పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Bharathi Katragadda కవిత

వీరవనిత అసలైన వీరవనితవి నీవేనమ్మా! అందుకే నీకు వేల వేల వందనాలమ్మా! వీధుల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చేస్తూ శుభ్రంగా వుంచే నీవే కదమ్మా అసలైన వీర వనితవి. అర్ధరాత్రి సైతం వీధుల్ని శుభ్రం చేసే నిన్ను చూస్తుంటే నీ ధైర్యాన్ని అభినందించాలో నీ వృత్తిధర్మాన్ని మెచ్చుకోవాలో నాకర్ధం కావడం లేదమ్మా! తోడేళ్ళు,గుంటనక్కలు పొంచి వుండే ఈ అర్ధరాత్రి సమయంలో నిన్ను నీవే రక్షించుకుంటూ సాగిపోయే నీ మనోధైర్యానికి నిజంగా వేల వేల సలాములమ్మా! అయినా నీచుట్టూ వుండే ఈ సమాజానికి నీ కష్టాన్ని గుర్తించే తీరికెక్కడిదమ్మా? ఒకవేళ గుర్తించినా నిన్నేదో అంటరానిదానిలానే చూస్తారే తప్ప నిన్ను నిన్నుగా గుర్తించే హృదయమెక్కడిదమ్మా! మీరే లేకపోతే మీ శ్రమే లేకపోతే ఈ సమాజంతో పాటుగా ఈ పరిసరాలెంత కల్య్షితం అవుతాయో కదా!! ఒక్క క్షణం దుర్ఘంధానికే ముక్కు మూసుకునే వీరికి అదే దుర్ఘంధంలో నీవు అనుక్షణం చెలిమి చేస్తుంటే కరడుకట్టిన వీరి హృద్ఫయాలకి కనీసం చిన్న కదలికైనా లేదే? అణువంత కనికరమైనా లేదే? అర్ధరాత్రీ సైతం మీ ధైర్యం చూస్తుంటే నడిరేయి సైతం మీ వృత్తిధర్మం చూస్తుంటే నిజంగా నీకు వేల వేల సలాములమ్మా!!! (అమీర్పేటలో ఒక వివాహానికి హాజరైన నేను అర్ధరాత్రి అక్కడ రోడ్లు ఊడుస్తున్న స్త్రీలని చూసి మనసు చలించి రాసిన కవిత) 23.JUNE14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UATfX0

Posted by Katta

Panasakarla Prakash కవిత

క్షమాపణలతో... ఎక్కడికి వెళ్ళిపోయావ్ నువ్వు..? నువ్వు దూరమయ్యే సమయానికి నాకు తోడుగా నేను కూడా లేను ఎవ్వరినడగాలి నీ గురి౦చి..? నువ్వే నన్ను ఒ౦టరిని చేసి వెళ్ళిపోయాకా అర్ధ౦ చేసుకోవడమ౦టే ఇదేనా? అర్దా౦తర౦గా నన్ను విడిచి వెళ్ళిపోవడ౦ నా శ్వాసకు ఇక దిక్కెవ్వరు నా క౦టికి ఇక చూపెవ్వరు...? నా హృదయానికి గుర్తెవ్వరు ఇక నా బాధకు ఓదార్పెవ్వరు..? వెళ్ళే ము౦దైనా నన్ను ఒక్కసారి హత్తుకుని చూడాల్సి౦ది ప్రియా.. నీ గు౦డె చప్పుడు నా గు౦డెల్లో నీకు వినిపి౦చేది. వెళ్ళేటప్పుడైనా నీ చేతిని ఒక్కసారి నాకు అ౦ది౦చాల్సి౦ది కదా.. నా అరచేతిలో మెలి తిరిగిన ప్రేమరేఖలు నీ చేతిలో పెట్టిన నా జీవితాన్ని ముద్దాడేవి సూర్యుడు కూడా లోకానికి చెప్పే వెల్తాడుకదా నా జీవితానికి వెలుగిచ్చిన నువ్వే౦టి నాకు ఒక్క మాటైనా చెప్పకు౦డానే చీకటిలోకి వెళ్ళిపోయావ్..? తెలియక నిన్నేమైనా బాధపెట్టి ఉ౦టే నన్ను క్షమి౦చు ఎ౦దుక౦టే నువ్వు శిక్షి౦చే౦త పెద్దవాడిని కాదు నేను ఎప్పుడూ నీ ప్రేమ ధనాన్ని ఆశి౦చే పేదవాడినే... పనసకర్ల‌ 23/06/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5JHE3

Posted by Katta

Arcube Kavi కవిత

ఎక్కడివో ఆమెకు ఆ చేతులు _________________________ఆర్క్యూబ్ ఆమె ఎట్ల సవరిస్తదో... పబ్బుల మీదికి గునా గునా పాకి పొట్ల తీగ తెల్లగ పూస్తది ఆమే వాటి ఆకులకు పసుపు కుంకుమ పెట్టి దండం బెడ్తది ఈ చెట్టుకు దండం బెట్టే చేతులు ఆమెకెక్కడివి ఏదేమైనా- అనాదిగా ప్రవహించే కానుకలు మనుషులను భలె చిగురింపజేస్తై కదూ !

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3jILs

Posted by Katta

Jyothirmayi Malla కవిత

మిఠాయిపొట్లం ||జ్యోతిర్మయి మళ్ళ|| బంగారమంటే ఇష్టం నాకు.. పెంకుటింటి పద్మ చెవిలోలాకులు ఉత్తుత్తినే ఊగుతున్నపుడూ మేడింటి మాలక్ష్మి లాకెట్టుగొలుసు మరిమరీ మెరిసిపోతున్నపుడూ ఎక్కడో ఏదో వెలితి.. అలాటివేవీ నాకెందుకు లేవో! అమ్మదగ్గరా నాన్నదగ్గరా ఎన్నోసార్లు బయటపెట్టిన ఆశ ఎన్నాళ్ళయినా నిజమవదెందుకో! పండగపండక్కీ చింతపండేసి తోమితే మెరిసే నా చెవిదిద్దులు ఆలోలాకులూ లాకెట్టుగొలుసూ ఎదురవగానే చిన్నబుచ్చుకుని వన్నెతగ్గుతాయెందుకో! కారణం తెలిసేసరికి నాకు చాలా వయసొచ్చేసింది పద్మ పెంకుటిల్లిపుడు మేడయింది ఆమె చెవుల్తో పాటూ మెడ కూడా మెరుస్తోంది మాలక్ష్మి మేడ ఇపుడు నెత్తిన మరో మూడు మేడల్ని పేర్చుకుంది ఆమె మెడే కాదు వొళ్ళంతా ధగధగలాడుతోంది మా గుడిసె మాత్రం మరికాస్త శిధిలమయింది మా నాన్నలాగే! నా బంగారు ఇష్టం చిటారుకొమ్మన వేళ్ళాడుతోంది ఎప్పటిలాగే!

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E6h2

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మన పాత తరాలకు గుర్తింపు పెద్దలు మన పూర్వికుల జ్ఞాపకాలు పెద్దలు మనం కుడా భవిష్యత్ లో పెద్దలమే మనం తెలియకుండా ఎదిగిపోతాం ఇప్పటికి మన బాల్య జ్ఞాపకాలు మనల్ని అంటి పెట్టుకొనే వుంటాయి అనుభవాలే మనల్ని పెద్దవాళ్ళని చేస్తాయి పెళ్ళికి ముందు అమ్మ నాన్నల ప్రేమ యుక్త వయసులో స్నేహితుల సరదాలు బాంధవ్యం తో కుటుంబ బాధ్యతలు పిల్లలతో హృదయ పూర్వక అనుబంధం పెళ్ళిళ్ళతో కోడళ్ళతో పెద్దరికం ఒంటరి తనం లో పాత జ్ఞాపకాలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేని బయట పారేయ్యలేని ఒక బరువు !!పార్ధ !!23/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E60u

Posted by Katta

Krishna Reddy Chundi కవిత

చీకటి రాత్రుల్ని నేలంతా పులిమినా వినీలాకాశంలో మబ్బు తెరల్ని కట్టినా వేకువ వెలుగులు విచ్చుకోక మానునా...! అలాగే జీవితంలో కష్టాల తెరలు కమ్ముకున్నంత మాత్రాన అవి శాస్వతం కాదు.. కష్టాల వెంటే సుఖం బాధ వెంటె నవ్వుల పంట ఎప్పుడు ఉంటుంది...

by Krishna Reddy Chundi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljManW

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

//వాన మాయ// -దాసరాజు రామారావు నన్ను తడిపిన వాన ... కళ్ళ మీద కురిసి ముళ్ళ చూపులు విరిచింది నుదుటి మీద ముసిరి అదృష్ట రేఖలు సవరించింది నాసికాగ్రాన బిందువై జారి తన సువాసన తెలిపింది పెదాల మీద వాలి బతుక్కొక చిరునవ్వును కానుక ఇప్పించింది చెంపల మీద కారి ప్రేమ కెంపుల చెమరింపులు పూయించింది మెడ మీద పారి చక్కదనాల చక్కిలిగింతలు తొణికించింది నన్ను కడిగిన వాన.... ముసురుపట్టిన ఆకాశమంతా నా వదనమై- ప్రకృతంతా నా హృదయంలో ఒదిగిన గువ్వపిట్టై- నన్ను విడువని వాన..... 23-6-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6OBpv

