పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జూన్ 2014, సోమవారం

సిరి వడ్డే కవిత

ll మా పల్లె లోగిళ్ళు ll తొలిపొద్దు పొడుపులోని బాలభానుని అరుణ కిరణాల అలికిడితో హొయలొలుకుతూ కరిగిపోయే తెలి మంచుపరదాల మాటున మా పల్లె అందాలు తెలతెలవారే వేకువలో గాలిపాడే సంగతులకు పులకరించే తరువులు చిగురుటాకులపై అలవోకగా జారిపోతూ మంచుముత్యాల సోయగాలతో మెరిసిపోయే పత్రాలు సుప్రభాతవేదికపై కువకువల మేల్కొలుపులు ముసిముసి నగవులనే విరులుగా అలంకరించుకునే సుమలతల పరిమళాలు పులకింతల గమకాలతో విచ్చుకుంటూ ముద్దు పూబాలలు పచ్చదనాల పానుపుపై ముత్యాల కూర్పులతో మురిసిపోతూ గరికపూల సోయగాలు స్వాతిచినుకుల చిరుజల్లులను హత్తుకుంటూ ధరణి మురిపాలు తూరుపుకనుమలనుండి తొంగిచూస్తూ దినకరుని దోబూచులు మంగళవచనాలతో శుభాలు పలుకుతూ గణగణ స్వరాలతో మ్రోగే కోవెలగంటలు మెళ్ళో గంటల రవళులతో పరుగులుతీసే బసవయ్యలు తెల్లారకముందే తట్టిలేపుతూ మా పల్లె తల్లి ఆత్మీయతలు అభిమానం, అనురాగం చిగురిస్తూ చిరునవ్వుల హేమంతాలు బంగారు పంటలతో తులతూగే హృదయాలు నిండైన హేమంతాలు మా పల్లెలోని ప్రతి ఇల్లు నిత్య వసంతాలు వచ్చీ పోయే అతిధులే మా పల్లెకు కదిలే ఆనందాలు ఝుమ్మంటూ యెదను మీటుతూ అల్లరి భ్రమరాలు కొలను నిండుగా పొంగి పూస్తూ చెంగలువ కుసుమాలు నీటి ముత్యాలతో సయ్యాటలాడుతూ తామరాకుల పరవశాలు చూరులవెంట జారిపోతూ వడివడిగా సాగిపోయే వాననీటి వయారాలు వానజాన కురులజాలువారే చినుకు ధారలను వడిసిపడుతూ మా ఇంటి మండువాలోగిళ్ళు తుళ్ళుతూ ముంగిట రంగవల్లులకు హరివింటి వర్ణాలను అద్దే మా పల్లె పడతులు ఆడుతూ పడుతూ వరి మడులను నాటుతూ మా పల్లె పాడే జానపదాలు ఆదమరచి నాగలి దున్నే రైతన్నలు, అలుపెరుగక చెమటోడ్చే కూలన్నలు పాడిపశువుల గుమ్మపాలు పంచుతూ గోపన్నలు మా పల్లె పడుచులాడే చింతపిక్కలు, సీతాదేవి వామనకుంటలు పచ్చని తోరణాలతో మా పల్లె పలికే మమతల స్వాగతాలు పసుపుగడపల శోభలతో మా పల్లె సీమలు పలికే ఆహ్వానాలు దేశ సౌభాగ్యానికే పట్టుగొమ్మలు పసిపాపల మారాలు, పల్లె తల్లుల అనునయాలు అంబరాన్ని అంటే పండుగల సంబరాలతో ఏకమయ్యే మా పల్లె మనసులు హైలెస్సా అంటూనే అలల పై సాగిపోతూ మా జాలరుల నావలు నవ వధువులను మెట్టినింటికి సాగనంపుతూ కనుమరుగైపోయే గూడుపడవల జాడలు తీయని జలాలతో ఊరి ఉరికి పొంగి పోయే బావి గట్టులు గ్రీష్మ తాపాన్ని చల్లబరుస్తూ ముంజెలు, కొబ్బరి బొండాలు అదృశ్య మైపోతూ మల్లె లాంటి స్వచ్చమైన పల్లెటూరి మమతలు కధలుగానే మిగిలిపోయే మా ఊరి ఏరువాకలు జ్ఞాపకాలై తడుముతూ గ్రామదేవతల జాతరలు నవసమాజానికి కనుమరుగై పోతూ పల్లెల సోయగాలు చరిత్రలోనైనా పాఠాలుగా మిగిలిపోయేనా పల్లెటూరి అందాలు? వీడిపోని బంధాలుగా మిగిలేనా మా పల్లెవాసుల మమతల కోవెలలు? ll సిరి వడ్డే ll 02-06-2014 ll

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYDMOw

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

పరావర్తనం ___________________________ అదొక్కటన్నా ఇక నిలుస్తుందని భ్రమపడ్డ ఏ నిముషం ప్రాణంతోలేదు. లేనప్పుడు చీకటనుకుంటాం కాని భళ్లున తెల్లవారినప్పుడు వెళ్లిపోయిన వెన్నెల్లా అదొక్కటి. కనీసం ఒదార్పుకైనా నేనుంటే బాగుండు నిలువునా ఒకరికోసం ఒకరు దోపిడవుతారుకానీ ఎక్కడో ఒకచిన్ననటన ఎవరిలోనొ చంపేస్తుంది ఆశగా బతికేస్తుంటాం గానీ కొలతపెట్టి గీసినట్టు నడకనిండా పేరాగ్రాఫుల్లా తెగిపడ్ద జీవితం ఆనిముషనికన్నా నేను మిగులుంటే బాగుండు నిలువుగా దహించడానికి నాకు నేను తప్పెవరుంటారు అప్పుడప్పుడు పచ్చదనంతోపాటు పశువులూ మరణిస్తాయి ఒకడికోసం ఆఒకడే కన్నీటి చుక్కైతేబాగుండు ఎదవనాటకం ఎన్నాళ్లుంటుందనీ నదులన్నీ మొత్తుకొనీ మొత్తుకొని ఎప్పుడో నోరుమూసుకుని పడిపోతాయి అప్పుడు కవిత్వమయ్యేందుకు కాఫీ తాగుతూ ఓ పేపర్ వార్త నిజంగా మనిషని చెప్పడానికి మ్యూజియంలోనన్నా ఒకడుంటే బాగుండు

