పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Sasi Bala కవిత

ఆరాధన.......శశిబాల ..................19 feb 14 ........................................ నా వేదన .ఎద నివేదన నీపై నా ఆరాధన తెలుపలేను భాషలో మిగలలేను భావనలో నా ఊపిరి నీవేనని నా గమ్యం నీవేనని నా తపన నీకని హృదయ ఘోష నీకొరకని నీకు తెలియచేసేందుకు కాను కాను నేను కవిని వేయలేను నీ చిత్రాన్ని భాషకు అందని నా భావాలను తెలుపగలను కనుపాపతో చూపగలను మౌనముతో.........

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0nWHr

Posted by Katta

Gangadhar Veerla కవిత

కొలువులు అనేకం ...................... కొన్ని కలుపుగోలుతనాలు మరికొన్నికలగలపుతనాలు ఒక్కో చోట.. అందంగా లభించే ముత్యపు చిప్పల్లోని స్నేహాలు మరింకో చోట.. కొంతకాలం బంధాలు మరికొంతకాలం.. అరమరకలు లేని స్నేహాలు..! కొంత గురుసాంగత్యం మరికొంత అన్నదమ్ముల అనుబంధం జీవిత పోరాటంలో..చేసే కొలువులు మారుతుంటాయి పరిచయ రూపాలు మారుతుంటాయి బంధాల్లోని అనుభవాలు మాత్రం అవే విడిచిన నేలపై వదిలిపెట్టిన పరిమళాలను మరోసారి వెదుక్కుంటూ వెళ్ళడం కష్టమే కానీ, అప్పుడప్పుడు.. ఆ వాకిట.. ఆ అనుభవాలు మిగిల్చిన మనసుల్ని, మనుషుల్నిమర్చిపోవడం సాధ్యం కాదు కొలువులు అనేకం గుప్పెడంత స్నేహం అందించిన.. మనుషులు, మనసులు మాత్రం పరిమితం..!! (చేసిన కొలువుల్లో మనసులో మనసై నాతో మసిలిన స్నేహసుమాలకు ప్రేమతో) 19 ఫిబ్రవరి-2014

by Gangadhar Veerla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0f4l3

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు// Dt.19-2-2014 కరిగి పోయిన కాలాన్ని గాజు జాడీలో భద్రపరచాను పరుగెత్తే కాలంకాళ్ళు తగిలి పగిలిపోయింది ఆ జాడీ ఏమైందీ కాలానికి పరిగెడుతోంది నడక నేర్చుకుంటున్న నా ప్రేమకు చేయందివ్వ కూడదూ!

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVG7lO

Posted by Katta

Aruna Naradabhatla కవిత

వెలుగులోకి సూరీడు ____________________అరుణ నారదభట్ల అరవై యేళ్ళుగా మునిగిన సూరీడు అడ్డుపడే గ్రహాల చాటునచీకటై కూచున్నాడు! ఎన్ని త్యాగాలో...ఎన్ని ఆత్మ బలిదానాలో ఇంకెన్ని మూగబోయిన గొంతుకలో ఇప్పుడే మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి! ఎన్నేళ్ళనుండో...ఎన్ని గొంతుకలో ఎర్రకోటను ఆశ్రయించి... పదమంటూ రోడ్డెక్కి వంటావార్పులను...బతుకమ్మగ తీర్చిదిద్ది వేదికలెక్కి గుండెగోడు వినిపించాయి! మన నీళ్ళూ..మన నిధులూ... మన కొలువులు...మన బతుకులంటూ తిండీ నిద్రలు మానీ.... నిరసించీ...నీరససించినా మన గడ్డ నినాదమే మన బాధ్యత అనుకుంటూ పదవులు పక్కనబెట్టీ... పదపద మని అడుగులేసి కాళ్ళిరగదన్నినా కదం తొక్కి మాటలు..పాటలు...ఆటలతో ధూం దాంగ నాట్యమాడె మన పల్లెలు! ఉస్మానియ క్యాంపస్సూ ఊబిలెక్క మారి పోయింది ధర్నా చౌక్ రోజూ దద్దరిల్లి పోయింది.. అసెంబ్లీ...పార్లమెంటు... అరుపులతో అడుగంటిపోయినై! ఉరితాళ్ళు ఏడుస్తున్నాయి... ఉత్తరాల్లోని లక్ష్యం చూసి కంటినీరు ఆగని ప్రవాహమైంది... ఊపిరీ బిగబట్టింది విషవాయువులకు బలైపోయి! రబ్బరు బుల్లెట్లన్నీ రక్తంతో తడిసిపోయాయి! బొక్కలన్ని పెళుసైనై... విరిగిన కట్టెల సాక్షిగ! రాస్తారోకో మంటూ.. రోడ్డెక్కి అడ్డుకుంటే... బొక్కలో తోసి కేసులు ఎత్తేయకుండ.. మళ్ళిమళ్ళి తన్నినా మాట్లాడలే మా భూమి కోసం! రైలు రోకొ...బస్సు రోకొ...కారు రోకొ...కంచరగాడిదనూ..రోకోమంటిమి! నిరాహారదీక్షజేసి. ప్రాణాలను పణంబెడితె నిమ్మకాయ నీళ్ళిచ్చి సరేలే ఇస్తామన్నది... ఇటలమ్మ...ఇడ్లీలాంటిమనసుతో... పుట్టినరోజుకు గుర్తుగ...తెలంగాణ! కమిటీలూ..కసరత్తులు కహానీలు చెప్పినా కలుపుమొక్కలన్నిజేరి.. కలిసుందామని సమైక్యపోరు చేసినా ఎలగబెట్టిన అరవైయేళ్ళు చాలు.. మాకొద్దూ..అనేట్టు చేసుకుంటిరి... మన సీమాంధ్రా నాయక అన్నలు! విడదీయరాని బంధం మనదైనా విడిపోక తప్పలేదు! ఒక్క ఇల్లుగా ఉన్న ప్రాంతం ఇప్పుడు పక్కింటిలా మారింది! ఎన్ని కోట్ల గుండె తడ్యో వర్షమై కురిసి తెలంగాణ చల్లబడ్డది వెన్నెలంటి పండగ జరుపుకుంటోంది! 19-2-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRAosN

Posted by Katta

Tarun Chakravarthy కవిత



by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oRYP1S

Posted by Katta

Siddenky Yadagiri కవిత

గెలిచిన కల వతందారి నేలను వల్లకాడు జేసిన ఆరున్నర దశాబ్ద అక్రమ పాలనకి ప్రజాక్షేత్ర స్మశానంలో తల గొర్రాయి తగులుకొంది బతుకుల్ని చిదిమిన చరిత్రలో రాలిన వేల పానాల పానదుల సాక్షిగా అమరులు అల్లిన సర్వుగంప పరువుతో నెత్తికెత్తుకొంది ప్రజాస్వామ్యం ప్రజాకంటకం దుర్మార్గపు ఏలుబడి దురంతం దురాలోచన పేక మేడల్ని కన్న తల్లుల కడుపుకోత శోక ప్రవాహం సునామి అలల శక్తితో సులువుగా ఇనుప సిమ్హాసనాన్ని కూలదోసింది కాలం కత్తి కొన మీద కాంతిరేఖ నిలుప నాలుగు వందల మంది జీవర్పన నైద్యం మలిదశలో వినిపించిన మరన వాంగ్మూలాలు 'జై తెలంగాణ ' నినాదపు దేహ దహనపు మంటలు శిథిల చరిత్ర శకలాలై రక్తాక్షరాలు ముద్రించిన బిల్లు పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర శాసనం మోరపారకం మోసంతో పంటకు జీవిగంజి పొయ్యని నీళ్ళు దప్పిక గొంతుల్ని తడపని నీళ్ళు దాహార్తి తలరాతల్ని మార్చేందుకు పరవల్లు దొక్కాలి అమరుల ఆశయ సాధనలో అవినీతి రహిత భవితను బహుజన ప్రజాస్వామ్య తెలంగానం బహుచక్కగ నిర్మిచుకోవలే ... .

by Siddenky Yadagiri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRuTKD

Posted by Katta

Nirmalarani Thota కవిత

కనుదోయేమో కన్నీటి చెలిమలా నిండి ఉంటే నువ్వేమో పెదాలపై చిరునవ్వుల ఊసులు చెపుతావు .. జీవితమేమో విడలేని విధి శాపంలా ఉంటే నువ్వేమో మనసు జత చేసే ఊసులు చెపుతావు . .! మనసు పరితపిస్తున్నా మనసు కలపలేని స్థితిలో. . ఏమీ చేయలేని అశక్తతలో నేనుంటే . . మది గాయం ఇంకా మానని స్థితిలో నేనుంటే. . మరో గాయానికి పురిగోలిపే ఊసు నువ్వు చెపుతావు. . ! కనుదోయేమో కన్నీటి చెలిమలా నిండి ఉంటే నువ్వేమో పెదాలపై చిరునవ్వుల ఊసులు చెపుతావు .. ! ! ఈ లోకమంతా ప్రేమలో ఎలా ఓలలాడుతూ వుందో . .. ఒకరికొకరనే భ్రమలో మునిగి తేలుతూ వుందో . . గుండెల్లో ఆవేదనై రగిలే జ్వాల ఆరేలోపే మళ్ళీ తీరని మంటరేపే ఊసు నువ్వు చెపుతావు . . ! కనుదోయేమో కన్నీటి చెలిమలా నిండి ఉంటే నువ్వేమో పెదాలపై చిరునవ్వుల ఊసులు చెపుతావు .. వలపుల వాకిళ్ళు నేను కలగంటే కనుల కింది నీడలే నాకు మిగిలాయి . . సందోహపు సాయంసంధ్యలు నేను కోరుకుంటే ఒంటరితనపు నిశి రాత్రులే నాకు దొరికాయి . . ఎటు చూసినా స్థబ్ధపు పొగ మంచే కమ్ముకొని ఉంటే మరులు విరిసే వసంతపు ఊసు నువ్వు చెపుతావు. .. ! కనుదోయేమో కన్నీటి చెలిమలా నిండి ఉంటే నువ్వేమో పెదాలపై చిరునవ్వుల ఊసులు చెపుతావు ... ! ! { ఆంఖ్ హై భరీ భరీ . . అనువాదం . . Tumse achcha koun hai movie . . Alka Yagnik } నిర్మలారాణి తోట [ తేది: 19.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvdFL9

Posted by Katta

Kavi Yakoob కవిత

కలుసుకుందాం రండి !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRjDhj

Posted by Katta

Chi Chi కవిత

_ భాదల్స్ _ ఒంట్లో మూడొంతుల మట్టి భాదల్ని ఒక్కొంతు నీరు మింగలేక కక్కే కన్నీటిలో ప్రపంచమంతా ప్రతిభింభంగా నిత్యం జారిపోతూ శోకం ఆవిరైపోతున్నా హృదయం తాలలేని సంకుచితాలెన్నో నిత్యం నీరూర్చుతూ శోకాన్ని బతికిస్తూనే ఉన్నాయి!! కన్నీటి రుచి తెలుసా అంటే!! ఏమో రకరకారణాలు అకారణంగా ఏడ్చే రకాలుకూడా పుట్టకముందూ , చచ్చాక కూడా ఉండే బ్రహ్మాoడమే బతుకని తెలిసాక కూడా సౌభాగ్యమనే భ్రమ చుట్టూ మతి తిరుగుతూ మాటవరసకి మనిషైపోడం దౌర్భాగ్యమే !! ఎలా ఉంటాయవి!! కళ్ళకి చప్పగా , నాలుక్కి ఉప్పగా , చంపలకి చల్లగా గుండెకి బరువుగా , బుర్రకి గురువుగా , నలుగురికీ నవ్వుగా పారిపోయే ప్రతి బొట్టుకో చరిత్రున్నా లేకున్నా నిలువెత్తు ప్రశ్నకి సమాధానాలుగా సందర్భోచితంగా సాగిపోతూనే ఉంటాయి!! hello!! బాగున్నా..అంతా బాగున్నాం.. అన్నీ బాగున్నాయి.. మీరెలా ఉన్నారు మీకేంటి.. ఎలా ఉన్నా బాగుంటారు..మాకన్నా మీరే బాగుంటారు మాదేం బాగు లెండి.. బాగుండండి.. ఉంటాను మరి.. రెండు వైపులా ఒకే బాగు .. ఒకే భాద పంచుకుంటే ప్రేమంట.. ప్రేమిస్తే భాదంట.. భాదుంటేనే బాగంట భాదున్నా బాగున్నా ఏడుపేనంట!! ఒంటర్ల ఒంటరైన సృష్టిలో జంటలు కూడా ఒంటర్లే అంటే ఒప్పుకోరే!!అందుకే భాద పోలికల politicsలో అన్నీ గెలవాల్సిందే జనాల జాడ్యం!! భాదల్లో కూడా పోల్చుకుని చస్తారెందుకో బూడిదగొట్టు bodyలు మళ్ళీ మొండాలకి ఓదార్చే ముండమోపులు కావాలి ఇక జూస్కో!! bolo bolo bolo bujji kyaa భాదా హై!!అంటూ వచ్చేస్తారు పెంచుతారో , తగ్గిస్తారో తెలీదు కానీ ఓదార్పు పేరుతో వాళ్ళ అనుభవాల సినిమా చూపించి వాళ్ళే whistles ఏస్కుంటారు ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే పొరపాటుగా కూడా భాదల్లో ఉన్నోళ్ళు ఇంకో emotion express చేయకూడదు ఓదార్చే వాళ్ళ స్వేచ్చకి భంగం కలిగిస్తే మళ్ళీ వాళ్ళు కూడా భాదపడతారు అప్పుడేం చేయాలో అర్థం అవక ఇంకో భాదకి doors open అవుతాయి!! so..భాదను మింగో , మర్చిపొయ్యో , తీరిగ్గా ఓదార్పు తీస్కుని వాళ్లకేవైనా భాదలోస్తే వెళ్లి same protocol అమలుపర్చేయాలి!! ఏదైనా ఉంచుకుంటే ఉంటుంది , తెంచుకుంటే పోతుంది భాద మాత్రం ఉంచుకుంటే పెరుగుతుంది , తెంచుకుంటే మిగుల్తుంది మనసు మార్చుకున్నా మరచిపోలేం..మనిషిపోవాల్సిందే!! ___________________________________Chi Chi (19/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRjAlE

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

నువ్వు అనుకుని పుట్టలేదు నీ అమ్మ నాన్నలకు వాళ్లకు తెలియదు వాళ్ళ బ్రతుకు తెరువు ఎక్కడో ప్రాంతాలతో అనుబంధం సహజమే పరిసరాల మీద ప్రేమ అంగీకారం రేపు మన జీవనం ఎక్కడో తెలియదు ఎందుకు నీది నాది అనే భావం అంతా మనదే సోదర .. అందరు నావాళ్ళే అనుకోరా నీకు సహాయ పడేది నీతోటి వాడే స్వార్ధ పరుల రాజకీయాలలో బలికావద్దు సర్వ మానవ సమానత్వం పెంపొందించుకో !!పార్ధ !!19feb14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N9Ubxs