Posted by Katta

Nirmalarani Thota కవిత

శ్రీవారి ముచ్చట్లు..! కొంగుకు కట్టేసుకున్నానని ఆడిపోసుకుంటుంటే అలా మౌనంగా చూస్తావేం..? పచ్చని పందిట్లో కొంగు ముడి వేసింది మీరేగా..అని నిలదీయరాదా..! * * * పెళ్ళాం బెల్లమైందని మూతి విరుస్తుంటే ..బిగుసుకుపోతావేం ? ఇరవయేళ్ళు నువ్వు 'పెంచితే' .. అరవై ఏళ్ళు అది 'పంచాలని' చెప్పలేవా..! * * * సిగరెట్టు పాడు పొగ వద్దని చెవినిల్లు కట్టుకుంటే చిందులేస్తావేం..? పుట్టింటి ఊసెత్తొద్దదని కట్టడి చేయడం గుర్తుచేసుకోలేవా..! * * * మధ్యలో వచ్చిన మందు మానమంటే రాక్షసిని చేసి గింజుకుంటావేం..? పుట్టుకతో వచ్చిన ఇష్టాలన్నీ నీకోసం తుంగలో తొక్కానని తెలుసుకోలేవా ? * * * అలవాట్లు మార్చుకోమని బతిమాలుతుంటే అగచాట్లు పెట్టానని అపనిందలేస్తావేం ? ఇంటి పేరుతో సహా మార్చుకుంది నీ కష్టాలు పంచుకోవాలనేనని అర్ధం చేసుకోలేవా..! * * * ఏడడుగులు నీవెంట నీడలా నడిచి వస్తే ఎగతాళిగ చూస్తావేం? ఏడేడు జన్మల తోడై గుండెల్లో పెట్టుకొని గుట్టుగా చూసుకోలేవా..!

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kWYE

Posted by Katta

Lanka Kanaka Sudhakar కవిత

నెక్స్ట్ ప్లీజ్....... --డా.యల్.కె.సుధాకర్. ఆ అమ్మాయి ఇస్మాయిల్ కవిత్వంలా వుంటుంది అబ్బాయి శ్రీశ్రీ పొయెట్రీలా వుంటాడు జాతకాలు సరిపెట్టి దైవజ్ఞులు ఇద్దరికీ ముహూర్తాలు చూసిమరీ పెళ్ళి నిశ్చయించారు పేలబోయే టైంబాంబులా టేబుల్ మీద లగ్నపత్రిక కాలం మలుపుల్లో ప్రయాణిస్తూ వాళ్ళిద్దరూ... కవిత్వ సంతానసాఫల్య కేంద్రాల ద్వారా పిల్లల్ని కన్నారు... అతడు నానో గా మిగిలిపోయాడు ఆమె హైకూ గా స్థిరపడిపోయింది పెరుగుదల సరిగ్గాలేని పిల్లల్తో ఆ ఇల్లు పీ హెచ్ డీల మయమైపోయింది... ఇరవై యేళ్ళు గడిచాయి..... ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో పెళ్ళిసందడి... పేలబోయే టైంబాంబు లా టేబుల్ మీద లగ్నపత్రిక....

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kUQl

Posted by Katta

Ramana Yellapragada కవిత

అవిశ్రాంత పయనం ! అందమైన స్వప్న సీమలలో అలుపెరుగక విహరిస్తూ.. అను క్షణం దేనికోసమో అన్వేషిస్తూ అందినవి వదిలేస్తూ అందని వాటికై అర్రులు చాస్తూ… అడ్డదారులలో పరుగేట్టేస్తూ అయిన గాయాల్ని చూసుకుని ఏడ్చేస్తూ అనుభవాల చేదు మాత్రల్ని మింగేస్తూ అను నిత్యం కాలానికి ఎదురీదేస్తూ అన్నికధలకు ముగింపు ఒకటేనని చెప్పేస్తూ…. అలిసిపోతూ,రాలిపోతూ,జ్ఞాపకమై మిగిలిపోతూ అనంత యానం సాగుతోంది, అంతు చిక్కని లోకాలకు మనిషి పయనం సాగుతోంది !! 23.04.14

by Ramana Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kUzS

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Freezing point | ప్రశ్నలన్నీ ఎంగిళ్ళయ్యాక ప్రపంచపు ప్రశ్నపత్రం లో అమాయకపు వర్జిన్ ఐడియాస్ సంఘ నియమాల సిలబస్ లో ఇరుక్కోలేక జీజెస్ తో పాటు శిలువ ఎక్కుతాయన్న బెంగ తప్ప నిలదీయటానికి భయపడింది ఎపుడు ? ఈడెన్ తోట లో జ్ఞాన వృక్షపు నిషిద్ద ఫలం రుచి చూడక వివశత్వంలో వివస్త్రగా సాధారణ వెలుగులు అనుసరించి జీవిత కాలపు లాయల్టి కి లఘువుగా మిగులుతానన్న భయం తప్ప నిషిద్దాలకి తలవంచింది ఎప్పుడు టెలిపతి నియంత్రణలో భావోద్వేగ కేంద్రాలు ద్వేషం తో ఘనీభావించినప్పుడు వ్యక్తిత్వ లోపపు అయోమయాలు పాలరాతి తలుపులు వెనక సమాధి అవుతున్నాయన్న కలవరం తప్ప దయలేని దౌర్జన్యాలని ఎదిరించలేనిది ఎపుడు మృగతృష్ణ లలో మునిగి తేలి జ్ఞానతృష్ణలు తీరకుండానే మరణ కాంక్షకి బలైపోతానన్న బెంగ తప్ప చావంటే భయపడింది అసలెప్పుడు ? నిశీ !! 23/06/14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uXghCv

Posted by Katta

Lanka Kanaka Sudhakar కవిత

నిరర్ధక పుష్పగుచ్ఛం ---డా.యల్.కె.సుధాకర్ పూల గుత్తులు పోగేసాను ప్రేమగుచ్ఛం తయారు చేసాను.. నా ప్రణయగీతాల మాధుర్యాన్ని ఆస్వాదించే వాళ్ళకి కానుకివ్వాలని కోరిక... శిశిరవిషాదాన్ని లేకుండాచేసుకున్నాను ఆకురాలిన కాలపు మూగబోయిన గొంతుల్ని పక్షులు శృతి చేసుకుంటున్నాయి... గాలికిరాలిన పూలు అంతకంతకీ వాడిపోతున్నప్పుడు అపురూప ఋతువులన్నీ గతకాలపు జ్ఞాపకాలే అవుతున్నప్పుడు ప్రేమతో నిన్ను బంధించేదుకు ఎవరూ లేని వేళ పూలగుత్తుల్ని బంధించి ప్రేమగుచ్ఛం తయారు చేయడం...... నిరర్ధకం అని తెల్సుకున్నాను.. (చీనా ప్రేమ గీతాలు)

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uXghlZ

Posted by Katta

Sharada Sivapurapu కవిత

తస్మాత్ జాగ్రత ///// శారద శివపురపు గోతిలోన పాతినా కొన ఊపిరినుంచుకున్న పసిగుడ్డును నేను కడుపుతీపితొ కన్నతల్లి ప్రాణమొడ్డితె బతికి బట్టకట్టితి నేను కుసుమించె సుమమని మురిసినంతలోనె బలియైతిని నేను నన్ను కోరి కనని నా కన్నతండ్రిచేతనే నలిగి వసివాడితి నేను తండ్రి తప్పినదారి నడిచె తనయుడు సోదరియని చూడని కాముకుడు కామమను ఆకలితో, వావి వరసలెల్ల మరచిన వేటగాళ్ళు వీళ్ళు శీలంతో పోని ప్రాణం పోతోంది నేడు ప్రతిక్షణము ప్రతిదినము చూడు సమాధిలోన శవము నాడు, సమాజమున జీవించు శవమైతి నేడు బడుగువర్గపు మహిళనైతే నేను, శీలమేమిటి నీకని గేలి చేసె రక్షకుడు పెద్దింటి ఆడపడుచు నేనైనా వెరువలేదుగదా కన్నుగీట రిక్షావాడు కష్టించి పనిచేయు మహిళ చక్కదనమేగాని కనపడదె పనితనము రహదారిలో పోతెనొంటరిగ, ప్రేమికులైన బస్సుడ్రైవరు, లారీ క్లేనరు ఆటోడ్రైవరు, కాలేజీ కుర్రకారు, చివరకు చేతకర్ర ఉన్న తాతగారు ఎంతవారలూ కాంతదాసులే నిజము, కొంగుతగిలినంతనే శునకానందము ఆరుగజముల చీరలోన నారి నగ్నసౌందర్యము నెమరువేసెనీ పశువులు ఖద్దరు తోపీల నేతల్లో, నామాల బాబాల్లో దాగిన పౌరాణిక సుయోధనులు ముసుగులోని భీముణ్ణైనా ద్రౌపదియేయని మోహించే ఉన్మత్త కీచకులు తెల్లకోటుల్లో, నల్లకోటుల్లో, ఖాకి బట్టల్లో, ఖాది లాల్చీల్లో, కాషాయం ఒంటిమీదా, నుదుట నామాలతో, కాటువేయ మాటేసిన నాగుబాములు కామమను విషము ఒళ్ళంతా నింపుకున్న నవయుగ దుశ్శాశనులు ఎంతవగచిన రారు నేటి ద్రౌపదులకు చీరలిచ్చి కాపాడే క్రిష్ణపరమాత్మలు నైతిక విలువల వలువలు విడిచిన సిగ్గుశరము లేని నగ్నపురుషులు యుగాలు గడిచినా మారలేదు మగవారు, వారి ఆధిక్యతల ఆంతర్యాలు ఆధ్యాత్మిక ముసుగులో ఆశారాంలు ప్రసాదించే అత్యాచారాల వరాలు స్త్రీలకొసం ప్రత్యేక మోక్ష ద్వారాలు, బిగికౌగిలిలో లఘు దైవదర్శనాలు ఆశ్రయాల గేలంతో ఆశ్రమాల వలల చిక్కిన అభాగినుల భోగించే నారాయణసాయిలు ముసలవ్వైనా మునిమనుమరాలైనా, బలిగొన వెరువని కాముకాసురులు అండగా న్యాయశాశ్త్రం లోపాలను వడగట్టిన తొంభైవసంతాలహ! రాంజేట్మలానీలు చూడబోవ ప్రపంచమంత, పురుషులెల్ల తలచె ఆడది తన తొత్తని లేదు మతము,జాతి,వర్గమను భేదము మదము మగవాని సొత్తు నీవు నేర్పిన బుడి బుడి నడకలే నేడు చెరిపె కన్నెల జీవనరేఖలు నాడు పట్టిన పాలచుక్కలాయె పసిపాపల పాలిట విషపు తునకలు నీవు నేర్పిన ముద్దు మాటలె, మూగచేసెను ముదితల గొంతుకలు ప్రేమగ పెట్టిన దిష్టి చుక్కలు, ఎన్నో కన్నెల మార్చెను దిష్టిబొమ్మలుగ దిక్కెవరు లేరు నాకని, దిక్కుతోచకేడ్వ నీకు దేవుడుకూడ దిక్కవడు పురుషులoదు విషపురుగుల నెరుగుట పసిపాపగనె నేర్వాల్సిన ఓనమాలు నిన్ను పీడించువాడెవడైన మరి సహియించిక నెదిరించు చాలు తస్మాత్ జాగ్రత, జాగ్రత, అబల కాక ముందే సబలవవు నీవు. 23/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1me5bse

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ఫేక్ లోక్ || రహస్య దయా మైదానాల హృదయ మార్గమును అన్వేషించుకోలేక లేదా ఎప్పటికి కనుగొనలేక చెదిరిపోయిన నక్షత్రపు గూడులో చెడిపోయిన కాపురాల తప్పులు లెక్కించుకోలేక లేదా ఎప్పటికీ కనులు తెరవలేక ఇప్పటికిప్పుడింక ఇంకా ఆరని తెగిపడిన కవితా పాదాల రక్తపు చారికల వెగటు వాసనల్లో అదే పనిగా ఈదలేక లేదా వెంటనే మునిగి చావలేక ఒకే ఒక్క ద్వేషాన్ని మాత్రమే కలకాలమూ కమ్మని స్వప్నమైన నిజమని ఒకే ఒక్క లోకాన్ని సృష్టించుకుని నీలో అక్కడే బతకలేక లేదా బయటకు రాలేక ఇలా ఇంకొన్ని లేదా మరికొన్ని కారుణ్యరహిత కారణాలిచ్చోట అనేకం. తెలియదా మిత్రమా మరి నీకు. ------------------------------------------24/6/2014 ( శ్రీకాంత్. k,.నీ ద్వేషం అను తొమ్మిది కా/రణాలు లేదా కవిత కాని గాధ ఒకటి.,. కవితకు ఉపసృజన)

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54LdL

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

శతాబ్దాలు గడిచాయి, దశాబ్దాలు దాటాయి! ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు ! కొన్ని కలయికలు మరిన్ని చీలికలు! ఆనందాలు అవధులు దాటుతున్నాయి, సంప్రదాయాలు సాకిల పడ్డాయి ! కానీ....... పీడితులు, పీడించేవారు, కార్మికులు, కార్పోరేటువారు, రైతన్నలు, రాజకీయ వాదులు,ఓటర్లు నాటకాల నాయకులూ, ఇంకా ఉన్నారు...... పేదలు, పేరు గడించిన వారు, నిర్భాగ్యులు, నీటు తాగే వారు, దౌర్భాగ్యులు, దౌర్జన్యాలు చేసే వారు, ఈ లోకంలో ఇంకా ఉన్నారు ..... ఆకలి దప్పుల ఆర్త నాదాలు, అన్యాయాల అరణ్య రోదనలు టపాసులై పేలుతున్నాయి, దీపావళి దీపాలు ఆర్పుతున్నాయి! బానిసత్వం బాట విడలేదు, కులం గోల కూత ఆపలేదు, రాక్షసులు రాజ్యం వదలలేదు, మద్యం సీసా మనసు దోచింది, సిగరెట్టు పొగ సిగానేక్కి కూర్చుంది! రాజకీయం రాబందులాగా రక్కసి కోరలు చాచింది ! ఇన్ని భూతల మధ్య అమాయకపు జనం ... ఎన్ని యుగాలు మరీనా ఉదయించని జ్ఞానం! అందుకనే ఈ లోకం.... మండుతోంది మండుతోంది ఆరని ఒక మంటలా! రావణుడి కాష్టం లా ! మండుతోంది మండుతోంది వెలుగులేని దివ్వెలా ! ఎగరలేని గువ్వలా ! మండుతోంది మండుతోంది అలుపు లేని ఆర్తి లా! అణగారిన జాతిలా! మండుతోంది మండుతోంది తీరని ఆకలిలా! ఆరని ఒక మంటలా!

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54GqC

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అక్షరం ప్రవహించే వేళ ****************************** నాచుట్టూ పరిసరాలు చిమ్మ చీకటిలో చెమ్మగిల్లుతూ పరభాషావ్యామోహపరివర్తనంలో దాసోహమంటూ సాగిలబడుతున్నవి, అంతటా తళుకుబెళుకుల తన్మయత్వాలే మమ్మీ దాడీ అంటూ చిన్నపిల్లల చిలుకపలుకుల కులుకులు, అనురాగ రాహిత్యపుసంబోధనలు తల్లిదండ్రులను తన్మయత్వపు ప్రవాహాల్లో ముంచేసి శైశవాన్నతటినీ చికాకులపాల్జేస్తున్నది. ఉదయాస్తమానాలమధ్య పిల్లవాండ్ర మాతృభాషా సంబోధనలు యజమాన్యాలను కలవరపెడుతూ శిక్షించాలన్న తపన వారిమనసుల్లో దినదినాభివృద్ధి చెందుతున్నది. అభంశుభం తెలియని అమాయక విధ్యార్ధులమెడల్లో నేనిక ఇంగ్లీషునే పలుకుతాను తెలుగస్సలు మట్లాడను అంటూ హెచ్చరికల బోర్దులు వేలాడుతూ వ్యవ స్థను వెక్కిరిస్తూన్నవి. నా ఉనికి మృగ్యమై పోతుందేమోనన్న భాషామతల్లి భయకంపితమౌతున్న దృశ్యం ఇదేంవరస ?ఇదిన్యాయమేనా అంటూ నిలదీసి గద్దించే దిశగా కొందరిహృదయాలైనా ముందడుగు వేయడం నిజంగా గర్వించదగిన అంశం. అభిమానుల అంతరంగాలను ఆందొళనాపధంలోకి పడేస్తుందేమోనని పండితవర్గం వేదనపడుతున్న దాఖలాలు అనేకానేకాలు వ్యయమధికమైనా పరభాషాధ్యయనానికి పోటీ పడుతున్న యువత అంతరంగాన్ని అర్ధం చేసుకోలేక భాషామతల్లి తలపంకించి రోదిస్తున్నది. ఆ గద్గదస్వర వేదనలు కన్నీటి పర్యంతమై కకావికలౌతున్న అమ్మ సరస్వతమ్మ ఆక్రందనల స్వరాల విజృంభణలతో తెగిపడిపోతున్న ఆమె కచ్చపి వీణా తంత్రులను సరిచేసుకుంటూ నినమ్రయై నిలుచున్నది నాలో యెదో నాకే తెలియని కదలిక మరుగునపడిపోతున్న మాతృభాషా సంపదనంతా ఒక చోటికి చేర్చాలన్న భావన నన్ను ఉన్నపళాన జాగృతం చేసి వెన్వెంటనే నానిద్రమత్తును వొదిలించాయి. మరుక్షణంలో నాకళ్ళెదుటే అక్షరాలన్నీ అమృతవాహినులై పరవళ్ళతో ప్రవహిస్తున్నదృశ్యం చేదోడువాదోడుగా మనం సహకకరించగలిగితే ఆమె ఇకపై నిరంతరం అమందానంద కందళిత హృదయారవిందయై విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLb0hI

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***ఒక్కోసారి*** ఒక్కోసారి.. నదిపాయలా మొదలైన సాధారణ దుఃఖం సాంద్రత పెరిగేకొద్దీ అవుతుంది సముద్రం..!! ఒక్కోసారి.. సాదాగానే మొదలైన బతుకు నాటకం సమస్యల తోరణంగా మారి జీవితం రణరంగమవుతుంది..!! ఒక్కోసారి... అలలా పడిలేచే జీవితం అనుమానం వలలో పడి అవమానం రాక్షసికి అర్ధాయుష్షుగా సాగిలపడుతుంది..! ! ఒక్కోసారి... అప్పటిదాకా..అలవాటుగా ఒద్దికగా సాగే జీవితం, ఒద్దిక సా...గే జీవితం అనిపిస్తుంది..అకస్మాత్తుగ..!! ఒక్కోసారి... ఫలవంతం కాని కలలు మంచు పలకల్లా కరగిపోతే, మనసులో బడబానలం రగిలి.. భరించలేని దేహం చల్లబడుతుంది..!!..23జున్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4EvoY

Posted by Katta

Achanta Hymavathy కవిత

ఉత్తమ సాహిత్య౦ చదివి-గ్రహి౦చుకున్నవాళ్ళకి జీవితాన్ని నిర్మి౦చుకునే మానసిక సత్తువ వస్తు౦ది.