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsc4Gt

Posted by Katta

Ravi Rangarao కవిత



by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u9etb1

Posted by Katta

Arcube Kavi కవిత

అద్దం ముందట నా తల్లి _______________________ఆర్క్యూబ్ సంకెల్లు తెగుతుండే నా తల్లికి ఎక్కడలేని సంతోషం ఏదో ఉన్నంతల భూమి పంచుడు తుర్తిగ తన బిడ్డలకు పాలిచ్చుడు సెర్ల సాపవుడు చెట్టు మీద పిట్టవుడు పాడి మందల పాటవుడు ఊళ్ళల్ల పొద్దు పొడుసుడు మూల మూలకు వీచే స్వేచ్చ అందరిండ్లలల్ల వెలిగే దీపం ఇగురం తళ్ళి ఇంతింతై ఎదిగే తల్లి ఇరాముంటదా చెయ్యి దుగేటట్టు శిక్షణ చిన్న పెద్ద పరిశ్రమలు ఏడీకాడ నీటి పారుదల అన్నిట్ల అడుగు ముందట సదువు ఇసురుక పోవుడు సర్వ రోగాలకు అగ్గి పెట్టుడు ఉద్యమం నడుముకు జెక్కిన కొడవలి చెమట చుక్కే నుదుటి బొట్టు తినేంత తిను ఇడిసి పెట్టద్దు మెతుకు కంచం పొంట పడద్దు -బతుకు సూత్రం నా తల్లి -తీరొక్క పూల పెద్ద బతుకమ్మ తీరు తీరు కళల్ల కొలువైన దేవత రాక పోకల సాగిస్తది రాజీర్కాన్ని వాకిట్ల నిలిపి సలాం గొట్టిస్తది ఏన్నైన నేగులుద్ది దేన్నైనా సాధిస్తది తన బాసల ఎలుగుతది తన బిడ్డల త్యాగం నిలుపుతది (తెలంగాణ ప్రకటనకు ముందు రాసిన కవిత )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4sXpM

Posted by Katta

Rambabu Challa కవిత

ఫలిత కేశం/ Dt.2-6-2014 నీజన్మ సార్ధకత ఏమిటని ఐదుపదుల వసంతాల్ని చూసిన మానవుడ్ని అడిగింది తొలిసారి తొంగి చూసిన ఫలిత కేశం ఏం చెప్పను? ఏమని చెప్పను? బాల్యం వెట్టిచాకిరీలో గడిచిందనా? కౌమారం కొంగ్రొత్త ఆశల పల్లకిలో ఊరేగిందనా? యవ్వనం విచ్చలవిడి శృంగారాగ్నిలో శలభమైందనా? ప్రౌఢం అక్రమార్జన వలలో చిక్కుకుందనా? ఏం చెప్పను? ఇంకా కోరికలు మిగిలిపోయాయని ఎలాచెప్పను? పదవికోసం పైరవీలు సాగిస్తున్నాని సంపన్నుల్లో సభ్యుడ్ని కావాలని విదేశాల్లో వైద్యం పొందాలని కులాసాగా విలాసాల్లో తేలాలని అన్ని అవకాశాలు కల్పించమని కోరికల చిట్టా విప్పాడు అందుకే జీవితకాలాన్ని పెంచమని దేవుడ్ని కోరుకుంటున్నాననీ చెప్పాడు అది విన్న ఫలిత కేశం నవ్వింది... తిమిరాన్ని తరిమిన వెలుగులా అజ్ఞానాన్ని బాపిన జ్ఞానిలా నీవున్నావనుకుని వెలిశానంది శేష జీవితాన్ని దేశ సేవలొ, క్రాంతి సేనలో శాంతివనంలో గడపమంది నా అవసరం నీకు లేదంది వెంటనే రాలిపోయింది.

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1onC8Ru

Posted by Katta

Sai Padma కవిత

తెలంగాణా కోసం, బలిదానం చేసుకున్న పిల్లల కోసం ఎప్పుడో రాసుకున్న కవిత .. తెచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు , మూలస్తంభాల్లా నిలబడి సాధించిన యువకులు .. ఇవాళ ఉద్యమం , రాజకీయంగా మారిన తరుణంలో వాళ్ళే గుర్తొస్తున్నారు .. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నారు ..!! మేరె దిల్ కే టుక్డా ....భద్రం !! ఎందల కెల్లి ఎట్ల సచ్సిన్రో తెలీలా.. పోరగాండ్లు మల్ల తెలంగానం తెరపైకి తెచ్చిన్రు.. పాత గానమే.. ఎన్ని సార్లు లొల్లి పెట్టి శురూ చేసిన.. చెవిటోడి ముంగట ధన్కా బజాయించినట్టే.. సురూ చేస్తే చేసిన్ర్లు. వచ్చే టోల్లు సక్కంగున్ర్లు.. పోయే టోల్లూ చల్లన్గున్రు.. అట్లేల్లి సూసి రాండ్రి పిలగా౦డ్లారా. ఆంధ్ర అంత బాగున్నారు.. హైదరాబాద్ల మంచిగున్రు . ఆల్ల అస్తులల్ల రంగు రంగుల పాగాలు సుట్టి ఆల్ల బిల్డింగులు పతంగుల్లా పైకి లేస్తున్నాయి కొడకా.. సక్కంగా సదూకొని పొగ సూరిన తల్లుల జిందగీలు బదలయిస్తరంటే ఇట్ల దెబ్బలు తిన్నవేంది కొడకా.. ఇరుపక్కల ఆద్మీలతో చేసేది.. ఉద్యమంరా కొడకా.. బద్నాం మనసులతో కాదు.. నువ్వు జై ఆంధ్రా అను.. జై తెలంగానమను.. నువు సావకురో బిడ్డా వాళ్లకి ఫరక్ పడదు.. మాకు జిందగీ లేదు.. తెలంగాణా వస్తది అపుడు సూసుకునేందుకు నువ్వుండాలే కదా బిడ్డా !! బిడ్డ లేని గొడ్డుదాన్ని సేయ్యకురో ఈ యమ్మని మండిన మన మట్టి మనకి దక్కక ఏడ పోద్ది పోరు సెయ్యి పానాలు మాత్రం జర భద్రం కొడుకో ఈ అమ్మ దిల్ కి టుక్డా నని యాద్ మరవకు !! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wUhle5

