పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Raghu Mandaati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raghu Mandaati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2014, బుధవారం

Raghu Mandaati కవిత

రఘు మందాటి // గుర్తు కనిపించే లోకానికి కనపడని నా లోకం ఎవ్వరికి అర్ధంగాని దివ్య కావ్యం. మనసు బాష మౌనమే అయితే గడిపిన కాలమంత గుర్తుపట్టలేని ఓ మధుర గ్రంధం. ఏవో గుర్తెరిగిన అనుభూతులు ప్రతిబింబాలై ఎదురు నిలిచి నెమర్లు వేయిస్తోంది. మాసిపోయాయనుకున్న ఎన్నో బావోద్వేగాలు నుదిట దిద్దుకొనే ఉన్నయన్న గుర్తులను గుర్తు చేస్తోంది. కాలమా నువ్వు బహు చిత్రం సుమీ.. ఇంకా తిరిగి తిరిగి ఎప్పటికి తిరిగిరాని జ్ఞాపకల్లోకే మళ్ళీ మళ్ళీ తోస్తూ ఇంకా ఏం సాదిద్దామానో ఈ మనసుతో... 11 june 14

by Raghu Mandaati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qujKHS

Posted by Katta

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Raghu Mandaati కవిత

రఘు మందాటి | వొడి .............................. అక్షరాలు చెదిరిపోయాయి. నువ్ నా ఏకాంతాన్ని వాటేసుకున్నాక. మాటలన్నీ మూగబోయాయి, నీ ఈ ప్రశాంతతకు నాకు బాష దొరక్క. నా దూరానికి తీరాన్ని నిర్దేశించుకోవడం ఓ భ్రమ. ఎంతైనా విచ్చలవిడిగా నను వాటేసుకున్నాక, నేననే అస్తిత్వపు మాయ మాయమయ్యింది. నన్ను నేనుగా పొందుపరుచుకోవడం కోసం విలవిల్లాడిన, నీ వొడి దాటాలేననేది దాచలేని సత్యం. ఏంటో నీ వొళ్ళో నేనెప్పటికీ ముసిముసిగా రెపరెపలాడే గడ్డిపోచని. 16 Feb 2014

by Raghu Mandaati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGjJg9

Posted by Katta

30, జులై 2012, సోమవారం

రఘు మందాటి కవిత

మాటలను మూటగట్టుకొని నా కలం నిదోరుతున్నది.
మేలుకొలిపే దృశ్యమాలిక చీకటిని దిద్దుకున్నది.
విసురుమన్న చల్లని గాలి కిక్కురుమనక దుప్పటి కప్పుకున్నది.
మౌనం మనసుకా ? లేక నా ఊహకా ? ఏమో....
ఎదురుకున్న ఎన్నో అనుభవాలు నా వెంటే నడిచోస్తున్న
తీపి మాయల గిలిగింతలో పులకిస్తున్న.
అక్షరంలో బంధించలేని ఓ నిర్బాగ్యున్ని..
కాలం చెరసాలలో నా కలం బందీ ఆయినదా లేక బందీని చేసాన?
అక్షరం నాకు దొరక్కో లేక నేనే అక్షరానికి సరి తూగకనో
కలానికి నా మాట వినపదట్లేదో లేక నాలోని మాటే మూగాబోయినదో ఏమో..
మొత్తానికి నను నా లోకంలో ఒంటరిని చేసింది..
ఇంకా ఎంతకాలమో ఈ నిశ్శబ్ద యాతన.........

*29-07-2012

26, జులై 2012, గురువారం

రఘు మందాటి కవిత


జీవితమా.. నువ్వు భాహు చిత్రం సుమీ...

చూస్తుండగానే ఎన్నో చిత్రాలని చూపిస్తూ, అనుదినం పాయలుగా చీల్చుకుంటూ,

అనుక్షణం అనుభూతులు లోయలను తవ్వుతూ, ఆలోచనల తీరాన్ని ఉవ్వెత్తున ముంచేస్తూ,

అనుబంధాల కెరటాలని గమ్మత్తుగా మాయం చేస్తూ,

మనసు గాయాల కన్నుగప్పి మత్తుగా ముసుగు చీకట్ల వాకిట్లోనుండి మరో కొత్త ఉదయాన్ని కోరుతూ ఆగని నీ పయనానికి గమ్యాన్ని నిర్దేశించానని అనుకోవడం నా భ్రమే...

నువ్వు నా సొంతమో లేక నేనే నీ భానిసనో ఏమో..

ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఈ కీలుబొమ్మ..
*25.7.2012

19, జులై 2012, గురువారం

రఘు మందాటి || అపురూపం ||

అపుడే జన్మించిన శిశువు అరుపు అపురూపం
పుట్టిన శిశువుకి మెత్తని అమ్మఒడి అపురూపం
ఉదయించిన సూర్యోదయంలో విరిసే గాలి అపురూపం

అపుడే రెక్కలు తెరుచుకొని గర్వంగా విరబూసిన మందారం అపురూపం
అందంగా ప్రకాశవంతమై నగ్నంగా కన్పించే ఆ గులాబీ పువ్వు అపురూపం
చల్లగా సేద తీరిన మేఘం నుండి వచ్చిన మొట్టమొదటి ముత్యపు చినుకు అపురూపం

గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకల మారే తీరు అపురూపం
అందని అందమైన హరివిల్లులో ప్రకాశవంతమై కవ్వించే ఆ రంగుల సంద్రం అపురూపం
మనసు బాధని చల్లార్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించే స్నేహం అపురూపం

ప్రతిక్షణం రంగులు మార్చే ఆ సూర్యాస్తమయం అపురూపం
సుధూర దూర తీరాలలో నుండి కమ్మగా వీచే చల్లని గాలులు అపురూపం
తెలియని మనస్సులో దాగిన ఊహలు అపురూపం

కదలాడే ఆ కళ్ళలో కనిపించకుండా కదిలే మౌన భావాలు అపురూపం
భువిలోని సప్త సముద్రాలలో పొంగే నీరు అపురూపం
నీటిలో ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా సాగే అలలే అపురూపం

ఈ లోకంలోని ప్రతి అందం అపురూపం
అన్నిటికి మించిన మనవ జన్మ అపురూపం
అందాలన్నీటినీ ఆస్వాదించే అందమైన మనసు అపురూపం

ఈ క్షణలన్నిటిని ఒకటి కూడా వదలకుండా చూసే కనులు అపురూపం
నవరసాల సమ్మేళనంతో కూడిన జీవితం అపురూపం
జీవితాన్ని సృష్టించిన ఆ దైవం అపురూపం

ఆ దైవాన్ని మించి ప్రేమను పంచే అమ్మ అపురూపం..
*19-07-2012

17, జులై 2012, మంగళవారం

రఘు మందాటి కవిత

గమ్యం ఎరుగని తీరాల వెంట ఆలోచనల పరుగులు.

నిశిధం మాటున సేద తీరిన నిన్నటి జ్ఞాపకాలు.

క్షణ క్షణమొక యుగం మరుక్షణం ఒక యాగం.

నీ తలపుల మాటున మిగిలిపోయిన శ్వాసల ప్రకంపనలు.

నీ అధరాల కౌగిల్లో ఊపిరాడని నా నిశ్శబ్దం.

గరుకు గుండెలో మరుపురాని తీయ్యని గాయం చేసి

చెరిగిపోని గుర్తుని మిగిల్చి

మాయం కాని రాగాన్ని నింపి

మౌనాన్ని సైతం సతమతపెడుతూ

ఉక్కిరిబిక్కిరి చేస్తూ

కనులకు సైతం అందకుండా

ఊహకైనా చిక్కకుండా ఇంకా ఎంతకాలమి దోబూచులాట..

-నీ లాలనకై అలమటిస్తూ వేచి చూస్తూ పరితపిస్తూ..... నీ నేను.
*17-07-2012