పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి ||పచ్చనోట్ల వసంతం || ఎన్నికల రుతువులో పచ్చనోట్ల వసంతమొచ్చింది చేదు చెట్ల పువ్వుల నిండా రాజకీయ పరిమళాలు తెచ్చింది దొరికిన ఆకుల్ని దొరికినట్టే తిన్న నోరుపెగల్ని గండుకోయిలలు వాగ్దానాల పాటలే పాడుతున్నాయ్ నేడు ప్రజావనమంతా.... మదికొమ్మ చాటున దాగిన ఓటుల్ని ఒడుపుగా కోసుకోవాలన్న ఆత్రుతే అన్నిచోట్లా ఏదో ఒక నిచ్చెన వాడుకొని ఎగబ్రాకేద్దామన్న ఆరాటమే ఎక్కడ చూసినా .. పంచాగ శ్రవణాలకి వేదికలెక్కడ మిగిలాయ్ కవిసమ్మేళనాలకి ప్రేక్షకుల్నెక్కడ ఉండనిచ్చారు ఊరూరా ఊకదంపుడు ఉపన్యాసాలతోనే వీధులు హోరెత్తిపోతుంటే .. షడ్రుచులు కలిపి వడ్డిస్తారనుకుని ఆశపడి ఏరు దాటించడానికి సాయపడ్డావో మళ్ళీ ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే మళ్ళీ ఆ ముఖం నీకు కనబడాలంటే .. )-బాణం-> 31MAR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7G8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి