పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

Panasakarla Prakash కవిత

"ఒక చావు తరవాత" వస్తే రానీ చీకటిని నేను మాత్ర౦ వెలుగుతూనే ఉ౦టాను చీకటిలోకి వెళ్ళేవరకూ..... చావ౦టే ఏ౦టి..? రూపాన్ని మార్చుకోడమేకదా..! ఊరికినే ఏడవకు ఎవరో సచ్చినట్టు కన్నీళ్ళు బుగ్గమీద‌ అమ్మ పెట్టిన తీపి ముద్దు గురుతుల్ని ఊరికే చెరిపేసి పోతాయ్ నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు నీ దోబూచులు... రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే శాశ్వత౦కాని జీవితాన్ని మలుచుకోవాల్సి౦ది అ౦ద౦గా కాదు హు౦దాగా మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో మన౦ ఇప్పుడు అటువైపే నడుస్తున్నా౦ మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు ఎన్ని గు౦డెలు నీ ఊపిరై కొట్టుకు౦టున్నాయో చూసుకో..... అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... పనసకర్ల 25/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S6KuCy

Posted by Katta

Sukanya Beegudem కవిత



by Sukanya Beegudem



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r6ifE5

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మానవత్వమా!|| =========================== ఎక్కడో ఓ మూల చిన్నగా హీన స్వరం ఊపిరిలాగ లేక డొక్క కదిలిస్తుంది ఆకలి కన్నా ఆవేదనే గుండెల్ని గుచ్చేస్తుంది కదిలేకాలంలో ఒంటరితనం నరాల్ని ఒడిసి పిండేస్తుంది ఆప్యాయ పిలుపుకోసం పరితపిస్తుంది దేహం! ఎక్కడో ఏసీగదిలో సేదతీరుతున్న ఓగంభీరస్వరం కన్న పేగుని పట్టించుకోని మృగ జీవిలా పెగ్గు లెగరేస్తుంది కాలం పరిగెడుతున్నా..అమ్మ కమ్మని లాలన వద్దనుకుంటూ ... ! ఎక్కడో శబ్దాలు వినిపిస్తున్నాయి రెండు వింత లోకాల మధ్య ఎడబాటు చూపుతూ పున్నమి వెన్నెల కూడా మసకేసింది నల్లటి దుప్పటి ఆకాశాన్ని కప్పేసింది రవ్వంతైన వెలుగు లేకుండా చిల్లులు పడిన లోకం మానవత్వాన్ని చీకట్లో కలిపేస్తుంది కేకలన్ని అరణ్య రోదనలై వెక్కిరిస్తున్నాయి జన్మ నిచ్చిన అమృతమూర్తి భారమౌతుంది అందుకే కాబోలు భూమి బద్దలవుతుంది జనని వేడెక్కుతుంది కనిపించని గాయాలు గుండె పొరల్లో దాక్కున్నాయి దాగని వేదన ఉబికుబికి లావాలా తన్నుకొస్తుంది డొక్కలో అదిమి పట్టే బాధ పెదాలపై గేలి చేస్తుంది అంతా శూన్యం ... ఎక్కడో మూగబోయిన పిలుపు కన్నాల్లోనుంచి తొంగి చూస్తుంది భళ్ళున తెల్లారే జీవితాలు చీకటి వైపే పయనిస్తున్నాయి కాలంపై కాలకూట విషం ఉమ్మేసింది చిద్రమైన లోకంపై చిమ్మేసింది మానవత్వాన్ని అమ్మేసింది ================== మే 25/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbhuCH

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

Chandaalika Raajyam/jwalitha poem where is it pls find out

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r6idMe

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

అతను పాటలుపాడుతూ ఉంటే ట్రైన్ ట్రైనంతా పాడినట్లుంటుంది అతనిపాట ట్రైన్ సంగీతానికి అనుగుణంగా ఉంటుంది

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S6qu2T

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//నానీలు-4 ****************************** మేధస్సు మానవునికి వరం అందుకే నెత్తినెత్తుకోబడిందేమో * * * * * ముక్కును కట్టివేస్తే ప్రమాదం నోరు కట్టివేయకుంటే ప్రమాదం * * * * * బాధ గుండెల్లో దాగిఉంటుంది సంతోషం నెత్తిన ఊరేగుతూంటుంది * * * * * మనిషి చూపులు సదాఆకాశంలో; నేలను వీడకుండా పాదాలేమో క్రింద. * * * * * 25-5-2014 ------------(16)

