంకేతాలను గమనిస్తున్నవి, గ్రహిస్తున్నవి. మచాదో తన అంతఃచేతన అచేతనం కాకుండా ఉండేందుకు ఎంత తపన పడుతున్నాడో గమనించండి. ఈ కవితలోని ఆత్మసంవేదన అద్భుతం. on the rim of vast silence. ఈ ఆఖరి వాక్యాన్ని మొదటి వాక్యంగా మలిచి అనువాదం చేయడం వలన మఛాదో కవితా స్ఫూర్తికి అనువుగా అమరిపోయింది. ----- నరశింహ శర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVIR6u

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కలల కూడలి పదాల మధ్యన నేను నాలోకి కొన్ని వాక్యాలుగా ఇంకినపుడు మధ్యమంగా మరికొన్ని భావాల వెల్లువ నరాలు పగిలేలా రుధిరపు హోరు గుండె గతుకుల్లో అవి తట్టనపుడూనూ/­నావికానపుడూనూ మనసు సాంద్రత పెరిగి దళసరి ధూపమేదో నన్ను కాల్చుతుండగా కొత్త అర్థాలకు మూసపోస్తూ నా ఈదేహపు బట్టీ నా కళ్ళలో పగిలిన పాలసంద్రాలన్నీ నాకు నేనె వడగొట్టుకుంటూ ద్రవీకరిస్తున్నా ఇప్పుడే...ఇక్కడే అమరణపు అంపసయ్య ఆలోచనలను నేను మళ్ళా పుట్టడానికి ప్రయత్నిస్తుంటాను..ఆ పసితనపు పుప్పొడిని నా కాగితపు కూడలిలో కొద్ది కొద్దిగా అద్దేందుకు ఇంకా ఏదో నిర్లిప్తత రాసి జీవించినా రాయక మరణించినా తిలక్ బొమ్మరాజు 23/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvq0hs

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

//సహజ ప్రవాహం // నలుగురితో నారాయణా .. అది సామాజిక బంధం పది మందితో పదరా.. అదే ఆనంద మంత్రం కష్టమొస్తే కళ్ళు సానుభుతికై ఆశగా చూస్తాయి ఇతరుల చల్లని సేద దీర్పును ఆశిస్తాయి సిన్మా కెళ్తే హాలంతా నిండితేనే బావుంటుంది క్రికెట్ స్టేడియం క్రిక్కిరిస్తేనే మజా వస్తుంది కాల్లో ముల్లు దిగితే పక్క వారి ఓదార్పు నొప్పిని తగ్గిస్తుంది గుంపులో సానుభూతి సహజ వెల్లువై ప్రవహిస్తుంది రోడ్ పై పడగానే నాలుగు చేతులు నిన్ను లేపుతాయి బస్సులో సొమ్మసిల్లితే వాటర్ బాటిల్స్ లైన్ కడతాయి ఎవరికైనా సమూహమే ధైర్యం ఇస్తుంది సమాజమే ఆత్మ విశ్వాసం కలిగిస్తుంది చివరాఖరికి మనుషులందరిదీ ఒక్కిల్లే ఆపదలో ఆదరిస్తుంది సంఘం అమ్మల్లే తోటివారితో సామరస్యం ఉండాలి రక్షల్లే అప్పుడే అందరం నిద్రిస్తాం పాపలల్లే గుంపును నడుపుకు పోయే పనవుతుంది నీ వల్లే అందరి మనసుల్ని కలుపు ఒక గొలుసల్లే జీవుల్ని అనుసంధానిస్తుంది ఒక ఏకత్వం అందరిలో ఉంటుంది కనబడని దైవత్వం

