పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Renuka Ayola లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Renuka Ayola లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2014, శుక్రవారం

Renuka Ayola కవిత

//వెల్తురు చాలా చిన్న వెల్తురు// రేణుక అయోల నిశ్శబ్దం కోసం వెతకాలనే ఈ గదిని అలంకరించాను నాటకం కోసం వేసుకున్న ముసుగులన్నీ కుప్పగా పడి నాటకాన్ని గదిలోనే వేయడం మొదలుపెట్టాయి కనిపించకూడదని తలుపులు ముసేసాను ముసుగుల రెప్పలు మిణుగురులై ఎగరడం మొదలుపెట్టాయి గదిలోపలి ఖాళీతనంలో ఇరుగ్గా నిలబడి పాదం ఆనే చోటు వెతికాను లోపలి చీకటి నిండి పొంగి పొర్లి గదిలో ప్రవహించింది నాటకంలో పాత్రలన్ని శరీరాన్ని ఆనుకుని ఈదుతున్నాయి గది తలుపులు తెరుచుకుని వెళ్లిపోలేక ఇంకా ఖాళీ కోసం వెతుకుతున్నాను ఖాళీలన్నీ పూడుకుపోయిన గొంతుతో జీరగా మాట్లాడుతున్నాయి చిన్న వెల్తురు చాలా చిన్న వెల్తురు దీపం వత్తిలా కనిపించింది జరుగుతున్నా దీపం కోసం చేతులు దాస్తూ వెళ్తూ వెళ్తూ గది తలుపులు మూయడం మరిచిపోయాను అలంకరించుకున్న నిశబ్దం ఎక్కడోజారిపోయింది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qkjnQV

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Renuka Ayola కవిత

//చక్రాల కుర్చీ // రేణుక అయోల నిన్నటి దాక నన్ను పట్టుకున్న గోడల చేతులు నేల చేతులు కొత్త అతిధిని చూసి దాచేసుకున్నాయి నిన్ననే శరీరాన్ని చక్రాల కుర్చీలోకి మార్చాలన్నప్పుడు అవి చేతులు దాచేసుకున్నాయి ఈ బండీ రీమోటుతో తిరుగుతుందిట మారుమూలకి నన్ను తోసేస్తూ ఎన్ని జాలి కళ్ళని తిరస్కరించినా లోపలి కళ్ళు జాలిని వదిలి పెట్టావుగా ఉడుములా ఒక్క సారిగా కెరటంలా వచ్చిన ఈ అనుభవంతో నిద్ర సముద్రంగా మారిపోయింది మెలకువ వేకువ ఇసుక తిన్నెల రెప్పల మీద ఆగిపోయాయి ఇంక నేలని తాకలేని పాదాలు పరుగులు పెట్టలేని పాదాలు శరీరంలో కరిగిపోతాయి జ్జాపకాలు లోపల శిలగా మారుతున్నాయి శిలలో తడి కరిగి వేడి ఆవిరి అవుతోంది శిలలో రక్తం మరుగుతోంది శిలలో యవ్వనం గుస గుసలు చేస్తోంది ఇప్పుడు చక్రాలు చప్పుడు చేస్తున్నాయి కాలికి కట్టుకున్న మువ్వల్లా గల్లుమంటున్నాయి గల్లుమన్నప్పుడల్లా నీళ్ళ కుండలని దాచేస్తూ గోడలని నేలని చూస్తూ తిరుగుతున్నాను రేప్పోదునుంచీ అందరితో చక్రాలు కట్టుకుని మాట్లాడాలి చిరునవ్వుని నోటీసు బోర్డులా అతికించుకోవాలి .....

