పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //నేల జారిన చాయ// పగలు లోకాన్ని మోస్తూ నిద్రలో కల్పించుకున్న లోకాన్ని ఆలోచిస్తూ అనుభవాలు మాటలు ఇస్టాలు ద్వేషాలని ఇముడ్చుకుని రేకులు కప్పుకున్న మొగ్గలా పడుకున్న శరీరం నిల్చుని నీడలో భాగమైనడుస్తుంది కాంతిలో పొద్దుతిరుగుడు పువ్వు పోడుగ్గా నేలని కావలించుకున్న నల్లని ఆత్మ రేగుతున్న జుత్తు ఊగుతున్న చేతులు నడుస్తున్న పాదాలు నేలమీద వాలిపోయిన రూపం విడివిడిపోని రూపం గోడల మీద మేకులుతో కొట్టని చిత్రపటం వాలిపోయిన పోద్దులో తగ్గిపోతున్న కాంతిలో అదృశ్యమైన ఛాయ వీపుని చేరుకున్న స్వేచ్చ ఇంట్లో కూడా బల్బుల అర్ధకాంతిలో కదిలే వేళ్లని కావలించుకున్న ఆకారన్ని సొఫాల మీద పరుకున్న పక్కమీద మనకింద నోప్పిలేని శరీరంతో మౌనంగా నిద్రపోతుంది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73vKv

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత

అ"మంగళుడు" పొద్దున్నే చన్నీటి తలస్నానం చేసినా..అతడు నిత్య అమంగళుడే! ముట్టుకున్న వారంతా కులం మురికిని ఒక స్నానంతో కడిగేసుకుంటారు గుబురుగడ్డాలపొదల్ని నునుపుగా చెక్కే శిల్పి అతడు చేతిలో కత్తి వున్నా...బతుకుతో తప్ప పోరాటం చేయని యోధుడతడు కాలిగోర్లు ,చంక వెంట్రుకల మాలిన్యా న్ని ప్రక్షాళించే "పవిత్ర గంగ" అతడు .. నీ చింపిరి తల అరణ్యాన్ని క్రాఫ్ పార్క్ లా తీర్చి దిద్దే డి జై నర్! ఎక్కడైనా అతని పిలుపొక్కటే "మంగలోడా" అని , అవును !అతడు మంగలుడే,.... నీకు నిత్యం మంగళం కలిగేందుకు నీ మురికిని నరికి సుందర వేషాన్నివేసి మార్కెట్లోకి పంపినందుకు .... అతడు అమంగళుడే ! కత్తి మొండిదైనా మనుషుల కన్నా నయమే, తనకాళ్లమీద తానెలా నిలబడాలో చెప్పే కొత్త చూపు అతడు ! క్రీములెన్నిటితో తడిపినా మొద్దుబారిన క్రిమి ముఖాలు మెత్తబ డవు ... పురాతన దుర్గంధాల్ని ఇంకా మోస్తూనే .... తలపట్టి ఒళ్ళంతా హూనమయ్యేలా సేవ చేసేది తరాల కులవిద్య మీదే ! ఎందరి ముఖాలకో పున్నమి వెన్నెలలు అద్దినా , అతని జీవితమంతా అమావాస్యలే ! యంత్రం గా మారి, కత్తి గాట్ల గాయాల జీవితంపై ఏ ముఖమూ సానుభూతిని వర్షించదు నగిషీలకు అలవాటైన ముఖాలు ఛీ కొడతాయి ... అతని నిస్సహాయతకు దువ్వెన నవ్వుతుంటే కత్తి కర్తవ్యా న్ని గుర్తు చేస్తుంటే ....చావుకైనా ,మంచికైనా ముందుండే మండే దివిటీగా .. .అందరి పెళ్లిళ్లలో మోగే మంగళ వాద్యమై ..... నడిపిస్తున్నా ... అతడింకా... "అమంగళు డేనా? -డా . కలువకుంట రామకృష్ణ e

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUhfb

Posted by Katta

Patwardhan Mv కవిత

ప్రేమిస్తా రా ?? మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది..మన మాట వారికి నచ్చట్లేదనీ,ఎప్పటికీ నచ్చదనీ. అర్థమౌతూనే ఉంటుంది మన ఉనికి వారికి కష్టమైందని,ఎప్పటికీ ఇష్టం కానిదనీ. మన స్పర్శ వారు భరించలేరని,ఎప్పటికీ అసహ్యమైనదనీ. మనను అక్కడకు రాకుండానే చూడాలనుకుంటారని,ఎప్పటికీ రానివ్వరనీ. వారి ప్రతి ఆలోచనా మనకు ఐమాక్స్ స్క్రీన్ మీద కనబడుతూనే ఉంటుంది. మనల్ని కొలిచే కొలమానాల శిలాజాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటవి. చాలాసార్లు నిగూఢంగానూ,ఒక్కోసారి కాసింత బహిరంగంగానూ శిశిరంలో ఆకుల్ని మాత్రమే రాల్చి కాదు చెట్టు నగ్నమయ్యేది,ఆలోచనల్ని కూడా! వారు మన ప్రతి పద ముద్రల వెనకాల వెదికేదేంటో మనకు తెలుసు వారు మనను చిత్రించే చిత్రవర్ణ మర్మమేమిటో తెలుసు వారు మన గాలిలో శ్వాసించే గంధక ధూమమూ తెలుసు వారు మన చుట్టూ అల్లిన చీకటి సాలెగూళ్ళూ తెలుసు. వారి అభావ,విభావ,ముభావ స్వభావాలకీ మన చేతుల్నించి దారం తెగిపోయిన గాలిపటం లాంటి కారణమూ తెలుసు అయినా విచిత్రం !విస్ఫోటించిన ఆవేదన విరామాన్ని ఎరుగకముందే మన మొహం మీద నవ్వు నెలవంక మొలుచుక వస్తుంది. అంతకంతకూ వారిపై మోహం పెరుగుతూనే ఉంటుంది వారిని ఒక్క సారైనా ముద్దాడి పోవాలనే వ్యామోహమూ పెరుగుతూ ఉంటుంది మనల్ని మనం జీవ నదిగా మార్చుకున్నప్పుడు అన్నింటినీ కల్పుకొని ముందుకు సాగిపోవడమే కదా మనకు తెలిసింది. నిస్సహాయులం ప్రేమించడం మన జీవ ధాతువు. 22-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73tSP

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వెంకటేశ్: కాలమా నువ్వెక్కడ..: కాలమా నువ్వెక్కడ నా చెలి కమ్మని కౌగిలి నులి వెచ్చదనమున కరిగిపోయావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి తేనియల అధరాల మధురాల తేలియాడి తెరమరుగయ్యావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి గులాబి బుగ్గల సోయగమునకు మతితప్పి సంభ్రమాశ్చర్యాలలో మునకలేసావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి వాలిసోలిన కంఠసీమన శంఖమును గాంచి సొమ్మసిల్లావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి నడుమొంపున మాయమై ఆకసమున నెలవంక రసరాజును రాబిలుచుటకు పయనమయ్యావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి మమతల బృందావనపు ప్రణయ మురళీగానమై మైమరచి హృదయాలయమున అర్చనకు కొలువుదీరావు కదా...! 22/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgI5

Posted by Katta

Murthyraju Adluri కవిత

భగత్ సింగ్ [మూర్తి రాజు అడ్లూరి]23/3/2014 ------------- భగత్ సింగ్ ఇతడు భగత్ సింగ్ ఇతడు భగ భగ మండె అగ్ని కీల ఇతడు సామ్రాజ్య వాద కలపు వనానికి అంటిన కార్చిచ్చు ఇతడు భూర్జువా పాలకులపై దూకిన కొదమ సింగమితడు ;భగత్ సింగ్ ఇతడు; పాఠ్య పుస్తకాలలో కనిపించని పాఠ మితడు పాఠ శాలలో వినిపించని గీతమితడు బ్రిటిష్ వారి గుండెలో మ్రోగిన మరణ మృదంగమితడు ;భగత్ సింగ్ ఇతడు; నవయువుకుల్లో పరుగెత్తె వెచ్చని రుధిర ధార ఇతడు కవి కలాల్లో ప్రవహించే యెర్రని సిరా ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; దురహంకార తెల్ల జాతిపై బుసకొట్టిన నాగు ఇతడు అణగార్చిన నల్లనీతిపై విసిరేసిన బాంబు ఇతడు ఆకాశములొ మెరిసిన అరుణారుణ తార ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; పుట్టిన ప్రతి శిశువు ఎత్తిన పిడికిలి ఇతడు దేశం కోసం యమ పాశాన్నే ఎదిరించిన షహీద్ ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; 23/3/2014 ;భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా;

by Murthyraju Adluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgrB

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ప్రయాణం ---------------------------- గతాలు మనసును తడుముతున్నపుడు గుండె అరల్లో పేరుకుపోయిన జ్ఞాపకాల ధూళి నీకోసమెక్కడో మిగిలిన కొన్ని నిరంతర వాహినిలు నిండుగా గూడు కట్టుకుంటూ దివి ధూలానికి వేలాడుతున్న కలల నక్షత్రాలు ఒక్కొక్కటిగా రాలుతుంటే నిర్వేదాలు క్రమంలో పేర్చుకుంటూ జీవితానికి సరిపడ సంభాషణలు మళ్ళీ నువ్వే ఇక్కడ ఈ క్షణం నిన్ను నువ్వు రాసుకుంటూ ఇంకో కొత్త ప్రయాణం తిలక్ బొమ్మరాజు 22.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73ru9

Posted by Katta

Sana Chittaluri కవిత

చిత్తలూరీలు నేను చేసిన డిగ్రీలన్నీ నా రెక్కల మీద చుక్కల అలంకరణలయ్యాయి నేనున్న గది మాత్రమే నేనెగిరే చోటయింది అతనికెప్పుడూ నేనో రంగుల సీతాకోక చిలుకనే నా స్వేచ్చా స్వాతంత్ర్యాలంటే అతనికెప్పుడూ చులకనే పెళ్ళంటే ఒకరి స్వేచ్చను మరొకరు హరించడం కాదని అతనికెలా చెప్పేది... చిత్తలూరి 220314

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgaX

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ప్రయాణం ---------------------------- గతాలు మనసును తడుముతున్నపుడు గుండె అరల్లో పేరుకుపోయిన జ్ఞాపకాల ధూళి నీకోసమెక్కడో మిగిలిన కొన్ని నిరంతర వాహినిలు నిండుగా గూడు కట్టుకుంటూ దివి ధూలానికి వేలాడుతున్న కలల నక్షత్రాలు ఒక్కొక్కటిగా రాలుతుంటే నిర్వేదాలు క్రమంలో పేర్చుకుంటూ జీవితానికి సరిపడ సంభాషణలు మళ్ళీ నువ్వే ఇక్కడ ఈ క్షణం నిన్ను నువ్వు రాసుకుంటూ ఇంకో కొత్త ప్రయాణం తిలక్ బొమ్మరాజు 22.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmsvSP

Posted by Katta

Aruna Naradabhatla కవిత

అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ త్రిషోల్డ్ లో జరిగిన కవిసమ్మేళనంలో సీనియర్...జూనియర్ కవులంతా చక్కని భావాలను ఆవిష్కరించారు! ఒక అహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంది. ముఖ్యంగా గమనించిన విషయం ...చాలా నచ్చినవిషయం ఏంటంటే సర్వమత....కుల....జాతి...ప్రాంతం...వయసు...ఆడా...మగ...హొదా...ఈపదాలకు అతీతంగా సమభావం కనిపించింది! అక్కడ ఉన్నది కేవలం ఒక్కటే కులం "కవికులం" కవిత్వం మనిషిని మనోవికాసం వైపు నడిపిస్తుంది అనడానికి ఇది నిదర్శనంలా తోచింది! కవిత్వం విషయానికొస్తే "మనసుకు ప్రతిబింబమే కవిత్వం". ఒక్కొక్కరి మనసును చదివి వినిపించినట్టుగా అనిపించింది! ఇంత మంచి అవకాశాలను కొత్త కవులకు బాటగా తీర్చిదిద్దినందుకు యాకూబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1plz7R4

Posted by Katta

Sreekanth Aluru కవిత

శ్రీ IIనన్ను వదిలెయ్యండిII ఎందుకో ఇప్పుడంతా కొత్తగా అనిపిస్తుంది లోకమంతా కొత్తగా పరిచయమవుతున్నట్టు ఇన్నాళ్లూ నేనెరిగిన మనుషులేగా పరిచయాలు పాతవె గాని పలకరింపుల్లోనే ఏదో తేడా వుంది మాటల తూకంలో నన్ను తూస్తున్న అనుభూతి దూరం మనుషుల మద్య దూరాన్ని పెంచుతుందన్నది అబద్దం దూరం మనసుల మద్య బంధానికి స్ట్రెస్ టెస్ట్ ఇప్పుడెందుకో ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు అర్రే వీడు ఎదురుపడ్డాడు పలకరిచాలేమో అని సందేహించకండి మీ పలకరింపు నాకవసరం లేదు ప్లాస్టిక్ నవ్వుల కంపు భరించలెకున్నా మీరు పలకరించి నా నోటికి ప్లాస్టిక్ అద్దకండి ప్లీజ్ ఇప్పుడు నాకే తెలియకుండా కొత్త విద్యేదో అబ్బినట్టుంది సైనస్ తో ముక్కు వాసనలు పసిగట్టలేకున్నా మనుషుల అంతరంగాల్లోని మకిలి వాసనలు మాత్రం బాగా తెలుస్తున్నాయి నా మానాన నన్ను వదిలెయ్యండి నా గురించి మీరు ఎదో అనుకుంటారేమో అన్న స్థితిని నేనెప్పుడో దాటేసాను మీకు తోచినట్టు అనుకోవచ్చని కూడా ప్రకటిస్తున్నా ఇక మీ నటనలు చాలించి మీకు మీరుగా రండి ముసుగులు తొలగించి --శ్రీ

by Sreekanth Aluru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJXEF

Posted by Katta

Manjunadha Reddy కవిత

మాయవిని నేను మకువను నేను ఆశను పుట్టించేది నేనే అ ఆశను తిర్చేది నేనే నీ అవసరన్ని నేను నీ ఆపదను నేను అవసరము తిర్చేది నేనే ఆపదలో ఆదుకునేది నేనే అమ్మను నేను అలిని నేను అక్కున చేర్చుకునేది నేనే ఆనందాన్ని పంచేది నేనే నీ చుట్టాన్ని నేను నీ కష్టాన్ని నేను నీ చుట్టూ తిరిగేది నేనే నీ కష్టాన్ని పంచుకునేది నేనే నీతో ఆడుకునేది నేనే అ అటను ఆడించేది నేనే కోరికను నేనే కోరికలు తిర్చేది నేనే నీకోసం వేచివుండేది నేనే @ 22/03/2013

