పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Thilak Bommaraju కవిత

తిలక్/నీ/స్వార్థం --------------------­-------- ఆకాశంలో ఒక సరళ రేఖలో పయనిస్తున్న కొన్ని పక్షులు ఒకరి భారాన్ని మరోటి మొస్తున్నట్టు కొన్ని నిశబ్దాలను శూన్యంలో వింటున్నట్టు భూమికి సమాంతరంగా నీలంలో నిగూడంగా నువ్వు నీ కళ్ళతో వాటిరెక్కలపై చూపులనద్దుతుంటావు చూడు సహృదయుడివైనట్టు కొద్దిసేపట్లో వాటిని కళేభరాలుగా మారుస్తావని తెలియక నిన్ను నమ్ముతాయి మూగగా మాట్లడుతూ దోసిళ్ళలో నింపుకున్న కొన్ని కీచక ప్రేమలేవొ కురిపిస్తుంటావు పడబోతున్న మాంసపు ముద్దలను ఒడిసిపట్టుకునేలా..... తిలక్ బొమ్మరాజు 21.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hBPmLi

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

చిరాశ // మత౦ // ************************************** గుడిలో దేవుడు హి౦దువా... ?! శిలువెక్కిన ఏసు క్రైస్తవుడా...?! హి౦దువు రక్త౦ రుచిచూడాలని ముస్లి౦ కత్తులు ఉరుకుతున్నవి ముస్లి౦ తల తెగనరకాలని హి౦దువు గొడ్డలి పరిగెడుతున్నది మతపు మరబొమ్మలె కాని మనిషి జాడ కనరాదే?!.. మతమౌఢ్యపు మారణహోమమే గాని మానవతే కనరాదే?!... యుగపురుషులు అవతరి౦చి మతబీజ౦ నాటివెళ్ళిరి మతమ౦టే మానవతకు మార్గదర్శన౦, మనిషిని "మనీషిగ" తీర్చే పథనిర్దేశన౦. ************************************* --- {21/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cxLUwT

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

శ్రుం.సం. నాకెన్నటికీ సరిపోలేదనిపిస్తుంది నీతో ప్రేమ........

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1edG8Nt

Posted by Katta

Srinivas Saahi కవిత

*పాత పాటే..* ప్రయత్నం పాయఖాన మీదే కూర్చుండిపోయింది దిక్కులేని తనం వెక్కిరించి ధిక్కరించి నా ప్రయత్నమొక పనికిరాని విరేచనమయింది అజ్ఞాతాన్ని కాలి కింద తొక్కి పెట్టి దాని మొహాన ఓ అగ్గిపుల్ల గీకి పడేద్దామనుకున్నా! అలాగైనా వెలుగు మొహం చూడొచ్చేమోనని.. కానీ.. ఎండిపోయిన తాటి చెట్టు చివరన ఉరేసుకున్న కల్లు-కుండ అవశేషంలా రోజు-రోజుకి ఎండిపోతున్న నా పిప్పిప్పీ.. పీక లాంటి మెడ చుట్టూ అజ్ఞాతం ఓ తాడు కట్టుకుని ఊయలూగుతుంటుంది ఆలోచనలంతా అతలాకుతలం-అయోమయం ఏదేమైనా నేనిలా రాసుకుని నా జబ్బ నేనే చరుచుకోవడం నాకు కాస్త ఊరట.../శ్రీనివాస్ సాహి 21/02/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MHPmvv

Posted by Katta

Santosh Padala కవిత

ఒక స్పందన --------------- ఒక కల దశాబ్దాలుగా సాగింది ఒక నేల వందల ప్రాణాల త్యాగాలు చేసింది ఒక ఆశ వేల హృదయాలను కదిలించింది ఒక కేక లక్షల మందిని ఒక తాటిపై నడిపింది ఒక రోజు కోట్ల మనసుల్ని సంబురాల్లో ముంచింది ఒక ఆకాంక్ష దేశానికి పోరాటాన్ని నేర్పింది. Sorry for posting this on this platform which is apolitical. All I wanted is to share my feelings. Santosh Padala

by Santosh Padala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQ8Edc

Posted by Katta

Nirmalarani Thota కవిత

ప్రత్యూషపు పద సవ్వడిని గోరు వెచ్చని అరుణ కిరణాలతో ఆత్మీయంగా స్వాగతిస్తాడు సూరీడు. . .! ఒళ్ళంతా తెరుచుకున్న ఆకుల కన్నులతో పచ్చని శ్వాసలతో ఊపిరిలూదుతూ ప్రతి హృదినీ పలకరిస్తుంది తరువు . . ! ఉరుములు మెరుపుల పిలుపులతో తొలకరి చినుకుల చేతులతో స్పృశించి తనువెల్లా తన్మయంతో తడుపుతుంది మేఘమాల . . ! గుండె రేకులు గుట్టుగా విప్పుకొని సౌరభాల సోయగాలతో మనసంతా సొగసైన సుగంధాలు నింపుతుంది సుమబాల . . .! తన తెలి తరగల తరంగిణీ నృత్యంతో తాదాత్మ్యంగా పాదాలకు ప్రణమిల్లి పారవశ్యాన పులకరిస్తుంది కడలి . . . ! పంటచేలతో సరాగాలు పాడుతూ ముంగురులు ముద్దాడుతూ మురిపెంగా పలకరిస్తుంది పైర గాలి . . ! విశ్వాలను నింపుకున్న నింగి సైతం రేయంతా నక్షత్రాల విందుతో జాబిల్లిని పంపి వెన్నెల జోల పాడుతుంది . . ! సృష్టిలో ప్రతీది తనదైన శైలితో సాటి జీవిని పలకరిస్తుంది . . . మనసున్న మనిషి మాత్రం భేషజాల ముసుగు మాటున మూతి ముడుచుకొని కుచించుకుపోతాడెందుకు . . ? ఓ మనిషీ . . ! ఓసారి నవ్వవా . . ! పెదాలు విచ్చి ఓ పలకరింత చిలకరించవా. . ? మనసు విప్పి ఓ పులకరింత చిగురించవా . . ! రెండు పెదాల మధ్య మొగ్గ విచ్చే లాస్యం . . రెండు పలకరింపు కరచాలనాల మధ్య స్పూర్తినిచ్చే ఓ మధురమైన ఙ్ఞాపకం . . ! ! నిర్మలారాణి తోట [ తేది: 21.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ed0B4V