Posted by Katta

Jagaddhatri Dhaathri Jagathi కవిత

జగద్ధాత్రి ||అసంబద్దత || కొన్ని సార్లు అంతే ఎవరూ నిందకు పాత్రులు కారు అయినా కొన్ని వదులుకోవాలి కొన్ని మరిచి పోవాలి కొన్నిటిని గుర్తు చేసుకోకూడదు మరి కొన్నిటిని దూరంగా పెట్టాలి ఆత్మ ద్రోహం చేసుకోవడం కన్నా ఆత్మీయులకు దూరంగా మెలగడం మంచిది కదా అవతలి వారు అర్ధం చేసుకోలేదని బాధ పడేకన్నా మౌనంగా మిగిలిపోవడం ఉభయ శ్రేయస్కరం కదా ఎక్కడినుండో వచ్చి చుట్టూ ముట్టిన సుడి గాలిలో అనుకోకుండా చిక్కుకుని అతలాకుతలమైన మనసును ఆత్మ పరిశీలన తోనే కదా సేద తీర్చుకోవాలి ప్రమాదం కన్నా ప్రమాదం నుండి వెంట్రుక వాసి లో తప్పించుకోవడం కూడా ఎంతో భీతిని మిగులుస్తుంది దశాబ్దాల అనురక్తి ముందు అర్ధం లేని అనుతాపం నిలబడగలదా కొన్ని అంతే సుడి గాలులు వీస్తాయి .... వాటినుండి తప్పుకోవడం మన ఇంగితం అంతే తప్ప దేనిపైనా కోపగించుకోలేము అక్షరాన్ని అన్యా క్రాంతం చెయ్యడం కంటే ఆత్మ హత్యా సదృశం మరొకటి ఉందనుకోను అనుబంధాన్ని బలి పెట్టి అసంబద్దాన్ని కోరుకోలేను ...............................................జగద్ధాత్రి 3.50 పి.ఏం . 28/05/2013 మంగళవారం

by Jagaddhatri Dhaathri Jagathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1huOCb5

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||కుక్కిరాత|| పిల్లలు ఏడుస్తారు, అయితే ఏంటి? కాసేపయ్యాక తేటగా నవ్వుతారు. ఆకులు రాలిపోతాయ్,. అయితే ఏంటి? కాలం గడిచాక, చిగురాకులు పుట్టుకొస్తాయ్. కుక్కలు మొరుగుతుంటాయ్, అయితే ఏంటి? కొద్దిసేపటి తరువాత, గొంతలసి మూలన మునగదీసుకుంటాయ్. రాష్ట్రాలు విడిపోతాయ్, అయితే ఏంటి? పిల్లలు ఏడుస్తూనేవుంటారు, లంచగొండులు లక్షణంగా బతికేస్తుంటారు, రాజకీయాలు ఎప్పటిలానే ముండమోస్తు నడుస్తుంటాయ్. ఆకులు రాలతూనే వుంటాయ్,. శోకాల్లో రాగాలు తగ్గిపోతాయ్,. ఆనందాలు ఆవిరైపోతాయి. కుక్కులు మొరుగుతూనే వుంటాయ్. మారని మనుషులు కొత్తకొత్త సమస్యలను వెతుక్కుంటారు, లేదా సృష్టించి సంతృప్తి పడుతుంటారు. చానల్ల చర్చలు చెవుల్ని హోరెత్తిస్తూనే వుంటాయ్. కవులు అలానే రాస్తుంటారు. ఓపికున్నోళ్లు చదువుతుంటారు. ఏది పట్టని కష్టజీవులు బతుకీడుస్తుంటారు. ఎంత కాలం గడిచినా,. ఏ మార్పులు వుండక, మళ్లీ కలిస్తే ఏలా వుంటుందోనన్న ఆలోచనలు వస్తాయ్. కుంటి నడకల హొయలు సాగుతూనే వుంటాయ్. ముక్కలైతే కాని చెట్టు, కట్టెలై కాలిపోదు. గుర్తుకొస్తు సెగలై తగులుతూనే వున్నా,. రాష్ట్రాలు విడిపోతాయ్,. అయితే ఏంటి? -----------------------------------------19/02/2012

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQBwNf

Posted by Katta

Srikanth Kantekar కవిత

కొత్త అసందర్భం.. ----------------- అస్పందన అద్దుకొని.. మౌనాన్ని తృప్తిగా పుక్కిలించాలి రాయడం వ్యసనమో..పిచ్చో అయినప్పుడు ఇ.. న్ని.. అక్షర పుక్కిలింతలెందుకు? మార్మిక కాలం మంత్ర దీక్షకు మౌనం ఒక కంకణమవ్వాలి పొడి పొడి అక్షరాలతో తడి ఇసుక ఒడ్డును చదును చేసి .. కెరటాలు మోహించే రెండు పేర్లను రాసి.. ఇక అంతర్థానం కావాలి చేరని అదూర తీరంలో చెరిగిపోని అమర స్పర్శగా..!! - శ్రీ..

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bKSq5N

Posted by Katta

Santhisri Santhi కవిత

All are invities..!

by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQh4Mz

Posted by Katta

Lugendra Pillai కవిత

కరణం లుగేంద్ర పిళ్ళై //పోగాలం దాపురిస్తే...// పచ్చగడ్డి వేసినట్టే వేసి ఇద్దరి మధ్యా మంట పెట్టగలరు పచ్చని జీవితాలను వివాదాల ఊచలకు ఉరివేయగలరు పోగాలం దాపురిస్తే పుట్టేవి వంకర బుధ్ధులే మరి బతికి వున్నప్పుడే శరీరాన్ని ఆత్మను వేర్వేరు చేయగలరు ఎప్పటికయినా వేరే కదా అనే వేదాంతాన్ని చెప్పగలరు వినాశకాలే విపరీత బుద్ధంటే ఇదే మరి గజం కూడా వదలక వేల ఎకరాల గనులను తినేసి వాతాపి జీర్ణం అంటూ నేనేమి ఎరుగ అని అనగలరు భూమినాది అనిన భూమి ప్రక్కున నవ్వు మరిచారు మరి సిద్ధాంతాల వల్లె వేతలో సిత్రాలెన్నో చూపెడతారు సిత్రంగా తామే వాటిని కాలరాచి ఏకో నారాయణా అంటారు ఏకాభిప్రాయమంటే ఏక వ్యక్తి అభిప్రాయమట మరి చీమంత కూడా ప్రగతి కానరాకున్నా తామంత గొప్పవారం లేరంటూ చాటింపు వేసుకోగలరు పదవి కోసం ఎంతకైనా సరే దిగజారుడు నేర్చిన పాకుడిది ఎంతటి ఘనులంటే ఏలిన వారు వారసత్వం ఉనికి కోసం ఉసురు తీసినా ఊరినంతా ఉద్దరించినట్టు పోజులిచ్చే నటనా వైభవమిది ఎంతటి గొప్ప వీరులంటే పాలకులు స్వంత జనంపైన యుధ్దాలు చేసి బాంబులేయగలరు కంట్లో కారం చల్లి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించడమిద ఈ ప్రభుత్వాల కు కళ్ళు లేవు .. ఈ పాలకులకు వినే చెవుల్లేవు ఏమంటే న్యాయదేవతకు మాత్రం వున్నాయా అనగలరు మరి తుమ్మితే ఊడిపోయే ముక్కుచందం అయినా తుమ్మే రాదు ..............తుమ్మేవారేలేరు... కర్ర వంపు తీర్చేది పొయ్యే కదా ఒకరి కడుపు మంట మరొకరికి భోగి మంటగా మారుతోంది అదిగో ఎన్నికల నగారా మ్రోగుతోంది.. మోసపుచ్చేందుకు ముఖాలు మార్చుకుంటూ సిద్దమవుతున్నారు జాగ్రత్త సుమా 16/2/14

by Lugendra Pillai



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVNrSj

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

అయిపోయిన దానిని మనం మార్చలేనప్పుడు అందరు బాగుండాలని కోరుకుందాం.. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుందాం.. అక్కడా ఇక్కడా అందరూ "మన" వాళ్ళే కాబట్టి "మన" సోదరులు సుఖంగా ఉండాలని ఆశిద్దాం.. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోని కొట్టుకోని శాపాలు పెట్టుకోని మన మద్యన ఉన్న సఖ్యతని పోగొట్టుకోని శత్రువులవకుండా మైత్రీ బంధంలోనే మెలుగుదాం.. తెలుగు వెలుగులను లోకానికి పంచుదాం. తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటుదాం. ప్రాంతాల గోడలు మాకడ్డు కాదంటూ రాజకీయ నాటకాలు నన్నాపలేవంటూ.. నరనరానా నాన్న పంచిన ధైర్యాన్ని దట్టంగా పట్టించి కణకణానా అమ్మ పెట్టిన గోరుముద్దల ఆపేక్షలు అరచేతిన పట్టుకుని సాగుదాం ఎవరూ ఆపలేని ఎవరూ అడ్డుకోని ఆశావహు ప్రపంచంలోకి.. అక్కడ నేనుంటా.. నువ్వుంటావ్.. ఇంకెవరూ ఉండరు.. మనం పంచుకునే తియ్యని తెలుగు మాధుర్యాల మంచు తేనెలు తప్ప.. రా సోదరా.. ఈ కుళ్ళు లోకంలో మనకింక పని లేదు.. మట్టి మట్టిగా మిగిలిపోకముందే మన లోకానికి తెచ్చెయ్.. పసిడి పంట కోతకెళ్ళే లోపు చీడపురుగుల అంతు చూద్దాం. తెలుగు వెలుగులను లోకానికి పంచుదాం. తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటుదాం. - సాట్నా సత్యం

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MbSnU1

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || స్త్రీ గురించి || ఈరోజు ఎందుకో ఆమె స్త్రీ గురించి రాయమని అడిగింది నాలో లేనిది నేను కానిది నన్నేమని వ్రాయమంటావ్ అని అడిగిన కళ్ళను తన చేతులతో మూసి ఇప్పుడు నీ లోనికి చూసి వ్రాయి అంది అమ్మ పాలు తప్ప మరేమీ రక్తంలో లేనపుడు అనురాగాన్ని నింపుకున్న ఒక పరిపూర్ణ స్త్రీని నా పసితనాన స్పర్శించిన అనుభూతిని ఆ ప్రేమ ఇంకా నాలో ప్రవహిస్తూ ఎవరినో నింపాలని ప్రయత్నిస్తూ గాయపడిన చోటే చిగురిస్తున్న ప్రతీ సారీ ప్రసవ వేదన పడుతున్న ఆడతనాన్ని నా హృదయం అచ్చం అమ్మలా నన్ను నన్నుగా నగ్నంగా పైట వెనుక దాయడాన్ని నెమ్మదిగా నన్ను నేను తడుముకుంటూ గమనించాను ******* ఒకే తాళితో రెండు దేహాలను కలిపి కట్టినప్పటినుండీ ఆమె నాలో తల్లిని వెదుకున్నపుడూ నా ఒడిలో అనురాగాన్ని త్రాగగలిగినపుడూ నేను స్త్రీని కాక ఇంకెకవ్వరు..? స్త్రీ గురించి రాయడం నాలో ఎప్పటికీ పూర్తవ్వదేమో మీ చాంద్ || 19.Feb.14 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bKCssj

