పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Katta Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Katta Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2014, ఆదివారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || నాన్నపేగు అప్పుడు అమ్మమాటకోసం అడవుల్లోకి వదిలినా కన్నపేగుని వదలని మనసుతో ప్రాణాలొదిలింది తనే. మరోసారి మామ కత్తికి బలికాకుండా కాచేందుకు అర్ధరాత్రి వానలో గంపకెత్తుకుని నదినిసైతం లెక్కచేయకుండా దాటించి కాచుకుందీ తానే. బాధలన్నీ గాంభీర్యపు కవళికల చాటున దాచేసి వున్నదంతా ఇచ్చేసేదీ తనంటే తనే నిజమే సుమా దేవుడ్నయినా దయతో కాచుకునేది నాన్నే అమ్మతర్వాత అమ్మంతటిదీ తనే. అశ్వద్ధామా హత: చెవికి సోకగానే ఆయుధాల్నీ, ప్రాణాల్నీ వదిలేంత పుత్రశోకం. గురుధర్మం రూపంలో తూస్తే ప్రేమగా కనపడకపోవచ్చు. వందతప్పుల్ని చూస్తూ కళ్ళుమూసుకున్న కట్టడిని లోకం గుడ్డిదనుకోవచ్చు. అమ్మప్రేమలా అది ఊటబావి కాదు నిరంతరం తడిగా కనిపించేందుకు అమ్మతో సహా నీచుట్టూ తన దేహాన్నే ఫణంగా పెట్టి నిలుచున్న రాతికోట. అప్పగింతలప్పటి వరదగుడి ఎదురుదెబ్బల్ని కాచే జీవితపు బడి గుండెలపై జేబుని ఊయలచేసి ఊపే ఒడి పుట్టగానే తల్లిపేగుని కత్తిరించినా పోయేవరకూ అంటిపెట్టుకుంటుందేమో నాన్నపేగు. బిడ్డలు తాకినప్పుడల్లా అదిమనల్ని సాకుతున్నట్లు కనబడుతుంది. ► 15-06-2014 ► http://ift.tt/TXXrjh

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrjh

Posted by Katta

28, మే 2014, బుధవారం

Katta Srinivas కవిత

http://ift.tt/1pxd8Io 10tv.in లో కవిసంగమం కార్యక్రమం గురించి

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxd8Io

Posted by Katta

22, మే 2014, గురువారం

Katta Srinivas కవిత

పద్యలక్షణాలను తెలుసుకునేందుకూ, గణవిభజనకు సాప్ట్ వేర్ వుంది గమనించారా? Dileep Miriyala గారూ మీ టెక్నికల్ పరిజ్ఞానాన్ని చాలా సమయాన్నీ శ్రమనీ తీసుకుని తెలుగుకోసం వినియోగించటం చాలా గొప్ప విషయం సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ ఇలా పద్యాలను ఇచ్చి గణవిభజన చేయమంటే కొంచెం కష్టమే అనుకుంటున్నారా? గణవిభజనను సరిచూసుకునేందుకూ, పద్య లక్షణాలు తెలుసుకునేందుకూ సాప్ట్ వేర్ http://ift.tt/SmeN8N

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SmeN8N

Posted by Katta

21, మే 2014, బుధవారం

Katta Srinivas కవిత

ఆకర్షించిన వార్త : కవిత్వం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందా? అవుననే అంటున్నారు ఇంగ్లాండులోని దక్షిణ యార్క్ షైర్ లో వున్న షెఫిల్డ్ విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ మరియు అనేక అవార్డులు గెలుచుకున్న కవి Simon Armitage. వీరు రాసిన Praise of Air అనే కవితను ఫోటోలో వున్నట్లు అది పెద్ద సైజులో అంటే 10 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు వుండే ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారుచేసిన పేపరుపై పద్యాన్ని వేయించారు. ఈ కాగితాన్ని రద్దీగా వుండే రోడ్డు పక్కన వున్న వారి Sheffield విశ్వవిద్యాలయం గోడలకు అతికింపజేసారు. అయితే ఈ కాగితం కాలుష్య హరణ పదార్ధాలతో పూతపూయబడివుంటుందట అది గాలిలోని టైటానియం డైయాక్సైడ్ పదార్ధాన్ని తినేస్తుంది. దానికోసం వేరే కరెంటు, బ్యాటరీలూ వాడటం కాకుండా కేవలం సూర్యరశ్మి, గాలిలోని ఆక్సిజన్ ను మాత్రం వినియోగించుకుంటుందట. ఈ పోస్టరు తయారీకి 100 యూరోల లోపుగానే ఖర్చయ్యింది అంటున్నారు. దీని కెపాసిటీ రోజుకి 20 కార్లనుండి వెలువడే కాలుష్యాన్ని హరించేంత. ఒక సంవత్సరం పాటు దీనిని యూనివర్శిటి గోడలపై ఇలాగే ప్రదర్శించేలా ప్రణాళిక రచించారట.ఇంతకీ సైమన్ ఆ కాగితం పై రాసిన కవిత ఏమిటంటే ఇది. ► Simon Armitage || A poem for the poster || I write in praise of air. I was six or five when a conjurer opened my knotted fist and I held in my palm the whole of the sky. I've carried it with me ever since. Let air be a major god, its being and touch, its breast-milk always tilted to the lips. Both dragonfly and Boeing dangle in its see-through nothingness… Among the jumbled bric-a-brac I keep a padlocked treasure-chest of empty space, and on days when thoughts are fuddled with smog or civilization crosses the street with a white handkerchief over its mouth and cars blow kisses to our lips from theirs I turn the key, throw back the lid, breathe deep. My first word, everyone's first word, was air. కవిత్వాన్ని పర్యావరణం కోసం వినియోగిస్తున్న క్రియేటివిటీ భలేగా వుంది. అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఈ ప్రాజెక్టుని గురించి చెపుతూ ‘‘ కళా,శాస్త్రం మధ్య ఈ తమాషా జోడింపు చాలా ప్రధానమైన ప్రమాదకరమైన సమస్యను సమర్ధవంతంగా ఎత్తిచూపగలుగుతోంది.’’ అన్నారట నిజమే కదా? ................... (భరత్ రావు మాస్టారు గారికి ప్రత్యేకధన్యవాదాలతో...)

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jBPkDC

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || వృధా ప్రవాహం || మంటలు మంటలు మంటలు మంటలు దేశాన్నంతా కాల్చే మంటలు దేహాన్నంతా చీల్చే మంటలు నల్లని రంగువి, తెల్లని హంగువి గాంధిబొమ్మల రంగుకాగితం ఎర్రని నాల్కల నిండు జీవితపు మంటలు మంటలు నిండా మంటలు పక్కన మూగిన నక్కల వోలే నలగని చేతుల చలువ చొక్కాల్, గొట్టాలతో తెగ ఎగదోస్తున్నాయ్. వరదలు వరదలు వరదలు వరదలు కురవని ప్రేమల కుదరని ప్రేముల లొడలొడలాడే కదలికలతో రాత్రికి రాత్రే తెగిన ప్రవాహం కుర్చివైపుగ పరిగెడుతూనే పీకల్దాకా వాగ్ధానాలు పిపీలికాలకు వాగ్భాణాలు పిలుపుల పలుకుల పూనకాలతో ప్రజలమీదుగా ప్రవహిస్తున్నాయ్ వరదలు వరదలు. వరదలు వరదలు కుర్చీ వైపే కదిలే వరదలు. జండాకర్రలు, నిండా దిమ్మెలు కార్లూ బీర్లూ భజంత్రీలు ప్లాస్టీక్ రంగులు, వేస్టేజ్ జంకులు కోడ్ళూ గీళ్ళూ జాన్తానై అని కళ్ళూ చెవులను కూరేసేలా కుళ్ళు కాగితం కూరేస్కుంటూ తళతళ పెళపెళ విరుచుకు పడ్డాయ్ చెమటచుక్కనే పీల్చేసేందుకు పంచవర్షాల గాలం చేసి పిచ్చిచేపలకు వలవేసేందుకు ఉరుములు మెరుపులు ఊకదంపుడులు, మైకుల నిండా చిందే సొల్లు మాటల నిండా దొర్లే పొల్లు ఒకరిపై ఒకరిది పేడ కళ్ళపీ దేశం మొత్తం దుర్వాసనలే, ఎవరికి వారే నీతివంతులు నలుపే ఎరుగని గురుతుల గింజలు పులుపే వుండని ద్రాక్షతీగకై అలుపే ఎరుగని నక్కల గెంతులు విసుగు నిండిన ఓట్లతుంపరకి తెగ ఉరికొచ్చే పుట్టగొడుగులు శకుని చేతిలో పాచికలాట కుర్చిలాటలో తెగ కాట్లాట జేబులు నిండే మార్గం మీదుగ దర్భం పండే పొలాల గాటన నేతలమేనని వస్తున్నారు. మన తలరాతను గీస్తారంట. ► 11-04-2014 ► http://ift.tt/1k9RHvN