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xLS0Uh

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Renuka Ayola కవిత

//నా నడకలో నగరం// రేణుక అయోల రోజు నడుస్తాను నిశ్స బ్దంలో శబ్ధనై ఆకుపచ్చని గడ్డి అలలపై నడిచే నల్లని పిట్టలని చూస్తూ తెల్లటి మనుషుల పల్చని చిరునవ్వుల మధ్య నడుస్తాను ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది చెట్లనీడలు ఆకుపచ్చని లోయలని తడుముతాయి ఆక్కడే కుక్కపిల్లలు ఆడుకుంటూ వుంటాయి మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం నాదేశంలోకి తీసుకు వెళుతుంది కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి ద్వారాలు వేరవుతున్న చప్పుడు అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు నగరం నన్ను నీడలా అనుసరించింది చుట్టూ నిద్రపోతున్న నిశ్సబ్ధంలోకి జలపాతంలా దూకింది అది ఆకుపచ్చని నీడలోకి కనుమరుగైనా నగరం ధూళిలో నేను నడుస్తున్నాను ఆకుపచ్చని నిశ్బబ్ధం లోకి ఒరిగిపోతూ

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rEsQ9w

Posted by Katta

28, మే 2014, బుధవారం

Renuka Ayola కవిత

నేను నువ్వు // రేణుక అయోల వలస వచ్చిన సీతాకోక చిలకలు చెట్టుని చుట్టుకుని నిజమైన ఆకుల్లా రంగురంగు పువ్వుల్లా ఆ వనంలోకి వచ్చాయి అద్దంలో ఎన్ని సార్లు చూసుకున్నా వాటి జ్జాపకం ఒకటి ఒంటిని అంటి పెట్టుకుని చూపిస్తుంది ఎక్కుతున్న మెట్లన్నీ వాటి రెక్కల జాడలతో నిండిపోయాయి నిజమైన రూపం ఎన్నో సార్లు అక్కడే ఆగిపోతోంది పై మెట్టు ఎక్కుతేగాని దీపం వెలగదు కిందమెట్టులో ఆగిపోయే పాదం వెల్తురునీడలో అద్దం బిగించి చూసుకుంటూనే వుంది రూపం నగ్నంగా నిలబడానికి సిగ్గుపడుతోంది దేహ నగ్నాలు లోకం లోపటి వస్త్రాలు ఎక్కడో నువ్వు నేను ఇంకా ఇక్కడే ఇరుక్కుని అద్దం చూసుకుంటూ పై మెట్టులో పాదం నీడని చూసుకుంటూనే వుంది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TTOXKe

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //అలుపెరుగని కొత్త నేస్తం // బాల్కనీలోకి రాగానే పలకరించే నా నేస్తం ముదురు జేగురు రంగుని కలుపుకుని నలుపునీడలో కరిగిపోతూ ఆకుపచ్చని ఆకులులేని నేస్తం కింద పరుచుకున్న లేత గడ్డికి నీడ విసనకర్రని వీచుతుంది అలుపెరుగని నేస్తం పిచుకల కుటుంబంతో హాడవిడిగా వుంటుంది ఆకులేని కొమ్మలని వంచుతాయి ఏరి ఏరి పట్టుకెళ్తాయి నిద్ర పోతూ కలవరిస్తూ ఊగీ ఊగీ గాలినందిస్తుంది నిన్న రాత్రీ చీకటిలో కురిసిన వానకి తనువంతా అప్పగించి నీటిని దులుపుకుని పట్టుకెళ్ళే ఆకులనందించింది పిచుకలకి మళ్లి ఈరోజు పొద్దున్నే తెల్లనిపూలని తలనిండా పూయించుకుని నునులేత కొమ్మల చేతులతో సవరించు కుంటూ నిద్రలేపింది నా నేస్తానికి నేస్తాలు కుటుంబ సభ్యులు పిచుకలు తెల్లని పూలని మెత్తని దిళ్ళుగా ఎత్తుకెళుతున్నాయి ఈ నేస్తం ఇక్కడిదా ?అనుకుంటాను ఎక్కడవున్న నువ్వు నా దోస్తువే అంది నీటిచినుకులు రాల్చుతూ తెల్లనిపూల కొమ్మల గోడుగులోకి రమ్మని పిలుస్తూ ....

