పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rajkumar Bunga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rajkumar Bunga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (4)|| సరేలే ఒక "వేలైతే" చూపించగల్గావు ....మరి మిగిలిన నాలుగు సంగతేంటో ? ఆర్కే ||బుంగలు (4)||20140404

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFtsnN

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (3)|| అ ల సి పో యా ను ఒరేయ్ బుజ్జోడ ఆయాసంగా ఉందని లోపలివాడికో మాటేసాను. సంహార దేవేత వచ్చి ఓడించకముందే, విజయపతాకం ఎగురవేసి శాశ్వతంగా బొజ్జోరా అని లోపలి బుజ్జోడు బయట బుజ్జోడితో ఒకటే గొడవ - విరామం లేకుండా! కన్నులనిండా నిద్ర - ఆనందమే కా ని గుండె లోతుల్లో పసికూనల అలజడి సంగతేంటో !! ఆర్కే ||బుంగలు (3)||

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2vZWc

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (2)|| ఓహో నాకు ఓ రోజున్నదన్న మాట! జీవన పోరాటంలో ప్రతి రోజు అయినా అధికారంగా ఏప్రిల్ ఒకటని - ఒకటే అని!! పోన్లే ఇదో తుత్తి..... ఆర్కే ||బుంగలు (2)|| 20140401

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5GoS

Posted by Katta

30, మార్చి 2014, ఆదివారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (1)|| ఔను ... ఎంత ఉతికిన మనసు పరిశుద్దత సంతరించుకోవడం లేదు. బహుసా మాసిన గుడ్డతో శవాన్ని మనసుని కలిపి చుట్టాలేమో! ఏమో మనసు గుర్రం ఎగరావచ్చు.... పరిశుద్దినివైపు!! ఆర్కే ||బుంగలు (1)||20140330

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQ6lJ2

Posted by Katta

27, మార్చి 2014, గురువారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||నిద్ర|| అ ల సి పో యా ను ఒరేయ్ బుజ్జోడ ఆయాసంగా ఉందని లోపలివాడికో మాటేసాను. సంహార దేవేత వచ్చి ఓడించకముందే, విజయపతాకం ఎగురవేసి శాశ్వతంగా బొజ్జోరా అని లోపలి బుజ్జోడు బయట బుజ్జోడితో ఒకటే గొడవ - విరామం లేకుండా! కన్నులనిండా నిద్ర - ఆనందమే కా ని గుండె లోతుల్లో పసికూనల అలజడి సంగతేంటో !! ఆర్కే ||నిద్ర|| 20140327

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3AlF7

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే||హోలి రంగులు|| హోలి పుణ్యాన వళ్ళంత రంగులద్దుకొని అసలురంగు //దాచుకునే //ప్రయత్నం // ఈ ఒక్కరోజైన//! వర్ణహీనమో వర్ణరహితమో మాసిపోయిన మనసులు రంగువెలసిన మనుషులు చవుకైన రంగులద్దుకొని చులకనైన జీవితం ప్రక్షాళనకోసం పరిగెడితే చుట్టూత మూసినదే మురికి నీటిలో మనసు తేలి ఆడుతోంది..మలినపు బుడగలా విచిత్రం ఆ బుడగాలోను సప్తవర్ణాల ప్రతిబింబమే ...ఓ నిజమైన అబద్ధంలా బ్రిడ్జిపైనుండి ఏ రంగులేని నగ్నదేహంతో ఓ పసిబిచ్చగాడు మురికిప్రవాహంలో రంగుల బుడగే ప్రపంచమన్నట్టు రంగుల బుడగను చూసి మురిసిపోతున్నాడు కొద్ది క్షణాలే మురిపెం ఈ జీవితపు ఆటలో ..ఆటైన, రంగైన టపెల్..తుస్స్ ...పేలిన బుడగలో రంగులు విరజిమ్మలేదు,కాని ఆశపడ్డకళ్ళలో ఎర్రని కన్నీరు పరవళ్ళు తొక్కుతూ వెనుదిరిగి నగ్నంగా నడుస్తున్నాడు బిచ్చమెత్తుకుంటూ రక్తంఅంటని అమ్మకడుపులో పసి పిండంలా స్వచ్చమైన రంగులతో! ఆర్కే||హోలి రంగులు|| 20140317