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t1drLI

Posted by Katta

Srinivas Yakkala కవిత

***అమ్మ*** అక్షరాలు సైతం ఆరాధిస్తాయి ఆ పేరు రాయగానె మనసు సైతం మురిసిపొతుంది ఆ పలుకు వినగానె మమత సైతం మెరిసిపొతుంది ఆ మాత్రుత్వంలొనె ఆకాశం సైతం ఆనందిస్తుంది ఆమె నవ్వగానె పువ్వులు సైతం పొంగిపొతాయి ఆమె పాదలు చేరగానె రాజులు సైతం బానిసలె ఆమె ప్రేమకై ఈశ్వరుడు సైతం పూజిస్తాడు ఆమె క్రుపకై మాధవుడు సైతం మొక్కుతాడు ఆమె కరుణకై అవని సైతం ఎదురుచూస్తుంది ఆమె సేవకై..... ఈ అక్షరాంజలి ప్రతి అమ్మకై,అమ్మ ప్రేమకై... శ్రీనివాస్ యక్కల

by Srinivas Yakkala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1omuHeh

Posted by Katta

Rajeswararao Konda కవిత

నేడు పసిమొగ్గలమే- రేపటి జాతికి సుగంధ పరిమళాల్ని అందించే పుష్పాలమే//23 మే 2014

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oYScws

Posted by Katta

Kavi Yakoob కవిత

YouTube లో కవిసంగమం : ఇప్పటివరకూ కవిసంగమం సీరీస్ లలో చదివినవారి వీడియోలు ఇందులో ఉన్నాయి.చూడండి. http://ift.tt/1lZDqR7

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZDqR7

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0oj7i

Posted by Katta

Sikandar Haji Vali కవిత



by Sikandar Haji Vali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1omiRRs

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

చిగుర్ల వగరుల్ని తినే కోయిలకు పొగరెక్కువ కుహు అంటే స్వరంపెంచి కుహూ అంటుంది

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1phPoI8

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------బాల్యం ఏ గిరి శికరాల పైకి ఎగబాకి అనంత వాయువుల్లో కలిసిపోయిందో ఏ దిగంతాల అంచుల పంచన చేరి కనుమరుగైపోయిందో. జ్ఞప్తికి వచ్చిన క్షణం శ్రావణ సమీరమై వచ్చి హృది గదిలో కొన్ని జ్ఞాపకాలను జార విడుస్తుంది. నెమరు వేసుకున్న సమయాన అనుభూతులు కన్నీరుగా మారి కళ్ళల్లో గుచ్చుతున్నాయి ఏది నా బాల్యం ! 23/05/2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TzXv8W

Posted by Katta

Panasakarla Prakash కవిత

"చెప్తావా..!" రేపటికోస౦ ఎప్పుడూ తొ౦దరే మనిషికి ఈ రోజే దానిన౦దుకోవాలని రేపటిమీద ఎప్పుడూ అత్యాశే మనిషికి ఈ రోజే ఏదో దాచుకోవాలని రేపటి ప్రస్తావన లేకు౦డా ఎవ్వరి జీవిత౦లోనూ నేటి ఉనికి ప్రసక్తే ఉ౦డదు రేపటి స్వప్న౦ లేకు౦డా ఏ అడుగూ ము౦దుకు పడదు రేపటి వైపుకు వెల్దువుగానిగాని ఈ రోజే౦చేసావో చెప్పు రేపటిగురి౦చి ఆలోచి౦చడ౦ మినహా....! పనసకర్ల 23/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TzUPbr

Posted by Katta

Rajender Kalluri కవిత

## ఆడతనం - ఐదోతనం - అమ్మతనం ## జన్మనిచ్చేది ఓ ఆడది ఇచ్చిన జన్మ కోసం ఆరటపడేది ఆడది జీవితానికి తోడుగా వచ్చేది ఆడది మగని జీతానికి వారధిగా నిలిచేది ఆడది పచ్చని కాపురానికి పైసా పైసా కూడబెట్టేది ఆడది పసుపు కుంకుమే ప్రపంచంలో గొప్ప ఆస్తిగా భావించేది ఆడది సమస్యలెన్ని ఉన్నా , సహన్నాన్ని చూపేది ఆడది బాధ భారంగానే ఉన్నా , భర్త కటినంగానే ఉన్నా , బాద్యత తనదే అంటూ కన్నీళ్లను సైతం కళ్ళలోనే నింపుకుని కష్టాలను కుడా ఇష్టంగా ఎదుర్కునేదే ఆడది కడ దాక మనతోనే ప్రయాణం చేసినా .... ఆడదాని కన్నీటి వెనకాల ఉన్న బాధేంటో తెల్సుకునే మాగాడే ఉండడు ! అందుకేనేమో చరిత్రలో ఆడ తనానికి , అమ్మ తనానికి ... ఓ స్థాన్నాన్ని కేటాయించి ప్రస్తావించారు గాని మగతనాన్ని ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదు ! " Treat the Women as Goddess .... Bcos ' SHE ' is not Less " Dedicating to All Women's _/\__ kAlluRi [ 23 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZTAal

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/ఊరు తల్లి దండు కదులుతు0ది నాలుగు అన్నం మెతుకుల కొరకు...... ఈ రోజు నా ఊరు భయమై0ది కాలుష్యం ని0డిన నగరం ధైర్యమై0ది ఆవకాయి మెతుకులు అయిష్టమై ఫ్రయిడ్ రైస్ ప్రియమై0ది. రచ్చబండ దుమ్ము పట్టి0ది సర్కారి చెట్టు ఖాళి అయిన ఇ0టి కాపలై0ది హనమంతుడి గుడి తెల్లబడి0ది మసకబడి0ది వాకరొచ్చినట్టు0ది జరిగిన అవుమానం గురి0చి కళాహినమైన గుడిశలా వె0డిన బావిలా పగిలిన కు0డలా వేదనా పూరిత హృదయంతో ఊరు ఊరంతా ... నా ఊరు తల్లి ఎదురవుతు0ది ఇప్పుడు నా ఊరు ఎడారి రంగును ధరి0చుకొని దుమ్ము అయి లేస్తు0ది ఇప్పుడు నా ఊరు క్యాట్ వాక్ చెయ్యడానికి సిద్దమవులతు0ది. 23-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZTzTT

Posted by Katta

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో గత కొన్నివారాలుగా గాలిబ్ కవిత్వం గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజు గాలిబ్ 17వ గజల్ మొదటి షేర్లు చూద్దాం ఏక్ ఏక్ ఖతరేకా ముఝే దేనా పఢా హిసాబ్ ఖూనె జిగర్ వదియతె మజ్కానె యార్ థా ఒక్కో బొట్టుకు లెక్క చెప్పక తప్పలేదు గుండె నెత్తురు కనురెప్పకు చెల్లించక తప్పలేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఖతరా అంటే బొట్టు, చుక్క, బిందువు. హిసాబ్ అంటే లెక్క. వదియత్ అంటే అమానతు, ఇది కూడా ఉర్దూ పదమే. వదియత్ లేదా అమానత్ అంటే అర్ధం ఎవరైనా మనవద్ద ఏదన్నావస్తువు, లేదా సంపద దాచమని అప్పగిస్తే దాన్ని అమానత్ అంటారు. ఇచ్చిన వ్యక్తి అడిగిన వెంటనే దాన్ని తిరిగి అప్పగించవలసి ఉంటుంది. సంపద కావచ్చు, ధనం కావచ్చు, వస్తు సామాగ్రి కావచ్చు ఏమైనా కావచ్చు. ఎవరైనా నమ్మకంగా మనవద్ద ఉంచింది అమానత్ అవుతుంది. దాన్ని తిరిగి అడిగిన వెంటనే అప్పగించవలసి ఉంటుంది. అందుకే ఈ జీవితం దేవుడి అమానత్ అంటారు. అడిగిన వెంటనే మనం తిరిగి ఇవ్వక తప్పదు. మజ్కాన్ అంటే కనురెప్పలకు ఉండే వెంట్రుకలు, ఇంగ్లీషులో eyelashes. ఈ కవితలో మిగిలిన పదాలు సాధారణంగా వినబడే పదాలే. ఇప్పుడు కవిత భావం చూద్దాం. గాలిబ్ తన గుండెలోని నెత్తురంతా నిజానికి ప్రేయసి కనురెప్పలపై ఉన్న వెంట్రుకలు దాచుకున్న సంపద అంటున్నాడు. ఆమె ఇష్టమొచ్చినప్పుడు వాటిని తిరిగి తీసుకోవచ్చును. విరహబాధతో అతని కంటి నుంచి జారే కన్నీళ్ళు అలా వాపసు ఇస్తున్న లెక్కలే అంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, కనురెప్పలపై ఉండే వెంట్రుకలు సాధారణంగా చాలా బిరుసుగా, మొనదేలినట్లు, చూడడానికి ముళ్ళ మాదిరిగా చిన్నవిగా ఉంటాయి. ప్రేయసి సౌందర్యానికి దాసుడైన ప్రియుడికి, ఆమె కనురెప్పలు అల్లార్చినప్పుడు ఆ కనురెప్పల వెంట్రుకలు గుండెల్లో దిగినట్లనిపిస్తుంది. ఆ ప్రేమగాయాల నుంచి స్రవించే నెత్తురే కంటి నుంచి జాలువారుతుందని చెప్పాడు. విరహబాధతో కంటి నుంచి కన్నీళ్ళు కాదు రక్తమే ప్రవహిస్తుంది, నిజానికది ప్రేయసి దాచుకున్నదే, ఆమె ఈ విధంగా తిరిగి తీసుకుంటోందని భావం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలో 17వ గజల్ రెండవ షేర్ అబ్ మైం హూం ఔర్ మాతమె యక్ షహరె అర్జూ తోడా జో తూనే ఆయినా, తమ్సాల్ దార్ థా ఇక నేనున్నాను, అభిలాషల నగరాలున్నాయి ప్రతిబింబాలున్న అద్దాన్ని నువ్వు పగులగొట్టావు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. మాతమ్ అంటే విషాదం. షహరె అర్జూ అంటే కోరికలు, అభిలాషల పట్టణం అంటే లెక్కలేనన్ని కోరికలు ఆకాంక్షలు. ఆయినా అంటే అద్దం. తమ్సాల్ దార్ అంటే ప్రతిబింబం స్పష్టంగా కనబడేలా తయారు చేసింది. ఇక్కడ పగలగొట్టిన అద్దం స్వయంగా అతడి హృదయమే. తన హృదయాన్ని స్పష్టమైన ప్రతిబింబాలున్న అద్దంగా చెప్పాడు. కవిత భావం చూద్దాం. స్వచ్ఛమైన అద్దాన్ని నువ్వు పగలగొట్టావు. అందులో అనేక ప్రతిబింబాలు, నా అభిలాషల పట్టణాలు నివసిస్తున్న అద్దాన్ని నువ్వు పగలగొట్టావు. ఈ అద్దాన్ని పగులగొట్టడం ద్వారా నువ్వు అసంఖ్యాక అభిలాషలను హతమార్చావు. ఇప్పుడు ఏదీ మిగల్లేదు, కేవలం నా ఆకాంక్షల విషాదం, దుఃఖం, నేను, తప్ప మరేమీ మిగల్లేదు. ప్రేయసి తిరస్కారం వల్ల తన హృదయంలో జరిగిన విషాదాన్ని గాలిబ్ వర్ణించిన తీరు బహుశా మరెవ్వరు చెప్పలేదేమో. ఇప్పడు మూడవ కవిత చూద్దాం గలియోం మేం మేరీ నాష్ కో ఖీంచే ఫిరో కె మైం జాందాదా యే హవాయే సరె రహ్గుజార్ థా ఇక వీధుల్లో నా విగతకాయాన్ని లాగుతూ తిరుగు బతికినప్పుడు ప్రతివీధి మూల ప్రేమవాంఛనే నేను ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గలీయోం అంటే వీధులు. నాష్ అంటే ప్రాణం లేని శరీరం, శవం. జాందాదా అంటే ప్రేమలో పడిన అని భావం. హవా అంటే వాంఛలు. జాందాదా యే హవా అంటే ప్రేమలో పడిన వాంఛలు అని చెప్పవచ్చు. సర్ అంటే తల అని అర్ధం. రహ్గుజర్ అంటే రహదారి. సరె రహ్గుజర్ అంటే వీధి మలుపు అని చెప్పవచ్చు. ఫార్శీ భాషలో రెండు పదాలను కలిపి సమాసం చేయడం తేలిక. ఈ పదాలన్నింటిని గాలిబ్ ఒకే సమాసంగా మార్చేశాడు. జాందాదా యే హవా యే సరె రహ్గుజర్ అంటూ అన్ని పదాలను కలపడం వల్ల ప్రతి వీధి మలుపులో ఉన్న ప్రేమవాంఛ అన్న భావం వస్తుంది. అంటే