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTv1Pl

Posted by Katta

Rasoolkhan Poet కవిత

నేటిదినం పత్రికలో నాకవితా సంపుటి 'దువా'సమీక్ష

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTv1yJ

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || నేను సైతం || ======================== మట్టి నెర్రల మధ్య దాగున్న ఆనవాళ్ళు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి గత గాయాల చరిత్ర పునరావృతమై శిధిలాలు జ్ఞాపకాల్లోనుండి బయలుపడుతున్నాయి గుండె గాయాలు పచ్చి పుండ్లై లేపనం కోసం చూస్తున్నాయి ఎప్పుడో చెప్పిన (చదివిన ) పోరాటాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి నరాల్లో రక్తం వేడెక్కింది గుండెలను పిండేస్తుంది ఉడికి(కె )నెత్తురు మెదడులో ఆలోచనల అగ్నిగోళం పేలుతుంది ఆవేశం లావాల ప్రవహించినా నేనింకా నెర్రల మధ్యే ఇరుక్కుపోయాను గొంతు పెగలని ఆవేశం బిగపట్టుకున్న ఆలోచనలు అణచి వేసే నీ చేతుల సాక్షిగా నా చుట్టూ బిగుసుకుంటున్నాయి ఆరుబయట పిల్లలు ఆడుకొంటున్నారు బొమ్మ తుపాకీలతో ... ఏదో రోజు నేను సైతం అంటూ నీ(పోరాటాల) బాటలో పయనించేందుకు ... --------------------------------------------- మార్చి 22/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWRh

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll యాడుంటివి మామా ll యాడనుంటువి మామా ? కోడికూయక మునుపే సంతకని పోతివే? సద్దికూడును మరిసి, ఏకువెంటే తరలిపోతివే? గొడ్డును తెచ్చి కాడికి కడతనంటివే? కొత్త రైక తెత్తనంటివే ముత్తెమంత ముక్కెర ముద్దంటివే మువ్వల గజ్జలతో మురిపిత్తనంటివే మువ్వన్నెలకోక నీకంటివే సిలిపిగా ఈలలేసి గోలసేసే గాలిసుడిగాడు మరుల పూలగందమేసి పోయే వనరేడు సినుకులతో సిటికలేసే వానదేముడు కనుగీటి సైగసేసె కోరమీసాల సక్కనోడు తుంటరి మల్లెలు వలపు అత్తరులేసి పోయే గండుతుమ్మెదలు గుంపుగా సేరి గుసగుసలు రేపే కొంటె కందిరీగ బుగ్గ గిల్లిపోయే మొగలిపొదమాటున నాగులలసి సొమ్మసిల్లిపోయే యెరుకతొచ్చి ఏమో సెప్పిపోయే సిలక జోసెమంతా..ఇప్పిపోయే పావురాయి పిట్ట పిలుపు ఇనకపోయే కాకమ్మయినా కబురు తేకపోయే ఆసలన్నీ సిసిరాలై రాలిపోయే ఊసులన్నీ వసంతాలనే నింపిపోయే ఊహలన్నీ సెరత్తులై సిగురులేసే బాసలన్నీ గీస్మతాపాలై గుబులురేపే యెన్నెలమ్మొచ్చి ఎలుగు కల్లాపి సల్లిపోయే తారలమ్మలొచ్చి సుక్కలనే దిద్దిపోయే మెరుపులమ్మ మేనాదిగి ముగ్గులల్లిపోయే ఏడురంగుల దీపమొచ్చి రంగులద్ది పోయే మినుగురుల దీపమెట్టి ఎతుకుతున్నా సాగిపోయే ఏరులనే ఆరాలడుగుతున్నా జింకపిల్ల యెంటపడి మతిసెడి పరుగులెడుతున్నా ఒడ్దు సేరే పతి నావ నడుగుతున్నా గోదూలి ఏలైపోయే లేగదూడలన్నీ ఇంటికి సేరిపోయే గువ్వలన్నీ గూడుసేరే వాడంత కునుకుతీసే సిరుగాలి సంగీతాలతో జోలలు పాడే తమలపాకు సేతులేమో కమిలిపోయే పూల పుప్పొడి పారానులేమో రాలిపోయే సిలకసుట్ట ఇసిగి ఎలిసి పోయే దూపమలిగి దూరతీరం సేరి పోయే మబ్బుసాటున సెందరయ్య తొంగిసూసి ఇసిగిపోయే జాబిలమ్మ యెన్నెల దీపమెట్టి అలిగిపోయే ముసురుపట్టి కనులేమో ఏరులాయే మాపుటేలకైనా మరలిరాకపోయే మురిపాల మిరియాల జున్ను సేసుంచినా మినప సున్నుతో ఉట్టినంత నింపి పెట్టినా దిబ్బరొట్టి పానకాలే దాసి పెట్టినా కొర్రమేను పులుసు కమ్మగా వండి పెట్టినా నాటుకోడి కూర గాటుగా వండినా సిల్లుగారెలేసి అదిమి పెట్టినా తెల్లనైన వరిబువ్వ వార్చిపెట్టినా ఇప్పపూల సార సేకరించి తెచ్చినా పొన్నపూల పానుపేసి ఉంచినా నాగమల్లి పూల పక్క పరిసినా జాజిపూల దండ కొప్పులో తురిమినా మొగలిపూల అత్తరులే సల్లినా యెన్నెల్లో తానమాడి పొదరింట ఎదురుసూత్తున్నా యెన్నెల దొరవై వత్తవని, యెన్నెల సరసమే తెత్తవని వలపు ఇత్తరి పరసి ఉంచా... మరుల మడి తడిపి ఉంచా మగసిరితో వత్తవని సొగసరి సొగసును దోసుకుంటావని మల్లి మనసు సిన్నబోయే కనులు కడవలాయే జామురాతిరంతా జాగరనాయే రేయేమో తరగదాయే, కాలమేమో కదలదాయే నువ్వేడనున్నా ఏగిరమే గూటికి సేరుకో మామా ! నీ మల్లి గుండె గదిలో దాగుండిపో మామా ! ll సిరి వడ్డే ll 22-03-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWAA

Posted by Katta

Yasaswi Sateesh కవిత

ఈ రోజు ఒక ప్రముఖ కవి పుట్టినరోజు ఆయనే Billy Collins (DOB: March 22, 1941) American http://ift.tt/1gbMUsJ Source: http://ift.tt/1f2ArU1 వారిదే ఒక కవిత ఇక్కడ:....................................... ఒక్కోసారి వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉంటాయి సన్నని నల్లటి చేవ్రాలులో… ప్రతి పేజీ మార్జిన్లోనూ చెల్లాచెదరుగా కోపంతో రచయితమీద వ్యతిరేకంగా. “నా చేతికిగాని దొరికితే, Kierkegaard ! Conor Cruise O’Brien! తలుపు గడియపెట్టి మీ తలలోకి కాస్తతర్కం ఎక్కేలా చేస్తాను,” అన్నట్టు ఉంటాయి. కొన్ని వ్యాఖ్యలు మాత్రం అప్పటికప్పుడు వ్రాసినవి “అర్థం పర్థంలేదు,” అంటూ తీసిపారేసే రకమో, “ప్లీజ్”, “హ్హహ్హహ్హా” అని రాసే రకమో అన్నమాట. నాకు బాగా గుర్తు, ఓ సారి పుస్తకం చదువుతూ… అది “A Life of Emily Dickinson” … తలపైకెత్తి, బొటనవేలు బుక్ మార్క్ లా పెట్టి పేరాకి పక్కనే “మరీ మూర్ఖంగా రాయకు” అని వ్యాఖ్యరాసిన వ్యక్తి ఎలా ఉంటాడా అని ఊహించడం. పేజీ మార్జిన్ల సైకతతీరాల్లో తమ పదముద్రల్ని చెల్లాచెదరుగా విడిచే విద్యార్థులు కొంచెం హద్దుల్లోనే ఉంటారు. ఒకరు “Eliot”కవితపక్కన”రూపకాలంకారం” అని గెలికితే; ఇంకొకరు, జొనాథన్ స్విఫ్ట్ “A Modest Proposal” కి పేరా పక్కన యాభైసార్లు “వక్రోక్తి” అని రాస్తారు. లేదా వాళ్ళు క్రీడామైదానాల్లో గేలరీలోంచి అరిచే అభిమానుల్లా మూతికి అడ్డంగా రెండుచేతులూ పెట్టి Duns Scotus కీ, James Baldwin కీ “తిరుగులేదు” అని అరుస్తుంటారు. “వావ్!” “ఏం రాసేవు గురూ” అనో, “ఏం గురి” అనో అంటుంటారు. పక్కన తుఫానులా వర్షించే టిక్కులకీ, నక్షత్రాలకీ, ఆశ్చర్యార్థకాలకీ లెక్కే ఉండదు. “మనిషికీ ప్రకృతికీ మధ్య సంఘర్షణ” అని మార్జిన్లో రాయకుండాగనక కాలేజీ నుండి పట్టభద్రులైతే, బహుశా ఇప్పుడు ఒక అడుగు ముందెయ్యడానికి ఇది సరైన సమయం. మనందరం కూడా ఆ తెల్లని చుట్టుకొలతని ఆక్రమించినవాళ్ళమే చేతికుర్చీలో కూర్చుని కాలక్షేపానికి పేజీలుతిరగేస్తున్నామని అనిపించుకోకుండా పెన్ను కోసం తడుముకున్న వాళ్ళమే. దారిపక్కన ఒక ఆలోచనా ముద్రని వేసిన వాళ్లమే ఒక అభిప్రాయాన్ని అంచున అంటుగట్టిన వాళ్లమే. చివరికి ఐరిష్ సన్యాసులుకూడా తమ చీకటి గ్రంధాలయాల్లో క్రీస్తు జీవిత సువార్త పేజీల అంచుల్లో వెలిబుచ్చేరు నకళ్ళువ్రాయడంలో తమబాధల్ని క్లుప్తంగా వ్యాఖ్యలుగా, ఒక పిట్ట తమకిటికీ దగ్గర చేస్తున్న సంజ్ఞలు గురించో, లేక తాము చదువుతున్న పేజీ మీదపడుతున్న ఎండగురించో రాస్తూ… అజ్ఞాత వ్యక్తులు భవిష్యద్యానం చేస్తున్నారు తమజీవితాల్ని దాటి మనగల వాహక నౌకలో William Blake అతనిమీద రాసిన తీవ్రమైన విమర్శ చదివే వరకూ, Joshua Reynolds ని మీరు చదివినట్టే కాదని కొందరంటారు. వీటన్నిటికంటే ఎక్కువగా మనసులో మెదిలేది లాకెట్టులా నా ఆలోచనల్లో వేలాడేదీ నెమ్మదిగా వేడేక్కుతున్న ఒక వేసవిరోజున స్థానిక గ్రంధాలయంలోంచి ఎరువుతెచ్చుకున్న “Catcher in the Rye” పుస్తకంలోని వ్యాఖ్య. నేనింకా అప్పుడే ప్రౌఢవిద్యలోకి అడుగుపెడుతున్నా మా తల్లిదండ్రులగదిలో సోఫాలో కూచుని పుస్తకం చదివే రోజులు; ఒక పేజీ మీద ఆ వ్యాఖ్య కనిపించినపుడు ఒక్కసారిగా నా ఒంటరితనం ఎంతలోతుగా అనిపించిందో నా కళ్ళముందు ప్రపంచం ఒక్కసారిగా ఎంత విశాలమూ, ఎంత తీపుగానూ అయిందో మీకు చెప్పలేను. కొన్ని జిడ్డు జిడ్డు మరకల తర్వాత చక్కని దస్తూరీలో పెన్సిలుతో ఇలా రాసి ఉంది- అది నే జీవితంలో కలుసుకోలేని ఒక అందమైన అమ్మాయిదని ఖచ్చితంగా చెప్పగలను- “ఈ ఎగ్ సలాడ్ మరకలకి క్షమాపణలు. ఏం చెయ్యను, నేనిపుడు ప్రేమలో పడ్డాను.” . బిల్లీ కాలిన్స్ అమెరికను కవి. . ఈ కవితలోని సౌందర్యం దాని విశ్వజనీనతలో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు వైయక్తిక అనుభవాన్ని సార్వజనీనము చెయ్యడంలోనూ, సార్వజనీన అనుభవాన్ని వైయక్తికం చెయ్యడంలోనే కవి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. కాలేజీ మెట్లెక్కడంగాని, లైబ్రరీకెళ్ళి పుస్తకం చదవడం అలవాటున్న వాళ్లకి గాని ఈ విషయం స్వానుభవంలోనిదే. పుస్తకాల మార్జిన్లలో … పజిల్సు, కనుక్కో చూద్దాం, వ్యాఖ్యలూ, బొమ్మలు, ఒకటేమిటి … కాలక్షేపం నుండి, సీరియస్ గా చదువుకుని రాబోయే పఠితలకి సులభం చేద్దామన్న తపనతో రాసే రాతలదాకా అన్ని రకాలూ చూసి ఉంటాము. ఈ కవితలో కొసమెరుపు… దాని ప్రత్యేకత. . Marginalia . Sometimes the notes are ferocious, Skirmishes against the author Raging along the borders of every page In tiny black script. If I could just get my hands on you, Kierkegaard, or Conor Cruise O'Brien, They seem to say, I would bolt the door and beat some logic into your head. Other comments are more offhand, dismissive - "Nonsense." "Please!" "HA!!" - That kind of thing. I remember once looking up from my reading, My thumb as a bookmark, Trying to imagine what the person must look like Who wrote "Don't be a ninny" Alongside a paragraph in The Life of Emily Dickinson. Students are more modest Needing to leave only their splayed footprints Along the shore of the page. One scrawls "Metaphor" next to a stanza of Eliot's. Another notes the presence of "Irony" Fifty times outside the paragraphs of A Modest Proposal. Or they are fans who cheer from the empty bleachers, Hands cupped around their mouths. "Absolutely," they shout To Duns Scotus and James Baldwin. "Yes." "Bull's-eye." "My man!" Check marks, asterisks, and exclamation points Rain down along the sidelines. And if you have managed to graduate from college Without ever having written "Man vs. Nature" In a margin, perhaps now Is the time to take one step forward. We have all seized the white perimeter as our own And reached for a pen if only to show We did not just laze in an armchair turning pages; We pressed a thought into the wayside, Planted an impression along the verge. Even Irish monks in their cold scriptoria Jotted along the borders of the Gospels Brief asides about the pains of copying, A bird signing near their window, Or the sunlight that illuminated their page- Anonymous men catching a ride into the future On a vessel more lasting than themselves. And you have not read Joshua Reynolds, They say, until you have read him Enwreathed with Blake's furious scribbling. Yet the one I think of most often, The one that dangles from me like a locket, Was written in the copy of Catcher in the Rye I borrowed from the local library One slow, hot summer. I was just beginning high school then, Reading books on a davenport in my parents' living room, And I cannot tell you How vastly my loneliness was deepened, How poignant and amplified the world before me seemed, When I found on one page A few greasy looking smears And next to them, written in soft pencil- By a beautiful girl, I could tell, Whom I would never meet- "Pardon the egg salad stains, but I'm in love." .