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9RHvN

Posted by Katta

26, మార్చి 2014, బుధవారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || ప్లాస్టిక్ అల్లికల ప్రజాసేవ ఊరించేవాడు చేతులెత్తేస్తే ఊటలింకిపోతున్నాయి. ఆశలెగిరిపోతున్నాయి. ప్లాస్టిక్ ఎమోషన్లు ఎప్పటికీ ఇంకిపోక ఎడద కంతా కీడుచేస్తున్నాయి. విలన్ లానే కనిపించే విలన్ కంటే హీరో ముసుగుల వలకే ప్రమాదమెక్కువ. జీవితంలో ఖాళీలనో జేబుల్లో ఖాళీలనో కుర్చిలో దర్భాల వెలితినో నింపేందుకు ఒంపుకునే పేరేనా ప్రజాసేవంటే? జాలంటే ఒక బలిసిన స్వార్ధం అయినపుడు సమానత్వం కావలసింది నీ వాటా పంపకాలకేనా కులాల గుర్తొచ్చేది కట్టగా నీ జేబులో మడిచి పెట్టుకునేందుకా? సేవంటే ప్రచార ఆర్భాటానికో చక్కటి ఎర అయినపుడు దేవుడా దేశపు దేహా్న్ని నువ్వైనా రక్షించ గలవా ? నాకిప్పటికీ అర్ధంకాదు కుర్చీలో కూర్చుంటేనే సేవకు చేతులొస్తాయా? కిరీటం పెట్టుకుంటేనే పరిష్కారాలు కనిపిస్తానంటాయా? నోటూ, నాటు లాగానే మాసు హిస్టీరియా ఘాటెక్కించినపుడు? ఫేసు హిస్టరీలు పోటెత్తినపుడు మేఘమా నీవైనా మడతల మత్తుదించగలవా? నోటు ఊపినా జనం నోటా బాట పడతారేమోనని నీటుగా దిగిన పోటుగాళ్ళెందరో పుట్టగొడుగుల నీడలోకి పీలుస్తున్నారు. నిభందనల రూళ్ళకర్ర నీడలో, కట్టలపాములు జరజరా పాకుతూ విషాన్ని వదిలే మార్గాల్ని వెతుక్కుంటున్నాయి. కాయ్ రాజా కాయ్ ఒకటికి ఐదు, ఐదుకి వంద ఈ చక్రంలో నోట్లు పోస్తే నువు మోయగలిగినంతై తిరిగొస్తాయ్ ఓసినా సిరా రాసిన వేలా చీకట్లు విస్తరించకుండా జరాసంథులని పురిట్లోనే నొక్కేయగలవా? ఇవ్వాళ వలలో గాలాలో గాలిలో ఊపేవాళ్ళందరూ చేపల సాగుదార్లు కాదు ఐదేళ్ళకు సరిపడా మసాలా నూరుకొచ్చారు. కుదరితే కొడుకులకూ మనవళ్ళకూ శీతలగిడ్డంగుల్లో దాచే మార్గం చూసుకునే దూకుతారు. ఓ ఎరా, పిచ్చిచేప నోట్లో నీళ్ళూరకుండా నీవొక ఉపాయం గానీ చెప్తావా ఏంటి? తర్వాతైనా చేపలు పట్టడం నేర్చుకునే తీరిక మాకేం లేదు కానీ ఓ దొరా, కూసింత పులుసుంటే నా సట్టెలో పోసెళ్ళు పెబువా. ►26-03-2014 http://ift.tt/1gyvN5A