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p7G3pa

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

రైల్లో - 2 అతని వేళ్ల చివర అతని గుండె వుంది వేళ్ల కాళ్లు కంజిర మీద నాట్యమాడుతున్న కొద్దీ గుండె వేల వేల ఖండితాల చరణాలుగా మారి పాటై ప్రవహిస్తుంది అతను - ఆ పాటగాడు రైలు పెట్టెనంతా వో వాద్యపరికరంగా మార్చేశాడు ! రచనా కాలం : 25 మే 2014 ------------------------------ 25.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mapILh

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక||తెలుగు గజల్ -5 .. దేశప్రేమ పెంచితే ప్రగతిని నిలబడి చేరినట్టే కులపిచ్చి పంచితే దుర్గతికి కలబడి పోరినట్టే. .. కాలేపేగుకు కూడు యింత దొరికితే ఆకలి మంటకు ఇక సెగవడి తీరినట్టే. .. కవి లోచనకు భావం యింత దొరికితే పాళీనడకకు ఇక బలువిడి కూరినట్టే. .. చెలిమనసుకు రాగం యింత దొరికితే మది ఊసుల్లో ఇక అలజడి దూరినట్టే. .. ప్రేమదోయికి వలపు యింత దొరికితే అధర పలుకుల్లో ఇక అలికిడి జారినట్టే. .. దీపవల్లికి తైలం యింత దొరికితే కాంతి సుధలకు ఇక నిలకడ చేరినట్టే. .. (తెలుగు గజల్-25/05/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h1WUrl

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వాస్తవికత ఆ చిన్న చిన్న స్వప్నాలు ఒక దానితో ఒకటి కలిసిపోయి చిక్కు పడిపోయి ఉన్నాయి ఎందుకంటే ఆ స్వప్నాల్ని తెరవకుండానే ఉంచేశాను జీవితంలో ఇంతవరకూ ఇప్పుడెంత ప్రయత్నించినా ఆ స్వప్నాలు వాస్తవాలు కావడం లేదు చిన్న చిన్న స్వప్నాలు కాలాన్ని మ్రింగేస్తాయని నా ఆశల్ని అడియాసలు చేస్తాయని తెలుసుకున్నాను అందుకే నా జీవితానికి సరిపోయిన ఒక పెద్ద స్వప్నాన్ని సృష్టించుకుంటూ ఆ స్వప్నాన్నే జీవితంగా మలుచుకుంటూ నన్ను నేను ఒక మనిషిగా ఆవిష్కరించుకుంటున్నాను! స్వప్నమంటేనే జీవితం అని జీవితం అంటే స్వప్నమని తెలుసుకున్న తరవాత స్వప్నఋషిగా మరి ధ్యానం చేసుకుంటూ వాస్తవికతలోకి పయనిస్తుంటే, ప్రవహిస్తుంటే జీవితం ఎంతో హాయి గా ఉంది! 25May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRcF4z

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

.............నరసిoహ్మరావుజాలిగామ //కవిని నేను// నేను కవిని... నాలో..భావం...జ్వలించినప్పుడు.. అక్షరం...అక్షరం...సయ్యాటలాడుతూ... మల్లెపందిరిలో...శోభిస్తూ... పదాల...సమాహారం...లయతో...ప్రసవించినప్పుడు... ఆ.....భావం..కవితై...... రూపం...గుణం...దాల్చినప్పుడు.... నా...మానసం....మరో...ప్రపంచంలో....విహరిస్తుంటే.... నా...ఆనందపు...అందానికి.... ఎల్లలెవీ.....నా...ఆ...అనుభూతి...అందానికి...అంతేది... నేను కవిని... ఏ...సిరాతో...వ్రాస్తేమి... ఏ...కలమైతే...ఏమి... జాలువారిన...పదాలు... కారుచిచ్చై...విప్లవజ్వాల...రగిలించవచ్చు.... జన..జాగృతం...చేయవచ్చు.... దగాకోరుల...గుండెల్లో...నిద్రించవచ్చు... శ్రమైక...జీవులు...పట్టాభిషేకులు...కావచ్చు.... అయ్యో!..నేను..కవిని!.. పదాల పూలతో..బాణాలేయవచ్చు.... కన్నె..మనసు..గెలువవచ్చు.... ప్రేమను...పుట్టించవచ్చు... విరహ..జ్వాలలో...పద..రసికత్వంలో...నిట్టూర్పులిడువవచ్చు.... మానస...శ్రుంగారంలో...అందని...ప్రేయసితో...హాయిగా..క్రీడించవచ్చు.... నేను..కవిని..... నిశ్శబ్ధ...శ్మశానం...సృష్టించుకోవచ్చు.... సుఖాల...మరిగిన...శరీరం...కాష్టమవుతుంటే.... సుఖాలకు....తర్పణం...వదులుతూ.... మరో...జీవిత...నాటకాన్ని...రచించుకోవచ్చు...... నేను...కవిని...నా..ఇష్టం....నేను...కవినే...... //ది: 25-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Szkm3R

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -------నేను పుట్టాను ఒకానొక గర్భ గదుల గుండెలనుండి అల్పాయుశ్శును నింపుకుని కొన్ని బండరాళ్ల మనుషుల్లోకి నేను పుట్టాను. వెంట తెచ్చుకున్న కొన్ని అనురాగపు ఆనవాళ్ళు బాహ్యలోకంలో అడుగిడగానే ఎండిపోయిన రుధిరపు బిందువులుగా. ప్రసవించక మునుపు నా స్తావరం ఇరుకు అయినా విశాల కలల ప్రపంచం ఇక్కడ అనంతమైన నేల పరుచుకున్నా ప్రేమలు ఉద్భవించని కుగ్రామం. ఒకసారి మనసుని వెతికి చూస్తే చేతికి తగిలాయి ఇంకీ ఇంకని కన్నీటి జ్ఞాపకాలు వడిలీ వడలని చర్మపుతోళ్ళు. వసంతానికో నవ్వు చూడను దశాబ్దానికో పులకింత కనను శతాబ్దాలుగా పుడుతూనేవుంటాను యుగాలుగా బ్రతికేస్తూనేవుంటాను ! 25/05/2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9BhT7

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

.............నరసిoహ్మరావుజాలిగామ //కవిని నేను// నేను కవిని... నాలో..భావం...జ్వలించినప్పుడు.. అక్షరం...అక్షరం...సయ్యాటలాడుతూ... మల్లెపందిరిలో...శోభిస్తూ... పదాల...సమాహారం...లయతో...ప్రసవించినప్పుడు... ఆ.....భావం..కవితై...... రూపం...గుణం...దాల్చినప్పుడు.... నా...మానసం....మరో...ప్రపంచంలో....విహరిస్తుంటే.... నా...ఆనందపు...అందానికి.... ఎల్లలెవీ.....నా...ఆ...అనుభూతి...అందానికి...అంతేది... నేను కవిని... ఏ...సిరాతో...వ్రాస్తేమి... ఏ...కలమైతే...ఏమి... జాలువారిన...పదాలు... కారుచిచ్చై...విప్లవజ్వాల...రగిలించవచ్చు.... జన..జాగృతం...చేయవచ్చు.... దగాకోరుల...గుండెల్లో...నిద్రించవచ్చు... శ్రమైక...జీవులు...పట్టాభిషేకులు...కావచ్చు.... అయ్యో!..నేను..కవిని!.. పదాల పూలతో..బాణాలేయవచ్చు.... కన్నె..మనసు..గెలువవచ్చు.... ప్రేమను...పుట్టించవచ్చు... విరహ..జ్వాలలో...పద..రసికత్వంలో...నిట్టూర్పులిడువవచ్చు.... మానస...శ్రుంగారంలో...అందని...ప్రేయసితో...హాయిగా..క్రీడించవచ్చు.... నేను..కవిని..... నిశ్శబ్ధ...శ్మశానం...సృష్టించుకోవచ్చు.... సుఖాల...మరిగిన...శరీరం...కాష్టమవుతుంటే.... సుఖాలకు....తర్పణం...వదులుతూ.... మరో...జీవిత...నాటకాన్ని...రచించుకోవచ్చు...... నేను...కవిని...నా..ఇష్టం....నేను...కవినే...... //ది: 25-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1w1gNmk

