పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kavi yakoob లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kavi yakoob లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2014, శనివారం

19, జూన్ 2014, గురువారం

Kavi Yakoob కవిత

యాకూబ్ || మిగిలుండాలి ! - అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు మళ్ళీ కొత్తగా మొలిచేందుకు ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి కనీసం గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే పక్షి రెక్కల ఒడుపులా జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి పారుతున్న నీళ్ళను చేతుల్తో కళ్ళిగొట్టి,తేర్చి దోసిళ్ళతో నీళ్ళను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదతీర్చాలి. చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపుముద్దలాంటి తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్నతేనెటీగలాంటి దేహంలోంచి అవశేషమే నిజమైన ప్రాణవంతజీవితమన్నట్లు ఎదగాలి నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలిఉండేందుకు ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి * *జనవరి 2013

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1spFpG3

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Kavi Yakoob కవిత

selected Readings ~ గంటేడ గౌరునాయుడు | మా ఆకాశంలో నెలవంక ................................................................. మా ఇంటి ఆకాశానికి పూచిందొక నెలవంక వంకంటే వంకగాదు ఇంటిల్లిపాదినీ వెంటతిప్పుకునే అల్లరల్లరి పిల్లజింక. *** వేరువేరు తీరుతీరుల విడివిడి ప్రపంచాలను ఒకే ప్రపంచం చేసింది. మేము మరిచిపోయిన ఆటల్నీ,పాటల్నీ మాకందించి మరబొమ్మలమైపోయిన మమ్మల్ని మనుషుల్ని చేసింది. నెలవంక తెచ్చింది మా ఇంటికి లిపిలేని వెన్నెల భాష అదే మమ్మల్నిప్పుడు పాలిస్తున్న అధికార భాష . దానికీ వ్యాకరణం ఉంది దానికో వింత సౌందర్యం ఉంది. శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే మహత్తేదో ఉంది దానికి, అదే మా ఆత్మల్నిప్పుడు అనునిత్యం శాసిస్తోంది. వొచ్చీరాని మాటల వొయ్యారినెలవంక వంకంటే వంకగాదు .. వేయిపున్నముల వెన్నెలజింక. *** మేజాబల్లమీద కూజాలోకి రెండాకులతో ఓ పూలరెమ్మ చేరగానే గదంతా కళాకాంతులతో నిండిపోయినట్టు, పచ్చనాకు ప్రమిదలో ఒకే ఒక్క అరుణారుణ పల్లవి మొక్కను దివ్వసమ్మి గా