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL3BPE

Posted by Katta

Achanta Hymavathy కవిత

సమతాంకురం ----------------- నాటాను చైతన్య బీజం- చల్లాను వాత్సల్య జలం! మొలకెత్తుతుంది సభ్యతా అంకురం. మమతా గాలి తగిలి, మొక్క ఎదిగి- మారాకేసి, వృద్ధి చెందుతుంది! పచ్చని రెమ్మల మధ్య పసిడి మొగ్గై, 'ఎప్పుడు విచ్చుకో గలనా?,- ఆ నిరీక్షణా బాధ్యతాయుతమే! మొగ్గపువ్వై,పువ్వుకాయై...పండై, ఉపకర్త కావాలనే తీవ్ర వాంఛ! అభ్యుదయ భావానుభూతికి, అభ్యున్నత స్నేహానుభూతికి, సర్వ ప్రాణులూ హక్కుదారులే! కుతూహల కదనమే గాని ... క్రూర సమరం అవాంఛనీయం! సమతా సమాజ నిర్మాతల- విరామ మెరుగని క్రాంతి పయనం, సేవా సాఫల్యాన ఉప్పొంగే హృదయం- స్వాత్మానుభవ శాతి వలయం. స్వచ్చా మానసం-ఆనంద నిలయం! వ్యధలూ,సౌఖ్యలూ లయ విన్యాసాలై అరుణోదయంలో ఐక్యమౌతున్నాయ్!! దారిద్ర్య,ఖేద దు:ఖాలు సమయగా, వివక్షా రుగ్మతలు తొలగగా... పులకింతుము పుడమి జీవులం- ఉల్లములెల్ల వెల్లువలై ఉప్పొంగగ- అలరారు ఆబాలగోపాలం!!! (2006,కవితామాలిక సంకలనం లో ప్రాచురింపబడింది. 2008,లో మహాకవి'జాషువా'విశిష్ట సేవా పురస్కారం 'సాహితీ శిరోమణి'అనే బిరుదును సంపాదించిపెట్టింది.)

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rprdZx

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఎండాకాలంలో చెట్లు వర్షాభావం వల్ల కన్నీళ్ళు కార్చడానికి నీ

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tn6NVc

Posted by Katta

Satya Srinivas కవిత

పూల రెక్కలోని చిత్రం నేను ఓ చెట్టుని కౌగలించుకున్నప్పుడు నాలోని వృక్షత్వం నింగిలో తటాకమవుతుంది నేను మటుకు సదా పూల రేకుల్లా... ఎండుటాకుల్లా... వేర్ల మొదళ్ళలో రాలుతూనే వుంటా ఆమె అరికాళ్ళ రేఖలు నా మీదుగా పయనించినప్పుడు తొలకరికి మట్టి చిట్లి వివిధ రంగుల్లో విచ్చుకుంటుంది ఆకాశం తన రంగుల వస్త్రాన్ని ఆరేసుకున్నట్లు తడి మట్టి రాట్నం మీద హస్తరేఖల్లా ముద్రితమవుతున్న చిత్రం అంకురిస్తుంది (9-6-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ptOPL6

Posted by Katta

Rasoolkhan Poet కవిత

*అమ్మ* పురిటి నొప్పుల యజ్ఞం లో ఓ ప్రాణం అంచుల చివర మరొక ప్రాణం వెలిగింది నెత్తుటి ముద్దను మనసారా హత్తుకొని మురిపెంగా ముద్దు పెట్టుకున్నావు నిన్ను తలిస్తే చాలు ఇప్పటికీ ఆ స్పర్శ నా గుండెను తాకుతూనే వుంది కట్టెలు కొట్టావు కూలికి వెళ్ళావు నా కడుపును నింపి కన్నీళ్ళతో కాలాన్ని నడిపావు తాగుబోతు తండ్రి అప్పుల అతుకుల బతుకు ఆ నీడల జాడలు కూడా నాపై పడకుండా వెన్నెల కాంతులు జల్లావు నిశీధిలో నీవు కలిశావు నేనెంత ఎత్తుకు ఎదిగినా నీ వేలు పట్టి నడిచిన ఆ తొలి అడుగులు మరువలేదు నీ చేతి ఎర్రకారం ముద్దలు తింటూ నేను తినిపిస్తూ నువ్వు ఇద్దరం ఏడ్చేవాళ్ళం నేడు నా చుట్టూ పంచభక్ష పరవాణ్ణాలు ఉన్నా అమ్మ...! నీవు లేవు. పి రసూల్ ఖాన్ 23-6-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wlrSOr

Posted by Katta

Abd Wahed కవిత

నేను కవిత్వం గురించి రాస్తున్న పంక్తులు కవిత్వ నిర్మాణ రూపాలను అర్ధం చేసుకోడానికి, కవిత్వ నిర్మాణానికి అవసరమైన మరిన్ని టూల్స్ సముపార్జించుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అర్ధం చేసుకోవాలని మనవి. కవిత్వం గురించి లోతుగా తెలిసిన వారు నా పోస్టులకు ప్రతిస్పందించడం నాతో పాటు గ్రూపులో రాస్తున్న అనేకమంది కవులకు అది ఊపయోగకరంగా ఉంటుందన్నది నా ఆలోచన. ఇంతకు ముందు పోస్టులో రాసిన కవితను సెల్ఫ్ ఎడిటింగ్ ద్వరా మరింత పదునుగా మార్చకోవచ్చని అనుకున్నాం. కవిత్వం ఆవేశప్రధానమైనదని తెలుగులో చాలా సార్లు విన్నాను. కవిత్వం బాధ, ఆవేదన ప్రధానమైనదని ఉర్దూలో విన్నాను. క్లుప్తంగా చెప్పాలంటే కవిత్వం మన భావావేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని అర్ధం చేసుకోవచ్చనుకుంటాను. కాబట్టి కవిత మన భావావేశాల వ్యక్తీకరణ. సాధారణంగా రాసిన వెంటనే పోస్టు చేయాలనిపిస్తుంది. కాని ఆ కవితను ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టి, దాని గురించి మరిచిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఆ కవితను చదివితే మనం చేసిన కొన్ని పొరబాట్లు మనకు ఖచ్చితంగా కనబడతాయి. పొరబాట్లు వ్యర్ధపదాలకు సంబంధించినవి కావచ్చు. లేదా అనవసరపు ప్రతీకలు, పోలికలు, ప్రాసలకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించడం వల్ల కవిత్వంలో చిక్కదనం పెరుగుతుంది. కాని వ్యర్ధ పదాలేవో తేల్చడం ఎలా? ఈ విషయమై సీనియర్ కవులు సూచనలందిస్తే బాగుంటుంది.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1syd7cp

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఈ వారం కవిసంగమం కవి గురించి చదవండి.. http://ift.tt/1q08iql

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q08iql

Posted by Katta

Rajeswararao Konda కవిత

వీలయినంత మేరకు కాకుండా మొత్తంగా తెలుగులోనే మాట్లాడి మన తెలుగు తనం ఉట్టుపడేలా అసెంబ్లీలో వ్యవహరించమని ఆంధ్రరాష్ట్ర ప్రజలు సభాపతి,ఉపసభాపతిని,శాసనసభ్యులను కోరుకుంటున్నారు. ఇకనుంచైనా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విన్నపాన్ని సీఎం గారు, ప్రతిపక్షనేత కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది.