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyvN5A

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

Katta Srinivas కవిత

పుస్తక ప్రచురణ : ప్రత్యామ్నాయ దృక్పదాలు ఆలోచనలను అక్షరాలుగా మార్చి తరాల అవతలి వరకూ సైతం బావాలను చేరవేసే సాధనాలుగా పుస్తకాలను అచ్చొత్తుకుంటున్నాం. కథలో, కవితలో,వ్యాసాలో మరోకటో మరోకటో పుస్తకంగా రావాలంటే వేలాది రూపాయలు మళ్ళీ పుస్తకం అచ్చొత్తుకున్నంత ఆవిష్కరణలూ, కొరియర్లూ, బుక్ పోస్టులూ సమీక్షకులను సంతృప్తి పరచే విధానాలూ ఇలా నానా తంటాలూ పడినా పాఠకుడికి ఎంతవరకూ చేరుతున్నామో అర్ధంకాని స్థితి. ► నిన్ననే Baskar Kodreddy గారు తన కవితలను వాక్యం పేరుతో తనే పుస్తకంగా తయారు చేసి పాఠకుడి చిత్రాన్నే తన కవర్ పేజీగా ఇస్తూ నాకొక కాపీ పంపారు. తనే వాక్యం మొదటి సంపుటిని కలర్ క్రేయాన్స్ తో డెకరేట్ చేసింది తయారు చేసారు. కవిత్వం పాఠకుడిని చేరటమే ముఖ్యం అయినపుడు కోకడాబుకే మరింత ప్రాధన్యత అవసరమేం లేదు అనే తన ఆలోచన నన్ను మరోసార వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది. ► కరీంనగర్లో సాహితీ సోపతి మిత్రులంతా నెలకోమాటు నెలనెలా వెన్నెల పేరుతో ఒకరి ఇంటిదగ్గర మామూలుగా నేలపై దీపం చుట్టూతా కూర్చుని వారు వెంటతెచ్చుకున్న కవిత్వాన్ని మిత్రులకు చదివి వినిపిస్తారు. అవే కవితలని హంగూ ఆర్భాటాల జోలికి పోకుండా వారికి అవసరమైనంత మేరకే పుస్తకాలుగా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తయారు చేసేసుకుని ‘‘ఎన్నీల ముచ్చట్లు’’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమ కవిత్వం ఇలా పుస్తకంలా పదిల పరచడం ఎందరినో ఉత్తేజితం చేస్తోంది. ► యశస్వీ సతీష్ గారు తన మొదటి పుస్తకం ‘తెల్లకాగితం’ కానీ తరువాత మిత్రుల కవితత్వాలను గురించి రాసిన ‘ఒక్కమాట’ పుస్తకం కానీ ఆన్ లైన్లో ప్రభుత్వం వారిచే ఉచితంగా విడుదల చేసిన యూనికోడ్ అక్షరాలను, కేవలం వర్డ్ ఫైల్ లో మెర్జింగ్ విధానం ద్వారా అందంగా అమర్చుకోవడం ద్వారా ప్రింటుకు తీసుకుని వచ్చారు. ► కినిగే లాంటి ఆన్ లైన్ వెబ్ లలో మన పుస్తకాలను కేవలం సాఫ్ట్ కాపీలుగా విడుదల చేసుకునే అవకాశం పుష్కలంగా వుండి, కాంటెంట్ వుంటే కొనుగోళ్ళ వల్ల రచయిత డబ్బు సంపాదించుకునేంత అవకాశం కూడా వుంది. లేదంటే అనేక వెబ్ మ్యాగజైన్స్ పుస్తకాలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. ► మొత్తంగా మహా అయితే వెయ్యి కాపీలు వేసి అందులో సగమో ముప్పాతిక శాతమో పంచుకుంటే అందులో పదిశాతం మంది సరిగ్గా మనసుపెట్టి చదివితే ఎంతమందికి చేరుకుంటామో తెలియదు కానీ ఇప్పటికే వేలాది మంది కొని చదువుకునే పాఠకులున్న అచ్చులోని సాహితీ పత్రికలే కాకుండా ఉచితంగా అందుబాటులో వుండే ఆన్ లైన్ సాహిత్యా స్థావరాలలో నైనా అప్పుడొకటి అప్పుడొకటిగా వెళ్ళినా ఆలోచనల షేరింగ్ జరిగే అవకాశం వుంది. పుస్తకం డిటీపీ, కవర్ డిజైనింగ్, రంగుల అచ్చులూ, బోలెడంత ఖాళీలను అనవసరంగా వదిలేసే డిజైన్లూ, కృత్రిమ బూమింగ్ కోసం డబ్బుల బోగిమంటలతో చేసే అనవసరపు హడావిడీ ఇవ్వన్నీ తగ్గించుకునేందుకు మనం ఇంకా చెయ్యాల్సింది చాలా మిగిలే వున్నట్లుంది. తీరా తయారైన పుస్తకం సరిగా మండల స్థాయివరకూ కూడా కావాలనుకునే పాఠకుడికి సరిగా అందజేసేందుకు అమ్మిపెట్టే, అద్దెకిచ్చే,లేదా ఉచితంగా పంచగల సరైన యంత్రాంగాల అవసరం కూడా వుంది. అలాగని అత్యంత చీప్ ప్రింటింగ్ తో వచ్చేయాలనేది కూడా సమంజసం కాదేమో, ఒక ‘శివ ట్రయాలజీ’ లా పకడ్భందీ ప్రణాళికతో పాఠకుడికి మనమేం ఇవ్వబోతున్నామో తెలియజేయగలిగేంత నాణ్యత ప్రకటనలోనే కాదు. ముఖ చిత్రంలోనూ పుస్తకం ఆకారంలోనూ వుండాల్సిందే. చదువుకునేందుకు సౌకర్యంగా వుండేంత చక్కటి డిజైనింగ్, కాంటెంట్ కాలనుగుణ్యతను అనుసరించి అది వుండాల్సినంత కాలం వరకైనా పరిస్థితులను తట్టుకుని నిలబడేంత గట్టిదనం వుండాలేనేదీ నిజమే. అతి పొదుపు - అతి ఖర్చులను జాగ్రత్తగా బ్యాలన్స్ చేయడానికి కూడా మళ్ళీ పుస్తకం కోసం తెలుసుకున్నంత నేర్చుకోవలసిన విషయంలానే వుంది. ఆన్ లైన్ పుణ్యమా అని టైపింగ్ నుంచి డిజైనింగ్ దాటుకుని పబ్లిషింగ్ విషయంలోనూ రెక్కలు విప్పుకుంటున్న స్వతంత్రతకు వందనం.ఇది మరింతగా ప్రవర్ధమానమై నూరుపూలలా వికసించాలి, వేయి ఆలోచనలుగా వర్షించాలి, లక్షలాది బీజాలను మొలకెత్తించాలని కోరుకుందాం. జయహో అక్షరం....

