//సంకల్పం// గరిమెళ్ళ నాగేశ్వర రావు// మొన్న రాత్రివేళ హఠాత్తుగా మాయమైపోయిన వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెదుక్కుంటూ వుంటే... వేపచెట్టు కొమ్మల రెమ్మల్లోంచి పువ్వులై నవ్వుతూ కనిపించిందది. కోయిల గానం లోంచి వినిపించే ధ్వానం లోనూ చిగురుల వగరులని దానం చేసిన మామిడి కొమ్మ త్యాగం దాగుందట మొగ్గ తొడిగేవేళ మల్లె మొక్క మదిలో.. మన్మధుడు రధమెక్కి కదులుతూ మెదిలి ఉంటాడు.. అందుకే గమ్మత్తుగా మత్తెంకించే ఈ పరిమళం. తూరుపు కొండల లోంచి శిరసెత్తిన తొలికిరణం వేకువ దేహం మీద కాలం కానుకలా వెలిగే ఆభరణం మేఘం తో మేఘం తాకినప్పుడు మోగిన మోహన రాగమేదో మలయ వీచికతో కలిసి మంగళ గీతం పాడిందట ఊహా జనిత ఉత్ప్రేరకం లాంటి ఉత్సాహమే కదా ఉగాది అంటే! ఊహల ఉయ్యాల దగ్గర హృదయపు చెవి పెట్టి విను కొత్త శిశువు చెబుతుంది రేపటి ఉగ్గుపాల ఊసులు వసంతాన్ని స్వాగతిస్తూ తొలికోడి కూయగానే మొదలయ్యింది సంవత్సరం పొడవునా సాగాల్సిన జీవనోత్సవం. నోరు తెరచి స్వాగతించగానే ఆరు రుచులపచ్చడి ఆలోచనల లోలోపలికీ చేరి అరిగినట్టే ఉంది.. నవనాడులనూ శుద్ది చేసి జీవన యుద్ధానికి సిద్ధం చేస్తుంది. పంచాంగ శ్రవణంలో వినిపించే భవితవ్యం ఒక హెచ్చరిక రాజ్యపూజ్యమెదురైతే ఉప్పొంగి పొంగి పోకు అవమానం బెదిరిస్తే భయపడుతూ లొంగిపోకు మేషమైన సింహమైన, మిధునమైన మీనమైన రాశి ఫలం చెబుతుందట గంటల పంచాంగం రాశేదైన రాసిందేదైనా అసలు బలం నీలోనే ఉందన్నది యదార్ధం కందాయ ఫలంలో సున్నా ఎక్కడ ఉన్నా నీహృదయం లో దానిని చేరనీకు ఆగ్రహం పోయి గ్రహాలన్నీ అనుగ్రహాలించాలంటే చెయ్యాలి నువ్వొక దానం..నువ్వుల దానం కాదది అహాన్ని దహనం చేస్తూ 'నేను ని వదిలే దానం అది. మిత్రమా ఈ పండగవేళ మది మలినానికీ తలకడిగి కొత్తగా ధరించి మానవత్వాన్ని పట్టుదల వస్త్రంలా. శాంతి ఎప్పుడూ హోమగుండం లోచి పుట్టదు. అది ప్రేమ భాండం లోంచి పుడుతుంది. పదిమంది కలిసిన చోటే పండగ మొదలౌతుంది చిరునవ్వు పూసిన చోటే ఉగాది చిగురిస్తుంది . 30/3/2014
by Gvs Nageswararao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeNhn
Posted by Katta
by Gvs Nageswararao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeNhn
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి