పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
SwarnaLata Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SwarnaLata Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2014, సోమవారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || నా మనసు || నా మనసుకి మేలుకొలుపు నీ చూపుల వయోలిన్ పై చిలిపి కమాన్ రాగాలు పలికించినపుడు! పట్టుకుచ్చులాంటి నా ముంగురులను సుతిమెత్తగా స్పృశిస్తూ నీ మునివేళ్ళలో పలికించే సితార్ స్వరాలకి `లబ్ డబ్ 'మంటూ ..కస్తూరి చినుకులే కురుస్తున్నాయి ..నా ఎదలో! హృదిని హత్తుకున్న ఒక వెచ్చనిస్పర్శకు మది వీణ తంత్రులన్ని మధురనాదాలు పలికిస్తున్నాయి. ! పున్నమి తరగలలో...వెన్నెలనావపై విహరిస్తుంది నా మనసు నాలో నింపుకున్న సంతోషానికి. జలధిలోని నీరంతా ఎర్రబడింది మన వలపులు చూసిన సిగ్గుకి. ! వలపుల నావ తీరం చేరే తరుణాన నా ఎదనుండి జారిన ప్రేమలేఖలెన్నో మూటగట్టిస్తా! సిగ్గులు...సంకెళ్ళు తెంచుకున్నపుడు చిగురుమోవిపై కాంతులన్నీ నీకే అర్పిస్తా!

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owoUGr

Posted by Katta

19, మే 2014, సోమవారం

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ముక్కుపుడక || ముక్కుపుడక మెరిసేది ముద్దులొలికే నీ మోము చూసే ! నీ వలపుల శ్వాసతో వెలిగే పుడక ..తళుకులీనే మెరుపురవ్వలతో కోహినూర్ వజ్రానికీ మెరుగులు పెట్టొచ్చు ! నీ పలుకుల్ని చెవులారా విన్నపుడు గుండె కవాటాలలో గుట్టుగా దాచినపుడు తేనెసోనలు తనువంతా వ్యాపించి సిందూర వర్ణాలే పులుముతుంది ! నీ నిశ్వాసలో వినిపించే నిశ్శబ్దరాగాలకి పులకించే ముక్కుపుడక బుంగమూతిలొ దాగిన అలుకలన్నీ నా నాసిక చటుక్కున ఒడిసిపట్టి నీ ముక్కును ముద్దాడి వినిపిస్తుంది ఆత్రంగా ! నీ సరసాల సంద్రంలో సన్నజాజుల అలల నురగల పూలు ఆత్మీయ ఆలింగనాలు .. సిగ్గుల తాంబూలాలు జార్చే నిట్టుర్పుల సెగలు..నాసికాభరణానికి నయనానందకరం ! పగలంతా మూగబోయిన మందారంలా గమ్మున కూర్చుంటుoదా.. గోధూలివేళ పగటి పరవశాలన్నీ వార్చి చిలిపి కబుర్ల పొట్లాలన్నీ విప్పుతూ గంధపు చినుకులు ఎదపై జార్చుతూ గుమ్మరించేస్తుంది గుప్పెడు నవ్వుల వజ్రపురాశులు..వెన్నెల వాకిట్లో !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1toq0np

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || చీర || ఆరుగజాల చీరే .. పదహారణాల తెలుగుతనానికి భాష్యం చెప్పేది వ్యక్తిత్వానికి అద్దంపట్టేది ! కలనేత చీరలో.. మెరిసే కన్నె సింగారాలు పట్టుచీరల రెపరెపల్లో పలుకేరాని వైనం వలచిన ప్రియునికి ! చెంగావి చీరలో.. దరహాసాల చంద్రవంకలా దరిచేరమని సంజ్ఞలు చేసే రసరాణియై నిలిచేవు మనసుని దోచిన మనోహరుని కడ ! అద్దాల చీరలో.. మెచ్చిన సఖుని రూపం వేల ప్రతిబింబాలై పదమంజీరాలని మీటగా తిలోత్తమనే మరిపించేవు ! కంచిపట్టు చీరలో.. నడకలో జీరాడే కుచ్చిళ్ళలో వినిపించే తంజావూరు వీణానాదాలకు నర్తించే వనమయూరివై అలరించేవు ! సిల్క్ చీరలో.. నక్కీలు, చమ్కీల తీగలై పెనవేసుకుపోయేను నీ మన్మధుడే ! మంగళగిరి చీరలో.. మదిలో దాగిన మమతల క్షీరధారలు ప్రియ వల్లభుని మానసంలోపొంగిపోర్లేను మధువుల జల్లులా ! పువ్వుల చీరలో.. వనదేవతవై ఎదను సతతహరితం చేసేవు. ప్రతిఋతువులో వసంతాన్ని కళ్ళకి చూపించేసేవు !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVYE8y

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ఉగాది || అవనిని పలకరించే అరుణారుణిమ గీతికలు పచ్చికబయళ్ళపై మంచు తుంపరల తుషారాలు మత్తిల్లిన కోయిల హిందోళగానాలకి ...దంతక్షతాలకి... మావిచివుళ్ళు సిందూర వర్ణాలనే పులుముకున్నాయి ! తుమ్మెదల ఝంకార నాదాలకి సిగ్గుతో తలవాల్చిన కుసుమపరాగాలు వాసంత సమీరాలకి తేనెసోనలు కార్చే సుమబాలలు మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై వ్రాసే మకరికాపత్రాలు తటాకంలో మెరిసే బంగారు వర్ణపు నీరు..సూర్యకిరణాల ప్రతిబింబాలే ! లతల లావణ్యంతొ వనమంతా వింతసౌరభాలు, కమ్మతెమ్మెరల రసభావనలకి .. మయూరాల వింజామరలు కోనేటిలో రాయంచల వలపు విహారాలు..జలపుష్పాల నాట్య విలాసాలు కొమ్మ కొమ్మనూ పలకరించే వసంతుని శ్వాసతో ఆమనికే వింత సొబగులు సెలయేటిలో దాగిన తుంబురుని వీణానాదాలు ! శుకపికాల సంగీతవిభావరి..వేపపూతల సుగంధాలతో..మామిడిపూతలతో మధురఫలాలతో ..మకరందాల జల్లులు కురిపిస్తూ..వనకన్య ధవలవర్ణ కాంతుల్లో హిమవత్పర్వతాలు ..రసమయ జగత్తులో ఒంపుసొంపుల మందాకినీ సోయగాలు ! వయ్యారుల సిగలో మల్లెజాజుల విరహతాపాలు నవనవలాడే నవమల్లికలు కొత్తజంటకు శృంగార ఉద్దీపనలే మదుప సేవనంలో అలిసిన తుమ్మెదలు రెమ్మరెమ్మకు ఆరాటమే మన్మధబాణాల స్పర్శతో పులకించి పోవాలని ! వీధివీధిన పంచాంగ శ్రవణాలు పుట్టింటికి కళ తెచ్చే కొత్త అల్లుళ్ళ ఆగమనం షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చడితో శ్రీకారం..నవ్యజీవనానికి జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. పచ్చదనాల హారతినిస్తూ ...వసంతకన్య

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dIIs5t

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ఉగాది || అవనిని పలకరించే అరుణారుణిమ గీతికలు పచ్చికబయళ్ళపై మంచు తుంపరల తుషారాలు మత్తిల్లిన కోయిల హిందోళగానాలకి ...దంతక్షతాలకి... మావిచివుళ్ళు సిందూర వర్ణాలనే పులుముకున్నాయి ! తుమ్మెదల ఝంకార నాదాలకి సిగ్గుతో తలవాల్చిన కుసుమపరాగాలు వాసంత సమీరాలకి తేనెసోనలు కార్చే సుమబాలలు మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై వ్రాసే మకరికాపత్రాలు తటాకంలో మెరిసే బంగారు వర్ణపు నీరు..సూర్యకిరణాల ప్రతిబింబాలే ! లతల లావణ్యంతొ వనమంతా వింతసౌరభాలు, కమ్మతెమ్మెరల రసభావనలకి .. మయూరాల వింజామరలు కోనేటిలో రాయంచల వలపు విహారాలు..జలపుష్పాల నాట్య విలాసాలు కొమ్మ కొమ్మనూ పలకరించే వసంతుని శ్వాసతో ఆమనికే వింత సొబగులు సెలయేటిలో దాగిన తుంబురుని వీణానాదాలు ! శుకపికాల సంగీతవిభావరి..వేపపూతల సుగంధాలతో..మామిడిపూతలతో మధురఫలాలతో ..మకరందాల జల్లులు కురిపిస్తూ..వనకన్య ధవలవర్ణ కాంతుల్లో హిమవత్పర్వతాలు ..రసమయ జగత్తులో ఒంపుసొంపుల మందాకినీ సోయగాలు ! వయ్యారుల సిగలో మల్లెజాజుల విరహతాపాలు నవనవలాడే నవమల్లికలు కొత్తజంటకు శృంగార ఉద్దీపనలే మదుప సేవనంలో అలిసిన తుమ్మెదలు రెమ్మరెమ్మకు ఆరాటమే మన్మధబాణాల స్పర్శతో పులకించి పోవాలని ! వీధివీధిన పంచాంగ శ్రవణాలు పుట్టింటికి కళ తెచ్చే కొత్త అల్లుళ్ళ ఆగమనం షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చడితో శ్రీకారం..నవ్యజీవనానికి జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. పచ్చదనాల హారతినిస్తూ ...వసంతకన్య