Posted by Katta

Sistla Madhavi కవిత

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...మాతృభాషా వైభవం అనే స్వీయ కవితా సంపుటి నుండి) 21-2-14. దేవ భాష. శిష్ట్లా మాధవి. వింటె భారతమ్ము వినాలి తింటె గారెలె తినాలి పలుకంటె మాతృభాషలోనే పలకాలి మెరుపంటి వెలుగు కంటి వెలుగంటి తెలుగు చెరుకంటి తీపి తెలియాలంటే తెలుగు కనుకనే తెలుగు కలువలరేని వెలుగులంటి తెలుగు వీణియ రాగమంటి తెలుగు ప్రతి మది వీణియ మీటే తెలుగు తెలుగు తెలుగంటూ పలుమార్లు పలికిన తెగని రాగమై సాగే వెలుగు రాగమే తెలుగు శివుని జటాజూటమునుండి జారి పడు గంగా ఝరి తెలుగు తల్లి భారతి వీణానాద తరంగమీ తెలుగు బ్రహ్మ వేదముల నాదమ్మీ తెలుగు శ్రీమాత చిద్విలాస లాస్యమ్మీ తెలుగు సంగీత,సాహిత్య సముచిత వికసిత పద్మ సౌరభమ్మిది దేవభాషయన్న వేరొకటి లేదు ఎవరి మాతృమూర్తి వారి దేవతామూర్తి అయిన యట్లు ఎవరి మాతృభాష వారి దేవ భాషయేగా- 21-2-14. శిష్ట్లా మాధవి.

by Sistla Madhavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d94w3g

Posted by Katta

Sita Ram కవిత

ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణం ఈ తీపి భాధ ఎంత హాయిరో నీస్నేహమే నాకే చూపెనే ఒక కొత్త బాటను నీప్రతి మాటలో ఏదో మౌనమా నీ ప్రతి నవ్వులో నేనే శూన్యమే నీ స్నేహం కోసం పరుగులు తీస్తు వస్తున్నా ఈమౌనపు దూరాన్నిక దూరం చేస్తున్నా 21-feb-2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d8EoFJ

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1dVzMXv

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dVzMXv

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // నేర్చుకోవాలి! // షేరింగ్ ఆటో గుండా ప్రయాణిస్తాం. మరో రోజులోకి. మళ్ళీ ఆ బ్రతుకు అరణ్యంలోకి. మనం అటెండ్ చెయ్యక తప్పని మనుషులలోకి. డెక్ లో పాట. "అమ్మా తెలంగాణమా, ఆకలికేకల గానమా...", నిరంతరాయంగా. ఏండ్లుగా డొక్కలో సుళ్ళు తిరుగుతూ. ఎక్కడెక్కడి యాదిల్లోకి లాగుతూ. అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా. "పవుతు నా తిండి, నా తాగుడు, ఎన్నడన్న పక్కోనికి పైస పెట్టినాడె?!". "ఎవని పాపాన వాడే పోతడక్కా. దావ్ ఖానల పడ్డప్పుడు మనమైతె మందలిచ్చి రావాలెగద?". ప్రేమైకమూర్తులు. సాయిబాబా గుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా అయినప్పుడు, "రోడ్డు సల్లగుండ" అంటూ, కోపంలోనూ నోరు జారని వాళ్ళు. పాఠాలు తెలియనివాళ్ళు. పాటలను మించినవాళ్ళు. ఏమి కావలె, ఇక ఈ సమయానికి, జీవితానికి? పై గుండీ విప్పి, అంగీ వెనక్కి లాగితే, తగిలే చల్లని గాలి చాలు. 25.9.2013 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9BP

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-67// ******************** 1. ఎత్తుని చూస్తే భయం, ఎక్కేంతవరకే... అదేలే మనిషి నైజం. 2. గ్రహాలమద్య భవిష్యత్ వెతక్కు, కృషి చెయ్, నీరాత, నీ చేతుల్లోనే 3. గతం గుర్తుంచుకో చాలు, వెనక చూస్తూ నడిస్తే, ముందుకి సాగలేవు 4. నిన్ను మించిన, నమ్మకస్తుడెవరు, నీకు నలుగురూ నిను నమ్మాలంటే 5. నువ్వు చూస్తున్న లోకం, నీ ప్రతిబింబం, నీ నీడచూస్తే, భయమెందుకోయ్. 6. చెట్టు విరుగుద్దేమోనని, పిట్ట భయపడదులే, రెక్కలకష్టం నమ్ము,చుక్కలైనా చుట్టాలే 7. సాధించినదానికి గర్వించు, జీవితం పుష్పకవిమానం, ఒక సమస్యకి జాగా ఖాయం. 8. తప్పుదోవ పట్టించే, ఒక చిన్నమాట, "నేనేమనుకున్నానంటే" 9. ఓడాక రెండోచాన్స్ లేదు, అప్పుడు ఆడిన ఆటకి... నీక్కాదు. 10. ఓ మనిషీ!!! నువ్వెప్పుడూ ఓడిపోయే పందెం, సమస్యనొదిలి పరిగెత్తడం. ===================== Date: 21.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9lr

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h41Acs

Posted by Katta

Girija Nookala కవిత

తెలంగానం తెలంగాణ తెచ్చాము వీరగంధం పూయండి అవాక్కయిన ఆంధ్రాను బుజ్జగించండి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వచ్చింది రాజధాని వెతకండి తెలంగాణ తొ తెగుతెంపులు ఆంధ్రా,తెలంగాణ విడి ఆకులు ఇష్టం లేని ఐక్య్తతకు నిండా అరవై ఏళ్ళు కలహాల కాపురంలొ ఎన్నో వెక్కిళ్ళు అహంకారం,ఆత్మగౌరవం దెబ్బతింటె వేర్పాటు వాదం ప్రపంచంలొ అనైకతకు ఇదే కదా ఆధారం అది ఈశాన్యమైనా దక్షిణమైనా దిక్కు ఏదైనా దు:ఖమెక్కటే రంగు,రూపు,భాషా బేధాలు కాకూడదు తారతమ్యాలకు పునాదులు.

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecyZwV

Posted by Katta

Sai Padma కవిత

అకవిత్వం-7- వాటాలు పోనాయి, మరేటి సేత్తాం .. మళ్ళీ కౌకిలే ! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఇయ్యాల మనేదిగుంది .. అది గుబులో ఎటో తెల్నేదు గానీ.. సివరాఖరికి తెలిసీసి పడేసినారు. వోరి వోరి ఎదవకానల్లారా , ఇది మీది కాదెసెహ్ , అవల్రయిట్గా వోప్పగించీసి ఎలిపోచ్చీయండి అని.. సర్లేవో, ఇయ్యాల అమిరికాలూ, ఏరే దేశాలూ అట్టుకుపోయే మడుసులకి వూరేటేహే .. అని మీరడగచ్చు ..నిజమే గానీ.. పోరా పోరా అంటే సూరట్టుకు నిలబడిపోనానికి మావు తినేదీ వోన్నమే గదా .. అదిగదిగేప్పుడో, రంగం ఎలిపోయీవారు, మా భీమిలి, ఇజీనారం, సికాకులం పిల్లలు... ఉన్దీవారో అక్కడే సచ్చేవారో తెలీకపోనాది,పెల్లాలూ, తల్లులూ కంటికీ మింటికీ లేనట్టు ఎద్సీసీ వారు ఆళ్ళ పేరెత్తితే, వద్దులేవో, అంత దూరం ఎల్లిపోయి కట్టపడిపోవాల్నా, ఉన్నూరు వదిలేసి, ఇదిగిదిగో మన ఐద్రాబాదు, రాండి, ఆ కట్టమేదో ఇక్కడే పడదాం అంటే వచ్చిన పిలగాల్లకు , మల్లీ ఎటో ఒక్కాసి పోయి గుక్కెడు గంజి తాగడం ఎంతసెపెహ్ .. మరాల్లకి బెంజి తెలీదు గదా ..!! సుకపడిపోనారు , నిండు పార్లమెంట్ లో గుడ్ద్దలూడదీసినట్టు సిగ్గుపడనేక..!! హమ్మియ్య.. ఇన్నాల్లకన్నా ,సుకంలో కాపు గాసి, కట్టంలో మర్యాద లేని పెల్లి పెటాకులయిపోనాది. సుబ్రంగా తలారా నీళ్ళోసి, పనిలోకి దిగండేహే.. ఇంకెన్ని బుజ్జి బెంగలూరులు, చేన్నపట్నాలు, మన చిన్ని చిన్ని వూల్లల్లో తయారు చేయాలి గందా.. వింటున్నారా అండీ.. ఆయ్ .. నేనేనండీ చెప్త.. పక్కవాడి ఇల్లు దుమ్ము దులిపి కల్లాపెసేందుకు ఉన్న శక్తి, మనిల్లు కడుక్కొని కళ కళ లాడించేన్దుకు డబల్ గా వస్తాది కదండీ.. సందేహం ఎందుకు .. ?? ఓయ్.. అమిరికా,ఇతర దేశాల సీమాంధ్ర బాబులూ.. మనిల్లు శుభ్రం చేద్దాం రండి . కాలికి దూరం కావచ్చు మీరు, కంటికి చాలా దగ్గరే కదా .. రండి, రండి మీ ఇంటి దుమ్మూ ధూళీ దులిపి, అయినవాల్లతో ఆనందంగా అభివృద్ది పాలు పొంగించండి.. శుభమస్తు !! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d8oET1

Posted by Katta

Swatee Sripada కవిత

ఈ నేల ఎప్పుడో కోటి రతనాల వీణ మెట్లపై జారి ఘల్లున రాలిపడ్డ గమకం ఈ నేల గాయపడ్డ రెక్కలను సరిచేసుకుంటూ ఒదిగిఒదిగి ఓ మూలాన దిగాలు పడిన వెలుగు వెన్నెల నావ ఈ చిన్నారి నెమలీక ఆకలి దప్పుల కారడవుల్లో దారితప్పిన పసిపాపై అలమటించి అలమటించి శుష్కించి బీటలు వారిన జ్ఞాపకాల నీడలు ఆగి ఆగి రేగి రేగి నొప్పించే మానని ఎదురు దెబ్బలు నిమురుకుంటూ కాలం చారల సిల్కు చీర వెనకాల చిరిగినదేహాన్ని కుట్టుకుంటూ అరణ్య వాసం చేసినదీ నేల ఏళ్లకొద్దీ అణిచేసిన అధికార దాహం కింద అన్య వలసల అపరాహ్నపు విలవిలలో నీ బాంచను కాల్మొక్త దశ ఆగిపోయిన ఘడియల్లో ఆగిపోయే శ్వాసతో తుపాకులు పైకెత్తి ఎదురుతిరిగి రక్తాలోడిన దీ నేల శృ౦ఖలాలు సడలించుకు పిడికిలి బిగిస్తూ ఇన్నాళ్ళకు అశ్రుతర్పణాల అభిషేకాలతో నేల తల్లి కనురెప్పల నందన వనాలలో వినువీధిన పతాకమై నింగి కెగసినదీ ఈ నేలే. ఇది జయధ్వానాపు సన్నాయిలో సరిగమలై కురిసే తెలుగు నేల

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MGFan4

Posted by Katta

Krishna Mani కవిత

గురుగులాలయం ****************** అమ్మానాయిన కష్టం తిండికే సరిపోక పొతే నడవని పయ్యల బతుకు బండిల మా సదువులెట్ల సాగుతయీ ! అందుకే మావొళ్ళు సర్కారాస్టల్ల ఎశిన్రు నన్ను ! కడుపునిండ అన్నం ఎసుకోనికే బట్టలు సదవనీకే పొస్కాలు పండనీకే దుప్పటి ఆడుకోనికే అన్నీ అన్నీ ఉన్నా అమ్మ లేదు ! మా ఇంటికాడ సోపతోంతో జగడమాడితే తల్లి పెట్టోలె మా అవ్వ ఉరుముతుండె ఏడిస్తే దెగ్గరికిదీషి అదుముతుండె ఈడనేమో మూలిగిన గాని ముట్టరాయే ! గిన్నెవట్టి గోలుసుగడితే అన్నముంటది లేకుంటె అయ్యల్ల కడుపు కాల్తది అమ్మ ఐతే పూట పూటకు తింటలేనని తిడుతుండె అన్నకాడికి లేదనక నింపుతుండె ! మా నాయిన వారమైతె అక్కడిక్కడ ఓయి పట్టుకొస్తుండే చెర్ల శాపలేమీ ఎండ్రికిచ్చలేమీ శేనుకాఏమీ తాటిమున్జలేమీ ఇప్పుడేమో కోడిగుడ్డు కూడ ఉడకదాయే ! గిన్నెకడిగి బట్టలుతికి పెయ్యితోమి ఉరుకుల పరుగుల ఇస్కోలాయే మనసుకారి చెప్పుకుందమంటే తోడబుట్టినోల్లు కారాయే అమ్మనాయిన తోడుకులేరాయే యాదికొచ్చి నాలుగురోజులకే పానమింతాయే ! కృష్ణ మణి I 21-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l400LA

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి. సురేష్ || వలస || డేగ రెక్కల నీడలో వాడిగోళ్ళను చిక్కుక్కొని ఉన్న మా౦సపు ముద్దలా రాత్రి ను౦డి రాత్రుల్లోకి గుహల ను౦డి పచ్చికబయళ్ళలోకి నదుల పక్కను౦డి సాగర౦ పక్కకు సాగర౦లో ను౦డి సుడిగు౦డాల్లోకి వలయాలు వలయాలుగా తిరుక్కు౦టూ తిరుక్కు౦టూ పెట్టా బేడా సర్దుకొని వలస. తెగిపడిన జీవితాలను అతికి౦చుకొ౦టూ జతలు జతలు గా పక్షులు బారులు బారులు గా తీరి సాగినట్లు కొన్ని వ్యధలూ ...కొన్ని కడుపు కోతలు ..కొన్ని కడుపు తీపిలు..కాసుల వేటలు కనురెప్పల క్రి౦ద ఇ౦కిపోయే కన్నీటిని మి౦గుతూ వలస........ వొ౦టరి బాటసారిలా. పడమటి కొ౦డల్లోకి దీన౦గా వలస పోయే సూర్యునిలా.... ఎప్పుదూ ఏకాకిగానే మనల్ని మన౦ అర్థ౦ చేసుకొనే దివ్యజ్ఞానాలు దారిపొడువునా గమ్య౦ ఎప్పుడూ కనుచూపు మేరలోనే.... అవును.... లక్ష రెక్కలున్న పక్షులవలస వలస తర్వాత వలస సేద తీరుతూ మర్మాలు తెలుసుకొ౦టూ అప్పుడప్పుడు మన౦ ఆగిపోతా౦.....ప్రాణవాయువు చచ్చిపోతు౦ది 21.2.2014

