మరువం ఉష | తోడై వస్తావా సహోద్యోగి గా? ------------------------------------------ "కవిత్వం అంటే?" నాకు నేనే వేసుకున్న ప్రశ్నని మోసుకుంటూనే, పదిలంగా నా 'కవితాసంకలనం' ఒకటి నీకు పోస్టులో పంపుదామని... "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" నిర్లిప్తం గా సమాధానం కొరకు వేచిన చెవులతో ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు, ఉద్యోగాలు: డాలర్లలో/డాలర్ల కోసం, ఇంద్రియాలు వేలం వేసుకుని క్రిమి ఇబ్బంది గా కదులుతోంది లోలోపల: గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు నీరుగారిన ఆశలు, ప్రణాలికలు మనసులో- దేహం లోపలా వెలుపలా ప్రవహిస్తున్న చీమూ నెత్తురు బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు - ఏ జలతత్వం తెలపాలి? నువ్వు, నేను, తను నిజానికి ఈ మర్త్యలోకం, కదిలే జీవం ఏదో ఒకనాటికి Perishable మరణ సంహిత ఇదే/ను/గా/!? విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే, విశ్వం పట్టటానికి అంతే లోతైన గొయ్యి తవ్వాలి, ఇదే, ఈ నానాజాతులకి నాబోటి జీవి తలపెట్టగల Potentially Hazardous యోచన "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" మళ్ళీ అదే నవ్వుతో, విసుగు ధ్వనిస్తూ అదే ప్రశ్న- తెప్పరిల్లాను కానీ, I grinned back, sort of smiled... చెప్పగల/అంగీకరించబడే మాట మెత్తగా అప్పజెప్పి కొత్త సమాధానం కొరకు వెదుకులాట ఈమారు నాలోని నాకు నేను వేసుకున్న ఇంకొక ప్రశ్న పువ్వుల్లో ఏదో ఉంటుంది, పసిపాప నవ్వల్లే - ఏమిటది? పసిపాప కన్నుల్లో దాగి ఉంటుంది వెన్నెలల్లే సున్నితం గా, లేతగా- లేత గాలిలో, నీరెండలో కోమలత్వం ఉన్నట్లే అవన్నీ fragile beings, ఖచ్చితం గా విలువైనవీను కాలం ఎంత చిక్కగా ప్రవహిస్తుంది, ఎన్నిటిని దాటుకుని ఎడతెరిపిలేకుండా... ప్రశ్న వెనుక ముసురుతూ ఇంకొన్ని మరికొన్ని ఇంకెన్నో! అశాశ్వతం కి నిర్వచనం: ఏది? ఇదొక్కటీ శాశ్వతం గా దొరికితే బావుణ్ణు కలవటం, విడిపోవటం, పోగొట్టుకోవటం, నిరీక్షించటం నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ బలం గా చేధిస్తే - ఆకాశం దాచుకున్న nonperishable, సముద్రం పొదివిపట్టిన perpetual శాంతి నిత్య సత్యమై పోదూ!? యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు- మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా! ఇకిప్పుడు చెప్పు, నీ నుంచి, నా నుంచి, మనల్ని కాపాడుకునే వృత్తిని చేపడదామా మనమిద్దరం ఈ చిన్ని లోకాన్ని రక్షిద్దామా? "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" విశ్వాల తనిఖీ చేస్తూ - సృష్టి కోసమొక తపాలా వ్యవస్థ కనిపెడుతూ - మరణించే వరకు ఓ మహత్తర కార్యం నెరవేరుస్తూ... కవిత్వమంటే జవాబు అవసరం లేని బతుకు సాగిస్తూ- లోలోపల పగుళ్ళ సవ్వళ్ళు వినవస్తున్నాయా? రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక నీకు త్రోవ చూపుతూ- 05/02/2014
by మరువం ఉషfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jfFzL3
Posted by
Katta