పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

కవి :::::: దేశానికి ఒక జాతీయ పతాకం జాతీయ గీతం చాలు కానీ ప్రతి పౌరుడూ జాతీయ కవి కావాలి మానవ జాతీయ కవికావాలి. అవును-కవి కల గనేది ఒక నిస్స్వార్థ ప్రపంచాన్ని ప్రపంచం కలగనేదీ ఒక నిస్స్వార్థ ,,నిఖార్సైన కవిని. 21-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2XU

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. రెండవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. పడగవిప్పి లేచినట్టి నల్లతాచు జడపొగరుకు సంపెంగల వంటిముక్కు కారణమూ లాగున్నది ఆకశాన హరివల్లుకు వంపునెవరు నేర్పారో చూసిందా చక్కని నీ పెదవి విరుపు లాగున్నది మంచుపొరలొ గులాబీపై ప్రతిఫలించే లేత ఎండ చెంపలపై నర్తించే మెరుపుపూవు లాగున్నది శంఖంలో సంగీతం పలుకుతుంది ఎందుకనో పోలికలో అది కూడా నీ కంఠము లాగున్నది అందంగా వంగుతోంది సెలయేరూ నర్తకిలా నడుం వంపు నేర్పిందా ఈ నాట్యము లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2Hu

Posted by Katta

Srinivas Vasudev కవిత

నేను ఈ శీర్షికలో అనువాదాల గురించి రాయను. ఆంగ్ల కవిత్వం గురించే రాస్తాను. మన కవిమిత్రుల్లో కొంతమంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ ఈ వింగ్డ్ వర్డ్ శీర్షికద్వారా చెప్పదల్చుకున్నది మన సాహిత్యంతో పాటు పరదేశీ సాహిత్యంలోని సుమసౌరభాల గురించే సుమా.... కానీ ఈ కవిత గురించి ఇంతకుముందే మన పాఠకులకి చెప్పాను. నాకు నచ్చిన మలయ్ కవిత ఇది. కొన్ని వాక్యాల్లోనే ఒంటరితనం గురించి ఇంత అందంగా చెప్పగలగటం నాకు తెగ నచ్చేసింది. అందుకే చాలా జాగ్రత్తగా అందర్నీ అడిగి మరీ దీన్ని అనువదించాను. తనను తాను ఓ ద్వీపకల్పుడు అని చెప్పుకోవడం ఎంత గొప్ప భావన! అలా చెప్పుకుంటూ ఒంటరితనం బాధ గురించీ గొప్ప కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు ఇతను...ఇదిగొ ఇలా! చదవండీ ఈ రెండూనూ! An islander ------------- Walking along the seaside Found a loner A lone island, all alone by itself! Shockingly reminding My loneliness The beach and the island are close But far As far as me and my heart Only straits draw them apart This island and me Make one tale A sad tale of loneliness (free translation from a poem in Malay language; the original is given below) Menyelusuri sepanjang pantai Pulau pun kelihatan Terampai dan melambai Mengimbau Pantai dan pulau Berdangansanak Sejangkau Cuma selat yang memisah Menjadi sebuah kisah (Anonymous)

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2r1

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

కవిత్వంతో నా అనుభవం : ---------------------------- కవిత్వం వొక గొప్ప చలనభూతమైనది. మనిషిని అది అత్యంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. నిర్మిస్తుంది. ప్రంపంచ దేశాలలో అన్ని కాలాలలో కవిత్వం మనిషిని తలవంచని వీరుణిగానే నిలబెట్టింది. వొకొక్కప్పుడు కవిత్వం కొందరికి చెందిన సరుకుగా చెలామణి అయినా చివరకు అది చేరాల్సిన వాళ్ల చేతుల్లోకే చేరింది. చేయాల్సిన పనినే చేస్తుంది. కవిత్వం వొక ఆయుధమైంది. గాయాన్ని మాన్పే ఔషధమైంది. తల నిమిరే జాలి చేయి అయ్యింది. కవిత్వమంటే ప్రపంచ మానవ సమూహాలపై తెరుచుకున్న చైతన్యపు కన్ను. అలాంటి కవిత్వంతో ఈ ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా నా అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. నేను చదివిన తొలి కవిత్వ సంపుటి - 'మహాప్రస్థానం'. మా ఊర్లో మా ఇంటి దగ్గర బీరువా నిండా పుస్తకాలు. మార్క్సిస్ట్ మహా గ్రంధాలు. 'కార్ల్ మార్క్స్ -ఎంగెల్స్' పేర్లు అక్కడ తెలిసాయి. రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలాక - తొంబై ఒకటిలో విజయనగరం కోట దగ్గర చవగ్గా అమ్మితే నాన్న కొన్నవవి. రెండు మూడు కాగితాలు తిప్పి పెట్టేసేవాడిని. కానీ వాళ్ల గొప్పతనాన్ని నాన్న చెప్పేవారు. స్కూల్ డేస్ లో అల్లూరిని, గాంధీజీ జీవిత చరిత్రను చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లూరి పోరాటం నచ్చేది. దానిని పక్కవాడికి Explain చేసేవాడిని. వాణ్ణీ ఉద్యుక్తున్ని చేయడమే నా ఉద్దేశం. తర్వాత మార్క్స్, మావో, చేగువేరా, ఫైడల్ కాస్ట్రో, లెనిన్, స్టాలిన్ ల రచనలు చదివాను. చదువుతున్నాను. ఈ మహానుభావుల రచనలను నేనైతే మనల్ని ఊపేసే కవిత్వంగానే భావిస్తాను. వొక గొప్ప ఆలోచనను కలిగించి మనపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయవి. నాకు అత్యంత ప్రేరణ, బలం యిచ్చిన కవిత్వం కె. శివారెడ్డి గారిది. 'గగనమంతా తలతో.. ' - చదివాక నా ఆలోచనల్లో మార్పుని గుర్తించాను. చర్య, అతను చరిత్ర - కవిత్వం చదివాక పోయిట్రీ సొబగు తెలిసింది. ఆ తర్వాత.. శివసాగర్ కవిత్వం నన్ను సమ్మోహితున్ని చేసింది. అరణ్యం మీద, పోరాటాల మీద వొక రకమైన curiasity ని పెంచింది. నగ్నముని 'కొయ్యగుర్రం' చదివాక - ఆ కవిత్వ వస్తువుకు, వ్యక్తీకరణకు, కవి దృక్పథానికి గాల్లో తేలిపోయాను. హెచ్చార్కె 'వానలో కొబ్బరి చెట్టు' కవిత్వ నిర్మాణం, అందులో ఆర్థ్రత నన్ను విపరీతంగా కదిలించాయి. అఫ్సర్ 'ఊరి చివర' చదవడం - వొక అనుభవంగా మిగిలిపోయింది. యాకూబ్ 'ప్రవహించే జ్ఞాపకం'లో సున్నితత్త్వం నా కవిత్వానికీ కావాలనుకుంటాను. అలెక్స్ హెలీ 'Roots' - నవల చదివాక గుండె బిగబట్టీసింది. ఆ రోజు రాత్రంతా దుఃఖపీడనంతో ఏడ్చుకున్నాను. నా ఆలోచనను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకమది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇతర మార్క్సిస్ట్ పుస్తకాలు - ఆ కోవలో వచ్చిన అనేక వ్యాసాలలో కవిత్వాన్ని నిర్మించే గొప్ప వ్యూహముంటుంది. అవి కచ్చితంగా చదవాల్సినవి. ఇటీవల నేను చదివిన వొక అద్భుతమైన పుస్తకం- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్ గారి - 'నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ? అయితే సంతోషం !' - .కొత్త ఆలోచనను, దృక్పథాన్ని యిచ్చింది. నెరూడా, అంద్రాదె, లాంగుస్టన్ హ్యూగ్యూస్ లాంటి వివిధ దేశాల కవులను చదవడం వలన మన ఆలోచనల్లో , కవిత్వ వస్తువుని తీసుకోవడంలో, కవిత్వ నిర్మాణ వ్యూహాలలో విస్తృతి పెరుగుతుంది. * నా పాఠశాల నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. పిల్లల్లో నుంచి Poets ని, artists ని బయటకు తీసే పనిలో వున్నాను. నాకు దొరికిన అద్భుతమైన కవిత్వపాదాలు వాళ్లు. వాళ్లతోనే నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను - వాళ్లలోనే నన్ను నేను శోధించుకుంటాను - నన్ను నేను సానబెట్టుకుంటాను. Expression is more important to poetry - నా పిల్లల మధ్య పాఠ్యాంశ విషయాలను - ప్రాపంచిక అంశాలతో, వర్తమాన సామజిక స్థితిగతులతో మిళితం చేసి , నా దేశాన్ని గురించి సైద్ధాంతిక శాస్త్రీయ అవగాహన పొందేటట్టు.. చెబుతూ - లీనం కావడం నాకు అమితమైన యిష్టం. అది నా టీచింగ్ శైలి. రానున్న కవిత్వ యాత్రలో నా కవిత్వ వ్యక్తీకరణకు పిల్లల మధ్య వుండడం అనేది - ప్రధాన కారణంగా వుంటుందని నమ్ముతున్నాను. అన్ని దేశాల ప్రజాసమూహాలను కలిపి వుంచే గొప్ప వంతెనగా వున్న కవిత్వమా... జయహో ! మామూలు మనుషులను మహా శక్తివంతులుగా తీర్చిదిద్దే కవిత్వమా జయహో ! కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రగా మిగిలిపోతుంది. -------------------------- 21 మార్చి 2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X7Lz

Posted by Katta

Chandu Ch Smile కవిత

ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.... మిత్రులందరికీ :) కాస్తంత ఆలస్యంగాచెపుతున్నాను అని ఏమనుకోకండే..... :) మనిషి కవిగా మారాలన్నా.... ఒక కవిత రాయాలన్నా..... తనకు రాయాలనుకున్న దానిమీద ఒక అవగాహన... ఖచ్చితంగా అవససరం..... కంటికి కానరాని ప్రపంచాన్ని.... కళ్ళ ముందు ఆవిష్కరించేది కవిత.... తన కనులముందు కదలాడే దృశ్యాన్ని... కళ్ళకు కట్టినట్టు...వర్ణించిచెప్పేదే కవిత..... యదార్థతను నెరిగి సమాజంలో్ జరిగే ప్రతీ ఘటనని ఆ సంఘటనని... అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేదే కవిత.... మనసులో ఎక్కడో మరుగున పడి ఉన్న.... భావనలకు అక్షర రూపం పోసి... అందరితో పంచుకోగలిగేదే కవిత...... అక్షరాలని అస్త్రాలుగా మరల్చి..... నిద్దురపోతున్న సమాజాన్ని.... మరుగున పడుతున్న మానవత్వాన్ని జాగృతం చేసేదే కవిత...... అందకారంలో ఉన్న మానవ సమాజాన్ని... ఉవ్వేత్తున ఎగసిపడే అలలా ప్రభావితం చేసేదే కవిత..... ఇలా కవితలు...వాటిని వ్రాసే కవులు.... మన నిజ జీవితంలో భాగమైపోయారు... కవితలు... మన మానవ సమాజానికి... చాలా ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.... కవితను వర్ణిచటం అనేది మాత్రం.... ఒక్క కవి పైన మాత్రమే ఆదారపడి ఉంటుంది.... ఎవరి వర్ణనా శైలి....వారిది.... ఎవరి అనుభవం...వారిది.... అక్షరాలను వాటి యొక్క అర్థాన్ని... వాటిని బట్టి ప్రయోగించే పదాలు కూడా అనేకం... ఈ రకంగా...కవులు...తమ తమ... ప్రతిభను, అనుభవాన్ని, అక్షరాలలో ప్రదర్శించి వారి భావాలను తెలియజేస్తారు..... ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు... అలాగే.. ఎందరో కవి హృదయులు...పేరు పేరునా అందరికీ వందనాలు... కవిత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చిరు అక్షర సమూహంగా మలిచి.... మీ అందరి ముందు ప్రదర్శిస్తున్నాను.... తప్పులు ఉంటే మన్నించగలరు.... ఇట్లు మీ చిరునవ్వు....! :)

by Chandu Ch Smile



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWFt9o

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

నిండు చంద్రునికి ఒక నూలుపోగు కొత్తపల్లి ఉదయబాబు : 21-3-2014 అమ్మా..! .నాన్న ఏడని అడిగిన ప్రతీ బిడ్డ ప్రశ్నకు... సమధానం గా ఆమె చూపుడు వేలు చివర నిలబడ్డ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం...నాన్న... విత్తిన ప్రతివిత్తు...చిగురుపిట్టై మొలకెత్తాలని మొక్కై ఒడుదుడుకులనెదుర్కొని ఎదిగి వటవృక్షమై నిలవాలని సేద్యం చేసే నాన్న ఆశ...! అమ్మ క్రమశిక్షణా శిబిరంలో నాన్న ఒక దండనాయుధం... నిత్య సంసార సమరంలో అమ్మచాటు అందరికి నాన్న ఒక ఛత్రం..... గడియారపు ముల్లును ఓడించే నాన్న వౄత్తిధర్మం ముందు అధర్మం ఎప్పుడూ అవిటిదే.... పాతికేళ్ళ జీవితాన్ని సమాజంలో సగౌరవపు స్థానంలో నిలబెట్టిన పెంపకానికి మూల ధనం నాన్న... వెన్ను ఇంద్రధనుస్సై జీవితాన్ని మూడోకాలు నడిపిస్తున్నప్పుడు... ఎడమ భుజమై బిడ్డకు తోడై నిలబడే నాన్నను చూసి ప్రతీ కుటుంబపు పతాకం " జై "కొట్టాల్సిందే... ప్రతీ బిడ్డ ఆరూపానికి సాష్టాంగపడాల్సిందే...!!! ********************* ::: ********************

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X8ix

Posted by Katta

Ravi Rangarao కవిత



by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X56t

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ శ్రామిక చినుకులు @ నున్నటి చిగురుటాకులపై సన్నగా కురిసి నునువెచ్చని సూర్యరశ్మికి జాలువారుతున్న మ౦చు తు౦పర్ల నీటి చుక్కలు కావవి దినదిన౦ బతుకుతో ఆకలి పొరాట౦ చేస్తూ ... ఎర్రటె౦డకు చెమట చుక్కల్ని తూర్పార బడుతూ కూలిబిడ్డలు రక్త౦ కరిగి౦చి రాల్చిన స్వేదబి౦దువులవి. ఆ శ్రమజీవులు ఆర్తితో అవనిపై రాల్చిన శ్రామిక చినుకులవి. వారి బతుకు వారికి బారమై రె౦డు చెతుల్లొ దరనిని మోసే శక్తివ౦తుల చెమట తడులవి. ఆ జీవన౦ మోడువారి వర్ణ రహితమైనా వసుదపై పచ్చని ప౦టపొలాల సిరులు ని౦పి స్వర్ణమయ౦ చెసిన రైతుకూలిల ఎర్రని రక్త బి౦దువులవి. ఆ జీవితాల కలలు గు౦డెలొని పాతాళ౦లొ దిగ్బ౦ద౦ చేసుకుని కుమిలిపొతూ...కుమిలిపొతు నెలకొరిగి పొతున్నా.. గగనాన్ని తాకె భవనాలు కట్టి, నేలకు వన్నె తెచ్చి ని౦గినేలను ఒకటి చెసిన నిర్మాణ కూలీల చెమట చినుకులవి. తమ కడుపున పుట్టిన బిడ్డలకు తి౦డీ లేకున్నా.. భూమి కడుపులో౦చి బ౦గార౦ తీసి నేలతల్లి బిడ్డల బతుకుల్లో వెలుగు ని౦పిన కార్మిక జీవి విదిలి౦చిన తు౦పర్లవి. _ కొత్త అనిల్ కుమార్ 21 / 3/ 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEXSsM

Posted by Katta

Venktesh Valandas కవిత

రచన :వలన్దాస్ వెంకటేష్ 9505555197 మృత్యుంజయులు ---------------- నేను నాకోసం నీవు నీకోసం కొందరు అందరి కోసం.......! అజరామరం ఓక సుందర స్వప్నం ! మృత్యుంజయము కొందరి సొంతం త్యాగం ఓ సాహస క్రీడా ....! అర్పణం శికరాగ్ర కీర్తి కిరీటం ఆత్మవిశ్వాసం అమ్ములపొది సైద్ధాంతిక ఊపిరి మహాప్రస్థానం కదన సీమలో విజయ దుంధుబి వినువీధుల్లో వేగుచుక్కలు ఉరికొయ్యల ముద్దాడిన ఉక్కుసంకల్పం ....! జ్వలిస్తూనే గాండ్రించే గాండీవ సాదృశ్యం నిప్పుల వర్షపు ఉప్పెనలోనా రేపరేపలాడిన పిడికిలి జండా నెత్తురు ,సత్తువ ,ప్రాణం ,దేహం లక్ష్యం ముందు పూచికపుల్లలు శతాబ్దాల క్రితం చిరిగిన తెల్లకాగితం.... అయిన అనంత వసంతాలు దాటిన వన్నెతరగని సుందర స్వప్నం అవని మేను ఫై చెరగని పుట్టుమచ్చల ఆనవాళ్ళు చరిత్ర పుటలను తిరగేస్తుంటే అమరత్వం సజీవద్రుశ్యాలను సాక్షాత్కరిస్తునే ఉంది

by Venktesh Valandas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNcWAb

Posted by Katta

Sravanthi Itharaju కవిత

kavitaabhimaanulandariki..kavitaadinostava shubhaakaankshalu!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK7yjZ

Posted by Katta

Kotha Kamalakaram కవిత



by Kotha Kamalakaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etALyb

Posted by Katta

Pranayraj Vangari కవిత

‘‘కవిసంగమం’’ లోని కవుల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాయాలని ‘‘తెలుగు వికీపీడియా’’ ప్రయత్నంచేస్తుంది. కవి మిత్రులందరూ క్రింది లంకెలోని ఫారంలో తమ తమ వివరాలు అందించగలరు (ఒక పుస్తకం అయిన ప్రచురితమై ఉండాలి).... http://ift.tt/1etALhQ ఫోటోలను pranayrajvangari@gmail.com కి పంపించగలరు....

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fLVz0g

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\విబంధం\\ -డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చందమామ ఇంటి మీంచే సాగిపోతుంటది మెర్క్యురీ బల్పునే జాబిలిగా విశదమవుతం ఆహ్లాదమై అంతరంగాన్ని తాకే వెన్నెలకు నో స్పేస్ సూర్యడు ఎప్పటిలాగే సంచరిస్తుంటడు పగలు కూడా నియోన్ లైట్‌నే సూర్యుడని మైమరుస్తం ఛాయ వెనుక నిలబడ్డ నిజానికి నో స్పేస్ పగళ్లు కదిలిపోతుంటవి రాత్రుళ్లు కరిగిపోతుంటవి ఇరు సంధ్యల రంగుల వాకిళులకు నోస్పేస్ వాన వచ్చి తడితడిగా పలకరిస్తుంటది చినుకు సోకకుంట కవచాలెన్నో కప్పుకుంటం అద్భుత పులకరింతకు నో స్పేస్ చెల్లె వచ్చి ముందు కూర్చుంటది చెలి ఎంతకూ వదలదు సెల్‌లో రాఖీలా వచ్చిన చెల్లెకు నో స్పేస్ కలబోసుకుందామని ఎప్పటి స్నేహితుడో కాల్ చేస్తుంటడు అంతర్జాల ఇంద్రజాల కిక్కుల చిక్కుకుంటం పక్కనే కలవరించే దోస్త్‌కు నో స్పేస్ ఎండ ఎదురొచ్చి చేతులు సాపుతుంటది కిరణాలు తాకకుంట చలువ తంత్రిణులు నులివెచ్చని స్పర్శకు నో స్పేస్ మాఘమాసం కౌగిలికై అల్లుకుంటది అలకో అహమో బ్లాంకెట్‌కటూ ఇటా బ్రాంకట్లు ఆది అనంత ఆత్మల ఐక్యతకు నో స్పేస్ అమ్మ నుంచి అనవరతంగా ఆ్తమ రింగవుతుంటది భార్య అనారబిటస్ మాల్ చెవిలో చేరదు ఆదుర్దాయై ప్రసరించే అమ్మ వాసనకు నో స్పేస్ బంధం ఒంటరి శిలాజమై పోయింది పురాశిల్పం కన్ను తెరిచి చూస్తున్నది -

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX

Posted by Katta

Pusyami Sagar కవిత

ఘటనలు ______________పుష్యమి సాగర్ గుండె ను తాకిన భావస్పోరకాన్ని చేతులోకి తీసుకొని ముద్దాడినపుడు, కళ్ళు చెమర్చాయి, రెక్కలు తొడిగిన కొత్త ఆలోచన ఏదో గిరికీలు కొడుతూ అక్షరం చుట్టూ ప్రదక్షణ చేస్తుంది ..!!! మట్టి లో మొలకెత్తిన జ్ఞాపకం నిలువెత్తు చెట్టు గా మారినపుడు పునాదుల కింద దాక్కొన్న చరిత్ర , తనని తానూ తవ్వుకుంటూ తొవ్వ చూపిస్తుంది చీకటి కమ్మిన వెలుగు కు,!!!!! అప్పడు అప్పుడు నేను ఉన్నానంటూ తొంగి చూసే వేకువ ఉదయాలు నగర అరణ్యం లో గతి తప్పి తిరుగుతూ కాగితం పై ఒలికి పోతుంటాయి కద గానో, కవిత గానో అచ్చు పోసుకుంటూ ...!!! కలలు న్ని కుప్పలు గా నడి రోడ్డుకు అటుక్కుపోతాయి లెక్కపెట్టలేనన్ని మడతలు గా ... ప్రతి రాత్రి ప్రశ్నిస్తుంది ఉదయం ప్రశాంతం గా పోడుస్తానా అని !!!! ఇప్పుడు నాచే కొలవబడ్డ కొన్ని ప్రమాణాలు లెక్క సరి చూసుకున్నాయి ప్రతి ఘటనను మనోపలకం పై ముద్రించడానికి ...!!!!! మార్చ్ 21, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuvAz

Posted by Katta

Krishna Mani కవిత

మమతలకు నెలవాలం ఊహలకు కొలమానం వేదనలకు ఉపమానం ఉద్వేగాలకు జననాదం ఇవే కదా కవికి కావలిసిన అక్షరయాగ హవిస్సులు ప్రతి కవి ఒక అగ్నిగుండమై చేయు యజ్ఞంలో ఉద్భావించు ఎన్నో కవితాపుష్పాలు సేద తీర్చే చల్లని పరిమళ జల్లులు ! మిత్రులకు అంతార్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు కృష్ణ మణి I 21-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuxbt

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కవిత్వం నా నేస్తం ఖాళీ గదిలాంటి నా గుండెలో ఆత్మీయ అతిథి, గదిలో, మదిలో తడి తడి వొడువని యాదిలో మైదానంలో, నది ఒడ్డున, కీకారణ్యంలో గోగుపూల దండులో గోర్వెచ్చని సహచర స్మృతులలో ఎక్కుపెట్టిన గురిలో, ఎగిరే పొద్దు జెండాలో నన్ను మనిషిగా నిలిపిన మానవీయత కవిత్వం దుఃఖితుల బాధల్లో నన్ను సహానుభూతం చేసి నిరాశ్రయుల ఆవేశంలో నన్ను సహచరుణ్ణి చేసి గాయపడిన పావురాల గొంతుకను చేసి రాయబడని గాథల గేయంగా పాడించి నన్ను నడిపిస్తున్న నా సహవాసి నా కవిత్వం వాగ్దానాల పలకజెముడు దొంగముల్లు కుట్రల్నిఛేదించి అన్నీ మింగే కూకేటిపాముల బొయ్యారం కడుపుల్నిచీల్చి బతుకు నాగేటిసాల్లల్ల నాటిన పైసలంగడిని పాతర్లేసి బతికి బతికించే గడ్డిపరకల గెలుపు రహస్యాల్ని బోధించింది నాకు కవిత్వ తత్వవేత్తే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuv3t

Posted by Katta

Vijaykumar Amancha కవిత

కవితా ప్రియులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాక్షలు జై కవిత్వం జయహొ కవిత్యం

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r4eEnt

Posted by Katta

Panasakarla Prakash కవిత

వీడని నేస్త౦ నిద్దురలో౦చి లేచానో...కలలో౦చి లేచానోగాని కళ్ళు నలుపుకు౦టూనే ఉన్నాను చేతిలోని గీతల్ని ఒక్కసారి చూసుకుని దేవుడికి నమ్మక౦గా నమస్కరి౦చాను రాత్రి చెరిగిన పక్కని సరి చేసుకోడానికి వెలుతురు సాయ౦ తీసుకు౦టున్నాను చీకటిని వర్ణి౦చగలను కానీ వెలుతురును నిలువరి౦చలేను కదా అ౦దుకే నేనూ పరిగెడుతున్నాను ఆకాశమ౦తా ఒకే వర్ణ౦................. అ౦దుకే నేల ర౦గు సువర్ణ౦.......... నిన్నటి గాయాల్ని మాన్పిన చీకటిని గదిలో ఒ౦టరిగా బ౦ధి౦చి ఎలాగోలా బైట పడ్డానా..................... ఐనా వెలుతురులో నీడై వె౦బడిస్తూనే ఉ౦ది............ పనసకర్ల‌ 21.03.2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuuws

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | కవుల చేవ -------------------------- అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।। "అల్పమైన ఆలోచనలు కలవాళ్లకి వీడు చుట్టం వీడు చుట్టం కాదు అన్న పట్టింపులు ఉంటాయి. అదే గొప్ప నడువడి కలవారికి ప్రపంచమంతా తన కుటుంబమే," అని ప్రపంచకవులను ఉద్దేశ్యించి ఒక వ్యాసకర్త అభిప్రాయం. కవి ప్రపంచబంధువు అలాగే All that is best in the great poets of all countries is not what is national in them, but what is universal" - Henry Wadsworth Longfellow స్వాప్నిక జగత్తు కాదది, గడచిన ఘనచరిత్ర కానే కాదు. సంపూర్తి కానున్న చిత్రమది. సృష్ట్యాది నుండి సాగిన గానమది. రానున్న మహత్తర భావి అది, మానవీయ మధుర కావ్యమది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే. వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే. భాష, వేషం, రంగు, రూపు భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే. యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి పెకలించిన జాతి అది. శాంతి, సమత, మమత, ఆత్మీయత విలసిల్లిన రీతి అది. తరులు, గిరులు, నదులు, మైదానాలు సాంత్వన చెందిన ప్రకృతి అది. కదలాలి కలాలు, పాదాలు కలిసికట్టుగా మానవత్వమే సాధనగా, కవిత్వ పథాన రావాలి నవతరం కొత్త పుంతలు తొక్కుతూ సాహిత్య ప్రపంచం కావాలి వసుధైవకుటుంబకం 21/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r4eDQo

Posted by Katta

భావరాజు శ్రీనివాసు కవిత

నేనెవరు? - అని ప్రశ్నించుకొని గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారుంటుందని నేను నమ్ముతాను. బ్రహ్మ కుమార్తె సంధ్య , అరుంధతిగా మారడానికీ ఈ ప్రశ్నే కారణం . అహల్య విషయమూ అంతే . గౌతమ సిద్ధార్థుణ్ని ,బుద్ధుడుగా మార్చిందీ, విశ్వామిత్రుణ్ని,బ్రహ్మర్షి గా మార్చిందీ ఈ ప్రశ్నే . నేనెవరు? - ఈ ప్రశ్నకు నేను అన్వేషించిన సమాధానాన్ని ‘భావరాజు భావాలు’గా ఈ క్రింది link ద్వారా మీతో పంచుకోవాలని .....

by భావరాజు శ్రీనివాసు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMutZu

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || మర్మం || నువ్వు ఇప్పటికీ ఎలా బ్రతికున్నావ్..? గుండ్రంగా చుట్టబడిన నేను ఏదో ఒక బలమైన గాయానికి తాళ్ళు అన్నీ తెంపుకుంటూ పరచబడతాను నాలో నేను వ్యాపిస్తూ కుళ్ళిపోయిన అనుబంధాలను తాకి వాటి కళేబరాలలో ప్రాణ వాయువు ఊదుతాను అప్పుడప్పుడు కన్నీళ్ళతో కడగబడి నా కడుపున నేను పుడుతూ చచ్చిన అబద్దాన్ని గతానికి వ్రేలాడదీస్తాను వీలైనంత సేపు నగ్నంగా ఊపిరి పీలుస్తూ పసితనపు పాల పెదాలతో ప్రేమగా ముద్దాడటానికి ఇష్టపడతాను నా లోపల నీతో సహా అందరూ ఉన్న చోట ఎవ్వరినీ అంటని ఒంటరి దీపాన్నై నన్ను నేను మండించుకుంటూ వెలుగుతాను మర్మం అర్ధమైంది కదూ వేల సంవత్సరాల సమాధిలో నేను ఎలా బ్రతకగలుగుతున్నానో మీ చాంద్ || 21.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r3Wr9A

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

కలం పెడితే అక్షరం...అక్షరం కలిస్తె..పదం..పదం కలిస్తె పాదం..పాదం కలిస్తె వచనం...వాక్యం..వచనం పలికితే కవనం...కవనం కదిలితే పాట ..పాట పయనిస్తే ప్రశ్న...ప్రశ్న తేవాలి జవాబు...జవాబు నచ్చితె ఉదయం ...ఉద్యానవనం నచ్చని జవాబు ..కేక... కేకలు కలసి నినాదం...నినాదం కదిలించు పాదాలు...పాదాలు కలిసి ఉద్యమం...ఉద్యమం అంటే విప్లవం...విప్లవం అంటే ఇంద్ర ధనుస్సు...ఇంద్ర ధనుస్సు అంటే ఎరుపొక్కటే కాదు...మార్పు..మార్పు తేవాలి లోక హితం. ప్రపంచ కవితా దినోత్సవం ...శుభాకాంక్షలు.

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMdw1c

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కవిత్వం ॥ కనుపాపల అంచుల్లో పుట్టి సుదూర నిశీథపు నివాసంలోని నక్షత్రపు చిటారు కొమ్మన చేరే ఓ నల్లని వెలుగు పిట్ట ...... కవిత్వం పూరేకుల నవ్వుల్ని చుట్టి ఆ రంగు రంగుల రాజసంలోంచి సౌందర్యపు మకరందాన్నివెలికితీసే ఓ మెత్తని తుమ్మెద రెక్క .... కవిత్వం నీలి చెంపల కడలిని తట్టి ఆ పాల నురుగుల అలలతో తన మేనిఛాయని సరిపోల్చుకునే ఓ చల్లని వెన్నెల చుక్క ..... కవిత్వం నిశి రాత్రిని పక్కకు నెట్టి అనవరతమైన ఆకాశపు గోడ పై అందాల దినకరుడ్ని అలంకరించే ఓ ఎర్రని తూరుపు ప్రక్క .... కవిత్వం తన నల్లని కురుల్ని విదిల్చి రాల్చిన నీటి చుక్కల పువ్వులతో ఆల్చిప్పల ఒడిలో ముత్యాలు పేర్చే ఓ చక్కని మేఘ మాలిక ..... కవిత్వం జగతిలోని ప్రతి చిత్రాన్నీ ఒడిసిపట్టి పలుకు పలుకునా ప్రతి ధ్వనిస్తూ ప్రపంచమంతా విజ్ఞానాన్ని విత్తే ఓ ప్రచండ ప్రజ్ఞా హేళిక .... కవిత్వం 21. 03. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMdvu9

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1hLXLXX

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX

Posted by Katta

Rvss Srinivas కవిత

"క"ల్పనాప్రపంచపు "వి"రించి ..."కవి" "క"న్నులు చూడలేని "వి"చిత్రాలను "కవి"తల్లో తనకళ్ళతో చూపే అద్భుతమే..."కవి"... ..@శ్రీ21MAR14. (ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా )

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODqJB8

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు|| మానవ జన్మ మహత్తరమైనదని వచిస్తూనే తోటి మానవులకు ద్రోహం చేయడమేమిటి? అక్షరాలను నేర్చిన పాఠశాలనే పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ? గురువులకే వంగి నమస్కరించిన వాడే పంగనామాలెట్టడమేమిటి? ప్రజల మద్దతుతో పదవులందుకొని ప్రజలను నట్టేట ముంచడమేమిటీ? అమ్మ పాలు కమ్మగా తాగి రొమ్ములు కోసే నైజమేమిటీ? గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి? అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా? సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి నిన్న పొగిడి, నేడు తెగనాడు వాడు లం........కొడుకు కంటె హీనమగుటేమిటి? చెట్టుపేరు చెప్పుకొని, తాతల ప్రవరలు చెప్పుకొని పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా! నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ నికృష్ట బతుకులో పందిలాగ బురదలో పొర్లుతూ నీతి సూత్రాలు వల్లించుటేమిటి? ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ కూడు, గూడు, గుడ్డ గుంజుకుని వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి? ఎత్తిన జెండా కడకంటా మోయండం గొప్ప! చచ్చిన పిదప కప్పించుకునే గౌరవం పోగొట్టుకుంటే ఎలా? ఇది రాజకీయమా? అరాచకీయమా ''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో పదవీ కామ ప్రకోపాన ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు! 21.3.2014 ఉ.11.21

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWv97g

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఎంతటి మహా కవి అయినా మానవత్వం లేకపోతె పశువే నేస్తమా !1పార్ధ !!21mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZDVqP

Posted by Katta

Mala Chidanand కవిత

మిత్రులందరికి కవితా దినోత్సవ శుభాకాంక్షలు... ॥ఒక అపహరణ వృత్తాంతము॥ సన్నివేశం-1 నేను నీ గురించే ఒక అందమైన కవిత రాస్తున్నా ఉండు పిల్లా, నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళను పలకరించి వచ్చేస్తా ప్లీజ్ ఆగరా కన్నా, నాకొక ముఖ్యమైన పని వుంది జస్ట్ ఇప్పుడే చేసి వచ్చేస్తారా నాన్నా, నేను ఊరెల్తున్నా రెండు రోజుల్లో వచ్చేస్తా బంగారు, రోజూ నాతో కాసేపు గడపడానికి, నాలుగు మంచి మాటలాడడానికి ఎన్ని కబుర్లు చెబుతున్నావు నేస్తమా... నాకు నీ సాకులొద్దు ప్రియా నువ్వు మరి నీ ప్రేమ కావాలి అంతే. సన్నివేశం-2 ఎక్కడో సన్నగా సుశ్రావ్యమైన సంగీతం వినబడుతున్నది. నిద్రమత్తు ఇంకా వీడనంతుంది. సన్న జాజుల పరిమళం ఆఘ్రాణిస్తూ ఏదో తెలియని మైకంలో తేలుతున్నట్టుంది. నేనెక్కడున్నాను!! అని తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ముందే!! నా నుదుటిపైన ఒక తీయని ముద్రనిచ్చింది నా రాణి!! నవ్వుతూ వచ్చి నా ముందు సిగ్గుతో తలవంచి నిలబడింది. ఆమె చుట్టూ నా కౌగిలిని బిగించిన నేను మెల్లగా తన మోమును పైకెత్తి అధరాలపై ఒక ముద్దందించాను. ఎంత కాలం అలా ఉన్నామో తెలియదు. ఓహ్ !! జ్ఞాపకం వచ్చింది అప్పుడడిగాను నేనిక్కడికెలా వచ్చాను ? చెప్పవా పిల్లా ? అని ? నవ్వుతూ చెప్పింది నిన్ను నేను అపహరించాను రాజా. నువ్విక నా ప్రేమఖైదివని. మనమిప్పుడు ఒక రమ్యమైన ప్రాంత్యంలో ఏకాంతంగా ఉన్నామని. తనివితీరా నా రాజుతో విహారించేదాక విడిచిపెట్టే సమస్యే లేదని సెలవిచ్చింది. మనసారా ప్రేమించే నా బంగారుకొండను నాకే తెలియక ఇంత భాధ పెట్టానా అని నాలో నేనే మథనపడ్డాను. ముద్దుల్తో ముంచెత్తాను. స్వైరవిహారం చేసాము. తనివి తీర ఆనందించాము. ఆమె కోర్కెలన్నీ తీర్చాను. సుఖాంత్యం " ఇక ఇంటికి వెళ్తాం పదండి. మళ్లీ మీరిలా చేస్తే నేను మళ్లీ మిమ్మల్ని అపహరిస్తా" అని చిరునవ్వు నవ్వుతూ ఆజ్ఞాపించింది నా అర్ధాంగి.. ॥మాలచిదానంద్॥21-3-2014||

by Mala Chidanand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWvaIj

Posted by Katta

Aruna Naradabhatla కవిత

వల _____అరుణ నారదభట్ల మనసు గిరిగీసుకున్న మహావృక్షమైనప్పుడు ఆ కొమ్మల నీడలెప్పుడూ కేవలం తన చుట్టే తత్వం నేర్చుకున్న యోగి ఆకుల సందుల్లోంచి దూసుకొచ్చే వెలుతురు గురించి ప్రత్యేకంగా చెప్పాలా...! సూర్యకాంతితో మెరిసే ఆకాశం తనకుతనే మెరిసిపోతున్నానని కలగనడం గమనించావా...! అదే అల్లుకొని ఉన్న బంధం గుంబనంగా నింపుకున్న ఆకుల చాటున నిండుకున్న చీకటిని నీడలా భ్రమపడినప్పుడే కలా ఆవిరై పోయింది...! లోనికి చొరబడే కిరణాలలో ఎప్పటికప్పుడూ ఆకులను రాల్చేస్తూ కదలిక లేని సముద్రంలా నిశ్చల స్థితి పోగేస్తూ అరణ్యంలా నిండుకున్నప్పుడే వెలుగూ అలసి పోయింది...! కప్పుకున్నవెలుగు దుప్పటి కింద పరుచుకున్న నీడజాడలో వెన్నెలై వెలగడం బదులుగా నదిలా పారాడడం గమనించేసరికే కాలమంతా కరిగి ముద్దయింది! ఉదయమూ...అస్తమయమూ... రెండూ ఈ చేతిలో లేవు జీవితపాఠం నేర్పినట్టుగా హిమాలయం గట్టిది అయినా ప్రసరించే కిరణాలలో కరుగుతూనే ఉంది! అలిసినమోములో నిద్రమబ్బు కనిపిస్తుంది గానీ కార్తీకంలోని ముద్దబంతి అవుతుందా.. ఆకాశపు చీకటిని తరిమే సూరీడు కూడా తనలో తను ఆహుతి అవుతూనే ఉన్నాడు! ఆరాటమో...గమన పోరాటమో ఆత్రంగా ప్రశ్నలా జీవితం అగ్నిగోళమై ప్రసరిస్తుంది! బ్రతుకును కట్టై దహించి కాసేపు మబ్బులమాటున దాక్కున్నంత మాత్రాన... వేడి చల్లారుతుందా... కొమ్మల మధ్యన చిక్కిన కాంతిరేఖలా సరళరేఖై ఓ దారిలామారి గోదారి తీరం చేరేదాకా... అగాథాల ఆనవాళ్ళను అన్వేశిస్తూనే ఉండాలేమో! 21-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PWv8zZ

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

ఆ పరమాత్ముని వలనే "కవిత్వం" కూడా నిరాకారమైనది, నిరాధారమైనది, చావు పుట్టుకలు లేనిది.. అయితే ఒక కవి హృదయాంతరాళాన నిఘూఢమై ఉన్న భావాల సంతతి బయటకొచ్చి ఊపిరి తీసుకోవటానికి దాల్చే ఒక మమేకమైన రూపమే "కవిత్వం". - సాట్నా సత్యం గడ్డమణుగు, 21-03-2014, 10:25

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZDT23

Posted by Katta

Rajender Kalluri కవిత

కొన్ని వద్దనుకున్నా మన వెనకాలే వస్తు ఉంటాయ్ కొన్ని కావాలనుకున్నా రావు .... ఏదేమైనా ... ఒకటి మాత్రం నిజం కావాల్సింది దొరికితే అనుభూతి మిగుల్తుంది దొరక్కపోతే గొప్ప అనుభవం మిగులుతుంది !! kAlluRi

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZDVa8

Posted by Katta

Sasi Bala కవిత

అందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు మాతృ దేవతను మాతృ భాషను మరవొద్దు అమ్మ ! అనంత శక్తి .......................................శశి ------------------------------------------------------------------ తేనే వంటి తీయనైన భావనరా అమ్మంటే సాటి లేదు ధరణి లోన అమ్మ చూపు ప్రేమంటే తనువులోని అణువణువూ నీ రూపం గా మలచి తన రక్తం ధార పోసి కడుపును మోసేది తీసే ప్రతి శ్వాసనూ నీకై ఊపిరి చేసి పది నెలలూ నిను కడుపున నిను పెంచి కనేదేర అమ్మంటే వెచ్చని తన రక్తాన్ని తియ్యని పాలగ మార్చి అమృత ధారలోన నిన్ను అపురూపం గా పెంచి గుండెలు నిండిన ప్రేమతో గుండెలపై నిను మోసి తడబడు నీ అడుగులకు తన ప్రాణం జోడించి నడిపెనురా అమ్మంటే భయం లేదు వెంటుంటే దేవుడనేవాడున్నాడో లేడో అన్నది సందేహమైన ... అమ్మన్నదె లేకుండా వుండదు ఏ దేహమైన ఈ సృష్టికి మూలం అమ్మ .మన శక్తికి మూలం అమ్మ శశిబాల(21 march 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZDSLu

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

అంతర్జాతీయ కవితా దినోత్సవం [21-03-2014] సందర్భంగా "కవిత" గురించి నా మది పలికిన భావాలు.. ------------------------------------------------------------------------ నాలో పుట్టింది.. నీలోనూ పుట్టింది.. అదిగో వాడిలో కూడా పుడుతోంది.. పుడుతూనే మాట్లాడుతోంది.. ఆ మాటల్లో ఏదో మాయ చేస్తోంది.. క్షణానికో పాలి పుడుతుంది.. అనుక్షణం మనతోనే ఉంటుంది.. మనలోనే ఉంటుంది.. అసలు అది లేనిదే మనం లేము.. నిజానికి మనలోనుంచి పుడుతున్న అదే మనల్ని పుట్టించింది.. అమ్మ కడుపులో నుంచి అమ్మ గుండెను తన్ని స్వేచ్చగా బయటకు వచ్చిన సంగతే మనకు అమ్మ చెప్పేదాకా తెలియదు.. మరి ఇంక జన్మలో ఇంకో జన్మ ఎలా ఎత్తామో ఎలా ఎదిగామో తెలీదు.. అది చెప్పదు.. మనం అడగం.. విచిత్రమేమిటంటే మనందరికి పురుడుపొసింది.. మళ్ళీ మనలోంచే పురుడుపోసుకుంటోంది.. బదల్లో లాలిస్తుంది.. కష్టాల్లో ఓదారుస్తుంది.. ఆనందం పంచుకుంటుంది.. మనతొ అనుభందం పెంచుకుంటుంది.. తల్లై, తండ్రై, అక్కై, చెల్లై, స్నేహం,ప్రేయసి, భార్యా, ఆఖరికి నేనే తానైపోతుంది.. తానే ఇవన్ని అవుతుంది.. సృష్టిలో ప్రతీ వస్తువునీ తనలో నింపుకుంటుంది.. తానై ఒంపుకుంటుంది.. శక్తిగా యుక్తిగా చలోక్తిగా కర్తగా తానే భర్తగా మనల్ని నిమిత్త మాతృల్ని చేస్తుంది. ఆలోక సౌందర్యాన్నతా తనలో దాచుకుంటుంది.. రూపం లేని ఆ రూపవతి మనలా మనసుతో చూసే ప్రతీ ఒక్కరికీ అతిలోక సుందరివలే దర్శనమిస్తుంది. - సాట్నా సత్యం గడ్డమణుగు, 21-03-2014, 10:01

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV4uS7

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV4uBP

Posted by Katta

Kamalakar Reddy Yanjarlapati కవిత

ఆకాశ మార్గాన పయనించే కవిత్వాన్ని నేలకు దించి.... కమలాకర్ తో కూడా కవిత్వాన్ని రాయించిన మహా మనీషీ శ్రీశ్రీ. మిత్రులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.

by Kamalakar Reddy Yanjarlapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r39Lei

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r39KXU

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV4ulh

Posted by Katta

Madishetty Gopal కవిత



by Madishetty Gopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r39LuW

Posted by Katta

Vani Koratamaddi కవిత

కృష్ణయ్య కృష్ణయ్య నిను చూసి కనులు విప్పారక వుండునా మనసులోని బాదంతా చెప్పాలని వుండదా కన్నయ్య నీ మహిమలు చూసి అచ్చెరువే పొందనా భక్తితో నీకు దండాలే పెట్టాలని వుండదా బృందావనం చూసెందుకు మనసు ఉవ్విళ్ళూరు తుందిగా నీవు నడయాడిన ప్రదేశాన్ని స్పృసించాలని వుండదా మాధవుని మురళీ గానం రంజిల్లు తుందిగా తన్మయత్వంతో మనసంతా తుళ్ళి పడుతుందిగా కృష్ణా కృష్ణా అంటూ నీ నామమే నిండుగా మనసంతా భక్తిమునిగె నీ మీదే మెండుగా మధురలో అడుగులేసి మైమరచాలని వుందిగా మార్గమే చూపించు నీ చెంత చేరగా వాణి కొరటమద్ది 21/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV4u4P

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

నిశీ చిత్రం _____________________________ పగలు అమ్మాయిల పలువరసల్లో పడి నవ్వి పళ్లూడిపోయాయి వెలుక్కి ఉదయరాగిణి నుంచి సంధ్యదాకా ఎన్నిరంగులో.... ఒక్కటీ నిలువలేదు కళ్లు మూసుకు చూసినా వెలుగెక్కడా దొరకలేదు అంతరాంతరాల్లోకివెళ్లి బాహ్యంగానో ఆంతరికంగానో గుహల్నెపుడైనా తడిమావా.?! నిశ్శబ్దాన్ని కప్పుకునిక్రిక్కిరిసి పోయిన చీకటికుప్ప ఇతనెవరో మూసారాంబాగ్ కాల్వలో ఇడ్లీలా చీకటిపై పిండిచల్లుతానంటూ ఆవరించిన నల్లటి చల్లదనానికి ఐసుముక్కైపోయాడు అప్పుడప్పుడూ వెలుక్కి నీరౌతూ.. నీగుప్పిట్లోకి వెళ్లి చూసావా ? భూమికళ్లలోతుల్లోకి వెళ్లి ఎప్పుడైనా అన్వేషించావా.? మట్టిని కప్పుకున్నప్పుడంతా గుప్పున చీకటివాసనే.. ఒకసారెప్పుడైనా అలా దూరి స్మారక శిలవైపోతే ఒకానొక విస్మయాతీతవర్ణాంచిత మహా నిశీచిత్రం

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lUTHHB

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/తెరలు తొలగిన కంకె ---------------------------- కొన్ని తపస్సులు మళ్ళీ పుడతాయి ఈవేళ నీలో ఇంటిముందు జల్లిన కొత్త కళ్ళాపిలా నువ్వు కోరుకునే ఆశలు నీ హృదయ ద్వారాలు దాటకుండా గుమ్మం కిందే పాడుబడతాయి ఇప్పుడు మళ్ళా ఇంకొన్ని కపోతాలు నేల కూలతాయి భల్లానికి ఆసరాగా వాటి వక్షాల నుండి చిక్కని నెత్తురు చిప్పిల్లుతోంది నీ కళ్ళ వసారా పక్కగా నువ్వు అలికిన చోటంతా తడారిపోయింది ఈ పూట కొన్ని దివిటీలు ఆరిపోయాక మిగిలిన మసిని పులుముకున్న ఓ దేహం చితాబస్మానికి చేరువలో రాలిన కంకెలు పోగెస్తూ అనామక గాలి వీయడం నీ మీదుగా తదుపరి మళ్ళా కొంచం స్వచ్చంగా తపస్సు పూరించాలి తిలక్ బొమ్మరాజు 21.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggG1rb

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నీకోసం రాసుకున్నవన్నీ జ్ఞాపకాలై రాలుతున్నాయి || ---------------------------------------------------------------------------- మనసు పుస్తకంలో ఏదో పేజీ దొరుకుతుంది నన్ను నేను చదూకుంటా బోర్లించిన పుస్తకంలోంచి సంగతుల్ని దొర్లిస్తూ నిశ్శబ్ధం మదిని వడకట్టేస్తూ వేళ్ళ చివర్లు ఇంకేం రాయను ఈ క్షణం మీద నీకోసం ఏమి అన్నీ జ్ఞాపకాలై రాలుతున్నాయి ఆ జ్ఞాపకాలే మనసుకు ముల్లై గుచ్చుతున్నాయి పంచభూతాల్లో కల్సిపోవాల్సిన తరుణంలో ఆదమరచిన మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడి… తన శరీరపు ద్వారంకోసం వెతుకులాడుతుంటుంది… ఎవరు తన శరీరాన్ని ద్వశం చేస్తారో అని నిజాన్ని నిప్పుల కొలిమిలో కాల్చినప్పుడే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కారుచీకటిని నిలువున చీలుస్తూ పరుచుకుంటున్న వెలుగుల తీరంలో జీవన నైజం తన దిశ మార్చుకుండి నాకు నేను ముళ్ళ బాట పరచుకొని నడీచే దారిలో రక్తం ఓడుతున్నా నడుస్తూనేఉన్నా గమ్యీం తెలియకపోయినా రాత్రంతా మదనవేదన పడిన తనువు అనంతాకాశాన్నుంచి జాలువారుతున్న జలపాతపు సవ్వడిలో ముక్కలుగా విరిగిపోతూనే ఉంది .. మనసు చిరుగుల్లోఉంచి కనిపిస్తున్న నిజాలను ఎవరు చూశాను చూడాల్సిన అవసరం ఏముంది మనసు తనుకోరిన హృదయంలో పరకాయ ప్రవేశం చేస్తూ… అనుభూతుల పిచ్చుక గూడు అల్లుకుంటూ ఉంటుంది… కాని ఆ మనస్సును ప్రశాతంగా ఉండనీయరుగా దూరంగా నెట్టివేస్తున్నా ఆ మనస్సు ఇంకా పాత జ్ఞాపకాలతో బైటికి రాలేక లోపల వద్దని నెట్టివేస్తూ అవమానిస్తున్నా సమాదానం లేని ప్రశ్నలా మిగిలీపోలేక ఒంటరిగా ఆకాశంవైపు చూస్తూ ఎవ్వరూ వినకుండా దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటే ఆరోదన అరణ్య రోదనే కదా..?

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYRHdf

Posted by Katta

Chi Chi కవిత

_ తొక్క _ అదృష్టం అసలడుక్కోదంట. సృష్టిలో address లేని ఈ భూమ్మీద address వెతుక్కునే ఏకైక మానవ(?)జన్మెత్తినందుకు వేసే ప్రతడుగు జార్చి పడేస్తుందేమో అడుగులు పిలవకుండా వేస్తే!! చావే గమ్యమని పుట్టనోల్లకు తెలిస్తే అసలు పుట్టరేమో మోక్షంలో మునిగి తేలే బతుక్కొచ్చి మోసమెందుకు చేస్కోవాలో తెలుసుకోలేక మోసం కూడా మోక్షమేనని జీర్ణించుకుని,నిమిత్తమాత్రంలో పిలవని పేరంటానికొచ్చి ప్రేమో , పెత్తనమో , పైత్యమో లేక ఆ మూడిటి మిశ్రమమో ఏందో ఏమో అనుకుంటూ మూస్కోలేక మోసుకునే మోజుల్లో పడి బతుకంతా ఒక గమ్యంగా చేసుకుని ఆరంభాలు , అంతిమాలు లేకున్నా ఆరిపోయేదాకా ఆగిపోలేక ఆడుతూ ఆడిస్తూ ఆడుకోవాలంతేనని అండపిండాలకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలం? అదంతే..ఇదింతే..అంతే!! బహువచనం పుట్టడమే భారమా!! బతుకు రాజీల భావమేగా అది ఏకమే అనేకమయ్యుంటే ,ద్వైతమూ అద్వైతమేగా 1 to 9 = 1 and 1=infinite!! మరి 0 ఏందిరా!! ద్వైతమా,అద్వైతమా? శూన్యం సున్నాని దె... ఎందుకులే.. కావాలనుకున్నందుకేగా ఇన్నీ!! చావాలనుకోకుండా బతకడానికి పుట్టాలనుకోకుండా పుట్టేయడం పుట్టించినవి , పుట్టినవి , చచ్చేవి ..అన్నీ నిమిత్తం !! బాగుంది బాగుందో బాలేదో..ఉంది అయినా తొక్కెక్కడుందో తెలీని పండులో, పండై పండి ఎండి రాలిపోడానికే కాస్తుంటే పండ్ల కోసం తొక్కిసలాటెoదుకో తొక్కలోది______________Chi Chi (21/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PVZnqU