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f105Hp

Posted by Katta

JayaSarathi Yerroju కవిత

JayaSarathi Yerroju చ॥ తెలుగు మనోహరంబగును తేనెల కన్నను తీయనైనదౌ వెలుగును లోకమంతయును వెన్నెల తీరుగ హాయిగొల్పుచున్ సులలిత సుందరంబగును జోలలు పాడగ అమ్మపాటయౌ సలుపుము తెల్గురక్షణము ! సాహస వీరుడ! తెల్గు పౌరుడా ! . అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు .

by JayaSarathi Yerroju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZ0jYo

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఓటు అదొక నిండు సభ కానీ పెద్దలేరి? అందరూ పెత్తందార్లే అక్రమార్కులే ఈ రాజకీయావాకశాకాశంలో అందరూ రాబంధులే ఉన్న ఒకళ్ళో ఇద్దరో ఉన్న పలాన రంగులు మార్చే ఊసరవెల్లులే అదంతా ఒక పెద్ద భూటకం మనకి ఏదో ఒరుగుతుందని మనల్ని భ్రమింపచేయడానికి ఆడే నాటకం ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికలు మనకి వచ్చే ఒకే అవకాశం ఓటు అంటే వ్రేలు మీద చుక్క పెట్టించుకోవడం కాదు అదొక బాణం మంచి అభ్యర్ధిని గెలిపించడానికి ప్రత్యర్ధిని ఓడించడానికి ప్రయగించే అస్త్రం మనం దాన్ని మంచిగా మడతపెట్టి బాలెట్ బాక్స్ లో భద్రంగా వేస్తాం మన బ్రతుకుల్ని మనకి తెలియకుండానే నేతలకి తాకట్టు పెడతాం వాళ్ళు విసిరే ఉచితవరాల వలలో పక్షుల్లా చిక్కుకుపోతాం ఇకనైనా కళ్ళు తెరుద్దాం మన ఓటుని సందిద్ధాం అసలు అభ్యర్ధే లేకపోతే అస్త్రసన్యాసం చేద్దాం అంతే గానీ ఓటుని మాత్రం వ్యర్ధం చేయవద్దు ఎవరికీ అమ్మవద్దు ఇది ఒక దేశ దిశ దశని నిర్ధేశించే సదవకాశం అంతే గానీ మనల్ని మోసం చేసే మనుషులకిచ్చే అవకాశం కాదు ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం మన భవిష్యత్తుని మనమే వ్రాసుకుందాం 21FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZ0jYc

Posted by Katta

Aruna Naradabhatla కవిత

శూన్యానికి దూరంగా ______________అరుణ నారదభట్ల జీవితం ఎప్పుడూ ప్రశ్నార్థకమేనేమో! ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలుసూ... పుట్టి బుద్ధెరిగినప్పటినుండీ మొదలయ్యే ప్రయాణం! ఎన్ని...కలలు...ఎన్నెన్ని కహానీలూ అన్నీ నెరవేరేవేనా...?! కొన్ని చేతిలో ఉండేవి... మరికొన్ని ప్రయత్నించినా దక్కనివి! ఎప్పటికప్పుడూ రంగుల దుస్తులు ధరించినట్టు తెల్లారే సరికల్లా మరో కొత్త ఊహ మదిని మేల్కొలుపుతునే ఉంటుంది! నేనూ..నేనూ అంటూ వేసే ప్రతి అడుగూ ఓ సంచలనం అవ్వాలని ఎన్ని నిద్రలేని రాత్రులు తపిస్తామో! ఆకాశపు చివరన నిలబడినా ఆశమాత్రం చావదు నీటిలో వేసిన కాగితపు పడవలా కాలంతో పాటుగా కదిలే ప్రవాహంలో మునిగిపోతూ కూడా పరుగెడుతూనే ఉంటాం! నిజాలు అబద్ధాలుగా...అబద్ధాలు నిజాలుగా కావలసింది దక్కక...దక్కినది వద్దనుకోలేక దృవాల దగ్గరి వెలుతురులై అప్పుడప్పుడూ ప్రకాశించే గెలుపు గుర్రాలు మనసును ఊరట పరిచినప్పుడు మళ్ళీ నాలో నేనుండను! ఏ పూలపల్లకో నాకోసం ఎదురుచూసినట్టు వెన్నెల వర్షం ఎడారిపువ్వై విరిసినట్టు దివిటీలాంటి అఖాతంలో నెగ్గడం చిరుదీపమె అయినా చివరివరకూ పోరాడటానికి అదో వింతవెలుగై కదలాడుతూనే ఉంటుంది కరిగే కాలానికి ధీటుగా ఈ కలబోతలో ఇంకెన్ని రంగులు పులుముకునేదుందో మెరిసే ఇంద్రధనుస్సులా!! 21-2-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oYXtCA

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అవలోకనం// 1. ఒక్కోసారి చెబుతూనే ఉంటారు అపత్రహరితం గానో అబద్రతాభావం లోనో నేను కొట్టుమిట్టాడుతాను తేట తెల్ల ముఖం తెలిసిపోయి తరువాత మాత్లాడుదాం అని ముగుసుపోతుంది. 2. ఇంకోసారి నువ్వేదో చెబుతావు నేనింకేదో మాట్లాడుతాను ఐనప్పటికీ మూడో పాయేదో చేజిక్కుంచుకొని జడ అల్లుకుపోతాం. 3. అప్పుడప్పుడూ చెప్పండి అనగానే మీకు తెలియందా అంటాను విషయం వివరించక్కరలేకుండానే సరే అలాగే చెద్దామని బదులు చిత్రంగా కలుస్తాను అని ముగింపు. 4. కొన్నిసార్లు నువ్వూ నేనూ ఏదురవుతాం విచిత్రంగా మన మధ్య మాటలే ఉండవు పలకరింపుకి వీడ్కోలుకీ ఒకే చిరునామా చిరునవ్వు. 5. చివరగా ముభావాలూ ముక్తాయింపులూ ముడులు విప్పుకొంటాయి కొన్ని తెలిసి కనుమరుగైనట్టే మరికొన్ని తెలియకుండా అంటిపెట్టుకొంటాయి. విలోమ సిద్దాంతాలెన్ని ఎదురైనా ఏ లెక్కకైనా శేషం సున్నా రావాల్సిందే...20.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3nk89

Posted by Katta

Kancharla Srinivas కవిత

అరవయ్యేళ్ళ విభేదాలలో అమ్మ భాష నిర్లక్ష్యం.. ఢిల్లీ ఏపీ టూర్లతో తెలుగోళ్ళ గోల తప్ప తెలుగు గోడు విన్నదెవడు.. ఇకనైనా.. సీమాంధ్ర తెలంగాణ సంఘటితమవ్వాలి సమైక్య ఉద్యమానికి ఉద్యమించాలి ప్రాంతం రాష్త్రం కోసం కాదు.. మాతృభాష రక్షణ కోసం అన్న దమ్ములున్నా.. అమ్మ ఒక్కటే కదా రెండు రాష్త్రాలైనా తెలుగు భాష ఒక్కటే కదా..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dUU5V8

