పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Patwardhan Mv లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Patwardhan Mv లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2014, మంగళవారం

Patwardhan Mv కవిత

ఐసా దీజియే :::: // ఎం.వి.పట్వర్ధన్ || ఒరేయ్! నీకు అంతులేని సంపదలూ, అపారమైన సంతోషాన్నీ అనుగ్రహిస్తున్నాను ఆహా !! స్వామీ! అయితే నన్ను కవిని చేయ్ కళ్ళూ,కాళ్ళూ నేలపై గట్టిగా నిలిచి ఉండేలా ఆయన అదోలాగా నవ్వి అన్నాడూ కాదురా! నిత్య దరిద్రమూ, నిరంతర దుఃఖమూ అభిశపిస్తున్నాను అంతేనా స్వామీ! అయితే నన్ను కవిని చేయ్ ఎదుటి వారి సుఖాన్ని ఎప్పుడూ స్వప్నించేలా ఈసారి విసుగ్గా అన్నాడు నిప్పుల వాగుల వెయ్యా నిన్ను ఈ ప్రపంచం గుర్తించకుండుగాక అవునా స్వామీ ! అయితే నన్ను కవిని చేయ్ అమృతమయుణ్ణై నా సరికొత్త ప్రపంచమేదో నేనే సృష్టించుకునేలా 27-05-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S9iLkF

Posted by Katta

21, మే 2014, బుధవారం

Patwardhan Mv కవిత

పట్వర్ధన్ ఎం.వి---- // అర్థాంగీకారం || ఎలా ఉన్నాడు? నచ్చాడా? పెదవుల మీది పేలవమైన ప్రశ్న సమాధానాన్ని ఆశించని పరమ యాంత్రికమైన ప్రశ్న యథాలాపమైన ప్రశ్న ఇదే ప్రశ్న కొన్నేళ్ళ నుండి వేయబడీ,వేయబడీ మొదలూ,కొసా అరిగి పోయి జవ జీవాల్ని కోల్పోయి శూన్యంలో ఎగరేసిన వస్తువులా ఏ ఆకర్షణా లేక ,ఒకానొక నిరీహా నిశ్చల స్థితిలో ఒక వెర్రి నవ్వు పరిమళాన్ని నింపుకున్న ప్రశ్న గాయాల తుప్పుతో మొండుబారిన ప్రశ్న అప్పుల ఉరి కొక్కెంలా వేలాడుతున్న ప్రశ్న గంధక ద్రావణంలో మరిగి కరిగి చల్లారిన ప్రశ్న ఒక చక్కటి సౌశీల్యానికి మాపదండమైన ప్రశ్న తన గుడ్లను తానే తినే పాము నోరులా ఉంది ప్రశ్న పడి లేవని చచ్చిన కెరటంలా ఉంది ఇప్పుడు ప్రశ్న న్యాయ మూర్తి విరిచేసిన పాళీలా ఉంది కానీ... ఆమె హృదయ తీరంలో ఎక్కడో ఇప్పటికీ సమాధానం సజీవ శిలాజంలా ఉండే ఉంటుంది. 21-05-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVgLCJ

Posted by Katta

21, ఏప్రిల్ 2014, సోమవారం

Patwardhan Mv కవిత

అపరిచితుడు::::: నుదుట నెన్ని రాసితివో నూకల నీవు ముందుకు పోనీవు నన్ను వెనుకకు రానీవు. సుఖమే అని చెప్పి నన్ను సులావుగాబట్టి ఎక్కడి కక్కడె బాధల మేకులు దిగకొట్టి ఏడ్వ లేక నవ్వలేక నేడుస్తుంటే సిలువపైన బతుకంతా ఈడుస్తుంటే ...... ఏర లడిగినారని నను పసుపు పతంగీని చేసి ఆశయాల గగనంలో అత్యున్నతి నెగరేసి ఆచరణా సూత్రమ్మును దారుణముగ తెంపేసి పతన కంటకాలలోన వేగంగా పడద్రోసి...... ముదమైనా పెదాలపై నవ్వు హంస వ్రాలదు వ్యథయైనా కనుల నశ్రుకణ మొక్కటి రాలదు అనుభూతుల శూన్యతనే కానుక నిచ్చి నడయాడే ఎడారిగా నను కానిచ్చి ......... మంచోడని జగ మంతా మెచ్చేస్తుంటే నా లోపలి మనిషి నన్ను నవ్వేస్తుంటే మోయలేని మంచితనం ప్రశ్నిస్తుంటే నన్ను చూసి నాకే మరి భయమేస్తుంటే....... ఈ భాష నాది కాదు-- ఈ ఆశ నాది కాదు ఈ ఆశ నాది కాదు--నే నసలు నేను కాను నాకే తెలియని దేదో నాలో శ్వాసిస్తే కీర్తి కాంక్ష కుతిక మీద కత్తి లాగ శాసిస్తే...... 21-04-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rcfeww

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

Patwardhan Mv కవిత

మిత్రులారా!! కవిసంగమం ఒక అద్భుతమైన వేదిక.దయచేసి దీనిని మత సాహిత్యానికి వాడుకోవద్దు.వాడుకోవాల్సిన పరిస్థితే కనుక వస్తే నాణేనికి రెండువైపులా రాస్తే బాగుంటుంది.దీనిలో మనం కవులమే తప్ప పరమత///కుల నిందాకారులం కాదు.కారాదు. ఒక సంఘటనను ఒక సంఘటనగానే చూడండి.జెనరలైజ్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.గోద్రా సంఘటన సబర్మతికి ప్రతిచర్య అనే వారూ ఉంటారు. దుర్మార్గం ,కుట్ర కూహకం మతంలో ఉండదు.మనుషుల్లో ఉంటుందని మనకు తెలియంది కాదు.ఏ మతం చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? ఏది లోపరహిత మతం??? హిందూ మతంలో భయంకర కుల వివక్షత,ముస్లీం మతంలో ఇతర మతస్తుల మీద దౌర్జన్యాలూ,కళా,సాంస్కృతిక విధ్వంసం,క్రైస్తవంలో మనుషుల ఆర్థిక బల హీనతలను ఆధారంగా తీసుకొని మత మార్పిడులను ప్రోత్సహించడం---ఇవి కొన్నే.. మనకు మతాన్ని మించిన ఎన్నో భయంకర సమస్యలున్నాయి.వాటి మీద దృష్టిపెడదాం. లౌకిక అన్న పదానికి నిజమైన అర్థంలో వ్యవహరిద్దాం.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1L7DB

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Patwardhan Mv కవిత

బోల్ లఖన్ జీ బోల్!!! :::::::::: ఊర్మిళా !ఒక్కసారి మరిది గారితో మనసు విప్పి మాట్లాడాలమ్మా అలాగే !ఆత్మేశ్వరులవారే సమయానికి స్వయంగా విచ్చేస్తున్నారక్కా! మరి నీవేమీ అనుకోవద్దు సుమా! అక్కా!అనుకోడానికి మనం తప్ప ఇంకా మనకేం మిగిలున్నాయని? రావోయీ మరిదీ! బాగున్నావా? బాగానే ఉన్నావు లే-రాచసుఖాల్లో మరింత రంగుతేలి అలా చూపులతో పాతాళాన్ని తవ్వకపోతే ఇప్పుడైనా ఒక్కసారి తలెత్తి నా కేసి చూడరాదా? అక్కా! నీకు తెలియనిదా ఆయనకు ఆడవారంటే గౌరవమూ-అంతకు మించిన సిగ్గూ అని! ఔన్లే! మరిది గారి సిగ్గు సింగారమంతా శూర్పణఖ నాడే తెలిసింది కానీ చెల్లెలా!ఒక్కటడుగుతాను-మీ ఆయన చెప్తాడేమో కనుక్కో. ఆనాడు నా అదృష్టం నూపురాల్లో రవళించకుంటేనూ..... అదిప్పుడెందుకక్కా?! అయిపోయిన కథ కదా! కాదు మరిది గారు మరి తమ మాతాశ్రీని కూడా చూడరా చెల్లీ?? అదేం ప్రశ్నక్కా? ఇది నా బాధమ్మా! నేనమ్మను కాననే కదా........ 08-04-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itjdSb

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Patwardhan Mv కవిత

పట్వర్ధనీయాలు::: సీసా పెంకుల వట పత్ర శాయి చెత్త కుండీలో వదిలిన పేరులేని పాపాయి *********************************** కమలంలో చిక్కిన తుమ్మెద పలవరిస్తున్నది స్వేచ్ఛ! *********************************** నేను నిజంగా నిజాన్ని నమ్ముతా నిజాన్నే తుమ్ముతా ! *********************************** తప్పిపోయిన శాంతి కోసం వెతుకుతున్నాను అశాంతీ ! నీకేమన్నా కనిపించిందా ?? ************************************ ఇల్లు ఖాళీ చేయాలి ఇంకో ఇల్లెక్కడో ఏమో మరి :( ************************************ నన్ను రక్షించుడీ సన్యాసుల్నుండీ సన్నాసుల్నుండీ ! ************************************ బాల్యం విస్ఫోటించింది మూల్యం సమాజం చెల్లించింది. ************************************ సైనేడు నవ్వుల లోకం సత్యవ్రతా! జాగ్రత్త. ************************************ గడ్డిపోచ కోరుకుంటున్నది ఓట్ల పండుగ ఒడిసిపోవద్దని. ************************************ శిథిలమైన మనస్సులో శిలీంద్రాలు మొలుస్తాయి. *********************************** ప్రభూ!! విశ్వ రూపం ఈ కళ్ళతో చూడలేను హిజ్ ఎక్సలెన్సీ హిపోక్రాట్ కళ్ళియ్యి. *********************************** చంద్రున్లో మచ్చ పేదరాశి పెద్దమ్మదీ,కదలని కుందేలుదీ కానే కాదు. అచ్చం తుపాకీ పట్టిన నా చిన్న కొడుకుదిలా లేదూ? ************************************** వేటగాడికి తెలిసింది నేను కలల కుందేళ్ళను పెంచుతున్నానని! 02-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZ9bO0

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Patwardhan Mv కవిత

కాల్ కత!! మనం కాలాన్ని గోడకు వేలాడదీసి సంబరపడుతుంటామా అదేమో నిశ్శబ్దంగా మన కాళ్ళ కింది ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. . ********************************************************* తేదీల పేర్లూ రోజుల పేర్లూ వారాల పేర్లూ వత్సరాల పేర్లూ మారుతున్నాయి కానీ ఓ పిచ్చి తమ్ముడూ! మన బత్కు లేమైనా మారుతున్నాయా? కాలందీ,రాజ్యందీ ఒకే స్వభావం. 31-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hQ67N4

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Patwardhan Mv కవిత

కాల్ కత!! మనం కాలాన్ని గోడకు వేలాడదీసి సంబరపడుతుంటామా అదేమో నిశ్శబ్దంగా మన కాళ్ళ కింది ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. . ********************************************************* తేదీల పేర్లూ రోజుల పేర్లూ వారాల పేర్లూ వత్సరాల పేర్లూ మారుతున్నాయి కానీ ఓ పిచ్చి తమ్ముడూ! మన బత్కు లేమైనా మారుతున్నాయా? కాలందీ,రాజ్యందీ ఒకే స్వభావం. 31-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hQ67N4

Posted by Katta

30, మార్చి 2014, ఆదివారం

Patwardhan Mv కవిత

నమ్మకు నమ్మకు ఈ రేయిని: ఈ రాత్రి చీకటి సిగ్గుపడి, భయపడి తన కళ్ళను గట్టిగా మూసుకుంటుంది. రౌడీ సీసా కరెన్సీని వెంటేసుకొని వీధి గద్దె మీదే ఓటరుపై అత్యాచారం చేస్తుంది. ఈ రాత్రే ప్రజాస్వామ్యానికి వెంటిలేటర్ తొలగించబడి అనుమానం రాని రీతిలో హత్య కావించబడుతుంది. అంతరించిన డైనోసార్లు మళ్ళీ అవతరించే రాత్రి. అసలైన మేనిఫెస్టోలు రాయబడే రాత్రి రేపు ఇనుప బాక్సుల్లో నిండేవి ఈ రాత్రి కార్చిన రక్తపు చుక్కలే ! అవును ఈ రాత్రే ,ఎన్నికల ముందు రాత్రి. 29-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fz2qL9

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Patwardhan Mv కవిత

సందర్భం::: మన తెలుగు ప్రశ్నపత్రాల్లో సందర్భ సహిత వ్యాఖ్యలు మనకు తెలుసు.అదే ఈ సందర్భానికి ఆలోచన ఇచ్చింది. ఇది కేవలం మంచి కవిత్వ పంక్తులను (నా దృష్టిలో) ఒక సారి మీ పార్టిసిపేషన్ ద్వారా స్మరణం చేసుకోవడం... దీనికి మొదలు అర్ధరాత్రి టీవీల్లో వస్తాయే "కాల్ చేయండి" ఆ షోల తరహాలో ఓ పదిహేను నిమిషాల వ్యవధిలో అనుకున్నా....నా అంచనా ఏమంటే-అందరమూ కవులమూ,సాహిత్యాభిమానులమే కాబట్టి చాలా ఎక్కువ ఆన్సర్లు వస్తాయనుకున్నా.కానీ ఎక్కడో కనెక్ట్ కాలేదు.సందర్భం రాయడం నాకు ఎక్కువ తెలుసనీకాదు.అడిగేవాడికి అన్నసామెత ఇక్కడ వర్తించదు.నేనూ సేకరించి పెడుతున్నవే. ఏదో కొంచెం వెరైటీగా ఉంటుందని అనుకున్నా! దీన్ని టేక్ అప్ చేయడంలో ఒక సమస్యా ఉంది.మీ నుంచి సమాధానాలు రాని పక్షంలో నాకు ఇక బయటపడే మార్గం ఉండదు.కాబట్టి సందర్భం బాగుంది అనుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా విజ్ఞప్తి.సమాధానం తప్పో,ఒప్పో ఏదో ఒకటి రాయండి. అలాగే సందర్భం మీద మీ విలువైన సూచనలూ,సలహాలూ నిర్మొహమాటంగా రాయండి.దీని కంటిన్యూయేషన్ మీ స్పందనను బట్టే ఉంటుంది.నా ఈ మేయిలును కూడా ఇస్తున్నాను-కవిసంగమం అధికార నినాదం అందరికీ తెలుసు కదా! జయహో కవిత్వం. 29-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iKvgMr

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

సందర్భం -04: ఇది ఎవరిది? హాయ్ పోయెట్స్ ఆండ్ ఫ్రెండ్స్!గుడ్ ఈవ్నింగ్.వెల్ కం టు సందర్భం -04. ఓ ప్రసిధ్ధ కవి పద్యం. //// హార్మోనియము మెట్ల మీద అడుగులేసుకుంటూ ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని తీసుకెళ్ళినట్లు నా శరీరాన్ని అలా అరచేతితో పెట్టుకొని గాలిలో తేలిపోతోంది రైలు అస్థిపంజరాల సమూహాలు పరుగెత్తినట్లు శబ్దం ఒకటే వెంటాడటం పెట్టెలోని గాలి నీళ్ళలోని నావలా అటూ ఇటూ కొట్టుకుంటుంది వాగ్యుధ్ధాల్లో మిగులుతున్న శూన్యమూ రైలు వంతెనని నములుతున్న భయంకర శబ్దము కాళ్ళకి ఇనుప సంకెళ్ళతో పరుగెత్తుతున్న భూమి అక్కడికక్కడనుండే తిరిగి తీవ్రంగా పైకి లేచి కన్నీటి బొట్టులా భూమిలోకి కూరుకుపోయే దుమ్మూ అడుక్కునే గుడ్డాడి గుంట నీళ్ళలో స్థిర నివాస మేర్పరుచుకున్న చీకటి ఇవన్నీ రెపరెప కొట్టుకుంటున్నాయి ......ఏదో స్టేషనొచ్చింది,రైలు భూమ్మీదకు దిగింది గుక్కెడు టీ నీళ్ళకోసం రైలు కిటికీలన్నీ వేల చేతుల నోళ్ళు తెరిచాయి //// ఎవరిదీ సాహిత్య ప్రయాణం??పదండీ మనమూ చేద్దాం. 28-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8fvo6

Posted by Katta

27, మార్చి 2014, గురువారం

Patwardhan Mv కవిత

సందర్భం--03:: ఇది ఎవరిది ?? ((((మిత్రులందరికీ విన్నపం...మీకు నా ప్రయత్నం-- సందర్భం -దీనికి నేను ఎన్నుకున్న విధానం- నచ్చితే మీ స్పందనను సమాధానం తెలియచేయడం ద్వారా చూపి ముందుకు పోవడానికి సహకరించండి.సమాధానాలు రాకుంటే ఈ శీర్షిక ప్రయోజనం (ఈ రూపంలో) నెరవేరదు కదా!! శీర్షిక ముందుకు పోవడానికి కావల్సింది మీ సమాధానం.మీ సూచనలూ,సలహాలూ నిరభ్యంతరంగా తెలియజేయండి ))))) హలో !! సాహిత్య మిత్రులకు లంగిడీలు!!.అదే--వందనాలు. ఇవాళ్టి సందర్భానికి స్వాగతం.ఇవ్వాళ కూడా నేను ఒక మాంచి కవిత్వ భాగాన్ని ఇవ్వబోతున్నాను.బాబ్బాబూ!క్కొంచేం టైం తీసుకున్నా సరే ఎవరిదో మాత్రం తప్పక చెప్పండి. ఈ సాహిత్య క్రీడకు మీ కోపరెషన్ ఇవ్వండి.లెట్'స్ బిగిన్ నౌ. /////...భవిష్యత్తు ఎలా వచ్చినా --స్వాగతం చెప్పలేను రోగిని రాగిని చేయలేని నర్సులా రేసులో గెలుపొందలేని హార్సులా కళకళల్లాడని ఖాళీ పర్సులా జీవంలేని ఫ్రీవర్సులా వస్తే భవిష్యత్తుకు స్వాగతం పలుకలేను నాయనమ్మలా నడ్డి వంగిపోయి వస్తే ప్రేయసిలా భావించి చేయి సాచలేను రాక్షసిలా లక్షల ప్రాణుల్ని కుక్షిని పెట్టుకుంటూ వస్తే ససేమీ దాక్షిణ్యం చూపలేను. మహారాజులా మొహం నిండా బూజుతో-గతంపై మోజుతో మదగజం మీద అపరంజి అంబారీలో వస్తే దుర్నిరీక్ష హర్యక్షాన్నై అమాంతం లంఘించి ఆ గజాన్నీ,గజారూఢుణ్ణీ అంతం చెస్తాను.////// ఈ వ్యంగ్యంతో కూడిన పలుకుల ములుకులు ఎవరివి??? నాకు తెలుసు...మీకూ సమాధానం తెలుసని.మరి ఆలస్యం ఎందుకు??మీ సమయం మొదలౌతున్నది ఇప్పుడు. 27-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hxDHHI

Posted by Katta

26, మార్చి 2014, బుధవారం

Patwardhan Mv కవిత

సందర్భం 02- ఎవరిది ఇది ?? (ఎపిసోడ్ సమయం 15 నిమిషాలు మాత్రమే) అందరికీ నమస్కారం.మీకందరికీ నచ్చిందనే నమ్మకంతోనే వచ్చింది సందర్భం-02 ఎపిసోడ్.ఇవాళ కూడా నిన్నటి లాగే ఓ కవిత్వ భాగం మీ ముందుంచుతున్నాను. అఫ్కోర్స్..మనకు అంత కష్టం ఏమీ కాదు.ఎవరిదో చెప్పండి. ఇలా పెట్టడం గూర్చి మీరేం అనుకుంటున్నారు? మీ స్పందనేంటి? ////.....ఎక్కడుంది నీ కప్పుడు కనిపించిన సత్యం? ఏనాటికి దొరుకుతుంది దేశంలో నాకు నచ్చిన సజ్జన సాంగత్యం? నీవానాడు చచ్చావు కనుక నిజంగా బతికి పోయావు ....,నువ్విప్పుడు బ్రతికే ఉంటే పిస్తోలుతో మరణం కాదు చిత్రవధ జరిగి వుండేది నీకు చావో బ్రతుకో తెలియని సందిగ్ధ జీవిత సంధ్యా సమయంలో ఊహలూ ఉద్భోధలూ మానేసి నీ అంతట నీవు ఉరి పోసుకుని వుండేవాడివి ....,నువ్విప్పుడు బ్రతికేవుంటే పచ్చి వెలక్కాయల్లాంటి ప్రశ్నల బాణాల్ని నీ గొంతుకు గురి చూసి కొట్టేవాణ్ణి..//// ఎవరివి ఈ తూటాల్లాంటి వాక్యాలు? నాకు తెలుసు .మీరు చెప్పగలరు.కొన్ని గొప్ప కవిత్వ చరణాలు స్మరణ చేసుకొనే ఈ పోస్ట్ మీద మీ స్పందన కోరుతున్నాను.మరి ఆలస్యం దేనికి?మీ సమయం ఇప్పుడు మొదలౌతున్నది. 26-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gCrjuO

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Patwardhan Mv కవిత

సందర్భం:: ఎవరిది ఇది ??? ................. /////......అన్నా నేనొక జ్వాలా వలయితుణ్ణి దుఃఖితుణ్ణి నా లోపల నా బాధలు నా వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా బీభత్సరవాలు నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో సలసల కాగే మానవాశ్రుజలాలు అయినా అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం నా లోపల వినబడుతూ నన్నిలాగ నడిపిస్తూ సృష్టిలోని అర్థం కోసం జన్మలోని సాఫల్యం కోసం జనన మరణాతీతమైన సురభిళ రహస్యం కోసం.......///// ఎవరిదండీ ఈ పద సంగీతం?? 25-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXWwfY

Posted by Katta

Patwardhan Mv కవిత

ఆండ్ ద క్రెడిట్ గోస్ టు::: తెలగాణా రాష్ట్రంబిది దీపించెను సంబరమే తలపంగా గెల్చితిమీ దండిదైన సంగరమే అలనాడూ ఈనాడును అపురూప త్యాగమ్ములు ఇల నెల్లా ఉద్యమాల కివే పాఠ్య భాగమ్ములు ఏరు తెచ్చినారలనీ ఏరలిచ్చినారలనీ వీరలకూ వారలకూ వీరతాళ్ళు ఎందుకనీ పేరుపేరునా రాయగ పెద్దకావ్య మౌను కదా భూరి ప్రజాశక్తే గెలుపొందె నంట మేలు సదా అందరినీ కల్పినదీ అందరినీ మల్పినదీ అందరినీ ఒక్క బాట యందుననే నిల్పినదీ అందిందన నేల దాని నఖిల ప్రజా మూర్తినీ అందులకే ఉద్యమాని కర్పించుద మీ కీర్తిని 24-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qoCD

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Patwardhan Mv కవిత

ప్రేమిస్తా రా ?? మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది..మన మాట వారికి నచ్చట్లేదనీ,ఎప్పటికీ నచ్చదనీ. అర్థమౌతూనే ఉంటుంది మన ఉనికి వారికి కష్టమైందని,ఎప్పటికీ ఇష్టం కానిదనీ. మన స్పర్శ వారు భరించలేరని,ఎప్పటికీ అసహ్యమైనదనీ. మనను అక్కడకు రాకుండానే చూడాలనుకుంటారని,ఎప్పటికీ రానివ్వరనీ. వారి ప్రతి ఆలోచనా మనకు ఐమాక్స్ స్క్రీన్ మీద కనబడుతూనే ఉంటుంది. మనల్ని కొలిచే కొలమానాల శిలాజాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటవి. చాలాసార్లు నిగూఢంగానూ,ఒక్కోసారి కాసింత బహిరంగంగానూ శిశిరంలో ఆకుల్ని మాత్రమే రాల్చి కాదు చెట్టు నగ్నమయ్యేది,ఆలోచనల్ని కూడా! వారు మన ప్రతి పద ముద్రల వెనకాల వెదికేదేంటో మనకు తెలుసు వారు మనను చిత్రించే చిత్రవర్ణ మర్మమేమిటో తెలుసు వారు మన గాలిలో శ్వాసించే గంధక ధూమమూ తెలుసు వారు మన చుట్టూ అల్లిన చీకటి సాలెగూళ్ళూ తెలుసు. వారి అభావ,విభావ,ముభావ స్వభావాలకీ మన చేతుల్నించి దారం తెగిపోయిన గాలిపటం లాంటి కారణమూ తెలుసు అయినా విచిత్రం !విస్ఫోటించిన ఆవేదన విరామాన్ని ఎరుగకముందే మన మొహం మీద నవ్వు నెలవంక మొలుచుక వస్తుంది. అంతకంతకూ వారిపై మోహం పెరుగుతూనే ఉంటుంది వారిని ఒక్క సారైనా ముద్దాడి పోవాలనే వ్యామోహమూ పెరుగుతూ ఉంటుంది మనల్ని మనం జీవ నదిగా మార్చుకున్నప్పుడు అన్నింటినీ కల్పుకొని ముందుకు సాగిపోవడమే కదా మనకు తెలిసింది. నిస్సహాయులం ప్రేమించడం మన జీవ ధాతువు. 22-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73tSP

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

కవి :::::: దేశానికి ఒక జాతీయ పతాకం జాతీయ గీతం చాలు కానీ ప్రతి పౌరుడూ జాతీయ కవి కావాలి మానవ జాతీయ కవికావాలి. అవును-కవి కల గనేది ఒక నిస్స్వార్థ ప్రపంచాన్ని ప్రపంచం కలగనేదీ ఒక నిస్స్వార్థ ,,నిఖార్సైన కవిని. 21-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2XU

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

కౌమార సంభవం :::: తనకు తానే అపరిచిత సందర్భాల్లోకి విసిరేయబడుతూ...... ****************************** నిన్నటి దాకా మీటిన సుశీల పాటలా సారవవంతమైన స్వర కేదారంలో పడ్డ గరగరల మొరం మొరాయింపులను బాల్యానికీ తనకూ సరికొత్త సన్నని కంచెలా మెల్లగా వరుసలో మొలుచుకొస్తున్న నూనూగు నలుపు మొలకలను మంచుఫలకంలా మిలమిల లాడే మొహం మీద తరచి చూసినా సరైన సమాధాలు దొరక్క ముటముటలాడుతున్న అసహనాల మేటలను. రహస్తంత్రులు రాత్రి చేసిన అస్పష్ట రాగాలాపన తన ప్రమేయం లేకుండానే రాల్చిన చిత్తడి స్వప్న భూపాలాలను నీలి బాటిళ్ళ బిరడా చీల్చుకొని పొగ లేని సెగ లాగా నిండిన మగతనపు మొనగాళ్ళ మాటల మోహ మాధుర్యాలను ఎవరిని ఎలా అడగాలి ఈ అసంకల్పిత ప్రతీకారచర్యలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను. నాన్న చెప్పడు కదా ! పాపం ! అమ్మాయి కాదాయె అమ్మ కొన్నైనా చెప్పడానికి ముడులను విచ్చుకుంటూ,ముళ్ళను కుచ్చుకుంటూ కుమారుడు. తొలకరి వాగులో తడబడి పడి ఈదుతూ కుమారుడు ! 07-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NFYOjz

Posted by Katta

2, మార్చి 2014, ఆదివారం

Patwardhan Mv కవిత

నిరంతరం కవిత్వం కోసం తపించే మిత్రులు కవి యాకూబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NI7mWM

Posted by Katta

Patwardhan Mv కవిత

అంతర్జాల కవిత్వం రెండవ శ్రేణికి చెందిందా??? నేను పెద్ద సిధ్ధ్దాంత చర్చలను చేసేంత స్థాయిలో లేను కానీ మిత్రులారా తోచింది మీతో పంచుకుంటున్నాను.ఈ అంతర్జాల కవులూ అంటూ-- మనను ఒక ప్రత్యేక తెగగా గుర్తించడం /////వివక్షించడం మీకు నచ్చుతుందా?నాకైతే లేదు. 01)మామూలు కవులకూ-మనకూ ఏమైనా తేడా ఉందా?? పదే,పదే కొందరు ఈ అంతర్జాల కవులు అంటూ ప్రస్తావించినప్పుడు ఇదే అనిపిస్తున్నది. 02) కేవల ముఖ పుస్తకాన్ని వాడుకోవడం తప్ప మామూలు కవిత్వానికీ--మన కవిత్వానికీ ఏమైనా ఏమైనా తేడా ఉందా? 3) నాలుగు ఆంగ్ల పదాలూ,నాలుగు బూతు మాటలు రాయడం -- ఏం కేవలం అంతర్జాల కవిత్వానికీ మాత్రమే సొంతమా??? నిజానికీ మన కవిత్వానికీ ఇవి ఎంత వరకూ పోషకాలుగా ఉంటున్నాయి? నాకు పిండీకృతార్థంగా అర్థమైంది ఏమంటే "స్వీయ నియంత్రణ లేదు అంతర్జాల కవిత్వానికి"" అన్న కారణంగా కొందరు దీన్ని తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు.ఈనాటి కవి పొందుతున్న స్వేచ్ఛ వారిని నివ్వెర పరుస్తున్నది. మనమూ మరింత బాధ్యతాయుతంగా రాయాల్సి ఉంది. మరి మీరు ఏమంటారు? నేను చెప్పింది సక్రంగా ఉందా?లేదా?దయచేసి చెప్పండి. కోపం వస్తే మరీ సంతోషం. 02-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWyDzO

Posted by Katta