Posted by Katta

Rajender Kalluri కవిత

## స్నేహం ## వయసు బేధం లేదు నాకు ఎక్కడంటే అక్కడ విహరిస్తాను ఎవరి మధ్య అయినా చిగురిస్తాను ప్రతి వాళ్ళని పలకరిస్తాను నా నుంచి ప్రేమ మొదలువ్తుంది. నాకంటూ ఓ ఆస్థానం లేదు గాని ప్రత్యేక స్థానం మాత్రం ఉంది కల్మషం లేని నా స్వభావాణ్ని అడ్డుగా పెట్టుకుని కలుషితమైన వ్యాపారం చేస్తున్నారు కదూ విలువలు లేని వీధిలో మీరు బ్రతుకుతున్నా , వాటిని తెలుస్కోలేని మీ మధ్య నేను బ్రతకలేను అందుకే ప్రపంచ వీధులన్నింటిలో నేను సంచరిస్తున్నా , అతి కొద్ది మంది మధ్యలో మాత్రమే స్వేచ్చగా జీవిస్తున్నా ఆ స్వేచ్చా జీవితాన్ని అందిస్తున్న వారందరికీ నా “ ఈ రోజు “ ని అంకితం చేస్తున్నా . ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ .... నేను విహరించే వీధి ని “ స్నేహం “ అంటారు నన్ను అక్కున చేర్చున్నవారంధరిని “ స్నేహితులు” అంటారు నేనే ప్రాణం అని అనుకున్నవారందరిని “ గొప్ప స్నేహితులు “ అంటారు ! kAlluRi [ 25 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9ov6V

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//రుతుపవనాలు// ఆలోచనలు ఇంకని అక్షరాలు కాగితపు పడవలో కొట్టుకు పోయి అకాల మేనెల వర్షంలో మునిగి ముగుసి పోయాయి తెలవారుతుంది పై పై పొరలు తడిసిన మనసు గీష్మతాపంలో పొగలు కక్కుతుంది ఉక్కబోతలా వెళ్ళగగ్గుతూ అక్కసు గాలిని విసనకర్రనడిగి నీడన అణిగిమణిగి బతకాల్సిన కాలం ఎండిన చెరువు అడుసులో ఎగిరెగిరిపడ్డావో మట్టగిడసలా ఒట్టిచేతులకే దొరికిపోతావ్ నీదైన రుతుపవనం రావాలంటే అలపీడనం గూడు కట్టాలి తుఫాను ఒకటి తీరం దాటాలి రోహిణి కార్తెలో తగుబెట్టిన కొల్లేటి కిక్కిసకర్ర మేకలు ఎగురుతున్నాయ్ సిద్దంగా ఉండు కళ్ళని మేఘావృతం చేసుకొని....24.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouBylW

Posted by Katta

Rajeswararao Konda కవిత

అమ్మ ప్రేమ ఎప్పుడూ కమనీయమే @ రాజేష్ @ 25/05/14

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQQYBy

Posted by Katta

Sky Baaba కవిత

AAHWAANAM..! QUSHAAMADEED..!!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1niGKtt

Posted by Katta

Maheswari Goldy కవిత

|| శు భ ప్ర భా త ము || మహేశ్వరి గోల్డి వసంత సమీరపు సాక్షిగా పసిడి వర్ణమును అలంకరించుకున్న నక్షత్ర చామంతులు నాలో ఊపిరి పోస్తూ.....!! నిను తాకాలని కాంక్షిస్తున్న ఆ నిశ్వాసపు గాలులు పరచిన పానుపు పై పహారా కాస్తున్న అపరంజి ఊర్వశి నగవుల...............! అనురాగ విరుల ఆనంద సంతకాల తలపుల రాలిన నా మౌనభావాల ప్రణవాక్షరాలు మధులేఖలుగా మారి భానూదయాన నీ ఆశీస్సులకై నిరీక్షిస్తున్నవి ఓ మదూధయా...!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouu42n