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgkmC

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0JVOb

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | 'In and out' అను అంతరంగం ................................................... నీ రక్తం పంచుకు పుట్టనివాడిని నీ పిల్లాడిలానే ప్రేమించగలవా? ప్రేమించడం ఒక సాహసం : క్రీడ : అనుభవం. సాహసం చేసే డింభకుల మాటల్ని ధైర్యం చేసి వినగలవా? సాహసం ఒక విలువ : వెలుగు : కొత్త చూపు అయిష్టమైన ముఖాల్ని తొలగించి మనుషుల్ని అక్కున చేర్చుకోగలవా? సుఖాల బారిన పడకుండా కటిక దుఖం వైపునకు మళ్ళగలవా? నాలుక చాచి దాహంగా పరుచుకున్న దేహాన్ని విసర్జించగలవా ఏ మోహమూ లేకుండా.. మోహం ఒక బల్లి : ఒళ్ళంతా గీతలు పెట్టే మంచపు నులక : చిరుచలి నీ ప్రేమను తుంచేసిన చోటునే మళ్లీ జీవించగలవా నిర్భయంగా భారాల దూరాల సంకుచితత్వాల సావాసాల్లో చెదిరిన అంతరంగం వెక్కిరింతల మధ్య ఉండగలవా? నీకోసం మిగిలిన శీలాన్ని మానాన్ని సహనంగా స్వీకరించగలవా? జీవితం ఒక కిటికీ రెక్క ఎప్పటికీ తెరుచుకునే ఉంటుంది నిస్సిగ్గుగా అరిచే గొంతుకలా ### *పాతవాచకం, వార్త 2001, 'సరిహద్దు రేఖ' నుండి..

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jit2E6

Posted by Katta

Kancharla Srinivas కవిత

గ్లోబలైజేషన్ పల్లెకి దూసుకొచ్చి ఫ్యాషనైజేషన్ వెదజల్లాక పచ్చని పొలాల్లో పరభాష సాగయ్యాక.. మాతృభాష మనుగడ లోపిస్తోంది.. ధాన్యంలో బెరుకులు బియ్యంలో మెరిగలుగా ఉన్న ఆంగ్ల పదాలు ఇపుడు అన్నంలో రాళ్ళవుతుంటే తెలుగుభాష తియ్యదనం తగ్గుతోంది.... సొంతభాషకు సోకిన తెగులు వదలాలంటే అక్షరాలకర్షకులు అభినవ హాలికులు కలాల హలాలు ఎక్కు పెట్టాలి సాహిత్య సంపదలుసాగు చేయాలి..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jiqyFz

Posted by Katta

Kavi Yakoob కవిత

రేపు సాయంత్రం ! :)

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d33ypb

Posted by Katta

Satya NeelaHamsa కవిత

"ఇయ్యాల లేడు సారు" (Prof. Jaya Shankar sir. ) ^^^^^^^^^^^ --సత్య చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! నిదానంగ తెలంగాణ అవసరాన్ని జెప్పినోడు నినాదంగ ఆక్రందన గొంతులని మల్చినోడు అలోచనలన్నింటిని ఆచరణలో జూపినోడు అలుపెరుగని పోరాటమే ఉద్యమంగ జేసినోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! దిక్కుతోచని మాకు దిక్సూచై నిల్చెటోడు ఆటుపోటులన్నీ దాటి అవతలి దిక్కు జేర్చేటోడు ముంచెత్తే అలల నుండి నిజమయ్యే కలల దిక్కు మా నావకు చుక్కానిగ ముందు ఉండి, నడిపెతోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! ఉలిదెబ్బలతోనే రాయి రూపుదిద్దుకుంటది రాపిడితోనే ఇనుముకి జంగు తొలగి పోతది మరి దారిజూపేటోడివి ఇట్ల జెప్పకుండబోతే గుబులు తోని ఈ గుండె ఎట్ల కోలుకుంటది? చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! తెలంగాణకి పెద్దకొడుకువి నీకెమిచ్చుకునేది నా బిడ్డవై పుడుదువుగాని రావో నా పెద్దసారు! అల్లంత దూరాన సూడు తెలంగాణోస్తున్నది సాకారమైతే సూద్దువు గాని రావో నా పెద్దసారు!! చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! --సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NfVH17

Posted by Katta

Srinivasa Rao Moida కవిత

http://ift.tt/1l3CSNb

by Srinivasa Rao Moida



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3CSNb

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // ఏమై పోయావు … // ఏమై పోయావు ఎక్కడని వెతకను ఏ ముళ్ళ పొదలో చిక్కు కొని గాయాలను తీపి గుర్తులని ఓర్చుకుంటున్నావ్ ఏ నీడల వెంట చీకట్లో వెతుకుతున్నావ్ ఏ ఆవిరయ్యే తడిలో దాహం తీర్చుకోను వెళ్ళావ్ ఏ పర్ణశాలలను అద్భుతమైన హృదయంతో కడుగుతున్నావ్ ఏ మాయా వీధుల్లో అవాజ్యమైన ప్రేమను కురిపిస్తున్నావ్ ఇటురా ఒక అద్దం నిన్ను చూస్తుంది చేతి వేళ్ళపై కదిలే విషాదాలని మోహిస్తుంది నవ్వు కొనే క్షణాలను కాంక్షిస్తుంది నిన్నునీలా మరింత ప్రతిఫలించాలని మరి ఒక్కసారి కడిగిన హృదయంతో ఇటు వచ్చి వెళ్ళరాదు Date:20/02/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3CUo9

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

తెలుగు పౌరుషం రగిలించు... బిడ్డలారా! నేను అమ్మభాష తెలుగును కడుపారా పాలిచ్చి కోటి ఆశలతో పెంచుకున్నాను మీ మాటల మాధురిలో మురిసిపోయాను మౌఖిక గేయాల ఆలాపనలో పులకించాను కవిత్రయ భారతకథతో కావ్యజగత్తులో కాలుమోపి శివకవుల కావ్య విబూదిలో స్నానమాడి శ్రీనాధ చాటువుల రస సీమలో విహరించాను పోతన భాగవత భక్తిపారవశ్యంలో వేణుగానం చేసి రాయల అష్టదిగ్గజాల ప్రబంధపారిజాతాల్ని ఆఘ్రూణించి వేమన్న ఆటవెలదులతో ఆటాడుకున్నాను చిన్నయసూరి కందుకూరి పంచతంత్రకథాజ్ఞానమై గురజాడ అడుగుజాడలో దేశభక్తిని నింపాను విశ్వనాధ సి.నా.రె భరధ్వాజల చేయూతతో జ్ఞానపీఠమెక్కి జాషువా కలం బలంతో నవయుగకవిచక్రవర్తినయ్యాను కృష్ణశాస్త్రి కరుణశ్రీల గానవిలాపానికి కరిగి శ్రీశ్రీ మహాప్రస్తాన రథచక్రాలతో భూకంపం పుట్టించాను బండెనక బండికట్టి నిజామోడికి గోరికట్టి విప్లవ, అభ్యుదయ,దళిత,మైనారిటి,స్త్రీవాదాల శంఖమెత్తాను ఇది ఒకప్పటిచరిత్ర కాకూడదు ఇప్పటికైనా మేల్కొండి ! కన్నవారిని వృద్ధాశ్రమాల్లో పడేసినట్లు పరభాషావ్యామోహంలో నన్ను మూలన పడేయకండి బడులలో ,కార్యాలయాలలో నిరాదరిస్తూ మాతృభాషా ద్రోహానికి ఒడికట్టకండి . తల్లిమరణిస్తే బిడ్డలు అనాథలవుతారేమో కాని ! తెలుగు భాష మరణిస్తే తెలుగువారూ మరణిస్తారు . ఈ సత్యాన్ని గ్రహించండి..!తెలుగు పౌరుషాన్ని రగిలించండి..! {మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు}..21.2.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0oNaR