వెలిగించినట్టు, పువ్వంత పాలనవ్వు మాయింటి ఆకాశాన్ని వెలుగు వెల్లువ తో ముంచెత్తింది. చిట్టి చంద్రవంక నట్టింట పాకుతుంటే మా మానస కాసారాల లోలోతుల్లోకి చొచ్చుకుని మేము కోల్పోయిన ప్రమోదాల నిధుల వేదాలకోసం శోధిస్తున్న మీనమే అనిపిస్తుంది. తన చిట్టిచిట్టి చేతులు నేలకు ఆనించి మెల్లమెల్లగా పారాడుతుంటే మేం మోయలేని మహానంద మంధరగిరిని మూపునకెత్తుకున్న కూర్మం లా గోచరిస్తుంది. బాలరాముడౌతుంది, చిలిపి కృష్ణుడౌతుంది, శతాధిక అవతారాలతో మాలోపలి దానవులను, దశకంఠులను దునుమాడి అంతరంగాల్ని ప్రక్షాళన చేస్తుంది మా నవ్వుచినుకుల నెలవంక, వంకంటే వంకగాదు ఎదలోయల చీకటులను తొలగించే వెలుగులెంక. *** నెలవంక వెలుగువేళ్ళతో తాకితేచాలు రబ్బరుబొమ్మ రసరమ్య రాగాలు పలుకుతుంది. పూలపిడికిళ్ళతో పట్టుకుంటేచాలు కొయ్యగుర్రం కీలుసవరించుకుని పరుగులు పెడుతుంది. పగులగొట్టినా ప్రాణం పోసుకుని తనచుట్టూ ప్రదక్షణలుచేస్తాయి ఆటబొమ్మలన్నీ. దాని అనుగ్రహం కోసం చేతులుసాచి నిరీక్షిస్తుంటాయి నిరంతరం మా ప్రాణాలన్నీ. ఆటల్లో అలయబెట్టి అందీ అందకుండా అలరించే మా చిన్ని నెలవంక వంకంటే వంకగాదు ఎద ఎదనూ పూపొద ను చేసిన పసిపలుకులప్రియాంక. *** నక్షత్ర ధూళి తో నలుగుపెట్టి మిన్నేటి గంగ తో స్నానమాడించి తెల్లమబ్బుల బొచ్చుతువ్వాలుతో ఒళ్ళుతుడిచి కళ్ళకు చీకటి కాటుక దిద్ది చెక్కిట దిష్టిచుక్క పెట్టి వేలికిమిగిలిన కాటుకరేకను అరిపాదంకింద అద్ది ఇంద్రధనసు ఉయ్యాలలో వేసి జోలపాడితే దాని నీలాల కళ్ళమీద నిదరపువ్వు వైశఖపున్నమిలా విచ్చుకుంటుంది. నిద్దరలో దాని ముద్దుమోము నిశ్చల దీపంలా వెలుగుతుంది. పరిమళాలు నింపుకుని పిల్లగాలి పాపచుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఇల్లు ఇల్లంతా ప్రశాంత దైవమందిరమైపోతుంది. నిదరలో బెదురుతుందో , కల చెదురుతుందో ఉన్నట్టుండి ఉలిక్కిపడి తపోభంగమైన మునిలా కలవమొగ్గల కళ్ళు విప్పారుస్తుంది. అప్పుడది ఏడిస్తే అదొక ఇతిహాసం, నవ్వితే అది నవీన కావ్యం. పాపతో గడిపే ప్రతీ క్షణమూ కమ్మని కవిత్వానుభవమే, అదొక నిత్యనూతన సాహిత్యాధ్యయనమే, మేమిప్పుడు నెలవంక పాలనవ్వులకు దోసిళ్ళుపట్టి కళ్ళనిండా నింపుకునే చుక్కలం నెలవంకెకు వేలాడే సరికొత్త ఆశల చొక్కాలం. మా నెలవంక... గోరుముద్దల ముద్దుల గోరువంక, వంకంటే వంకగాదు ప్రేమ క్షీరసాగర గర్భాన మేము నిర్మించుకున్న శతసహస్ర దళసుమాలంకృత స్వర్ణలంక అదేకదా మా ప్రియ ప్రపంచమింక.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0PXU