Posted by Katta

Rasoolkhan Poet కవిత

*తను* పుడుతూనే ఎండిన హృదయాలలో కొత్త చిగురులు పూయిస్తుంది తగ్గుతూ విస్తరిస్తూ ఎన్నో ఎత్తుపల్లాలు దాటి బీళ్ళలో పచ్చదనం పరుస్తుంది ఓర్పుగా నేర్పుగా కదులుతూ ఎందరికో ఆశాదీపం అవుతుంది తనుమాత్రం ఒంటరిగా తీరం చేరుతుంది సముద్రుడి(మగాడి)కి బ్రతుకునిస్తుంది. రసూల్ ఖాన్ 2-6-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wU3Afv

Posted by Katta

Chi Chi కవిత

_సంస్కరణ_ నిలువెత్తు కొలువే సాక్ష్యంగా కొలతలొదిలిన యోచనేదో కొలుస్తోంది చదరాన్ని!! వైపులెన్నైనా చూపొకటిగా లోతులన్నిటినీ చదునుగా రాతలెరుగని చదువుగా !! మలుచుకోమని మనసునేసి వెంబడిస్తూ మనసుతోనే ఉంది లేదుల తర్కమహిమను దాటుకెళ్లే దారికాచి వదిలిపోయాయ్ జంటపక్షులు ఒక్కటై నా నేనుతో!! సాక్షి కూడా కాను ఇప్పుడు సదరమైన ఈ సృష్టిలో మరుపు వరమై స్థితిని మార్చే యోచనెందుకు మనిషిలో ?? ____________________________(2/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rCsvEc

Posted by Katta

Krishna Mani కవిత

పూర్ణానందం _______________కృష్ణ మణి మేఘాల మాలలో మెరిసే వెండికొండల జాతర ఎత్తులో రారాజు ఎవరెస్టు కాక ఇంకెవరు ఎవరెస్ట్ ను మించిన అహంభావం మన సొత్తు ఎక్కనా ఆ కొండ ? భూలోకాన్ని శాషించే సూర్యున్నై పెట్టనా ఆ అడుగు ? అని కలలు కన్నా కనులెన్నో ! ప్రపంచమే తొంగి చూసిన క్షణం పెట్టిన అడుగు పట్టిన జెండాను చూసిన మదిలో పొందిన ‘పూర్ణానందం’ అంతా ఇంతా కాదు సుమీ ! హిమ శిఖరం అ ఎత్తు జీవితంలో మరో ఎత్తు ఎదిగిన కొద్ది ఒదిగే గిరిజన గులాబీలు మన తెలుగు బిడ్డల సాహాసానికి ఆరంభం మా చావుకు మేమేకారణం అని చేసిన సంతకం తిరిగొచ్చిన క్షణాన కన్న కడుపులు పొందిన ఆనందసాగరం ! Krishna mani I 02-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p0qQnA

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || బెర్లిన్ గోడ..!! || బెర్లిన్ గోడలో కప్ప..!! ఎన్నాళ్ళయిందో పాపం ... గోడా కూలింది జాడా మారింది .... గొర్రెలన్నీ తుర్రుమన్నాయి పాపం కప్పకు మాత్రం స్వేచ్చ వచ్చినా నీళ్ళున్న బావుల్లేక తల్లడిల్లుతుంది!! వెర్రిజనాలు అసలు విషయం మర్చేపోయారు ...? కారు చీకట్లో దొంగలు మాత్రం వెలుగు రవ్వల్ని ఉరేస్తూనే ఉన్నారు !! పిరికి పందల మందలకు కాపర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు ! దూకడానికి గోడల్లేవు మేయడానికి చేలూ లేవు ? ఎడారి రాజ్యంలో ఎండమావుల వెంట కొరిజీవునం ఉన్నంత కాలం ఉరుకుడే ... గిదేం బ్రతుకురా దేవుడా ...ఎంతకాలం ??! --------------- 2-6-14

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXGiBf

Posted by Katta

Abd Wahed కవిత

అపరిచిత... గమ్యంపై నడుస్తూ నడుస్తూ చివరకు అపరిచితులమైపోయాం.. మరోసారి పరిచయం పెంచుకోడానికి ఎన్ని మౌనాలు మరణించాలో మైత్రిగంగ ప్రవహించాలంటే ఏ భగీరధుడు రావాలో? మచ్చలేని పచ్చదనం చినుకులను ప్రసవించే మబ్బులు మిగిలాయా? ఈ రక్తపు మరకలు కడగాలంటే ఎన్ని వానల్లో తడవాలో... మంచుగడ్డగా మారిన ప్రేమ వడగళ్ళవానే... నడుం విరిగిన బంగారు కంకులు... పంటపొలం పచ్చచీర కట్టుకునేదెప్పుడో... నగ్నంగా ఉదయించింది పగలు పెదాలపై సువాసనలేని కాగితం నవ్వులతో సరే, ప్రేమించడానికి కావలసింది దేహమే కదా... దుస్తులొదిలిన తర్వాత సిగ్గు సుగంధాలుండవులే... మెరుపుల్లేని మట్టిలాంటి ఆత్మవాసన దొరికేదెప్పుడో? ఓడిపోయే ముందు గుండెకు ఒక్క ఊపిరి దొరికినా బాగుండును కొన్ని నిందలు, మరికొన్ని రోదనలు, ఇంకొన్ని వేదనలు గుప్పెడు పూలు, దోసెడు ముళ్ళు పంచుకునేవాళ్ళం కదా... ఏవేవో చెప్పుకున్నాం ఏదో చెప్పాలని కలుసుకున్నాం దశాబ్ధాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇద్దరమూ మాట్లాడుతున్నాం ఎవరమూ వినలేదు... మాటలు కరిగిపోతే మౌనం గడ్డకట్టింది చెప్పాలనుకున్నది వినబడనే లేదు... సరే, ప్రేమ నుదుటిపై బాధలే కదా... మరోసారి చరిత్ర మొదలెడదాం...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mITAyF