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbMUsJ

Posted by Katta

Maheswari Goldy కవిత

I F E E L A L O N E........... MAHESWARI GOLDY. Now I’m alone Yes…. I feel alone So much alone in fact...!! Because Having nobody to comfort me Nobody could see my pain...!! Perhaps I feel I was unknown to me...!! But I was something missing Hoping one day I know...!! I think nobody knows the Real me including you...!! So now I’m alone That is why I won’t be pretty, Until you will see my inner beauty But I’m looking gorgeous always...!! Because I just don’t want to be hurt you I’m hurt only all the time...!! I know how you feel It cope my feelings according you It constantly amazes my thoughts But on the inside I’m alone…!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbiY4n

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ || నువ్వు - వాడు || ------------------ నువ్వు నవ్వుతుంటావు మల్లెపువ్వై .. మంచు బింధువై .. వాడు పగలుబూనుతుంటాడు నీ లాలిత్వాన్ని నలిపేసి ..సున్నితత్వాన్ని చిదిమేసే రాక్షసుడిలా .. వాడి జన్మకు నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటావు వాడు నీకు పునర్జన్మే లేకుండా తలుస్తున్నాడు భూదేవంత వోర్పు నువ్వు పంచుతున్నావు నీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నాడు భూమాతపై వాడు క్షమాగుణం నీ సహజ లక్షణం అంటున్నావు పశువై ఉరుకుతున్నాడు కసాయితనానికి చిరునామాగా వాడు కన్నీళ్లను నువ్వు దాచుకుని ప్రేమ బాహువులు అందిస్తున్నావు కనికరం వాడు మరచి నుదిటి రాతలు తిరగరాస్తున్నాడు నీ నిదురలోనూ ప్రేమతో నిండి ఉంటావు వాడు కలలోనూ విషం కక్కుతుంటాడు అగ్నిపరీక్షలు సహించి అభినవ సీతవు నువ్వవుతున్నావు అణువణువునా అనుమానం నింపుకుని మృగం వాడవుతున్నాడు ! (22-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEsv

Posted by Katta

Venugopal Rao కవిత

ఎన్నెన్ని ఆలోచనలు ఎన్నెన్ని ప్రణాలికలు బతికినంత కాలం కలిసే బతకాలనుకున్నం ఎన్ని ఊసులు మరెన్నో ఊహలు ఎన్నో ఎన్నెన్నో పంచుకున్నాం పకృతి ప్రకోపించి ఎక్కడో ఉరుముతుంటే నిద్రలో ఉలిక్కిపడి నిన్ను హత్తుకున్నానా పొద్దున్నే నువ్వా విషయం చెపితే నాకు భయం అనిపించేది నువ్వు లేకుండా నేనీ లోకంలో ఒంటరిగా నేనలా బతకాలని సాయంత్రం శృంగార దేవతను తలచుకొని నీకెన్ని రోజులు నిద్రను దూరం చేశానో నిజం చెప్పు ఒక్కనిమిషమైన నిన్నొదిలి ఉన్నానా పరమాత్ముడు పిలిచినా పనిఉందని చెప్పి నాతోనే ఉంటానన్నావ్ మరి ఎందుకు ఉన్నపళంగా నాకు దూరం అయ్యావు చెట్టులో పుట్టలో ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావ్ నువ్వు లేవని రావని తెలిసి కూడా నా మది ఒప్పుకోడం లేదే నడిరాత్రి నిద్రలోనే నీకోసం పక్కలో వెతుక్కున్నాను నువ్వెంత దూరం వెళ్ళినా నీకోసం నేనొస్తా నేస్తం నువ్వా స్వర్గంలో ఉండి ఆనందం అనుభవిస్తున్నావేమో నీ ఉత్సాహంలో నాకు ఎప్పుడైనా చోటు లేకుండా ఉన్నదా స్వర్గానికి నేను చేరినా ఆ రంబా, ఊర్వసి లు నాకెందుకు నటరాజ స్వామిని తలచుకొని మనిద్దరమే నాట్యం చేద్దాం మనిద్దరిని చూసి ఇంద్రాది దేవతలు కుళ్ళు కోవాలి నీవు లేని లోకం తెరచాపలేని నావలా ఉంది ఇక్కడ నేనుండలేను వస్తున్నా నేస్తం నీకోసం

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEc5

Posted by Katta

R Rama Krishna కవిత

: "బంగరు కాసుల రాసుల బందీవే నీవు తృణముల తోయముల నాడు స్వేచ్చా జీవిని నేను " :

by R Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbiUl8

Posted by Katta

Gangisetty Lakshminarayana కవిత



by Gangisetty Lakshminarayana



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQGAC

Posted by Katta

Saidulu Inala కవిత

// ఐనాల // నిప్పురవ్వలు వెలిగించిన గుండెల్లో లక్ష్యాన్ని రగిల్చకుంటే రాయికూడా నిన్నెక్కిరిస్తుంది తెగించి తంతుచేయకుంటే తరాల భానిసబ్రతుకులు నీడలా నిన్నెంటాడుతుంటాయ్ సంస్కారంలేని చదువు చిల్లులుపడ్డ కుండలాంటిది త్యాగంతెల్వని జీవితానిది చిరునామాలేని ఉత్తరం గతే చుక్కానిలేని నావ చీకటినిచీల్చలేని కిరణం అడవిగాసిన వెన్నెలే..... -1- మని షి మత్తులో చిత్తుగా గమ్మత్తుగా గగనమైపోతాడు -2- అత్యాశతొ రేపటిఆశాకిరణం నేలవిడిచి సాముకుసిద్దమైది -3- మహా వ్రుక్షం విత్తు వీసమ తే -4- వసంతానికి కోయిల గొం తునిచ్చింది -5- అమ్మరొమ్ముపట్టి బిడ్డగుక్కఆపింది

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbiTO1

Posted by Katta

Sriarunam Rao కవిత

నా చేతిలో… నీ చెయ్యి... అహం సంకెళ్ళు తెగినప్పుడే నేను ప్రేమ పాదాల్ని తాకాను. ఆ దృశ్యం ఎంత నిండుగా చూశావో.. నీ ప్రణయపు జలపాతంలో నన్ను శుద్దిస్త్నానం చేయించావు. సంధ్యాచీకట్ల పొత్తిళ్ళలో సంద్రపు చలువ వింధ్యామరల మధ్య మనల్ని కమ్ముకున్న ఒడ్డున ఇసుకతిన్నెల పరుపు పరుచుకొని ఒకరినొకరం హత్తుకొని కునుకు తీసిన నాలుగునిముషాలు చాలవా? స్వర్గం మనకోసమే పుట్టిందని చెప్పడానికి. అమ్మల నువ్వూ బాబులా నేనూ మురుపించుకొనీ బుజ్జగించుకొనీ బాధించుకొనీ ఏడ్పించుకొనీ గాఢంగా నమ్ముకొనీ ఎన్ని ఊసులు చెప్పుకొన్నాం ఎన్ని ఆశల్ని నెమరువేసుకున్నాం చెప్పరా? ఇది ఎన్నిజన్మల వరం. ప్రేమకు అర్ధం చెప్పమంటే..చెబుతానిప్పుడే అది నా చేతిలో వున్న నీ చెయ్యి. sriarunam from my book నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు...nundi

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBUtx2

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBUtgK

Posted by Katta

Sri Modugu కవిత

Sri Modugu //She….// A life of seclusion filled with pain living a life with nothing to gain. Surrounded by obscurity Astounded with shame. Without concord with no one to blame….. Do you know of a place A place unseen that holds only traumatized dreams, Filled with sorrow with no end in sight, A place without hope or comforting dreams It is so stony, this is the place I call my soul…. Do you know of a life A life not worth living wouldn't it seem That should have never been The feeling that today One more day of sadness is much too hard to bare, tired of living a life of heart ache and despair….. Do you know a person with so much pain inside The feeling of solitude when no one hears the cry Maybe when the tears are gone, Can evidently see The only question left will be DO YOU KNOW ME ….? Date:22/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk18rX

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk16k0

Posted by Katta

Abd Wahed కవిత

ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటి ముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ra7e1Z

Posted by Katta

Boddu Mahender కవిత

తెలుగు దేశం పార్టీ అనుబంధ సాహితీ సంస్థ - తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని జిల్లాల ప్రాశస్త్యాల గురించి పలు పుస్తక సంకలనాలు వేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి, అక్కడి భాష, యాస , జానపద , సాంస్కృతిక వారసత్వ విశేషాలపై కవితలు/గేయాలు/వ్యాసాలు పంపవలసిందిగా కోరుతున్నాం. కావున ఆదిలాబాద్ జిల్లాపై అభిమానం గల కవులు, రచయితలందరూ ఏప్రిల్ 5, 2014 వ తేదీలోగా myfrndmahi@gmail.com కి తమ ఫోటో తో పాటుగా రచనలని ఈమెయిల్ చేయగలరు. లేదా బొడ్డు మహేందర్, ఇంటి నెంబర్ 2-26, ఆదర్శ నగర్, అయ్యప్ప టెంపుల్ ఎదురుగా, చెన్నూరు పోస్ట్ &మండలం . ఆదిలాబాద్ జిల్లా, పిన్ కోడ్ : 504201 అనే చిరునామాకు పోస్ట్ చేయగలరని కోరుతున్నాము. వివరాలకు కారం శంకర్ -9440207311, ఎల్మల రంజిత్ కుమార్ -9849808757, మరియు బొడ్డు మహేందర్ -9963427242 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు. పొట్లూరి హరికృష్ణ - తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు - బొడ్డు మహేందర్ తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

by Boddu Mahender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk16jS

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

khammam nundi nenu unnaanu

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk16jO

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత

మంత్రాలకు చింతకాయలు రాలితే రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చి,22,2014 మంత్రాలకు చింతకాయలు రాలితే మౌనాలకు భూకంపాలు రావాల్సిందే. అగ్ని పునీతం చేస్తే జఠరాగ్ని బాధితులంతా పవిత్రులే. మొదటి చూపులోనే ప్రేమంటూ పుడితే చూడలేకపోయేది కామం కాక మరేమిటి? ప్రశ్నించటం తలపొగరయితే సమాధానాలు లేకపోవటం సాధుత్వం అవుతుంది.

by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIs06

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

చిలుకలు చేరిన సాయంకాలం ---------------------------------- సాహిత్యాకాశంలోని ఓ చిన్ని మేఘం చిరుజల్లు కురిపించింది భారతకోకిల భాగ్యనగరావాసంలో సదమల సాయంత్ర సమయాన తలవెండ్రుకల్ని తళతళ లాడించే కుంకుడు చెట్టు కింద కూడిన చిలుకల ముచ్చట్లకు ముచ్చట పడిన ప్రపంచ కవిత్వ దినం పసిడి సింహద్వారం లోకి పరుగులు తీస్తూ వచ్చింది ఆత్మీయతానాదం అంతర్లీనంగా ధ్వనించే వాతావరణం ఆరాజేందరనందకిశోరాన్ని అలరించింది పరిణతవాణి పరిచయాలు ప్రఫుల్ల కవితా చంద్రోదయాలు కలంపడుతున్న కలువ మొగ్గలకు ఆశల సౌదామినులయ్యాయి ఆశయాల హరివిల్లులయ్యాయి కొత్త గొంతుల కోయిలల గానం చిత్త శుద్ధి చేసింది చివర చిలుకలు వాలిన చెట్టును చిత్తరువు బంధించింది ---------------------------------------- వాధూలస 22-3-2014 ప్రపంచ కవిత్వ దినోత్సవ సందర్భంగా 'కవిసంగమం'లో ప్రేక్షకుడినై పొందిన అనుభూతి.

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuVK

Posted by Katta

Srinivas Yellapragada కవిత

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ ||మార్పు|| ఎవరు మారతారు.. పెద్దవారిని ప్రాధేయ పదాలతో శరణు వేడినా చిన్నవారిని మందలింపు బెత్తంతో అదిలించినా స్నేహితులను ఆకర్షణ మాటలకు గురిచేసినా తెలిసినవారిని అప్పుడప్పుడూ వినమ్రంగా చెప్పిచూసినా ఎవరు మారతారు.. మాయ పొరల్లో దాక్కున్న వేల జన్మల ధోరణులవి నశించిపోయే అస్థికల అస్థిత్వాన్ని నమ్మి ముందుకు సాగే అడుగులవి ఒక వాక్యం సరిపోతుందా.. ఒక చిత్రం చూపిస్తుందా వారికి నిజం నిరూపించడానికి ఒక సత్యం చూపించడానికి స్వీయ అనుభవ కొరడాలు పేలాలి భావాల కొంపలు కుప్ప కూలాలి అంతవరకూ.. ఎవరు మారతారు.. 22MAY14 ...(సూరీడు)

by Srinivas Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuVy

Posted by Katta

Chi Chi కవిత

_పదార్ధం_ ఎన్నర్థాలు మింగితే అన్ని పదాలు కక్కుతాం రా.. >చా..అవునా!! ఎలా మింగుతావ్?ఎలా కక్కుతావ్? easy ఎహే basicగా గమనించాల్సిందేంటంటే అర్థాలకు పదాలు పెట్టారా or పదాలకు అర్థాలు పెట్టారా!! అర్థం అంటే పదమా , అర్థమా!! గమనించేసావా? ఇప్పుడు doubts ఉంటే అడుగు >తు నీ.. అర్థం అంటే ఏంటో అర్థం కాట్లా.. అది పదం అనయితే అర్థమయింది ఎక్కడో ఏదో miss అయావెహే..మళ్ళీ గమనించు >నియయ్యా!! ఇపుడు పదమంటే ఏంటో కూడా అర్థం కాట్లా పదానికి అర్థముంది..అర్థానికి పదముంది..అంతే matter..ఇంకేం గమనించకు >ఏదో అర్థమయింది..అది సరే , అర్థాన్ని ఎలా మింగాలి? పదాలతో >మరి పదాలు కక్కితే అర్థాల్ని కక్కినట్టు కాదా? నిజమే రోయ్!! నేను గమనించలేదిది >పదమే అర్థం , అర్థమే పదం నువ్విలా నాకన్నా ఎక్కువర్థం చేస్కోకు..నాక్కాల్తుంది >సరే..అవి రెండు లేకపోతే ఎలా ఉంటుంది? _______________________________________Chi Chi