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | నదీమూలంలాంటి ఆ యిల్లు ! ................................................... చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకం ఊళ్ళో ఇప్పుడెవరూ లేరు వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం; చిన్నిచిన్ని కిటికీలు రెండు; కొన్ని దూలాలు; వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని . కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూలేచి ,పక్కలో తడుముకుని దొరక్క వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తాను; అప్పటికవి ప్రేమిస్తాయి ఇంకా నాలో మిగిలిఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి. 1 ఇంతున్నప్పుడు నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి ఒళ్ళంతా పాకిన గజ్జికురుపులమీద చల్లుకుని పేడరొచ్చులో ఉపశమించాను వేపాకు నూరి పూసుకుని కురుపుల్లా మాడి చేదెక్కాను కాలిబొటనవేలి దెబ్బల్నిఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేసాను ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవుమూత్రం రాసుకుని ఆనందంతో గంతులేశానుఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది; గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది 2 అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు; ఎవరూ సంచరించని ,నిద్రించని, గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి, నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి , పెంచి పోషించిన కాలం వుంది వెళ్ళలేక చింతిస్తున్న , దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naDkWk

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Kavi Yakoob కవిత

యాకూబ్ | ఊయల నిద్రపోయింది ............................................. ఈ నిద్ర నాకు శాపం. ఊహల కుంచెలో ఊయల నిలవడం లేదు. గొంతులో శబ్దం పెగలడం లేదు . ఎక్కడ్నుంచో నిండా ముసుగేసుకుని చిన్ని పాదాలతో నడకల మెట్లెక్కుతూ ,పసినవ్వుల్ని కురుస్తూ ఒక కాలపుచుక్కలా రాలిపడ్డాను . నా అడుగుల సవ్వడి విని ఆకాశం నవ్వింది బోసిగా- * నా రాక కోసం చూసి చూసీ చూపుల మీద కత్తుల్ని పెర్చుకున్నావ్ ! తొమ్మిది నెలలకలల్ని కడుపులో దాచుకున్నావ్ ,కానీ ఈ భూమి నన్ను మరో క్షణానికే వెలివేసింది. తొమ్మిదో నెలవంక రాలిపోయింది. దీర్ఘనిద్రలో ఎన్నో స్వప్నాల మెరుపులు * అమ్మా - ఊయల ఊపకు. నాకు నిద్రొస్తుంది. ఈ జన్మకిక ఉంటాను -సెలవు ! # *పాతవాచకం .

