పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sriramoju Haragopal కవిత

పచ్చీసాట కన్నీటి గవ్వలతో కాలం పచ్చీసాడుతున్నది నన్ను నీతో పోటీకి దింపి తెగ నవ్వుకుంటున్నది నా పందేలన్ని దూగ,తీని,చారీలే సంపుడు పందెంలేదు, పెద్ద పందెంలేదు నేను తనంత చెయ్యి తిరిగిన ఆటగాణ్ణి కాదు పడక పడక పందెం పడ్డా బతుకు పంటగడి చేరకుండనే గుండెల పండుగాయలు చస్తున్నయి ‘ఎన పచ్చీసు’ గెలుపు మంత్రం ఎన్ని సార్లన్నా గవ్వలు నవ్వుల్లెక్క తెల్లగ పడ్డదెన్నని, పడితే పనికిరాని ఏకాంతం చౌదానో, ఒంటరితనం చెక్కనో ఆటొప్పుకున్నంక తప్పదు మాటల్లో, మహిమల్లో నీతో గెలవనని నాకెరికే నీ చేతుల గవ్వలు నీవనుకున్నంత పందెం పలుకుతయి నీవనుకున్నట్టె గెలుపులన్ని నీ ఇంట్లనే దస్సో, పచ్చీసో, త్రీయీసో నీ రెండువేళ్ళమధ్య నీ ఇష్టం గవ్వ నీవన్నట్లు నీషరతుకు పడతయి నాకు నీ చేతిల ఓడిపోవుడు కొత్తనా నీ బనాయింపులే కొత్త కాయలెత్తెటపుడు, పచ్చీసు మూట కట్టేటపుడు గుస గుస ‘నీవెందుకు ఓడిపోతవో నా కెరుకే’ నీ చిన్ననవ్వులో పరిచయ పరాచికం నాకేం తెలుసు ఆడినా ఆడకున్నా నువ్వంటే నాకు ఇష్టభయసందోహం నన్ను ఆడించేది నువ్వే, ఆటను నేను నువ్వు ఓడించే గెలుపును నేను

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mJgGpz

Posted by Katta

Rama Murthy Panuganti కవిత

'జయ' ఉగాది సందర్భంగా రాసిన కవిత-ఉగాది తో'రణం'- పానుగంటి రామమూర్తి

by Rama Murthy Panuganti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoBfTa

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PofLQs

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || ఎలా ...|| పువ్వుల్లో మకరందాల్ని నవ్వుల్లోకి వెన్నెల వెలుగుల్ని కళ్ళల్లోకి నింపుకొస్తే నీ పరిచయం శాశ్వతమని మురిసిపోయా నీ ప్రేమ నిజమనుకుని గుండెకు అప్పజెప్పా హృదయాంతరాళలోకి వేళ్ళూనుకున్నావనీ మనసు తోటలో వసంతమై విరబూస్తావని అనుకుంటే శిశిరమైనా రాకముందే చిరురించిన ఆశల్ని రాల్చేసి కళ్ళముందే ప్రేమవృక్షాన్ని కూల్చేసి వెళ్లిపోయావ్ నువ్వున్నప్పుడు క్షణమై కరిగిన కాలం లేనప్పుడు యుగమై గడ్డ కట్టుకుపోయింది నువ్వున్నప్పుడు నీడలా వెంటవచ్చిన ఆనందం లేనప్పుడు ఎదురుపడినా తలత్రిప్పుకు వెళ్ళిపోతోంది మర్మం తెలియని మదికి ఇవన్నీ చెప్పేదెలా నువ్వేనిండిన తననుండి నిన్ను వేరుచేసేదెలా మారాంచేసే మనసుతో మాటలెలా కలిపేది ఊరుకోని హృదయాన ఊరడింపునెలా నింపేది ?!! )-బాణం-> 04MAR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mJ8B49

Posted by Katta

Abd Wahed కవిత

గత శుక్రవారం గాలిబ్ గజళ్ల సంకలనంలోని 14వ గజల్ మొదటి రెండు షేర్లను చూశాము. ఈ వారం కూడా అదే గజల్ లోని మిగిలిన షేర్లను చూద్దాం. ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ మూడవ షేర్. గర్ చే హూం దీవానా, పర్ క్యోం దోస్త్ కా ఖావూం ఫరేబ్ ఆస్తీన్ మేం దుష్నా పన్హాం, హాథ్ మేం నష్తర్ ఖులా నేను పిచ్చివాడినైనా, భరించాలా మిత్రుడి మోసం చొక్కాలో చురకత్తి, చేతుల్లో శస్త్రచికిత్సల కత్తి ఇందులో ఉన్న కొన్ని ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. గర్ అంటే అయినప్పటికీ అని అర్ధం. ఫరేబ్ అంటే మోసం, ద్రోహం వగైరా. ఆస్తీన్ అంటే చొక్కా చేయి. దుష్నా అంటే చురకత్తి. నష్తర్ అంటే శస్త్ర చికిత్సకు వాడే కత్తి. దోస్త్ అంటే మిత్రుడు. ఈ కవితలో ఒక సన్నివేశం కల్పించి చెప్పడం జరిగింది. గాలిబ్ తన ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చివాడయ్యాడు. అలాంటి పరిస్ధితిలో గాలిబ్ కు మిత్రుడైన ఒక వైద్యుడు గాలిబ్ కు సహాయం చేయడానికి, అతడి పిచ్చి బాగుచేయడానికి వచ్చాడు. అతని చేతిలో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి ఉంది. కాని అతడి చొక్కాలోపల మరో చురకత్తి ఉందని గాలిబ్ గమనించాడు. ఆ మిత్రుడు నిజానికి తనకు సహాయపడడానికి రాలేదని, మోసంతో చంపడానికి వచ్చాడని, ఎంత పిచ్చిలో ఉన్నా మిత్రుడి మోసానికి గురికావలసిన అవసరం లేదని అంటున్నాడు. ప్రేమవైఫల్యం వల్ల పిచ్చివాడిలా మారినప్పటికీ, మోసగాళ్ళ మోసానికి గురయ్యేది లేదని, తనకు సహాయం చేస్తామంటూ వచ్చేవారి నిజానిజాలు తాను గుర్తించగలనని ఈ పంక్తుల్లో చెప్పుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, ప్రేమవైఫల్యం వల్ల పిచ్చి పట్టింది. ప్రేమించిన అమ్మాయి దొరకనప్పుడు ఇక జీవించి ప్రయోజనమేమిటన్న భావం కూడా మనసులో ఉంది. అయినా మోసానికి గురయి, ద్రోహానికి గురయి ప్రాణాలు పోగొట్టుకోవడమేమిటి? చావడానికైతే చాలా మార్గాలున్నాయి. కాని మోసానికి బలయి చావడం మాత్రం ఎన్నటికి భరించలేనంటున్నాడు. మనిషిని నమ్మినవారే మోసగిస్తారు. మిత్రులే మోసం చేస్తారు. మోసపోవడం అన్నది ఒక పరాభవం లాంటిది. అలాంటి పరాభవాన్ని తాను భరించేది లేదని గాలిబ్ ప్రకటించాడు. పాతకాలంలో పిచ్చి, ఉన్మాదం వంటి రోగాలకు రక్తనాళానికి గాటు పెట్టడం ద్వారా వైద్యం చేసేవారు. అలాంటి శస్త్రచికిత్సను ఇక్కడ గాలిబ్ సూచించాడు. శస్త్రచికిత్సకు వాడే కత్తితో కూడా చంపవచ్చు, కాని గాలిబ్ చొక్కాలో చురకత్తిని గమనించానని చెప్పాడు. అంటే పైకి నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు సహాయం చేసే శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిలా ఉన్నప్పటికీ, లోపల దురాలోచనలు ప్రాణాలు తీసే చురకత్తులవంటివని ప్రతీకాత్మకంగా చెప్పాడు. బుగల్ మేం ఛురీ ముం మేం రామ్ రామ్ అని హిందీలో ఒక సామెత ఉంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అని తెలుగులో కూడా అంటాం. ఇలాంటి భావాన్నే గాలిబ్ చక్కని కవితలో అల్లాడు. ఈ రోజు రెండో కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ నాల్గవ షేర్ గో నా సమ్ఝూం ఉస్కీ బాతేం, గోనా పావూం ఉస్కీ భేద్ పర్ యే క్యా కమ్ హై కీ, ముఝ్ సు వో పరీ పేకర్ ఖులా ఆమె మాటలు అర్ధం కాకపోయినా, ఆమె అంతరంగం తెలియకపోయినా ఆ అప్సరస నాతో మాట్లాడుతోంది. అంతకన్నా ఏం కావాలి? ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. పరీ అంటే అప్సరస అని అర్ధం చెప్పుకోవచ్చు. పేకర్ అంటే రూపం అని అర్ధం. పరీ పేకర్ అంటే అప్సరస రూపమున్న అమ్మాయి. భేద్ అంటే రహస్యం. పావూం అంటే తెలుసుకోవడం, పొందడం వగైరా అర్ధాలున్నాయి. గో అంటే అయినప్పటికీ అని అర్ధం. ప్రేమ చిగురిస్తున్న రోజుల సన్నివేశాన్ని గాలిబ్ వర్ణించాడు. ఆయన ప్రేయసి అస్పరస వంటి రూపం కలిగిన స్త్రీ. ఆమె హావభావాలతో గాలిబ్ కు ఏదో చెబుతోంది. కాని ఆ మాటలు ఏవీ ఆయనకు అర్ధం కాలేదు. బహుశా ఆమె అందాన్నే చూస్తున్నాడు కాబట్టి అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. లేదా ఆమె గాలిబ్ కు తెలియని విదేశీ భాషలో మాట్లాడి ఉండవచ్చు. పర్షియన్లో ఒక సామెత ఉంది. జుబాన్ యార్ మన్ తుర్కీ వ మన్ తుర్కీ నా మీ దానమ్. అంటే అర్ధం, నా ప్రేయసి టర్కీ భాష మాట్లాడుతుంది. నాకు టర్కీ భాష రాదు. గాలిబ్ పరిస్థితి అదే. కాని గాలిబ్ కు ఆమె మాటలు అర్ధం కాకపోయినా ఫర్వాలేదు. ఆయన నిరాశపడే మనిషి కాదు. ఆమె ఏం చెబుతుందో అర్ధం కాకపోయినా ఫర్వాలేదని, అసలు ఆమె అంతరంగం అంతుబట్టకపోయినా ఫర్వాలేదని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి, తర్వాత అర్ధం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయం. తర్వాత ఆమె భాషను, ఆమె అంతరంగాన్ని అర్ధం చేసుకునే అవకాశాలు చాలా వస్తాయని ఆశిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆమె తనతో మాట్లాడుతుంది, తాను వింటున్నాడు. అది చాలు. ఇదే పెద్ద విజయం. ఇదే భావాన్ని మరో ఉర్దూ కవి కూడా చాలా చక్కగా చెప్పాడు. రాహ్ పే లగా తో లాయే హైం బాతోం బాతోం మేం ఔర్ ఖుల్ జాయేంగే దో చార్ ములాఖాతోం మేం ఇది చాలా సరళమైన కవిత. దీనికి అనువాదం కూడా అవసరం లేదు. మాటల్లో దారికి తెచ్చుకున్నాను. కొన్నాళ్లకు సంకోచాలు పోతాయి అన్నదే ఆ కవితకు భావం. ప్రేమికుల తొలిరోజుల పరిస్థితిని చాలా సున్నితంగా గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఈ రోజు మూడో కవిత గాలిబ్ సంకలనం లోని ఐదవ షేర్ హై ఖయాల్ హుస్న్ మేం, హుస్న్ అమల్ సా ఖయాల్ ఖుల్ద్ కా ఇక్ దర్, హై మేరీ గోర్ కే అందర్ ఖులా అందం గురించి ఆలోచనలు సదాచరణల భావాలే నా సమాధిలో తెరుచుకున్న స్వర్గ ద్వారాలే ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఖయాల్ అంటే ఆలోచన, మనోభావం. హుస్న్ అంటే అందం, మంచితనం, అందమైన ప్రేయసి, సూఫీతత్వంలో దీనికి అర్ధం దేవుడని కూడా ఉంది. ఎందుకంటే దేవుడు సౌందర్యవంతుడు. అమల్ అంటే ఆచరణ. హుస్నె అమల్ అంటే సదాచరణ. ఖుల్ద్ అంటే స్వర్గం. గోర్ అంటే సమాధి, దర్ అంటే ద్వారం. అందమైన తన ప్రేయసి గురించి ఆలోచనలు సదాచరణలను పాటించడంతో సమానమంటున్నాడు. ఇస్లామీయ విశ్వాసం ప్రకారం దేవుడిని విశ్వసించి మంచిపనులు చేసేవారు స్వర్గార్హత పొందుతారు. మనిషి మరణం తర్వాత అంత్యక్రియాలు ముగిసిన పిదప ఇద్దరు దైవదూతలు నకీర్, మున్కిర్ లు అతడి ముందుకు వస్తారు. మరణించిన ప్రతి మనిషిని ప్రశ్నించడానికి దేవుడు నియమించిన దైవదూతలు వాళ్ళు. ఆ మనిషి తన జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నింటి చిట్టా వారి వద్ద ఉంటుంది. చెడు పనులు చేసి మరణించిన వ్యక్తి పట్ల వారు చాలా కఠినంగా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే సదాచరణలు పాటించిన వారి పట్ల చాలా మృదువుగా వ్యవహరిస్తారు. అలాంటి మంచివారు, పుణ్యాత్ముల సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుంటుంది. దానివల్ల వారి సమాధిలో చీకటి ఉండదు. హాయిగా ఉంటుంది. గాలిబ్ అలోచనల్లో ప్రతిక్షణం అతడి ప్రేయసే ఉంది. అందమైన తన ప్రేయసి గురించి మాత్రమే అనుక్షణం ఆలోచిస్తున్నాడు. అంటే నిరంతరం తాను మంచిపనులు, సదాచరణలే చేస్తున్నానంటున్నాడు. కాబట్టి దైవదూతలు తీసుకొచ్చే ఆయన ఆచరణల చిట్టాలో అన్నీ మంచిపనులే ఉంటాయి. కాబట్టి సన్మార్గంలో జీవించిన వ్యక్తిగా యోగ్యత పొందుతాడు. చీకటి సమాధిలోనే అతని కోసం ఒక స్వర్గద్వారం తెరుచుకుంటుంది. ఈ కవితలో ఇస్లామీయ విశ్వాసాలను సూచనాప్రాయంగా గాలిబ్ ప్రస్తావించాడు. వాటిని అర్ధం చేసుకుంటే ఈ కవితను మరింతగా అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆది నుంచి జన్మించిన మానవులందరినీ దేవుడు ప్రళయానంతరం తీర్పుదినం రోజున మళ్ళీ బతికిస్తాడు. ప్రళయాన్ని ఖయామత్ అంటారు. అప్పటి వరకు చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారు. (ఇక్కడ ఇస్లామీయ విశ్వసాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారని రాశాను. అంత్యక్రియల్లో దహనమైన వారి గురించి ఇస్లామ్ ఏమంటుంది అన్న ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఇస్లామీయ విశ్వాసాల చర్చ లేదు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏమైనా, చనిపోయిన వారందరూ బర్జఖ్ అనబడే లోకంలో ఉంటారన్నది ఇస్లామీయ విశ్వాసాల్లో భాగం.) గాలిబ్ తాను ఎల్లప్పుడు తన ప్రేయసి ధ్యానంలో ఉండి మంచిపనులే చేసాను అంటున్నాడు. అయితే తనకు స్వర్గం దొరికేసిందని చెప్పడం లేదు. తన చీకటి సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుందని అంటున్నాడు. మరో విషయం ఏమంటే ప్రాణంగా ప్రేమించే ప్రేయసి ఆలోచన ఒక హాయి పవనం లాంటిది. సమాధి చీకటిలో కూడా ఆమె ఆలోచన వస్తే చీకటి సమాధి వెలిగిపోతుందన్న భావం కూడా ఈ పంక్తుల్లో ఉంది. గాలిబ్ పదప్రయోగం ఇక్కడ గమనించదగ్గది. సాధారణంగా ఏ మతంలో అయినా మంచిపనులంటే ఏవి, సత్యాన్ని పలుకడం, తోటివారికి సహాయపడడం, బలహీనులకు సహాయపడడం, దుర్మార్గానికి దూరంగా ఉండడం వగైరా. తన ప్రేయసి గురించిన ఆలోచనలను వీటన్నింటితో సమానంగా నిలబెట్టాడు. ఆ విధంగా మతంపై ఒకవిధమైన తిరుగుబాటు ధ్వనింపజేశాడు, కాని ఆ వెంటనే మతవిశ్వాసాల ప్రకారం స్వర్గం అనేది కేవలం ఖయామత్ తర్వాత మాత్రమే లభించేది, కాబట్టి తనకు స్వర్గం లభించిందని చెప్పలేదు. స్వర్గార్హత పొందానంటూ తన సమాధిలో ఒక ద్వారం తెరుచుకుందని రాశాడు. అంటే మతవిశ్వాసాలను అతిక్రమించనూ లేదు. ఈ సమతుల్యం గాలిబ్ కవితల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో అనవసరంగా మనోభావాలు గాయపడే వ్యక్తీకరణలకు దూరంగా ఉండడం అనేది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ గజల్ ప్రారంభం నుంచి ఈ కవిత వరకు ఎక్కడా సూఫీ తత్వం రాలేదు. కాని ఈ చివరి కవితలో లోతయిన సూఫీతత్వం కనబడుతుంది. ఒక కవిసమ్మేళనం గురించి వర్ణన, ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చి పట్టినా, బతకాలని లేకపోయినా నమ్మకద్రోహాన్ని భరించేది లేదన్న ప్రకటన, ఆ పిదప తన ప్రేయసితో మొదటి పరిచయం గురించిన ప్రస్తావనలు ఇంతవరకు గజల్ లోని ప్రతి కవిత వేర్వేరు కవితల్లా కనిపించాయి. కాని ఈ చివరి కవితని పరిశీలిస్తే వాటన్నింటిని అనుసంధానం చేసే సూత్రంలా కనిపిస్తుంది. సూఫీతత్వం ప్రకారం దేవుడే సౌందర్యం. సూఫీలు దేవుడిని ప్రేమిస్తారు. ఇప్పుడు పై కవితలో ప్రేయసి స్ధానంలో దేవుడిని ఉంచి అర్ధం చేసుకుంటే కవితకు అర్ధమే మారిపోతుంది. గాలిబ్ అనుక్షణం సౌందర్య ధ్యానంలోనే ఉన్నాడు. అంటే దేవుడి ధ్యానంలోనే ఉన్నాడు. దేవుడిని అనుక్షణం ధ్యానించే మనిషి ప్రతి పని మంచిపనే చేస్తాడు. ఆ విధంగా గాలిబ్ తన జీవితంలో ప్రతి క్షణం సదాచరణల్లో గడిపాడు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత అతడి చీకటి సమాధి దేదిప్యమానంగా వెలిగిపోతుంది. ఈ కవితను సూత్రంగా చేసుకుని గజల్ లోని మిగిలిన షేర్లను భావార్ధాన్ని తెలుసుకోవచ్చు. మొదటి రెండు షేర్లలో గాలిబ్ కవిసమ్మేళనం గురించి చెప్పిన వర్ణనలో చెప్పిన విషయాల్లోను నిగూఢంగా చక్రవర్తి దర్బారులో కవిసమ్మేళనం గురించి చెబుతూ ఇది శాశ్వతంగా ఉండేలా చేయమన్నాడు. కాని శాశ్వతంగా ఉండడమన్నది ఇహలోకంలో దేనికీ సాధ్యం కాదు. పరలోకంలో మాత్రము సాధ్యం. తర్వాత ఆకాశాన్ని ద్వారం తెరుచుకున్న మందిరంలా దేదిప్యమానంగా ఉందని వర్ణించడంలోను ఆధ్యాత్మికతను అంతర్లీనంగా ప్రస్తావించాడు. మిత్రద్రోహం గురించి చేసిన ప్రస్తావనలోను, చావు అది వచ్చినప్పుడు రానీ, కానీ మోసానికి బలయ్యేది లేదని చెప్పడంలో అంతర్లీనంగా ఇస్లామీయ విశ్వాసాల ప్రస్తావన ఉంది. మనిషిని మార్గం తప్పించే షైతాను మిత్రుడిలా నటిస్తూ మోసం చేస్తాడని, ఆ మోసానికి గురై దైవాగ్రహానికి పాల్పడరాదన్న భావం ధ్వనిస్తుంది. చివరి కవితను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మిత్రుడి మోసం అన్న కవిత మరింత లోతయిన కవిత. సాధారణంగా మతం, ధర్మం పట్ల అంత పట్టింపు లేకుండా గడిపేస్తున్నప్పుడు పొరబాట్లు జరగవచ్చు. మనిషిలో దేవుడికి తనపై కోపం వచ్చి ఉంటుందన్న ఆలోచనలు కూడా రావచ్చు. ప్రేయసి తిరస్కారం అన్న పదాలు ఇక్కడ దేవుడికి ఆగ్రహం వచ్చిందన్న భావంగా అన్వయించుకుంటే, మిత్రద్రోహానికి పాల్పడే వారెవరన్నది సులభంగా అర్ధం అవుతుంది. ఒకసారి దేవుడి అనుగ్రహం పట్ల నిరాశ చెందిన వ్యక్తిని దారి తప్పించడానికి షైతాను చాలా సులభంగా ప్రయత్నిస్తాడని, మిత్రుడిగా అంటే ఆలోచనల్లో దైవతిరస్కారమే మంచిదన్న భావాలు చొప్పించడం ద్వారా మనిషిని నాశనం చేస్తాడన్న భావం ఉంది. అలాంటి మోసానికి తాను గురిఅయ్యేది లేదని ప్రకటించాడు.అలాగే ప్రేయసి మొదటి పరిచయం గురించి చెప్పిన కవితలోను ఇదే సూఫీతత్వం ఉంది. మనిషి దైవగ్రంథం చదివినప్పుడు లేదా దేవుడి గురించి తెలుసుకుంటున్న మొదటిలో బహుశా అర్ధం కాకపోవచ్చు, కాని దైవం గురించి తెలుసుకునే ఆ అవకాశం కన్నా గొప్పేముందన్న భావం ఉంది. అంటే చివరి కవితను ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే మొత్తం గజల్ కొత్త అర్ధాలు తెలుస్తాయి. ఈ కవితలో పదడాంబికాలు లేవు. సరళమైన పదాలు. నిజానికి కవితలోని రెండు పంక్తులు రెండు వాక్యాల్లా కనిపిస్తున్నాయి. ఒక అత్యున్నత స్ధాయి ప్రేమను ప్రకటించేటప్పుడు పదడాంబికాల అవసరం లేదు. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4BxX6

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నీటి చాప ::::::::::::::::::::­:::::::::::::: పైనుండి ఆకాశం పారబోస్తున్న నీటి తెరకు ఒక పక్కగా నేను ఇంకో పక్కగా చిక్కని శూన్యం చీకటిని వెలుతురు ముళ్ళతో చీలుస్తున్న మినుగురులు వాటికి తోడు నిశ్శబ్ద దండోరాలు కొన్ని రాత్రి కోసం పహారా కాస్తున్న పగటి సాలీళ్ళు కలల్ని తమ కళ్ళలో సొంతంగా అల్లుకోడానికి విశ్వ ప్రయత్నం పెగలని పెదవుల మధ్యగా కొన్ని పలుకులు బళ్ళున వాన చినుకులు నేల పరదాపై ఎండుతున్న ఆనవాళ్ళు మరోసారి నింగి కింద ఇంకా తడుస్తూనే నేను.. తిలక్ బొమ్మరాజు 04.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hotwEz

Posted by Katta

Viswanath Goud కవిత

అంకితం ఎన్ని రాత్రులు రాతి పరుపులై చీకటి ముళ్ళని చల్లుకుని నీ తలపుల్ని గాయపరిచి ఎత్తుకెళ్ళడానికి ధీర్ఘంగా కొంగజపం చేస్తున్నాయో తెలుసా.... కలలు నీవి... కనే కళ్ళు నావి సూరీడు మబ్భుతెరలు కప్పుకుని శయనించిన ప్రతిసారి నా కనురెప్పలకు విశ్రాంతినిచ్చి కంటి'పాప'లకు పనిచెబుతాను నీ ఊహల జాడేదో తెలుసుకురమ్మంటాను.. ఏ గ్రహణం మింగిందో... ఏ అమాస ఊభిలో చిక్కుకున్నావోనని తోకచుక్కల తోకపట్టుకు రోదసంతా వెదుకుతుంటా...ఐనా కనపడవే నా కళ్ళు రాసుకున్న కలలు నీకు అంకితం చేద్దామంటే.! విశ్వనాథ్ 04APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcSgFx

Posted by Katta

Em Es Naidu కవిత

:: గాలిని మింగాను :: కావాలనే కదూ కల ఇవతల చనిపోయావు కలవలేని కలపలేని కన్నీటి కనికరం ఎందుకులే సువాసనే దుఃఖంది హత్తుకున్న ఖాళీ హృదయం ఏ ప్రేమదో కోరిన కోరిక కానుకై వస్తే అది మనసుశ్వాసే నిద్రలేక గాలిని మింగాను

by Em Es Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fBdNFX

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

మా అబ్బాయి చి|| రోహిత్ గోవర్ధనం ఈ ఎన్నికల వేళ, ఒక అర్థవంతమైన, సమయోచితమైన లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి ఆ లఘుచిత్రాన్ని చూసి, మా అబ్బాయిని ఆశీర్వదించగలరు. ఈ చిత్రంలో నేనూ ఒక పాత్రను ధరించడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. http://ift.tt/1q7sy6S - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7sy6S

Posted by Katta

Viswanath Goud కవిత

విశ్వమాలికలు. . 1.తారలపై అలిగి... మూతి ముడిచిన చంద్రుడు.... నెలవంక.! 2.నీఊహల చిగుళ్ళు ఎన్ని తిన్నదో నామనసు కోయిల.! తనువుకు వసంత శోభతెస్తూ.. తనదైనశైలిలో ఆలపిస్తోంది ప్రేమగీతం.!! 3.దాగుడుమూతలు ఆడుతున్న సూర్యచంద్రులు.! ఒకరికొకరు యుగాలుగా పట్టుబడకుండా.!! 4.వెతుకుతూనే ఉంటాయి నా కళ్ళు.! ఇలలోనో, కలలోనో నువ్వు పట్టుబడేవరకు.!! 5.మగజాతికిది తీరని అన్యాయమే.! కవులు, కవయిత్రులు అందరూ...మగువల గురించే వర్ణిస్తుంటే.!! 6.భారంగా నా కనులు.! నిద్ర కరువై కాదు సుమా..... నీతలపులు కరువయ్యే..!! 7.పచ్చనోటుపై బాపూజీ బోసినవ్వుల తెల్ల'ధనం'.! నల్లధనంగా మిగిలిపోతున్నానని తెలియదు పాపం.!! 8.శాస్త్రవిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందనట్టే.! వస్తుభారాలను కొలవగలిగే సాధనాలే కాదు గుండెభారం కొలవగలిగే సాధనాలు రానంతవరకు.! 9.దైవత్వం నాకు బాగా ఎరుకే.! ప్రతిరోజు నాతల్లికళ్ళలో నాపై చూపే ప్రేమానురాగాల దివ్యత్వపు వెలుగును దర్శిస్తున్నాగా.!! 10.తన గుండెచప్పుడు నేనేనంట.! నేను పరిచయమయ్యేవరకు తను ఎలా బ్రతికిందో మరి.!! 11.నీశీథి మునిగిన శిథిలాలయాలు....కన్నులు.! పట్టుకు వేలాడే గబ్బిలాలు ...కలలు.!! 12.ఐకమత్యం.! కళ్ళు రెండు....చూపు ఒకటే.!! 13.సూర్యచంద్రులు.! ఏకకాలంలో ప్రపంచవీక్షణం గావించే సందర్శకులు.!! 14.పాకుడురాళ్ళు... కళ్ళు..! కన్నీళ్ళు నిలబడవు.!! 15.ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలట.! నాగుండెలో దిగబడిన నీజ్ఞాపకాలను తీసేయాలంటే ఏజ్ఞాపకాలు కావాలో.!! 16.మాసానికోసారిఉప్పొంగే వెన్నెల సంద్రం.! భూమి తీరాన్ని వెలుగులతో తడుపుతూ.!! 17.మనసైనోడికి దగ్గరవ్వాలంటే ఆకర్షించాలన్నారటెవరో.! అయస్కాంతంతో తయారయ్యింది తింగరబుచ్చి.! 18.జీవనది కాలం.! ప్రవహిస్తూనేఉంటుంది సమయం.!! 19.కళ్ళు మాయాదర్పణాలు.! తనను తప్ప అందరిని చూపెడతాయి.! 20.చందమామకో దిష్టిచుక్క.! ఎన్ని తారకల కళ్ళు పడ్డాయో.!! -విశ్వనాథ్ 03APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouOtHR

Posted by Katta

John Hyde Kanumuri కవిత

కృపాతిసయము *** తరతరములలో నీ ఉపదేశములను మా పితరులకిచ్చి నడిపించితివి, నిలిపితివి ఇలలో చీకటిలో నడచిన జనులకు నీ వాక్యపు వెలుగు జ్యోతులతో నీ త్రోవలలో తొట్రిల్లక నివశింపజేసితివి నేటివరకు మరియ సుతుని మాకొరకిచ్చుటకు నీ దయకు ప్రాప్తురాలుగ జేసితివి వేదన బాధలలో తోడుగనుండి వదనము మార్చితివి నీ రూపులో కలతలందు వెతలయందు కల్లోలపరచిన కన్నీళ్ళయందు ఏకాంతంగా సంధించి అబ్రహాము తండ్రిగా బలపరచితివి సంసోనుకిచ్చిన బలముతో సమూయేలుకిచ్చిన నీ పిలుపుతో సుందరత్రోవలలో నడచుటకు యిమ్ము మరి యాశీర్వాద అపరంజి పాదముల్ సుందరపట్టణ బంగారు వీధులలో నడువ కటాక్షం బొసగ యిచ్చిన గురూతులతో ఆశీర్వదించితివే ఆనందమయముగా మమ్ము మూడింతల దీవెన మాకొసగ మా మససు నీతిఫలములు ఫలియింపగ నీధ్యాసలో మిక్కుటముగ నడువ నీ మధుర స్నేహ వచనమిచ్చితివి మాకొరకు కృపాకనికరము లింకను నిజానుభవములతో నింపి అగష్టస్ కాలమునుండి నింపితివే నిన్నెరిగిన వారికి నా డెందముప్పొంగగ యేసుడే విడువక నింపెనే సదా నందము రత్నములై మెరిసెనిల కృపాతిశయమేరీతి పాడెద పద్మప్రియ తేజునికి మరణం గెల్చిన విజయం వందనమ్ములీ నా పదములెల్ల సుధాకరుడగు యేసుని నిత్యభూషణంగ ధరియింప శాంతి స్వరూపులనుగా మార్చి చైతన్య పరచితివి ఇలలో ప్రీతిగల నీమాట, పాటలు ఆశతో మేము నేర్వగా శృతిచేసి మమ్ములను సుందర సింగారము చేసితివి పరమేరీతి పోనగునో నీ దాసు నీలాగు దెల్పితివే దావీదు రాజ కుమార జయకుమార తరలితివే స్లీవకు మము రక్షించగ ఏమిచూసో నుర్వితిగుచుండ నీ వాక్యఖడ్గాన పరంజి చేసి చీల్చితివే కీళ్ళ మూల్గులను సుందరంబే స్సియోను మార్గము పద్మమే వికసింప ధరిత్రిపాడెనే శ్రావమై ఆకసం జయగీతమెత్తి సంగీతమే అలరారే ప్రతినోట నీ ప్రేమ కొనియాడగ మధురమేగా మాటిమాటికి రుచి చూతును, ధ్యానింతుము బోధింతును ఎల్లవేళల హల్లెలూయ, హల్లెలూయ హల్లెలూయ, హల్లెలూయ ఆమేన్ ... ఆమేన్

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pr4T3S

Posted by Katta

Sriramoju Haragopal కవిత

గాథాలహరి గడ్డిపరకలాగ అణిగినా నిటారుగానే వుంటాడు నీవున్నావని వాడికి తెలుసుకదా మల్లెపువ్వులాగా నవ్వుతూనే వుంటాడు వాడు ఫీనిక్స్ పక్షిలాగా నీదగ్గరే కాలిపోతుంటాడు కదా ఎక్కడైనా రాతిగుండెలో కూడా జీవించగలడు నీలో కలిసిపోవాలని కోరుకున్నాడుకదా ఎల్లప్పుడు కాలం కన్నా ముందరే వుంటాడు నీ కన్నా ముందు పుట్టిన నిరీక్షణ కదా వాడు వాడు మరణించినా చావులేనివాడు వాడు నిన్ను వరించిన వాడుకదా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAOns8

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-37 నీలోని ఆకాశం మేఘరహితమైనపుడు తెలుస్తుంది అక్కడ సూర్యుడున్నాడని... మాటల్లోని సంభావ్యత ఏమిటో తెలిసినపుడు నీ మౌనం కూడా సంభాషించడం ఎదుటివారికి తెలుస్తుంది... పుట్టలోనుంచి బయలుదేరిన చీమల్లాంటివి ఆలోచనలు అవి ఎప్పుడూ ఈ విశాలవిశ్వం లో ఎవరినో ఒకరిని కుట్టి కార్యోన్ముఖులని చేస్తూనే వుంటాయి... మనకి అతి దూరంగా ఉన్నవి ఎలా అర్ధం కావో ఒక్కోసారి అతి దగ్గరగా ఉన్నవి కూడా అర్ధం కావు..! ------------------------------------------ 3-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pXuNJS

Posted by Katta

Nirmalarani Thota కవిత

వెతుకులాట..! విచ్చుకునేదాక ఒళ్ళంత కళ్ళతో తమకంగా వేచి చూస్తే విరిసీ విరియగానే నలుదెసలా తనకందకుండా పరుచుకునే తావి విరహంలో తమ తనువు చాలించే విరి కన్నియలు ! గగనాల నీడల్లో పరుచుకోవాలని సాగిపోయే గాలిని పట్టుకోవాలనే పంతమో పారవశ్యంతోనో పరుగులు తీస్తూ పరిమళం ! విశ్వమంతా వింత పోకడలతో తిరిగే నిలకడలేని మబ్బు తునకని చల్లబరచి కురిపించాలనే ప్రయత్నంలో పయనిస్తూ పలవరిస్తూ గాలి తెమ్మెరలు మబ్బేమో యెద నిండా తడి నింపుకోవాలనే తీరని దాహంతో వాగుల వెంట, సంద్రాన్ని వెతుకుతూ అగాధాల్ని ఆణిముత్యాల్ని తనలో నింపుకున్నా తనివితీరని సంద్రం ఆకాశాన్నందుకోవాలనే ఆశలో ఎగిసి పడుతూ పాలపుంతల్ని ఇముడ్చుకున్న ఆకాశం మాత్రం అందర్నీ ఊరిస్తూ ఎవరికీ అందకుండా ఆశల్ని రేపుతూ చిద్విలాసాంగా తటిల్లతై మెరుస్తూ . . ఉన్నదానిపై శీతకన్ను . . అందని మాయలేడిపై సీత కన్ను ! అసలు "మేడ్ ఫర్ ఈచ్ అదర్ " ఉత్తి ట్రాష్ ! అంతా "పెయిడ్ ఫర్ ఈచ్ అదరె . . కాసిన్ని కాసులో..ఊసులో..అందాల రాశులో కాకుంటే దోసెడు కన్నీళ్ళో గుప్పెడు నవ్వులో భూసారం తగ్గినప్పుడల్లా మనుషుల స్థావరాల స్థానచలనాలు తెలుసు పచ్చదనం మొలిపించే నేల గుండెల్ని తడుముకుంటూ ! సంద్రాలు దాటే విహంగాల విహారమూ తెలుసు మేత దొరికే చోటు కోసం గూటి కోసం రెక్కల్ని తరుముకుంటూ ! కానీ.. కానీ.. అదేంటో చిత్రంగా "మనసులు" వలస పోవడమేంటో ప్రేమను వెతుక్కుంటూ మజిలీలు మారుస్తూ ?!!! నిర్మలారాణి తోట [ తేది: 04.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTWa5W

