పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kranthi Srinivasa Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kranthi Srinivasa Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||నేను ఓ నేనునే || అంతా కదులుచున్న చోట నేను కదిలినా అంతా నిలచివున్న చోట నేను నిలిచినా చాతీనిండా పూలు వెలుస్తున్నాయి అందరికీ నేను భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే... పూసిన పూలు పరిమళించడం మొదలెడతాయి ఒక్కడిగా విడిపోయినప్పుడు ......... బయటకు తొంగిచూస్తే వైరాగ్యం లోపలికి వెళ్ళిచూస్తే విౙానం ....... విచిత్రమేమంటే .... ఒక్కోసారి ౙానం గాయపరుస్తుంది ...వైరాగ్యం భోధపరుస్తుంది ఎన్ని విన్యాసాలు చేసినా .....చివరికి కేవలం నేను ..ఓ నేనునే ననే సత్యమే విడులవుతుంది

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nt88CS

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||సమాధానం|| సుప్రభాతగీతం మనకు మనమే పాడుకొని పొద్దున్నే మళ్ళీ శవాన్ని భుజానవేసుకొని ...... నిన్నటి పాదముద్రలనే కాళ్ళకు తొడుక్కుంటాం చెవులను అక్కడక్కడా అతికించి నాలుగువైపులకు కళ్ళను పారేసుకొంటాం.... ఆపై కళ్ళను చెవులను ఏరి తెచ్చుకొని ముందర పోగేసుకొని ఎడిటింగ్ లో విఫలమవుతుంటాం విసిరేసిన ఆట వస్తువుల నడుమ .....పసిపిల్లాడిలా చెల్లాచెదురైన ..దృశ్యాలు శబ్ధాల మధ్య పడి అలసిపోతుంటాం చలనపు చెలిమ ఎండిపోయేదాకా ....సమాధానాలకోసం వెతుకుతూనేవుంటాం .....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uNh4Wo

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||యధాలాపం|| పొగలోమునిగి అస్పష్టతల మధ్య కళ్ళను వెలిగిస్తాము మనమే ఒక ద్వారబంధాన్ని తగిలించుకొని కలయచూస్తాము అనేక దృశ్యాలు నిద్రలేస్తుంటే వాటికి గొంతుకలు తగిలించేపనిలో పడతాం అప్పుడవి మనకు తెలియని భాషలో మాట్లాడటం మొదలెడతాయి ఏదో ఉందని నిర్ధారించి,ఒక తాళపత్రమైపోతాం ..................... మనలో ఎవడో ఎప్పుడో యధాలాపంగా ఒక రహస్యతంత్రిని మీటుతాడు ...... అప్పుడు తాళపత్రం నోరుచేసుకొంటుంది ..... పొరలుపొరలుగా ఉన్న కాలం కొత్తపొరలోకి కాలుపెడుతుంది

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqJ8iP

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||మొదలులోకి ...|| నేను సాంద్రమైపోతాను ...కానీ ఆవెంటనే ఉక్కిరిబిక్కిరై ఉనికిలోకి తేలిపోతాను నేను సరళమైపోతాను ...ఏం లాభం భయం రెక్కలు మొలచి క్రిందికి జారిపోతాను నేను అప్పుడప్పుడూ నిలిచిపోతాను ....క్షణాల్లోనే రంగువెలసి మరుక్షణమే ఎవడిలానో మారిపోయేందుకు పరుగులిడతాను.. చుట్టూ ఎన్ని భూతాలో ..అన్ని వాటిలానే మారాలంటున్నాయి అందుకే నన్ను నేనే ఉండచుట్టుకొని ... వేగంగా విప్పుకొంటూ కొత్త గాలిపటమై ఎగురుతుంటాను అయునా ఎలాఉన్నా మరోలానే ఉండాలనిపిస్తుంది ......ఎందుకంటే నాకంటే ముందే ఎవడో అచ్చం నాలానే ఎగురుతుంటాడక్కడ నాకొసం ఈలోకం సిద్దపరిచిన గాజుపూల పానుపు గుచ్చుకొంన్నప్పుడల్లా నన్ను నేను గుర్తుపట్టే ప్రయత్నంలో మునిగిపోతాను ....మళ్ళీ సరళమై సాంద్రమై స్తాణువై తల్లి పేగులో వెతుకులాడుతాను .....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQnTF

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఊరికే ....|| నాఊరిగాలి సోకగానే,పొలిమెర తాకగానే, ఎన్ని రహస్యసంభాషణలో చెట్టుతో,చెరువు గట్టుతో,కలయతిరిగిన మట్టితో ఎన్నెన్ని రహస్యసంభాషణలో పోయున మనుషుల ఙాపకాలతో... కూలిపోయున నిర్మాణాల ఆనవాళ్ళతో ఎన్నెన్ని సంభాషణలొ ఏళ్ళ క్రిందటి వూరు మళ్ళీ కళ్ళకు తగిలించబడితే........ దారిపొడవునా మాటువేసిన అప్పటి వేలవేల మాటలు ఎన్నెన్నో నాచెవిలో పూసాయి అప్పటి ఆకాశం వైపు దారితీస్తూ నాలో నేనే నడచిపోతున్నప్పుడు ..ఎన్నెన్ని మధుర సంభాషణలో చిన్ననాటి గొంతుకలు పలకరింపుల గుభాళింపులో .... మళ్ళీ బాల్యాన్ని రాసుకొని అమ్మమ్మ కాళ్ళ మురుగుల చప్పుడు మళ్ళీ విని,నేనప్పుడు పెంచిన తోకబంతి పువ్వొకటి కోసుకొని నాఎదుట నేను నిలబడ్డాను ....విధిలేక మెల్లగా మళ్ళీ ఇప్పటి లోకి జొరబడ్డాను

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdCXQV

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||తొణకని వేదన || అందరూ దుఃఖం లోకి తొంగిచూడగలరు ఏకొందరో గొంతుపగిలేలా ఏడ్వగలరు ......... విషాద వీచికలు మొహమ్మీద ఈడ్చికొడితే ఎదలో ఏవో రంగువెలసిన జెండాలు అవనతం అవుతుంటాయి స్వప్నాలు కాసేపు నిద్రించి... మిగిలిన ఖాళీలో ఒకకన్నీటీ ఛాయను ముద్రించి పోతాయి ....... ఎంతకీ తెగని తలపొకటి తలక్రిందులుగా నిలబెడితే పాదాలు అస్తిత్వం కోల్పోయి నడక కాసేపు ఆగిపోతుంది ... వందలుగా పగిలిన మనలోకి భయం ప్రవహిస్తుంటే వొంటరి వొంటరిగా ఎదురీతకు సిద్దమవుతుంటాం .... అందరూ దుఃఖం లోకి తొంగిచూడగలరు ఏకొందరో గొంతుపగిలేలా ఏడ్వగలరు .........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1piGjlC

Posted by Katta

31, మే 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||సంధ్య చిగురు|| సులభంగా సౌక్యంగా ఉండేందుకు మనని మనం చెరిపిరాసుకొనేలానే రాసుకొంటాం ఎప్పుడో అప్పుడు పొగడ్తలోనో ..పదవిలోనో పడిపోవక తప్పదు అప్పుడు భారం కోల్పోయి ..మళ్ళీ కొత్తగా మొదలవుతుంటాం నిత్యం లోపల పర్వతాలను ఎక్కేవాళ్ళమేకదా ... ఎప్పుడో అప్పుడు జారిపడతాం.. అప్పుడు మాత్రం.... . గతంలో రాసుకొన్నది చెరిగిపోకుండా చేతలతో అడ్డుకొంటాం ..... ఎటుతిరిగి మనమో సున్నా గీస్తాం ....కాకుంటే ఙానం పెరిగాక అదే సున్నాని మరికాస్త గుండ్రంగా గీస్తాం మహా అయుతే మనమో సుడిగాలి అవుతాం ...సన్నని వాన చినుకులవుతాం తెల్లని మల్లెమొగ్గలవుతాం .... అన్నీ ఉన్నవే ...అన్నీ నిన్నవే లక్షల ఖాళీ క్షణాలమధ్య ఒక్కటి మెరవగానే .... మనల్ని మనం గబగబా చెరిపి తిరిగి రాసుకొంటాం క్షణంలోనే లక్షసార్లు .....మొదలవడం నచ్చక మళ్ళీ మొదలవుతుంటాం చెరిపిన అక్షరాల పొడి మొహం మీద పడి మెరుస్తూ .... ముంగురుల నీడలో తడుస్తూ ....వచ్చిన సందు దొరకగానే కాసేపు సంధ్య చిగురులై ఊరించి చాటుకు వెళ్ళిపోతాం ........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wGmrKR

Posted by Katta

22, మే 2014, గురువారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఫలిత బలం|| ఎందుకో ...ఈ మనుషులందరూ ఇనుప తీగల్లా సాగిపోతుంటారు .... ఇంటినుండి బయటకు ...బయటనుండి లోపలికి ... మనిషి నుండి మనిషికి ....వ్యవస్త నుండి వ్యవస్తకి .... అవస్త నుండి అవస్తకు ...సాగిపోతూనే ఉంటారు ఏదో లౌకిక విషయం మీటినప్పుడు ఒక ఋణాత్మక అంశం ప్రవహించి..విషాద గీతాలనాలపిస్తారు ముక్కలు ముక్కలుగా తెగిపోవడం చేతకాదు మళ్ళీ మొదలయ్యు చిగురించడం అంతకన్నాచేతకాదు.... మొక్కలు మనకంటే చాలానయం ...నిత్యం చిగురిస్తూ ఎదుగుతాయు మారాకులు వేస్తూ మనుగడ సాగిస్తాయి .. మనం...... కేవలం చిగురిస్తున్న ఆకులమే అందుకే అలాగే ఎదిగి రాలిపోతుంటాం ఎదో చైతన్య వృక్షానికి మనమంతా చిగురులమే సుమా..... జీవితాల సమాహారమే తప్ప జీవిత శకలాల సమాహారమంటూ ఏదీ దొరకదు ..మొత్తం జీవితమే ఒక శకలం కదా అనుభవ నేపధ్యం లోంచి మరో అనుభవం ...పొడుస్తున్నప్పుడు జీవితాలు...సారూప్యతలు లేని కొత్త సంతకాలు చేస్తూనే ఉంటాయి ఎప్పటి కప్పుడు కొత్త ఫలితబలాలు నెట్టే దారిని పలకరిస్తూ పోవడమే ......

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF2fF4

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||దాపరికపు జాడ|| అక్కడే ఆగావేం ...... చూడు చూడు నీ నీడఎలా మెట్లెక్కి పోతుందో గమ్మత్తేమిటంటే నీ పాదాలకే వేలాడి వేలాడి ...చివరికి ఉరి తీసుకొంటుంది నిజం చెప్పనా .... పాపం సూర్యుడు వెలుగు కుంచెలతో .....నీ బొమ్మ గీసి గీసి అలసిపోతాడు నీవేమో .....నీ వెలుగును నీడ బుజాలకెత్తి మలిగి పోతావు వెలుగు,నీడల,యుద్దం లో ...అడుగు జాడలవై మిగిలిపోతావు

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jP9sMN

Posted by Katta

19, మే 2014, సోమవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||లిపిలేని భాష || జీవితమా........ సాయంత్రమై వస్తావు మొగలిరేకుల మొనపై వెన్నెలవై వాలుతావు అంతటితో ఆగక ... మొదలులో పడివున్న కుబుసానికి మెరుపులు పూస్తావు నేను ఉదయుంచే లోపే .. రెండుగాట్ల అగచాట్లను కానుకగా ఇచ్చిపోతావు జీవిత మొక లిపిలేని భాష ............ అందుకే ఎన్ని కాగితాలున్నా ఒక్క ముక్కా రాయలేం ...

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nY6Gwz

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||చీకటి సౌక్యం || చీకటి కూడా కొన్ని సౌక్యాల నిస్తుంది రేపటి రోకటి పోటుల రుచి తెలిసేదాకా తెలియనితనం మందుమాత్రయి ఇచ్చే ఆనందం ముందు తరాలను ముంచేదాకా తెలియదు మొత్తు కొనేది మీరే.... మోదు కొనేది మీరే ఎవడో వచ్చి ఆదుకొంటారని ఎదురు చూసేది మీరే ... ఎంతయునా.... చీకటి.. రోజులో ఒకబాగం మాత్రమే రోజంతా ఆకలే అయునప్పుడు ....నిజం తెలియక మానుతుందా తిరుగుబాటురధం కదలక ఆగుతుందా ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lBgasv

Posted by Katta

10, మే 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఏకాంకిక || నీవున్నావ్ కనుకే నేనున్నాను నేనున్నాను కనుకే నీవున్నావ్ నిన్ను నన్ను ఒకటిగా కట్టేసారెందుకో లేదు లేదు ఒకరిలో ఒకరిని పాతరపెట్టేసారు నిన్నయునా నన్నయునా తవ్వుకొనేందుకు నిన్ను నేను నన్ను నీవు అనుమతించాలిగా నీవు అలికిడి చేసినంతకాలం నేను నేను అలికిడి చేసినంత కాలం నీవు ....ముడుచుకుపోతాం కదా తెలియని ఇంకెక్కడో నిన్ను నన్నూ మడతపెట్టి పొట్లం కట్టారెవరో సరిహద్దులు రెండూ ముచ్చట్లాడుకొంటున్నప్పుడు ముళ్ళకంచెలమధ్య రంగుల తేడాతో నీలోకి నేను నాలోకి నీవు ప్రవహిస్తూవుంటాం ఎంతవింతో కదా నా అంగీవి నీవు ..నీఅంగీని నేనూ అయి ...ఒకరి లోపల మరోకరం... వేయు వొక్కలుగా పగిలిపోతూ తిరిగి రెండుగా అతుక్కుంటాం .... ఒక్క రెండు రెండే ...రెండొకట్లూ రెండే ...మనకాంతిలో మనమే మననీడలో మనమే వజ్రం లో చిక్కుబడ్డ సూర్యకిరణంలా నేను తలలు చెక్కబడ్డ వజ్రం లా నీవు ఇంకోసారి నాలా నీవు నీలానేను ఇప్పటి వరకూ ఎప్పుడూ నిన్ను నీవు ..నన్ను నేను చూసుకోలేదు కాబట్టే నీవుగా నేనుగా విడిపోయామేమో ఒకే దేహానికి రెండు వేషాలకోసం కట్టిన మాయతెరలు మననిలా విడదీసాఏమో నాటకం పూర్తయ్యేదెన్నడో వేషం చెరిపేసుకొనే దెన్నడో

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sx4AmA

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఆచూకి|| తెలుసుకోవడం క్రియే ... కానీ అది నిష్క్రియాప్రియత్వాన్ని వరించినా లోపలి దారి హఠాత్తుగా ఆగిపోయినా ఒక చీకటి మేఘం చిగురాకులా ఊగినా కొత్త వేకువ వైరాగ్యపు వరదల చప్పుడు వినిపించినా నీలోలక చలనపు ఆధార ఆకర్షణ అయిన తెలివే..... ఊడ్చే చీపురుకు మొదలు సరిచేసుకొనేలోపే వాకిలి విశాలమయి విషాదాన్ని శృతి చేస్తుంది పొరలు పొరలుగా అల్లుకొన్ననీవు ప్రాణవాయుప్రసార మార్గాల వెంట కొత్త పగుళ్ళలోచేరి ప్రయా్ణాన్ని కాసేపు ఆపివేస్తావు కొత్త లోకం లోకి జారిపడుతున్నప్పుడు నీటి బిందువులా నీలోకి నీవు గుండ్రంగా ముడుచుకొంటావు ఆపై చిద్రమై ఏదో ప్రవాహంలో కలసిపోతావు కొట్టేసిన వాక్యానివై కొత్తదనానికి పునాదివి అవుతావు నీ పుట్టుకకు చావుకు మధ్య బిగించికట్టిన కాలపుతీగను మీటే కారణాన్ని కనుగొనేందుకు నీకు తెలియకుండానే నీవే ఏదో ఆచూకి వదులుతావు

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tQMtd6

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఏటు??????|| మననుండి మనం జారిపోవడం మనలోకి మనం జారిపోవడం.. వేరువేరు సున్నా అయిపోవడం సుడిగుండంలో చిక్కడం.... వేరువేరు అయినా సరే ఏంజరిగినా ఒక్క దీర్ఘశ్వాశతో మనసును ఖాళీ చేయడం సాధ్యమా? గతాన్నంతా ఇనుపగోళ్ళతో వొలుచుకొని కొత్తపల్లవి ఎత్తుకోవడం సాధ్యమా? సాధ్యమే అనుకొన్నా......... మరక మంచిదే అనుకొనే వాడిని మారుమనసు పొంది మనువాడాలనుకొన్నప్పుడు రంగు వెలిసిపోక తప్పదుకదా అటుపై ఎన్ని గుంజీళ్ళు తీస్తేమాత్రం ఏంప్రయోజనం?

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OgZNGD

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||చెవిలో పువ్వులు || ఒకడివ్వటమేంటో మరొకడు పుచ్చుకోవడమేంటో ఎటుతిరిగి వెనుక బడ్డోడిని ఇంకా వెనకేయడమే కదా హఠాత్తుగా నిద్రలేచి కొన్ని పులివేషాలు ఆవులిస్తాఎందుకో దేశం చెవిలో పువ్వులు తురుమేటందుకే కదా వద్దంటూనే ఒకరిపై ఒకరు ఒరిగిపోవటాలేమిటో ఎదురుతిరుగుతారనుకొనే నేతలను వొరుగుల్లా వాడుకొనేటందుకే కదా జెండాలను న్యూటన్ చక్రంలో వేసి న్యూట్రలై పోవడమెందుకో కొత్త రంగుపులుముకొని ఎంగిలైపోవడానికే కదా వాడినోట్లో వీడిపేరు వీడినోట్లో వాడి పేరు స్మరించుకొంటూ ఊరేగుడేందో ఎటుతిరిగీ కొనుక్కోవడమే అయినప్పుడు కసితీర్చుకొనేందుకు మరో మార్గం లేకనే కదా

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iJYET6

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Kranthi Srinivasa Rao కవిత

|ఏమంత తొందర || గులాబీముళ్ళు గుచ్చుకొని రక్తసిక్తమయ్యుంది హస్తం పద్మంకోసం పంకిలంలో జారిపడ్డది పచ్చచొక్కా లింకులకోసం బలమైనలంకెలకోసం బంగపడుతున్నది కొడవలిక్కి నానోట్లో నీవేలు నీకంట్లో నావేలు .....ఎంచక్కా పొత్తయు పొడుచుకొందాం కుదరకుంటే చెప్పు ....కండువాల రంగులు మార్చే ఎజెండాలో పడదాం ఎన్నికలయ్యాక ఎవడెక్కాలో తేల్చుకొందాం......ఏమంత తొందరలేఇప్పుడు ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QaQFVT

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఆమని || లోపలంతా గాలివీచినప్పుడు, ఉక్కపోసినప్పుడు అక్షరఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా కురుస్తున్నప్పుడు,కూలిపడుతున్నప్పుడు అక్షర ఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా మండిపోతున్నప్పుడు,తడిసి గండి పడుతున్నప్పుడు అక్షర ఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా శూన్యమై నప్పుడూ ,సూదిమొనంత ఖాళీ లేనప్పుడూ అక్షర ఆమని చిగురిస్తూనే ఉంది లోపలికి ఏదిప్రవహించినా ....అక్షరమై బయటికినడచివస్తూనేవుంది మారే ప్రవాహ దిశల పౌనఃపున్యం నాలోపలి నన్ను దిశమొలతో నిలబెడుతూనేవుంది అక్షరమై అక్షర ఆమని చిగురిస్తూనేవుంది .........................

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nTDIOP

Posted by Katta

20, మార్చి 2014, గురువారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||కాబోలు || కాలం పుప్పొడి వనాల మధ్య నుండి చివరిదాకా పరుగులు తీస్తునేఉంటాం కేవలం ఎటునడవాలో తెలుసుకొనేందుకే సుమా .... చెక్కెర తలపులు విరియకున్నా...అప్పుడప్పుడూ కాసిన్ని నవ్వులు పువ్వుకొంటాం...బతుకు సిగలో ...బతికున్నామని చెప్పేందుకు నిర్హేతుక ప్రయాణమైనాసరే తెలియకుండానే బడలికవొంకతో విశ్రాంతి తీసుకొంటాం ..... యుగాంతాల విశ్రాంతికి రిహార్సల్ చేసేందుకు ...... వెలిగి మలిగే మిణుకు జీవితంలో.... ఒక్కసారి కూడా మిణుగురుల మూలం వైపు చూడలేం మాయామోహిత మణిమమయ కాంతులను నర్తింపజేసే మట్టిపాటలుగానే మిగిలిపోతాం ... రాలిపడుతున్న పూల సౌందర్యం నీకెంత ఇస్టమో ....నీవువచ్చిపోయే దృశ్యమే ప్రకృతిని పులకరిస్తుంది కాబోలు ..............

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJdSYv

Posted by Katta

19, మార్చి 2014, బుధవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||వింత వేడుక || విరహం విచ్చుకత్తుల మొనపై నాట్యమాడే వెన్నెల తరగ విసుగుకు విరుగుడు మందేసి ఆఖరి మెట్టెక్కే అనుభవం వేదన వీపుపైనెక్కి ఆడే ఉప్పుమూట లాట విరహం ఖైదీ జైలుగదిలో ఆత్రంగాఆరగించే విడుదలకు ముందురోజు విరహం అనంత దూరాల మధ్య అవిశ్రాంతంగా నిర్మించబడుతున్న రహదారి విరహం మౌనం కడుపులోకాస్తున్న మహాద్భుత శబ్ధానికి కవలపిల్ల విరహం తెరిపిలేకుండా కురిసే రసఝరి సయుతం తలవంచుకు వెళిపోయే తన్మయత్యపు కౌగిలి విరహం అప్పుడప్పుడూ గాలి కన్నాల లోంచి ప్రకృతి ఆలపించే విలయగీతపు సంగీతం...... విధ్వంసం లోంచి మొలచే వింత అనుభూతి ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OvbES1

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఊదారంగు పువ్వు|| తలవంచుకొని మంత్రాక్షరాలను ఏరుకొంటున్న నిన్ను ఓ శుభముహూర్తంలో ఊదారంగు పువ్వొకటి ఉచ్వాస నిశ్వాసల పరిమళాన్ని నిచ్చెనగావేసి పైకి రమ్మంటుంది ఖాళీ అయున పెదవుల్లో ఏదో మూల మిగిలిపోయున మధువు సలపరిస్తుంది కాళ్ళూ చేతులు కూడదీసుకొనే లోపే వీపుపై రెక్కలు మొలచి నింగిలోకి ఎగిరేస్తే నిన్నటి దాకా నీవే అల్లిన సాలెగూళ్ళలో చిక్కి సతమతమవుతుంటావ్ .............................. నిజమే మరిమళమంటే పిలుపే ....కానీ దాన్ని గెలుచుకోవాలి సుమా .........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g5aIxK

Posted by Katta