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1wuZ9

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Kavi Yakoob కవిత

కవిసంగమం - నిరంతర కవితోత్సవం ! .............................................. మిత్రులారా ! ఆశ్చర్యంగా ఉంటుంది ఇంతమంది కవుల్ని,ఇన్ని కవితల్ని ఇలా 'కవిసంగమం' వేదిక మీద చూస్తున్నప్పుడు. ! చాలా కష్టపడి,శ్రమించి రెండున్నర ఏళ్ళ క్రితం- తెలుగులో కవిత్వం లేదు అంటున్న మాటల్ని వినీ వినీ విసిగిపోయి - ఉన్నారు,అద్భుతమైన కవిత్వం తెలుగులో ఉంది, అని నిరూపించడానికి - కవిసంగమం ప్రారంభించాం. ఇవాళ -తెలుగులో కవిత్వం లేదు- అనడానికి ఎవరూ సాహసించరు. ఫేస్ బుక్ లో ఈ వేదిక ప్రారంభించడానికి ముందు ఇలా కవిత్వం రాసుకోవడానికి వేదికలు ఉన్నా, అవి ఉన్నాయని చాలామంది సాహిత్యకారులకి తెలియదు. 'కవిసంగమం' ప్రారంభించాక ,ఇటు ఫేస్ బుక్ లోనూ, అటు నెలనెలా కవిత్వ సభలతోనూ ,పోయెట్రీ ఫెస్టివల్స్ తోనూ విస్తృతంగా కవిత్వం గురించిన ఆసక్తిని కల్గించిందనడం అందరూ ఇవాళ ఆమోదించే విషయం. కొత్తగా రాస్తున్నవారు ప్రసిద్ధులైన కవులను కలుసుకునే అవకాశం కలిగింది.వారితో ముచ్చటించే సందర్భాల్ని సృష్టించింది. నిరంతరం రాసేందుకు వీలుగా,ప్రేరణ పొందేందుకు వీలుగా కవిత్వ వాతావరణాన్ని సృష్టించింది. మిగతా ఫేస్ బుక్ గ్రూప్ ల్లా కలుసుకునే 'గ్రూప్ మీట్స్'అనే దశనుంచి కవిత్వ చర్చోపచర్చల సందర్భంగా ఆ కలయికల్ని మలిచింది. 'కవిసంగమం'లో రాస్తున్న కవులవైపుకు ఆసక్తిగా అందరూ చూచేటట్లు,వారి కవితలవైపు దృష్టి మరల్చేటట్లు కవితల విశ్లేషణలతో,సందర్భాలతో ఉత్సాహపరిచింది. కవిత్వం అంటే ఒకానొక సీరియస్ అంశమనీ, కవిత రాయడం అంటే 'అంతరాంతర జ్యోతిస్సీమల్ని'బహిర్గతం చేసే సాధన అని తెలుసుకున్నవారు ఇన్నాళ్ళ ఈ కవిత్వ వాతావరణంలో మెరుగుపడ్డారు, కవిత్వంలో తమదైన ముద్రను కనబరుస్తున్నారు. ఇవాళ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.జయహో ! రాసిన ప్రతి కవితా గొప్పది కానట్లే, రాస్తున్న ప్రతివారూ కవిత్వమే రాస్తున్నారని చెప్పలేం. కానీ రాయగా రాయగా 'కవిత్వ దివ్యరూప సాక్షాత్కారం' ఎప్పుడో ఒకప్పుడు అవుతుందని మాత్రం నమ్ముతూ రాసుకుంటూ సాగడమే చేయాల్సిన పని. అలా రాస్తూ వినమ్రంగా కవిత్వ మెళుకువల్ని ఆకళింపు చేసుకుంటూ ;చదువుతూ; రాస్తూ తుడిపేస్తూ ఎవరైతే కవిత్వం కోసం తపిస్తారో వాళ్ళు మాత్రమే మిగులుతారు, వారి కవిత్వమే నిలుస్తుంది. *** "చాలా రోజులనుంచి రాస్తున్నమండీ 'అని దబాయించేవారికి ఒకటే సమాధానం -ఎప్పుడొచ్చామన్నది కాదు,ఎలా రాస్తున్నామన్నది ముఖ్యం. కవిత్వం పాఠకుడిని హత్తుకుందా ,లేదా ముఖ్యం. లైను కింద లైను గా అక్షరాలు రాసుకుంటూ పొతే అది కవిత అయిపోదు. అందులో ఆత్మను కవిత్వ నైపుణ్యంతో ఆవిష్కరించావా ,లేదా ? అన్నదే ముఖ్యం". "ఫేస్ బుక్ లో గ్రూపులు కొన్నాళ్ళ తర్వాత చప్పబడి పోతాయి'' అని ఆమధ్య ఒక మిత్రుడు మాటల సందర్భంలో అన్నాడు. సంతోషించే విషయం ఏమిటంటే , 1.రోజురోజుకీ 'కవిసంగమం'లో Join request లు పెరుగుతూ ఉండటం. కొత్తగా వస్తున్నవాళ్ళలో మెరుగైన కవిత్వ సృజన చేస్తున్నవాళ్లు కన్పిస్తుండటం.2.ఇదొక పోయెట్రీ హబ్ లాగా మిగతా సాహిత్య పత్రికలకు, e పత్రికలకు ఉపయోగపడుతుండటం.3. కవిత్వరంగంలోకి వస్తున్నవారికి సంతోషించదగ్గ ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తూ ఉండటం. కవిత్వంలో ఉత్సాహం నింపుతున్న ఇటువంటి కవిసంగమం నిలబడాలి. నిలబడాలంటే నిత్యమూ కవిత్వరచన, అభిప్రాయాలు -కవిసంగమంలో కన్పించాలి. కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించాలి. *** నిరంతరం కవిత్వం..కవిత్వం ..కవిత్వం ! జయహో కవిత్వం !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHszKX

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Kavi Yakoob కవిత

Today at 12.30pm~ 10TV లో మోహన్ రుషి' జీరో డిగ్రీ' పుస్తక పరిచయం!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8mAoB

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Kavi Yakoob కవిత

http://ift.tt/1kHj7uj

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHj7uj

Posted by Katta

Kavi Yakoob కవిత

Selected Readings ~ మోలానా జలాలుద్దీన్ రూమీ | మన్నుగా మారు ............................................................ బండరాయి మీద వసంతంలో గూడా పూదోట పెరగదు . మెత్తటి మన్ను అయితే ఎంచక్కా రంగురంగుల పూలు పూస్తవి ! నీ గుండె ఒట్టి బండరాయి. ఇకనుంచైనా ప్రయత్నించి మెత్తటి మన్నుగా మారు. #

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rUnsPF

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Kavi Yakoob కవిత

సత్య శ్రీనివాస్ తో కవిత్వ సంభాషణ / Inner View ! -భాస్కర్ కొండ్రెడ్డి -వీడియో రికార్డ్

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oz7Nzq

Posted by Katta

Kavi Yakoob కవిత

ఇక ప్రతి గురువారం / సి రా column 'కవిత్వ వారధి' /కవిసంగమంలో !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mihC21

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2jBqo

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ "ప్రపంచీకరణ నేపధ్యంలో సంబంధాలు, ప్రేమలూ, ఆర్ధికసంబంధాలు అవుతున్న స్థితిలో మనుషులు ఏకాకులుగా మిగులుతున్న నేపధ్యంలో జీవితాన్ని గురించి పాడటం [రాయడం] ఒక ఎత్తయితే, మనుషుల్ని కలపడం మరొక ఎత్తు. సామ్రాజ్యవాది, పెట్టుబడిదారుడు మనుషుల్ని విడదీస్తారు. కవి ,కవిత్వం మనుషుల్ని కలుపుతుంది. సంగమమే ఒక పండుగ .సంపద. ఇప్పుడు కవిత్వం నలుగురిని పోగేయడం, కలపడం, కలిసి పంచుకోవడం, ఆనందించడం, కలిసి మార్చ్ చేయడం,యుద్ధాలు చేయడం ." * "- మామూలు మాట కవిత్వం ఎట్లా అవుతుంది? మామూలు వాక్యం కవితాత్మకంగా ఎలా అవుతుంది ? మామూలు మాటని ఎలా తిప్పితే ,ఎలా కదిలిస్తే, కవిత్వమౌతుందో కవికి తెలియాలి ." * = కె.శివారెడ్డి ,ప్రసాదమూర్తి ' మాట్లాడుకోవాలి' ముందుమాట నుంచి [2007]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcZFFN

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Kavi Yakoob కవిత

Selected Readings ~ మౌలానా జలాలుద్దీన్ రూమీ | నీకు తెలియాలి * అమ్మకానికి పెట్టిన ప్రతి వస్తువు విలువా పరిశీలించి తెలుసుకుంటావు గాని, నీ సొంత విలువ గురించి నీకు తెలియనప్పుడు చిక్కుల్లో పడతావు. ఏ నక్షత్రాలు అదృష్టం కలిగిస్తాయో ఏవి శుభం సూచిస్తాయో కష్టపడి తెలుసుకుంటావు గానీ, - నీకు నువ్వు అదృష్టవంతుడివో కావో నీకు తెలియదు . ఇదీ అన్ని శాస్త్రాలూ చెప్పే నీతి - ఆ ఆఖరు రోజు వచ్చినప్పుడు నీవెవరో నీకు తెలియాలి. * దీవి సుబ్బారావు ' సూఫీ కవిత్వం' నుండి, పేజి 31

