కవిత్వంతో ఏడడుగులు 20 . కవిత్వాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావాలన్న ఆలోచన లండనులో స్థిరపడిన అమెరికను కవయిత్రి Judith Chernaik ది. 1986లో ప్రారంభమైన ఈ ప్రోజెక్టులో మరో ముగ్గురు కవులు జతకూడి, (ఆ ముగ్గురు కవుల్లో షెనా ప్యూ ఒకరు ) లండను భూగర్భరైలుమార్గం రైళ్లలో కొన్ని అత్యుత్తమమైన కవితలను / కవితల పాదాలను అడ్వర్టైజ్ మెంటు బోర్డులమీద రాసేవాళ్ళు (ఆ ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతోంది). ఆ రాసే జాగాకి అయే ఖర్చుని కొన్ని కంపెనీలు / వ్యక్తులు భరిస్తున్నాయి. ఈ ప్రయోగంలో వచ్చిన అపురూపమైన ప్రాచీన, ఆధునిక కవుల కవితలలో ఈ కవిత ఒకటి. (మనందరం, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అటువంటి ఒక ప్రయోగం జరిగినందుకూ, అతి ఫలవంతంగా నడుస్తూ, జనసామాన్యానికి కవిత్వం అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషించాలి.) ఆ తర్వాత, ఈ కవితల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని సంకలనాలుగా తీసుకు వస్తున్నారు. మనం వాళ్ళదగ్గరనుండి ఏదైనా నేర్చుకోదలుచుకుంటే, మన RTC బస్సులలో ప్రఖ్యాతి వహించిన కవుల కవితలు, సందేశాలు పెట్టి, యువతరం దృష్టిని వెండితెర నకిలీ (Pseudo Heroes ) నాయకులను ఆరాధించి, అనుకరించే మనస్తత్వంనుండి మళ్ళించే ప్రయత్నం చెయ్యొచ్చు. ఈ ఏడు సార్వత్రిక ఎన్నికలు రానున్న దృష్ట్యా, ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగో, లేక ఎన్నుకోబడిన పార్టీకి , ఇంతకుముందు లేకున్నా, ఈసారైనా ప్రజాస్వామ్య మూల సిద్ధాంతంపై అవగాహన కుదిరి, ప్రజలకు సేవచెయ్యాలి తప్ప శాసించకూడదని గ్రహించి 5 ఏళ్ళు సజావుగా పరిపాలిస్తే ఎంత బాగుంటుంది! ఇది కలే. కానీ 'ఒక్కోసారి ' కలలు నిజమౌతాయి. . ఒక్కోసారి... . ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది; పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి; మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని, ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి; కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు. ఒక్కొసారి మనం మనఃస్ఫూర్తిగా కోరుకున్నది వృధాపోదు;ఒక్కొసారి మనం ఏది ఎలా చేద్దామనుకుంటామో అది అలా చేయగలుగుతాం; సూర్యుడు ఒక్కోసారి ఘనీభవించిన దుఃఖభూమిని సైతం కరిగించగలుగుతాడు; నీకు అలా జరగాలని కోరుకుంటున్నాను. . షెనా ప్యూ ఇంగ్లీషు కవయిత్రి . Sometimes... . Sometimes Sometimes things don't go, after all, from bad to worse. Some years, muscadel faces down frost; green thrives; the crops don't fail. Sometimes a man aims high, and all goes well. A people sometimes will step back from war, elect an honest man, decide they care enough, that they can't leave some stranger poor. Some men become what they were born for. Sometimes our best intentions do not go amiss; sometimes we do as we meant to. The sun will sometimes melt a field of sorrow that seemed hard frozen; may it happen for you. . Sheenagh Pugh English Poetess [One of the finest and simplest poems admired by London Underground Metro Commuters. You can see the comments on this poem at the link: http://ift.tt/1abSxpN . Sometimes, more than what a poet writes, it is the reader's identification with it makes it a great poem. Poems of the Underground was a project initiated in 1986 to make poetry to reach out to people by posting them on the advertisement boards of London Underground Metro. ]
by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dhcyX4
Posted by
Katta