ప్రతి వీధి మలుపులో, ప్రతి వీధిలో ప్రేమలో పడిన పిచ్చివాడిగా తిరిగాడు. పార్శీ ప్రభావం వల్ల ఉర్దూలో కూడా పదాలను ఇలా అల్లడం తేలిక. అందువల్ల కవిత్వంలోను ఆ సౌలభ్యం లభిస్తుంది. ఈ కవిత భావం చూద్దాం. తాను బతికి ఉన్నప్పుడు వీధుల్లో తిరగడమంటే చాలా ఇష్టంగా ఉండేది. వీధుల్లో తిరగడాన్ని ఇష్టపడుతూనే చనిపోయాడు. ఇక దేహానికి అంత్యక్రియలు చేసేబదులు వీధుల్లో లాక్కువెళ్ళండి అంటున్నాడు. మరణించిన తర్వాత కూడా వీధుల్లో తిరగడమే తనకు ఇష్టమని చెబుతున్నాడు. ఏదో ఒక జైలు లాంటి సమాధిలో ఉంచవద్దని, అలా చేయడం తన స్వేచ్ఛను కోల్పోవడమే అంటున్నాడు. పై రెండు కవితలకు ఈ కవితకు పైకి సంబంధం లేనట్లే కనిపిస్తుంది. పై రెండు కవితలు ప్రేయసి, ప్రేమ, విరహం గురించి చెప్పాడు. మూడవ కవితలో వీధుల్లో తిరగడాన్నే తాను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ప్రతివీధి మలుపు వద్ద ప్రేమవాంఛగా నిలిచాడు. మరణించిన తర్వాత కూడా అలాగే తన దేహాన్ని వీధుల్లో లాక్కు వెళ్ళాలని చెప్పడం ద్వారా తాను బతికి ఉన్నప్పుడు ఏ ప్రేమవీధుల్లో తిరిగాడో అవే వీధుల్లో మరణించిన తర్వాత కూడా తిరుగుతానని పరోక్షంగా చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే గజల్లో 4వ షేర్ చూద్దాం మోజె సరాబె దస్తె వఫా కా న పూఛ్ హాల్ హర్ జర్ర మిసలె జోహరె తీగ్ అబ్దార్ థా ప్రేమ ఎడారిలో ఎండమావుల కెరటాల గురించి అడగకు ప్రతి రేణువు పదునుతో మెరుస్తున్న కరవాలంలా ఉంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. మోజ్ అంటే అల. సరాబ్ అంటే ఎండమావి. దస్త అంటే ఎడారి. వఫా అంటే ప్రేమ లేదా ప్రేమలోని నిబద్దత. జర్ర అంటే రేణువు. మిసల్ అంటే పోలిక. జోహర్ అంటే మెరుస్తున్న అని ఇక్కడ భావం. తీగ్ అంటే కరవాలం. అబ్దార్ అంటే పదునైన. ఈ పదాలను కలపి పదబంధాలు రూపొందించడం ద్వరా చక్కని కవితను అల్లాడు ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ తన ప్రేమ గురించి అడిగిన వారికి చెబుతున్నాడు. మిత్రులారా, నా ప్రేమ ఎడారి పరిస్థితి ఎలా ఉందని అడగొద్దు. అందులో ఎండమావుల కెరటాల గురించి అడగవద్దు. ప్రేమలో అంకితభావం, నిబద్దత అనేవి ఎండమావుల వంటివి, ఎండమావిలో నీరు, పచ్చదనం ఎలా కనబడుతుందో ప్రేమ ఎడారిలోని ఈ ఎండమావుల అలలు కూడా అలాంటివే. వాటిని వెదుక్కుంటూ తిరగడమే. ఎడారిలో దప్పికతో అలమటించే వాడికి ఎండమావిలో నీరు దొరకదు. ఎండమావి వెనుక నడుస్తూ చివరకు ప్రాణాలు కోల్పోతాడు. ప్రేమ ఎడారిలోను ఇదే పరిస్థితి. ప్రేమ ఎడారిలో పరిస్థితి