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrr0Rd

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || తిప్పరదండం ఉక్కుగోళ్ళ లోహపు పక్షి ఒకటి ముక్కుతో పొడుస్తూ తెగతిడుతోంది. సజీవ శిలాజంలా మిగిలున్న ఓ పిచ్చిపిట్టని వెధవపక్షీ ఎప్పుడూ ఎందుకిలా మొత్తగా వుంటావంటూ లేబుల్ సీసాలోని నీళ్ళు ఎగిరెగిరి మిడిసిపడుతూ మూగనదిని ఆడిపోసుకుంటున్నాయి. పిచ్చిమొహమా కొంచెం నాగరికత నేర్వరాదేఅంటూ ... వెనకగదిలోని అమ్మకాలం నాటి నిర్మలత్వంలాగానే అవికూడా మౌనాన్నే సమాధానమిస్తున్నాయి. ► 23-03-2014 ► http://ift.tt/1pm2nXG

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm2nXG

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || మొలకపాఠం అప్పుడలా అన్నావు అవును నాతోనే నిజంగా అన్నావు. 1. శీతలం శరీరాన్ని ముట్టించిన రోజుల్లో మాటిచ్చావ్ తొలకరిజల్లు పడగానే తిరిగొస్తానని వేసవితాపంతో ఎదురుచూస్తున్నాను నీ రాకకోసం. 2. మొత్తంగా మూసిన పెంకుని తనువుని దాపిన మట్టిసమాధిని బద్దలుకొట్టుకొస్తూ, అదంతా నేర్పిస్తానన్నావు ... ... అన్నావు నీవు తప్పకుండా వస్తానన్నావు. 3. మూటకట్టి మూలన పడేసినా మనసెప్పటికీ వట్టిపోదని గట్టిగా చెప్పేందుకు పరాన్న జీవుల ప్రపంచానికి స్వతంత్రతేమిటో చూపిస్తూ అదంతా పాఠం రాసిస్తాననేశావు ... ... ఇచ్చావు నాకెప్పుడో మనస్పూర్తిగా మాటిచ్చావు. 4. మృత్తికనుండి దేహంలా పొత్తపు గవాక్షాల అక్షరంలా మస్తకపు దారిగుండా ముచ్చటలా బయటికొచ్చి ఆచరణల ఆకులతో ఆకాశాన్నే కాదు, ఆలోచనల పాదులతో భూమండలాన్నీ కూడా పొ దు వు కుం టా న ని, ... ... చెప్పావు నాలోపల మాత్రమే వినిపించేటట్లు ఘంటాపదంగా గుసగుసలాడుతూ చెప్పావు. 5. అబ్బా పగిలింది చెంప వేసవి వేడిలో సైతం ఎదురు చూస్తున్న నన్నెందుకు కొట్టావ్ ? మొలకై నేనే తలెత్తకుండా బులపాటంగా ఎదురు చూస్తున్నందుకేనా? ► 16-03-2014 http://ift.tt/1gpQ874