Posted by Katta

Sailaja Mithra కవిత

గది దు:ఖం // శైలజామిత్ర ఒక్కసారి చూడగానే మొదటి చూపు అనుకుంటాం పరిచయం చేసుకుంటాం అనేకం మాట్లాడుకుంటాం గది గోడల్ని కొత్తగా కలియజూస్తాం నిశ్శబ్దాల్ని ఒకసారి, నిజాల్ని మరోసారి తెలుపుకుంటాం ఆ సమయం లో ఆ గది ఒక ప్రపంచంలా కనిపిస్తుంది ఒకరినొకరు ఆశాంతం చూసేందుకు తటపటాయిస్తాం పదే పదే గొంతును సరిచేసుకుంటాం. అనవసర వ్యక్తిని మధ్యవర్తిత్వం వహించమంటాం ! గుండె తలుపు చూపుల కొక్కానికి తగులుకుని విల విల లాడినట్లు శరీరాన్ని తరచి తరచి చూసుకుంటాం ! బరువైన జ్ఞాపకాలకు నిట్టూర్పుతో సరిపెట్టేస్తాం ఒక్కరి ఎదుట కుర్చుని సమూహంలో ఉన్నట్లు భావిస్తాం ! రోజు మొదలవ్వగానే బయలుదేరాలని అలొచలనలను విడివిడిగా మూటలు కట్టేస్తాం ప్రయాణం మనల్ని వదిలి పోయిందని తెలుసుకుంటాం చలనాలన్నీ సంచలనాలుగా భావించుకుని చిరునవ్వుల దుప్పటిని కప్పేస్తాం ! విహార యాత్రలన్నీ కళ్ళల్లో నింపుకుంటాం జీవన యాత్రకు మాత్రం కాళ్ళనే ఉపయోగిస్తాం గురిపెట్టిన హృదయాన్ని కడిగి కడిగి ఆరపెట్టేస్తాం చివరికి మనసును అంట్ల గిన్నెల మధ్య పడేసి ఎప్పటికప్పుడు కడుక్కుంటాం!! ఇంతే కదా జీవితం అనుకుంటాం ! ఎప్పటికప్పుడు అప్పుడే ప్రారంభం అయిందని తెలుసుకునేందుకు సమయంతో పోరాడతాం గెలుపు ఓటమిల నడుమ సన్నని రేఖ లా మిగిలిపోతాం ! 21-02-2014

by Sailaja Mithra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU8tgc

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ ||అహ్మద్ ఫరాజ్ ||Teri bataain hi|| teri bataain hi sunanay aa'e dost bhi dil hi dokhanay aa'e phool khilte hein tu hum sochtae hein teray aanay ke zamaanay aa'e aisi kuch chup si lagi hai jaise hum tujhe haal sunanay aa'e ishq tunha hai sir-e munzil-e ghum kaun yeh boojH uthanay aa'e ajnabi dost humein dekh keh hum kuch tujhe yaad dilaanay aa'e dil dharakta hai safr ke hungaam kaash phir koi bulanay aa'e ab tu rounay se bhi dil dukhta hai shaid ab hosh thikanay aa'e kya kahein phir koi busti ujri laug kyooN jashun mananay aa'e so raho maut ke pahloo mein Faraz nind kis waqt na janay aa'e http://ift.tt/1d7gNFx

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d7gNFx

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| కాపాడుకుందాం|| మాతృభాషాదినోత్సవం సందర్భంగా మన భాషని, సంస్కృతిని, విశ్వజనీనమైన సాహిత్యాన్ని గౌరవిస్తూ స్నేహ, సౌభాతృత్వాలను కాపాడుకుందాం. జయహో కవిత్వం!........21.02.2014 ఉదయం 5.55

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eZZl5w

Posted by Katta

Padma Rani కవిత

!!నేనే నా సైన్యం !! అంతరంగ మధనమే నమ్మిన నా అంగరక్షకుడిగా నియంత్ర భావావేశాలే కాపాడే కవచకుండలాలుగా ఆలోచనా ఆయుధాలెన్నో అంబులపొదలో దూర్చి ఆగి అడుగేస్తు సంధిస్తున్నా అస్త్రాలను ఆచితూచి నవ్వు మాటున దాగిన వేదనలే నా గూఢాచారులు ఆత్మస్థైర్య, శ్రమ ఫలితాలే నా ఆయుధకోశాగారాలు నింగికెగసిన ఆశయాలే చేరుకునే లక్ష్యాలుగా మారి నిలబెట్టి నిలేస్తున్నాయి నిశ్చల సిపాయిలుగా చేరి సాహసమే ఊపిరంటూ సహాయపడే సలహాదారుడు సాధ్యంకానిది లేదంటూ సాగిపోమనే సైన్యాధ్యక్షుడు సహనాన్నే కాలంపై సంధించబోతున్నా చివరాస్త్రంగా ఎడతెరపిలేని జీవితరణం చేస్తున్నా నేనే నా సైన్యంగా 21-02-2014

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTmN8V

Posted by Katta

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ దీవాన్లో 9వ గజల్ మొదటి షేర్ దహర్ మేం నక్షె వఫా వజె తసల్లీ న హువా హై వో లఫ్జ్ కె, షర్మింద యె మానీ న హువా లోకంలో ప్రేమ దారులపై సంతుష్టి దొరకదు ఈ పదం ఎన్నడూ అర్ధానికి తగినదిగా నిలబడదు ఇది గజల్ లో మొదటి కవిత కాబట్టి రెండు పంక్తుల్లోను ప్రాస కనబడడమే కాదు, ప్రతి పంక్తి దానికదే సంపూర్ణ వాక్యం. ఈ గజల్లో మొత్తం 7 కవితలున్నాయి. గాలిబ్ ప్రసిద్ధ గజళ్లలో ఇది కూడా ఒకటి. ఈ గజల్లోని ఉర్దూ పదాలకు అర్ధాలను చూద్దాం. దహర్ అంటే ప్రపంచం, నక్ష్ అంటే చిహ్నం, గుర్తు, వఫా అంటే విశ్వాసం, ప్రేమ, బే వఫా అంటే విశ్వాసం లేనివాడని అర్ధం. ముఖ్యంగా ప్రేమికులకు సంబంధించి వాడినప్పుడు బే వఫా అంటే మోసగించిన వాడని అర్ధం చేసుకోవచ్చు. అంటే వఫా అన్న పదం ప్రేమను సూచించే పదంగా కూడా వాడడం జరుగుతుంది. శాబ్ధికంగా వఫా అంటే విశ్వాసం అన్న అర్ధమే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రేమను సూచిస్తుంది. వజహ్ అంటే కారణం. తసల్లీ అంటే సంతుష్టి. లఫ్జ్ అంటే పదం. షర్మిందా అంటే సాధారణంగా సిగ్గుపడడం అని చాలా మంది భావిస్తారు, కాని ఈ పదబంధానికి అర్ధం నెరవేరడం. తెలంగాణా కల నిజమయ్యిందనడానికి తెలంగాణా కా ఖ్వాబ్ షర్మిందా తాబీర్ హువా అంటాం. దీన్ని ఉర్దూ పలుకుబడి రీత్యా అర్ధం చేసుకోవాలి. ఈ కవితకు భావాన్ని చూస్తే. ప్రపంచంలో గొప్ప ప్రేమికులు చాలా మంది ఉన్నారు. గాఢమైన తమ ప్రేమ చిహ్నాలను ప్రపంచంలో వదిలివెళ్ళారు. ఎందుకంటే వారంతా అంతకు ముందు కాలాల్లోని గొప్ప ప్రేమికులతో ప్రేరణ పొందారు. వారిలాగే తాము కూడా సాటిలేని ప్రేమికులుగా మారాలనుకున్నారు. అందుకే తమ ప్రేమ ఎంత గాఢమైనదో చాటిచెప్పే చిహ్నాలను ప్రపంచంలో వదిలి వెళ్ళాలనుకుంటారు. కాని ఇలాంటి వారి ఆశలు, ఆకాంక్షలకు పునాదుల్లేవంటున్నాడు గాలిబ్. ప్రపంచంలో విశ్వాసబద్దమైన ప్రేమ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని, ఇందులో సత్యం లేదని, అది ఒక భ్రమ అయినపుడు దానికి సంబంధించిన చిహ్నాలను వదిలి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అలాంటి ఒక భ్రమను నిజమనుకుని ఆ మార్గాన నడుస్తున్నప్పుడు మనకు సంతుష్టి ఎలా దొరుకుతుంది. ప్రేమికులు తమ ప్రేమకు నిబద్దులై ఉంటారు. కాని నిజానికి నిబద్దతతో కూడిన ప్రేమ అనేదే ఒక భ్రమ అయినప్పుడు అందులో సంతుష్టి దొరికే అవకాశం లేదంటాడు గాలిబ్. తర్వాతి కవిత గాలిబ్ 9వ గజల్ 2వ కవిత సబ్జ యే ఖత్ సే తేరా కాకులె సర్కష్ న దబా యే జుమ్ముర్ద్ భీ హరీఫె దమె ఉఫయీ న హువా కెంపులాంటి చెంపలపై తలబిరుసు కురులు చూడు నాగమణి కూడా నల్లతాచును ఆపలేకపోతున్నది ఖచ్చితంగా తెలుగు అనువాదానికి, ఉర్దూలో ఉన్న పదాలకు సంబంధం లేదు. ఈ కవితను అర్ధం చేసుకోడానికి ఉర్దూ పలుకుబడి, ఉర్దూ ప్రతీకలు, ఉర్దూ కవులు సూచనాత్మకంగా ఉపయోగించుకునే సంఘటనలు, ఉర్దూ ఉపమానాలు, ఉర్దూకు ప్రత్యేకమైన పోలికలు వగైరా అన్నీ తెలిసి ఉండాలి. ముందుగా ఈ కవితలోని పదాలకు అర్ధాలు, వాటి వివరణలు చూద్దాం సబ్జా అంటే ఆకుపచ్చ రంగు, ఖత్ అంటే కేశం, సన్నని గీత, సబ్జా యే ఖత్ అన్నది ఉర్దూ కవులు ఉపయోగించిన ప్రత్యేకమైన పోలిక. యుక్తవయస్సు తర్వాత శరీరంలో ఒక కొత్త తేజం వస్తుంది. ముఖ్యంగా చెంపలపై రోమాలు.ఇంగ్లీషులో మనం సైడ్ బర్న్స్ అనంటాం. పురుషులకే కాదు, స్త్రీలకు కూడా చెవుల వరకు పల్చని నూగు వంటి కురులు వస్తాయి. తెల్లని వంటిఛాయ ఉన్నవారిలో అవి కొంత వరకు ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తుంటాయి. వీటినే సబ్జాయే ఖత్ అని పోల్చడం జరుగుతుంది. కాకుల్ అంటే కురులు, సర్కష్ అంటే తలబిరుసు, తలెగరేస్తూ గర్వించే వాడు, జుమ్ముర్ద్ అంటే ఒక కల్పనాత్మకమైన రంగురాయి, దీని మెరుపులను ఉపయోగించి నాగుపామునైనా గుడ్డిది చేయవచ్చు. హరీఫ్ అంటే ప్రత్యర్ధి, దమ్ అంటే శ్వాస, లేదా జీవితం, ఉఫయీ అంటే తాచుపాము లేదా నాగుపాము. ఇది గాలిబ్ గజళ్ళలో చాలా ప్రసిద్ధి చెందిన గజల్ అని చెప్పుకున్నాం. లోతైన భావాలతో చక్కని పదాలతో రాసిన ఈ గజల్ ను లతా మంగేష్కర్తో సహా చాలా మంది పాడారు. పైన తెలిపిన ఉర్దూ పదాల అర్ధాలు వివరణలు చదివిన తర్వాత నేను చేసిన అనువాదం అసలు ఉర్దూ కవితకు ఆమడ దూరంలో కూడా లేదన్నది మీకు అర్ధమై ఉంటుంది. ఈ కవితలో ఉన్న ప్రతీకలు, పోలికలు తెలుగులో యథాతథంగా అనువదిస్తే తెలుగు వాతావరణంలో ఇమిడేవి కాదు కాబట్టి నేను కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. ఈ కవితను అర్ధం చేసుకోడానికి, కొందరు గాలిబ్ వ్యాఖ్యాతలు చెప్పిన ఒక దృశ్యాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒక చిత్రాన్ని ఊహించండి. అందమైన అమ్మాయి చిత్రాన్ని ఒక చిత్రకారుడు వేశాడు. ఒకే జడ వేశాడు. కళ్ళు, ముక్కు, చెవులు, చెంపలు, ముఖం