బాలు వాకదాని ||బ్రతుకు పోరాటం|| బిందాస్ మాటలన్నీ మనోనిబ్బరంకోసమే, కడుపు నిండికాదు వీధి వీధి తిరిగేది ఆసరాకోసమే, ఆనందం కోసం కాదు అంతర్జాల గోడలపై తగిలించిన బొమ్మలన్నీ పాతవే, కాస్త ఉరటకోసం బాకీ లెక్కల కాగితం గుండెను తడుముతుంది చొక్కా జోబులోనుంచి నా వాళ్ళంతా నిలదీస్తున్నారు నన్ను నిలబెట్టటానికి అణిచిపెట్టిన ఆసక్తినంతా కొలమానాలతో చూపించాలెమో! దగాపడిన హృదయం మరోసారి సిద్దమౌతుంది తాకట్టుకి తగలపెట్టిన ఆదర్శాలు, సిద్ధాంతాలలోనుంచి తీసిన ఆయుధంతో మంచి మనసుని పొడవాలి కావలిసిన దానికోసం కసితో నేన్నుంటే, కాకమ్మ కథలంటారేమో! దారంతా వెతుకులాటే, కాస్త వెలుతురు వేసేవాళ్ళు తోడైతే భావుండు మన:శాంతి, మనోవేదన పట్టింపులేమీలేవు, కాస్త పనుంటే చాలు ఇంతకన్నా సాక్షాలు ఏంచూపను? రూపీకోసం, రోటీకోసం చస్తున్నానని బాలు వాకదాని 09-03-2014
by Balu Vakadani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BP
Posted by Katta
by Balu Vakadani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BP
Posted by Katta