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

నంద కిషోర్ కు జన్మదిన శుభాకాంక్షలతో కాశిరాజు ||ప్రవహించు జననం || నీట్లో తేలి ప్రవహించే గుర్రపుడెక్క గుంపులాగా మనదే మంచి స్నేహం నువ్వటూ, నేనిటు అన్నట్టు మాటాడుకుని పనుందిరా పోవాలి అని చేతిలొదిలేస్తూ దగ్గరవుతాం మనం అచ్చం గుర్రపుడెక్క గుంపుల్లాగే బరిస్తాం కొన్ని మాటల్ని బరువుగా గుండెని గుద్ది , బరువుగా కొన్ని నిందల్ని మనమీద చల్లిపోయాక ఒరేయ్ సూరిడా నువ్వు స్నేహంలో ఉదయించాకే నా రాత్రులకి పాటలు నేనాడితే వంకతెచ్చి పాడితే గొంతెత్తి పాటలయ్యాక ఇంకేందిరా అని పోనుపెడుతూ తరగని మాటేదో వదిలేస్తావు ఆ గొంతులోని లోతులకి నా గుండెని ఒంపేస్తాన్నేను. మాటలే మనమధ్య జననమయ్యాక మాటాడుకుందాం చివరి శ్వాసకి చేరేవరకూ

by కాశి గోవిందరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e62d0t

Posted by Katta

Sita Ram కవిత

☼ఉదయ్ వెన్నెలనొదిలిపోయానిలా మల్లీ తిరిగి వచ్చేదెలా కాలం గడిచిపోతోందిలా నీతో గడిపిన క్షణమే అలా తొలిగిన మబ్బులో చూడగా నిజముగ నాలొ నీవే కదా ఒకసారి నన్ను కరుణించలేవా ఋణపడిపోతా ప్రతిజన్మకి నీకై నీకై నా పంచ ప్రాణాలైనిస్తినే నీకై నీకై నా ఈ జన్మ రాసిస్తినే నీవే నీవే నాతో సావాసాన్నె విడిచావుగా ఐనా ఐనా నా ఈ మనసు నేదేనుగా............... నీతలపే నాలో తరగని భాధ నాలో ఎందుకీ అలజడి కలసిన ఇన్నేళ్ళ మనకలయికలో చిరునవ్వుల క్షణమే గుర్తేలేదా నీకై పూచినీవెన్నెలా వద్దనిపోతేనే ఎలా నీకొరకే నేవేచి చూస్తూ కరిగిపోయేను కన్నీరులా 18-feb-2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gDBwFg

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ePtGU6

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి||దగాపడ్డ గుండెలు|| భంగపడ్డ బిడ్డలారా దగాపడ్డ తమ్ములారా బెంగ పడకండి ! విడిపోతే పడిపోతామేంటి ? ఐనా ఎగసే ప్రతికెరటం పడే లెగుస్తుందిగా! అణుబాంబు మీదపడినా చిగుర్లు చిగురించలేదా ప్రగతిలో పయనించట్లేదా! కష్టపడే గుణం కల్గినోడివే తెలివైన బుర్ర ఉన్నవోడివే ఉప్పెన్లెన్నొచ్చినా లెక్కచేయనోడివే!! ఒక బిడ్డను నవ్వించడానికి రెండో బిడ్డను ఏడిపించిన సవతితల్లి ప్రేమకు మధనపడకు! నీకేం కావాలో అడక్కుండా ఉరికొయ్యకు వేలాడేసిన పెద్దరికానికి పెద్దగా విలువనివ్వకు! పగబట్టినట్టు కాటేసిన కాలనాగుల కర్కశకోరలకు చిక్కినందుకు చిన్నబుచ్చుకోకు ! ఆఖరి నిముషం వరకూ ఆశపెట్టి వంతపాడిన తోడుదొంగల్ని తలచి అతాశుడివై మిన్నకుండిపోకు! లే తమ్ముడూ లే.. లేచి నిలబడు నీ జాతి నీకై వేచిచూస్తోంది.. ఎవడి పాపాన్ని వాడికే వదిలేసి కర్యోన్ముఖుడివికా.. నీ బిడ్డలను రక్షించు వాళ్ళ ఆశలను బ్రతికించు ఇంకెప్పుడూ విడిపోని పడిపోని మరో రాజ్యాన్ని నిర్మించు.. కాదన్నవాడి కళ్ళుభైర్లు కమ్మేలా నువ్వేంటో రేపు నిరూపించు !! >--బాణం-> 19FEB14 ( తెలంగాణా ఆకాంక్ష నెరవేర్చడం తప్పుకాదు ... ఆంధ్రా గోడును వినకుండా భరోసా కల్పించకుండా విడగొట్టిన పాపం మాత్రం ప్రబుత్వ పెద్దలదే ... సీమాంద్ర ప్రజలకు బాసటగా నాలుగు మాటలు ... )