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuFg

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి నిషా ఒక చుక్కతో మొదలైంది నిషాగా ఉండే ఆ జీవితం ఆ ఒక చుక్కేనే సముద్రంగా చేసుకుని నాకు తెలియకుండానే త్రాగేశాను మరి ఇప్పుడు ఆ మరణసముద్రం నాలో ఉండి నన్ను పీల్చుకుంటూ తన దాహం తీర్చుకుంటుంటే గుండెలో స్పందనలు మెల్లమెల్లగా ఆగిపోతుంటే శవపేటికపై నేను! 21Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkAuzS

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||గుగాగీలు-15|| @ గురువుగారు, పుస్తకమొకటి దొరికింది, భాష తెలియదు.. ఏం పుస్తకమో ఇది,. మీ దివ్యదృష్టితో చూసి సెలవిస్తారా స్వామి. # ఇది కవిత్వ పుస్తకంరా,. నాయినా @ఆహ, మీ దివ్యదృష్టి అమోఘం స్వామి, క్షణం లో చెప్పేసారు, సమాధానాన్ని. # ఒరేయ్ పిచ్చి శిష్యా,. దివ్యదృష్టి లేదు, గాడిదగుడ్డూ లేదు,. ప్రపంచంలో ఎక్కడైనా సరే,. అక్షరాలు తక్కువ, ఖాళీలు ఎక్కువ వుండే ఒకే ఒక్క పుస్తకం,,. కవిత్వమేరా,. ఒకటో తరగతి అక్షరాల బుక్కు తరువాత., ------------------------------22/03/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkAu2H

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ ॥ సు దూ ర స్వ ప్న ౦ ॥ ఖచ్చిత౦గా చెప్పలేకపోతున్నా ఆమె, తన ప్రేమను ఆ చూపుల్లో ప౦పుతో౦దా? ... బహుశా ఆమెకు నా ప్రేమ‌ తెలిసే ఉ౦టు౦ది కదా ఎ౦దుక౦టే, తారసపడిన ప్రతిసారీ దొసిళ్ళకొద్ది ప్రేమను ఆమెపై గుమ్మరిస్తాను నా ప్రేమ గాఢమై౦దని నా ప్రగాఢ విశ్వాస౦... చాలాసార్లు గమని౦చాను! ఆమె పెదాలు చిన్నగా విచ్చుకొనేవి ....దరహాస౦లో లార్వ ను౦డి వెలువడే ర౦గుల సీతాకోక చిలుకే గుర్తొచ్చేది...... మృధువైన పొడవాటి ఆమె వ్రేళ్ళు... ఆ నవ్వు కనిపి౦చనీయకు౦డా ఆమె ప్రయత్న౦..! అయినా సరే! పొగమ౦చును మెత్తగా పక్కకు తప్పిస్తూ వస్తున్న కిరణ౦లా ఆమె నవ్వు ఎప్పుడు దాగేది కాదు ఆ క్షణాన నా కనుపాప‌లు తన్మయ౦తో అరమోడ్పులై.... ఆమెను అద్భుత౦గా ప్రేమిస్తున్నానని చాలా సార్లు ఎద చ‌ప్పుడు చేసేది.... ఓ మిట్ట మధ్యాహ్నపు కల విశాలమయిన పచ్చిక బయళ్ళలో ఆమె, నేను ఏకా౦త౦గా ఎన్నో క్షణాలను ఏరుతూ కుర్చున్నట్లు....! మౌన౦గానే భావిజీవితాన్ని ప్రణాళీకరి౦చుకొన్నట్లు 2 ఉదయ౦ పూట వచ్చే కలలు నిజమవుతాయన్న ఆశ ఇప్పటికీ నాలో!!!

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r9fyPz

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

సమాధానం ఇస్తాం అంటే ప్రతి వాడు ప్రశ్నలు కురిపించేవాడే !!పార్ధ !!22mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inkSKh

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మన కుటుంబం లో పిల్లవాడు పని చేసుకు వస్తే బాగా చేసావు , ఇంకా కొద్దిగా చేస్తే బ్రంహాండం అంటే వాడు పొంగిపోయి మళ్ళీ చేసే సమయం లో ఇంకా బాగా చేస్తాడు , భర్త భార్యను బాగా కష్టపడుతున్నావు అంటే ,ఎంతటి కష్టాన్ని అయినా చిరునవ్వుతో ఎదుర్కొని చక్కటి ప్రశాంత జీవితం , సహకారం ఇస్తుంది , రంగాస్తల నటులు చప్పట్లు కొడితే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోయీ మనల్ని సంతోష పెట్టటానికి ఇంకా కృషి చేస్తారు , ఒక సంస్త యజమాని సిబ్బంది ని పిలిచి మీ వలన లాభం వచ్చింది అని అంటే ఉద్యోగులు తమ పని కి గుర్తింపు వచ్చినట్లుగా భావిస్తారు ,ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది , ఒక చిన్న ప్రోత్సాహం ఎన్ని విజయాలకు పునాది అవుతుందో , ప్రోత్సాహం అనేది ఒక గొప్ప శక్తి లా పనిచేస్తుంది . ఇక్కడ కవులకు కూడా మీ లైక్ వాళ్లకు ప్రోత్సాహం , దీనివలన నేను మనుషుల మధ్య వున్నాను అన్న భావన తో పాటు కొన్ని లక్షల మధ్య మనకు తెలియని వ్యక్తులు నా కవితను ఇష్టపడ్డారు అంటే , ఆ ఆనందం వర్ణనాతీతం , అది అనుభవిస్తే కాని తెలియదు . . ఒక ప్రోత్సాహం ఇవ్వటానికి మనకు ఎంతో గొప్ప మనసు వుంది తీరాలి , అది జన్మ సంస్కారం అయి ఉంటేనే మనకు వస్తుంది . ప్రోత్సాహానికి పెట్టుబడి లేదు కేవలం బాగుండాలి , ఇంకా బాగారాయాలి అనే గొప్ప మానసిక భావన . మన కుటుంబానికి అతిధి వస్తే పలకరిస్తాం , మన గ్రూప్ లో ఏదైనా కవిత రాసిన , మంచి వాక్యాలు రాసిన దానిని లైక్ చేయటం మన అందరి ధర్మం . ప్రోత్సాహం లో వున్నా ఆనందం మనం అందరం అనుభవిద్దాం . మనలా అందరు సంతోషం లో ఉండేలా ప్రోత్సహిద్దాం . హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరేహరే మహామంత్రం జపించండి ఆనందం గా జీవించండి మీ అడ్మిన్ కృష్ణా తరంగాలు పార్ధసారధి ఊటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inkStZ

Posted by Katta

Madala Venu కవిత

సామరస్యపు సమ శల్యపు పెనుగులాటలో అప్పటి వరకు అణిగివున్న ఆవేదననంతా ఈ అర్ధరాత్రీ తనే అందుకుంది. పాల సముద్రుడి నురగలో, తేనె ప్రబుద్దుడి తరగలో, మల్లె వర్ణపు తాలికలను ప్రకృతికి ఇప్పించి పురుషుడిని సూరుణ్ణి చేస్తుంది. అలజడులన్నీ అణిచివేసే ఈ రాతిరి అందరి అగాదాలను ఆవహించుకొని నల్లటి రంగులోకి మారుతుంది ఇలా ప్రతీ రాత్రి .