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q04sxG

Posted by Katta

Aruna Naradabhatla కవిత

మేల్కొలుపు ___________అరుణ నారదభట్ల రాత్రంటే కేవలం చీకటే కాదు అందంగా ఆకాశాన్ని చుట్టుకునే నక్షత్రాలూ కావు! చల్లని వెన్నెలలా చేరే జాబిల్లే కాదు! ఎందరి ప్రయాసలనో ఒడిలో చేర్చుకొని లాలించి నిదురపుచ్చే నేస్తం! ఎన్ని హృదయాలనో ఒకటిగా కలగలిపే అమృత హస్తం! ఎన్ని మౌనాలనో మేల్కొలిపే తీయని రాగం! ఎన్నో జ్ఞాపకాలను కొత్తగా హత్తుకునే జ్ఞాననేత్రం! రాత్రంటే కేవలం భయమే కాదు ధర్యాన్ని రంగరించే తండ్రి! అలసిన ప్రకృతి మూగబాస రాత్రి! ఇంటిపక్కన గోరీలు నేర్పిన గుండె నిబ్బరం రాత్రంటే! కేవలం నలుపే కాదు రాత్రంటే కోట్ల దీపాలనూ స్వయంగా వెలిగించుకునే శక్తి! నీకు నువ్వుగా ఓ ప్రచండ కాంతి రవికి తెలియని కొత్తలోకం రాత్రి! నిశ్శబ్దంగా వీచే చెట్ల గుసగుసలు రాత్రి! పురుడు పోసుకునే వేకువకు నొప్పుల చీకటి రాత్రి! వెలుగుకు గుర్తింపు నిచ్చేది ఎన్నో కలాలకు...కలలకు పనిచెప్పేది ప్రశాంతంగా పడకగదికి మోసుకెళ్ళేది వెచ్చని దుప్పటై అల్లుకునేది! తీరని కోరికలను మధురస్వప్నమై వీక్షింపజేసే సుందర క్షణం రాత్రి! ప్రతినిత్యం కొత్తపదాలతో తెల్ల కాగితంపై చీకటిని చీల్చేది రాత్రి! రాత్రంటే నా ప్రియమైన నేస్తం నన్ను వింతగా మేల్కొలిపే ఆపన్న హస్తం! 23-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UyuU46

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఏదైనా చెప్పాలి తెలియచేయాలి అనుకున్నా మనకున్న ఏకైక సాధనం మాట అది లోపల ఉన్నంత వరకు మనం దానికి రాజు అది బయటకు వస్తే దానికి బానిస పరుషం గా మాటలాడటం ఆత్మాభిమానం కావచ్చు ప్రేమ గా మాట్లాడితే విరోధి కుడా ఆప్తుడే అవుతాడు బాధ కలిగించే పరుష వాక్యాల కంటే ధైర్యాన్ని ఇచ్చే మంచి మాట మేలు నేస్తమా !!పార్ధ !!23/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nwpbCX

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత



by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qDF7tr

Posted by Katta

Krishna Mani కవిత

సాగరం ______________________కృష్ణ మణి ఆకాశపు అంచున ఆరేసిన కొంగుపై మెరిసే కాన్తులెన్నో చూసివద్దామా నేస్తం చెదిరిన మనసున చీకటి కుంపటిలో మిణుగురులని వదిలి వద్దామా ! కమిలిన చోట తెల్లని కణాలను ఇచ్చి మత్తున నిద్రపుచ్చి వద్దామా నేస్తం గతాల గుద్దులాటలో గతించిన ప్రేమ గుర్తులను గుర్తు చేసి గుదిబండలను జరిపి వద్దామా ! ఎంతకాలం ఇలా గీతలనడుమ గోతుల తీసి గోడల కట్టడం ? నడువు లోకాన్ని కలుపుతూ కొత్త దారిలో నేలపై గీతలను నీటిపై రాతలుగా మార్చుదాం దింపుదాము అందరిని చేపలుగా తలచి హద్దులేని ప్రేమసాగరంలో తారతమ్యాలు చెరిపి ! కృష్ణ మణి I 23-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pZRrnO

Posted by Katta

Naga Raju కవిత

Company Promotion Giving A Free Recharge Of Rs.100 On Your Mobile Number @ Register Here http://ift.tt/TFUiV2

by Naga Raju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TFUiV2

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

వస్తుస్పష్టతతో గొప్పగా నిర్వహించబడిన కవిత. గుండెల్ని కదిలించే కవిత. సాక్ష్యం / ప్రసాదమూర్తి ------------------------- కురిసిన నెత్తురు కురిసినట్టే ఉంది మేఘాల సాక్ష్యం ఏదని ఆకాశం కేసు కొట్టేసింది. తెగిపడ్డ తలకాయలు కళ్ళ ముందు ఎగురుతూనే ఉన్నాయి మొండేల జాడ ఏదని గాలి కేసు కొట్టేసింది వెన్నుపూసను వణికిస్తున్న జ్ఞాపకాల చెట్టుకు నరకబడ్డ కాళ్ళూ చేతులూ వేళ్ళాడుతూనే ఉన్నాయి కత్తుల మీద నెత్తుటి చుక్కలు లేవని కాలం కేసు కొట్టేసింది మృతదేహాల మూటలు తుంగభద్ర తరంగాల్లో కలిసి తలలెత్తి ఎగిసిపడుతూనే ఉన్నాయి నీరు నోరు మెదపలేదని గట్టు కేసు కొటేyసింది హతులున్నారు హంతకులే లేరు హంతకులున్నారు సాక్షులే లేరు సాక్షులున్నారు వినే చెవులు లేవు చూసే కళ్ళు లేవు ఇదేంటని ప్రశ్నించే నోళ్ళున్నా సాక్ష్యంగా జవాబులే ఉండవని ఫైనల్‌ గా మనువు కేసు మూసేశాడు సాక్ష్యం చెప్పవే చుండూరా చుండూరా చుండూరా దేశం దేహమ్మీద సలపరం పెడుతున్న మనుధర్మ రాచపుండూరా!! (చుండూరు మారణకాండలో బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతుగా..) ( 23.06.2014.... సోమవారం, ప్రజాశక్తి )

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lid3Zn

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

కన్నయ కన్నయ నొక కరమున, నీ కన్నయ నింకొక కరమున గలిగి కదలెదో - కన్నయ నమ్మిన యెడ, నీ కన్నయ కిక కడుపు నిండు గదనే తల్లీ! - డా.ఆచార్య ఫణీంద్ర 23/6/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UxV7jf

Posted by Katta

Rvss Srinivas కవిత

|| తొలకరొచ్చేసింది || జ్వలించే గిరులపై నీటిపూలు చల్లేస్తూ రేగడినేలపై పరిమళాలు మొలకెత్తిస్తూ పచ్చని చెట్లకి అభిషేకాలు చేసేస్తూ చాపిన నాలుకపై ముత్యంలా నర్తిస్తూ కొండ'జారుపాతాలకి' కొత్తపాట పల్లవిస్తూ సెలయేటి నడకలకి వయ్యారం అందిస్తూ జీవనదుల జీవితాన్ని జీవంతం చేసేస్తూ బడుగురైతు ఆశలపై పన్నీటిని చిలకరిస్తూ గోదావరి పరుగులకి ఉరకలెన్నో నేర్పిస్తూ కదులుతున్న క్రిష్ణమ్మలో కులుకులెన్నో కుమ్మరిస్తూ గంగోత్రి గలగలలకి గజ్జెలెన్నో కట్టేస్తూ యుమున నడుము వంపుల్లో కొత్త సొబగులొంపేస్తూ... @శ్రీ 23jun14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V3Aj3L

Posted by Katta

Kapila Ramkumar కవిత

సాక్ష్యం Posted on: Mon 23 Jun 01:07:54.530786 2014 కురిసిన నెత్తురు కురిసినట్టే వుంది మేఘాల సాక్ష్యం ఏదని ఆకాశం కేసు కొట్టేసింది తెగిపడ్డ తలకాయలు కళ్ళముందు ఎగురుతూనే వున్నాయి మొండేల జాడ ఏదని గాలి కేసు కొట్టేసింది. వెన్నుపూసను వణికిస్తున్న జ్ఞాపకాల చెట్టుకు నరకబడ్డ కాళ్ళూ చేతులూ వేళ్ళాడుతూనే వున్నాయి కత్తుల మీద నెత్తుటి చుక్కలు లేవని కాలం కేసు కొట్టేసింది మృతదేహాల మూటలు తుంగభద్ర తరంగాల్లో కలిసి తలలెత్తి ఎగిసిపడుతూనే వున్నాయి నీరు నోరు మెదపలేని గట్టు కేసు కొట్టేసింది హతులున్నారు హంతకులే లేరు హంతకులున్నారు సాక్షులే లేరు సాక్షులున్నారు వినే చెవులు లేవు చూసే కళ్ళు లేవు ఇదేంటని ప్రశ్నించే నోళ్ళున్నా సాక్ష్యంగా జవాబులే వుండవని ఫౖౖెనల్‌గా మనువు కేసు మూసేశాడు సాక్ష్యం చెప్పవే చుండూరా చుండూరా చుండూరా దేశం దేహం మీద సలపరం పెడుతున్న మనుధర్మ రాచపుండూరా (చుండూరు మారణకాండలో బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతుగా) - ప్రసాదమూర్తి కవిసెల్‌: 8498004488 http://ift.tt/1inqyYv