ఏదీ చిత్రంలో వేయలేదు. కేవలం జడతో ఉన్న ముఖం ఔట్ లైన్ మాత్రమే వేశాడు. ఆ చిత్రం ఎలా కనిపిస్తుంది. పడగవిప్పిన నాగుపాము తీవ్రమైన కోపంతో కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు గాలిబ్ వాడిన పదాలను చూడండి. సబ్జాయే ఖత్ అంటే ఆకుపచ్చని నూగు వంటి సైడ్ బర్న్స, ఆ తర్వాత కల్పనాత్మకమైన జుమ్ముర్ద్ అనబడే రంగురాయి గురించి రాశాడు. అది కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ఈ రంగురాయిని నాగుపాముకు చూపిస్తే అది గుడ్డిదై పోతుందని చెప్పుకుంటారు. ఆ విధంగా ఈ రంగురాయితో నాగుపాము దాడి నుంచి రక్షణ పొందవచ్చు. అంటే, నాగుపాము ప్రత్యర్ధిలా దాడి చేయడానికి వచ్చినా ఈ రంగురాయి ఉంటే రక్షణ పొందవచ్చు. ప్రేయసి చెంపల పైన, చెవుల వరకు సబ్జాయే ఖత్ (ఆకుపచ్చని సైడ్ బర్న్స్) ఈ ఆకుపచ్చని కాల్పనిక రంగురాయితో పోల్చాడు గాలిబ్. జుమ్ముర్ద్ అనబడే కాల్పనిక ఆకుపచ్చని రంగురాయి గురించిన కథని తన కవితకు వాడుకుంటూ, చెంపలపై నూగులాంటి ఆకుపచ్చని సైడ్ బర్న్స్ వచ్చినా, అవి జుమ్ముర్ద్ అంటే ఆకుపచ్చని కాల్పనిక రంగురాయిలా ఉపయోగపడుతున్నప్పటికీ, మిరుమిట్లు గొలిపే అందమైన తలబిరుసు కురులు నాగుపాములా చేస్తున్న దాడిని ఆపలేకపోతుందట. ప్రేయసి ముఖసౌందర్యాన్ని గాలిబ్ తప్ప మరెవ్వరూ బహుశా ఇలా వర్ణించలేరు. మొత్తం కవిత భావాన్ని చూస్తే, పడగవిప్పిన నల్లతాచు లాంటి నీ అందమైన కురుల తలబిరుసు సౌందర్యాన్ని ఆకుపచ్చగా మెరిసే నూనూగు సైడ్ బర్న్స్ కూడా అదుపు చేయలేకపోతున్నాయి. తలబిరుసు కురుల సౌందర్యం అన్న ప్రయోగం కూడా గాలిబ్ తప్ప మరెవ్వరూ చేయలేరేమో. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్ 3వ షేర్ మైం నే చాహాథా కె అందోహె వఫాసే ఛూటూం ఓ సితమ్ గర్ మేరే మర్నే పే భీ రాజీ న హువా ప్రేమ బంధం నుంచి బయటపడాలని అనుకున్నా కాని నా మరణానికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. అందోహ్ అంటే బాధ, వఫా అంటే నిబద్దత, ప్రేమ, విశ్వాసం, సితమ్ గర్ అన్న పదాన్ని ఉర్దూ పలుకుబడి రీత్యా అర్ధం చేసుకోవాలి. సితమ్ అంటే దౌర్జన్యం లేదా బాధ అని భావం. సితమ్ గర్ అంటే దౌర్జన్యం చేసే, బాధపెట్టే వ్యక్తి. కాని ఇక్కడ ప్రేయసినే సితమ్ గర్ అని పిలవడం జరిగింది. అనేక బాధలకు కారణమైన ప్రేమలో ప్రేయసి సితమ్ గర్ కాక మరేమవుతుంది. ప్రేయసిని ఖాతిల్ అంటే హంతకి అని వర్ణించడం కూడా మనకు ఉర్దూ కవితల్లో కనబడుతుంది. చూపులను ఖంజర్ అంటే చురకత్తులతో పోల్చినప్పుడు, అలాంటి చూపులున్న ప్రేయసి ఖాతిల్ అనుకోక తప్పదు మరి. రాజీ అంటే ఒప్పుకోవడం. ఇక ఈ కవిత భావాన్ని చూద్దాం. అనేక బాధలకు కారణం ప్రేమే. గాలిబ్ తన ప్రేయసిని ఎంత గాఢంగా ప్రేమించినా ఆమె మాత్రం అతని ప్రేమకు నిదర్శనాలు, రుజువులు కోరడం తగ్గలేదు. ఇక భరించలేని స్థాయికి చేరుకున్నాడు. విముక్తి కావాలనుకున్నాడు. కాని ఆమెను వదిలి బతకనూ లేడు కాబట్టి జీవితాన్ని చాలించాలనుకుని, అందుకు ఆమె అనుమతి కోరాడు. ప్రేమతో ఆమెను బాధించే తాను శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళతానంటే ఆమె వెంటనే ఒప్పుకుంటుందనుకున్నాడు. కాని దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇక ఈ బాధ భరిస్తూ బతకడం గాలిబ్ కు తప్పలేదు. ఈ కవితలో మరింత లోతయిన భావం కూడా ఉంది. మనిషి ఈ లోకంలోని జీవించడానికి వచ్చాడు. దేవుడిపై ప్రేమ, భక్తితో దేవుడు చెప్పినట్లు బతకడానికి వచ్చాడు. కాని ఈ లోకంలో అలా జీవించడం కష్టసాధ్యం అవుతోంది. పరీక్షలు ఎదురవుతున్నాయి. బాధలు తట్టుకోలేకపోతున్నాడు. రోజూ దేవుని పట్ల తన నిబద్దతను నిరూపించుకుంటూ దేవుని మార్గంలో బతుకు గడపాలి. బాధలు తట్టుకోలేక మరణిద్దామన్నా వీలు లేదు. ఎందుకంటే, మరణించడానికి కూడా దేవుడి అనుమతి లేదు. ఆత్మహత్య మహాపాతకమని నిషేధించాడు. ఇదే భావాన్ని గాలిబ్ చక్కని పదాల్లో వ్యక్తం చేశాడు. గాలిబ్ కు ముగల్ చక్రవర్తి ఆస్థాన కవి, చక్రవర్తికి కవిత్వంలో గురువు దాగ్ దహెల్వీకి మధ్య ఒకవిధమైన పోటీ ఉండేది. దాగ్ రాసిన ఒక కవితకు జవాబుగా గాలిబ్ ఈ పంక్తులు రాశాడంటారు. దాగ్ రాసిన కవిత ఏమంటే : జీస్త్ సే తంగ్ హో యే దాగ్, తో జీతే క్యోం హో జాన్ ప్యారీ భీ నహీం, జాన్ సే జాతే భీ నహీం బతుకంటే విసుగొచ్చిందా, దాగ్, మరి బతుకుతావెందుకు ప్రాణం అంటే ప్రేమ లేదు, ప్రాణాన్ని వదిలిపోనూ లేవు. దాగ్ రాసిన ఈ కవితకు జవాబుగా గాలిబ్ పైన పేర్కొన్న కవిత రాశాడని అంటారు. నిజానికి దాగ్ తన కవితలో ఒక డైలమా రాశాడు. బతుకంటే విసుగొచ్చింది. కాని చావాలని కూడా లేదు, ఏం చేయాలన్నది ఆ డైలమా. ఈ డైలమాకు గాలిబ్ తన కవితలో జవాబిచ్చాడు. చావడానికి కూడా కుదరదని తేల్చేశాడు… ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మరికొన్ని కవితలతో మళ్ళీ కలుద్దాం...అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cuUHzL

Posted by Katta