పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మార్చి 2014, సోమవారం

Suresh Banisetti కవిత

నీ మొబైల్లో వున్న నా నంబరైతే.. డిలీట్‌ చెయ్యగలవ్‌.! కానీ.. నా మనసులో వున్న నిన్ను..!? ----Suresh.banisetti 03/03/2014.

by Suresh Banisetti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU3Z5x

Posted by Katta

Abd Wahed కవిత

అలల కంటిలో కమ్మనికలగా మారి చూద్దామా గుండెలోతులో వలపులవలగా జారి చూద్దామా కనురెప్పలపై ఎదురుచూపులే దీపాలైతే ముళ్ళబాటపై పాతనవ్వులను ఏరి చూద్దామా నీవు నీవుగా నేను నేనుగా బతుకుతు ఉన్నా ఎడబాటు ఎండలో కాస్తనీడను వెదికి చూద్దామా మంచుపొరల్లో ఇసుకరేణువులు ముత్యాలేగా రాతిమనసుపై చూపుల దుప్పటి పరచి చూద్దామా ఎదలోతుల్లో వెచ్చని ఊపిరి వేడిసెగలతో హృదయసీమలో చలిచీకట్లను తరిమి చూద్దామా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU40Xe

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ /// 29.ఇ౦తిబొమ్మ /// ***************************** పాలరాతికి తాను పసిడి వన్నెలనద్ది, పరువాల పూపొదిని పొదిగినాడో! ఇ౦ద్రధనువును తెచ్చి యి౦తి బొమ్మను కూర్చి, యిన్నాళ్ళు ఏడ తను దాచినాడో! పాలమీగడ తీసి పూలసొబగుల నద్ది, ప్రాయ౦పు పరువాలు చేర్చినాడో! ***************************** --- {03/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTPXkA

Posted by Katta

Pusyami Sagar కవిత

!!విడిపోయిన బందం !! _________పుష్యమి సాగర్ మూడు ముళ్ళు , ఏడు అడుగులు కలిసి ఉంటామంటూ జతగా పెనవేసుకొని తిరిగి తిరిగి అలసిపోయాయి అనుకుంటా ఆర్ధిక స్వాలంబన లో .... పెళ్లి నాటి ప్రమాణాలు పడి కొట్టుకు పోయినపుడు పెద్ధరకం చిన్నబోయినది !!!!.. గృహస్థ ధర్మాన్ని ముడి వేసి... మడి కట్టిన సమాజానికి సవాలు విసిరి ...చేరి సగం కావాల్సిన వాళ్ళు విడి విడి గా అయ్యారు , బాగుంది కాని , రక్తం పంచుకుకొని పుట్టిన కన్న పేగులు ను నిర్దయగా వదిలేసారు !!! అమ్మతనాన్ని నాన్న అనురాగాన్ని పుస్తకాల్లో వెతుకుతూ ... పసి జీవితాలు మోడు వారుతున్నాయి విడి విడి గా ముక్కలవుతూ నడి రోడ్డు పై వంశాకురాలు శాప ఫలం గా మిగిలిపోతున్నాయి !!! మార్చ్ 3, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTPWwY

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

చెప్పులు ----------------- హిందీ మూలం- ఓంప్రకాశ్ వాల్మీకీ స్వేచ్ఛానువాదం - శ్రీనివాసుగద్దపాటి ------------------------------------------------------------ ద్వేషపూరితపదాలు నా శరరంలో సూదుల్లా గుచ్చుకుంటాయ్ అప్పుడు వారంటారు మా వెంట రావాలంటే అడుగుముందుకెయ్ త్వరగా.. త్వరగా కానీ....నాకు అడుగు ముందుకేయడమంటే... పర్వతాన్ని అధిరోహించినట్లే నావి గాయపడ్డ పాదాలు తెగిన చెప్పులు వారు మళ్ళీ అంటారు వెంట రావాలంటే.. అడుగుముందుకేయ్ మా వెనుకే నడువ్ నేనంటాను కాళ్ళలో బాధగా ఉంది నడవటం నావల్లకావటంలేదు చెప్పులు బాధపెడుతున్నాయ్ అప్పుడు వారు అరుస్తారు అగ్నిలో పడేయ్ నువ్వు- నీ చెప్పులూనూ... నేనిలా చెప్పాలను కుంటాను అగ్నిలో కాదు మంటల్లో జీవిస్తున్నానని క్షణం క్షణం చస్తూ ఉన్నా చెప్పులు నన్ను గాయపరుస్తున్నాయ్ ఆ బాధ నాకే తెలుసు నీ గొప్పదనం నాకు నల్లని చీకటే వారు నగిషీలు చెక్కి మెరుస్తున్న ఆ కర్రతో నన్నదిలిస్తూ.....ముందుకెళ్తారు నాకు తెలుసు నా బాధ మీకు చిన్నదే అనిపిస్తుంది మరి మీబాధేమో కొండలా అనిపిస్తుంది అందుకే .. నీకూ నాకూ మధ్య ఒకదూరం దాని పొడవు నేను కాదు కాలమే కొలుస్తుంది 03.03.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kO0UsG

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నా మనసు ---------------------------- ఈ రోజు సముద్రాన్ని పలకరిద్దామని ఒక్కదాన్నే వెళ్ళాను నువ్వు లేకుండానే తీరం ముందు పరుచుకున్న ఇసుకపై కూర్చున్నాను నీ గురించే ఆలోచిస్తూ ఎన్నిసార్లు మనిద్దరం ఇక్కడ నడిచామో సాయంత్రాలు నిండుకునేదాక కలల కెరటాలను కళ్ళలోకి తోడుకుంటూ యోచిస్తున్నా ఈరోజు నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకొదిలేసావొనని నిన్ను నాలో(కం)లోకి ఎన్నిసార్లు పొదువుకున్నానో మర్చిపోయావా నా ముఖం నీ చేతుల్లో నేను నీలో నువ్వు నాలో కరగడం ఇంకా గుర్తే ఎన్ని క్షణాలను లెక్కెట్టను నువ్వు లేకుండా గతాలను చెరపలేక నీ జ్ఞాపకాలను ఇంకా మోస్తూనే ఉన్నా నువ్వు రావని తెలిసినా అమ్మలా నిన్ను నేను హత్తుకున్నపుడు నా స్తన్యంలో నీ చేతివేళ్ళ గురుతులు ఇంకా అలానే ఉన్నాయి ఇంకా ఎన్ని నిరీక్షణలు కరగాలో నాలో నేనెప్పుడు అంతమవ్వాలో నీలో వేచిచూస్తున్నా నువ్వొచ్చే గడియకోసం నా మదితలుపులు తెరచి నిశ్శబ్దంగానే రోదిస్తున్నా శూన్యం తోడురాగా. తిలక్ బొమ్మరాజు 03.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dgfU0N

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ కలం వాడిపోతున్నది వేలు వేలుపెట్టినప్పట్నుంచీ 3.3.14 'వాధూలస'

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVIssY

Posted by Katta

Maddali Srinivas కవిత

సందేశ గీతిక 1. //శ్రీనివాస్// 03/03/2014 ----------------------------------------------------------- మరణం లేదిక ,రాదురా మరల, యీ మాయా ప్రపంచమ్ములో తరుణమ్మయెను లేచిరా పవలు రాత్రాయెన్, పెనుత్పాతముల్ ధరణిన్ దర్శనమయ్యెరా, మరల మేధావుల్ కుతంత్రాల తో నరులన్ దొక్కెడి కాంక్ష తో కదిలె రా! నాయమ్ము చేయంగ రా! నిజమేదో తెలియంగ లేదు వెదికితే నీరందు లేదయ్యరో గజమే మిధ్యట గా! పలాయనము తాగాదేమి మిధ్యా మరీ రుజువుల్లేనపు డెన్ని మాటలను తా రువ్వంగ నేమింక తా నె జనాధ్యక్షుడు తానెపో మనిషి తానే మంత్రి తానే ప్రజా కొలువుల్ దక్కని నాడు నీ మనసు లో కొల్వైన దెయ్యాన్ని, నీ వెలుగున్ కమ్మిన చీకటిన్, తరుమ నీవే సిద్దమవ్వాలి రా! తళుకుల్ నిండిన మాటలందు నిను సాంతమ్ముంచి తా నెగ్గినా నిలువెల్లా విషమైన వాడి తను వున్నిప్పందు కాల్చంగ రా !

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLHp3i

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NMJEss

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kN7QGf

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kN7O19

Posted by Katta

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి ||చిన్నోడా! || ఋజుమార్గంలో పయనించేవాడికి సవాళ్ళన్నీ కాలగతి ననుసరించే ఋతువులే పలువిధాల ప్రశ్నించే తలపులున్న లోకంలో తర్కానికతీతమైన తపనలన్నీ తప్పులే ఎప్పుడైనా అక్కడికక్కడే పరుచుకునే తీగకే పందిరేస్తారు కాని ఏపుగా ఎదిగే చెట్టుకి కాదు చిన్నోడా! నీకు నీవే ఒక సైన్యమై ముందుకు కదులు ఇదే క్రమంలోని మరిన్ని చిన్న కవితల కోసం ఈ లింక్ http://ift.tt/1cnvcTu

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnvcTu

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-30 రైలు బోగీలో కూర్చుంటామా-ఎవరో వస్తారు ఏదో మాట్లాడుతారు.. ఆ కొన్ని గంటలు వాళ్ళు మనకోసమే పుట్టారా అనిపిస్తుంది..! స్టేషన్ రాగానే ఎవరి తొందర వారిది ,ఎవరి దోవ వారిది.. ఆలోచిస్తే ..బయటా అంతే...! జీవిత చక్రాలు మెత్తగా తిరగాలంటే 'సం'బంధాలు అవసరమే కదా..! ----------------------------------------- 3-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnvfyA

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

త్యాగం Vs అర్థం లేని త్యాగం.... పూరేకు అంచు చివర రాత్రంతా తన అస్థిత్వం నింపుకున్న మంచుబిందువు.... ప్రత్యూషపు తొలి గాలి కెరటానికి నేల రాలుతుంది భూమిని అభిషిక్తం చేయటం కోసం.... దినమంతా తన పరిమళంలతో ప్రభవించిన లేలేత పువ్వు మళిరోజు తుమ్మెదకి తనని తాను అర్పించుకొని అమరత్వం పొంది నేల రాలుతుంది.. మరొ మొక్కని స్రుష్టించటం కోసం... ఉమిత్ కిరణ్ ముదిగొండ 03/03/14

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnqx3Q

Posted by Katta

Lingareddy Kasula కవిత

వాకిలి .కాం లో నేను రాస్తున్న" పడుగు " పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి - డా. కాసుల లింగారెడ్డి మార్చి 2014 ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు ‘ఎగిలి వారంగ’ మన పొన్నాల బాలయ్య ‘దందెడ’ భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు. వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల దోపిడి, పీడన, అణచివేతల్ని తెలంగాణ సమాజం మీద ప్రయోగించిందో అట్లాంటి వాటినన్నిటినీ నిండుగా అనుభవించిన వాడు బాలయ్య. వీటికి తోడు ‘బోడిగుండు మీద తాటిపండు పడ్డట్టు’ బాల్యంలో తండ్రి మరణం, యౌవనంలో తల్లి మరణం అల్సర్‌,అపెండిక్సుల అనారోగ్య రూపాల్లో జీవితం పొన్నాలకు పరీక్షల మీద పరీక్షలు పెట్టింది. ఆపరీక్షలన్నీ నెగ్గుకుంటూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేసి ఉపాధ్యాయ వృత్తిల స్థిరపడ్డ బాలయ్య ఇయ్యాళ్ళ పేర్కొనదగ్గ కవిగా గుర్తింపు పొందిండు.అందు కు కవి శ్రమతో పాటు మరో రెండు ముఖ్య విషయాలు దోహదం చేసినవి. తెలంగాణ అందునా ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్‌లో పుట్టి పెరగడం ఒక ఎత్తైతే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అట్టడుగు తంతెమీద ఆవిర్భవించడం మరో ఎత్తు.ఈ రెండు అస్తిత్వాలు బాలయ్య జీవితాన్ని, కవిత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఒక ఉత్కృష్ట పాత్రని పోషించినవి. ఎవరైనాకవిత్వాన్ని, కళను జీవితానుభవంలోంచి తోడుకోవాల్సిందే. అనుభవం ఎంత విస్తృతమైందైతే, సంపన్నమైందైతే కవిత్వం,కళ అంత సజీవమౌతుంది. తన విస్తృత,సంపన్న జీవితానుభవంలోంచి ‘దందెడ’ సాయంతో సజీవ కవిత్వాన్ని తోడుకుంటున్నడుకవి. అందువల్లే దళిత భాషను, జీవితాన్ని సాధికారంగా కవిత్వంలోకి తెచ్చిన అతి కొద్దిమంది కవుల్లో ఒకడుగా నిలబడ్డడు. ‘శ్రమ జీవుల శిరస్సులన్నీ బ్రాహ్మణుల చేతుల్లో బంతులైన ‘ వైనాన్ని గుర్తించిండు. అందువల్లనే, ‘తుప్పుపట్టిన చెన్నె ఆరెలే మిగ్గు పూసుకొని దూసుకొచ్చే కవితా కత్తులుగా’ చేసుకొని ‘పగబట్టి సంస్కృతిని కొల్లగొట్టిన పరాయీకరణ మీద’ యుద్ధం ప్రకటిస్తున్నడు. ”మనువు వటవృక్ష వూడల అడల్‌ గా అల్లుకొని ఎనుగేసిన ఎడెముల్ల కులం గొంతుల ఇరుక్కొని బుగ..బుగ పొంగిన అవమానాల” పలవరిస్తున్నడు.’ఎద పగిలినప్పుడు ఏడ్పందరిదీ ఒక్కటే’ అన్న స్పష్టతవున్న కవి ”అక్షరాలు అగ్గికణాలె కురిసి జీవిత నిజాలు రాస్తె కండ్ల సలువ రాతలు కవిత్వమౌతయంటరా?” అని సందేహపడ్తడు. కాని, ఆ సందేహం తెలువనితనం కాదు ”జాన్‌ డయ్యర్‌ను వేటాడిన ఉద్ధంసింగ్‌లం శిరస్సు తెగిపడిన శంభూకులం వేలు కొయ్యబడ్డ ఏకలవ్యులం రామాయణాన్ని రాసినోళ్ళం రాజ్యాంగాన్ని రాసినోళ్ళం ఎర్రకోటను ఏలెటోళ్ళం” అంటూ సాధికార స్వరాన్ని వినిపిస్తడు. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరాన్ని చెప్పుతడు. 50 కిలోల సిమెంట్‌ బస్తా ఎత్తుకొని ఏకబిగిన 12 అంతస్థులు ఎక్కే మనిషి ఎంత దృఢంగా ఉంటడో బాలయ్య తాత్విక నేపధ్యం కూడ అంతే గట్టిది. కాబట్టే, ‘జాతిని తాకట్టు పెట్టి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతూ, అంబేద్కరిజాన్ని అమ్ముకొని బ్రతికే జాతిద్రోహుల మీద’ యుద్ధం ప్రకటిస్తడు. బహు సంక్లిష్టమైన భారతదేశంలో బతుకుతున్నడు కవి. అందుకే, బహుముఖ సమాజంలో అనేక పొరల అస్తిత్వాన్ని కలిగి వున్నడు. అంతర్గత వలసవాదంలో దోపడి, వివక్ష, అణచివేతలకు గురవుతున్న తెలంగాణ సమాజంలో జీవిస్తున్న కవితన ప్రాంతీయ అస్తిత్వాన్ని వెదుక్కుంటున్నడు. తెలంగాణ ఉద్యమం ఎగిసిసడ్డప్పుడల్లా వలసవాదులు భాషను ముందుకు తెస్తరు. తెలుగుజాతి మనమంతా ఒక్కటేనంటరు.తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటరు.అందుకు ఉద్యమించమంటరు.ఆకుట్రను అర్థం చేసుకున్న కవి ”అయ్యా! ఓ తెలుగోడా! ఇక్కడ నువ్వు భద్రమే, నీ భాషా భద్రమే భరోసా లేనిదల్లా మా బతుకులకే” అని మఖం మీద గుద్దుతున్నడు. తెలంగాణ మలి ఉద్యమం పునాది సాగునీరు, వనరుల దోపిడి.నాగార్జునసాగర్‌ నిర్మాణంలోని కుట్రను అర్థం చేసుకున్నంకజలయజ్ఞం భవిష్యత్తులో తెలంగాణను ఎడారిగా మారుస్తుందని తేలికగనే గ్రహించిండ్రు.ఆ ఎరుకతోనే ‘బుద్దుని పాదాలను బురద తగలకుండ సుమేరుడు తన శరీరాన్ని పరిచినట్టు తలమీద ప్రాజెక్టు కట్టి నా మొకాన మట్టి కొట్టిండ్రు’ అని ‘బొజర్లల్ల ఎండిన నీటి కలల’ పలవరిస్తడు. ‘ఎగిడ్సిన వలసవాది అగిరలేస్తిన అంగమయిన’ వైనాన్ని వివరిస్తడు.నీళ్ళు కావాలె నని నిలదీస్తడు. ‘ఈసమెత్తు జాగనిడువక మర్మం తెలిసిన మనమట్టి కోసం మన్ను బుక్కైనా కొట్లాడుదాం’ అని ఉద్భోద చేస్తడు. కలిసుండడం అనేది నిజానికి చాలా ఉదాత్తమైన భావన.విడిపోవడం ఎప్పుడైనా బాధాకరమే. అది భార్యాభర్తల బంధమైనా కావచ్చు, తెలంగాణ ఉద్యమమైనా కావచ్చు, ఎస్‌.సి. వర్గీకరణైనా కావచ్చు. కాని కల్సిందామని కథలు చెప్పేవాళ్ళు దాన్ని దోపడీ,అణచివేతలకు సాధికారతను సాధించిపెట్టేదిగా చూడడమే అసలు సమస్య.’పాపమని ఎంగిలి రొమ్మును చీకనిత్తే, పాలోడై, పామై పగబట్టడమే’ విషాదం. సామాజికస్పృహ ఉన్న కవి,సమసమాజ కలగన్న కవి సమాజం కోసం తపించిన ధీరుల అమరత్వాన్ని గానం చేస్తడు. ‘పొన్న పువ్వుల దుక్కపు రెమ్మై’న నరేందర్‌ మాదిగను, ‘ పారిన నీ నెత్తురంతా ఏరులై నా కలం నుండి కవితా పాదాలై నిలువనీ ‘ అని గురు రవిదాస్‌నీ, ‘పొద్దు గూకడమంటే రేపటి పొద్దుపొడుపుకు ఎరుక’ అని బాలగోపాల్‌ని, ‘మట్టి పొత్తిల్ల విచ్చుకున్న పుట్ట బంగారం’ అని మిద్దె రాములుని, ‘చిల్లులు పడ్డ హక్కుల జెండాను కన్న బిడ్డోలె సంకనెత్తుకున్న’ కన్నబీరన్‌ని, ‘అంటరాని జాతి అస్తిత్వగొంతు’గా నిలిచిన ఫ్రొ|| కొమ్రన్ననీ, ‘ఉదయించే సూర్యుడివే, నువ్వు చమర్‌జాతి వీరుడివే’ అంటూ ఉద్ధమ్‌సింగ్‌నీ యాది చేసుకుంటడు. స్వతహాగా ఆవేశపరుడిగా ముద్రపడ్డ బాలయ్యకు అడవిమీద, ఆయుధం మీద అచంచల విశ్వాసం. అస్తిత్వ ఉద్యమాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నా అంతిమ పరిష్కారం అది మాత్రమే కాదని స్పష్టంగా తెలిసినవాడు. ”మేమెందుకు విడిపోవడానికి శరీరాలు అంటువెట్టుకొని సత్యాగ్రహులమైనం? ఆత్మహత్యలనాపి ఆయుధాలు ధరించి సాయుధులం కాలేమా?” అంటూ ఆవేశపడ్తడు.’జబ్బకు డప్పు బదులు తుపాకి వేసుకున్న సూర్యుడు రాత్రికి రాత్రే హత్యచేయబడుతడు’ అని అంగలారుస్తడు.’ఆకుల్లా రాలుతున్న అమరుల శవాలకు వేపచెట్టు తనువంతా తల్లడిల్లి తల్లివేర్లలో రేపటి స్వప్నాలను వెతుక్కుంటున్న’ వైనాన్ని గమనిస్తడు.’కోమలి పాదాలకుప్రేమగా కుట్టిన అలుకల చెప్పులు మల్టీ డేగ ముక్కులో రక్తం కక్కి చచ్చిన’ కారణాల్ని పసిగడ్తడు. అందుకే సామ్రాజ్యవాదం మీద, ప్రపంచీకరణ మీద అలుపెరుగని యుద్ధానికి సిద్ధమైతడు. ”అదగో.అదిగదిగో..గగనానగేయాల సూర్యులు నల్లసారపు గుండ్లమీద గగుపవ్వులు నడిసి ఆడిన జ్ఞాపకాల పలవరింత హుస్నాబాద్‌ ఎల్లవ్వ తల్లి సిగలో పూసిన నల్ల బతుకమ్మ శ్రమజీవులు తలెత్తుకొని శిఖరానికెత్తిన సుత్తెకొడవలి” అవనతమైందని వ్యధచెందుతూ, మట్టిస్వప్నాల సౌధం విచ్ఛిన్నమైందని విలపిస్తడు.’గిరాయిపల్లి అడవిలో పచ్చని కలలను కాలుస్తున్న శబ్దాని’కి కలత చెందుతడు. కాని కవి నిరాశావాది కాదు. ”నన్ను పాతిపెట్ట చూత్తె బొందపెట్టిన మట్టినుంచి మల్ల మొనదేలిన కత్తినై మొలకెత్తుత మరణించి ప్రతిసారీ సూర్యుడినై ఉదయిస్తా కొత్త కవితనై బతికొత్తా” నంటూ భరోసా నిస్తడు. వస్తువుకు సంబంధించిన స్పష్టత కవిత్వ నిర్మాణంలో కనిపించకపోవడం ఇబ్బంది పెడ్తది. కవిత ఎత్తుగడ, ముగింపుల విషయంలో పరవాలేదనిపించినా పదాల కూర్పులో, వాక్య నిర్మాణంలో,ప్రతీకలు ప్రయోగించడంలో శ్రద్దపెట్టాలె.మనల్ని మనమే కాంట్రాడిక్టు చేసుకునే సందర్భాల్ని పరిహరించాలె.ముఖ్యంగా ‘ఎగిలివారంగ’ లో అట్ల ఎక్కువ కనిపిస్తది. ‘దందెడ’ లో కొంత అట్ల అనిపించినా వస్తువుకు తగ్గ రూపాన్ని సంతరించుకున్న కవితల్ని అనేకం మనం చూడవచ్చు. ‘భూమాత నుదుటిమీద దస్కత్‌ చేసిన పాదం’ ‘తలపాపిన తల్లి పాపెడ నిండ నేల రాలుతున్న సుక్కల తిలకం’ ‘తలపువ్వు వేసే మక్క కర్రకు సంకల పాపోలె కులం’ ‘గాడుపు దుమారంల ఈతకమ్మల పతంగి’ లాంటివి అందుకు మంచి ఉదాహరణలు. అట్లాగే, తెలంగాణ పదసంపద, పలుకుబడులు,నుడికారాలు, శ్రామిక సాంస్కృతిక చిహ్నాలు బాలయ్య కవిత్వం నిండా పరుచుకొని ఒక కొత్త సోయగాన్ని అబ్బుతయి.కుక్కుడు పట్టిన,మర్రవడి,కైలాటకాలు, కశికె, బల్లిపాతర, సందెనవడడం,అడ్డికి పావుశేరు, పిత్తకంత,మోర్థపుతనం, గెరువు, మక్క కంకి, గతిమెల్లె, దొయ్య, కాట్రావు, నొగ,తడక, ఎడ్లకొట్టం,గలుమ, ఉద్దరాశిపువ్వు, అడధర్మి, దండె పొడిత్తె, అర్నమడిగితె, ఎతలవూట లాంటి పదాలు, పదబంధాలు కవిత్వం నిండా పరుచుకొని అబ్బురపరుస్తవి. నిర్మాణాన్ని మరింత మెరుగు పరుచుకొని, మరింత కవిత్వంతో పొన్నాల బాలయ్య మనల్ని అలరించాలని, సామాజిక పరాణామ క్రమంలో ఉత్ప్రేరకం అవా&ఆలని ఆకాంక్షిస్తూ… *** * *** బయోడేటా పేరు: పొన్నాల బాలయ్య తల్లిదండ్రులు: కొమురవ్వ, దుర్గయ్య పుట్టిన తేది: 04-09-1973 స్వగ్రామం: ఆరెపల్లి, కోహెడ (మం) జి|| కరీంనగర్‌ విద్యార్హతలు: ఎం.ఎ.(హిందీ), ఎం.ఎ.(తెలుగు) వృత్తి: భాషాపండిట్‌ రచనలు: ఎగిలివారంగ-2008(కవిత్వం)

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLTXrY

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఆడ పిల్ల కోడి పిల్లా కాదేదీ బలికి అనర్హం . . ! వీధి గుండా.. దుర్యోధనుండా కాడెవడూ పదవికి అనర్హం . . ! లేత హృదయం నీతి పురాణం కాదేదీ బ్రతుకుకు అధారం . . ! రక్షా బంధనం మాంగల్య బంధం కాదేదీ డబ్బుకు అతీతం . . .!

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqNju3

Posted by Katta

Satya Srinivas కవిత

ఎండుటాకుల మది ఒక్కోసారి మనస్సు కాలం అర్ధరాత్రిలోని ఆసుపత్రి గది కంటి చికిత్స తర్వాతో గుండె పోటు తర్వాతో ఆద మర్చి పడుకున్న తల్లికో, తండ్రికో తోడుగా మేలుకున్న క్షణం కిటికి బయటున్న చింతమానుతో మాట్లాడుకున్న ఘడియలు బయటకు వచ్చి పెదవులపై తగలెట్టిన కాష్ఠం పొగలు పొగలుగా వైతరణిలో అస్తికలు ప్రవహించిన ఆనవాళ్ళు ఇప్పుడు అటువైపుగా వెళుతున్నప్పుడు కొద్దిసేపు ఆగి చూస్తాను మానులు లేని ఆ ప్రదేశాన్ని టీ పొగలు లేని శూన్యపు ఉదయాన్ని తల్లిదండ్రుల మనోవేదన గీతాన్ని వింటూ భార్యాపిల్లాడిని తలుచుకుంటూ రంగు కాగితం లేని జేబులగుండా గుండెని తడుముకుంటూ చింతాకుల వర్షం లో తడిసిపొతు ఎండుటాకుల మదిలో పాదముద్రలు లేని అడుగుల సవ్వడిలా ఛివరొక్కసారిగా కదిలిపోతాను (28-2-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i6upZk

Posted by Katta

Sasi Bala కవిత

ప్రియా !!! నీతలపు నాలోని ప్రతి ''నీ'' జ్ఞాపకాన్ని స్పృశిస్తోంది నీవు వచ్చేటప్పుడు ప్రతి అడుగు నా హృదయ మృదంగం మీద తడుతూ (పడుతూ ) తీయగా ధ్వనిస్తోంది నీవు వచ్చే దారిలో నా వూహ పూలు పరుస్తున్నది మెత్తని పాదాలు సోకి తెల్ల కలువలు మధురానుభూతితో ఎర్రబడినాయి ఎదుట నిలచిన నిను చూడగానే నాలోని పరవశాలు రంగారు బంగారు కెంజాయ వర్ణాలతో ప్రకాశిస్తూ సూర్యునికే మిరుమిట్లుగోలిపాయి అంతెందుకు నీ తలపే నాలో కొత్త ఊపిరులు నింపి నూతన కవితా సృష్టికి స్వాగతం పలుకుతున్నది శశిబాల....3 march 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i6unk3