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tc3FMd

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Kavi Yakoob కవిత

జయహో కవిత్వం ! ..................................... కవిసంగమం - ఫేస్బుక్ లో ఒక గ్రూప్ : వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. http://ift.tt/1jynLpu త్రిపురనేని శ్రీనివాస్ ॥ కవిత్వం కావాలి కవిత్వం ! .......................................................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ............. కవిత్వం వేరు వచనం వేరు సాదాసీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్- కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం .......... - కవిత్వసృజన,కవిత్వపఠనం,కవిత్వ సంబంధిత అంశాలు -ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా 'కవిసంగమం'సీరీస్ సభలు 'పోయెట్రీ వర్క్ షాపు'ల్లా జరుపుకుంటున్నాం.వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను వాల్ మీద పోస్ట్ చేసుకుంటున్నాం. ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గంలో సాగుతున్నాం. Important Note : ~Join in కవిసంగమం with ORIGINAL profile Photo. ~Don't send Join requests if your profile picture is not with original face. ............................................................................ ఈ గ్రూపు లో ~ 1. కవితలకు ఫోటోలు పెట్టవద్దు.[సీనరీలు గట్రా] 2. ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యాలి. 3. ఇతర పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన మీ కవితల,కవితావ్యాసాల 'లింక్స్'ను సరాసరి ఇక్కడ పోస్ట్ చెయ్యవద్దు. ఆ రచనను టైపు చేసి కానీ ,కాపీ,పేస్ట్ చెయ్యడం ద్వారాగానీ పోస్ట్ చేస్తూ క్రింద బ్రాకెట్ లో సదరు పత్రిక యొక్క పేరును రాయండి.[అలా లేని పక్షంలో అటువంటి పోస్టింగును పోస్ట్తె చేసినవారికి తెలుపకుండానే తొలగించడం జరుగుతుంది] 4. కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి. 5. కవితాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేవారిని, 'కవిసంగమం' గ్రూపు సమగ్రతకు భంగం కల్గించేవారిని వారికి తెలపకుండానే తొలగించడం జరుగుతుంది.ఈ విషయంలో 'అడ్మిన్'లు ఎవరికీ జవాబుదారీగా ఉండనవసరం లేదు. 6. కవిత కింద కేవలం లైక్ కొట్టిన వారికీ,కామెంటు రాసినవారికి -ఒక్కొక్కరికి ఒక 'థ్యాంక్స్' చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా,అవసరమైన చోట్ల ఆ కామెంటుకు వివరణ కానీ,ఇంకాస్త కవితకు సంబందించిన విషయం కానీ చెప్పదలుచుకున్నప్పుడు రాయడం బాగుంటుంది. 7.కవితలలోని అంశాలకు, కామెంట్ల లోని విషయాలకు పోస్ట్ చేసినవారే బాధ్యులు. వాటితో 'అడ్మిన్'లు గానీ,'కవిసంగమం' గ్రూపుకానీ ఏకీభవించారని అనుకోవసరం లేదు. ..... Note 1 ~ ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యండి. ఒకటికన్నా ఎక్కువ కవితలు పోస్ట్ చేసినచో ఆ పోస్ట్ తొలగించడం జరుగుతుంది. NOTE : 2 ~ కవిత పోస్ట్ చేసేటప్పుడు-కవితా శీర్శిక తప్పక పెట్టండి. [*ఉదా: కవి పేరు | కవితా శీర్షిక ] అలాగే కవిత క్రింద తేదీ తప్పక వెయ్యండి.[*ఉదా: 30.8.2012 ] మిత్రులారా! సహకవులు రాసిన కవితలపై మీ స్పందనలు రాయండి.ప్రోత్సహించండి. మంచి 'కవితా'వరణం సృష్టించండి !! Note:3~EVERY SATURDAY - SPECIALLY FOR POSTING ENGLISH POETRY . ....... *సాధ్యమైనంతవరకూ సభ్యులు తెలుగులిపిలో చర్చలు సాగించవలసిందిగా మనవి. తెలుగులిపిలో టైపు ఎలా చెయ్యాలో తెలీని వాళ్ళు http://lekhini.org/ or http://epalaka.com/ తో మొదలుపెట్టవచ్చు. : *నిర్వాహకులు*

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jynLpu

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1udTFPE

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2TvaN

Posted by Katta

Kavi Yakoob కవిత

Selected Readings~

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2bqDa

Posted by Katta