త్యాగం అందమైతే అదే-- చార్లెస్ లాంబ్ Charles Lamb --------------------------------------------------------------- ఓ కవి గురించో, కవయిత్రి జీవితం గురించో మనం చాలా విన్నాం ఇక్కడ, ఐ మీన్ చదివాం కదా...కానీ ఓ కవి తన కవిత్వాన్ని, అది ఏ జాన్రా ఐనా, జీవితానికి ముడిపెట్టాల్సి వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు? ఎలా రాస్తాడు? ఇదిగో ల్యాంబ్ ని చదివితే మనకే తెలుస్తుంది. ఔను! అతను మగాడూ, అందమైనవాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా. మనోజ్ఞంగానూ, మనోహరంగానూ రాస్తానని తెల్సుకున్నప్నట్నుంచీ రాస్తూనే ఉన్నాడు. తన వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాడు. అదే ల్యాంబ్……. Charles Lamb అతను ఓ గొప్ప కవీ, రచయితా, కానీ ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాడు. ఒకరు- అతని అక్క మేరీ ల్యాంబ్, రెండు అతని ప్రేయసి (ఆమె Fanny Kelly). ఫిబ్రవరి 10, 1775 న జన్మించిన ల్యాంబ్ తన జీవితంలో కొన్నే రచనలు చేసాడు, ఆ రచనల్లో హ్యూమర్ నీ, ట్రాజెడీనీ మిళితం చేసి మరీ రాసాడు. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి Essays of Elia, Tales from Shakespeare. ఇవి ప్రపంచానికి తెల్సినవే. ముఖ్యంగా పిల్లల సాహిత్యానికి ఈయన ఆద్యుడు. అది ల్యాంబ్ కి పిల్లలంటే, ప్రేమంటే ఉన్న ప్రేమ గాఢతకి నిదర్శనం. మనకీ ఈ గాఢత ఉంటుంది కానీ అది మనం వ్యక్తపర్చలేకపోయాం--ల్యాంబ్ చెప్పగలిగాడు. తనకున్న కొద్దిపాటి నత్తి వల్ల తన పద్యాలని తను చదవలేకపోయాడుకానీ, ఆయన రాసిన పద్యాలు ప్రపంచ సాహిత్య స్థాయికి తగ్గవనే విషయం అతనికీ తెల్సు. జీవితంలో ఎదుగుతున్నప్పుడల్లా ఏదో ఒక దెబ్బ తగుల్తూనే ఉంది ల్యాంబ్ కి. మనందరిలాగనే... మొదట్నుంచీ ఓ రకమైన ఉన్మాదానికి లోనైన మేరీ ల్యాంబ్ అంటె చార్లెస్ కి అక్క, ఓ రోజు అదె ఉన్మాద స్థితిలో తన తల్లినే వంటగదిలోని కత్తితో పొడిచేయటంతో ఆమె మరణిస్తుంది. దాంతో మేరీనీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి, విచారించి ఆమెకి ఆజన్మ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష ప్రకారం ఆమె ఓ మానసిక (రోగ) వైద్యశాలలో జీవితాంతం గడపాలనీ నిర్ణయిస్తారు. కానీ చార్లెస్ తన ప్రాబల్యంతో ఆమె మానసిన వ్యాధిగ్రస్తురాలే ఐనా ఆమెని తను ఆజన్మాంతం చూసుకుంటునాననీ ఆమె వల్ల సమాజానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా సహాయపడ్తాననీ రాతపూర్వకంగా మాటిచ్చి ఆమెని తన ఇంటికి తెచ్చుకుంటాడు. అప్పట్నుంచీ అతను మరణించే వరకూ ఆమెనే అలానే చూసుకున్నాడు కూడా....ఓ ప్రముఖ కవీ, రచయితా ల్యాంబ్! 44 ఏళ్ళ వయసులో ల్యాంబ్ ఫ్యానీ కెల్లి తో ప్రేమలొ పీకల్లోతు ప్రేమలో పడ్తాడు. ఇద్దరికీ ఇష్టమే కానీ ఆమె ఓ షరతు విధిస్తుంది. 'నేను కావాలా, నీకు మీ అక్క కావాలా, నేను కూడా మీ అమ్మ లాగా ఓ అర్ధరాత్రి మీ అక్క చేతిలో కత్తిపోటుకి గురై చనిపోలెను, సో ఆమెని మళ్ళి అసైలమ్ లో దింపేయ్, మనం పెళ్ళి చేసుకుందాం లేదంటే నన్ను పూర్తిగా మర్చిపో" అని. దానికి ల్యాంబ్ దగ్గరున్న రెండు పరిష్కారాల్లో తనకి మేరీనే ముఖ్యమనుకున్నాడు. తన ప్రేయసికి మరెవరైనా దొరకొచ్చు, కానీ తన అక్కలాంటి వ్యక్తిని మరెవ్వరూ చూసుకోరు కాబట్టి ఇద్దరిలో తన అక్కనే ఎంచుకుని తన "ప్రేమ" ని వదులుకున్నాడు ల్యాంబ్..