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

నదిపాట అలల గొంతుతో నది పాడుతుంటుంది ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని కచేరీ ముందు వీక్షకులు చేరినట్టు నది వొడ్డున చేరుతుంటాయి నది గొంతెత్తి మరింత మార్దవంగా ఆర్ధ్రంగా లాలిత్యంతో పాడుతుంది నదిది సమూహపు పాట సర్వదుఃఖాలనూ, దుఃఖావశేషాలనూ కడిగేసే జోలపాట జలపాట ఈ నది పుట్టి ఎన్నాళ్లయ్యిందో ఏ ఆదిమకాలపు వీరుడో నదిని నిలువునా ఛేదించి ఆవలి తీరానికి తొలి దారి వేసాడో ఎందరి మబ్బు బట్టిన కన్నుల్లో వేకువ సూరీణ్ణి నాటిందో నది గత వర్తమాన చరిత్రకు నిలువుటద్దంలా ఈ నది 2 నది దుఃఖాన్ని ప్రేమిస్తుంటుంది నురగల పరవళ్ల పాటలాగే దుఃఖాన్నీ గొంతు నిండుగా నింపుకుని దిక్కుల గుండెల్లో ధ్వనించేట్టు మహా ఆవేశంతో ఆలపిస్తుంది నది పాటంటే గాయాల పాటేనేమో ఏ ఆదివాసీ తల్లో పరమ ఆవేదనతో కార్చిన కన్నీరు ఎండి జ్ఞాపకంలా మిగిలిన కన్నీటి చారికేనేమో ఈ నది - కౄర అరణ్యమృగం దాడికి ఎముకలు బయల్పడిన లేత జింక దేహంలా నిండా తేలిన రాళ్లతో చుక్క నీరు లేని ఈ నది - 3 ఈ రోజు తెల్లారి కలలో నది కనిపించింది పడవేసుకుని నది మీదికి బయలుదేరాను లయబద్ధంగా తంత్రుల్లా కదలాడాల్సిన అలలు మూగగా రోదిస్తూ.. ఏవో కొన్ని పక్షులు నది మీది ఆకాశాన్ని రెక్కల కింద బరువుగా మోస్తూ మహా గుంభనంగా.. నది చనిపోయిందా ? ఏఏ అరణ్యాలనో, ఏఏ పర్వతాలనో దాటుకుంటూ తరాల మధ్య వంతెనలా అనంత జీవకోటి దేహాంతర రక్తప్రసరణలా ఎన్నెన్ని ఊళ్లనూ ఎన్నెన్ని పొలాలనూ వొరుసుకుంటూ ప్రవహించిందో ! నది మీద నాలుగు కన్నీటి బిందువులు రాల్చాను నదిని దగ్గరకు చేరదీసాను చేతులారా తడిమాను మూగబోయిన నదికి మళ్లీ తన రెక్కల పాటను గుర్తుచేయాలనుకున్నాను యిలా అనుకోవడమే అనుకోవడమే నది పాటయ్యింది పాటే నది అయ్యింది 4 విష పుష్పావృతచేతులతో నదిని దహనం చెయ్యొచ్చు వికశిత పుష్పాలంకారిక మాంత్రిక హస్తంతో నదిని మహానదిని చెయ్యొచ్చు నది ప్రజల అరచేతుల్లో నిండా మొలిచిన తడి మొలక నది - నది పురివిప్పుతుంది నది పురివిప్పుతుంది ( 'చంపావతి నది'ని చూసి దుఃఖంగా.. ) రచనా కాలం : 1 ఏప్రిల్ 2014 3.4.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hETAjf

Posted by Katta

Kamal Lakshman కవిత

పరుగు రాణి.........................కమల్ లక్ష్మణ్ పరుగులు.. పరుగులు... పరుగులు .. లేడిని మరపించే నీ పరుగులు చిరుతను తలదన్నే నీ ఉరకలు అనితర సాధ్యాలైన నీ విజయాలు మాటలకందని మహాద్భుతాలు నీ జయకేతనాల పరంపర దేశ విదేశాలలో జగద్విఖ్యాతం పద్మశ్రీ లు ,పయోలి ఎక్స్ ప్రెస్ లు నీ మకుటంలో కలికితురాయిలు అతివలకు ప్రేరణనిచ్చిన నీవు నారీ లోకానికే తలమానికం యావత్ప్రపంచం శ్లాఘించే నీవు భరత మాత ముద్దు బిడ్డవు అఖండ భరతావని గర్వించే అరుదైన పరుగుల రారాణివి నీవు ఈ అనంత విశ్వం లో మరపురాని మరువలేని మా ఉషారాణివి నీవు కమల్ 03.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouubOy

Posted by Katta

Pusyami Sagar కవిత

గాయం _________పుష్యమి సాగర్ అప్పుడు ఎప్పుడో మట్టి పొరల్ల్లో పాతేసిన నీ జ్ఞాపకాలు కన్నీటి వర్షానికి భూమిని చీల్చుకొని మొలకేత్తినప్పుడు, చిగురాకులా వణికి పోయాను నా వేర్లని నేనే నరుక్కుంటూ క్రుంగి పోతాను ఏమో అని !!! చిరిగిన బతుకు విస్తరి ని సంచి లో వేసుకొని అక్కడ అక్కడ తెగిపడిన నవ్వు శకలాలను ఏరుకుంటూ గత కాలం నుంచి ప్రయాణం చేస్తూ చేస్తూ వర్తమానపు గమనం లో గమ్యం తెలియని బాటసారిని అయ్యాను నీ వెంట ఏడు అడుగులు నడవలేక ...!!! నా చే చెప్పబడ్డ కొన్ని తియ్యని మాటలనే చిలక లా మారి నువ్వు మరొకరి చెవి లో చెప్తున్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన చెక్కిళ్ళ ని చేతుల్లో కి తీసుకొని బరువు గా ముద్దాడుతు ... నన్ను నేను ఒధార్చుకున్నాను !!!!... ఇక నా సన్నిధి నుంచి నువ్వు దూరం గా వెళ్ళిపోయి మరొకరి ఒడి లో సేద తీరుతున్నావు అని తెలిసాకా.. మరణానికి దారులు వేసుకోలేక ముక్కలయిన హృదయాన్ని సముద్రం లో కలిపెయ్యటానికి బయలుదేరుతున్నాను ...!!! ఏప్రిల్ 4, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaEFND

Posted by Katta

Pusyami Sagar కవిత

గాయం _________పుష్యమి సాగర్ అప్పుడు ఎప్పుడో మట్టి పొరల్ల్లో పాతేసిన నీ జ్ఞాపకాలు కన్నీటి వర్షానికి భూమిని చీల్చుకొని మొలకేత్తినప్పుడు, చిగురాకులా వణికి పోయాను నా వేర్లని నేనే నరుక్కుంటూ క్రుంగి పోతాను ఏమో అని !!! చిరిగిన బతుకు విస్తరి ని సంచి లో వేసుకొని అక్కడ అక్కడ తెగిపడిన నవ్వు శకలాలను ఏరుకుంటూ గత కాలం నుంచి ప్రయాణం చేస్తూ చేస్తూ వర్తమానపు గమనం లో గమ్యం తెలియని బాటసారిని అయ్యాను నీ వెంట ఏడు అడుగులు నడవలేక ...!!! నా చే చెప్పబడ్డ కొన్ని తియ్యని మాటలనే చిలక లా మారి నువ్వు మరొకరి చెవి లో చెప్తున్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన చెక్కిళ్ళ ని చేతుల్లో కి తీసుకొని బరువు గా ముద్దాడుతు ... నన్ను నేను ఒధార్చుకున్నాను !!!!... ఇక నా సన్నిధి నుంచి నువ్వు దూరం గా వెళ్ళిపోయి మరొకరి ఒడి లో సేద తీరుతున్నావు అని తెలిసాకా.. మరణానికి దారులు వేసుకోలేక ముక్కలయిన హృదయాన్ని సముద్రం లో కలిపెయ్యటానికి బయలుదేరుతున్నాను ...!!! ఏప్రిల్ 4, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaEFx2

