పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
BVV Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BVV Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Bvv Prasad కవిత

|| వానలోకం || ఊహించనిరోజున ప్రియమైనవ్యక్తి ఎవరో నీ గుమ్మంలో నిలబడినట్టు ఈ వేసవి ఉదయం లేచేసరికి నీ ఇంటిచుట్టూ వానపంజరం చెట్ల ఆకులమీద వాన, కొమ్మలమీద వాన, వాన నీటిమీద వాన, నీటిలోని ప్రతిబింబాలమీద వాన వాననెమలి నీ ఇంటిచుట్టూ పురివిప్పి తిరుగుతున్నపుడు నీ ఇల్లు అరణ్యంలో వున్నట్లూ సరిహద్దులులేని మరోలోకంలోకి నువ్వు ప్రవాసం వెళ్ళినట్లూ వుంటుంది మూగవెలుతురులో మునిగిన ప్రపంచం ఇప్పుడు ఆటలన్నీ కట్టిపెట్టి వానధ్యానంలోకి తనని కోల్పోతుంది కాసేపు జీవితమంటే నీ మనోలోకాల గోల కాదని వెళ్ళిపోతున్న ఆకాశాన్ని కన్నార్పక చూడమనీ చెప్పీ, చెప్పీ విసుగు పుట్టినట్టు చల్లని చినుకై చరిచి నీకంటిన నల్లని కాలాన్ని కడుగుతుంది వాన నువ్వు మనిషిలా రాకపోయి వుంటే వానవై పుట్టేవాడివనుకొంటాను బహుశా, లోకపు ఏ కొలతలోనో నువ్వొక వానవయ్యే వుంటావు లేకుంటే వాన కురిసినపుడల్లా నీకు దిగులు ముసురుకొన్న చల్లని సంతోషం ఎందుకు కలుగుతోంది __________________________ ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి 22.6.14 http://ift.tt/Uukkew http://ift.tt/Uukjax

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlxhC7

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || తాకినపుడు || మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు నీ నవ్వు కొండల్లో పరుగులుతీసే పలుచనిగాలిలా వుంటుందని పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి కవీ, ఏం మనిషివి నువ్వు ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ అనుభవించాననిపించదు నీకు నిజానికి, వాటిని తాకకముందటి వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా ___________________ ప్రచురణ: సారంగ 12.6.2014 http://ift.tt/1wcM0lD 21.6.2014

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wcM0lD

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || ఇందుకేనా || 1 నాలుగుగోడల మధ్య విసిరేసిన బంతిలా ఇక్కడిక్కడే తిరుగుతాయి నీ ఊహలు అదే ఉదయంలోకి మేలుకొంటూ, అదే రాత్రిలోకి నిద్రపోతూ ఒక్కరోజునే వందేళ్ళు బ్రతికి వెళ్ళిపోతావు ఇందుకేనా పుట్టింది, జీవితం ఇంత ఇరుకా అని అడుగుతుంటావు కనబడ్డవాళ్ళందరినీ ఒక్క మనిషిలాంటి వేలమనుషులు ఒక్క జవాబైనా ఇవ్వకుండానే వెళ్ళిపోతుంటారు ఈమాత్రానికి చీమైపుట్టినా సరిపోయేదికదా పూవైపుట్టినా మరింత బావుండేదికదా అని నిన్నునువ్వే నిలదీసుకొంటావు 2 రాలిపోతుంటాయి ఉదయాలూ, అస్తమయాలూ రాలిపోతుంటాయి వెన్నెలలూ, నక్షత్రాలూ రాలిపోతుంటాయి వానచినుకుల్లానో, ఎండుటాకుల్లానో రుతువులూ, కోరికలూ, బాంధవ్యాలూ జారిపోతున్న దిగులుదుప్పటిని ముఖమ్మీదికి లాక్కొంటూ ఇందుకేనా పుట్టిందని ఎవరిలోంచో ఎవరిలోకో అడుగుతూ వుంటావు నువ్వు కాస్త శాంతీ, చిరునవ్వూ మినహా మరేమీ వద్దని కాస్త ఊరటా, ధైర్యం కాక ఇంకేం కావాలని ఊరికే సుడి తిరినట్టు నీలోనువ్వే తిరుగుతుంటావు 3 చీకటి ఆకాశంలో నల్లని మేఘంలా దు:ఖం చిక్కబడినపుడు నీటిలోని సుడిగుండం లోతుల్లో నీరేమీ మిగలనపుడు పీడకలలాంటి వెలితిలోకి నీ ప్రశ్న నిన్ను విసిరేసినపుడు తటాలున ఉలికిపడి మేలుకొంటావు జవాబు దొరకదు కానీ, ప్రశ్న మాయమౌతుంది ఉదయాస్తమయాలూ, వెన్నెలలూ, రుతువులూ దిగుళ్ళూ, ఊహలూ, ప్రశ్నలూ అన్నిటికీ అర్థంవుందని, అర్థాలకి అందని ఖాళీ ఆనందాన్ని అవి ప్రకటిస్తూ, మాయమౌతూ వున్నాయని నీలోపల మేలుకొన్న సిద్ధార్ధుడు చెప్పగా వింటావు __________________________ ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 9.6.2014 http://ift.tt/TyiUiB 9.6.2014

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TyiUiB

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || జీవితార్థం || అర్థం కావటం ఏమంత అవసరం అర్థం తెలియని ఆకాశానికీ అర్థం తెలియని నీకూ మధ్య కురిసీ కురవని మేఘాల్లా ఎగురుతుంటాయి పదాలూ, వాటి అర్థాలూ జీతమంటే ఏమిటని నువు ప్రశ్నించుకొన్న ప్రతిసారీ దిగులుమేఘాలమీద ఒక కొత్త జవాబు ఇంద్రధనువులా మెరుస్తూనే వుంటుంది కానీ, ఇదిగో దొరికిందని ఇంద్రధనువుని తాకబోయే ప్రతిసారీ నిరాశవంటి నీటితుంపరులు మినహా ఏ రంగులూ నీ చేతికి అంటుకోవు జీవితమంటే ఏమిటైతే ఏమిటి ఊరికే జీవించు నీ కళ్ళముందు ప్రవహిస్తున్న నదిలా నీ కళ్ళముందు ఎదుగుతున్న చెట్టులా నీ కళ్ళముందు ఎగురుతున్న ఉదయాల్లా, అస్తమయాల్లా, నక్షత్రాల్లా ఊరికే జీవిస్తూ వుండు నెమ్మదిగా, మరికాస్త నెమ్మదిగా అర్థాల లోతుల్లోని నిశ్శబ్దమంత మృదువుగా ఊరికే.. _________________________ ప్రచురణ: వాకిలి జూన్ 2014 http://ift.tt/1kHjbtT http://ift.tt/SkAc1i 7.6.2014

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHjbtT

Posted by Katta

31, మే 2014, శనివారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || రాక || నువు ఎందుకో ఇక్కడికి వస్తావు వచ్చేసరికే ఇక్కడొక ఉత్సవం కొనసాగుతూవుంటుంది నువ్వు ఎవరో, నీచుట్టూ జరుగుతున్నది ఏమిటో నీకు నువ్వుగా తేల్చుకోకముందే వాళ్ళంటారు 'నువ్వు ఫలానా, ఇది చెయ్యాలి, అది కూడదు ' అని ఈ ఉత్సవానికి అర్థమేమిటని అడగబోతావు 'అదేమిటి కొత్తగా అడుగుతున్నా' వంటారు కొందరు జాలిదలచి 'నిరాశ కూడ' దని ఓదార్చుతారు వారికి నచ్చినట్టు ఉండబోతావు కాని భయ, హింసాపూరితమైన ఉత్సవంలో ఏదో వెలితి వుందని తెలుస్తూనే వుంటుంది ఉత్సవాన్ని విడిచి ఏకాంతమైదానం చేరి నీ జవాబు నీలోనే వుందని నమ్మి అడుగుతావు 'ఇదంతా ఏమిటి’ అని మరింత విశాలమౌతున్న ఆకాశం క్రింద దృశ్యాలన్నీ అణగిపోయిన విశ్రాంతిలో ఉండిపోతావు రాకపోకలు లేని నీలో కరిగిపోతావు 31.5.2014 http://ift.tt/1pGhKvQ

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGhKvQ

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || ఒక మధ్యాహ్నం, ఆమె || 1 నా గదిగోడలూ, వెలుపలి చెట్లూ వాటిమీద వాలుతున్న మధ్యాహ్నపు ఎండా మనుషుల భయాలూ, అవి సృష్టించే అడవినీడల్లాంటి ఊహలూ, వ్యూహాలూ యధావిధిగా భద్రంగా ఉన్నాయని నమ్ముతున్నవేళ ఆమె ఫోన్ చేసింది 2 'మీ కవిత్వం చదివాను మీ ఊహలన్నీ ఇంతకుముందే ఊహించాననిపిస్తోంది నేను గతంలో ఉన్నానా, మీరు భవిష్యత్తులో ఉన్నారా ' అని అడిగింది నాకూ అర్థంకాని సమాధానమొకటి చెప్పి నన్నొక నైరూప్యకవితలోకి నడిపిస్తున్న ఆమె మాటల్ని వింటున్నాను ఏ కొండమీది బౌద్ధాలయంలోనో ఖణాలున మ్రోగిన గంటారావం ప్రశాంతసమయంలోకి ప్రశాంతంగా కరిగిపోతున్నట్టు స్వచ్ఛ శ్రావ్య కంఠస్వరంనుండి వికసించిన మాటలు నాలో కరిగిపోతున్నాయి 3 'నేను ఉదయం నిద్రలేస్తానా నాలోంచి ఎందరెందరో వెళ్ళిపోతుంటారు, ఏవో చెట్లూ, జంతువులూ కూడా అన్నీ వెళ్ళిపోయాక నేను లేస్తాను ఎప్పుడూ నాతో మొక్కలూ, చీమలూ, గోడలూ ఏమో చెబుతుంటాయి' నా వెలుపలి, లోపలి ప్రపంచాలని చెరిపేస్తూ నాకు తాజా చూపునీ, ఊహనీ ప్రసాదిస్తూ ఆమె చెబుతూవుంది 4 'కొన్నాళ్ళు ఎక్కడికో వెళ్లిపోయాను, గదిలో పెట్టి తాళం వేసారు కొన్నాళ్ళు పిచ్చి అన్నారు కొందరు, కొందరు సైన్సు అంటున్నారు నాకేమీ అర్థం కావటం లేదు, చెప్పండి నాకు పిచ్చివుందా ' ఇంత నిసర్గమైన మాటలు విని ఎన్నాళ్ళయింది ఇంత నిర్మలమైన, దయ పుట్టించే కంఠం విని ఎన్ని రుతువులు గడిచాయి అనాది అమాయక బాల్యపురాశి నుండి నా వంతు నేను పంచుకొని అనుభవించిన తొలిరోజుల్లోని నా కంఠమూ, అమాయకత్వమూ ఆమె మాటల్లో చూసుకొంటున్నాను 5 ‘లేదమ్మా, నువు ఆరోగ్యంగా ఉన్నావు నీ ఊహలు, నీ వాస్తవానికన్నా శక్తివంతంగా ఉండటం మినహా నువు చాలా బాగున్నావు ' 6 ఎక్కడి ఆమె, ఎక్కడి నేను, ఏ జన్మాంతరాలలోని దయగల బంధం ఏ తల్లీబిడ్డల బంధం, ఏ తండ్రీకూతుళ్ళ బంధం ఇవాళ మా మధ్య మేలుకొంది ఇంకా ఏమో విన్నాను, ఏమో చెప్పాను 'భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా ' నా చివరిమాటతో మా సంభాషణ ముగిసింది భగవంతుడు లేకున్నా ఆ దయనిండిన క్షణాలనుండి పుట్టే వుంటాడు ఆమెని చల్లగా చూస్తాడు 7 భద్రమైన భయాలతో బ్రతుకుతున్న నా ప్రపంచం మంచిదా భయమెరుగని అమాయకత్వం నిండిన ఆమె ప్రపంచం మంచిదా నా గదివెలుపల గోడలమీదా, చెట్లమీదా వాలుతున్న మధ్యాహ్నపు ఎండ నా జీవితాన్ని కాసేపు వెలిగించి మరికొన్ని నీడల్ని మిగుల్చుతూ మాయమవుతోంది http://ift.tt/1h2X6AP 20.5.14

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2X6AP

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Bvv Prasad కవిత

బ్రతకాలి నువు లోకాన్ని లోపలికి తీసుకొంటున్నపుడు అది నిన్నూ లోపలికంటా తీసుకొంటుంది నిశ్చలతటంలోకి దిగినట్టు లోకంలోకి దిగుతావు కానీ నీటి అడుగున వేచివున్న మొసళ్ళని ఊహించలేవు ప్రతి గెలుపూ, పరాజయమూ జీవనానందం నుండి మరికాస్త దూరంచెయ్యటానికి వస్తాయి కీర్తి ఒక వజ్రంలా ఆకర్షిస్తుంది కాని దానిని మింగినపుడు ప్రాణం తీయటం మొదలుపెడుతుంది జీవితం ఇటువంటిదని ఎవరూ చెప్పరు జీవితం కానిది వదులుకొంటే జీవితమే మిగులుతుంది చనిపొమ్మని నిన్ను ఊపేస్తున్న భావాలన్నీ జీవితపు నీడలే కాని, జీవితం కాదు జీవితం తనని తాను చూసుకొనేందుకు నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకొంటే ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మరణించి వుండేది ఏమీ ఎరుగని చిరునవ్వు ఏనాడో మాయమైపోయేది జీవించడమంటే మరేం కాదు గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండటం ఉండటమే ఉత్సవమైనట్టు ఉండటం మిగిలిన పనులన్నీ నిద్రపోయినప్పుడు నీ పక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు ______________________ ప్రచురణ: నవ్య వారపత్రిక 7.5.14 http://ift.tt/1rVyW1P

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rVyW1P

Posted by Katta

1, నవంబర్ 2012, గురువారం

బివివి ప్రసాద్ ll వర్తమానంలోకి ll


రాలిపోయిన రాత్రిలాంటిది గతం
ఇంకా రేకులు విప్పని రాత్రి భవిత
వర్తమానపు కాంతిపుష్పం ఊగుతోంది గాలిరేకులతో


రాత్రులకైనా నల్లని రంగుంటుంది
మృదువిషాద పరిమళముంటుంది, విరామంలోకి వికసిస్తూవుంటుంది
రంగూ, రుచీ, వాసనా లేని గతమూ, భవితా
ఊహల్లో మాత్రమే ఉనికిని పాతుకునుంటాయి
జీవితమంతా వెంటాడినా
వేలికొసకు క్షణకాలపు దూరంలో నిలిచి వెక్కిరిస్తాయి

గతం జీవన శిధిలాలయం, భవిత గాలిలో తేలుతున్న నగరం
కూలిన గోడల్నో, పునాదిలేని భవనాల్నో ప్రేమించేవాళ్లని ప్రేమించనీ
మిత్రుడా, రా
హద్దుల్లేని ఆకాశాన్ని కప్పుకొన్న వర్తమాన భవంతిలో
మనం కాలం మీటుతున్న సంగీతాన్ని విందాము

దాహాగ్ని కోల్పోయి ఎండిపోయిన చెట్లనీ
మట్టిని తవ్వి మొలకెత్తని విత్తనాల్నీ చూస్తూవుండేవాళ్ళని చూడనీ
రా, మనం పోదాము
ఆకుపచ్చని జీవితంలో, అది రాల్చే నీడల్లో తడుద్దాము

గతంలో వెలిగి ఆరిపోయిన దీపాల్నీ
భవిత కోసం ఇవాళ చమురు పోగేసేవాళ్ళనీ పోగుపడనీ
రెండిటినీ దగ్ధంచేసే అగ్నిలా లెక్కలేనితనంలోకి వెలుగుదాము

గతంలోకో, భవితలోకో ఇవాళ్టి సంపద ఒంపుకొంటూ
నిరంతరం పేదలుగా మిగిలేవాళ్లని మిగలనీ

కాంతి పగిలి కిరణాలు వెదజల్లినట్లు
ఆనందం పగిలి జీవితం అన్నివేపులకీ విచ్చుకొంటోంది

రా మనం పోదాము త్వరగా
వర్తమానంలోకి, జీవితంలోకి, పసిదనంలోకి
ఎప్పటికీ మరణించని బహిరంగ రహస్యంలోకి
చిరంతన శాంతిలోకి, చిరునవ్వులోకి, ఏమీ మిగలకపోవటంలోకి..

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

బివివి ప్రసాద్ || విహంగ దర్శనం ||


1.

జీవితం ఒక మహా విహంగం

దాని రెక్కలు

విప్పినపుడు అది పగలు

మూసినపుడు అది రాత్రి

ఆ పక్షిని నేను దర్శిస్తున్నపుడు

నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియకుండా ఉంది

నేను ఉన్న ఈ సృష్టి ఎక్కడ ఉంది

నా ఊహకి అందని ఈ విహంగం నా ద్వారా శ్వాసిస్తోంది

నా కనుల ద్వారా అది చూస్తోంది

నేను నిదురించినపుడు అది విశ్రాంతి పొందుతోంది

2.

నేను పొదుపుగా దాచుకొంటున్న నా ఊహలన్నీ

ఎండమావులే అని గమనించాక తెలుస్తోంది

నేను నేను కాననీ జీవితాన్ననీ స్పష్టంగా తెలుస్తోంది

ఇపుడు నేనొక మహా విహంగం

వెలుతురు నా కల, చీకటి నా విశ్రాంతి

నేను ఎక్కడ ఉన్నానో,

ఎపుడు మొదటిసారి నా రెక్కలు విప్పానో

నేను ఎందుకు, ఎక్కడికి వెళుతున్నానో

ఎప్పటికీ రహస్యం

3.

రహస్యం నా నివాస స్థలం

నేను మహా విహంగాన్ని, నేను జీవితాన్ని

2.9.2012

26, ఆగస్టు 2012, ఆదివారం

బివివి ప్రసాద్ || ఆమె ||


ప్రేమకాంతి నా రోజుల్ని వెలిగిస్తున్న ఒక సాయంత్రం ఆమె అడిగింది
నేను మీకు అబద్దాలు చెప్పాననీ, మిమ్మల్ని మోసం చేసాననీ
మీకు అనిపించిన రోజున ఏమి చేస్తారు, నాపై కోపం వస్తుందా


నా చివరి సాయంత్రపు, చివరి బంగారు కిరణాలు
నన్ను చీకటికి అప్పగించి సెలవుతీసుకొంటున్నాయి

పరుచుకొంటున్న ప్రశాంత నిశ్శబ్దంలో ఒక పిట్ట కూసినట్టు
ఊహించనివైపు నుండి నాలో వాలిన మౌనంలోంచి ఒక్కొక్క మాట ఆమెతో అన్నాను

లేదు, నీపైన ఎప్పటికీ కోపం రాదు
నిజానికి కొన్ని తప్త క్షణాల్లో నిన్ను నా సహచరిగా భావించినా
నువ్వు ఎపుడూ నాకొక పసిపాపలా కనిపిస్తావు

నీ నిర్మలమైన చిరునవ్వు నన్ను ప్రాభాతకాంతిలా ఎన్నోసార్లు దు:ఖవిముక్తిడిని చేసింది
నీ చుట్టూ వలయం తిరిగి తాకిన చిరుగాలులు చల్లని నదీజలాల్లా తేలిక చేసాయి
నీ మాటలూ, వాటిమధ్య మౌనమూ నను రోదసిలో విహరించే అన్వేషిని చేసాయి
నా పేలవమైన సమయాలను నీ రూపం గొప్పదిగుల్లోకి పుష్పించేలా చేసింది

నీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది
జీవితం నాకు ఇచ్చిన అన్ని కానుకలలోకీ గొప్ప కానుకవి నువ్వు

కానీ, ఒకటి చెప్పగలను, నువు నన్ను విడిచేరొజు సమీపించేకొలదీ
నీకు నేను, మరిచిపోలేని, విడిచిపెట్టలేని అపురూపమైన కానుకనవుతాను
నన్ను విడిచివెళ్ళిన దు:ఖం నీ జీవితమంతా పరుచుకొంటుంది

ఆమె అంది, ఇది తీయని ప్రతీకారం
ఆమె చల్లని నవ్వుపై చీకట్లు వాలుతున్నాయి

నాలో తీయగానైనా ప్రతీకారకాంక్ష ఉందో, లేదో నాలోపల ఒకరికి తెలుసు
నాకు తెలుసు, ఆమె ఎక్కడ ఉన్నా నా మనిషి,
ఆమే, నేనూ వేరుకావటం ఆమె భ్రమ మాత్రమే అని

ఆమె వల్ల నేను ఏయే విశాల విశ్వాలకి మేలుకొన్నానో, విస్తరించానో
ఆమెకి తెలియదు ఇంకా, తానొక పసిపిల్ల కదా

జీవితం ఒక మొరటుస్పర్శ చాలాసార్లు
తాను నానుండి వెళ్ళిపోయాక ఆమెని జీవితమెలా లోబరుచుకొంటుందో నాకు తెలుసు
ఎందరిని చూడలేదు, కేవలం ధూళిలా, రాలిపోయిన పూలలా బ్రతుకుతున్నవాళ్ళని
ఆమెలో నేనొక మరువలేని సంతోషం మిగిల్చే మరువలేని దు:ఖాన్ని ప్రవేశపెట్టకపోతే
ఆమె జీవితం మాయలో ఎలా దారితప్పుతుందో
ఎలా వెలిసిపోయిన చిత్రపటంలా మిగులుతుందో నాకు తెలుసు, ఆమె ఒక పసిపిల్ల కదా

చీకటి ముసురుకొంది
చీకటి కన్నులు చెమరించినట్లు నక్షత్రాలు ఒక్కొక్కటీ మెరుస్తున్నాయి
అవి చిన్నిచిన్ని చినుకులు కావనీ, ఒక్కొక్కటీ నా జీవితం పట్టనంత కాంతిలోకాలనీ
నా కన్నులనుండి జారేందుకు వెనుకాడుతున్న కన్నీటిబిందువు చెప్పింది

ఆమె వెళ్ళిపోయింది, నువ్వైనా నాతో ఉండవా అనబోతున్నానని ఆ బిందువుకి తెలిసినట్లుంది

ఆమె ఉంటే జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని
ఆమెలేని దిగులు నన్ను మరింత దయలోకీ, కాంతిలోకీ నడిపించింది
తన వెలితిని నింపుకొనేందుకు అప్పటినుండీ విరామమెరుగక వికసిస్తూనే ఉన్నాను

ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూడాలని చాలాసార్లు అనిపిస్తుంది
అప్పుడు
పూలపై వాలిన మంచుబిందువులూ, పక్షుల రవాలూ, సెలయేటిపరుగూ,
మనుషుల చిరునవ్వులూ, దు:ఖితులపై ఎవరోఒకరు కురిపించే దయా
లోకం నన్నుతాకే మృదువైన సమయాలన్నీ ఆమె మాలో లేదా అని నవ్వుతాయి

24.8.2012

21, ఆగస్టు 2012, మంగళవారం

కవిసంగమం కుటుంబంలో అందరికీ వేనవేల అభినందనలు - బివివి ప్రసాద్



ఆంధ్రజ్యోతి వార్త దగ్గరిది.. అందరూ చూడాలని మళ్ళీ ఇక్కడ..

సమగ్రంగా జరపాలంటే రెండు రోజులైనా జరపవలసినంత ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక పూటకి కుదించినపుడూ, సమగ్రంగా రాయాలంటే రెండు పూర్తిపేజీలైనా రాయాల్సినది అరపేజీలో సర్దవలసివచ్చినపుడూ, అది కార్యక్రమ నిర్వాహకునికీ, వ్యాసకర్తకీ చాలా పెద్ద పరీక్ష అవుతుంది. అంత సాంద్రతనీ ఆవాహన చేసుకొని ఒక అవుట్ లైన్ తయారుచేసుకోవటానికి చాలా నిర్మలత్వమూ, ఓపికా కావాలి. మొన్న కార్యక్రమానికి యాకూబ్ గారికీ, ఈ వ్యాసానికి స్కైబాబా గారికీ ఆ ఓపికకీ, నిర్మలత్వానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

కవిసంగమానికి సీరియస్ నెస్ తీసుకువచ్చినవారూ, ఆ వేదికకి కారణమైన వారూ, ఇంకా ఎందరో వెనుక ఉండి దీనిని విజయవంతం చేస్తున్నవారూ తగుమాత్రం గుర్తించబడలేదనీ, లేక పూర్తిగా విస్మరించబడ్డారనీ చిన్నబుచ్చుకొనే అవకాశం ఉంది గనుక, వారి ప్రేమనీ, శ్రమనీ అశ్రద్ధ చేసారనే భావం కలగకూడదని ఇదంతా రాస్తున్నాను.

ఒక విషయాన్ని అందరం దృష్టిలో పెట్టుకొందాము. సాహిత్యం బ్రతకాలి. కొత్త తరం ఉత్సాహం గా గొప్ప వారసత్వాన్ని కొనసాగించాలి, అంతేకాదు మరింత సంపద్వంతం చేయాలి. అపుడు వారి విజయాలలో కవిసంగమ కృషి అంతా ప్రతిఫలిస్తుంది.

నా మటుకు నాకు, కొత్తవాళ్ళ పేర్లూ, కవితలూ ఈ పేజీలో చూడడం, మొన్న అందరినీ ఆహ్వానించే దగ్గర నుండి, వేదిక చుట్టూ, వేదికపైనా వాళ్ళు కళకళలాడుతూ ఉండటం చూస్తే, వాళ్ళందరిలో నన్నే చూసుకొంటున్నంత ఆనందంగా ఉంది. ఒక తల్లి తాను ఇంటికే పరిమితమైనా, ఆమె బిడ్డల విజయాల వెనుక ఆమె పెట్టిన అన్నమూ, ఆమె దీవెనలే కదా శక్తి.

మొన్న యకూబ్ గారి లోని వత్తిడినీ, ఇప్పుడు స్కైబాబా గారిలోని వత్తిడినీ మనం కూడా పంచుకొని మన ముందుండే ఇటువంటివారికి మనం ఎప్పుడూ భరోసాగా నిలవాలి.

సాహిత్యం అలా ఉంచండి, ఇంతా చేసి, ప్రతి సందర్భం నుండీ మనం ప్రేమలోకి అహంకారాన్ని కోల్పోవటం నేర్చుకోవటానికి కాక కవిత్వాలెందుకు. మన కుటుంబంలో అందరికీ వేనవేల అభినందనలు.. ఇక దూకండి కార్యరంగం లోకి..

17, ఆగస్టు 2012, శుక్రవారం

సామూహిక/ సామాజిక కవిత్వమా ? వ్యక్తిగత కవిత్వమా ?? అభేదమా ???



ఒక కవిత దగ్గర విజయకుమార్‌గారి ఆలోచన విన్నాక, మళ్ళీ నేను కొన్ని విషయాలు పునరాలోచిస్తున్నాను. మనిషికి రెండు ప్రపంచాలున్నాయి. బాహ్యమూ, ఆంతరమూ. రెండింటిలోనూ సుఖదు:ఖాలున్నాయి, బోలెడంత కన్ ఫ్యూషన్ ఉంది. బోలెడు చీకటి ఉంది. బాహ్య ప్రపంచ కవిత్వాన్ని సామూహిక/ సామాజిక కవిత్వమని, అంత:ప్రపంచ కవిత్వాన్ని వ్యక్తిగత కవిత్వమనీ.. అంటున్నాము. అవగాహనా సౌలభ్యం కోసం ఇలా విడదీస్తాము కాని, సామూహిక సమస్యల వల్ల కలిగే వేదనని

8, ఆగస్టు 2012, బుధవారం

బివివి ప్రసాద్ || వర్ధమాన కవికి ||


1.
కవీ, నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
దానినే గలగలలాడించి అది ఒక సెలయేరని భ్రమింపచెయ్యకు

నీ ముందు, నదుల్ని తాగి ఏమీ ఎరగనట్లు చూస్తున్నవారుంటారు

2.
ఎడారిలో బావి తవ్వాలని చూడకు,
ఎంతదూరమైనా ప్రయాణించి,
ఎన్ని పగళ్ళు, రాత్రులకైనా తలవొంచి ఒక నదిని కనుక్కో ముందు

ఎడారి ఏది, నది ఏది అని అడగకు
నీ అడుగులు అక్కడ మొదలుపెట్టు

3.
నీ దగ్గర ఉన్న శబ్దాలు కొన్ని
కాగితంపై పేర్చటమే కవిత్వం అనుకొన్నంతకాలం
నువ్వు ఒక్క కవితైనా చెప్పలేవు

నీ దగ్గర ఉన్న నిశ్శబ్దంలో కొంత
శబ్దాలలోకి అనువదించడమే కవిత్వం

ఎపుడైనా గమనించావా
నీలో నువు మాత్రమే వినగల నిశ్శబ్దాన్ని,
నువు మాత్రమే ప్రవేశించగల నీ నిజ ప్రపంచాన్ని

4.
నీ అక్షరం ఇంకా కాగితంపై ఆకారం దాల్చకముందే
నీ చెవిలో చప్పట్లు హోరు వినబడుతుంటే,

నిజం చెబుతున్నాను నమ్ము,
నువు ఎప్పటికీ కవిత్వం రాయలేవు
ఏ స్త్రీనీ ప్రేమించలేవు, ఎప్పటికీ నీకు జీవితమైనా మొదలు కాదు

5.
ఒక పువ్వు, ఒక పిట్టకూత, ఒక దు:ఖాశ్రువు
ఒక వానచినుకు, ఒక పసినవ్వు

ఏదైనా ఒకే ఒకటి, నీ జీవితాన్ని తలకిందులు చేయకపోతే
వాటిలోకి నువు నదిలోకి దూకినట్టు దూకలేకపోతే

వేలకొద్దీ పూలూ, అశ్రువులూ ఏవీ నిన్ను కదిలించలేవు

ఇపుడు గుట్టువిప్పుతున్నాను
ఒక పువ్వు నది, వేల పువ్వులు ఎడారి

6.
కవిత్వాన్ని వెలిగించే అగ్నికోసం, బయట వెదికేవాడికి
పొగమంచులో తడుస్తున్న ప్రపంచం మినహా ఏమీ కనిపించదు

నిన్ను నీకు కనబడనీయని పొగమంచులోకి
నిర్భయంగా చేతులు చాచినపుడు నీవే అగ్నివని గుర్తిస్తావు

చూస్తున్నావా
ప్రపంచమంతా అగ్నిమయమై గోచరిస్తుంది
నీ అక్షరాలు వెలుగుతున్నాయి

7.
కఠినమైన రహస్యాలు కొన్నిటిని దయ బయటపెట్టినపుడు
సముద్రమంత హోరు అకస్మాత్తుగా ప్రజల్ని కౌగలించుకొంటుంది

అప్పుడా రహస్యాలను
భవిష్యత్ స్వప్నాలను నిర్మించే ఉత్సాహవంతులు మాత్రమే వినగలుగుతారు

రహస్యాలను రహస్యంగా తెలుసుకొని, వారు

సూర్యకాంతిని వెలిగిస్తున్న చీకటిలోకీ
చీకటిని వెలిగిస్తున్న కంటికందని కాంతిలోకీ
అందరితో మాట్లాడుతూనే వడివడిగా నడుస్తారు


8.
వేలకొద్దీ నేనులు మాయమై,
ఒక నేనే వేల ప్రతిబింబాలయిందని కనుగొన్నపుడు
కవికి తన కవిత్వం రాయటం పూర్తవుతుంది

9.
కవిత్వాలకేం గానీ,
హాయిగా నవ్వుకొందాం కాసేపు

మనం చేయలేని చాలా పనులు
మన నవ్వులో దాగొన్న దేవతలు చేస్తారు


(ఇస్మాయిల్‌గారూ, ఎందుకో మీరు గుర్తొస్తున్నారు..)

7 అగష్టు 2012

6, ఆగస్టు 2012, సోమవారం

బి వి వి ప్రసాద్ || గమనించముగానీ ||

గమనించము కానీ
 ఒక దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
 ఇల్లు కూడా కాసేపు మనని అతిథిలానే చూస్తుంది

ఇంటి గోడలూ, వాటి వెలిసిన రంగులూ

సామానూ, అవి సర్దుకొని ఉన్న విధానమూ

మన మనుషుల మాటలూ, ప్రవర్తనా

వాకిట్లో ఇవాళ పూసిన పూలు కూడా

ఎవరీ మనిషి అని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి

మనని మనకు కొత్తమనిషిని చేస్తాయి


గమనించము కానీ

గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా

కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది

ఆక్షణమే, ఎవరో ఎక్కడినుండో ప్రపంచాన్ని తెచ్చి మన చుట్టూ పరిచినట్లుంటుంది

అపుడు మనం

మొదటిసారి శ్వాసిస్తున్నట్లు కొత్త ఊపిరి గుండెలనిండా నింపుకొంటాము


మేలుకొన్నపుడూ,

ఇంటికి వచ్చినపుడూ

కాసేపు మనలో పసిపిల్లల అమాయకత్వమేదో గోడమీది నీరెండలా పారాడుతుంది


తామేమి చేస్తున్నాయో తమకు తెలియకుండానే

కఠినమైన ప్రపంచాన్ని కోమలమైన రంగులతో నింపుతున్న

పూలలోని మృదు సౌందర్యస్పృహలాంటిది ఏదో

మనలో లీలగా, దూరం నుండి వినవస్తున్న పాటలా

వాగు ఇసుకపై మెరుస్తున్న పలుచని నీటిపొరలా చలిస్తూ ఉంటుంది


గమనించము కానీ

మన ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ

కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ

దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి

ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు

మన లోపలికి ఇంకుతూ ఉంటుంది.

*05-08-2012

3, ఆగస్టు 2012, శుక్రవారం

బివివి ప్రసాద్ || దినచర్య ||

ఉదయం తూర్పుగుమ్మం తలుపులు తెరవగానే
అప్పటివరకూ గుమ్మంతెరపై ఆడుకొంటున్న కాంతిదేవతలగుంపు
గదిలోకి ప్రవేశిస్తుంది

ఈ వెలుతురు ఉత్తవెలుతురు కాదనుకొంటాను
ఇది గదిలోని చీకటితోపాటు, నా లోపలి దిగులునీ మాయం చేస్తుంది

పసినవ్వులాంటి స్వచ్ఛమైన వెలుతురు
నక్షత్రాల కాంతివంటి లోతైన వెలుతురు
చొరవగల స్నేహితుడిలా
నాలోంచి నన్ను బయటికిలాగి ప్రపంచంలోకి తోసేస్తుంది

అప్పుడు ప్రపంచంనిండా పరుచుకొన్న జీవితోత్సవానికి
నా కళ్ళు విశాలంగా తెరుచుకొంటాయి
నవ్వుతానో, గాయపడతానో, నవ్విస్తానో, గాయపరుస్తానో
నా పాత్ర నేను పోషిస్తాను

నా నమ్మకాలూ, ఉద్వేగాలూ
పగలంతా నన్నొక తొలుబొమ్మను చేసి ఆడిస్తాయి

దినాంతాన
ముఖంమీద పరుచుకొన్న ప్రియురాలి వస్త్రంలాంటి వెలుతురు
ఏ గాలీ వీయకుండానే ఎటో ఎగిరిపోతుంది

దిగులులాంటి చీకటి
తన విశాలబాహువులు చాపి నన్ను తన హృదయానికి హత్తుకొంటుంది
అనాదికాలంలో పాతుకుపోయిన జీవితేచ్ఛ ఏదో
నన్ను ఊహల కొమ్మలతో నిండిన వృక్షంలా నిలబెడుతుంది

ఇవాళ సంపాదించుకొన్న సుఖదు:ఖాలు
వలస పక్షులలా నాలోపల చేరి కాసేపు రణగొణధ్వని చేస్తాయి
నాలోపలి పక్షుల సందడి ప్రాచీన నిశ్శబ్దంలో కరిగిపోయాక
రేపు మళ్ళీ కొత్తగా వచ్చేందుకు, ఈ రాత్రిలోకి మాయమౌతాను.
*03-08-2012

31, జులై 2012, మంగళవారం

బివివి ప్రసాద్ || మార్మిక కవిత్వం ||

1
మనిషిలో కోరికల ఫలవృక్షముంటుంది, ప్రపంచం దాని నీడ
సదా మానవులు నీడలకు వేలాడే కాయల్ని తెంపబోతారు
అరుదుగా, వివేకం మేలుకొన్నవాడొకడు
తనలోపలి వృక్షాన్ని చెరిపేసి, తానే రసపూర్ణ ఫలాన్నని తెలుసుకొంటాడు

2
అప్పుడే నడక నేర్చిన పిల్లల్ని వాళ్ళ పాదాలు నడిపిస్తాయి
మాటలు నేర్చిన పిల్లల్ని మాటలు మాట్లాడిస్తాయి
ఊహలు నేర్చిన పిల్లల్ని ఊహలు కదిలిస్తాయి

నడక బాగా తెలిసినవాడు తన పాదాలను నడిపిస్తాడు
మాటలు తెలిసినవాడు తన మాటలను ఉపయోగిస్తాడు
ఊహలు తెలిసినవాడు తన ఊహలపై అధికారం వహిస్తాడు

3
వేటినీ లోపలికి రానీయకపోవటం తొలిదశ
అన్నిటినీ లోపలికి రానీయటం మలిదశ
అన్నిటినీ వెలుపలికి పోనీయటం వాటి పై దశ
రాకపోకలు, లోవెలుపలలు లేవని తెలియటం చరమదశ

4
వెలుపలి ప్రపంచమొక పర్వతం, లోపలి ప్రపంచమొక ఆగాధం
పర్వతంపైన ఎవరైనా ఒక అడుగైనా పైకి నడవలేరు
అగాధంలోకి ప్రవేశించేవారు, అదే సమయంలో పర్వతాన్నీ అధిరోహిస్తారు
అగాధం లోతుల్ని తాకిన వారు, పర్వతాగ్రం మీద కనిపిస్తారు

5
జీవితమొక పర్వతం, మనిషి ఒక చలనం
వేలమనుషులు పర్వత పాదంలో ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు
అరుదుగా కొందరు నాలుగడుగులు పైకి నడిచి చుట్టూతిరుగుతారు
వారినందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు, వారు సంతృప్తులై మరలిపోతారు

ఎక్కడో ఒకరు నిటారుగా నడవటమే నడవటమని గ్రహిస్తారు
వారు ఒకమాటైనా మాట్లాడకుండా తలవొంచుకొని శిఖరాగ్రానికి ప్రయాణిస్తారు
శిఖరాగ్రంపై నిలిచి పర్వతమే తనచుట్టూ తాను పరిభ్రమించటం దర్శిస్తారు.



బివివి ప్రసాద్ || గంధర్వుడు ఒకడు ||

గంధర్వుడు ఒకడు వచ్చి వెళతాడు
మన చుట్టూవున్న శూన్యంలోని మనమెరుగని రహస్యలోకాల నుండి
మెరిసే జీవులలో ఒకడు మనకోసం వచ్చివెళతాడు

అతనిని భూమి గుర్తించదు
భూమి మేలుకొంటున్నపుడు పరివ్యాప్తమయే పరిమళం గుర్తిస్తుంది
అగ్ని గుర్తించదు
అగ్నిలోకం నుండి రెక్కలు విప్పుకొంటున్న రంగులు గుర్తిస్తాయి
అతనిని అక్షరాలు గుర్తించవు
అక్షరాలపై అదృశ్య సంచారం చేసే ఊహలు గుర్తిస్తాయి

చీకటి గుహలలో, గుహలలో, గుహలలో నిదురిస్తూ నడుస్తున్న మనం
అతనిని చూసి 'ఇతను మనలాంటి వాడే కదా
మన వలే భయ, కాంక్షా, వ్యాకులతలు చుట్టుకొన్న వాడే కదా ' అనుకొంటున్నపుడు
చెట్లు నిదానం గా కలగంటున్న పచ్చదనమూ,
పక్షుల రెక్కలపై వాలి కేరింతలు కొడుతున్న స్వేచ్ఛా కాంక్షా
మనని చూసి జాలి పడతాయి
'ఇతని భయ, కాంక్షా, వ్యాకులతల వెనుక
పారాడే దయ ఏనాటికి మీకు తెలుస్తుంద ' ని తలుస్తాయి

అతను నవ్వినపుడూ, మాట్లాడినపుడూ, పాడినపుడూ, కవిత్వం చెప్పినపుడూ
తలుపుల వెనుక, తలుపుల వెనుక, తలుపుల వెనుక
ఉన్న మనపైన ప్రేమ కలిగి
సుతారంగా మన తలుపులన్నిటినీ తడతాడు
చిరుగాలైనా వీయలేదే ఈ సడి ఎక్కడిదని కొందరైనా గుర్తించేలోపు
బంగారు కిరణమొకటి మరలినట్లు నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు

అతను వచ్చి వెళ్ళాడని
మనకి తెలియదు కాని, మన హృదయాలకి తెలుస్తుంది
మనలో జీవితేచ్ఛలా అణగారి వెలుగుతున్న మన అంతరాత్మకి తెలుస్తుంది
తలుపులు మూసిన గదిలోకి చలిగాలి తెర ఒకటి ప్రవేశించినట్లు
అతను సరాసరి మనలోపలికి ప్రవేశిస్తాడు
మన అంతరాత్మతో సంభాషిస్తాడు
మన అనుమతి లేకుండా మనలో కొంత వెలుతురు ప్రవేశపెట్టి చూస్తాడు
అతను ఏదో చేసాడని, ఏదో మాట్లాడాడని గుర్తించగలము కాని
ఏమి చేసాడో, మాట్లాడాడో ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది

మన చుట్టూ ఉన్న ఆకాశం లోపల వెలిగే రహస్యదేశాల జీవి ఒకడు
మన మధ్యకు వచ్చి వెళిపోతాడు
కాసిని రంగుల్నో, స్వరాల్నో, అక్షరాల్నో ఉపయోగించి
తాను నివసించే వెలుతురులోకం చిరునామా మనకు చెప్పబోతాడు

మనకు సంతోషపు మైకం కమ్మేవాటికి అతను దు:ఖిస్తాడు
మనం దు:ఖించేవాటికి, అతను చిరునవ్వు నవ్వుతాడు
అతను ఉత్సాహం పట్టలేక 'అదిగో చూడు ' అన్నపుడు
అతని వేలికొన చూపించే వెలుతురులోకాన్ని ఎంతకీ మనం చూడలేకపోతాము
మన కళ్ళని మూసిన మన అరిచేతుల చీకటిని అతను విదిలించలేకపోతాడు

పొరలోపల, పొరలోపల, పొరలోపల దాగిన ఉల్లిరసం ఘాటులాంటి
మన 'నేనే, నేనే, నేనే ' లను చూసి
దు:ఖంతో, జాలితో
చల్లటి వానాకాలపు జల్లులాంటి నవ్వుల్నీ, చూపుల్నీ మనపై కురిపిస్తూ
వచ్చినచోటికి మరలా తరలిపోతాడు
వాన తరువాత వ్యాపించే నిర్మల ప్రశాంత నిశ్శబ్దం వెంట
అతను తన లోకాన్ని చేరుకొంటాడు

గంధర్వుడు ఒకడు వస్తాడు, వెళతాడు
మనకు ఎప్పటిలా సూర్యాస్తమయమౌతుంది
దిగులుపాటల్ని మోసుకొంటూ పిట్టలు చీకటిలో కరిగిపోతాయి
చీకటికోసం రోదసినిండా వేచివున్న ఏవో శక్తులు
యధావిధిగా మనతో చేయి కలిపి
చిరంతన సంభాషణలో తరువాతి భాగం కొనసాగిస్తాయి
వాటిని హత్తుకొని మనం మరొకసారి
స్వప్న లోకాలు దాటి
నిదురలోకి, నిదురలోకి, నిదురలోకి జారిపోతాము

గంధర్వుడొకడు వచ్చివెళ్ళిన జాడలేవో
మనని కోమలంగా తడుతూ ఉంటాయి
మనలోలోపలి స్వప్నాలను పొదువుకొని కాపాడుతుంటాయి.

*30-07-2012

26, జులై 2012, గురువారం

బివివి ప్రసాద్ || కవి అంటే మనిషి సారాంశం ||


ఆలోచన, ఊహ, అనుభూతి, ఉద్వేగం ఇవి మానవులలో సజీవమైన శక్తులు. పదాలు ఈ శక్తుల్ని ఆవాహన చేసుకొని వ్యక్తపరిచేవి. వీటిని తనలో స్పష్టంగా దర్శించి, ఆ శక్తులనీ, పదాలనీ వృధ్ధి చేసుకొనేవారూ, వాటిపై అధికారం సంపాదించే వారూ పరిణతి పొందుతారు. కవి అంటే మనిషి సారాంశం, కనుక, అటువంటి శ్రధ్ధ గల కవులూ, వారి కవిత్వమూ ప్రేమించ బడతాయి.

బివివి ప్రసాద్ || సహజ కవులు, సాధన కవులు ||


*26-07-2012 నుండి
సహజ కవులు, సాధన కవులు అని కవులు రెండు రకాలు. సహజ కవులు తమ ఆలోచనలను నేలకి దించగలిగితే, సాధన కవులు తమ ఊహలను ఎగరనివ్వగలిగితే మరింత పక్వమౌతారు.


  • Katta Srinivas
     మరి ఎవరు ఏ రకమో తెలుసుకునే మర్గమేదైనా వుందంటారా సార్.
    సహజ కవులు ఆలోచనలను నేలకి దించాలంటే చేసే ప్రయత్నం సాధనే కదా అపుడు మళ్లీ సాధన కవుల వర్గంలోకి వచ్చేస్తారు కదా.




  • Bvv Prasad చాలా సూక్ష్మంగా గమనించాలి ఎవరికి వారు తనలో. ఒక వస్తువుని చూడగానే ముందు స్పందన (identificatiom) కలిగి, దానిని పదాలుగా ( thought) అనుసరిస్తే వాళ్ళు సహజ కవులు. ముందు ఆలోచన పుట్టి, దానిని స్పందన అనుసరిస్తే సాధన కవులు. ఈ విభాగాలు అనగాహనా సౌలభ్యం కోసమే. thought and feeling కలిస్తేనే కవిత్వం కదా..



  • Katta Srinivas లోన ఏదో వెలిగింది... ఎంతో లోతుగా చూసి స్పష్టంగా విభజించారు.
    ఇప్పుడు నన్నునేను కూడా సులభంగా చూసుకునే కొలత తెలిసింది సార్.
    మరి సహజ కవుల ఆలోచనలు ఆకాశంలోనూ
    సాదన కవుల ఊహలు క్రింద ఎందుకుంటాయి.
    వాళ్లు దించటం
    వీళ్లు ఎగరనివ్వటం అంటే ఏమిటి ? ఎలా చేయాలి?
    (క్షంతవ్యుడిని... మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టటం లేదు కదా)




  • Bvv Prasad ప్రశ్న జ్ఞానానికి దారిచూపే దీపం కదా.. సహజకవుల ఊహలు ఆకాశంలో ఉంటాయి, వాటితోనే ఆలోచనలు కూడా. సాధకుల ఊహలు నేల విడిచిపెట్టవు, వారి అలోచనాశక్తి ఊహల్ని ఎగరనివ్వదు.



  • Lugendra Pillai సాధన చేస్తున్న కవికి మంచి స్పందన వస్తే కవిత అంత సహజంగా వస్తుంది. సహజత్వం కవితలో ఉండాలి..


  • Bvv Prasad ఊహించటం ఒక సాహస చర్య. కాసేపు ఆలోచననీ, తర్కాన్నీ విడిచి ఊహల్ని ఎగరటానికి అనుమతించాలి, పిల్లలవలే. ఆలోచన ఒక దార్శనిక ప్రక్రియ. కాసేపు ఊహలు విడిచి, ఓర్పుగా ఆలోచనను లోతుల్లోకి ప్రయాణించనివ్వాలి.



  • Katta Srinivas ఆలోచననీ, తర్కాన్నీ విడిచిపెడితేనే ఊహలు ఎగరుతాయంటారా. ఊహకు ఇవిరెండూ ప్రతిభందకాలుగానో, శ్రుంఖలాలుగానో వుంటున్నాయా?
    మరి సహజ కవులు ఎలాగూ ఊహలను ఆకాశంలో నిలుపుకునే వున్నారు. వారిని క్రిందకు దింపేందుకు మళ్లీ ఇవి రెంటినీ పట్టుకోవాలంటారా ?



    •  'ఒక మనిషి మబ్బుల్లోకి ఎగిరాడు, మబ్బుల్లో మాయమై మరొక లోకంలోకి వెళ్ళాడు, అక్కడ తన పూర్వులతోనూ, తన తరువాత తరాలవారితోనూ మాట్లాడాను. అక్కడ మాటలంటే మన శబ్దాలు కాదు, ఒకరిలో స్పందన కలగగానే మరొకరికి అర్థమైపోతుంది. ' ఇది ఊహ. ఇది తర్కానికి నిలబడదు. అయినా ఈ ఊహ అంతా కొద్దిపాటి తర్కాన్ని ఆశ్రయించి ఉండటం గమనించవచ్చు.
      అలాగే 'నేను ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ఇంతలో కరెంట్ పోయింది. కరెంట్ లేకపోతే నా కంప్యుటర్ పనిచేయదు. దీనికి బాటరీ సపోర్ట్ లేదు కనుక. ' ఇది కేవలం ఒక వాస్తవాన్ని చూపిస్తున్న ఆలోచన. దీనిలో ఊహ లేదు. అయినా ఈ ఆలోచన కూడా, మనకి కనిపించని విద్యుత్తుని ఊహిస్తుంది.
      కేవల ఊహ ఆశ్చర్యం కలిగిస్తుంది, ఒక రస స్ఫూర్తిని ఇస్తుంది. కానీ అది తర్కానికి నిలబడనప్పుడు, మనలో ఎలాంటి వికాసమూ కలిగించదు. మనలోపలి, వెలుపలి సంక్లిష్టతల్ని ఇది పరిష్కరించదు. ఆలాగే కేవల ఆలోచన, రసహీనంగా ఉంటుంది, అది ఎలాంటి ఉత్తేజాన్నీ ఇవ్వదు.
      కవి ఈ రెండిటి సమ్మేళనం ద్వారా మనిషి బహిరంతర ప్రపంచాలకి మేలుచేసేది (మేలు చెయ్యాలన్న నిష్ట లేనప్పుడు, హాని చేసేది) ఏదో సృష్టిస్తాడు. అది పాఠకులని దాని ఊహాశక్తిని అనుసరించి, ఆలోచనాశక్తిని అనుసరించి ప్రభావితం చేస్తుంది.
      అందువలన కవికి రెండు శక్తులూ అవసరమే. ఏది లోపించినా సమగ్ర రచన జరగదు.
      మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి. ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి. అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి. అయితే కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం అని సామాన్య వాడుక కనుక, ఊహా బాగా ఉన్నవారిని సహజ కవులని, ఆలోచన బాగా ఉన్నవారిని సాధన కవులని అన్నాను. అంతకు మించి, వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. మనలో పసిదనం ఉంటుంది, sense of wonder ఉంటుంది. అందువలన మనం ఊహని ఎక్కువ ప్రేమిస్తాం. కాని ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.
      తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు. ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు. అందుకే జీవితంపట్ల శ్రద్ధ, అధ్యయనం అవసరం.
      అన్నీ స్పష్టంగా అర్ధమయ్యాయా శ్రీనివాస్..


    • Katta Srinivas ఇంతకు ముందు కేవలం మీరు ఇచ్చిన ప్రతిపాదన చదివినపుడు
      ఏదో చిక్కుముడుల దారపు వుండలా వుండి, ఎక్కడో పోంతనలేని తనం తడుతున్నట్లు అనిపించింది.
      ఇప్పుడు
      అవే దారాలు అందంగా అల్లిన గూడులా వున్నాయి.క్రమత్వం బొమ్మ కడుతోంది.
      ఇప్పటికి రెండు,మూడు సార్లు చదువుతూ అర్దంచేసుకుంటూ చదువుతున్నాను.
      ఊహా ఆలోచన మీద మీరు చెప్పన వివరణ చాలా బావుంది.
      ఊహని మనం ప్రేమించటానికి గల కారణం తార్కకంగా వివరించారు.
      ఇంకా చదివింది సరిపోల్చుకుంటున్నాను.
      ఇంకా సందేహాలేమీ మిగిలినట్లు లేదు.


    • Bvv Prasad లోపలి ప్రపంచాన్ని ఒకరు మరొకరికి చెప్పటం చాలా కష్టం. అది అంతా నైరూప్యవిషయం కదా. ఉదాహరణలు కొంత సహాయం చేస్తాయి. కానీ, లోపలి ప్రపంచాన్ని తెలుసుకోకుండా, వెలుపల ఎన్ని తెలుసుకున్నా మనిషికి మరింత గందరగోళం, దు:ఖం మాత్రమే మిగులుతాయి.


    • Katta Srinivas ఒక ప్రతిపాదన అర్దం చేసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నంలో
      లభించిన మరికొన్ని ప్రతిపాదనలు.

      => మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి.

      => ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి.

      => అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి.

      => కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం కనుక, ఊహా బాగా ఉన్నవారు సహజ కవులు, ఆలోచన బాగా ఉన్నవారు సాధన కవులు

      => వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.

      => ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.

      => తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు.

      => ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు.



16, జులై 2012, సోమవారం

బివివి ప్రసాద్ || దిగులు గీతం ||



1



దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో


2


వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో తగ్గి చల్లబడాలి కదా


కానీ ఈ దిగులేమిటి


దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది


3


ఎందుకని ఆకాశమా ఏడవకమ్మా అనాలనిపిస్తోంది


మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా


4


విరామమెంత బరువుగా వుంటుంది


ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని


వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును


5


ఏదో ఒకటి చేయాలి


నన్ను నేను తప్పించుకోవాలి


కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి


6


సంగీతమో, స్మృతులో, కవిత్వమో


దేనికైనా ఈ దిగులు సరైన సమయం


కానీ, అన్నిటినీ విడిచి,


ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది


ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలి


ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా


అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా


నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా


*15-07-2012