పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rakam Narender లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rakam Narender లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2012, ఆదివారం

రాకం నరేందర్ || నువ్వు-నేను ||


ఏ ఆవేశ కణాన్నో అల్లుకొని
అండ పిండాలలో దోర్లుకొని
ఆర్తనాదంతో, ఖండితమైన గాయంతో

అనుమతిలేని అస్తిత్వపు ఆనవాళ్ళని
పరుచుకొని, దిక్కులని నింపుకొని
అచంచల ప్రపంచపు అంచులపైన ఆడాలని......

కాని.....
రక్త మంసాలకి రంగులని అద్దుకొని
ఊరు పేరులతో ఉన్మాదం నింపుకొని
కుల మతాల కుతంత్రాలని రాసుకొని
జాతి నీతి పాటాలు వల్లేసుకొని
ఇరుకు సందులలో ఇమడలేక ఓడుతూ....

నేనెవరు....? నువ్వు....!!!

21, ఆగస్టు 2012, మంగళవారం

రాకమ్ నరేందర్ // ఎదురు చూపులు //


గుడిసెకు మూలాన
నులక మంచాన
పాచికంపు బొంతల నడుమ
జోరీగలతో దోస్తీ కడుతూ.........

మొగుడు పోయి మూడార్ల పైనే......
కొడుకుకు అవసరం తీరిన తోలు సంచి
కోడలికి అక్కరకురాని అవశేషమొకటి
కూతురు దులిపేసిన చేతిలో దుమ్ము
మనువడి పెళ్లికి తగిలెడి రాయి
ముని మనవరాలు చూసేటి వింతైన చూపు

ఐదారు నిమిషాలకోసారి రెప్పల చప్పుడు
వినపడితెనేమి వచ్చేదెవ్వరు....?
గుండెలో రగిలేటి ఆక్రందనాలు
చేసేదేమిటి....చావుకెదురు చూపులు...!
*20-08-2012