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/వాన దీపం ____________ గోడకు తగిలించిన దీపం రాత్రంతా వెలిగి వెలిగి ఇప్పుడే కొండెక్కింది ఒంటరిగా తనను తను కాల్చుకున్నాక ఒంటిపై మిగిలిన మసి ఇంటి చూరు కూడా చేతులు చాపి రేయంతా మెలకువగానే తోడుకుంది ఇంత చీకటిని ఎక్కడో దడాలున పగిలిన కీచురాళ్ళ శబ్ధానికి కొంచం జలదరిస్తూ ఒకింత అలజడి గాజు దేహం గుండా ముసలి వర్షమొకటి అప్పుడే అటుగా వెడుతూ తలతిప్పి చూసింది దహనమవుతున్న ఏకాంత ఒత్తిని/ఒక్కో చుక్కా రాలే కొద్ది నేలంతా తడిసిన వాసనతో నానుతోంది ఇక కొద్దిగానే నిండుకున్న చమురుతో నెట్టుకొస్తున్న ఆ పదార్థానికి శూన్యపు గాలికి కిర్రుమన్న చప్పుడు ఆకుల మధ్యగా కొన్ని పువ్వులు అప్పుడే రాలినట్టున్నాయి పసిరుచిగొడుతూ ఇంకెన్ని రాతులు దహనమవ్వాలో ఒంటరైనా ఆ గది కోసం తిలక్ బొమ్మరాజు 25.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TIMank

Posted by Katta

Krishna Mani కవిత

దొర ________________________కృష్ణ మణి పల్గార తోని పల్లుతోమంగ బంకమన్నుతీసి పెయ్యితోమంగా నలుపుగాని తెలుపు పంచల మెరిశె మల్లిగాడు ! సుట్టం పెండ్లికి తువాలు భుజానికేశి సూడముచ్చటగా నడవవట్టే ఎన్నడులేని షోకుల మెడలుతిప్పే రోషగాల్లు సూడ బావోచ్చిండని పల్కరించి పరాష్కమాడిన పావురాలు ! గుండెల బరువుదించి అల్కగైన పానాన పెండ్లిగాంగానే ఎర్రచద్దర్ల బగారన్నం కూరనీళ్ళ డాల్చ కడుపునిండ కానిచ్చి కల్లుదుక్నం దేవులాడి ముంతకల్లుకి మురిశిన మొటుకశ్టాలు ! చెట్లనీడల కునుకు తీసి పోద్దుదిగంగనే పోయోస్త బామర్దని మొకమింత జేసుకొని పలానోని కార్యంల కలుస్తనని తిరుగు బండెక్కిన మనసున్న దొర ! కృష్ణ మణి I 25-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ml1PSW

Posted by Katta

John Hyde Kanumuri కవిత

??? ||జాన్ హైడ్ కనుమూరి|| నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదు కొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారు దోచుకున్న సంపదను తరలించేందుకు చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు ఊరు నాల్గక్షరాలు నేర్చాక కాలిబాట రోడ్డయ్యింది నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారింది నేనింకా తొక్కాలనుకునే సైకిలికిప్పుడు ఆ రహదారిపై అనుమతిలేదు నా ఊరిదేహభాగమైన రహదారిపై కారు నడపాలంటే, బస్సెక్కివెళ్ళాలంటే పన్నుచెల్లించాల్సిందే! * * * కాలిబాటకు కాలంలో ఎన్ని మార్పులు * * * అంతర్జాల ప్రయాణంలో మార్పువెంట మార్పులు నాదైనదేదీ నాది కాదు *******************25.5.2014 6:00 - 7:25 pm ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oh6f0u

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/రూపం రవ్వంతే రాలి0దా రాయి రాయి అయితే బాగు0డు రాయిని రుపం ధరి0చుకోను0ది. ధరి0చుకోనున్న రూపానికి పుటల కొద్ది చరిత్ర.... చరిత్రంతా యుగాలుగా ని0డున్న భూమిది భూమే ఆ రూపం రూపమే భూమి అరాచకం ఆర్పిన దీపాలను వెలిగి0చి0ది. మూగబొయిన హృదయల్లో తంత్రులై మొగి0ది. దగాకోరులు నిధులు తరలిస్తు0డగా భద్రకాళి అయి ఎదురై ఎదిరి0చి0ది. చక్రవర్తులైపోతామని తయితక్కలాట ఆడి పిల్లి మొగ్గలు వేసిన దొ0గనాయళ్ళను దేశం దాటి0చి0ది. రోటి కపడా ఆజాది చి0దులేసే అవకాశమిచ్చి0ది. ఆ రూపమే ఈ రోజు దిక్కులేక రాయిని ధరి0చుకొని పెచ్చలుగా రాలుతు0ది. 25-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t7QgPU

