పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Vijay Kumar Svk లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vijay Kumar Svk లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• అస్పష్ట కలలు •• కలలో ద్రుశ్యంపై చెమట దేహంపై గాలి ముద్దు- రంగులు మింగి ఒక్తరి నలుపు తెలుపు ఐ కరిగీ- నిద్ర కలను పూరించదు హత్తుకుని- దాయదు మెలుకువ- సంధిగ్ధం నేమరేస్కోడం - వింత, రేపటి వెచ్చని నిద్రలో నిన్నటి తడి కల గూడు కట్టుకోదు-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SmbwWq

Posted by Katta

29, మే 2014, గురువారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• వెలుగొక నిద్ర గుర్తు •• నేలపై బంగారు పూత సాయంత్రం- పసుపుకొమ్మ సూరీడు- రాత్రికి చివరి చూపు వెలుగది-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNfkei

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• తెలవార్లు •• ఉదయాలు పక్షుల అరుపులై నా కనుల అంచుపై- గడ్డిలో మొలిచిన ఎర్రపురుగు సూర్యుడు- ఆకాశం నాలో ఈరోజుకి ఏ రంగు పూయునో, నంగనాచి-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1raWtiw

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• కొన్ని దార్ల నడకలు •• నడక దారీ బంధం- ఛిధ్రమైన ఒకానొక కాలం ఆగు నడక- పిచ్చిది దారి ఎదురుచూపై మునిగి ఔ నేల తడి- రాదు నడక- దారి కల్లోలం- 25/05/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rnc1Pr

Posted by Katta

10, మే 2014, శనివారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• ఖాళీ భూమి •• దేహంపై పురాతన మనిషి పచ్చబొట్టు- కాలంపై సందేహం మరక గుర్తు- ••• కొన్ని తవ్వకాల అనంతరం వెలువడు జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు- కోల్పోవుతనం శ్వాస- "చట్లు సమస్తం నరకబడు కల బాధ చేయదు-" ఒంటరి యెవరికివారు; గింజలు బుక్కు సమయమే ఉమ్మడి చర్య- మాయలు చేయు యుగం సమాధి- మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు- ••• యెవరివ్వారివే మూకుమ్మడి సంతలో బేరాలు- 10/05/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RyYRQc

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• చివరి సమయం •• పిచ్చితనం ఏంటో తెలియడం కోసమైనా కొన్ని జరగాలీ- ••• సమాంతరం కానిది ఎరుకలోకి- అలను విసిరే సముద్రం హోరు- మబ్బు విడుచు వాన చుక్క బాధ- నడక తడబాటు- మాట వణుకు- కంటి ఉప్పు నీరు రుచి- మనసు రహస్యమై పాడు తీవ్ర దుఖ్ఖ గీతం- కరచాలనం తరువాత చేతి తడి- మనం మనం కాము అను పచ్చి నిజం ఆత్మా యేడుపు- ••• తెలియాలి ఆసన్న సమయమిది- 28/04/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYNQrK

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• నది చేతుల ఆలింగనం •• పడవ నీటి ఊపిరి ప్రాణం- వెళ్ళు వరుస కొంగలు నది పాపిడ బిల్ల- అవతలి ఒడ్డుకి విన్నపం లేఖ సరంగు అరుపు- రెండు తీరాల్లో మౌనం చిట్లిన ఆనందం- కనులేప్పుడూ దూరం మోయు పల్లకిలై- నీళ్ళ చప్పుడు గీతం గాలంతా పరవశం- 25/04/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tHV7KW

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• ఉదయం కొన్ని పక్షులు •• ఉదయం చీరపై గింజలు బుక్కు పిట్ట బొమ్మలు- ••• మనసు కాలే అడివి రోజూ - నిప్పు కణికలు శరీరంపై జారు చెమటలు- నిస్సందేహం, వెనకా ముందూ కొన్ని గులకరాళ్ళ శబ్దం లోతును తెలుపు- ఎర్రమట్టి పాదం నీటి మీద మురికి మరక- ••• ఉదయం చీర గింజలు పిట్టలు గతం అంతా- మూలమలుపులో వేటగాడు గుండె ఆకలితో-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qFhiip

Posted by Katta

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Vijay Kumar Svk కవిత

"ప్రవహించే జ్ఞాపకం" తో ఓ పదిపన్నెండు సంవత్సరాల క్రితం తెలుగు కవిత్వ మైదానంలోకి నడిచి వచ్చిన యాకూబ్ ఈనాడు "సరిహద్దు రేఖ" ల్ని గీయాల్సి వచ్చింది. ఆనాటి అతని కవిత్వ తత్వాన్ని గురించి "రమణ మూర్తి " గుర్తించిన వాస్తవమేమిటి? " ఇతని కవిత సగమేమో సన్నని కలిదారి. తతిమ్మా సగం రోడ్డు. సగం పూరి గుడిసె. మిగితా సగం భవంతి. గ్రామీణ నేపథ్యం నుంచి బయలుదేరినట్లుండే కాలి బాటలాంటి కవిత కాస్తా హటాత్తుగా రోడ్డవుతుంది" "వెన్నెల నీడలు" నుండి... "మో"

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gnCENQ

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Vijay Kumar Svk కవిత

ఆధునిక కవిత్వంలో భావాన్ని ప్రకటించడానికి "ప్రతీకలు" బహుళంగా తోడ్పతున్నాయి. అయితే, ఈ ప్రతీక విధానంలో ఒక లోసుగుబాటు ఉంది. స్వభావ సిద్దంగానే వాటి అర్ధం అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని అందుకోడానికి కవితో చదువరికి సాదృశ్యమయిన భావన, దృష్టి అవసరం. లేకపోతె ప్రతీకలు అర్ధం కావు. అర్ధమైతే అపూర్వానందం. లేకపోతె అయోమయం. కవితలో ప్రతీకలు వాడేటప్పుడు కవులు అవి అర్ధమయ్యే వాతావరణాన్ని పరోక్షంగా అయినా కల్పించాలి. ---యం. రవీంద్రా రెడ్డి ( 'వచన కవిత్వం- అస్పష్టత ' నుండి)