చెప్పాలంటే, ఇక్కడ ప్రతి ఒక్క ఎండమావిలోని ఇసుక రేణువు పదునుతో మెరుస్తున్న కరవాలం వంటిది. ఇలాంటి ఎడారిలాంటి ప్రేమలో ఎవరు అడుగుపెట్టగలడు? కాబట్టి, క్షేమంగా ఉండాలంటే దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఎడారిలోని ఇసుక తిన్నెలను సముద్రంలో కెరటాలతో పోల్చడం, ఆ రెండింటిని భగ్న ప్రేమికుడి మనోభావాలతో పోల్చడానికి గాలిబ్ ఎంచుకున్న పదాలు అద్భుతమైనవి. ఈ గజల్ యావత్తు భగ్న ప్రేమ, విరహాలను అతిశయోక్తులతో వర్ణించాడు. ఇప్పుడు ఈ గజల్లోని 5వ షేర్ చూద్దాం కమ్ జాన్తేథే హమ్ భీ గమె ఇష్క్ కో, పర్ అబ్ దేఖా, తో కమ్ హుయే పే, గమె రోజ్గార్ థా ప్రేమబాధ గురించి తెలియలేదు, కాని ఇప్పుడు చూశాను, ఆ బాధ తగ్గితే, ఉపాధి బాధలు చుట్టుముట్టాయి ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. గమ్ అంటే బాధ, దుఃఖం. ఇష్క్ అంటే ప్రేమ. గమే ఇష్క్ అంటే ప్రేమ బాధ. రోజ్గార్ అంటే ఉపాధి లేదా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు. గమె రోజ్గార్ అంటే నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల బాధ అని భావం. ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ తెలియక ప్రేమలో పడ్డాడు. ప్రేమ బాధ గురించి తెలియదు. ఆ బాధ గురించి తెలుసుకుని దానికి దూరమయ్యే ప్రయత్నం చేస్తే నిత్యజీవిత వ్యవహారాలు, ఉపాధి బతుకుదెరువు సమస్యలు చుట్టుముట్టాయి. అంటే సమస్యలు, బాధలు లేకుండా స్వేచ్ఛగా ఉన్నదే లేదు. అయితే, మిగిలిన బాధలేవయినా కాని ప్రేమబాధ ముందు దిగదుడుపే. ఇక్కడ గాలిబ్ ఉర్దూలో చెప్పిన చమత్కారం ఏమంటే, ఒకవేళ ప్రేమబాధలో నేను మునిగిపోకుండా ఉన్నట్లయితే ఈ ప్రాపంచిక వ్యవహారాలు, బతుకుదెరువు బాధల్లో కొట్టుకుపోయేవాడిని. ఈ బాధల నుంచి ప్రేమబాధ నన్ను రక్షించింది. అంటే వందలు, వేల ప్రాపంచి బాధల్లో కొట్టుకుపోవడం కన్నా ఒకే ఒక్క ప్రేమబాధే మంచిది. ఎలాగూ బాధ తప్పనప్పుడు, ఒకేఒక్క అందమైన బాధను భరించడం మంచిది కదా. ఈ గజల్ మొదటి నుంచి కూడా అంతర్గతంగా ఒక భావాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తోంది. ఏకాగ్రతతో, ఒకే లక్ష్యంతో పనిచేస్తే, అది ప్రేమ కాని, మరో విషయంలో కాని మనిషికి ప్రపంచంలో మరేదీ పట్టదు. మరే బాధను అతను పట్టించుకోడు. కాని మనిషి తన లక్ష్యాన్ని మరిచిపోతే లేదా వదిలేస్తే అతడిని శూన్యం ఆవహిస్తుంది. ఆ శూన్యంలో అనేకానేక సమస్యలు, విషాదాలు, బాధలు చొచ్చుకువస్తాయి. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maouRL

Posted by Katta