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSrNSR

Posted by Katta

10, మే 2014, శనివారం

Renuka Ayola కవిత

//నిన్నటి అక్షరాలు// రేణుక అయోల నిన్న రాత్రి వేడెక్కిన అక్షరాలు వేడిగా వాడిగా ఊసుపోని కబుర్లతో చేతిలో రెప రెప లాడిన అక్షరాలూ అప్పటికప్పుడు నలుచదరంగా మడిచిన పడవై వాన ఒదిలిన పిల్ల కాలువలో ఊగుతూ వెళ్ళుతున్నాయి సగం ఉద్రేకాలు ,సగం కాంక్షలు,సగం ఆరోగ్య చిట్కాలు సగం కవిత్వం, మడచబడిన అక్షరాలతో కాలువలో పరిగెడుతూ నానుతూ నడుస్తున్నాయి చిన్న గులక రాయి మీద నిల్చున్న అక్షరాలు చిన్న చిన్న చినుకులకి తడుస్తూ తల ఒంచుకుంటున్నాయి చిన్న పాదం రాయి ఎక్కిన అక్షరాలని నీటి వాలులోకి తోసింది గిర గిరా తిరిగే నీటివాలులో ఊగుతూ నడుస్తున్నాయి చెట్టు విదిల్చిన చినుకుల జల్లులో తడిసిన అక్షరాలు నాని పోయి నడవలేని అక్షరాలు అణిగిపోయి చిరుగుతూ వర్షం ఆగిన గుంతలో మునిగిపోయాయి ...

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1glNz7F

Posted by Katta

1, మే 2014, గురువారం

Renuka Ayola కవిత

రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు వాళ్లు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు ఎండిన నేలలో గింజలు నీటిని తడుముకుని చిగురు తొడిగి పూలుపూచి మాటల గింజల మూటని నగరంలో ఎగరేసాయి ఎండిన ఆకుల్లా మాటలు గాలిలో షికార్లు చేసాయి మాటలు మాటలు ఎక్కడ చూసిన మాటలు వృక్షాలని నేలకూల్చాయి నీడలని దాచేసాయి నెత్తురు చవిచూసాయి ప్రాణాలు తీసాయి వాటి అర్ధం వెతికే పనిలో నగరం నలిగిపోయింది ప్రతీ ముఖంలో మాటలు నత్తి నత్తిగా పలుకుతున్నాయి ద్రోహం వలతో మాటల ఎరలు ఎర్రగా మెరుస్తూ తలలాడించాయి ఎండిన నదుల నిండా మాటలు మురికిగా పారుతున్నాయి కనిపించిన మనిషి బుజాలేక్కిన మాటలు బుజాలని నరుకుతున్నాయి పల్లేరు కాయల్లా గుచ్చుకుంటున్నాయి మాట మాటకి వెక్కిరింతలు విడిపోలేదేమని కుశల ప్రశ్నలు ఇంకా మాటలు ఊరుతునే ఉన్నాయి సముద్రాలు సృస్టించి ఇసుకమేటలు వేస్తున్నాయి చీకటిలో చుక్కలు ,పక్కటెముకలమీద చురకత్తులు గొంతుకి ఊరి తాళ్ళు సిధం చేస్తున్నాయి అయిన అందరూ మాట్లడుతూనే ఉన్నారు వాళ్ళు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్ళిపోయారు