Posted by Katta

Kavi Yakoob కవిత

నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేను. # యాకూబ్ | మూల్యాంకనం ................................ గతాన్ని చెరిపేయనూలేం అలాగని మరిచిపోనూ లేం అదంతే ! పరుచుకున్న ప్రపంచంవైపుకి మాటలమార్గంలోనే ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ అలిసిపోతుంటాం ఎవరెవరు చిటికెనవేలుపట్టి నడిపించారో వారి వారి జ్ఞాపకాల సంపదను ఎంతో కృతజ్ఞతతో మోసుకుంటూ నెమరువేసుకుంటూ బతుకుతుంటాం గోడమీది గడియారపుముల్లు గుచ్చుకుంటూనే ఉంది ఆరుబయల్లో చెట్టు మనలోంచి ఆకుల్ని తుంపేసి నేలమీదికి విసిరికొడుతూనే ఉంటుంది రాలిన ఆకుల్లో మిగిలిన పచ్చదనంలో మనలోపలి అంతరంగాన్ని దర్శిస్తుంటాం # @52 *పాతవాచకం | ఎడతెగని ప్రయాణం 'నుండి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NMjgyQ

Posted by Katta

Venugopal Rao కవిత

అందరు అనుకుంటున్నారు నాకేమో అయిందని గాలి సోకిందనో దెయ్యం పట్టింధనో అంటున్నారు నిజంగా వాళ్ళకేం తెలుసు నాకేమయ్యిందో నిన్ను చూసినంక నేను నా స్వాధీనం తప్పానని రివటలా నువ్వు విమల్ చీరకట్టి వెళ్తుంటే నా మది దారి తప్పిందని లోకానికేం తెలుసు వాస్తు తప్పని నీ అణువణువు నన్నో పిచ్చోన్ని చేసింది రెప్ప కొట్టని నా కళ్ళు విప్పారి నిన్నే చూస్తున్నాయి మయూర నాట్యం లాంటి నీ నడక నా గతిని మార్చింది పనిలేదు పాట లేదు ఎప్పుడూ నీ ద్యాసే ఆహారం నీరు నాకెందుకు నువ్వుంటే చాలు ఎంత కాలం ఇలా మరెన్ని రోజులు బతకను నిన్నే కొలిచే ఈ భక్తున్ని కరుణించు చెలి చరితలో నిలిచేలా నీతో వందేళ్ళు బతికేస్త అందరూ అనుకున్నట్లు నాకే గాలి సోకలా నన్నావహించింది నీ ప్రేమే-నాక్కావలసింది నీతో జీవితమే

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1deOIPU

Posted by Katta

Venugopal Rao కవిత

అందరు అనుకుంటున్నారు నాకేమో అయిందని గాలి సోకిందనో దెయ్యం పట్టింధనో అంటున్నారు నిజంగా వాళ్ళకేం తెలుసు నాకేమయ్యిందో నిన్ను చూసినంక నేను నా స్వాధీనం తప్పానని రివటలా నువ్వు విమల్ చీరకట్టి వెళ్తుంటే నా మది దారి తప్పిందని లోకానికేం తెలుసు వాస్తు తప్పని నీ అణువణువు నన్నో పిచ్చోన్ని చేసింది రెప్ప కొట్టని నా కళ్ళు విప్పారి నిన్నే చూస్తున్నాయి మయూర నాట్యం లాంటి నీ నడక నా గతిని మార్చింది పనిలేదు పాట లేదు ఎప్పుడూ నీ ద్యాసే ఆహారం నీరు నాకెందుకు నువ్వుంటే చాలు ఎంత కాలం ఇలా మరెన్ని రోజులు బతకను నిన్నే కొలిచే ఈ భక్తున్ని కరుణించు చెలి చరితలో నిలిచేలా నీతో వందేళ్ళు బతికేస్త అందరూ అనుకున్నట్లు నాకే గాలి సోకలా నన్నావహించింది నీ ప్రేమే-నాక్కావలసింది నీతో జీవితమే

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUaUeA

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

(ఒక్కొక్కరూ ఒక్కొక్క తీరంలా కనిపించే నా మిత్రులందరికీ అంకితం ఈ కవిత) **The Shores** Innumerable shores meet At a cape where all the oceans rest Where all the conchs Exchange their honks Where all the sea shells Share their sheen And the sands Whisper off their romance And let the sun shine To lit up the evenings And the moon seeps in to the water To burn it quiet and cool At last the shores depart Leaving behind the trails of scorching love Filled in the scratches of nails

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || కొ న్ని జ్ఞాపకాల చివర || ఎప్పటిలాగే... విరిగిన ఒక జ్ఞాపక౦ మళ్ళీ అతికి౦చుకొ౦టు౦ది అది మళ్ళీ శరీరాన్ని కానీ, మనసును కానీ చేరే ప్రయత్న౦ అప్రయత్న౦గానే సరె! ఏ ఒక్క జ్ఞాపకమైనా స౦తోషాన్నిచ్చి౦దా? సముద్రమ౦త వ్యధను నీపై తోయడ౦ మినహా వెలుగు రేఖలు నిరాశగా కన్నీళ్ళు కార్చడ౦ ఉపశమనాల ఊరటగా భావిస్తున్నావ్ 2 ఎన్నోసార్లు నీలోకి నీవే కా౦తికిరణాలేవి చొరబడన౦త చీకటిని ప౦పేశావు! అనుభవమొప్పుడూ తీర౦ వైపుకు లాగే విఫలయత్న౦ మునుపటి లాగే వ్యధను కప్పేసే పెదాలు ఎప్పుడూ ఒక చిరునవ్వును నిల్వ ఉ౦చడ౦ తప్పి పోవాలి .. తప్పిపోవాలి .... ఆలస్య౦గా నైనా సరే ఎలాగైనా నీవు తప్పుకోవాలి!!! @ సి.వి.సురేష్ 3.3.2014