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqyYv

Posted by Katta

Kapila Ramkumar కవిత

తెలంగాణ ప్రజా వ్యవహారం Posted on: Mon 23 Jun 01:12:02.070757 2014 - భాషలో విభక్తులు సాధారణంగా ప్రజావ్యవహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ప్రతి భాషకి స్వాభావికంగా ఒక లక్షణం ఉంటుంది. భాషలోని అనేక అంశాలలోనూ ఒక అంతస్సూత్రత ఉంటుంది. ఇది వేర్వేరు విభాగాల సాంప్రదాయికతని, స్థాయిని చెబుతుంది. దీన్ని భాషాలక్షణం అన్నా, వ్యాకరణం అన్నా ఒకటిగానే కనిపిస్తుంది. భాషను వ్యాకరణం నిర్దిష్టం చేస్తుంది. కాని ప్రయోగాన్ని నిర్దేశించదు. ఎందుకంటే భాషలో అనేక మార్గాల్లో ప్రయోగాలుంటాయి. అందువలన వ్యాకరణ భాషలోని లక్ష్యాన్ని చర్చించాలి గాలి లక్షణం గాదు. బహుశ దశాబ్దాల క్రితమే, శతాబ్దాల క్రితమే భాషమీద వ్యాకరణం అజమాయిషి మొదలు పెట్టిందనటం. అతిశయోక్తి గాదు. ఒక భాషలోని మూల లక్షణం వేరయినప్పుడు దానిలోని వ్యవహారం వేరవుతుంది. ఆయా ప్రత్యేక లక్షణాల మేరకే ప్రయోగాలు, ఉపయోగాలుంటాయి. నన్నయకు ముందు తెలుగు వ్యాకరణాలు లేవనే మాట వినిపిస్తుంది కాని భాషా వ్యాకరణాలు లేక కాదు. శబ్దానుశాసనం లాంటివి కనిపిస్తాయి. ఇలా కొన్ని 'దేశీ' తెలుగును కొంతవరకు విశ్లేషించాయి. నన్నయ కాలానికి తత్సమీకరణ అధికమై, ప్రబంధయుగం దాకా పరిపుష్టమై వ్యాప్తమైంది. ఒక రకంగా తత్సమ ప్రభావం ప్రజావాఙ్మయాన్ని, భాషను సాహిత్యభాషగా తిరస్కరించి అణచి వేసిందనటం పొరపాటు గాదు. తెలంగాణ విలక్షణ భాషా వ్యవహారం గల ప్రాంతం. సూక్ష్మ వైరుధ్యాలున్నా తెలంగాణ వ్యవహారా నికి ఒక మూల లక్షణం ఉంది. తెలుగులో విభక్తులు సంబోధనతో కలిపి ఎనిమిది ఉన్నాయనేది వ్యాకర్తల అభిప్రాయం. తెలంగాణా ప్రాంతంలో స్థూలంగా ఏడు విభక్తులు వ్యవహారంలో ఉండవు. ఉన్నవి కూడా 'బాల వ్యాకరణం'లాంటి ప్రమాణ గ్రంథాల సూత్రతని తిరస్కరిస్తాయి. ప్రాథమికంగా ఈ వ్యవహారంలో నాలుగు విభక్తులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా ఇతర ప్రాంతాలతో వ్యత్యాసం కలిగి వున్నాయి. సాధారణంగా ప్రథమ విభక్తిలో ప్రాతిపదికాలు సంబోధనలు ఉక్తాలినే మూడు పదాలుంటాయి. ''ప్రాతిపదిక సంబోధనాక్తార్ధంబులు ప్రథమంబగు'' అని చిన్నయసూరి డు,ము,వు,లు, ప్రథమా విభక్తి. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలకు 'డు' ప్రథమా విభక్తిలో కనిపిస్తుంది. తెలంగాణలో తొంభైశాతం ప్రజా భాషలో 'అన్న', 'అమ్మ', 'అయ్య', 'అక్క' లాంటి పదాలు ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరం వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని చూపేవి. ఇవి సంబోధనలే అయినా ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. ఉదా: రాజయ్య - మల్లయ్య, రాజన్న - మల్లన్న స్త్రీ పదాల్లో 'అమ్మ/అక్క'లు వినిపిస్తాయి. ఉదా: రాజక్క - మల్లక్క, రాజమ్మ - మల్లమ్మ తెలంగాణ ప్రాంతంలోని నామ్నీకరణాలు దైవికాంశ ని, జానపదాంశని కలిగి వుంటాయి (ఆధునికంగా వీటిలో మార్పులున్నాయి) కొన్నిసార్లు సంబోధనలతో ఉన్న పదాల్లా ఉచ్చారణలో వర్ణాలు లోపిస్తాయి. ఉదా: విజయమ్మ - విజ్జమ్మ ఆనంద్‌ - నందు 'డు'కు బదులుగా బహువచన ప్రత్యయమైన 'లు' ప్రాతిపదికాల్లో ఏకవచనంలోనే కనిపిస్తుంది. ఉదా: రాములు - వెంకటేశ్వర్లు 'డు' సందర్భాల్లో ఉక్తాల్లో కనిపిస్తాయి. ఉదా: బండోడు - నల్లమొకపోడు నిజానికి వాడు / అది అనే సర్వనామాలు ఇందులో నూ గౌరవ వాచకంగా 'ఆయన / ఆయినె' కనిపిస్తుంది గాని స్త్రీ వాచకంగా 'అది'కే వ్యాప్తి ఎక్కువ. ఉదా: ఇంటిది - ఇంటాయినె నపుంసకలింగాలు చెబుతున్నప్పుడు 'ము' తక్కువే. బదులుగా 'ం' సున్నాని ఉపయోగించడమే ఎక్కువ. ఉదా: కంబము - కంబం అన్నము - అన్నం అద్దము - అద్దం 'పు' ప్రత్యయం కలిగిన పదాలు తెలిసినా వ్యాప్తిలో ప్రత్యామ్నాయాలు ఎక్కువ. ఉదా: తరువు - చెట్టు కొన్ని పదాల్లో రూపాంతర వ్యాప్తి ఎక్కువ 'ఆయు:' అనే పదం 'వు' ప్రత్యయం చేరి 'ఆయువు' అవుతుంది. కాని - ఆయుష్షు - ఆయుస్సు - అవుసుగానే వ్యాప్తి ఎక్కువ. ఇలాంటివి ప్రజా భాషలో ముఖ వ్యాయమం వల్ల సంభవిస్తాయి. ప్రథమా విభక్తిలో సంబోధనల్లోనూ వైరుధ్యాలు న్నాయి. నామవాచకాల్లో అక్క, అమ్మలాంటి పద ప్రత్యయాలున్నా కొన్నిసార్లు అవి కనిపిస్తాయి. కొన్ని సార్లు కనిపించవు. ముఖ్యంగా స్త్రీలింగాల్లోనే ఇలా జరగటం గమనార్హం. రామక్క - ఓ రామీ మల్లక్క - ఓ మల్లీ ఆకారాంతాలైన పదాలూ సంబోధనల్లో 'ఇ' కారాం తాలు, 'ఉ' కారాంతాలవటం. గౌరమ్మ - గౌరూ లక్ష్మి - లచుమా మల్లమ్మ - మల్లీ కొన్ని సార్లు 'ఓ' చివర చేరుతుంది లచుమ - లచుమో మల్లిగా - మల్లిగో మల్లయ్య - మల్లన్నో శ్రోత, వ్యవహర్త మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పు డు పై రూపాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఉక్తార్థాల్లో ధ్వని వ్యత్యయాలున్నాయి. నిద్దుర - నిద్ర - నిర్ద 'లు' బహువచన ప్రత్యయంగా వాడుకలో ఉంది చెట్టు - చెట్లు పుట్ట - పుట్టలు - పుట్లు 'లు' ప్రత్యయం చివరి 'హల్లు'తో చేరి, చేరకుండా (సంయుక్తమయ్యి, కాకుండా) రెండు రకాలుగా వ్యాప్తి లో ఉన్నాయి. పండు - పండ్లు... 'పళ్లు' అనే మూర్దన్యం ఏ అర్థం లోనూ వాడుకలో లేదు. ద్వితీయా విభక్తిలో ని,ను,ల గూర్చి, గురించి... అనే ప్రత్యయాలున్నాయి. 'కర్త ప్రథమలో ఉన్నప్పుడు కర్మ ద్వితీయలో ఉంటుందన్నారు చిన్నయ సూరి. ఈ ప్రాంత వాడుకలోనూ కర్మ ద్వితీయకీ వస్తుంది. వాడి + ని = వాన్ని - ఆన్ని ని, ను లు 'అలుక్‌' (ప్రత్యయం కనిపించని) రూపాల్లోనే ఎక్కువ. (అ) వాడు చెట్టు కొడుతుండు. (ఆ) వీడు చెట్లు నరికిండు. (ఇ) ఆమె పాలు తెస్తుంది. ఇందులో కర్మయైన చెట్టు, పాల పక్కన విభక్తులు ప్రత్యక్షంగా లేవు. 'గూర్చి' గురించి'లలో 'గురించి' ఎక్కువ వాడుక. (అ) వాని గురించి తెలువది (ఆ) దాని గురించి అడుగకు కొన్నిసార్లు 'గురించి' ప్రత్యామ్నాయంగా 'విషయం' 'మాట' అనే ప్రాతిపదికలు వినిపిస్తాయి. (అ) వాని మాట తెలువది (ఆ) దాని విషయం అడుగకు. 'ల' అనేది ప్రాతిపదికలో సంయుక్తంగా ఉంది (అ) చెట్టు + ల + ను ట చెట్లను కొట్టిండు (ఆ) బుట్ట + ల + ను ట బుట్టల్ని అల్లింది తృతీయా విభక్తిలో చేత, చే, తోడ, తో అనే వాటిలో చివరి రెండూ ఉన్నాయి. కాని ప్రయోగాల్లో వైరుధ్యాలు న్నాయి. చిన్నయసూరి ''కర్మ ప్రథమంబగుచో కర్త తృతీయనగు'' అన్నాడు. ప్రధానంగా ఇక్కడి వ్యవహారంలో కర్మవాక్యాలు లేవు. (బహుశ: ఏ ప్రాంత వ్యవహారంలో కర్మ వాక్యాలు లేవనే అనాలి). ''రావణుడు రామునిచే చంపబడెను'' వంటి వాక్యాల్లో కనిపించే ''బడు'' ప్రత్యయం వ్యవహార శూన్యమే. కాబట్టి తృతీయలో చేత, చే, లు లేవు. తోడ, తో అనేవి బహుళంగా వ్యవహారంలో ఉన్నాయి. ఒక కర్తకో ఒక కర్మకో కాకుండా రెంటికీ, పరస్పరంగా కూడా వ్యవహా రం ఉంది. (అ) వాడితో కష్టమొచ్చింది. (ఆ) వానితోని ఎప్పుడు లాల్లే. వలన- అనే భావంలోనే ఇక్కడ 'తో' ఉపయోగపడు తుంది. ఏం చమిలో చెప్పే విభక్తికి ఇది ప్రత్యామ్నాయం. (అ) వానితో ఇబ్బందే కర్తృ స్థానంలో నాకు, నీకు, రామునికి వంటివి చేర్చవచ్చు. మరికొన్ని ఉదాహరణలు గమనిస్తే 'తో' ఎంత విస్తృతమైందో అర్థమౌతుంది. (అ) నాతోటి వాడు కూడా వచ్చిండు. (ఆ) నాకు వాని తోటే పని. (ఇ) మేము ఒకతోని బగలం మాట్లాడుత లేము. (ఈ) పాలతోటి కోవా చేసిండు. (ఉ) వాని తోటే పోయిండు. (ఊ) వాని తోటే దోస్తి. ప్రథమపురుషలో సంబంధాన్ని, పరిణామాన్ని చెబు తున్నప్పుడు 'తోడ' అనేది 'తోటి' అనే స్వర రూపం మారి కనిపిస్తుంది. కాని గుర్తించాల్సింది ఇది కర్తకు, కర్మ రూపంలో రావడం లేదని 'టి' అనేది జాప విభక్తుల్లో ఒకటని. సాధారణ వ్యవహారంలో లాగానే చతుర్ధీ విభక్తికి సంబంధించి 'కొఱకు' 'కై'లు వాడుకలో లేవు. సంప్రదానంబునకు చతుర్ధియగు' అని చిన్నయ సూరి అన్నా. ఈ ప్రాంతంలో సంప్రదానంలో (షష్టీ విభక్తి) 'కి' ఎక్కువ వాడబడుతుంది. (అ) రాముని కొరకు సీతనిచ్చెను (ఆ) రామునికి సీతనిచ్చిండు. చాలా వరకు 'కోసం' అనేది 'కొరకు'కు ప్రత్యామ్నా యంగా వాడబడుతుంది. కొన్ని సందర్భాలో ఆచ్చా దనా మాత్రంగా సంప్రదానం ఉంది. (అ) అతని కోసం పాలు తెచ్చిన (ఆ) ఎవరి కోసం కొట్లాడిండు (ఇ) నీ కోసం ఎంతసేపు చూస్తా (ఈ) నీ కోసం ఎవరో వచ్చిండ్రు పై వాక్యాల్లో మొదటి వాన్లోనే సంప్రదానం ఆచ్చా దనా మాత్రంగా ఉందిగాని మిగతా వాటిలో లేదు. కాబట్టి 'కోసం' అనేది చతుర్థికి సంబంధించిందిగా, దాని రూపాంతరంగా ఊహించలేం. పంచమీ విభక్తి కూడా తెలంగాణ వ్యవహారంలో లేదు. 'వలన', 'కంటె' 'పట్టి'లో వలనకు బదులుగా తృతీయా విభక్తి ప్రత్యయమైన 'తో'నే వాడుతారు. (అ) వాని వలన కొంప మునిగింది (ఆ) వాని తోటి కొంప మునిగింది (అ) ఉద్యోగం వలన కష్టాలు (ఆ) ఉద్యోగం తోటి కష్టాలు సంస్కృతంలో (తెలుగులోనూ) చెప్పుకునే ఉదాహర ణల్లో 'అశ్వపతిత:'లో 'వలన' కనిపించదు 'నుండి' 'మించి' అనేది కనిపిస్తుంది. (అ) గుర్రం మీంచి పడ్డవాడు (ఆ) గుర్రం నుండి పడ్డవాడు 'మీంచి' అనేది మీద నుండి (చి) అనే దానికి వ్యవహారంలో స్వర రూపాంతరాపత్తి వల్ల ఏర్పడ్డ రూపం. 'కంటే' అనే దానికి కొన్నిసార్లు 'కన్నా' అనేది బదులుగా వాడతారు. అయితే ఈ రెండూ ఒకే అర్థంలో ఉన్నాయి. రెండు వస్తువులను వ్యక్తులను పోల్చినప్పుడు ఈ పద్ధతి కనిపిస్తుంది. (అ) వాని కంటే వీడే నయం (ఆ) వాని కన్నా వీడే నయం (ఇ) ఈమె కన్నా ఆమే మంచిది (ఈ) దీని కన్నా అదే నయం (ఉ) ఇక్కడి కన్నా అక్కడే నయం (ఊ) దీనికన్నా అదే చక్కనిది 'పట్టి' అనేది కూడా కొంత వ్యవహారంలో ఉంది (అ) వీడు చెయవట్టి లొల్లయింది (ఆ) అది జెయవట్టే వచ్చుడైంది సంబంధాన్ని సూచించేది షష్ఠీ విభక్తి. కి, కు, యొక్క లో, లోపల - సుమారుగా ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. 'కి' ఏకవచనంలోనే సంబంధాన్ని సూచి స్తుంది. (అ) ఈ లొల్లిల వానికి సంబంధం లేదు (ఆ) వానికి పెళ్లయింది (ఇ) ఆ పిలగానికి మా బిడ్డనిచ్చినం పై వాక్యాల్లో చివరిది 'కొరకు' బదులుగా వాడబడు తుంది. పైన చతుర్దిలోనూ దీని వివరణలున్నాయి. (అ) పుస్తకాలు వానికి తెచ్చిండు. వీనికిక కాదు. (ఆ) వానికి సైకిలు కొనిచ్చిండు. 'కి' సంప్రదానంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో పై వాక్యాల్లో అర్థమవుతుంది. 'కం' బహువచనంలో వాడటం గమనార్హం. (అ) వాళ్లకు ఆకలలు (ఆ) ఏంది వాళ్లకు చెప్పేది (ఇ) ఆవులకు మేత వేసిండు (ఈ) గొడ్లకు వానికే సోపతి (ఉ) ఆ సదువులకు రోజులు గావు (ఊ) మాటలకు లొంగడు పద బంధాల్లో 'యొక్క' అంతర్గతంగా విభక్తిలోపం లో ఉంది వాక్యంలో బంధంలో ప్రత్యక్షంగా లేదు. అందువల్ల 'యొక్క' లేదనే వినిపిస్తుంధి. (అ) నా యిల్లు, (ఆ) వాని పొలం. 'లొ' 'లోపల' అనేవి రెండూ వాడుకలో ఉన్నా వీటి విషయంలో కొన్ని అంశాలు గమనించాల్సింది. (అ) 'లొ'కన్నా 'లోపల'నే ఎక్కువ వాడకం (ఆ) 'లోపల'కు ఔప విభక్తి 'టి' చేరుతుంది (ఇ) 'టి' చేరినప్పుడు 'లోపటి', 'లోపట' అనే వైరుధ్య రూపాలున్నాయి. 'అందు' 'న' అనే సప్తమికి కూడా 'ల' నే ప్రధాన ఉపయోగం కాని కొన్ని చోట్ల 'అందు' ప్రయోగం 'అండ్ల' 'ఇండ్ల' 'ఎండ్లె' వంటి రూపాల్లో ఉంది. (అ) వానికి మనసుల మనసు లేదు (ఆ) కోపంల ఉన్నప్పుడు మాట్లాడద్దు (ఇ) ఇంట్ల వాళ్లే నలుగురుంటరు (ఈ) పొలంల పనున్నది కొన్నిసార్లు 'ఎ' కారం చేరుతుంది 'ల'తో కలిసిన 'ఎ'కారాన్ని షష్టీ విభక్తిలో (జ) చూడవచ్చు. మరో రెండు ఉదాహరణలు గమనించండి. (అ) గుల్లె దేవుడున్నడు, (ఆ) బల్లె సారున్నడు. అందు అనేది కొన్ని చోట్ల ఉద్వేగాన్ని చెబుతున్న ప్పుడు కనిపిస్తుంది. (అ) మీకు తెలువదా? నా అందున తప్పులేదు (ఆ) నువ్వు పన్జేసేది ఇండ్లనేనా? (ఇ) అండ్ల పని చేస్తవా? ఎందున, అందున, తీందున లకుబదులుగా వాడబడిన రూపాలను గమనిస్తే ఈ భేదాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రజావ్య వహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ఇతర ప్రాంతాల ప్రభావాలు ఉచ్ఛారణ మొదలైన అంశాల్లో మార్పులు తెస్తాయి కాని మూలతత్వానికి కాదు. తెలంగాణ భాషా అస్తిత్వాన్ని గురించి మరింత చర్చ జరగాలి. - మ.నా.శర్మ సెల్‌: 9177260385 http://ift.tt/1inqwQl

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqwQl

Posted by Katta

Rajeswararao Konda కవిత

మొన్న ఎరుపు నిన్న నలుపు నేడు పసుపు ఏమిటీ ఈ రంగులు ఎందుకు ఈ మార్పులు ... ? ఎవరి కోసం ఈ దసరా రంగుల వేషాలు ..? రంగు మారినా నీ హృదయం మారదుగా...! అందరూ మనవారే అనుకోవడం ఒట్టి దగా... ప్రతి ఒక్కరూ చీ కొట్టే వరకూ ఈ రంగులు మారుతూనే ఉంటాయి.. నేస్తమా...!!//23.6.14// @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2kzTG

Posted by Katta

Rajeswararao Konda కవిత

ఆకులో ఆకునై.. పువ్వులో పువ్వునై.. నీచుట్టూనేనల్లుకుపోతా..! //23.6.14// @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pAQWyE

Posted by Katta

Harsha Vadlamudi కవిత

జీవన్మరణాల మద్యలో జీవిస్తున్న జీవశ్ఛవాన్ని నేను, బతుకు బాటలో ఎండమావి కోసం పరిగెడుతున్న బాటసారిని నేను, నడిచే శవాల మద్య బతుకు బండిని లాగుతున్న యంత్రపు మనిషిని నేను, నిరాశల పల్లకిలో వర్తమానాన్ని మోస్తూ భవిష్యత్ ఊహల్లో తేలే ఆశావాదిని నేను, మానవ సంభందాల పేరుతో కపట ప్రేమను నటించటం రాని సగటు ప్రేక్షకుడ్ని నేను, బతకాలంటే రోజూ మానసికంగా చావాలని తెలియని బతక నేర్వని వాడ్ని నేను, నాతో నేను సాగిస్తున్న పోరాటంలో గెలిచేవరకు ఓడుతున్న సైనికుడిని నేను, చస్తూ బతుకుతూ కూడా బతుకు మీద తీపి చావని మనస్సు బానిసని నేను, మనిషిలా బతకాలంటే మృగంలా ప్రవర్తించాలని తెలియని మానవ మృగాన్ని నేను, ఆశల ఎడారి ప్రయాణంలో అలిసిపోయినా ఆగలేని వృద్ద యువకుడ్ని నేను......

by Harsha Vadlamudi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wjeQ3R

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పాఠశాల అమ్మయింది బడి నాకు చిన్నప్పటిసంది నేను బడిలోనే చదువుకునేటప్పుడయినా, చదువుచెప్పేటపుడైనా బడి నాకు తల్లి కథలు చెప్పిచ్చుకునే ఉపేందర్ గాడు. ఏభై ఏండ్ల తర్వాత కలిసిన కబడ్డిగోస్త్ రంగడు గులేరు కొట్ట నేర్పింది, కోతికొమ్మచ్చి ఆడించింది వాడే మట్టమీద బెల్లమైన బాల్నర్సయ్య మనసుకు మాలిమైన క్రిష్ణగాడు ఆటలల్ల సోపతి మజీద్ గాడు బడికి వస్తపోత ఉప్మ,పాలు కడుపుల విషమైనపుడు పానం కాపాడిన చాకలి రాములమ్మ వొదినె కంచుక పుడితే కాపాడిన కుర్మమల్లమ్మ పెద్దమ్మ కష్టాల్ల ధైర్యం జెప్పిన కాపురామయ్య పెదనాయిన ఆకలై ఏడిసినపుడు కారంకూరైన పెదనాయినమ్మ ఎంత వేదాంతో అంత బతుకుతెలిసిన మనిషి బడికి పొయే తొవ్వల అన్ని అరుగులు అమ్మయినయి బిడ్డ బాగున్నవా అని రోజూ పల్కరించినయి, ఏడ్సుకుంట పోతుంటే వూకుంచినయి పాలు మరిపించాలని ముసాంబ్రం తాపిన అమ్మ బాధ యాదికొస్తే బతుకు అమ్మ పాలకుతే సేపులొచ్చిన ఏ అమ్మని జూసినా అమ్మే యాదికొస్తది చిలికిన చల్లమీద పేరుకున్నవెన్ననా అరచేతుల్ల అమ్మే పాలకంకుల జొన్నకాపిళ్ళు, పజ్జొన్నగట్కల పచ్చెన్నముద్ద అమ్మే వానల్ల తడువకుండ అన్నిండ్లు కొప్పెరయినయి ఎండల దూపకు చల్లటినీళ్ళు దోసిళ్లు నింపినయి ఆటల్ల,పాటల్ల వాగుల వూటచెలిమయింది బడి నవ్వుల్ల, ఏడ్పుల్ల గొడుగుపట్టిన మొగులయింది బడి ఎన్నిదుఃఖాలు వొడగట్టింది బడి ఎన్ని బాధలు వొడిపించింది బడి ఆటలు నేర్పి, పాటలు నేర్పి, మాటలు నేర్పి నన్ను బతికించిన జమ్మిచెట్టు బడి పోతున్న పానం పట్టితెచ్చింది బడే బతుకుప్రాణమైంది బడే కాపుదనపు ఇండ్లల్ల పొద్దుపొడిచి బువ్వచుక్కైంది బడి వాగుల వూరిన వూటచెలిమై మనసుదాహం తీర్చింది బడి సందెవాకిలితీసిన వాకిట్ల వేపచెట్టై ముచ్చట్లాడింది బడి రాత్రంత భయం,చీకటి, నిద్రల్ని కప్పి ఒక్కటే దుప్పటై కాపాడింది బడి ఎంతమంది స్నేహాల్నిచ్చింది బడి ఎంతమంది కన్నకష్టాల్ని చూపింది బడి నన్ను దుఃఖంల, నవ్వుల ఒక్కతీర్గ జూసిన మంచి మనసున్న నేస్తం బడి బడి నాకు నా కన్నీళ్ళ తాళపత్రగ్రంథం బడి నాకు నా మరణాంతర వీలునామా బతుకనేర్పింది బడి బతుకు నేర్పింది బడి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nv6gbH

Posted by Katta

Abd Wahed కవిత

ఎం.నారాయణ శర్మ గారు మంచి ప్రశ్నలు లేవదీశారు. ఈ ప్రశ్నలపై చర్చ జరగడం చాలా అవసరం. ఆయన అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ పోస్టు చేస్తున్నాను. ’’ కవిత్వ వచనం సాధారణ వచనం వేరుగా వుంటుందా..? సాధారణ వచనాన్నించి కవిత్వ వచనాన్ని వేరుగా ఎలా చూడాలి...కవిత్వం నిర్దిష్ట భావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా..?మెరుగైన కవిత్వం అని నిర్ణయించడానికి ఖచ్చితమైన విలువలున్నాయా..?చర్చ కోసమే ఈ ప్రశ్నల్ని ముందుకు తెస్తున్నాను.‘‘ ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన ప్రశ్న ’’కవిత్వం నిర్దిష్టభావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా?‘‘... ఈ ప్రశ్నకు జవాబిచ్చే స్థాయి నాకు లేదు. ఎందుకో ఈ ప్రశ్న చదవగానే ఎప్పుడో చదివిన ఒక చైనీస్ కథ గుర్తుకు వచ్చింది. ఆ కథేమిటంటే.... కొందరు వికలాంగ పిల్లలకు పరుగుపందెం జరుగుతోంది. చిన్నపిల్లలు, నడవలేని కుంటివారు. అందరు ఎలాగో పరుగెత్తుతున్నారు. అందులో ఒక చిన్నపిల్ల పడిపోయింది. కిందపడిన పిల్ల లేవలేకపోయింది. కుంటుతూ పరుగెత్తుతున్న పిల్లల్లో ఒక పిల్లవాడు చూశాడు. వెనక్కి వచ్చి ఆమెను లేవడానికి ప్రయత్నించాడు. శక్తి చాలడం లేదు, పైగా కుంటివాడు. ఇది చూసి మరో ఇద్దరు పిల్లలు వచ్చారు. వారితో పాటు, మిగిలిన పిల్లలందరూ వచ్చారు. అందరూ కలిసి ఆ పాపను లేపారు. అందరూ ఒకరి చేతులొకరు పట్టుకుని పరుగుపందెం ముగిసే లైన్ వరకు వెళ్ళారు. అందరూ గెలిచారు. ఇది కథ. ఎక్కడా పరుగు పందెం ఇలా జరగదు. అది వికలాంగ పిల్లలదైనా సరే, పోటీలో గెలిచేవారు ఒక్కరే ఉంటారు. అందరూ గెలిచేదైతే పోటీయే అవసరం లేదు. కాని ఈ కథలో పరుగుపందెంగా చెప్పింది నిజమైన పరుగుపందెం కాదు, సమాజంలో నిత్యజీవితాన్ని చెప్పారు. వికలాంగ పిల్లలుగా సూచించింది సమాజంలో సభ్యులనే, ప్రతి ఒక్కరికీ ఏవో లోపాలుంటాయి. ఒకరికొకరు సహాయపడడం ద్వారా ఒక మెరుగైన సమాజం ఏర్పరచడమే అందరూ గెలవడం. అంటే ఈ మొత్తం కథ, ఇందులో పాత్రలు, సన్నివేశఆలు భావచిత్రాలని భావిస్తే...ఇది కథా? లేక కవిత్వమా? కవిత్వ నిర్వచన పరిధిలోకి ఇది వస్తుందా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V2zlEW

Posted by Katta