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MxQ6Dg

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /ఇంకొన్ని జ్ఞాపకాలు ---------------------------- నేను గదిలో ఒక్కడినే కూర్చున్నప్పుడు సముద్రమంత నిశబ్దం అలుముకుంది నా చుట్టూ నేనెక్కడొ అగాధంలో పడిపోతున్నట్టుగా కొన్ని ఆలోచనా సరళ రేఖలు నా ఖగోళంలో గీసుకుని వాటి మీద నడుస్తున్నప్పుడు దూదిమేడలా నేను కూలిపోతున్నపుడు నాకు ఆసరా ఇస్తూ ఇంకొన్ని జ్ఞాపకాలు ప్రహరీలా నిర్మించినపుడు వాటి కింద ఏనాడో శిధిలమైపోయిన కొన్ని పిచ్చుకగూళ్ళు అందులో నేనో మూల నన్ను నేను తడుముకుంటున్నపుడు ఏమితోచక తోకచుక్కలా రాలుతున్న నా కన్నీళ్ళు కొన్ని అక్కడక్కడా నీటిచెమ్మలుగా నిద్రాణమైపోతుంటాయి నువ్వొచ్చేసరికికి నేను కరుగుతూ నిన్ను కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటాను నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా... తిలక్ బొమ్మరాజు 19.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oPft2o

Posted by Katta

Nvn Chary కవిత



by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cXcH2w

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // ఎదగాలి సోదరులమై మనం // అన్నలారా అక్కలార ఆంధ్రా..తెలంగాణా తెలుగు తల్లి బిడ్డలారా.. గాయ పడ్డ మనసులారా .. ఇది గెలుపు ఓటమిల సమస్య కాదు కాదు కానే కారాదు ఇది నీకు నాకు వైరము వలదు.. వలదు నీ దుఃఖము నాకు సంతసమునూ,నా ఏడుపు నీకు ఆనందమును కలిగించ తగదు కానే కారాదు.. ఎప్పుడైనా ఇది ఒప్పు కానేరదు ఒకే తల్లి బిడ్డలకు కానేరదు కలలోనైనా కలిగించు కోరాదు ముందు ముందును నీకు నాకు నొప్పి, మన తప్పు ఒప్పుల అనుమాన స్పద కాన్వాయి ల పై నుండి నువ్వు నేను, ప్రక్క ప్రక్కనే బస చేసి ఉన్నాము..నాడు ఆనాడు.. నేడైనా .. ఆ అహంకార ద్వేష వృక్షాలు దిగి చెట్టా పట్టాలేసుకొని, ఇంకనూ ఉందాము ప్రక్క ప్రక్కనే ఒకరి మదిని ఒకరెరిగి చిరకాలము.. ఒకరికొకరు తోడు నీడై ఎదుగుదాము నింగిలో నంత ప్రక్కవారికి ఆదర్శము కాగా.. ఆనందం సంతోషం.. బాధలు దు:ఖాలు అంతా నీవే .. నీ వారే .. అంతా నీవే ,ఇకనైనా... కోపాలు తాపాలు వీడి ఇరు వర్గాల మేలు కోరి ఎగురుదాము ఎదుగుదాము అనంతానికి నిచ్చెనలు వేసి.. జయహో తెలుగు వారు ఐక్యత వర్ధిల్లాలి అని ఉల్లాసంగా పాడుకుంటూ.. (ఎన్నో సంవత్చరాల పోరాటాలు, ప్రాణ త్యాగాలు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించినందున ఇరు వర్గాల ప్రజలు కక్ష్యలు మాని రెండు ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలని ఆసిస్తూ .. మీ సాటి తెలుగు వాడు .. )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1geXYSV