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o45QuW

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Renuka Ayola కవిత

కోరుకున్న సంభాషణ వేళ్ళలోతులలో రంగులుముంచి మనసు గుమ్మాలకి కుంచె లు ఆనించి ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం ప్రదర్శనలో గోడ గుండెల మీద నిల్చోగానే సముద్ర ఆగధత్వం, ఆనందం, ఆత్మపిలుపు చూస్తారని ఎదురుచూడడం మొదలు పెట్టింది ఎన్నో జతల కళ్ళు నీరెండమెరుపులా వాలి సౌందర్యాన్ని దిగులులోముంచి చర్చిస్తూ అర్దంకాని సమూహలుగా పక్షుల గుంపులై ఎగిరిపోయాయి దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం తామరపూలు వికసించి నవ్వడం ప్రేమించిన స్త్రీ పెదవులమీద మోహరించిన నవ్వుని చూస్తారని వెతకడం మొదలుపెట్టింది పడకగది గోడలమీద ఆనుకుని వాళ్ళనేచూస్తూ రంగులతో ఎప్పటికైనా సంభాషిస్తారని రంగులలో ముఖాలు స్పర్శలు వెతుకుతారని కళ్ళువిప్పార్చి చూస్తూనే ఉంది ఒక మాటకోసం ఒక ముఖం కోసం ఒక సంభాషణ కోసం.... (సారం గాలో ఒక కప్పు కాఫీ శీర్షికలో కృ ష్ణ ఆశోక్ గారి చిత్రాలు చూసాక రాసిన కవిత ఇది )

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fbVeES

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Renuka Ayola కవిత

// నీడలోపలిదేహం// రేణుక అయోల దీపం కింద నీడ దేహన్ని చాపలా పరుచుకుని కూర్చునట్లుగావుంది వెలుగు రెక్కలు జీవితాన్ని కాగబెడుతునట్లుగా వుంది మనసు జ్వాలతోపాటూ ఊగుతోంది కారణం లేకుండానే ఆశల రెక్కలు ఎగిరివచ్చి దీపాన్ని కౌగలించుకుంటున్నాయి మండుతున్న ఎరుపులో జారిపడిపోతూ లేస్తూ దీపం కింద నీడని వంగి చుస్తున్నాయి జవాబు రాని ప్రశ్నలా దీపం కొండేక్కుతోంది మునివేళ్లతో సవరించి నుసినిరాల్చి దీపాన్ని వెలిగించినప్పుడు అప్పుడు కూడా గాలి స్పర్శలో ఊగే దీపం ఆత్మలా మండుతోంది జీవితాన్ని వెలిగించాలన్న వెర్రికోరికతో ఎదుగుతోంది దారిచూపించాలన్న వేదన చీకటిని దాచేయాలన్న తపన వెలుగుకింద అన్ని దాగిపోతాయన్న నమ్మకం అదే దేహంతో దీపం చుట్టూ తిరుగుతూ దీపాన్ని జరిపి చూడగానే నీడ ఆత్మలోకి ఒరిగిపోయిన దీపం నిశ్సబ్ధంగానే వెలుగుతోంది...

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gNqTME

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Renuka Ayola కవిత

కొత్త ఊగాది //రేణుక అయోల// నగరం ఇప్పుడు కొత్తగావుంది పాత తలుపులు చెక్కి కోత్తగడియాలు బిగించినట్లు వుంది కోత్తగా కోయిలపాట వింటునట్లు వుంది నడిచిన రహదారులు ఎక్కిన రిక్షాలు చదివిన చదువులు అన్ని కొత్తగా వున్నాయి ఏళ్ళు గడిచిపోయాయి ఎక్కడి వారమో గూళ్ళుకట్టుకుని రెక్కలోచ్చిన పిల్లలు ఎగిరిపోయిన మిగిలిన గూడులో ఒదిగి నగరంలో నిద్రపోతున్నాము కాని ఈ రోజు కోయిల గొంతు కొత్తగా వినిపించింది నగరంలో ఇప్పుడు ఎన్ని పాటలు పాడినా పదాలకి అర్ధాలు కొత్తగా వున్నాయి కలసిబతుకుదామన్న కోరిక కొత్తగా అనిపించింది ఎప్పుడు విపోయామో అర్ధం కాక విడిపోయారు అన్నవాళ్ల వంక కొత్తగా చూడాలనిపిస్తోంది నగరంలో కొత్త ఉగాది పచ్చడికి కొత్తమాడికాయ కొత్త చింతపండు,కొత్త బెల్లం కావాలి కారం కలపాలని లేదు అది కొత్తదైతే మనసు మండుతుందని కొత్తగా ఆలోచిస్తూ తీసిన ఈ కిటికీలోకి వచ్చిన కొత్తవెలుగులో పెరటిలో మాడిచెట్టుమీద కొత్తమామిడికాయ కొమ్మమీదకూసింది కోయిల గోంతెత్తి గట్టిగా అది మాత్రం ప్రతీ ఏడాది పలకరించే అందరి కోయిల

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSkqFG

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //నేల జారిన చాయ// పగలు లోకాన్ని మోస్తూ నిద్రలో కల్పించుకున్న లోకాన్ని ఆలోచిస్తూ అనుభవాలు మాటలు ఇస్టాలు ద్వేషాలని ఇముడ్చుకుని రేకులు కప్పుకున్న మొగ్గలా పడుకున్న శరీరం నిల్చుని నీడలో భాగమైనడుస్తుంది కాంతిలో పొద్దుతిరుగుడు పువ్వు పోడుగ్గా నేలని కావలించుకున్న నల్లని ఆత్మ రేగుతున్న జుత్తు ఊగుతున్న చేతులు నడుస్తున్న పాదాలు నేలమీద వాలిపోయిన రూపం విడివిడిపోని రూపం గోడల మీద మేకులుతో కొట్టని చిత్రపటం వాలిపోయిన పోద్దులో తగ్గిపోతున్న కాంతిలో అదృశ్యమైన ఛాయ వీపుని చేరుకున్న స్వేచ్చ ఇంట్లో కూడా బల్బుల అర్ధకాంతిలో కదిలే వేళ్లని కావలించుకున్న ఆకారన్ని సొఫాల మీద పరుకున్న పక్కమీద మనకింద నోప్పిలేని శరీరంతో మౌనంగా నిద్రపోతుంది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73vKv

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //నాట్యం// ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా పాదాలతో మట్టిని తాకుతూ లోపలి గానానికి బీజాలు వేస్తూ రాలిన గింజలు నునులేత చిగురుతో ఆకుపచ్చని కాంతితో అల్లుకుంటాయి జంట సర్పాలు పెనవేసుకుంటాయి శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి సన్నిని సవ్వడితో మొదలైన గానం గుమ్మడి తీగలా అల్లుకుంటుంది పచ్చనిపూలు తాటాకు కప్పుమీద నిల్చునట్లుగానే వుంటుంది గానం నగ్నంగా మట్టిని నీరుని ఆకాశాన్ని తడుముతుంది అప్పుడే ఆకాశంలో కలుస్తున్నప్పుడే గాలితో, కొండలతో ఇసుకతో పరిచయం పరిచయం ఒకపిలుపు కోరిక, వాగ్దానం నిశ్శబ్ధ తాకిడికిలో పాదం వెనక పాదం పాటని నింపుకున్న వేణువు అప్పుడు నీకు నాట్యానికి తేడావుండదు గాలికి ఊగుతున్న పూలకోమ్మలుగా కనిపిస్తావు.

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMvWTl

Posted by Katta

2, మార్చి 2014, ఆదివారం

Renuka Ayola కవిత

(తొలి హాస్య కవితా సంకలనం. ౨౦౮ ఫిప్ర వరి లోనిది ) రేణుక అయోల//నాతో మాట్లడని నాకవిత్వం// నా కవిత్వం - అమాయకపుది, పల్లెటూరిది కొత్తదనం , డాబు,దర్పం తెలియనిది అధునికత అంటగడదామని- ముతక పంచ ముల్లు కర్రపడేయేంచి క్రాఫుదువ్వి ప్యాంటు చొక్కా తొడిగాను అయినా పెదవి విరిచారు కొత్తదనం లేదని - కవితే కాదని వాదించారు అప్పుడే- ఆస్పష్ట అనుభూతి కలిగిస్తూ పాత మాటల్నికొత్తగా చెబుదామని నా గుండె గుడికి దారం కట్టి నీ కనుల గేటుకి వేలాడదిశానన్నాను, ప్రేమకోసం నీ పెదవులు కత్తిరించి నా వీపుకి అతికించు కొన్నాను అన్నాను నీ కోసం నా శరీరం ఫ్లాస్కులో పోసినవేడి నీళ్ళలా కుత కుత మంటోంది అన్నాను. ఇలా ఇన్ని మార్పులు జరిగాక నా కవిత్వం ఆధునిక మైయింది పొగడ్తల సముద్రంలో ఈదులాడతూ నాతో మాట్లాడం మానేసింది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWyDQl

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //గాలిపటం// కనురెప్పల మీద నుంచి ఎగిరిపోయి రంగు రంగుల స్వప్నాలను కాజేసిన రాకాసి గాలిపటంలా ఆలోచనల కోమ్మకి వేళ్ళాడుతూ ఊరిస్తుంది ఇస్టమైన విషయాలు ఎన్ని కధలుగా చెప్పినా బతుకు కధల రంగురంగుల తోక చూపిస్తుందేగాని కిందికి దిగి రాదు ఆవలింతల దుప్పటి కప్పుకుని కనపడకుండా కొమ్మమీదనుంచి దింపుదామన్నా ఇంకా ఇంకా చిటారు కోమ్మకి వెళ్ళిపోతుంది రెప్పల ద్వారానికి అడ్డుగా నిల్చుంటుంది కళ్లకి మనసుకి వంతెనవేసి ఇసుకమేటలమీద నడిపించి ఊరించి తెల్లవారుఝాములో చేతికి అందుతుంది..

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dG2J61

Posted by Katta

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

రేణుక అయోల || మాటలు గుమ్మంలో విరగ బూస్తాయి

మీకు తెలుసా కొందరి మాటలు
మంచు కత్తులు
చల్లటి నీటి చుక్కలు గుండె మీద రాలుతున్నా

పదునులేని కత్తి

దిగబడుతుంది బలవంతంగా.

అవాల్లా జారుతున్న మాటలు పాదం మోపలేని నిస్సహాయత
అవి రెక్కలు కట్టుకుని దీపంపురుగుల్లా విసిగిస్తాయి
జీవితాన్ని క్షాణాల్లో చిందర వందర చేసీ మాటలు లోపలలికి వెళ్లిపోతాయి
తుఫాను వెళ్లిన చిత్తడి నేల అవేశాలు అక్రోశాలు ఏడారి ముళ్ళమోక్కలు చేతులు నలుముకుంటూ
మనవేపు చూస్తూంటాయి ఒక దాని ఒకటి పొంతన వుండదు,వాళ్ళ ముఖాలే పదే పదే మనవంక చూస్తుంటాయి

అప్పటిదాక ఆల్లుకుపోయినవి రేపటిని రంగులకలయికలో ముంచెత్తినవి పరాయిగా బొత్తిగా పరిచయం లేని ముఖంలా
గుంపులోకి వెళ్లిపోతాయి మన గురించే కొత్తగా మాటలు మోదలు పెడతాయి‘ అవే మన వాకిటిలో వద్దనా రంగు రంగుల పూలై మన చేట్లనిండా విరగబూస్తాయి.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

రేణుక అయోల// దహనంలో ఒళ్ళు//


ఒళ్ళు దాచుకో
పైట జారనీయకు
జీన్స వేసుకోకు
దాని మీద టాప్ అంత చిన్నదేమిటి
మినీస్ ఎందుకు?

ఒద్దికగా వున్న ఒళ్ళు కావాలి
నాజూకుగా వుండాలి
తెల్లగా వుండాలి
ఒళ్ళు వంచి పని చెయ్యాలి

ఒళ్ళు దాచుకోకు
సహకరించు
నాజుకుగా వుంటేనే ఇష్టం
అలంకారాలెందుకు
నాకోసం అందంగా వుండు చాలు

ఒళ్ళు దాచుకోకు
మాంగల్యం లేనప్పుడు
నీకు ఇష్టాలా?
నీ జీవితం మాది
ఒళ్ళు గట్టిగా వుంచుకో
చాకీరి కోసం

ఒళ్ళు దాచుకో
ఆనారోగ్యం మాకు పడదు
శిధిలమైన ఒళ్ళు కాటికేగా!
ఒళ్ళు దాచేయ్యి
తెల్లటి వస్త్రంతో

దహనంలో ఒళ్ళుతగలపడ్డకా చల్లారింది
ఒళ్ళు అమ్ముడుబోదని...

1, సెప్టెంబర్ 2012, శనివారం

రేణుక అయోల||పట్టుపురుగు||


ఒక క్షణం కాలాన్ని కదపదు
 ఇంకోక్షణం నిద్రని దూరం చేస్తుంది
ఆలోచనగానే మిగిల్చేయాలన్న ఆలోచనలనకి గండిపడింది

వరద వరద 
వేసవి దాహం
నేలలో చోరబడ్డ కనబడిన నీటి బిందువు
నీ శరీరాన్ని చుట్టుకున్న మంత్రమేదో లోపల ప్రవేశించాలని ఆలోచించగానే
 మెట్లమీద ఆగిపోయిన నా అడుగులని పావులని చేసి
నడిపించుకుంటూ వెళ్ళిపోయావు

మోహన రాగం నన్ను అల్లుకుంది వేణువుని అన్నావు.
కోపంతో రగులుకున్న కళ్ళకి కర్పూర కాటుకని అద్ది
నీటిలో చేపపిల్లలా కళ్ళలో ప్రతిబింబించావు రెప్పని వాల్చాను.
రెప్పల విసినకర్రలో ఒదిగి
అగ్నిని ఆర్పేసిన అగ్నిమాపకదళుడివయ్యావు

నన్ను నన్నుగా బతకని మాటల బుట్టని అక్కడ ఉంచేసి వచ్చేదామనుకున్నాను
నన్ను కమ్ముకున్న నీ ఊహ దానిమ్మపూలరంగుల అద్దకాలని
 క్ష.
ణా.
ల్లో ...
ముద్రలువేసి వెళ్లిపోయింది
రంగులు అంటుకున్నదేహంలాంటి మనసు వెన్నెల దారులని వెతుక్కుంది

ఓడిపోయాను- అన్నమాటలో ఎవరు అన్న ప్రశ్న?
జవాబుగా
రెండు బలమైనదారాల గూడు అల్లుకుని పట్టుపురుగుని చేసాయి...
1-9-2012

26, ఆగస్టు 2012, ఆదివారం

రేణుక అమోల // నిద్రగూటిలో కొడిగట్టినదీపం //


నిద్ర గుటిలో దీపం
దీపంచుట్టూ పురుగులు
ఎన్ని కధల మీద రెక్కలు పరుస్తాయౌ.


