పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
R Rama Krishna M లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
R Rama Krishna M లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2014, బుధవారం

R Rama Krishna M కవిత

ll వొస్తనే వుంటరు ll -ఆర్. ఆర్. కే. మూర్తి 12/03/14 ఇగ ఆడొస్తడు ఈడొస్తడు అడ్డమైన కొడుకులంతా వొస్తరు నువ్వు తలుపుతియ్యంగనే దండం పెడ్తరే పెద్దయ్యా ఇటు ఇటు జూసి నీ కాల్లు భీ మొక్తరు యాదిలే? ఐదేండ్లకింద రాలే ? గాల్లే గిప్పుడు మల్లచ్చిండ్రే పెద్దయ్యా ! పైసలిస్తరు మస్తు జెప్తరు పాపమంటివా బతుకు పాయిఖాన జేస్తరు ఈల్లు మడుసులుగారే పెద్దయ్యా కండువలు కప్పుకున్న మెకాలు.. మకురాలు చెప్పు చేతులవట్టుకోని ఆడు నీకేం జేసిండో అడుగు ఆడు గప్పుడెట్టుండె మరి గిప్పుడెట్టుండు అడుగు నా కొడుకుని ఇయ్యన్ని ఏడికెల్లి వొచ్చినయో మల్ల గనపపడితే మక్కెలిర్గుతయని చెప్పు ________________________

by R Rama Krishna M



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH1Tg3

Posted by Katta

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆర్. ఆర్. కే. మూర్తి ll కళ్ళు ll


ఆ కళ్ళు తెరుచుకు
వత్తులు వేసుకు
చూస్తూనే ఉన్నాయ్
ఇంకేదో చేస్తావని

నీ బాన పొట్ట
పెరుగుతూనే ఉంది
నీ పాపాల చిట్టాలాగ

ఇవి నోళ్ళు మూసుక్కూర్చున్న
ఆ తరం కళ్ళు కావు
ఇవి అయిదేళ్ళూ నిద్ర పొయే
ఆకళ్ళు కావు
నీవు చిమ్మిన
ఏ దుమ్ముకూ మూయని
ఎరుపు జీరల ఎరుక కళ్ళు

ఈ కళ్ళలో చిరునవ్వు
తన పసి కూన కోసం మాటేసిన
హైనాను చూసి నవ్వే
ఛిరుత దరహాసం

ఆ కళ్ళనుండి
నిన్నే చంచల్ గూడా లూ తీహార్లూ
రక్షించలేవు

ఆ కళ్ళు
అసీం త్రివేది కార్టూన్లు
తెహల్కా కెమెరాలు

అవి చేసే వర్చువల్ యుద్దానికి
నీ బలుపంతా బలవ్వాల్సిందే
నీ పరువంతా నీకక్కుర్తిలో కలిసి
నివ్వు నడి రొడ్డున పడాల్సిందే

అయితె ఆ కళ్ళకు ఇది కూడా తెల్సు
" నీది సిగ్గులేని జన్మ" ని !

----Dt: 12-09-2012:
Please have sense of communication while making suggestions on 'how to post in kavi sangamam'; don't allow your over enthusiasm kill the interest of poets to post..

19, ఆగస్టు 2012, ఆదివారం

ఆర్. ఆర్. కే. మూర్తి ll అబద్దాల మధుశాల ll


దారి నిను వదిలేసింది
భావాల మోజులో పడి

చుట్టూ ఉన్న గడ్డిని చూసి
చెట్టు తన వేళ్ళని వదిలేసినట్టు

ఆకలికీ షోకులకూ
విడాకులు ఈ జన్మవిగావు

నిజాలు చేదన్నదెవరో
నేనవి లేని చొట హాయంటాను

అందమైన ఊహల మధుశాల గదా !
ఈ అబద్దాల చెరసాల

గాలివాటపు ప్రపంచానికి
మనసు చూపులెక్కడివి?

కాన్సరొచ్చింది బాబూ అంటే
లడ్డూ కావాలా నాయనా అంటుంది.

*18-08-2012