Posted by Katta

Pusyami Sagar కవిత

ఇందిర గారు రాసిన కవిత !!అమానుషం ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ ఒక వ్యక్తి తో పెంచుకున్న అనుబందాన్ని గుర్తు చేసుకునే క్రమం లో, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ని అందుకు గల కారణాలను చూపిస్తూ ఆమె గొప్పతనాన్ని కొనియాడుతూనే, ఇలాంటి దురదృష్ట అవస్థ కి కారణభూతమైన కొడుకులకు చెంప పెట్టు లాంటింది ఈ కవిత.. తన చిన్నప్పటినుంచి కొడుకుల జీవితాల కోసం తను ఎలా కొవ్వత్తి లా కరిగిపోయినది ..అందరిని బాగు పరిచాక తన జీవినం ఎటు వెళ్ళింది ఇవన్ని ఆమె గురించిన ప్రశ్నలే... ఒక పద ప్రయోగం బాగుంది 'కొడుకులగన్న కోట'వని సాధారణం గ నలుగురు గుమి కూడె చోట నాలుగు మాటలు అనేస్తారు అది కన్న పేగు గురించి అయినపుడు ఎంతో ఉప్పొంగి పోతారు కదా..అల అని చ్పెపినపుదు ఆమె కోట గాను కొడుకులు సైనికులు గాను పోల్చుకున్నారు నిజమే... మాతృ ప్రేమ ముందు ఎంతటి కష్టం అయిన కూడా దిగదుడుపు, వారి బాల్యాన్ని తన భుజాల మీద మోస్తూ వృక్షం లా తయారు చేసినది కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా//అందరి ముడ్లూ మూతులు కడిగి//అడ్డమైన చాకిరంతా//ఆనందంగా చెయ్యలేదా....// జనరల్ గా పిల్లల పై ప్రేమ మమకారం తో తాము ఎంతో చేసిన అది చాలా తక్కువే అనుకుంటూ సర్వం ఇచ్చేస్స్తారు, పిల్లి ఎలాగా అయితే తమ పిల్లలని రక్షణ కోసం తపన పడుతుందో అలాగే తల్లి కూడా తమ బిడ్డలా సంరక్షణ కోసం పాటు పడుతున్నది పూచికపుల్లా దాచిపెట్టి//తినీతినక కూడబెట్టి//పిల్లల్నినీ వీపుకు కట్టుకోలేదా// నేటి సమాజం లో ఒక అమానుష ధోరణి ని ఎలా కొనసాగుతున్నదో పరిశీలిస్తే, ఈ రోజుల్లో కన్న వారు కొడుకు లకు బరువు గా అనిపించి వృద్ధ ఆశ్రమాలలోను, లేదు కొదుకల మధ్య పంపకాలు, జరుగుతున్నవాస్తవ ఘటనలను కళ్ళ ముందుంచారు ఇళ్లూ వాకిళ్లు పంచుకుని//ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక//కొడుకులంతా//కొట్టుకుచస్తున్నారే ఇది సాధారణం గా అందరి ఇళ్ళలో నేడు కనిపిస్తున్న నిజం, స్వార్ధం పెరిగిపోయి కన్నవారు అని కూడా చూడకుండా వంతులు వారిగా అమ్మ ని , నాన్న ని పంచుకోడం వాటి కోసం కొట్టుకు చావడం మానవత కె మచ్చ లాంటిది. అయిన తల్లి తండ్రులను కాదు పంచుకోవాల్సింది, వాళ్ళు మలి దశ లో పడే కష్టాలను, కొంత సంతోషాన్ని, కొంత దుఖాన్ని, మరి ఆసరా ను , కాని ఆస్తి ని పంచుకున్నట్టు కన్న పేగు ను పంచుకునే లోకం రీతి ని నిరసించల్సినదె నువ్వేమైనా..//ఆస్తివా పాస్తివా//ఆబగా పంచుకోడానికి ! అన్ని పంచి ఇచ్చి జీవితపు చివరి ఘడియలలో ఎవరు ఇంత అన్నం పెడతారో అని ఆశ గా ఎదురు చూస్తూ ...తనువు లు చాలించే పిచ్చి తల్లి పడే ఆవేదనలు కన్పించవు ఎవ్వరికీ , అందరి కొదుకలను చేర దీసి ప్రయోజకులను చేసిన ఖాళి చేతులు ఇప్పుడు చావుకు దగ్గర వుండి తన పై విహారం చేసే ఈగలను తోలుకుంటూ దీన స్థితి లో కను మూసింది బుక్కెడు బువ్వకోసం//నీ గాజుకళ్ల ఎదురుచూపు//చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక//వేలాడబడ్డాయి మనవ సమాజం లో అమ్మ పట్ల కొడుకుల నిరాదరణ ని ఎత్తి చూపించి, వారి ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలనే సందేశాన్ని వినిపించి వుంటే ఇంకా బాగుండేది అని నా అబిప్రాయం. ేటి ఆలోచన విధానానికి అద్దం పట్టేల ఇందిరా గారు వ్రాసారు అందుకు అబినందనలు మరిన్ని మంచి కవితలని అందించాలని కోరుతూ ... సెలవు ... అమానుషం నీకేందమ్మా మారాజువు 'కొడుకులగన్న కోట'వని నలుగురూ ఎకసెక్కాలాడినపుడు లోలోపల ఎంత ఉప్పొంగిపోయావో కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా అందరి ముడ్లూ మూతులు కడిగి అడ్డమైన చాకిరంతా ఆనందంగా చెయ్యలేదా ఏడేడు ఇళ్లల్లో పిల్లిలా తిప్పి కళ్లలో వత్తులేసుకుని పూచికపుల్లా దాచిపెట్టి తినీతినక కూడబెట్టి ఇల్లుకట్టి పిల్లల్ని నీ వీపుకు కట్టుకోలేదా అంతా ఒక రేవుకొచ్చేదాకా కునుకైనా తీశావా పిల్లలకై బ్రతకాలంటూ జీవితాన్ని ప్రేమించావే ఇళ్లూ వాకిళ్లు పంచుకుని ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక కొడుకులంతా కొట్టుకుచస్తున్నారే నువ్వేమైనా ఆస్తివా పాస్తివా ఆబగా పంచుకోడానికి ! ఆరుబయట అరుగుమీద బండరాయి గుండెలపై బుక్కెడు బువ్వకోసం నీ గాజుకళ్ల ఎదురుచూపు చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక వేలాడబడ్డాయి నీచేతుల్లో ఏముందింక కనకమ్మత్తా !! 19/02/2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKVrm5

Posted by Katta