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4bJj

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Vijay Kumar Svk కవిత

ఆధునిక కవిత్వంలో భావాన్ని ప్రకటించడానికి "ప్రతీకలు" బహుళంగా తోడ్పతున్నాయి. అయితే, ఈ ప్రతీక విధానంలో ఒక లోసుగుబాటు ఉంది. స్వభావ సిద్దంగానే వాటి అర్ధం అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని అందుకోడానికి కవితో చదువరికి సాదృశ్యమయిన భావన, దృష్టి అవసరం. లేకపోతె ప్రతీకలు అర్ధం కావు. అర్ధమైతే అపూర్వానందం. లేకపోతె అయోమయం. కవితలో ప్రతీకలు వాడేటప్పుడు కవులు అవి అర్ధమయ్యే వాతావరణాన్ని పరోక్షంగా అయినా కల్పించాలి. ---యం. రవీంద్రా రెడ్డి ( 'వచన కవిత్వం- అస్పష్టత ' నుండి)

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4bJj

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె . ••నాలో కొన్ని రాతలు •• బోయీల కాలి దుమ్ము యెరుపు సాయంత్రం నిద్ర- ••• పిచుక పూల రెక్కల్లో ముసుగు రెప్ప తొలగింపు- ••• ఆకురాలు పూట ముళ్ళ పొద మనసు చేయు దుఖ్ఖ పాట కూర్పు- ••• గదీ వెలుతురూ చీకటి కనే నాలుగు ముఖాల మట్టి జ్ఞాని- ••• మొదటా లేదూ చివర గొన్తుపొరలో మాట తడి- ••• బలి కోరు నలుపు దేవుడు ఊరి చివర ఒంటరి చెట్టు- ••• అల ముద్దు ఒడ్డు మొద్దు నిద్ర- ••• పడవలు నీటిపై తేలు ఒక రెక్క వింత సీతాకోకలు-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVxxrS

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••పెచ్చులూడిన గోడ•• గులాబీ వాసనలు పట్టు గాలి వల- అడవి కల కను మొక్క కన్ను- పురాతన తవ్వకం జరుపు మర్రిచెట్టు కోరిక- సమంగా రెండు చినుకులు రాలు కాలం- తడవడం లేదా నగ్నంగా తడపడం- పెచ్చులూడు ఆకాశం గోడ కుప్పకూలు సమయం- మనిషి యే తీరం గుర్తొ చరిత్రకి అద్ది పోతాడు- 15-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9Bdo

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• సమంగా రెండు దార్లు •• దేహంపై కనికరంలా కొంచం వెలుగూ మరో కొంచం చీకటి- సమంగా ఆనవాళ్ళు కళ్ళు తెరుచుకును సమయం- పాత కలల పెట్టె యే ఆశ్చర్యం ముందుకు నెడుతుందో- సమంగా మన దార్లు యే సమాదివైపు నడకో- ••• సమంగా రెండే రెండు దార్లు సమానమే వెక్కిరింత- నువ్ వెలుగు నడకై నేను చీకటి నిద్ర- 24-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlAEKu

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• ఉత్సవ సమ్మోహనం •• నిదుర దోసిట్లో ఆకుపచ్చ చిలుకల కునుకు- కనులకేవో అడివి కలల అత్తరు- జీవం పుట్టీ మిణుగురులై దూది ధూళి కాలం- పాప అడుగుల ముద్ర భూమి నడక- కొమ్మ నుండి కొమ్మకి గెంతు చెట్టుపాము ప్రాణం- ••• కట్టి పడేసినట్టు ఉత్సవ సమయాలు గుడిసె గుంజెకి లాంతరులా- 20-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gLt870

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••కొన్ని ఉదయాల మెలుకువ •• అడివిలో ఆకు మత్తు మెలుకువ- పసిపాపకి తల్లి స్పర్శ వెలుతురు ముద్దు- యుగాల నిద్ర , బరువు కనులు దేహం నుండి అంగం విడిపోయే ఒక హెచ్చరికలా చూపు విడుదల- మెల్లి మెల్లిగా ఐనా సమస్త చీకటి తిను వెలుగు- ఉదయాలు - 18-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzQ2Uo

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• వెలితి నింపే ఆరాటం •• ఖాళీ ఐన మనసు బావి- చెత్త నిప్పుకున్న గుండె బుట్ట- కొన్ని నా కన్నీళ్లు పీర్చుకున్న మబ్బు ముద్దలు- యెండు నేలపై నా అడుగు మొలకలు- కొమ్మకి కోకిల శవం ఔను తెలుస్తుంది తాడు నేనే- తోపులాటలో చిన్నపిల్ల గుక్క ఏడుపూ నేనూ ఒక్కటే యిప్పుడు- వెలితీ వేలితీ వెలితీ- 14/03/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIP0Qw

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••నీడ బొమ్మలు •• లోకం చీకటి అప్పుడు- లాంతరు వెలుగు యెదుర్గా జీవంలేని గోడ నేను అడవిని నీడల్లో దర్శిస్తా - జంగల్ రాత్రీ నేనూ నాన్న- వేటగాడి ఆకలిలా వెలుతురు దాడి- ••• అడివి నా కనుపాప చీకట్లో ప్రాణంతో మళ్ళీ- 13-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng5sl

Posted by Katta