వొరప్రసాద్ గారు రాసిన కవిత ||వయసుడిగిన జీవితం !!కవిత్వ విశ్లేషణ మనిషి మూడు దశలలో బాల్యం, యవ్వనం, వృధ్యాప్యం, వీటి లో ఏది క్లిష్టమైనది, .బాధాకరమైనది అన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు మలి దశ లో నిరాదరణకు గురి అవుతున్న వృధ్యాప్యం కనిపిస్తుంది ..నేటి కాలపు యువత తమ ఉనికి కాపాడుకోవటానికి, పైకి ఎదగటానికి తమ కన్నవాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ తమ ప్రగతి కి అవరోధం గా భావిస్తున్నారు ...వోరప్రసాద్ గారి కవిత లో ..వయసుడిగిన వ్యక్తి కొడుకల చే నిరాదరింపబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్టు గా చూపించారు .. యవ్వనం లో సాదించిన విజయాలు మరుగున పడి జ్ఞాపకాలు గా మారిపోతాయి, నిజమే కామోసు ..వయసు లో ఎన్ని పెద్ద పెద్ద లక్ష్యాలను చేదించినా కూడా అది అంతా గతం వలయం లో నే కొట్టుకుపోతుంది కదా... // గడిచిన యవ్వనపు జీవిత విజయాలు//మరుగునపడిన జ్ఞాపకాలై వెక్కిరిస్తుంటాయి వయసు శక్తిని ముసలితనపు చాయలు లాగేసుకొంటే, పెరిగిన పోటి ప్రపంచం లో ధర లతో ...నిత్య సమస్యలతో యుద్ధం చేస్తున్న పుత్ర రత్నాలకు భారం గా తోచి మానవత అనేది లేకుండా, అక్కరలేని వస్తువు గా మూలన పడేసినపుడు .....కూడా ఇంటి చూరుకు వేలాడుతూ వుంటారు .......తమ నిస్సహయత ని తలచుకొని.. అసమానతల పోటీ ప్రపంచం//కుటుంబాల్లో మానవత్వాన్ని కబళిస్తుంటే వయసుడిగిన శరీరాలు//ఇంటిచూరుకి భారంగా వేలాడుతుంటాయి మిడిల్ ఏజ్ నుంచి మలి దశ లో కి అడుగుపెడుతున్నపుడు శరీరం లో ఏ భాగం సహకరించదు నిజమే కుర్రాళ్ళు గా వునప్పుడు ఉన్న ఉత్సాహం వయసుడిగిన తరువాత ఉండదు కదా...., అప్పుడు ...అచ్చం పగుళ్ళు బారిన భూమి లా మారుతుంది ... అలసిన శరీరం//పటుత్వం కోల్పోయి//పగుళ్ళు బారిన బీడుభూమిలా మారుతుంది వయసు జోరు మీద ఉన్నప్పడు గెంతిన గెంతులు కాస్తా ....వంగి ...వంపులు తిరిగి ....వెన్నముక కి ఆధారం లేకుండా దారి తప్పిస్తుంది ...తాము కోల్పోయిన యవ్వనాన్ని ఉత కర్ర సాయం తో నిలబెట్టటానికి యత్నిస్తారు .. యవ్వనాన్ని కోల్పోయిన వెన్నెముక/ధనుస్సులా వంపు తిరిగి గరిమనాభిని దారి తప్పిస్తుంటుంది వయస్సు కోల్పోయిన/శరీరాన్ని నేలపై నిలబెట్టడానికి//ఊత కర్రతో ప్రయత్నిస్తుంటారు// ఒకవైపు వంటి నిండా జబ్బులతో నిస్సహాయత ఆవరించి, ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే , అయినవారి ఈసడింపులు , విసుగు ద్వనించే మాటలు ....ప్రేమలేనితనం ....అన్ని కూడా ఆత్మ గౌరవాన్ని పరీక్షిస్తూ వుంటాయి శరీర నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని//దెబ్బతీస్తుంటుంటే అయినవారి నిరాదరణ/ఆత్మగౌరవాన్ని నిత్యం పరీక్షకు పెడుతుంటుంది// కవిత చివరి రెండు పాదాల్లో ...వృధ్యాప్యం యొక్క దీనావస్థ ని కళ్ళెదుట ఉంచారు ...ప్రసాద్ గారు, ఆశ సచ్చిపోయి , పరాయికరణ లో సర్వం కోల్పోయి , ఏ మూల కొట్టు గది లో నో ..మరే ఇంటి వసారా లో ను ...కుక్కిన మంచం లో దగ్గుతూ మూలుగుతూ ...బతుకు ఈడుస్తారు , గతం లో తల్లి తండ్రి ని దైవం గా పూజించి నెత్తిన పెట్టుకునేవారు ...వర్తమానం లో మాత్రం అవి కరువు అయ్యి ...ఆత్మీయత కు నోచుకోక ....ఆశ్రమాల వెంట పరిగెత్తడం నిజంగా విషాదభరితమే, ప్రతి తల్లి , ప్రతి తండ్రి ఎదుర్కొంటున్న సమస్య నే .... //నిరుత్సాహం కమ్ముకుని//వ్యక్తిత్వం కోల్పోయి నిర్జీవులుగా మసులుతూ// అప్పుడప్పుడూ దగ్గుతూ ఇంట్లో ఉనికిని చాటుకుంటారు// త్మీయుల పలకరింపులకు నోచుకోని వృద్ధాప్యం మనిషిని ఓడించడం ఓ వర్తమాన విషాదం// నేటి సమాజం లో జరుగుతున్న ఎన్నో విషాద ఘటనలకు, చితికిపోతున్న ముసలి ప్రాణాల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు ....ఇప్పుడు ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ తమని తాము సరి చూసుకోవాల్సి వుంటుంది తమ పెద్ద తరం విషయము లో, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని కాపాడాల్సిన బాధ్యత ను గుర్తు చేసారు ..సమాజం అంత మారకపోయినా అక్షర జ్ఞానం ఉన్న ఏ కొద్ది మంది అయిన ఈ కవిత ని చదివి మారటానికి ప్రయత్నిస్తే ...వారు విజయం సాదించినట్టే . కవిత ని మొత్తం ఒకేసారి కుప్ప గా కాకుండా ..విడి విడి గా రాసి వుంటే ఇంకాస్త లోతు గా మనసులోకి వెళ్ళటానికి ఆస్కారం వుండేది ..అయినా కూడా సామజిక స్పృహ ని తట్టి లేపే ఇలాంటి కవితలు అవసరం ....మంచి కవిత ను అందించిన ప్రసాద్ గారికి అబినందనలు .. సెలవు ... అలసిన శరీరం పటుత్వం కోల్పోయి పగుళ్ళు బారిన బీడుభూమిలా మారుతుంది యవ్వనాన్ని కోల్పోయిన వెన్నెముక ధనుస్సులా వంపు తిరిగి గరిమనాభిని దారి తప్పిస్తుంటుంది వయస్సు కోల్పోయిన శరీరాన్ని నేలపై నిలబెట్టడానికి ఊత కర్రతో ప్రయత్నిస్తుంటారు శరీర నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంటే అయినవారి నిరాదరణ ఆత్మగౌరవాన్ని నిత్యం పరీక్షకు పెడుతుంటుంది గడిచిన యవ్వనపు జీవిత విజయాలు మరుగునపడిన జ్ఞాపకాలై వెక్కిరిస్తుంటాయి పెరిగిన ధరలు అసమానతల పోటీ ప్రపంచం కుటుంబాల్లో మానవత్వాన్ని కబళిస్తుంటే వయసుడిగిన శరీరాలు ఇంటిచూరుకి భారంగా వేలాడుతుంటాయి నిరుత్సాహం కమ్ముకుని వ్యక్తిత్వం కోల్పోయి నిర్జీవులుగా మసులుతూ అప్పుడప్పుడూ దగ్గుతూ ఇంట్లో ఉనికిని చాటుకుంటారు ఆత్మీయుల పలకరింపులకు నోచుకోని వృద్ధాప్యం మనిషిని ఓడించడం ఓ వర్తమాన విషాదం ఏప్రిల్ 9, 2014
by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hqlcdh
Posted by
Katta