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత



by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TIuwzS

Posted by Katta

Satya Srinivas కవిత

నీటి మొహం చెరువులో ఎవరో రాయి వేస్తే ఏర్పడ్డ వలయాల్లా గుంటాయి మొహాలు నవ్వుతూ ... నవ్విస్తూ ... ఏడుస్తూ ... ఏడ్పిస్తూ ... తడి ఎండుతున్న నీటిలా .. . చెరువులో ఆకులా రాలితే బాగుండు నీటి మొహంలాగుంటుంది బతుకు 29 అక్టోబర్‌ 2000 హైదరాబాద్‌

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tzy04b

Posted by Katta

Abd Wahed కవిత

దొరికిందొక జీవితమిది ఎలా ఉన్న బాధ లేదు విషాదమే సంపదైతె తక్కువున్న బాధలేదు అనుభవాల పాఠాలను చదువుకునే తరగతిలో మోదమేదొ ఖేదమేదొ తెలియకున్న బాధలేదు అగ్నిధారగా మారని అక్షరాలు అవసరమా లోకాలను ముంచే కన్నీళ్ళున్నా బాధలేదు ఇరుకు ఇరుకు మనసైతే ప్రేమలకిక చోటెక్కడ మర్యాదల పూలవాన కురియకున్న బాధలేదు శలభాలే కరువైతే దీపాలకు పనేముంది ముల్లులాగ పెనుచీకటి గుచ్చుకున్న బాధలేదు దిగ్మండల సుందరాంగి దరహాసం తొలిపొద్దుకు ముత్యాల్లా కిరణాలే రాలుతున్న బాధలేదు గడిచిపోయె ప్రతిరోజూ ఒకనష్టం బతుకులోన లాభాలకు దియా లెక్క లేకున్నా బాధలేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmYdAk

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• కొన్ని దార్ల నడకలు •• నడక దారీ బంధం- ఛిధ్రమైన ఒకానొక కాలం ఆగు నడక- పిచ్చిది దారి ఎదురుచూపై మునిగి ఔ నేల తడి- రాదు నడక- దారి కల్లోలం- 25/05/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rnc1Pr

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

అక్షరం ఆయువైతే ! అక్షరం ఇష్టమైనపుడు నా అందమైన భావాలను అపురూపంగా మలచి ఆనందపడ్డాను అక్షరం నేస్తమైనపుడు నా అంతరంగ తరంగాన్ని అనురాగం రంగరించి ఆవిశ్కరించాను అక్షరం వ్యసనమైనపుడు నా అమూల్యమైన అనుభవంతో అంతరాత్మను అనువదించి అంతర్మధించాను ఇప్పుడు అక్షరం ఆయువైంది నేనే అక్షరమై అంకురించాను ఇకపై అక్షరం అక్షరమే ఔతుంది... 25-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7lB2E

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 34 . బ్రిటిషు కవయిత్రి, మానవప్రేమి (Philanthropist), 38 ఏళ్ళ వయసులోనే క్షయవ్యాధివల్ల తనువుచాలించిన ప్రాక్టర్, విక్టోరియా మహారాణికి అత్యంత ప్రీతిపాత్రమైన కవయిత్రి. 14 ఏళ్ళ ప్రాయంలోనే కలం పట్టిన ప్రాక్టర్ Charles Dickens తో తమ కుటుంబానికున్న పరిచయాన్ని ఉపయోగించుకోదలచుకోక, అతని పత్రికలకే మారుపేరుతో కవితలు పంపింది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలని Charles Dickens కీర్తించాడు. కవిగా లార్డ్ టెన్నిసన్ తర్వాతస్థానంలో నిలబడగలిగినదంటే, ఆమె ప్రతిభని ఊహించుకోవచ్చు. సోషలిస్టు భావాలుకల ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగాఉండి, నిరుద్యోగయువతులకోసం, నిరాశ్రయులకోసం కృషిచేసింది. 19వ శతాబ్దంలో ఆమె కవిత్వ పుస్తకాలు బహుళప్రచారంలో ఉండడమే గాక, ఎన్నో పునర్ముద్రణలకు నోచుకున్నాయి. ఈమె కవితలలో ఉండే మంచి తూగు, సంగీత బధ్ధం చెయ్యడానికి ఉండే అనువు వల్ల ఆమె కవితలు పాటలుగా, ప్రార్థనలుగా మలచబడి ఇంగ్లండు, అమెరికా, జర్మనీలలో ప్రజాదరణకు నోచుకున్నాయి. 20 వశతాబ్దపు పూర్వభాగంలో క్రమంగా ఆమె కవిత్వంపై ఆదరణ తగ్గినా, ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆమె విమర్శకుల దృష్టినీ, ప్రశంశలనూ అందుకుంటోంది. అసూయ చాలా చిత్రమైన చిత్తప్రవృత్తి. ఒకరి పట్ల మనకి అసూయ కలిగితే, మనం చచ్చినా వాళ్ళలో ఉన్న అంతర్గతమైన ప్రతిభని గుర్తించం సరికదా, ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగానూ, వాళ్ళకి అనుకూలంగానూ కుట్రపన్నుతున్నట్టు కనిపిస్తుంది. ఈ కవితలో చివరి వాక్యాలు గమనించదగ్గవి... ‘చివరికి మృత్యువుకూడా అతన్నే ముందు వరించింది’... ఇది అసూయకి పరాకాష్ఠ. అయితే అంతర్లీనంగా మరొక విషయం గమనించవచ్చు. మనం ఎవరిని ఎక్కువగా మనసులో ప్రశంసిస్తామో వాళ్లంటేనే అసూయ ఎక్కువగా ఉంటుంది... ముఖ్యంగా సమవయస్కులలో. . అసూయ ... . అతన్నన్నిటిలోనూ ముందే. అదృష్టం ఎప్పుడూ అతన్నే వరించేది. నేను సంవత్సరాలతరబడి కష్టపడ్డాను; అతను అవలీలగా ఆ స్థానం సాధించగలిగేడు. మేం పరుగు పందెం వేసుకునే వాళ్ళం; నాకాళ్ళు రక్తాలోడుతుంటే, అతను పందెం గెలిచేవాడు. . అతను ఎన్ని విజయాలు సాధించినా ప్రజలు అతన్ని ఒక్కలాగే అభిమానించేరు; నా పేలవమైన ఒకే ఒక్క విజయానికి నాకెదురైనవి పరిహాసమూ, నిందా. మేం ఇద్దరం తప్పుచేస్తే, అతని మీద జాలిపడేవారు, నాకు మాత్రం దక్కింది అవమానమే. . నేను ఇంకా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాను, అతను మాత్రం కీర్తిప్రతిష్టలతో దేదీప్యంగా వెలుగుతున్నాడు. నా కోరికలేవీ ఫలించలేదు; అతను అడగడమే తడవు, అన్నీ జరిగిపోతున్నాయి. ఒకసారి నేను నా సర్వస్వాన్ని పణం పెట్టి ఆడేను... విజయం అతన్నే వరించింది. . నిజం; ఇప్పుడే అతన్ని చూసివస్తున్నాను, చక్కగా, చల్లగా నవ్వుమొగంతో, శవపేటికలో పరున్నాడు. దేముడే నన్ను కాపాడాలి! అతను ప్రశాంతంగా అలా విశ్రాంతి తీసుకుంటుంటే, నే నిలా బ్రతకమని శపించబడ్డాను. చివరికి మృత్యువుకూడా అతన్నేముందు వరించింది. . ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్. (30 October 1825 – 2 February 1864) . Envy . He was the first always; Fortune shone bright in his face. I fought for years; with no effort he conquered the place: We ran; my feet were all bleeding, but he won the race. . Spite of his many successes men loved him the same; My one pale ray of good fortune met scoffing and blame. When we erred, they gave him pity, but me--- only shame. . My home was still in the shadow, his lay in the sun: I longed in vain: what he asked for it straightway was done. Once I staked all my heart's treasure, we played--- and he won. . Yes; and just now I have seen him, cold, smiling, and blest, Laid in coffin. God help me! while he is at rest, I am cursed still to live:--- even Death loved him the best. . Adelaide Anne Procter (30 October 1825 – 2 February 1864)

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r3XN6E

Posted by Katta