సవరించడం మొదలుపెట్టాయి
కాగితాలు ఎగరడంతో అక్షరాల పావురాళ్లు వాలుతున్నాయి
కువకువ లాడుతూ గునగునా నడుస్తూ
నిద్ర రెప్పలపై పొడుస్తూ గింజలు ఏరుతున్నాయి

మసక వెల్తురులో ప్రేమలేఖని వెతికిపట్టుకున్నాయి
చేతిలోంచి జారిపోయిన అద్దం ముక్కలుగా అక్కడ
ఓడి పోయిన ప్రేమ పగిలిన ముక్కలలో ముక్కలుముక్కలుగా
మండుతున్నచితి మసగబారిన కళ్ళలో ఎర్రటి జీర
అమ్మ ముఖం-
ఎర్రటి సూర్యుడిని ఆహ్వనించడం మరచిపోయిన ఆకాశం


రెక్కలు కట్టుకుని ఇనుప పక్షి కడుపులో దూరి
సముద్రాలు దాటి పగలుని రాత్రి
రాత్రిని పగలుగా పేనుకుని కుశల ప్రశ్నలు
తీగలమీద వరుసగా కుర్చున్నపిట్టలు.
చెవిలో ఒకదాని వెంట ఒకటి అడుగుతూనే వున్నాయి

ఒకరి చేయిని ఒకరు ఆసరాగ పెనవేసుకుని
జీవితం వరదలో కొట్టుకుపోయి
మనసు లేని ఆల్చిప్పలు
పక్కమీదోర్లుతుంటే
నిద్రరాని గూటిలో దీపం కొడగట్టడానికి
తెల్లవార్లు రెక్కలపురుగుల్తో పావురాళ్లతో యుధం చేస్తూనే వుంది ...

25-8-2012

19, ఆగస్టు 2012, ఆదివారం

రేణుక అయోల //My name Is kahan : //


రేణుక అయోల //My name Is kahan : // ___సినిమా కూడా ఒక ఆలొచన
\\ఒక ప్రశంస,ఒక అకాంక్ష\\

ఆ మనిషి మనిషి కోసం వేతుకుతుంటాడు
మనిషిలో పసితనం కోసం అన్వేషిస్తుంటాడు

ముఖమే మనిషికి ఋజువు
పసితనం సహజాతం
అది సహజాతంగా లేని మనిషి పనిముట్టుగా అవతరిస్తాడు
గొడ్డలిగా,తుపాకీగా,కొడవలిగా.
సర్పంలా సంచరిస్తూ ఉంటాడు.
”రిజ్వాన్ ఖాన్” కి ఇవేమి అవసరంలేదు
అతను పసితనంలో ఇమిడిపోయిన మనిషి
హాయిగ నవ్వుతాడు ,ఏడుస్తాడు ప్రేమిస్తాడు
సమాజాన్ని స్వేచ్చగా ప్రశ్నించగలుగుతాడు.

దేశంకాని దేశం,పుట్టిన ఊరు ఎక్కడైన మనుగడ కోసం
జీవించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ
ఒక ప్రశ్న బులెట్లా వెన్నంటి వస్తూనే వుంది
విధ్వంసానికి ఒకే ఒక్క పేరు బలిఅవుతూ
అందరిని అడుగుతోంది?
నాపేరుని ఆయుధంగా ఎందుకు మార్చారని.

పేరు జన్మనిచ్చిన తల్లి పెట్టినది
మతంకూడా జన్మనిచ్చి గుర్తింపు ఇస్తుంది
మతం నాపేరుకాదు
మతం ఒక నియమం
మతం ఒక స్వాంతన.

మామూలు జీవీతం, అందరిలాంటి పేదరికం.
జీవితం గోడలు బద్దలు కొట్టీ
శిధిలాల మధ్యలోంచి పేరు చూసి శవమని వదిలేస్తేనే కదా
అడుగు అడుగునా ఘనీభవీంచిన మానవత్వంలోంచి
తడిని వెతుక్కుంటూ ప్రశ్నిస్తూ కనిపిస్తాడు ”రిజ్వాన్ ఖాన్"
నాపేరు ”రిజ్వాన్ ఖాన్”
విధ్వంస కారుడినికాదు అంటూ-
( మై నేమ్ ఇస్ ఖాన్) సినిమా చూసాకా.


*18-08-2012