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSv5Td

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//మిత్రమా...వ్యధాభొగీ// తటాకంలో కలువలెందుకు లేవు నదిలో ప్రవాహమెందుకు లేదు సముద్రంలో అలలెందుకు లేవు గాలిలో చల్లదనమెందుకు లేదు ఎండలో వేడిమెందుకు లేదు ఆఖరికి స్పర్శకి ఏ అనుభూతీ దక్కలేదు నీవన్న మాట అంతటిదే...కాదూ! మిమ్మలని నమ్మి అనుభవిస్తున్నాను మీకేం సుఖంగానే ఉన్నారు అన్నప్పుడు ఒక్క పదమూ వినిపించలేదు అంకెలు బండరాళ్ళుగా దొల్లిన శబ్ధం నువ్వు నిర్మించుకొంటున్న రహదారిలో పరుస్తున్న రాళ్లమీద రోడ్ రోలర్ నడుస్తున్న వైనం సమాధానం చెప్పడానికి నా దగ్గర అంకెలూ లేవు అక్షరాలూ లేవు ఆస్థిపాస్తులు చుసి వెనుక తిరిగి పర్సును బట్టి స్నేహం చేసి నువ్వు రాసుకొచ్చిన భూడిద కపాళానికి కప్పిన చర్మమని తెలియలేదు మాటనే ముళ్ళుగా మార్చగల నేర్పరీ అంకెలలోనే అభివృద్దిని చూసుకొనే వ్యాపారీ నేనొక అద్దాన్ని సరిగ్గా చూడు నేను నీలానే కనిపిస్తాను చేజార్చుకొన్నావో వేల వ్రక్కలౌతాను నిర్లక్షంగా నడిస్తే గాయమే నెత్తురోడుతాను ఓ మేధావీ నేనొక నిక్కసుఖభోగిని నాలో నిండిన కల్మషాన్ని నన్నంటిన దుమ్మూ దూళిని నాపై నెరిపే దాష్టీకాలని నా కళ్ల బడ్ద దుర్మార్గాలనీ సిరాతో కడిగే కార్మికుడిని చెమటలాంటి అమృతాన్ని అంతఃకలహ నిశి సంచారీ కళ్లలోకి చూసి మాట్లాడొకసారి నేను నిక్కసుఖభొగిని అంకెలు నిరాధారమని నిరూపించగల అక్షరాన్ని..నేను నీ మిత్రుడిని.....03.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSv4hW

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | సోయగానా శోకమే... ------------------------------------ పున్నాగపూలు వర్షిస్తున్నట్లు తెలిమంచు- వెలుపలి దృశ్యానికి, లోలోపలి చిత్రానికి రాకపోకల్లో కనురెప్పల రెపరెపలు కన్ను కి దాహం ఉండదా? విరిసీ విరియని తమ్మిలో చిక్కుకున్న తుమ్మెదలా తీరని మోహావేశపు చింతతో నా చూపు పట్టుకుచ్చులు పేర్చినట్లు పేరిన మంచు- గగనవాడల శిశిరాన్ని, దేహంలో శైత్యాన్ని నమోదు చేసుకుంటూ ఉఛ్వాస నిశ్వాసలు హృదయాన ఉప్పెన రాకూడదా? మునిమాపు వేళల్లో ఆ సంద్రాన పడవలా తీరాన వెలిగే దీపపు కాంతికై నా వగపు 03/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSjG5R

Posted by Katta

Pranayraj Vangari కవిత

ప్రణయ్ రాజ్ వంగరి | 3 జీవితం ప్రశ్నైతే... దానికి సమాధానం వెతకడమే జీవనం......

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSjHH4

Posted by Katta

Kapila Ramkumar కవిత

Subba Rao Mandava||చైతన్య గీతిక|| తెలంగాణ వచ్చెనని తెగ సంబురాలు చేసుకోకు దొరల పాలనలో గులాం గిరి చేయబోకు బాంచేన్ కాల్మొక్కుతానంటూ తరతరాల బూజు తలకెక్కనీకు వీర తెలంగాణ విప్లవ వీరుల పొరాటం నీవు మరచి పోకు నిన్నగాక మొన్న అమరలైన మన విద్యార్థుల త్యాగాలను యాది చెయ్ తెలంగాణాలో ప్రజా రాజ్యం కోసం ముందు తరాల బిడ్డల కోసం నిరంతరం నీవు పోరు చెయ్ నిప్పుకణికవై చైతన్య గీతం పాడవోయ్. 3.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NlzM92

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

నెమలికనుల చినదానా_నీకు నేనే నజరానా ..@శర్మ \3.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pS8sOG

Posted by Katta

Krishna Mani కవిత

మనుషులు ************ అందమైన ఊరిది సుషెతానికి కాదు మనషుల గుండెలు చిక్కని బర్రె పాలే ! రానుబోను కశీరుకాడ పానమైన పిలుపులు యాడికోతున్నవ్ మామ...గీడిదాక పొయ్యొస్త అల్లుడా ! మల్లయ్య తాతో ... ఎమోయ్ పిల్లగా అంత మంచిగనేనా ? ఉన్న తాతిట్ల అని పానమెల్లాగొడతరు ! పిల్ల బాగైనదా సత్తమ్మ షిన్ని ఏంజేతు బిడ్డ్యా.... తీరొక్క మందులు పొస్తినని మంచి చెడ్డలడుగుతరు ! జోన్నరోట్టెందుకూ లేదనక పంచుకతిందురు ! కయ్యమాడ కాలుదువ్వె కడుపుమంట ఉన్నోనికి గిట నలుగురు జెప్పిందే నాయం నలుగురొప్పుకుందే ధర్మం ! కష్టమోచ్చినోడింటి కాడ కాలునోయ్యవుందురు పగోనింట్ల పెండ్లైతె పదిత్తులైన ఏద్దురు ! ఎడ్లబండ్లల్ల జాతరొంగ రానువోను తోవ్వపోడితి బతుకమ్మ పాటలు మల్లన్న ఎల్లమ్మ కతలు ఇంటా జరుగుడు ! ఆపదుంటె యాదికొచ్చె అక్కజేల్లె పానము కార్యముంటే ఆ దినం ఆడివిల్లల మురుసుడు సల్లగుండు అమ్మగారని ఒడిబియ్యం పోసుకొని దీవెనలు ఇత్తురు ! ఎండిన బతుకైన మాటవడని నెత్తురు రోశగాల్లకు రోశగాల్లు మా ఊరి మనుషులు ! కృష్ణ మణి I 03-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NLlTkr

Posted by Katta

Annavaram Devender కవిత



by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fB6fEp

Posted by Katta

Annavaram Devender కవిత

http://ift.tt/1oirHgS

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oirHgW

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

Ramaswamy Blog: nramaswamy.drupalgardens.com నా కవితా సంకలనాలు: 1.'ఓనమాలు' --తొలి కవితా సంకలం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 2.'అనుధ్వని'--తొలి అనువాద కవితా సంకలనం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 (ఈ క్రింది కవిత 'ఓనమాల' లోనిది.) ......|| ఉద్భ్రాంత పాంథుడు ॥..... తెలిసినట్టే ఉంటుంది కాని అడవి దారి తెమలదు దిక్కు సరైందనే తోస్తుంది అయినా నావ తీరం చేరదు ఎరిగినవే ఎడారి దారులు ఎంత తిరిగినా సరిహద్దు అందదు ఇలాంటిదే మరి మనిషి జీవితం! దుర్గమారణ్యం దృగంత పర్యంత సాగరం దిగంత పరివ్యాప్త సైకతం మాయదారి మరీచిక లల్లిన మాయాజాలం దారితప్పిన తెరువరై పరిభ్రమిస్తుంటాడు ఉద్భ్రాంత పాంథుడు మానవుడు! (కౌముది ఆగస్ట్ 2010,జయంతి ఎప్రిల్/జూన్ 2011) (ఈ కవితకు' ఎలనాగ' చేసిన ఆంగ్లానువాదం ఈనెల 'వాకిలి' లో ) Mango Bites A Befuddled Wayfarer - Elanaaga • Nagaraju Ramaswamy మార్చి 2014 It appears as though everything is known But the path in the forest never ends Direction seems perfect Yet the dinghy doesn’t get ashore The tracks in desert are not unknown But no amount of treading takes you to the frontier The life of humans is but like this. It’s an impenetrable jungle A vast ocean, spread up to the horizon Infinite sand, stretched to the skyline A magic spell it is, of woven mystical mirages. Man, a befuddled wayfarer, keeps roaming, having lost his way Origin (Telugu): Nagaraju Ramaswamy Translated by: Elanaaga

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyasW

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

Ramaswamy Blog: nramaswamy.drupalgardens.com నా కవితా సంకలనాలు: 1.'ఓనమాలు' --తొలి కవితా సంకలం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 2.'అనుధ్వని'--తొలి అనువాద కవితా సంకలనం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 (ఈ క్రింది కవిత 'ఓనమాల' లోనిది.) ......|| ఉద్భ్రాంత పాంథుడు ॥..... తెలిసినట్టే ఉంటుంది కాని అడవి దారి తెమలదు దిక్కు సరైందనే తోస్తుంది అయినా నావ తీరం చేరదు ఎరిగినవే ఎడారి దారులు ఎంత తిరిగినా సరిహద్దు అందదు ఇలాంటిదే మరి మనిషి జీవితం! దుర్గమారణ్యం దృగంత పర్యంత సాగరం దిగంత పరివ్యాప్త సైకతం మాయదారి మరీచిక లల్లిన మాయాజాలం దారితప్పిన తెరువరై పరిభ్రమిస్తుంటాడు ఉద్భ్రాంత పాంథుడు మానవుడు! (కౌముది ఆగస్ట్ 2010,జయంతి ఎప్రిల్/జూన్ 2011) (ఈ కవితకు' ఎలనాగ' చేసిన ఆంగ్లానువాదం ఈనెల 'వాకిలి' లో ) Mango Bites A Befuddled Wayfarer - Elanaaga • Nagaraju Ramaswamy మార్చి 2014 It appears as though everything is known But the path in the forest never ends Direction seems perfect Yet the dinghy doesn’t get ashore The tracks in desert are not unknown But no amount of treading takes you to the frontier The life of humans is but like this. It’s an impenetrable jungle A vast ocean, spread up to the horizon Infinite sand, stretched to the skyline A magic spell it is, of woven mystical mirages. Man, a befuddled wayfarer, keeps roaming, having lost his way Origin (Telugu): Nagaraju Ramaswamy Translated by: Elanaaga (Dt.02 Mach 2014)

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyasW

Posted by Katta

Chi Chi కవిత

_నాయమ్మబ్బా_ నన్నిచ్చేసిన క్షణమే ధీక్షాగిపోయింది ప్రేమకి ఆగుంది,దాగుంది,లాగింది,బాగుంది,ఆగుంది!! వెతుకన్నదేదో , వెతికింది ఏదో..వెతుకాగితే కాని దొరకందదేదో వెతుకంది ప్రేమే, వెతికింది ప్రేమే..దొరకంది , దొరికేది ఏదైనా ప్రేమే!! ప్రేమనే కాదంది , ప్రేమేదీ లేదంది..అన్నదే ప్రేమైతే దాన్ననేదేముంది మాటొద్దు , మనసొద్దు , మౌనమూ వద్దు..చెట్టుచేమల జన్మలో ప్రేమదేముంది!! చూస్తోంది చూసేదే , చేస్తోంది చేసేదే..వచ్చింది కాదిది , పొయ్యేది లేనిది ఔననుకో,కాదనుకో,ఔనో అనుకో,కాదో అనుకో..అనుకో అనుకో, అనుకోకూ అనుకో!! ఉత్తుత్తిదుత్తమం , సులభమే కఠినం..గోప్పేది గోచికి , తప్పేది కాటికి నొప్పైతే తప్పించు , తప్పుకోలేవు..చెప్పేది కాదంటూ తప్పనిసరి చెయ్యకు!! ________________________________________ Chi Chi (3/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NKBi4E

Posted by Katta