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpQ874

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || గ్లాసుల్లో ప్రపంచం ద్రవంనింపిన గ్లాసుగుండా ప్రపంచం ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతుంటుంది వికృతంగా జడిపిస్తూ విహల్యులుగానూ చేస్తుంటుంది. అసలుదేదో దాచినట్లు కొత్తహంగుల్ని కప్పేస్తుంటుంది పారదర్శకతలోనూ నిండుతూ రంగుల చమక్కులు చూపిస్తుంది తడి పండుతూ మనసుకి లిమరిక్కులు వాక్కుల ఋత్విక్కులు వ్యవహార దృక్కులు వ్యాపార దక్షులు సర్వం సమ్మిళితానంద సందోహ సందర్బాలను కల్పిస్తుంటుంది. నింపుతున్న కొద్దీ ఖాళీనిజాల్ని బయటకు పొర్లిస్తుంది ఆక్సిటోసిన్* ప్రేమతో ముంచేస్తుంది. గానుగ గాటన పరుగులకు కిణ్వణాల ప్రోబయోట్స్ క్షణాలు కొన్ని వత్తిడుల వేడి విడదీసే వేళల్లో చల్లదనాల అనుసంధానంలా జ్ఞాపకాల వీచికలకు ‘తలపులు’ తెరుస్తూ చుట్టూ మడుసుల్ని అల్లుకుంటుంది. అయినా నానేస్తున్నకొద్దీ దారాల్నే ఊడలుగా బిగిస్తుంది. ► 13-03-2014 http://ift.tt/1fxpbD8 =పాదసూచిక ఇస్తున్నందుకు ఇప్పటికే ఈ విషయాలు తెలిసిన మిత్రులు మన్నించాలి. *ఆక్సిటోసిన్ :known as the “love hormone” because of its role in social bonding **కిణ్వణం ( Fermentation ) is a metabolic process that converts sugar to acids, gases and/or alcohol. ***Probiotics are micro-organisms that some have claimed provide health benefits when consumed.

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbD8

Posted by Katta

2, మార్చి 2014, ఆదివారం

27, ఫిబ్రవరి 2014, గురువారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || కాగితప్పండగల కారెడ్డం నగరం ఎన్నిపండుగల్నాయినా సంబురంగా జేసుకుంటది. సంతోషమంటే కొనేటిదని అమ్మెటొండ్లు ఎప్పటిసందో యాదిల బెట్టిండ్లు. అరే భాయ్ పండుగా ఒక సంతే పండుగ ఒక ఈవెంటే పండుగంట్నే అదొక సందర్భం ఇగదియ్ అది జేబ్ల మీదకుర్కే కత్తెర పండుగంటేనే అంగటి సరుకయినంక అంగిట్లో ఏం మాటుంటది. సందట్లో ఏం సరుకుంటది సందిట్లో ఏం సుకముంటది. ఛాల్తియ్ పోనియరా భయ్ పండుగంటే ఉచితార్ధం రికాంగొచ్చేటి నాగా. బూసెన్నలు,బూందీలు, బోల్‌పేలాల కాలంగాదు దావత్ చేద్దాం నడువ్ ► 26-02-2014 http://ift.tt/1cnqm30 ( కారెడ్డం = పరాచకం; బూసెన్నలు=పల్లీలు / వేరుశనగగింజలు ; బోల్‌పేలాలు = బొరుగులు / మరమరాలు )

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnqm30

Posted by Katta