Posted by Katta

Pranayraj Vangari కవిత



by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gXvlPn

Posted by Katta

Kapila Ramkumar కవిత

కవిస్వరం: నిర్మలారాణి తోట కవిత అమ్మ గురించి రాయని కవి బహుశా ఉండకపోవచ్చు. నాన్న గురించి రాసిన కవితలు కూడా ఉన్నాయి. అయితే, భౌతిక ప్రపంచంలోనే కాకుండా మానసిక ప్రపంచంలో కూడా సర్వనామంగా తండ్రి పీడితుడిగా గుర్తింపు పొందాడు. పురుషస్వామ్యాన్నికి ప్రతీకగా తండ్రి విగ్రహం రూపు దిద్దుకుంది. అవును నిజమే, పురుషాధిక్యాన్ని ఎదిరించాల్సిందే, నిరసించాల్సిందే. కానీ, తండ్రి భుజాల మీద ఎన్ని బరువులూ బాధ్యతలూ ఉన్నాయనే విషయాన్ని పట్టించుకున్నవారు తక్కువ. ఆ బరువును మోయడంలో అతను పడే యాతన చెప్పనలవి కానిది. పురుషుడు ఏడ్వకూడదు, కన్నీరు కార్చకూడదు. ఈ సమాజం పెట్టిన ఆంక్ష. ఆ ఆంక్ష అతన్ని కరుగుగట్టిన విగ్రహంగా తయారు చేసిందా, ఓదార్పునకు కూడా నోచుకోని వ్యధాభరితుడిని చేసిందా అనే ఆలోచించడానికి నిర్మలారాణి తోట రాసిన కవిత అవకాశం కల్పిస్తున్నది. ఒక మహిళ తండ్రి గురించి ఆర్ద్రమైన కవిత ఇది. తండ్రి పట్ల సానుభూతి, సానుకూలత కనబరిచే కవితాభివ్యక్తి ఇది. కవిత అతి సాధారణంగా కనిపిస్తున్నది. కానీ, అందులోని ఆర్ద్రమైన భావనలు మంచి కవితగా రూపుదిద్దాయి. పురుషుడికీ మనసు ఉంది, పురుషుడికీ ప్రేమ ఉంది అని తెలియజెప్పే కవిత. నాన్నలందరికీ ఆమె సమర్పించిన కవిత ఇది. "కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి/ ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి/ కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..!" అనే వాక్యాల సారాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అది అనుభవానికి అందుతుంది. ఇలాంటి కవితాత్మకమైన వాక్యాలు ఈ కవితలో చాలా ఉన్నాయి.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khhqV2

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

తెలంగాణ భాగ్య గీతి రచన : డా. ఆచార్య ఫణీంద్ర ‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్! అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!! నా ‘తెలంగాణ’ కోటి రత్నాల వీణ సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన - అమరులైన వీరుల ఆత్మ లందె శాంతి! మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!! నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై ఆకాశమంత ఎత్తార్చినాను - నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి పద్యాలు గొంతెత్తి పాడినాను - నే దాశరథి కవి నిప్పు లురుము గంట మొడుపులన్ కొన్నింటి బడసినాను - నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై పద్య ప్రసూనాల పంచినాను – ఐదు కోటుల సీమాంధ్రు లందరికిని మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి, మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ - పాడినాను తెలంగాణ భాగ్య గీతి! శ్రీలంగూర్చగ దివ్య ‘భద్రగిరి’పై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ - ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ - ‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ - మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్! యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు! – డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2L0g6

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1khhqV2

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khhqV2

Posted by Katta

Upendram Pullakhandam కవిత

జై తెలంగాణా ( 02-06-2014 తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావ సందర్భాన ) గోదారి నడకలతో కిష్టమ్మ ఉరుకులతో మంజీరా నాదం తో మా ఊరి కొచ్చింది // జై తెలంగాణా జై జై తెలంగాణా // నల్లా బంగారంతో నిండి నడి రేయి వెలుగు నిస్తూ తెల్ల బంగారం తో నిండి తెలుగు నచ్చంగా నేర్పే // జై తెలంగాణా జై జై తెలంగాణా // గోల్కొండ ఖిలా నీది ఖమ్మం మెట్టు ఖిలా నీది ఓరుగల్లు కోట నీది ఇందూరు కోట నీది // జై తెలంగాణా జై జై తెలంగాణా // భద్రాద్రి రామన్న ధర్మపురి నరసన్న కొండ గట్టు అంజన్న గార్లా వెంకన్న // జై తెలంగాణా జై జై తెలంగాణా // బతకమ్మ పాట పాడి పాల పిట్టను చూస్తూ పటాకులూ కాలుస్తూ సంకురాత్రి ముగ్గులతో ఉగాది పచ్చడి తో ఏడంత పండుగలే // జై తెలంగాణా జై జై తెలంగాణా // పాలమూరి చాపేసి ఘట్కేసరి కంబలేసి పోచంపల్లి చీర కట్టి పట్నాపు అత్తరు పోసి నీకు పూజ చేస్తామే // జై తెలంగాణా జై జై తెలంగాణా // రచన ; పుల్లఖండం ఉపేంద్రం , సాంఘీక శాస్త్రోపాద్యాయులు , తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకులం ,అల్వాల్ , మెదక్ ,జిల్లా , తెలంగాణా రాష్ట్రం .

by Upendram Pullakhandam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4IEd9

Posted by Katta

Maddali Srinivas కవిత

వందనం! అభివందనం//శ్రీనివాస్//02/06/2014 --------------------------------------------------------------------------------- తల్లిని కన్న బిడ్డలకు వందనం బిడ్డలను గాచుకునే తల్లికి అభివందనం అమ్మా తెలంగాణమా! తమ ప్రాణాలను నీ వూపిరిగా చేసి, తమ తనువులను నీ కునికిగా మార్చి, తమ రక్తం, తమ స్వేదం నీ కర్పించి తమని తాము బలి గావించుకోని నిన్ను కన్న నీ బిడ్డలకు వందనం! అమ్మా తెలంగాణమా! నీ వునికిని చలువ పందిరి చేసి నీ కనుల వెలుగు అందరికీ సమంగా పంచి నీ గుండెలో పుట్టు అమృతాన్ని అందరికీ అందించి నిన్ను కన్న నీ బిడ్డల ఋణం తీర్చుకో

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rAXHno

Posted by Katta

Padma Bikkani కవిత

|| అసంపూర్ణ చిత్రం || నిగూఢమైన ఆలోచనలనుంచి జనించిన భావాలు హృదయపు కాన్వాస్ పై గజిబిజి చిత్రరేఖలుగా రూపుదిద్దుకొని ఇమిడి ఇమడని భావాలతో ఓ పికాసో చిత్రంలా, తెలిసితెలియని ఆవేధనలా .... తర్కానికి అందని రోధనలా అరణ్యంలో ఓచోట రాజుకొంటున్న దావానలంలా ఎగిసి పడుతుంది... గుప్పిట బిగించిన అరచేతిలో గీతల్లా, రూపం పోల్చుకోని యాతనలా అచ్చులు హల్లులకి తర్జుమా చేయలేని ప్రకంపనాల్లా.., ముడతలు పడ్డ శరీరంలో వణుకు గీతల్లా రూపాన్ని మారిపోయి జాలిగా చూస్తున్నాయి.... కంటిపోరలలో నీరు తోణికిసలాటకు జీవం కోల్పోయిన ఆకారంలా భాషల లిపిలో ఏరూపంలో దాగక ఉడిగిన జవసత్వాలా నిశబ్ధరోధనై మూగపోతుంది..... గుప్పిట బిగిసిన గీతలు వృద్దాప్యంలో ముడుచుకు పోతు చిట్ట చివరి మజలీల్లో వైవిద్యభరిత శోధనకు నా జిజ్నాసకు అందని పదాలుగా నన్ను వెలివేస్తున్నాయి....!! భావాలకు అనుభవాలల్లి క్రమబద్ధికరించితేనే నీకు నువ్ గీటురాయివి అవుతావు అని వెక్కిరిస్తున్నాయి....!! కానీ, అంతర్మదనంలో అక్షరాలు ఉప్పొంగే అలల్లా నెగ్గటం రాక మళ్ళీ సంద్రంలో సబ్ధువుగా వెనతిరిగి ఓడి నెగ్గటానికి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ ఓటమి చేరువని దరిచేరుతున్నాయి ఎప్పటికి నెగ్గని నాలో భావుకునిలా... నా అన్వేషణ అక్షరమై,.... ఆ అక్షరానికి అసంపూర్ణచిత్రంలా వేళ్లాడుతూ మిగతా చిత్రాన్ని గీస్తూ పోతున్నాను ఈ అసంపూర్ణ చిత్రాన్ని సంపూర్ణం చేసేందుకు....!! 2 june14

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK9h6d

Posted by Katta

Kapila Ramkumar కవిత

ముళ్లచెట్టుకు పూచిన సుమం Posted on: Mon 02 Jun 00:16:12.837902 2014 తెల్లవారి భావాల్ని మధించి, ధిక్కరించి, జీవిత అనుభవంతో వచ్చిన అనుభూతుల్ని అక్షరాల్లోకి వంపి ముళ్లకంపకు పూసిన సాహిత్య కుసుమం ఆమె. అననుకూల సమయంలో రైతు సేద్యం చేసినట్లు రక్తమోడుతున్న తన జీవితంలోంచే కవిత్వం రచిందామె. బాల్యంలో ఊహించని అనుభవాన్ని చవిచూసినా మానవత్వాన్నే వెదజల్లిన దయార్ద్ర హృదయురాలు ఆమె. జీవితంలో అనేక మలుపులు తిరిగి, కూటికోసం వేశ్య అయిన ఆమె. ఆ పరిస్థితుల్లో ఉండీ కవిత్వం రాయడం గొప్ప విషయమే కదా! ఆమె ఈ నెల 28వ తేదీన మన మధ్య నుంచి మాయమైపోయింది. ఆమె 'మాయా యాంజిలౌ'. మాయా యాంజిలౌ 1928, ఏప్రిల్‌ 4వ తేదీన సెయింట్‌ లూయిస్‌లోని మిస్సోరీలో జన్మించారు. ఆమె అమెరికాకు చెందిన నల్లజాతీయురాలు. ఆమె జీవితాన్ని స్పృశిస్తే రచయిత్రిగా ఎదిగే వాతావరణం ఉందా అనిపిస్తుంది. కానీ ఆమె తన చివరి క్షణాల వరకూ ఎంతో ఉత్సాహంగా కవిత్వాన్ని రచించారు. ఆమె ఓ రచయిత్రీ, కవయిత్రీ, జర్నలిస్టు, గాయనీ... ఇలా చాలా పాత్రల్లో తనను తాను ఒంపుకున్నారు. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తన తల్లి స్నేహితుని చేతిలో ఘోరమైన అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన తర్వాత ఆమె దాదాపు ఐదేళ్ల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె మేనమామలే హత్య చేశారని తెలిసి మరింత మూగవోయింది. 'నేనింకెప్పుడూ మాట్లాడదల్చుకోలేదు. నేను చెప్పటం వల్లనేగా మా వాళ్లు ఆ అబ్బాయిని చంపేశారు. ఇక నేనెప్పుడు నా నోరు విప్పను. బహుశా, నేనే అతన్ని చంపేశానేమో, ఇక నేనేం మాట్లాడినా అది ఎవర్నో ఒకర్ని చంపుతుందేమో!' ... ఇవీ, ఆమె అతడి హత్య గురించి తెలిశాక రాసుకున్న వాక్యాలు. మాయా తన 86 ఏళ్లలో ఏడు ఆత్మకథల్ని రాసుకున్నారు. చరిత్రలో ఎవరూ ఇన్ని ఆత్మకథలు ఇప్పటివరకూ రాసుకోలేదేమో! ఇది అందర్నీ అబ్బురపరిచే విషయమే. ఆమె రాసిన వ్యాసాలతో మూడు పుస్తకాలు, బోలెడన్ని కవిత్వ సంపుటాలూ వెలువడ్డాయి. నల్లజాతీయులందరిలానే ఆమె కూడా తిండికి నకనకలాడింది. అందుకు ఏ పని చేయడానికీ ఆమె వెనుకాడలేదు. ఆఖరుకు వేశ్యా గృహపు కార్యనిర్వహణాధికారిగా, వేశ్యగా, రాత్రి క్లబ్‌ డ్యాన్సర్‌గా పని చేశారు. వంటమనిషిగా కొన్ని క్రిస్టియన్‌ సంస్థల్లో పనిచేశారు. జర్నలిస్టుగా, నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా .... ఇలా బహుముఖ ప్రజ్ఞగా ప్రవహించారు. అనేక చిత్రాల్ని, టెలివిజన్‌ కార్యక్రమాల్ని రూపొందించారు. 1982లో ప్రొఫెసర్‌గా జీవితం మొదలైంది. ప్రజల హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. నల్లజాతీయ మహిళల గొంతుకగా పేరొందారు. తన జీవితంలో ముగ్గురిని వివాహమాడింది. ఆమె 'ది పర్పిల్‌ ఆనియన్‌'లో నాట్యం చేస్తున్నప్పుడు పరిచయమైన వాళ్లలో టోష్‌ ఏంజెల్స్‌ ఒకరు. అతనితో కలిసి ఆమె మరిన్ని డ్యాన్స్‌లు చేసి, చివరిగా కాలిప్సో డాన్సర్‌గా స్థిరపడ్డారు. డ్యాన్సర్‌గా అనేక ప్రదర్శనల అనంతరం ఆ వృత్తి నుంచి విరమించుకున్నారు. 1959లో నవలాకారుడు జేమ్స్‌ ఓ.కిల్లెన్స్‌ని కలిశాక ఆమె జీవితం మరో దశ తిరిగింది. అతని ప్రభావంతో ఆమె నవలలు రాయటం ఆరంభించారు. ఆ ప్రక్రియలో విజయం సాధించారు. 1970లో ఓప్రా విన్ఫ్రే పరిచయమయ్యాక ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. 1973 లో పౌల్‌ డ్యూ ఫ్యూతో మళ్ళీ పెళ్లి అయ్యి, 1981లో విడాకులు అయ్యాయి. ఆ ఏడాదే (1981లో) ఆమెకి వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమెకో అరుదైన అవకాశం లభించింది. అది ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె తన కవితను వినిపించటం. అదీ, ఓ నల్ల జాతీయురాలు. ఆమెని ఆహ్వానించింది కాబోయే అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌. ఆమె తన కవిత నిఉఅ ్‌ష్ట్రవ ూబశ్రీరవ శీట వీశీతీఅఱఅస్త్రు చదివారు. 1961 తర్వాత జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ప్రమాణ స్వీకారోత్సపు సభలో రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చదవడం మొదలైతే, తర్వాత అలా చదివే అవకాశం వచ్చింది మాయాకే. బారక్‌ ఒబామా అమెరికా అధ్యక్షులయ్యాక ఆమె ఇలా అంది : నిఔవ aతీవ స్త్రతీశీషఱఅస్త్ర బజూ bవyశీఅస ్‌ష్ట్రవ ఱసఱశీషఱవర శీట తీaషఱరఎ aఅస రవఞఱరఎు. మాయా యాంజిలౌను 2011లో బారక్‌ ఒబామా 'ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌' తో సత్కరించారు. ఆమె ఓ ఉన్నతికి ఎదిగాక ప్రంచంలోని ముఖ్య సంస్థలన్నీ ఆమెని గౌరవించి, తమకి తామే గౌరవాన్ని ఆపాదించుకున్నాయి. ఆమెకు 30 పైగా గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. గత ఏడాది దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్‌ మండేలా మరణించినప్పుడు ఆమె రాసిన కవిత, నినఱర ణay ఱర ణశీఅవు . ఆమె చివరి కవిత కూడా అదే! 'స్వేచ్ఛ పిట్ట గాలి వీపునెక్కి ఎగురుతూనే ఉంటుంది. కిందకు తనను తాను దింపుకుంటూ గాలినెదిరిస్తూ సూర్య కిరణాల నారింజ రంగుల్లో తన రెక్కల్ని విప్పార్చుకుంటూ ఆకాశం నాదేనంటూంది...' అనే కవిత ఆమె ప్రతీకలకో మచ్చుతునక. ఇది 1969లో ప్రచురితమైంది. అదే ఆమెను మొదటిసారి వెలుగులోకి తెచ్చింది. ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ ఆ స్థాయిలోకి రావడం అరుదైన విషయమే! ఆమె సాహిత్య ప్రస్థానం 1969లో మొదలై ... చనిపోయే వరకూ అంటే 2014 వరకూ కొనసాగింది. ఆమె రచనలన్నీ ఆంగ్లంలోనే సాగాయి. ఆమె జీవితంనిండా ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ఆమె ముందుకే సాగింది. నిరాశా నిస్ప ృహ నిస్సత్తువా ఎక్కడా ఆవరించకుండా ఇంతింతై ఎదిగింది. వివక్షకు, అణచివేతకు వ్యతిరేకంగా సాహిత్య కేతనమై సగర్వంగా ఎగిరింది. ఆమె జీవితం, సాహిత్యం రెండూ వేర్వేరు కాదు.. అవి రెండూ స్ఫూర్తిదాయకాలే! పరిస్థితులు సానుకూలంగా లేవని చెప్పి, రచనలు చేయకుండా తప్పించుకునేవారు రాయడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి. - శాంతిశ్రీ 98663 71283http://www.prajasakti.com/mm/20140602//3.jpg.1401668167

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wQlQXb

Posted by Katta

Kapila Ramkumar కవిత

పర్యావరణ కవయిత్రి ప్రజాశక్తి - సవ్వడి -Posted on: Mon 02 Jun 00:09:57.651484 2014 ఇటు కవిత్వపు లోతుల్ని, అటు ప్రకృతి ఔన్నత్యాన్ని గ్రహించి జీవితాన్ని ఒక తాత్విక దృక్పథంతో అవలోకించిన మళయాల కవయిత్రి సుగతా కుమారి. ప్రకృతి - మానవుల సంబంధాన్ని కవిత్వీకరించిన కవయిత్రిగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడిన కార్యకర్తగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. నిబద్ధత, నిజాయితీ ఆమె వ్యక్తిత్వంలో ప్రధానాంశాలు. వాటిని ఆమె, ఆమె తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. సుగతాకుమారి 1934 జనవరి 3న బ్రిటిష్‌ ఇండియాలో పుట్టారు. తండ్రి బోధేశ్వరన్‌ గొప్ప కవి, స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన కూతురిగా ఆమె అనేక విషయాలు బాల్యంలోనే నేర్చుకున్నారు. దేశభక్తి, జాతీయభావన, నిర్భయత్వం ఆమె రక్తంలో ఇంకిపోయాయి. తల్లి ప్రొఫెసర్‌ వి.కె.కార్తియాయని.. సంస్కృత పండితురాలు, పరిశోధకురాలు. అందువల్ల తల్లి నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకున్నారు. సంస్క ృతి - సంప్రదాయాల పట్ల గౌరవం, జీవితంలో విలువల్ని నిలుపుకోవడం వగైరా సుగతా కుమారి తల్లి నుంచి స్వీకరించారు. భర్త డాక్టర్‌ కె.వేలాయుధన్‌ ఎడ్యుకేషన్‌ సైకాలజీ నిపుణుడు, అరవిందో ఫిలాసఫీ నమ్మినవాడు. అక్క హృదయకుమారి కూడా రచయిత్రే. ఆమె కూడా కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతే. కాల్పనికత మీద ఆమె కృషి చేశారు. ఈ విధంగా సుగతా కుమారికి గొప్ప కుటుంబం లభించింది. కవయిత్రిగా, పర్యావరణ కార్యకర్తగా ఆమె ఎదగడానికి కుటుంబ నేపథ్యం ఎంతో ఉపయోగపడింది. మొదటిసారిగా 1957లో ఆమె ఒక వారపత్రికలో కలంపేరుతో కవిత ప్రచురించారు. ఆ తర్వాత రచనల వేగం పెరిగింది. సున్నితమైన తాత్వికాంశాలు అక్షరబద్ధం చేయనారంభించారు. క్రమంగా ఆమె కవిత్వంలో ఉద్రేకం, బిగువైన పదాల అల్లిక, భావస్ఫోరకమైన పదబంధాలు, సరళత, ప్రవాహవేగం కనిపించసాగాయి. 'పటిరప్పుక్కళ్‌'కు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 'రాత్రిమజ్జా' (రాత్రివర్షం) సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య ప్రవర్ధక అవార్డూ లభించాయి. 'అంబాలమణికల్‌'కు ఒడక్కుజాల్‌ అవార్డు, ఇడుత్తచ్చన్‌ పురస్కారం మాత్రమే కాక ఆశాన్‌ అవార్డు, వలయార్‌ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ వగైరా ఎన్నో లభించాయి. సుగతాకుమారి ప్రకటించిన తన అన్ని సంపుటాలకు కవితా ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమైనవి చెప్పుకోవాలంటే 'ముతుచిప్పి' (ముత్యపుచిప్ప), 'ఇరుల్‌ చిరకుకల్‌' (చీకటి రెక్కలు) 'స్వప్నభూమి' 'పథీర్‌ అప్పూుకల్‌' (అర్ధరాత్రి పూచే పూలు), 'పావం - మానవ హృదయం' (పాపం! మానవ హృదయం) మొదలైనవి. సుగతాకుమారి ఎన్నో అనువాద రచనలు కూడా చేశారు. బాల సాహిత్యంలో ప్రత్యేకంగా కృషి చేశారు. 'తలిరు' అనే పిల్లల పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగరీత్యా కేరళ రాష్ట్ర - జవహర్‌ బాలభవన్‌కు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కొంతకాలం కేరళ రాష్ట్ర మహిళా సంక్షేమ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ కాలంలోనే దగా పడిన మహిళలకు రక్షణనిచ్చే సంస్థ 'అభయ'ను తీర్చిదిద్దారు. మానసికంగా దెబ్బతిన్న వారికి కేర్‌ సెంటర్‌ ప్రారంభించారు. 1955లో తన 21వ ఏట ఫిిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్న సుగతాకుమారి, తిరువనంతపురం మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. తిరువనంతపురంలోనే స్థిరపడి, అక్కడే ఉద్యోగం చేసి అక్కడే పదవీ విరమణ కూడా చేశారు. ఈమెకు ఐదారు భారతీయ భాషలతో బాగా పరిచయం ఉంది. ఇవన్నీ కాక తిరువనంతపురంలోని ప్రకృతి సంరక్షణ సమితి (సొసైటీ ఫర్‌ కన్వర్షన్‌ ఆఫ్‌ నేచర్‌)కి సెక్రటరీగా ఉన్నారు. జనంలో ఒక అవగాహన, చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆమెకు 'ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు' - 2003 లభించింది. దానితో పాటు సామాజిక సేవకు గుర్తింపుగా 'లకిë అవార్డు' కూడా లభించింది. భాతర ప్రభుత్వం 2006లో పద్మశ్రీ అవార్డుతో, 2012లో కె.కె.బిర్లా ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మకమైన 'సరస్వతీ సమ్మాన్‌'తో సత్కరించాయి. బహుముఖాలుగా సాగిన సుగతాకుమారి జీవితం, సాహిత్యం మళయాళ ప్రజలకు మాత్రమే కాదు, భారతీయులందరికీ ఆదర్శప్రాయమే! - డాక్టర్‌ దేవరాజు మహారాజు http://ift.tt/1wQ872o

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wQ872o

Posted by Katta

Buchi Reddy కవిత

06-02-2014 *****జై జై ర తెలంగాణా--- తెలంగాణా వచ్చింధీ---కాళోజీ గారు-- జై శంకర్ గారు--- జనార్ధన రా వు గారు you--- leaders plant the seed----మీ కళలు నిజం అయ్యాయి--- దీవించండి---మళ్లీ పుట్టండి ***** ఎన్ని ఏ౦డ్లు ఎన్ని మోసాలు ఎన్ని కమిటీ లు ఎన్ని వొప్పంధాలు ఎన్ని మా య ముచ్చట్లు ఎన్ని పొత్తులు-- ఎత్తులు-- జిత్తులు ఎన్ని రాజకీయాలు అడుగడుగునా అడ్డంకుల తో అన్యాయాల తో ఆ ల మ టి స్తూ ఏడుస్తూ బేజారు అయిపోతూ ఆంధోలన పడుతూ---చివరికి జై తెలంగాణా సాదించాం కా ళోజీ గారు జై శంకర్ గారు జనార్ధ న్ రా వు గారు-- you-- leaders--- plant the seed మిమ్ము ల్ని నమ్ముకుంటూ ఎన్ని ఉద్య మాలు ఎన్ని రాస్తా రోకులు ఎన్ని బ౦ధ్ లు ఎన్ని నిరాహార ధీ క్ష్ లు ఎంధరో అమరవీరుల త్యాగ ప ల ౦ నాలుగున్నర కోట్ల ప్రజల గుండె చప్పుళ్లు--నమ్మకం పట్టుధలతో KCR గారి నిరంతర కృషి తో విముక్తి విడాకులు స్వాతంత్రం వచ్చింధీ జై తెలంగాణా వచ్చింధీ జహాయో జై జై తెలంగాణా అన్న లూ--అక్క లూ రయితన్నాలూ---ఉద్యోగులు విధ్యార్థులు-- మేధావులు--- కవులూ-- మీ పోరాటం మీ బాట మీ పాట మీ కేకలు మీ తి రుగుబాటు ప లితం--- జై తెలంగాణా--- కోటి రత్నాల వీణ మన నమ్మకం--- మన ఆశయం మన కళలు--- నిజం అయ్యాయి విప్లవాల పుట్టినిల్లు ధో డి కొమురన్న--- ఐ లమ్మ---కొము ర౦ బీ౦ రావి నారన్న---ఆరుట్ల ధంపతులు పోరాటం-- మన ఊపిరి తిరుగుబాటు -- మన ఆయుధం వాళ్ళు చూపిన వెలుగు బాట లో-- పోరాడి తుధి విజయం ఎప్పుడు అయినా--ఎన్నడు అయినా మన ధె--- ఇప్పుడు మనకు కావలిసింధీ ఐ క్య త--- సమానత్వం కులమతాల పట్తింపులు వద్దు ప్రజాసామ్యం సామాజిక న్యాయం సామాజిక తెలంగాణా బంగారు తెలంగాణా గా నిలబెట్టుకుందాం---పాటు పడుధా౦ కలిసి కట్టుగా ముంధుకు సాగుదాం భాద్యత మన ధీ పాలన మన ధీ రాష్ట్రం మన ధీ---- మళ్లీ ఎప్పటిలా మన పల్లెల్లో పచ్చ ధనం చూడాలి కోడి కూతలు లే గ ల గంతులు ప్రతి ఇంటి ముంధూ చాను పు లు-- ముగ్గులు తొక్కుడు బిళ్ళ చెమ్మ చెక్క --చిర్రా గోనె ఆటలు ఇంట్ల క డు ప ల ముం ధు అమ్మలక్కల ముచ్చ ట్లు--మినీ మీటింగ్ లు రయితన్నాలు -వ్యవసాయ పనిముట్లతో--- మళ్లీ ఆ రోజులు రావాలి తెలుగు జాతి మన ధీ రోండు రాష్ట్రాల వెలుగు జాతి మన ధీ బౌ గోలికం గా-- ఆంద్ర ప్రదేశ్-- తెలంగాణా గా వి డి పోయిన కలిసి బ్రతుకుదాం కలిసి పాడుదాం మన తెలుగు తనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం-- పదండి పోదాం--- --------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1okeRzP

Posted by Katta

Sriramoju Haragopal కవిత

రేపటిపొద్దు మోడు పూలకొమ్మయింది చిగురాశ లేని మొండి జీవితంలో బండమీద నీటిచెలిమె లెక్క గడ్డకట్టిన మనసు ఇపుడు రెక్కలు విప్పిన పక్షి పారతో మలిపిన కాలువ మడి నిండినట్లు ఆవిరులైన వూహలన్నీ అందాలవానలైనయి తడిసినకొ్ద్ది నేనే వూటపర్రెనైనా మత్తడి దుంకుతున్న కలలు జొన్నకర్రల దసరా జెండాలైనయి ఈ పంటచేను మంచె రాగాలమీద నవ్వుల వెన్నెలలు కురిసినయి ఏడెల్లకాలం దుఃఖాన్ని ఒల్లెకు తీస్కొని వూకుంచినట్లుంది ఈ పొద్దు మోదుగులు పూచినట్లున్నాయి వూర్లనిండా పాలపిట్టలు పాటల కవ్వాతు చేస్తున్నయి సేపులొచ్చిన తల్లిలెక్క తెలంగాణా బిడ్డల్ని దేవులాడుకుంటున్నది కన్నబిడ్డల్ని గుండెలమీదనే కాల్చుకున్న దీన దుఃఖాన్ని మింగుకుని కాలాన్ని గెలిచిన పండుగ బోనం ఎత్తుకుంటున్నది కొత్తలు పెట్టుకుందాం, కొత్త ఆశలు తొడుక్కుందాం గంపనిండా కొత్తపొద్దుల ధాన్యం రండి ఎత్తుకుందాం నేనొక విత్తనాన్నై మళ్ళీ మొలకెత్తుతా కాలం అన్ని రహస్యాలు చెప్పితీరుతుంది ఇంక చరిత్ర తెలంగాణాదే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfWdLn

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //తట్టిలేపు// ఒక్కసారి తట్టిలేపు నీపక్కన నిద్రపోతున్నవాలని కాదు నీలో నిద్రపోయిన నీ జ్ఞాపకాలని తట్టిలేపు అంటున్న మదిలో ఎక్కడో బాల్యం అనే గదిలో పడేసిన అ జ్ఞాపకాలని తట్టిలేపు అమ్మ చేసిన పిండివంటల డబ్బా దొంగ చాటుగా తెరచి తిన్న ఆ అందమైన జ్ఞాపకాని తట్టిలేపు, నాన్న చేతివేలు పట్టుకొని బజారుకు వెళ్లి నీకు నచ్చిన బొమ్మ కొనుకొని స్నేహితులుకు చూపిస్తూ గర్వేపడే అ రోజుల్ని తట్టిలేపు చెల్లి నీ కొట్టి నేను కాదు అంటూ అబద్ధం. చెప్పి తపించుకున్న అ అల్లరి నీ తట్టిలేపు ఆధునికం అనే బూజు పట్టిన నే జ్ఞాపకాల పుస్తకాని దులిపి ఒక్కసారి చదివి, ఒకేసారి చిరునవ్వు,కన్నీరు నీ చూస్తూ నీ గుండెలో నుంచి వొచ్చే అ అందమైన భావాల్ని తట్టిలేపు 1june2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oY3NK0

Posted by Katta