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dIIs5t

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || నిత్య హోళీ || తెలిమంచుతెరల్లొ నీ ఎదను తాకిన అరుణార్ణవం వర్ణరంజితమై ఇంద్రధనువుకే మెరుగుపెట్టే శతకోటి వర్ణాలు.. నీ మేనికాంతుల్లో ! ఎడారిలో మండే ఇసుకరేణువులకు రంగుల ఆస్వాదనని పరిచయించింది నీలోని పరమాణువుల స్పర్శకి పచ్చికనేలపై జీవంకోల్పోయే గడ్డిపరకపై నీ చెమటచినుకులు జారి సంజీవినిలా ప్రాణం పోసాయి ! గుప్పిట పట్టిన సగంవాడిన సుమాలు నీ హస్తరేఖల్ని కౌగిలించుకుని ఊపిరి పీల్చుకున్నాయి సంతోషంగా ! చీకటి ఎదపై నీ కురుల లాస్యాలు వెన్నెల పొదరిల్లే కట్టింది చంద్రుని భువిపై దింపింది ! నీ నిశ్వాసలు పీల్చి గాలిలోని దుమ్ముకణాలు ప్రకాశవంతమై ప్రకృతికి కాంతిలహరి అందించింది నిస్సారమైన మట్టిలోని పొరపొరకీ రంగుల అద్దకాలే... నీ పాదస్పర్శతో వెలువడే ఆత్మీయకిరణాల పలకరింపుతో విశ్వమంతా రంగులకేళీయే !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvljI5

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || మహిళ|| ఆలిగా,తల్లిగా భాద్యతలు నిర్వహించగలదు నేటిమహిళ అంతరిక్షంలోపాదం మోపి తనసత్తా చాటిన ధైర్యశాలి `కల్పనాచావ్లా'..మహిళే ! రణభూమిలో ప్రళయకాల రుద్రునిగా చెలరేగిన`'ఛత్రపతిశివాజీ'ఖడ్గానికి శౌర్యం నెర్పి సానబెట్టిన జిజియాబాయి మహిళే ! తెల్లదొరల ఆధిపత్యానికి తన కరవాలం కరకుదనాన్ని చూపించిన ఝాన్సీలక్ష్మి ..మహిళే ! అపారమైన మేధస్సుతొ గణితంలొమేటిగా పేరొందిన శకుంతలాదేవి..మహిళే! పరుగుల సౌరభాలు భరతమాత ఎదపై వెదజల్లిన పి.టి.ఉషా..మహిళే ! పంజాబ్ మణిమకుటం..కర్తవ్యపాలనలో కదంతొక్కే కిరణ్ బేడీ మహిళే! మువ్వన్నెల పతాక వైభవాన్ని హిమశ్రెణులపై గర్వంగా నిలబెట్టి భరతమాత మనసును ఊయలలూపిన బచేంద్రిపాల్..మహిళే ! సాహితీవనంలొ మందారాల మకరందాలు కురిపించిన భారతకోకిల సరోజినీనాయుడు..మహిళే ! రామాయణాన్ని లిఖించి సుగంధాలు పంచిన మొల్ల కూడా మహిళే ! మానవత్వపు మల్లెలు గుబాళింపచేసిన మదర్ థెరిసా..మహిళే! ఉరకలెత్తే ఉత్సాహంతో ఉప్పుసత్యాగ్రహంలోపాల్గొన్న సమరయోధురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్ కూడా మహిళే ! భరతమాతకు కీర్తి పతకాలను అందించిన కరణం మల్లీశ్వరీ ..మహిళే!

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O4goh7

Posted by Katta

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || వలపుల సంద్రం || సాగరతీరంలో నీ చెంత ఆలపించిన గాత్రమాధుర్యానికి దేవశంఖాలన్నీ నాదాలు చేయడం ..అద్భుతమే ! నీవు జార్చిన నవ్వుల్ని ఒడిసిపట్టి ఆల్చిప్పలన్నీ స్వాతిముత్యాలకి మెరుగులు పెట్టడం ..అద్భుతమే ! నీ పాదాల్ని తాకిన ..ప్రతి నీటిబిందువు తమదే భాగ్యమని పరవశించడం ..అద్భుతమే ! నీ తీపి గుసగుసలు విని.. నాతొ పాటు తరంగాలు సైతం సిగ్గుతో తలవాల్చడం ..అద్భుతమే ! నీ స్వరమాధుర్యాన్ని విని సంద్రం పరుగుపరుగున ముందుకి రావడం ..అద్భుతమే ! నీ స్నిగ్ధసౌందర్యానికి మెచ్చి సముద్రుడు ..పాలనురగలతో అభిషేకించడం ..అద్భుతమే ! శీతల సమీరాలు సైతం పరిమళాల వాన కురిపించడం ...అద్భుతమే ! నీ పాదముద్రల స్పర్శకు పులకరించిన రేణువులు..ఇసుక సౌధాలు కట్టి నీ రాక కోసం వేచి చూడడం ..అత్యద్భుతమే!

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djx2zj

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || గులాబీ || చక్కని చుక్కల సిగలో ముద్దుగా ఒదిగి పరిమళపు వీవనలందించేది నీవే ! సుతిమెత్తని హృదయాన్ని సున్నితంగా తాకి రసరమ్యభావనలందిచేది నీవే ! ప్రేమికుల పాలిట తేనెచినుకులు చిలకరించి మనసుకి తన్మయసుమాలు పూయించేది నీవే ! కన్నెపిల్ల లేలేత పెదవులపై, చెక్కిళ్ళపై సిగ్గువర్ణాలందించేది నీవే ! నీ గుబాళింపులు లేనిదే ప్రేమికుల దినోత్సవమే జరుగదు ! నచ్చిన మనిషి మదిని గెలవాలంటే ప్రేమరాగాడోలికలలో మునగాలంటే నీ సహాయం అర్ధించాల్సిందే ! నీ పన్నీటి జల్లులు లేనిదే విందువినోదాలే బోసిపోతాయి ! చిగురించే స్నేహానికి మెరుపులద్దేది నీవే పసిడినవ్వుల చిన్నారులు మెచ్చే పసిడిపుష్పానివి నీవే ! పరిమళానికి భాష్యం చెప్పేది నీవే చక్కదనానికి నిర్వచనం రేకులు విప్పిన నీ రూపే ! Happy rose day

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g95Jdt

Posted by Katta

12, సెప్టెంబర్ 2012, బుధవారం

స్వర్నలత || పరిచయం ||


నీ పరిచయం
ఓ అందమైన ప్రమదావనం
ప్రతి ఉషొదయం అరుణిమ వర్నంతో
...
ఆరంభమై కనపడుతుంది............

కానీ నా జీవనయానం లో
ఉషస్సులనేవి మిగల్లేదు
పక్షుల కూజితాలతో శ్రావ్యంగా గానం చేసే
కోయిలతో ఆరంభమవదు

నీ సాంగత్యం లో నేను ఆద్యంతాలు లేని
ఓ తరంగిని లా ప్రవహిస్తుంది......
కనీ ఇప్పుడు నీ ప్రేమ
ఆకు పై జారే నీటి బిందువు
..........
ఎందుకు నా పై ఇంత కక్ష్య
నీవు లేని నెను
నిషీధమైంది నా జీవితం
...............
నీ తలపు నన్ను సమీపించగనే
ఎర్రెర్రెని సిగ్గు తెరలు ముంచుకొచె
మరుక్షణమే అవి దటం గా
కమ్ముకున్ని వచె
......అది ఓ దుస్స్వప్నం...........