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKhc1i

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||కిడ్నీలు|| చా ఊరుకో... ఎవడైనా వింటే నవ్వి పోతాడు! ---------------------------- కిడ్నీలకు దినమెలా చెయ్యమంటావ్, "జంట కిడ్నీలు" మార్వాడి కొట్టులో అటకమీద మగ్గుతుంటేను!! ------------------------------ మన ఊసులు విని, మనసు దేహంలో అన్వేషణ మొదలెడితే జవాబు చెప్పలేక ఉన్న గుండె ఆగిపోయీ రాతిరికి కాయాన్నికాటికి తాకట్టుపెట్టాలి.......ఇక చాల్లే ఊరుకో!!! ఆర్కే ||కిడ్నీలు||వరల్డ్ కిడ్నీ డే 20130313

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klARt8

Posted by Katta

11, మార్చి 2014, మంగళవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే||ఓ క్షణం చాలు|| అవును, జీవితం అందమైనది ఒక యుగమైన ఒక్క క్షణమైనా జీవితం అందమైనది కొన్నిసార్లు ఎవరో చెప్తేగాని తెలియదు అంతమయ్యేలోపు మరింత అందమని తెలుసుకో ఎందుకు ఆ భయం రోగంనిన్ను పీడుస్తుందా లేక రోగిని అనే దిగులు నిన్ను పీడుస్తుందా What is more hurting you? Disease or fear about Disease. ఇదిగో మనసా నీకో రహస్యం చెప్పనా, రోగం లేనోళ్ళు ఉన్నారేమో గాని మరణం లేనోళ్ళు కాదు...పిచ్చిముఖమా! న్యాయ సమ్మతమైన సమయంలో పరస్పర సమ్మతిపత్రం తీసుకొని ఏ ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చావో నీకు ఆ భగవంతునికి మాత్రామే తెలుసు అదో రహస్యం ....మీ ఇరువురి మధ్య ఒప్పందం ప్రయాణంలో ఎన్నో మజిలీలు, తోటి ప్రయాణికులు!! కార్యం ముగింపులో కార్యాలయం ఆలోచన ఎందుకు ఎలా వచ్చావో అలాగే స్వచ్చంగా, లేతగా వెళ్ళిపో కార్యాలయం బీటలు వేస్తే నీకేంటి, బూజులు పడితే నీకేంటి శిధిలాలు భుజాన్నేసుకొని తిరుగు ప్రయాణం ఎందుకు, భూమిలో పాతెయ్ కాన్సర్ కణాలు మట్టితోకట్టిన కార్యాలయపు గోడలను కూల్చగలవు గాని, నిన్నుదాటుకొని నీ గుండెను కాదుగా ...తెలుసుకో అద్దెకొంపలో ఏమైనా కట్టిపడేసే బాధ్యతలుంటే తేలికపాటి ప్రయాణం కోసం అన్ని ఖాళి చేసుకొని నీగుండెలో నువ్వు చేరి సిద్దపడిపో పక్షిలా ఎగరడానికి Everything looks like important in life, but everything is not need in life, until unless you know the difference between important and need. సమస్తం ఆవశ్యకమైనవే, కాని అవసరము కాదు వాటి మధ్య వ్యత్యాసము తెలియనంతసేపు జీవితమంటే శరీరంలోనే నివాసం కాదు .... జీవితమంటే ఓ అందమైన ప్రయాణం, ఓ జ్ఞాపకం అందరిలో జీవించడానికి , అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవడానికి వందేళ్ళు అవసరం లేకపోవచ్చు.. ఒక్కోసారి ఓ క్షణమే చాలు What is more hurting you? Death or fear about Death నవ్వినా నవ్వించగల్గిన...ఓ క్షణం చాలు ఎవరో ఒకరిలో నీవు తిరిగి జీవించడానికి..కమ్మని జ్ఞాపకంలా!! ఆర్కే||ఓ క్షణం చాలు|| 20140311

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nFMHQ0

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Rajkumar Bunga కవిత

ఆర్కే||అమ్మా, అక్కా, చెల్లి, భార్య, కూతురు|| ఈ ఒక్క దినం చేసేయ్యమంటార?? ఒక్క మాటతో రాసేయ్ మంటార ఏమి వ్రాయను మీ కోసం...... ఒక్క రోజులో వ్రాసేది కాదు ఒక్క రోజుతో పోయేది కాదు అమ్మా, నీ "పురిటినొప్పుల" పురాణం ఒక్కరోజులో చెప్పలేనిది అక్కా నీ చెయ్యి పట్టుకొని నేను ఆడిన "దాగుడు మూతలు" ఒక్కరోజులో చెప్పలేనిది చెల్లి నా చెయ్యి పట్టుకొని నీవు ఆడిన "తొక్కుడు బిళ్ళలు" ఒక్కరోజులో చెప్పలేనిది భార్య నా చెయ్యి పట్టుకొని నీవు ఆడుతున్న " జీవిత చదరంగం" ఒక్కరోజులో చెప్పలేనిది కూతురు నా కడుపు గట్టుకొని నీకోసం కూడగడుతున్న " జీవిత పోరాటం" ఒక్కరోజులో చెప్పలేనిది దినం చేసేయ్యమంటార?? ఒక్క దినంతో పోయేది కాదు, బంధం.... మీలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ దేవుడు మీ ద్వారా నాకీ రూపం ఇవ్వకపోవును ఆర్కే||20140308||

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PbNxZt

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే||నీ ఫోటో సజీవమే|| బెడ్రూం, కిచెన్, టాయిలెట్ అన్ని ఒకచోటే కంపు వేరైనా అన్ని ఒక కప్పు కిందే అనుకూలం అనుకుంటాం గాని ఎమ్ కోల్పోతున్నామో ఆలోచించే సమయమెక్కడ - ఎక్కడో? కాంక్రీటు జంగిల్లో స్వేచ్చ ఉన్న జంతువులం మెడకు గొలుసు లేదని సంభరం తప్ప మొండెం ఉరికొయ్యపై ఊగిసలాడుతుందని ఉలుకైన లేదు/రాదు జంతు చర్మమైన బాగుణ్ను ఉడకబెట్టి ఊరబెట్టి ఉపయోగించు.... కోటి రూకలతో శతకోటి ఆశలతో అంగుళం అంగుళం కొన్న పాలరాతి భవనం మూడు బాగాలే (బెడ్రూం,కిచెన్,టాయిలెట్) మూన్నాళ్ళ ముచ్చటే మూకుమ్మడిగా మట్టిపాలే మరమనుషులు/యాంత్రికజీవులు ఒక సంతాపం ఒక్క రోజు జ్ఞాపకం గాలిబుడగ జీవితం/గాలి బుడగై జీవితం వైరాగ్యంలే అని దులుపుకోకు మూడుగదులు(బెడ్రూం,కిచెన్,టాయిలెట్) గడప దాటి నీ మనసులో అడుగు పెట్టు జీవితపు మధురం జుర్రు ఆఖరి బొట్టు వరకు, తన పోలిక చొప్పున దేవుడు నిన్నెందుకు చేసాడో పశువుకి వివరించ్చొచ్చు ఆఖరి క్షణం వరకు.... గోడకు వ్రేలాడుతూ నీ ఫోటో సజీవమే ముందు తరానికి ఓ గొప్ప పాఠమే --ఆర్కే ||20140307|| పాతవాచకం

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P8bRLE

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Rajkumar Bunga కవిత

డబ్బువస్త్రం మాస్తే చాకిరేవుకి వెళ్ళాను నగ్నత్వమనుకొని లోకం నవ్వుతుంది!! --ఆర్కే

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko6LVb

Posted by Katta

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||మబ్బులు|| ఎన్నోమబ్బులు కారుమబ్బులు కరిగివర్షించే మబ్బులు కౌగిలిలో మురిపించే మబ్బులు కరడుగట్టిన మరికొన్నిమబ్బులు ఎగిరొచ్చి తాళితెంపిన తాగొచ్చి కుళ్ళబొడిసిన ఉరిమే మొగుడుమబ్బుతో రాజీపడుతూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో కాలంవేగంతో పరుగులుతీసి కాలుజారిన కన్నపేగుమబ్బును మళ్లీ తన గర్భంలో దాచుకొంటు అమ్మఆకాశం ...అదే ప్రేమతో క్షణ క్షణం తలకొరివి పెడుతూ నోటికాడ గింజను బజారుదానికెట్టి వావివరసలు లేని కొడుకుమబ్బును అనుక్షణం పురిటిస్నానం చేయిస్తూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో తొలిరేయి గదిలో తెల్లని కాంతి తెల్లని చీర తెల్లని పాలు తెల్లని పూలు తెల్లని పాన్పు మబ్బులు తెలియని అమ్మఆకాశం తెల తెల్లగా!! సుడిగాలులు వడగాలులు చలిగాలులు అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి సూరీడు ఈ కొన నుండి ఆ కొనవరకు ప్రాకతు నడిచి పరుగెత్తుకెళ్ళాడు అమ్మఆకాశం అలసిపోయి తెల్లని వస్త్రంలో చుట్టబడింది, అచ్చం తన తొలిరేయిల. మబ్బులన్నీ కలిసికట్టుగా అమ్మఆకాశాన్నిఆరడుగుల గోతిలో నెట్టేశారు! అమ్మఆకాశం ఇప్పుడో జ్ఞాపకం మాత్రమే .... తెల్లని తెలుపులా !! ఆర్కే ||మబ్బులు||20140224