by Madala Venu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d8ZZna

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఒక విన్నపం. సభ్యులుగా చేరండి.. చరిత్రలో భాగస్వాములు కండి http://ift.tt/1iLnu5z

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPm9bb

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLnwdJ

Posted by Katta

Swatee Sripada కవిత

“ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ” ,.... స్వాతీ శ్రీపాద సతత హరిత జ్వాలల్లా వెలిగే వృక్ష ముదాయాల నీడల్లో ఒదిగి ఒదిగి బిడియాన్ని దాచుకున్న అమాయకపు రోజులనుండి నీళ్ళచుట్టూ నదిచుట్టూ అల్లుకున్న అనంత బాల్యావస్థ పిచ్చుక గూళ్ళను౦డి తీపితేనే మాధుర్యాలు తప్ప పదునైన మాటల ఈటెలు ఇంకా నాలుకలపై మొలవని ఆదిమజాతి క్షణాలనుండి నేనూ నా చుట్టూ అనుకునే సమైక్య భావనను౦డి ఈ కాలబిలం సుడిగుండమై ఎలా నిన్ను లాగేసుకుందో తెలియదు ఎవరిచుట్టూ వాళ్ళు దిగులు పాటల గూళ్ళల్లుకు౦టూ కనిపిస్తూనే అదృశ్యమయే కాంక్షల మయసభల్లోకి నాలుగు రోజుల జీవితాన్ని సుఖాల వినువీధిలో రెపరెపలాడే రంగుల గాలిపటం చేసుకుందుకు ఎందరి బ్రతుకుతెరువో గాజు పెంకుల్లా నూరినూరి పలచని సుకుమారపు మానవీయత సిల్క్ దారం మరుగుపరచేలా మనసారా అద్ది అద్ది మా౦జాగా చేసుకు రక్త విహారం చేస్తూ చీకట్లు గొంతు తెంపుకు అరుస్తున్నా విజయోత్సాహపు మత్తులో మునిగితేలే ఈ అసురసంధ్య చివరిఘడియలమీద ఒక అద్వితీయ శక్తిననుకు౦టూ ఆధునికత తామరతంపర అడుసులో ఇరుక్కుపోయావు మనిషీ చేసిన పాపాలు వెన్నంటే ఉన్నాయి మరి బాల్యం వీప్మీద బరువులుగా మారి నీకు నిన్ను రేపటి అధికార వ్యామోహపు సంకెళ్లతో బానిసను చేసి నీకు నిన్ను అహంకారపు స్టేటస్ కు తలవంచుకునేలా చేసి చినుకుల్లా రాలి మనుగడ సాగు చేసే అక్షరాలూ ఏ మూలకు వడగల్లై చదువులు అటూ ఇటూ తిప్పికొట్టిన వేగంలో నిన్న నువ్వు నిలవరి౦చుకున్నవా చాపిన నీ చేతి కందినంత మేరా నిలుచున్న నేలనే ఆకాశం అంటావు సముద్రాలు సప్తరుషులు సర్వం సావిట్లో కట్టేసుకున్న పెంపుడు కుక్కలవుతాయి 2. కను చూపు మేర కంది చేలల్లా డబ్బు మొలిపించే రాతి సామ్రాజ్యాల మధ్య చుట్టూ హిమపర్వాతాలా పేర్చుకున్న మణిమాణిక్యాల మెరుపుల మధ్య ఆకాశాన్ని ఒంట్లోకి దిమ్పుకున్నట్టు నీలమై పోతున్న మనిషీ నిజం చెప్పు నువ్వేగా హరిత వనాలను పరిశ్రమలుగా మార్చినది చల్లగాలిని ఒడుపుగా పట్టి పంజరం లోన పెట్టినది ఆహ్లాదాన్నీ , సహజత్వాన్నీ తెగనమ్ముకు నీ చుట్టూ నువ్వు కంచెలు పాతుకు విలాసాలకు నెలవైనదీ అర్ధంతరంగా ఇలా చీడ పట్టిన చిక్కుడు పాదులా విలవిలలాడితే ఎలాగ? అన్యదా శరణం నాస్తి శరణం మమ అనుకుంటూ ఖాళీతనం శూన్యంలో మళ్ళీ మనసులను నాటుకో కధలుగా మారిన గత వైభవానికి ఈ ఆధునికత సమాదులమీద మనమనే విత్తనాలు చల్లుకో అన్యదా శరణం నాస్తి పాట పంచాక్షరిలా పునర్ జీవనానికి నడుం కట్టడమే ...

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLntPa

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

గృహస్తులూ ... సంచారులూ (అనువాద కవిత ) గృహస్తులు తమ కోసం తాము నిర్మించుకున్న ఇళ్ళల్లో నివసిస్తారు సంచారులు ఎవరూ నిర్మించని అతి పెద్ద గృహంలో నివసిస్తారు గృహస్తులు కుర్చీలలో కూర్చుంటారు .... వాటి కింద సాలెపురుగులు కదులుతుంటాయి సంచారులు గడ్డి కొండల పైన కూర్చుంటారు ... వాటి కింద వాన పాములు తిరుగుతుంటాయి గృహస్తులు, సంచారులని దొంగలు గా భావిస్తారు భూమినీ, నీళ్ళనీ దొంగిలించిన వాళ్ళని వొదిలేసి, సంచారులు ముందుకు సాగి పోతారు అదే అగ్ని మండుతుంది ... అదే వేడి అందరికీ అందుతుంది చందమామ వెలిగించిన రాత్రి, గృహస్తు - అతడి భార్య నిద్ర పోతారు వెన్నెల వెలుగులు వాళ్ళని తాకవు అదే రాత్రి, తన పురుషునితో కలిసి శయనించిన సంచార స్త్రీ వెన్నెల వర్షం లో తడిసి పోతుంది అదే సూర్యుడు ఉదయిస్తాడు .... అదే సూర్యుడు అస్తమిస్తాడు గృహస్తు భార్య, తన పిల్ల వాడికి స్నానం చేయిస్తుంది వర్షం, సంచార బాలుడికి స్నానం చేయిస్తుంది గొడుగు నీడలో గృహస్తు భార్య, తమ పిల్లాడిని బడికి పంపిస్తుంది సంచార బాలుడి తల్లి, ఎర్రటి ఎండలో, వాడిని వాడి జీవితానికి వొదిలేస్తుంది అదే ప్రకృతి పిలుస్తుంది .... అదే శబ్దం వినిపిస్తుంది గృహస్తుల అమ్మాయి, గృహస్తుల అబ్బాయితో పాటు వెళ్లి పోతుంది ఇద్దరూ ఇంటికే వెళతారు .... సంచారుల పిల్ల, సంచారుల పిలగాడితో పాటు వెళ్ళిపోతుంది మరి, ఈ సంచారుల పిల్లలు ఎక్కడికి వెళతారు ? -మళయాళ మూలం : ఎస్ జోసెఫ్ - కొట్టాయం ఇంగ్లీష్ అనువాదం; ఏ జే థామస్ [21 మార్చి - ప్రపంచ కవితా దినోత్సవం]

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPm877

Posted by Katta