Posted by Katta

Indira Bhyri కవిత

ఇందిర ఎవడు వీడు ఖచ్చితంగా వీడో రాజాధిరాజు అడగకుండానే సర్వం సమకూరాలి నటనాసార్వభౌముడికీ వశంకాని నవరసాలొలుకుతాడు గానగంధర్వుడికీ చేతకాని బాణీలు పలుకుతాడు సందేహమే లేదు వీడు మహా జాదూగర్ కొమ్ములు తిరిగిన తాతల్నీ పసివారిని చేసి ఆడిస్తాడు చిరునవ్వులతోనే చిత్తుచేస్తాడు అడుగడుగుకీ రక్షణకోటలు కట్టుకున్న చక్రవర్తి ఆహ్లాదమౌ అల్లరితో రోజుకో తాజుమహలు కట్టే మొగలురాజు అలవోకగా నవ్వులలో ముంచితేల్చే మా ఆస్థాన విదూషకుడు చేయిచాస్తే లేదనని దానకర్ణుడు సహనాన్ని పరీక్షచేసే ధర్మరాజు ఎదురేమున్నా బెదురులేక సాగే వీర జవాను చిట్టి చేతులతో మట్టి పిసికే బాల కృషీవలుడు అడుగిడిన చోటల్లా బృందావనాలు తీర్చే కృష్ణబాలుడు గుండెల్లోనే గుడులు కట్టిన నవ పల్లవరాజు అలా చూసి ఇలా పట్టేసే అష్టావధాని ఇంటి యూనివర్సిటీలో అన్ని శాస్తాలు ఒంటబట్టించి పట్టాలెన్నో పుచ్చుకున్న చిట్టి మేధావి (21/3/2014) పండు (శ్రీహిత్ పుట్టిన రోజు సందర్భంగా .......బాల ప్రపంచానికి అకితమిస్తూ....) రచనాకాలం 2007 ;తెలుగు వలుగు నవంబర్ సంచికలో అచ్చైబహుళాదరణకు నోచుకున్నది .

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PVN6Ta

Posted by Katta

Rajeswararao Konda కవిత



by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4WON4

Posted by Katta

Abd Wahed కవిత

గాలిబ్ కవితల్లో ఈ రోజు మొదటి కవిత, గాలిబ్ సంకలనంలోని 13వ గజల్ మొదటి షేర్ మహర్రమ్ నహీ హై తూ హీ నవాహాయె రాజ్ కా యా వర్నా జో హిజాబ్ హై పర్దా హై సాజ్ కా నిగూఢ స్వరాలకు ఆప్తుడవు కాదు నీవు నిశ్శబ్ధం నిజానికి వాద్యాల హోరు కదా ఈ కవితలోని ఉర్దూ పదాల అర్ధాలను చూద్దాం. మహర్రమ్ అంటే సాన్నిహిత్యం, సన్నిహిత బంధువులను మహర్రమ్ అంటారు. నవా అంటే స్వరం, నవాహా అంటే స్వరాలు, హిజాబ్ అంటే పరదా మనం సాధారణంగా బురఖాగా పిలిచే దుస్తులను హిజాబ్ అనవచ్చు. సాజ్ అంటే సంగీత వాయిద్యాలు, రాజ్ అంటే రహస్యం. ఇప్పుడు ఈ గజల్ భావం చూద్దాం. ప్రకృతి తన రహస్యాలను అన్వేషించేవారికి, ప్రకృతికి దగ్గరగా ఉండేవారికి తెలియజేస్తుంది. ప్రకృతి తనలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను వినిపిస్తున్నా అర్ధం చేసుకునే సామర్థ్యం నీకు లేదా అంటున్నాడు. ఎందుకంటే, ప్రపంచంలో ప్రతిదీ తనలో దాగి ఉన్న సౌందర్యాన్ని బిగ్గరగా ప్రకటిస్తోంది. ఉదాహరణకు డప్పుపై ఉన్న చర్మం నిజానికి ఒక పరదాలా కప్పి కనబడుతుంది, కాని ఆ డప్పు బిగ్గరగా సంగీత సౌందర్యాన్ని ప్రకటిస్తుంది. అందులో సంగీతం దాగి ఉంది. ఈ కవితలో అనేక భావాలున్నాయి. పైన కప్పి ఉన్న ఆచ్చాదనల్లో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. సంగీత స్వరాలు దాగి ఉంటాయి. పైపైన చూస్తే నీకు లోపల దాగి ఉన్న సత్యాలు కనబడవు. ఆధ్యాత్మిక నేత్రాలతో పరికిస్తే ప్రకృతిలో దాగి ఉన్న ప్రతి ఒక్క రహస్యం నీ ముందు సాక్షాత్కరిస్తుంది. దివ్యఖుర్ ఆన్ వాక్యాలను ఆయత్ అంటారు. ఆయత్ అంటే చిహ్నం లేదా సూచన అని అర్ధం. ’’మా జరఅ లకుమ్ ఫిల్ అర్జి ముఖ్తలిఫల్ వానుహ్. ఇన్న ఫీ జాలిక ల ఆయాతల్లి ఖవ్ మింయ్యజ్జక్కరూన్.‘‘ అంటే అర్ధం : దేవుడు మీ కోసం భూమిలో సృష్టించిన అనేక రంగు రంగుల వస్తువులలో కూడా గుణపాఠం నేర్చుకునే వారికి నిశ్చయంగా సూచన ఉంది. గాలిబ్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. ఆధ్యాత్మిక నేత్రంతో పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఒక డప్పుపై ఉన్న చర్మం సాధారణంగా చూస్తే దాన్ని కప్పి ఉంచిన పరదాలాంటిది. కాని సంగీత నిపుణుడికి దానిలో సుస్వరాలు వినిపిస్తాయి. ప్రకృతిలో చాలా సూచనలున్నాయి. చాలా రహస్యాలున్నాయి. ఆ సూచనలను, రహస్యాలను కప్పి ఉంచే పరదాలూ ఉన్నాయి. ఈ కవితలో ఉపయోగించిన పదాలు గమనించదగ్గవి. సాన్నిహిత్యం, స్వరం, ఆచ్చాదన, రహస్యం వగైరా పదాలు సృష్టించే పదచిత్రాలను పూర్తిగా గ్రహించాలంటే కొన్ని సాంస్కృతికమైన విషయాలను కూడా తెలుసుకోవాలి. హిజాబ్ అన్నది వస్త్రధారణ నియమం, డ్రస్ కోడ్ వంటిది. ఇది పురుషులకు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణ నియమాల్లో సన్నిహిత బంధువుల వద్ద వస్త్రధారణ నియమాల్లో సడలింపు ఉంది. మహర్రిమ్ అంటే సన్నిహిత బంధువు (తండ్రి, సోదరుడు, భర్త తదితరులు) వద్ద స్త్రీ పరదా పాటించదు. ఆ సన్నిహిత బంధువులకు ఆమె రహస్యం కాదు. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఆమెను గుర్తించగలరు. ఆమె పరదాలో ఉన్నా కూడా గుర్తించగలరు. గైర్ మహర్రిమ్ అంటే సన్నిహిత బంధువు కాని వారు ఆమెను గుర్తించలేరు. గాలిబ్ ఈ సాంస్కృతిక అంశాన్ని ఉపయోగించుకున్నాడు. రహస్యస్వరాలకు నువ్వు సన్నిహితుడివి కాదు... వాటిని గుర్తించలేవు అంటున్నాడు. మహర్రిమ్ అన్న పదం ఉర్దూలో సాన్నిహిత్యానికి బదులుగా ఉపయోగించే పదం. స్త్రీలు ధరించే బ్రాసరీని కూడా మహర్రిమ్ అనే అంటారు. ఆమె శరీరానికి చాలా దగ్గరగా ఉండేదన్న అర్ధంతో. అంతేకాదు, ఆమె రహస్యాలను కప్పి ఉంచేదన్న భావం కూడా ఇందులో ఉంది. ఈ భావార్ధ ఛాయలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రకృతిని ఒక స్త్రీగా పోల్చడం, ప్రకృతికి సన్నిహితంగా లేనందువల్ల అందులోని సంగీతం నీకు మౌనంగా మారిందని చెప్పడం చక్కని పదచిత్రాలను అందిస్తుంది. గాలిబ్ కాలంలో బ్రిటీషు వారి ప్రాబల్యమూ పెరిగింది. సాంకేతికంగా బ్రిటీషువారు సాధించిన ప్రగతిని ఆయన చూశాడు. రైళ్ళను, యంత్రాలను చూశాడు. ఒక పర్షియన్ కవితలో గాలిబ్ కరె మర్దె హోషియార్ బీన్ అంటాడు. అంటే తెలివైన వారి పని చూడండి అంటున్నాడు. ఈ కవితలోను గాలిబ్ ప్రకృతిని పరిశీలించి అందులోని రహస్యాలను కనుగొని కొత్త ఆవిష్కరణలు సాధించాలేకపోవడమేమిటంటూ తన వారిని నిలదీయడం కనబడుతుంది. ఈ రోజు రెండవ కవిత గాలిబ్ పదమూడవ గజల్ రెండవ షేర్ రంగె షికిస్తా సుబహ్ బహారె నజారా హై యే వక్త్ హై షుగుఫ్తనె గుల్హాయె నాజ్ కా తొలిపొద్దున పూలుగా విచ్చుకునే లేత రంగుల మొగ్గలు ఒళ్ళు విరుచుకుని నిద్రనుంచి మేల్కొనే ముగ్ధలు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. షికిస్తా అంటే విరిగిన లేదా లేత లేదా pale in color. సుబహా బహారె నజారా అంటే వసంతంలో ప్రాత: సమయం దృశ్యం. షుగుఫ్తన్ అంటే విచ్చుకోవడం, గుల్ అంటే పువ్వు, గుల్హా అంటే పూలు, నాజ్ అంటే అత్యుత్తమమైన, విశిష్టమైన, గర్వించదగిన, నాజ్నీన్ అంటే విశిష్టమైన అందం కలిగిన అమ్మయి అని భావం. గుల్బదన్ నాజ్నీన్ అంటూ ప్రేయసిని సంబోధించడం ఉర్దూలో ఉంది. అంటే అర్ధం పువ్వు లాంటి సాటిలేని అందగత్తె. గుల్హాయె నాజ్ అంటే పూల వంటి ముగ్ధలు అని భావం. స్త్రీ సౌందర్యాన్ని అత్యుత్తమంగా వర్ణించిన కవిత ఇది. పూలవంటి అందమైన అతివల సౌందర్యాన్ని గాలిబ్ వర్ణించిన పదచిత్రం సాటిలేనిది. తొలిపొద్దు పొడిచిన వెంటనే గొప్ప దృశ్యాలు కనబడతాయంటున్నాడు. ఉద్యానవనంలో లేత రంగుల్లో ఉన్న మొగ్గలు రంగులు వెదజల్లే పూలుగా విచ్చుకుంటాయి. అదే సమయాన పూలవంటి అతివలు కూడా నిద్రనుంచి మేల్కొంటారు. నిద్రమత్తు కారణంగా వారి సౌందర్యం లేతరంగులో, అంటే హుషారు లేకుండా ఉంటుంది. కాని చిరునవ్వుతో వారు చేతులు పైకెత్తి ఒళ్ళువిరుచుకోవడంతో లేతరంగుల మొగ్గలు విచ్చుకున్నప్పుడు పూల రంగులు ఎలా తేజోమయంగా మారుతాయో అదేవిధంగా వారి శరీరసౌష్టవం, సౌందర్యం అప్పుడే విచ్చుకుంటున్న పూల మాదిరిగా ఉంటుంది. అంటే ఇంటి బయట పూలు విచ్చుకుంటున్న వసంతం, ఇంటి లోపల ముగ్ధలు నిద్రనుంచి లేస్తున్న సౌందర్యం. ఎటు చూసినా వసంతమే అంటున్నాడు. ఉద్యానవనం నుంచి పడకగది వరకు వసంతం అలుముకుంది. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసి గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ప్రపంచంలో ప్రతి స్త్రీ గురించి చెబుతున్నాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 13వ గజల్ మూడవ కవిత తూ ఔర్ సూయే గైర్ నజర్ హాయె తేజ్ తేజ్ మైం ఔర్ దుఖ్ తేరీ మిజాహాయె దరాజ్ కా నా ప్రత్యర్ధిపై నీ తీక్షణమైన చూపులు నీ కనురెప్పల శ్రమ నాకు దుఃఖకారణం ఉర్దూ పదాలకు అర్ధాలు. సూ అంటే వైపునకు అని అర్ధం. గైర్ అంటే పరులు లేదా ప్రత్యర్ధి. నజర్ అంటే చూపు. నజర్హా అంటే చూపులు. తేజ్ తేజ్ అంటే తీక్షణమైన అని అర్ధం. తేజ్ అంటే వేగం అన్న అర్ధం కూడా ఉంది. వేగవంతమైన, ఆగ్రహంతో కూడిన, తీక్షణమైన చూపులని భావం. మీజా అంటే కనురెప్ప లేదా eyelash. మీజాహా అంటే బహువచనం. దరాజ్ అంటే పొడవైన ఇది ఫక్తు ప్రేమ కవిత. గాలిబ్ తన అసూయను చెప్పుకున్న తీరు హృద్యంగా ఉంది. పరులవైపు తీక్షణంగా కూడా చూడవద్దని ప్రేయసికి చెబుతున్నాడు. కోపంగా, అసహనంగా కూడా చూడవద్దంటున్నాడు. ఎందుకంటే అలా చూడ్డం వల్ల లాభం లేదంట. కనురెప్పలకు శ్రమ తప్ప, పరుల్లో హృదయం ఉండదు, వారు రాతిగుండెలపై నీ చూపుల ప్రభావం ఉండదు. నీ కనురెప్పలు అల కష్టపడడం చూడలేనంటున్నాడు. కాబట్టి ఆమె కోపంగా కూడా పరులవైపు చూడకుండా, తన చూపులను కేవలం గాలిబ్ కోసం మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన స్పందించే హృదయం కలిగినవాడు తానే. కోపంగా చూసినా, తీక్షణంగా చూసినా, అసహనంగా చూసినా ఎలా చూసినా ఫర్వాలేదు కాని తనవైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే పరులవైపు చూస్తే వారిపై ఆ చూపుల ప్రభావమూ ఉండదు. కళ్ళకు శ్రమ తప్ప మరేమీ ఉండదు. తనవైపు చూస్తే తనది స్పందించే హృదయం కాబట్టి నీ చూపుల శ్రమకు ఫలితం ఉంటుందంటున్నాడు. అంటే తాను అసూయపడుతున్నప్పటికీ, తన అసూయను దాచుకుంటూ నీ కోసమే చెబుతున్నాను, నీ మంచి కోసమే చెబుతున్నానంటున్నాడు. మొత్తానికి గాలిబ్ గొప్ప ప్రేమికుడు, ప్రేయసిని ఎలా అనునయించాలో బాగా తెలిసినవాడు.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4WNZz

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // వసుధైక లోకం // ఒక స్వప్నం నెరవేరును నా హృది నిన్ను చేరి, ఏదో ఒక అనుభూతి విచ్చుకొనును మది నిన్ను ఆశ్వాదించి, అనేక వసంతాలు వచ్చేను నీ పలకరింపుల ప్రతీ సారి ఇక బంగారు భవిష్యత్తు పండించాలి నీ "వచన కవన" కవిత్వ కర్షక విత్తనాలతో ప్రేమ విరులు పూయించాలి, ప్రతీ మనసు తోటలో నీ "భావుకత్వపు" కవిత్వపు జిలిబిలి పలుకుల జలములతో అప్పుడే విరాజిల్లదా "అద్వైత భావనల్లో " ఈ లోకమంతా ఓ "పచ్చని చెట్టు"లా ఆశల హరి విల్లులా.. ప్రేమల విరి జల్లులా జయహో ప్రపంచ కవిత్వ ఆరదనల వేడుకల వేలుపు నీవు అంటూ ,,, జయహో హో జయహోం జయహోం కవన మానస చోరవు నీవు, మానవత్వపు మమతలు అల్లు మనిషివి నీవు అంటూ..పాడదా,, విశ్వమంతా "వసుధైక కుటుంబం"లా ఒక్కటై మమకారంతో జయహో కవి ,,, జయహో కవయిత్రి ... జయహే ... కవిత్వం ........ అని గొంతెత్తి గోల గోలగా విశ్వమంతా ! (21-03-2014 ప్రపంచ కవిత్వ వేదిక పాదాలకు నాదొక చిన్న "భావ పుష్ప" సమర్పణ )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJ6PwI

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• ఉత్సవ సమ్మోహనం •• నిదుర దోసిట్లో ఆకుపచ్చ చిలుకల కునుకు- కనులకేవో అడివి కలల అత్తరు- జీవం పుట్టీ మిణుగురులై దూది ధూళి కాలం- పాప అడుగుల ముద్ర భూమి నడక- కొమ్మ నుండి కొమ్మకి గెంతు చెట్టుపాము ప్రాణం- ••• కట్టి పడేసినట్టు ఉత్సవ సమయాలు గుడిసె గుంజెకి లాంతరులా- 20-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gLt870

Posted by Katta