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgYMnS

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rajkumar Bunga కవిత

పంచేంద్రియాలు పవిత్రమే అని సంభరపడ్డా, తొంగి చూసుకుంటే "హృదయం" వ్యభిచరిస్తుంది.... హృదయ వ్యభిచారానికి గొల్లుమన్నాయి, అపవిత్రత ఊసెత్తని పంచేద్రియాలు!! ...||ఆర్కే||

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cUSNFp

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఎస్ ఎస్ కె - ఆర్కే||మతం - మార్గం|| మనిషి దేవుణ్ణి వెతికితే అది ఓ మతము దేవుడు మనిషిని వెతికితే అది ఓ మార్గము మనిషి మతాన్ని స్థాపించగలడు గాని,మార్గాన్ని కాదు, ఎందుకంటే దేవుడు మాత్రమే నిజమైన మార్గాన్ని చూపగలడు. మార్గం చూపడమంటే, చూపుడు వేలితో దులుపేసుకోవడం కాదు, తన గాయాలలోకి నిన్ను నీ వ్రేలును స్వాగతించడం మార్గం చూపడమంటే, దారిమధ్యలో నిన్ను వదిలిపోవడం కాదు, దారిపొడుగునా నీకోసం తన రక్తపు జ్ఞాపకాలు కార్చడం మార్గం చూపడమంటే, మార్గమని మార్గాన్ని దూరం నుండి చూపడం కాదు, నాగటితో దున్నబడిన తన వీపుపై నిన్ను మోసుకొంటూ మోక్షానికి చేర్చడం....అదే నిజమైన మార్గం!! మార్గం చూపడమంటే, తానే ఆ మార్గం అని నీకోసం మరణించడం ---|| ఎస్ ఎస్ కె - ఆర్కే||20140218

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cUIm4C

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||వాలెంటైన్ - ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు|| ప్రియుడా ఎలా ఉన్నావు? కళ్ళముందే కదులాడుతున్నావు గాని నా కల్మషం వలన నోరుపెగిల్చి పిలువలేను తొందరపడి తాకలనిపిస్తుంది నీ ప్రసస్త్ర వస్త్రాన్ని, కాని నా మాలిన్యము వలన నీ చెంగును తాకలేను అయిన ఏదో చిన్నఆశతో అడిగేస్తున్న ప్రియుడా ఎలా ఉన్నావు? ప్రత్యేకంగా అందరు ఈ రోజున ఇవే సంకేతాలు ఎవరేవిరికో!! తెలిసో తెలియకో ప్రయత్నమో అప్రయత్నమో సందర్భమో అసందర్భమో నేను అడిగేస్తున్న ప్రియుడా ఎలా ఉన్నావు? ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం శిలువలో నేచేసిన పంచ గాయాలు మన ప్రేమకు గుర్తు అంటూ మరణించావు. ప్రియుడా ఎలా ఉన్నావు? రుధిరధారలతో ఎరుపెక్కిన నీ మేను ఇదిగో ఇప్పుడు నాతోపాటు ఈ లోకం పులుముకుంది అబద్ధప్రేమతో...ఓ నిజంలా!! ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు రోజే కాదు క్షణ క్షణము గుండెరోదిస్తుంది....గుర్తుకొచ్చి ప్రియుడా ఎలా ఉన్నావు శిలువలో ఇంకా వ్రేలాడుతూ? ఆర్కే ||వాలెంటైన్ - ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు|| 20130804/20140214

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGCC6w

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే||భార్య|| ముంగిట భార్యను చూస్తూ, రేపటికోసం తనకు ఏమి కావాలో అనే ఆలోచనే గాని, తన కళ్ళలోకి చూస్తూ ఆ క్షణం ఏమి కావాలో ఆలోచన లేదు/రాదు. దౌర్భాగ్యం..... ఆనాటి నీవే ఈనాటి నీవు అని నీ భార్య నీతో చెప్పకపోవడం!! నువ్వు "నువ్వే" అని విని ఎన్నేళ్ళయిందో గుర్తుందా.... అదే అదే మాస్టారు ఏదైనా ఓ క్షణపు "గుర్తు" ఉందా అని ఓ ప్రశ్న? ఆర్కే||భార్య||20140211

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWmfPC

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||ఉరితీత|| సమస్యల బస్తాలు ఇరుభుజాలనెక్కుంచుకొని నిరాశ నిస్పృహలు చెరో సంకలో దాచుకొని సూర్యచంద్రుల మద్య నలిగే ఆకాశంలా అంగడిలో ఆ మూల నుండి ఈ మూలకు కురవని కాసుల బేరం నడుమ, పగుళ్ళ పాదాలతో సూరీడు వాలాడు, ఇంటిముఖం పట్టేవేంటి, గయ్యాళి పెళ్ళాం, గంపెడు పిల్లలు, కిరణా శీను రెంటు బాబాయ్, చిట్టీలోడు, చెబదులోళ్ళు నీ ఇంటిముంగిట కాపులేక చెట్టును దాటగలవ నీ కష్టాలు తీరేవికావు, సంచిలిసిరేసి సారాకొట్టుకు నడవోయ్ జారిణిరంగి రంగులద్దుకుని తలుపు తీస్తుంది,రంగుల్లోకంలో దూకై వరేయ్, నిన్ను చూస్తే దిగులవుతుంది, రాత్రి గడవదేమో,నీతో పాటు నేను వస్తాను నీ ఇంటికి కారు దిగిన బాల్యస్నేహం, జాలితో ఏంట్రా వట్టి చేతులతో కొమ్మ కొమ్మకు ఏదో తగిలిస్తున్నావ్ చెట్టుతో మాటలేంటో, మతిబ్రమించి, చివరకు మానసిక రోగం నిద్రలో కూడా నీ దీనస్థితి గుర్తొచ్చి, నా కనురెప్పలు తెల్లవార్లు కొట్టిమిట్టాడాయ్ రాత్రి గడిచింది ,సూరీడు నవ్వాడు, టీ సుక్క మింగెవొ లేదో, అప్పుడే చెట్టుతో మాటలేన్ట్రా ప్రతీ కొమ్మనుండి ఏవో తీసి మళ్లీ భుజాలకెక్కిస్తున్నవ్, పిచ్చి ముదిరింది నిముషం ఆగి నిజం చెప్పు, వట్టి చేతులతో చెట్టుతో మాటలేన్ట్రా, చీకటిలో ఏదో తగిలిస్తున్నావ్, వేకువ జామునే మళ్లీ ఏదో తగిలించుకుంటున్నావ్ చిద్విలాస చిన్మయత్వ ముగ్ద మనోహర రూపంతో మోము వెలుగుతుంది చిదంబర రహస్యం ఏంటో, స్నేహితుని అయోమయపు ప్రశ్న.... జవాబు "ఉరితీతే "......ఫలితం కంటినిండుగా కమ్మటి నిద్ర సమస్యల బస్తాలు, నిరాశ నిస్పృహలు నిద్రకుముందు చెట్టుకు ఉరితీసాను నాకు నేను ఊ కొట్టుకుంటూ "మనిషి" నై మనసుతో మనసులో కునుకేసాను రాత్రి గడిచింది, వేకువ యంత్రాన్నైఅంగడి వైపు మళ్లీ అడుగులేసాను బేరంకోసం నేను, అర్థంకాక బాల్య స్నేహం - చెట్టును చూస్తూ జాలిగా! "చెట్టుదేవుడు నవ్వుతున్నాడు ఎవరైనా ఉరేస్తారా అని ఎదురు చూపులతో శిలువలో భరిస్తూ" నిన్ను నన్ను నిదురపుచ్చడానికి!! సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఆయన మిమ్మును శోధింపనియ్యడు, అంతే కాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను "మార్గమును" కలుగజేయును. ఆర్కే ||ఉరితీత||20140205

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bpGhxi

Posted by Katta