మన చార్లెస్ ల్యాంబ్! తను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో మాములుగానే తోస్తాయి. ఇలాంటి త్యాగాలు మనకి మాములేగా ఇవేమీ కొత్తకాదు అని మనం అనుకుంటాం కానీ విదేశీ చరిత్రలోనూ మానవసంబంధాలు ఎప్పుడూ "మాములే". త్యాగానికి సిధ్ధపడాలేకానీ!! ఐనా మానవసంబంధాలకి దేశ,కాల, మాన పరిస్థితులు ఓ లెఖ్ఖకాదని మరోసారి ఋజువయింది.అదే సాహితీవేత్తలకి కావల్సింది కదా? మేరీ ల్యాంబ్ తో కల్సి ఆమె సృజనాత్మకతనీ వాడుకుంటూ ఆమెకీ ఓ వ్యాపకం కల్పిస్తూ ఓ గొప్ప పని మొదలుపెట్టాడు ల్యాంబ్. షేక్స్‌పియర్ రాసిన నాటకాలని పిల్లలకి అర్ధమయ్యెలా "Tales of Shakespeare," అనే శీర్షికతో దాదాపు ఇరవై కథలవరకూ అనువదించి, ప్రపంచానికి ఇచ్చారు ల్యాంబ్స్ ఇద్దరూ. కవిత రాసినా, కథ రాసినా, నవల రాసీనా పిల్లలని దృష్టిలో పెట్టుకునే రాసాడు చార్లెస్ ల్యాంబ్. ఇది అతనికి పిల్లలంటే ఎంత మక్కువో తెలిపే ఓ అంశం. ఐనా పిల్లల్ని ప్రేమించే మనసున్నవాడు ఎవర్నైనా ప్రేమించగలడులెండీ. Blank Verse (1798), అని ఓ కవితా సంకలనం వెలువరించినా The Adventures of Ulysses (1808) అని ఓ నవల రాసినా ఇలా అన్నింట్లోనూ పిల్లల సాహిత్యప్రధానంగా సాగిన ల్యాంబ్ రచనా వ్యాసంగానికి అతన్ బతికుండగానే ప్రపంచం నీరాజనాలర్పించింది. తనకోమంటూ అతను రాసుకున్న ఏకైక వ్యాససంకలనం On the Tragedies of Shakespeare (1811) లో మాత్రం తను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు ల్యాంబ్. జీవితంలో పేదరికం నుంచీ కట్టుబాట్లనుంచీ బయటపడీ చివరి రోజుల్లో అక్కతో సహా విలాసవంతమైన జీవితాన్నే అనుభవించిన ల్యాంబ్ ఓ రోజు హఠాత్తుగా తన ఇంటికి తిరిగివస్తూ రోడ్డుపై పడి ముఖంపై తగిలిన గాయం ఇన్ఫెక్షన్ గా మారటంతో ఆ గాయంతోనే మరణిస్తాడు. (అప్పట్లో యాంటి బయాటిక్స్ లేకపోవటంతో చిన్న గాయాలకే తగిలిన ఇన్ఫెక్షన్ కి మందు లేకపోవటం ప్రతీదీ ఓ ప్రాణాంతక వ్యాధే). అతని మరణం తర్వాత కొన్నాళ్లకే మరణించిన మేరీనీ అతని సమాధి పక్కనే పూడ్చటం ఆంగ్ల సాహిత్యంలో చెప్పుకోదగ్గ కుటుంబ పాశానికి సంబంధించిన సంఘటనల్లోఒకటి. చివరిగా ల్యాంబ్ రాసిన అతని కవితలన్నింటిల్లోకి ఇదే నాకు నచ్చిన కవిత. ఓ కవి హృదయం ఆక్రోశంతో రగిలిపోయినప్పుడు ఇలా రాస్తాడేమో.. అంతే కాదు బహుశా ల్యాంబ్ ఇది తనకోసం తను రాసుకున్న కవితనుకుంటా...... The Old Familiar Faces By Charles Lamb I have had playmates, I have had companions, In my days of childhood, in my joyful school-days, All, all are gone, the old familiar faces. I have been laughing, I have been carousing, Drinking late, sitting late, with my bosom cronies, All, all are gone, the old familiar faces. I loved a love once, fairest among women; Closed are her doors on me, I must not see her — All, all are gone, the old familiar faces. I have a friend, a kinder friend has no man; Like an ingrate, I left my friend abruptly; Left him, to muse on the old familiar faces. Ghost-like, I paced round the haunts of my childhood. Earth seemed a desert I was bound to traverse, Seeking to find the old familiar faces. Friend of my bosom, thou more than a brother, Why wert not thou born in my father's dwelling? So might we talk of the old familiar faces — How some they have died, and some they have left me, And some are taken from me; all are departed; All, all are gone, the old familiar faces.
by Srinivas Vasudevfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpPWf0
Posted by
Katta