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి స్వయంకృతం ఎన్ని పక్షులు ఎగిరిపోతున్నాయ్ నాలోంచి ఎన్ని స్వప్నాలు అదృశ్యమైపోతున్నాయ్ నాలోంచి ఎన్ని గతాలు మాయమైపోతున్నాయ్ నాలోంచి ఎన్ని రాగాలు రాలిపోతున్నాయ్ నాలోంచి ఎన్ని సుగంధాలు ఆవిరైపోతున్నాయ్ నాలోంచి ఇక హృదయం ఏం నిలుస్తుంది నాలో నేనే ఒక రంధ్రాన్నై నాలోంచి నేను జారిపోతుంటే నేనే ఒక శూన్యాన్నై నన్ను నేను కోల్పోతుంటే 03Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAgjfM

Posted by Katta

Maheswari Goldy కవిత

|| మ నో హ రం || మహేశ్వరి గోల్డి. హైందవి నదిలో హేమంతాలు పసిడి కిరణములద్దిన ప్రేమపల్లకిలో స్వాతిముత్యములయి ప్రభవిస్తూ అందమయిన,,, హంసలేఖలపై చాందిని సుమవేణువులతో నవమోహన సాహితీ సింధువులను అనూహ్యరీతిలో యామినీ దీపాల వెలుగుల సాక్షిగా అవిషీకరిస్తూ పడమటి కనుమల కాంతి సౌధంలో ప్రాణసుమవాహినీ జలతరంగాలపై,,, రాగమంధారాలుగా విరిసి స్వచ్చమయిన అనురాగ ప్రవాహినిలో ప్రేమ కలువలుగా కాంతి సౌరభాలను వెదజల్లి...!! విరజాజుల వెన్నెలలో మన ఊహల బాసలను మాయని మమతలుగా దృవీకరించ...!! మకరందాల మధువనిలో గత జీవన ఇతిహాసాలను నెమలికుంచెలతో నవ చెలిమి సోపానాలపై సుగంధ పరిమళాల పన్నీటి సిరాతో,,, మిన్నంటిన తారల సాక్షిగా అతిరహస్యముగా లిఖిస్తున్నవి అనురాగ శాసనములపై ఓ శశిధరా...!! ధృవతారలనంటిన నెలవంక నగవులు ఆ విచిత్రాలను మన రేఖా చిత్రాలుగా ఊహిస్తూ మౌనంగా మధువులొలికిస్తున్నవి ప్రియ మనోహరా...!! 04/04/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q6BWYu

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

----- చిరాశ /// పడగ నీడ /// ************************************************* వాడి అ౦తస్తు పెరిగే కొలదీ... నా బతుకు బజారున పడుతున్నది వాడి గవాక్ష౦ నా యి౦టి అణువణువును ఎక్స్-రే తీసి, మరుగే లేకు౦డా చేస్తున్నది వాడి బాల్కనీ నా కప్పులేని బాత్రూమ్ ని సిగ్గు లేకు౦డా వెక్కిరిస్తున్నది వాడి యి౦టిని చల్లబరిచే ఏసీ మిషన్ నా మొఖాన వేడి ఆవిర్లు గక్కుతున్నది వాడి కారు పొగగొట్ట౦ నా గుడిసెలోకి పొగను ఊదుతున్నది వాడి డస్ట్ బిన్ డబ్బాలన్నీ నోళ్ళుతెరిచి నా వాకిట ముగ్గులో చెత్త గొబ్బెమ్మ లవుతున్నాయి వాడి బిల్డి౦గ్ నీడలో నా కమ్మరేకుల గుడిసె పాము పడగ నీడన జేరిన కప్పలాగా కన్పిస్తు౦ది *************************************************** ----- {04/04/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jasNuV

Posted by Katta

Padma Arpita కవిత

పెద్దమనిషయ్యా.. ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!? అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు.. ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!? జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు.. ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!? తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు.. పద్మార్పిత.. 3rd March 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3i2OM

Posted by Katta

Veera Sanker కవిత

IIపనులే రికార్డ్ అవుతాయ్II -వీరశంకర్ ఒరేయ్ బాబులూ! ఎవడో చెప్పిన కొటేషన్లు పిచ్చ పిచ్చగా ఓవర్ యాక్టింగులు చేస్తూ ఊదరగొట్టకండ్రా మీకు పుణ్యం ఉంటుంది. చిన్నప్పట్నించి విని విని మా తలలు బొప్పికొట్టుకుపోయాయ్! అరవకుండా కరవకండా అమ్ముడుపోకుండా కుదురుగా నిలబడి మీరేం పీకుతారో కాపీలు కొట్టకుండా మృదువుగా చెప్పండ్రా! చరిత్రలో మీరు రికార్డ్ కారు మీరు చేసిన పనులే రికార్డ్ అవుతాయ్...

by Veera Sanker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h7xRBW

Posted by Katta

Narsimha Reddy Tagirancha కవిత

ప్రాణం అంతా గడబిడగా గందరగోళంగా ఉంది ఈ జీ వన ప్రయాణమెటువైపో తెలియక ...! మనసంతా కకలవికలమై అయోమయంగా ఉంది ....! 'మని'షి మర్మమేంటో తెలియక ...!! పువ్వు లా మురిపిస్తూనే.. నవ్వుతూ చేయందిస్తూనే... మట్టి పాలు చేసే ముష్కర ఆలోచనల ఆంతర్యమేంటో తెలియక .. గుండె నిండా గుబులుగా ఉంది ...! కాలికి ముళ్లు గుచ్చిందా... తల నొప్పి వచ్చిందా..... 'నెల రోజు ల పాటు ఆబ్జర్వేషన్.. లేకపోతే మీకే పరేషాన్... అవసరమేమో ఆపరేషన్..!' బిల్లులేమో బోలెడు బిళ్ల మాత్రం ఒక్కటే...! ఈ దేవుళ్లకు పట్టపట్టిన మనీ దెయ్యమెపుడు వదుల్తుందో తెలియక అవయవాలన్నీ ఆగమాగమైతుంటే... గుండె అంత గుబులుగా ఉంది ..! రాజకీయం రంగు నీడ లు కురిపిస్తూ... రసవత్తరంగా చదరంగ మాడుతుంది.. ఈ కుటిలత్వకోటలు బీటలు వారి కూలి పోయేదెన్నడో తెలియక... సామాన్య జనం పెయ్యంతా రాచపుండ్లయితుంటే.... గుండె ల నిండా గుబులుగా ఉంది ...!! తలరాతను తల్చుకుంటేనే.. తలపండు పగిలినట్లయితుంది...!! . . . . . . నర్సింహ రెడ్డి

by Narsimha Reddy Tagirancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxSStn

Posted by Katta

Prasad PV కవిత

**//నాన్న జ్ఞాపకం//** వీళ్ళంతా నువ్వు లేవంటారేం నాన్నా.. నా ప్రతి అడుక్కీ దారి నువ్వే అవుతున్నావుగా, ఒకరినొకరు చూసుకోకుండా మనమెప్పుడైనా నిద్ర లేస్తున్నామా..! నీ చిరునవ్వుతో నిద్ర లేచిన ఉదయాన్ని రోజంతా శ్వాసిస్తూ రాత్రి నీ ఒడికి వస్తే నీ జ్ఞాపకాలతో తెల్లవార్లూ నన్ను లాలిస్తున్నావుగా…!! మరి వీళ్ళంతా నువ్వు లేవంటారేంటి..? కాలేజీకెళ్ళేప్పుడు పిల్లలు ‘తాతయ్యా.. బై’ అని ఆఫీసుకెళ్లేప్పుడు నేను ‘బాపూ వస్తా’ అనీ బయటికే చెప్తే మా ఎదురుగానే కూచుని నువ్వు మాకు ‘టాటా’ చెప్పేది వింతగా చూసేవాళ్ళకు కనపడ్డం లేదా..! రోజూ కలలోకొచ్చి నాతో నువ్వు కబుర్లాడుతుంటే అమ్మకు కోపమొచ్చి నాతో మాట్లాడ్డం మానేసింది.. నువ్వు అమ్మకు కలలో కనపడ్డం లేదటగా మరి..! నువ్వెప్పుడూ నన్ను నీ ఒళ్ళో బంధించి నీ ప్రేమను చూపకపోయినా జీవితంలోని ప్రేమంతా నీ కళ్లల్లోనే కనిపించేదిగా.. ఒక్కసారి అమ్మకు కూడా కనపడు నాన్నా..! సుతిమెత్తని నీ చేతివేళ్ల స్పర్శ గుర్తొస్తే కాలం ఎందుకు అక్కడే ఆగిపోలేదనిపిస్తోంది.. అప్పుడూ ఇప్పుడూ అంతే, ఏముంటుంది నాన్నా మన మధ్య..! నువ్వు నా గురించి, నేను నీ గురించి ఆలోచించడం తప్ప..!! నాకుతెలిసి నీ కళ్లల్లో నీళ్లెప్పుడైనా చూసానా.. నువ్వు నీ శ్వాసతో సెలవు తీసుకుంటున్నపుడు నావైపు చేయి చాపి రాల్చిన కన్నీటి బిందువు.. కాలం పేజీపై అలాగే గడ్డకట్టుకుపోయింది.. అప్పట్నుంచీ మనిద్దరం కలుసుకోనిదెప్పుడంటావ్....? రోజూ రాత్రి నా కనురెప్పల వెనక దాగి దోబూచులాడుతూనే ఉన్నావుగా,, మరి ఇంకా నువ్వు లేవంటారేంటి..? నా చిన్నప్పుడు నీ గుండెలపై తచ్చాడి ముద్దాడిన జ్ఞాపకం నాకు లేదు గానీ నాన్నా.. నాదొక్క కోరిక తీరుస్తావా.. నిన్ను నా ఒళ్ళోకి తీసుకొని ఒక్కసారి ముద్దాడాలని ఉంది నాన్నా!! (మా నాన్న స్మృతిలో...) -ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3T0I9

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDOe7U

Posted by Katta

Nirmalarani Thota కవిత

నిశీధి నీడల చెంత నిరీక్షణ ! కాంతులీనే కనుల కోసమో కనుల వెలిగే కరుణ కోసమో జనారణ్యపు జాడల వెంట అన్వేషణ ! మచ్చలేని మనసు కోసమో మనసున మెదిలే మమతల కోసమో ముసిరే మబ్బుల్లో వెన్నంటే నీ నీడను చూసా విరిసే పువ్వుల్లో మురిసే నీ నవ్వుల్ని చూసా కురిసే చినుకుల్లో నర్తించే నీ భావాలు చూసా కర్కశంగా దూసుకొచ్చిన గ్రీష్మం మబ్బుల్ని, పూవుల్ని, చినుకుల్నీ నిర్దాక్షిణ్యంగా మాయం చేస్తే మిగిలింది నేనూ . . వెక్కిరిస్తూ నా ఒంటరితనం ! ఏ చోట మొదలు పెట్టినా గమ్యం మొదటికే వస్తున్న వలయాల్లో నింగికెగరాలన్న నా తపనకు ఏ రెక్కలు తొడగాలి? నిర్మలారాణి తోట [ తేది: 03.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k23kYk

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyrjdB

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

మనం మరిచిపోతున్నదే ! - పారువెల్ల ఎందుకో తెలియదు ఈ హృదయం నెలవంకను చూసి మురిసిపోతుంటుంది శిల్ప సౌందర్యాన్ని చూసి కరిగిపోతుంటుంది కనులు మూసుకోవడమో ! చేతులు జోడించడమో వంగి లేవడమో ప్రార్థనలుగా మిగులుతున్నాయి మతమంటే ఇంకొకకటుంది , అది నీకు నాకు తెలిసినదే ‘మనం’ మరిచిపోతున్నదే 03-04-14

by Srinivas Reddy Paaruvella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpu9Tn

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

పిల్లలూ.. కవులూ... కనిపించని పూలగుత్తులతో పిల్లలు ఎదురుచూస్తుంటారు అభిమానం కొంత ఆరాధన కొంత కళ్ల నిండుగా పరిమళిస్తుంటుంది కవుల ఆలోచనలచేతుల్లోనూ కనిపించని శ్రమ సౌందర్యపు పూలుంటాయి కరచాలనం చేసినా కౌగిలించుకున్నా కళ్ల ఆర్ధ్రమేఘాల బిందువులు దేహం నుంచి దేహంలోకి ప్రవహిస్తాయి కవులూ పిల్లలూ ఏ దేశానికైనా ప్రాణవీచికలు ! రచనా కాలం : 4 ఏప్రిల్ 2014 Time : 7 pm

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q5YgkN

Posted by Katta

Sky Baaba కవిత

సముద్రమంత నవ్వు..! - - - - - - - - - - - సముద్రాన్ని పలకరిద్దామని వచ్చాను చాన్నాళ్లకు వచ్చానని- అలిగింది..! ఆకాశాన్నై ఈ ఒడ్డును చుంబించాను ఆవలి ఒడ్డును ఆకాశం కౌగిలించుకోడాన్ని చూపుతూ.. నవ్వింది..! అబ్బ..హ్‌...! సముద్ర మంత నవ్వు..! గుండెల్లో నింపుకున్నాను... నీ కందిద్దామని...!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osN7xc

Posted by Katta

Sasi Bala కవిత

నిశ్శబ్ద గీతం ......................శశిబాల (3 ఏప్రిల్ ) ------------------------------------- నిశ్శబ్దం రాజ్యమేలే వేళ ........ పగిలిపోయిన గుండెను అతికించుకుంటూ నిదురించే జ్ఞాపకాలను హత్య చేస్తూ కన్నీటి కుండలను కంటి కావడిలో మోస్తూ అశ్రు ధారలతో ఎండిన బుగ్గలను నీ పలకరింపుల పన్నీటితో కడగాలని ప్రయత్నిస్తూ నీకై ఎదురు చూసే కళ్ళలో ఆశల గులాబీలు పూయిస్తూ తీగలు లేని మానస వీణకు నా హృదయ తంత్రులనేసి మీటుతూ చూస్తున్నా ...ఎదురు చూస్తున్నా వెన్నెల కోసం చకోరిలా ఎడారిలో పాడే కోయిలలా ఆశ చావక నీ కోసం రాని వసంతం కోసం మొండిగా ..మొండిగా ఎదురు చూస్తున్నా నిదుర కాస్తున్నా

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3xPWH

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ ||ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు|| ** అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు గుబులెన్నో అంతులేని నేతల గొంతెమ్మ కోరికలెన్నో! ** పనితనం బేరీజులో నూటికినూరు సున్నాలే ఎవరి పుస్తకం తెరిచినా మసిబారిన పేజీలే! ** లాభ సాటి స్థానం శక్తికి మించినదే గెలుపు మేతకు యుక్తిలెన్ని పన్నాలో! ** గతచరిత్ర విలువ మచ్చుకైనా లేకపోయె చీకటి కోణపు కతలన్నీ చూస్తే తన్నులే! ** ధనం మద్యం ముందు ఉద్రేకం ఆవేశం పనిచేస్తాయా? ఉపాయం అలోచన శూన్యం కుర్ర, కర్ర పెత్తనం గెలిస్తుందా? ** జుట్టు రంగు మారిస్తే జట్టుకు హంగులొస్తాయా? బట్టతల ఎత్తుగడలకు పుట్టగతులున్నాయా? ** తిట్టిన వాని పక్కనె చేరి జైకొట్టాలన్నా! పెంచినవాణ్ణి నెట్టగ గోడలెన్నో దూకాలి ** సిగ్గులెగ్గులొదిలేయాల్సిందే సీటుకై తొడుగు విముఖమైనా చేరాల్సిందే! ** వంటలు చేసో బట్టలుతుకో కాళ్ళు పిసికో కాయం శ్రమించాల్సిందే! ** చేరిన వాడి అవినీతి మచ్చ గోప్యమవుతుంది వాడుకొట్టిన దెబ్బ మానుతున్న మచ్చవుతుంది! ** వచ్చినవాడి నాలుక (నోరు) నరంలేనిదైనా ఇచ్చవచ్చినట్లు మాట కుట్టేయాల్సిందే! ** పార్టీ చెక్‌లలో బొక్కపెట్టి చక్కగ చెక్కులు ఫోర్జరీ భోజ్యం కోటావాటా చాటుమాటైనా సూటుకేసులు సర్దే లౌక్యం! ** నిలబడతానని మాటిచ్చి రాబట్టాల్సినదంతా నొక్కేసి చివరిక్షణంలో వెధవ్వేషం త్రేంచుకుంటూ పలాయనం! ** బతిమాలితే బిర్ర బిగుస్తారు అర్థణాకి చెల్లనోడు బోషాణం కోరుతాడు! ** రాష్ట్రం బ్రష్టు పడ్డా నాకేమి కేంద్రం చేరితే చాలు వక్రమార్గం నడవాలంటే చక్రం తిప్పేది అక్కడే! ** అమ్మకు అన్నంపెట్టనోడు అత్తకు మంచం వేస్తాడు ఆలికి అన్యాయం చేసైనా అంగడిబొమ్మ చేరతాడు! ** పార్టీలు మారేటోడికి జాతి లేదు! నీతి లేదు! గెలిచామా లేదా అంతే ఎవరేమనుకుంటే ఏమి? ** కట్టి పడేస్తే వెట్టి చాకిరి మెతకవహిస్తే అసరుకెసరు! అసలు సరుకే కొసరు మోసం! పిల్లి పెసరతో పాల ఫాక్టరి! ** ఐకమత్యం అందమైన నినాదం! రంగులోరంగు ఆనదని (రం) గులతో ఆరంగ్రేటం! ఓటేసేటోళ్ళు ఓటి వెధవలా? నోటాతో నోటుని, నోటిని సాగనంపరా! ** 3.04.2014 11.06 am

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h5XRNY

Posted by Katta

P Raja Sekhar కవిత



by P Raja Sekhar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcsOX

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఎదురుచూపు... నువ్వు నాకోసం ఎదురు చూసే క్షణాన, నన్ను నేను ఖాళీ చేసి ఉంచుతాను. నా నుండి నేను వీడిపోయి నువ్వెప్పుడు నాలో నిండుకుంటావని శూన్యమై వేచిచూస్తాను. నా హృదయాన్ని అద్దంలా పరచి, నేనైన నిన్ను నాలో ఒంపుకుంటాను. నీ ఎదురుచూపుల్లో నన్ను కౌగిలించుకున్న కాలాన్ని పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను. స్వచ్చమైన నా మనసుని దోసిలిపట్టి నీవైన నన్ను నేనే అభిషేకిస్తాను. 04-04-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcruo

Posted by Katta

Abd Wahed కవిత

ఎన్నికలు – వాహెద్ కనీసం మేకలు మేయడానికి నాలుగు పోస్టర్లయినా దొరికాయి.. నాల్రోజులు నాయకులు కళ్ళకు కనిపిస్తారు ఐదేళ్ళపాటు గుండెల్లో గునపాల్లా దాక్కుంటారు ఓటు బరువు మోసి మోసి వంగిన నడుం లేస్తుందా? కంటిలో నిరాశల నెత్తురు చూపుల పెనుమంటకు చమురునిస్తుందా? మానిపోయిన గాయంలా పాత హామీలే మళ్ళీ చిగురిస్తున్నాయి... బండిచక్రంలా తిరుగుతుంది అధికారం కందెనలా నలుగుతుంది సగటు ప్రాణం జెండాకొయ్యలు గాలివాటును మార్చేదెప్పుడు? ప్రాణంలా ప్రేమించిన ప్రేయసి చిరునవ్వులా ఎన్నికలు పంజరంలో చిక్కుకున్న పావురంలా ఫలితాలు...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k7odkO

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//డప్పులు// ఏటెళ్ల కాలం ఇదే తంతంటే ఇసయం తెలవంది ఎవల్లకి కర్చు తగ్గ డప్పులు మంచులో మోగుతాయా! ఇంటానికి ఇమానం మోత రేడియోలో బానే ఉంటది పెయాణం చెత్తేనేగాందా దూది అవసరమవుద్ది పోనీ ఒక్క తూరైనా నా మాట ఆలకిత్తావా.. డబ్బుకీ గుణం అబ్బాలి ఎంచేతంటే డబ్బుకి జబ్బుకి తుమ్మకిజిగురంత సావాసం మరి యాపారానికి డబ్బవసరమే డబ్బుకోసం చేసే సావాసాలన్నీ యాపారాలే రంగులు నీకు నువ్వే కడుక్కోవాలి రంగనాయకి ఏసాలు మానేయ్ పొద్దొడిచాక నెతుక్కుంటే అద్దంలో డప్పులే అగుపడతాయ్.....02.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mIcqGQ

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || వాడిపోయిన పువ్వు || వాడిపోయిన పువ్వు కొమ్మనుండి రాలిపోయే క్షణానికి ముందు జీవితాన్ని శ్వాసించడం ఎంత కష్టమో నీకు తెలియదు నన్నెవరూ చేతులలోకి తీసుకోరు మురిపెంగా సిగలో దోపుకోరు మాలలో కలవనివ్వరు, దేవునిపై జల్లనివ్వరు కనీసం నేనూ పువ్వునని గుర్తించరు ******* వింటున్నావా లేక నువ్వూ ఈ లోకం లాగే సమాధిలో నిదరోతున్నావా చెంపలపై ఎండిన కన్నీటి గుర్తులు ఎర్రని ప్రేమ లేని పగిలిన పెదాలు రోగాలతో చిల్లు పడిన దేహం ఏముంది నా దగ్గర ఆకర్షించడానికి మనసూ నీతోనే పాతిపెట్టబడింది ******* నాకేమీ వద్దు ఒక చుక్క ప్రేమ ఈ ముసలి గుండెను తడిపితే చాలు కొమ్మనుండి నవ్వుతూ రాలిపోతాను మీ చాంద్ || 02.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPEiJ7

Posted by Katta

Prabhakar Mandaara కవిత

తెలంగాణ రాష్ట్రం లో ఆవిర్భవిస్తున్న తొలి తెలంగాణ సాహిత్య త్రైమాస పత్రిక " జంబి " కి స్వాగతం ... సుస్వాగతం ! ఈ పత్రిక ఆన్ లైన్ లొ కూడా లభ్యం : www.ejumbi.com

by Prabhakar Mandaara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pQaXON

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ ఏదో జరుగబోతున్నది కొత్త ఆశలతో కొత్త కోర్కెలతో నవ వసంతమవతరించింది త్యాగాల ఆత్మబలిదానాల సకల ప్రజా ఉద్యమాల ఫలం అమౄత భాండ స్వర్ణపీఠమది గులాబీపూలు గోదావరీ ప్రవాహమై పొంగుతూన్నాయి కమలం కుల పర్వతమై(స)మతంగా ఎదుగుతూన్నది అదృశ్య హస్తమొకటి అంచెలంచెలుగా రంగులు మారుస్తూన్నది భుజాలు చేతులు కాళ్ళు ఒకసారి కనిపిస్తే పెదవులు కళ్ళు తొడలు మరోసారి కనిపిస్తూన్నాయి శిరస్సు లేదు శిస్నం లేదు అసలు దేహమే శూన్యం శతాబ్దాలు శతాబ్దాలుగా నిత్యం నేను మరణిస్తూనే ఉన్నాను నాలికలు చాపిన సకల అధికార దాహం చంపుతూనే ఉన్నది నన్ను కొత్త విద్య నేర్చిన శిష్యగణం మరణించిన మృతపుండరీకానికి ప్రాణమిచ్చి శక్తినిచ్చి కొత్త రూపానిచ్చి అలంకరణాభరణాలనిచ్చి ఒక స్వేచ్చా సౌందర్యాగ్ని కీల వెలిగించబడింది అభివృద్ది రాకాసి పైశాచిక శక్తి మృత్యు కుహరాలను తెరిచింది ప్రాణమిచ్చిన వాడిదా వాడిదా-వీడిదా-వాడిదా కర్ణభేరులను చేదిస్తూన్న వాటాల వాదం నేనెక్కడా శిధిల శకలమై కూడా మిగలలేదు విజయోత్సాహం వీరంగమేస్తూన్నది రాజ్యం ఒక రాజకీయ రంగస్థలం ఒకే నటుడు దశావతారాలనెత్తి ప్రజావాహినిని ఉర్రూతలూగిస్తూంటే గొర్రెలన్నీ కాయితాలను తిని సిరాతో నాలుక తడుపుకుంటున్నాయి మేక వన్నె మెఖాలు 'మెకాలే'సిధ్ధాంతాన్ని కప్పుకున్నాయి చీరలన్నీ మాయమై చైతన్యాన్ని చుట్టుకున్నాయి ఇక్కడ సామూహిక లక్కాగృహాల దహనం జరుగుతూన్నది ఇప్పుడు మర్మ మార్గాలు చూపే"విదురులు" అలభ్యం సంజీవనీ వనాలు మాయారణ్యాలయి మారణ హోమాల సాక్ష్యాలను కోల్పోతున్నాయి నీళ్ళు నిధులు ఊళ్ళు ఉద్యోగాలు పదవులు పొట్లాలు పొట్లాలుగా-పెట్టెలు పెట్టెలుగా కట్టలు కట్టలుగా-సీసాలు సీసాలుగా కంచెలు దాటి మందల మధ్య నుండి ప్రవహిస్తూన్నాయి మళ్ళీ నేను ఒక మాంసపు ముద్దనై ఉప్పూకారము అద్దబడి మాటలతో చేతలతో నగ్నీకరించబడ్డాను ఒక సమూహమై నిలిచి-కీర్తి లాలసనై అపకీర్తి కళంకితనై శూన్య మహార్ణవమయినాను ఒక పసివాడు చిరిగిన లాగును పైకి గుంజుకుంటూ మధ్యం పాకెట్టు నీళ్ళ పాకెట్టు పట్టుకొని తల్లి కొంగు చాటు నుండి తండ్రి కొరకు నడుస్తున్నాడు చరిత్ర టర్నింగ్ పాయింట్ లో రక్తమోడుతున్న స్త్రీ దేహం ఒక రుడాలి చేతిలో ఏదో జాగ్రత్తగా పట్టుకొని నడుస్తూన్నది నడక ఆగగానే ఏదో జరుగబోతున్నది అవును ఏదో జరుగబోతున్నది ------------- జ్వలిత 9989198943,02/04/2014,7.58పి.ఎం

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLf2Wg

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jYfWj7

Posted by Katta

యం. శ్రీవల్లి కవిత

ll ఏమో మరి ..నా ప్రేమll యం.శ్రీవల్లి. 04/04/2014. కాదనలేని సత్యమో.. ఔననలేని అహంభావమో... అంతులేని మోహమో... మోయలేని విరహమో... ఏమో మరి..నా ప్రేమ. మాటరాని మౌనమో.... అలవికాని అనురాగమో.... గుండెలో ఇముడ్చుకోలేని ప్రేమో... వ్యక్తపరచలేని భావమో... ఏమో మరి నా ప్రేమ. అక్షరాల్లో కూర్చలేని కావ్యమో... బంధనాలు దాటలేని దాస్యమో... అర్ధంకాని తత్వమో... నువ్వే కావాలనుకునే మొండితనమో.. ఏమో మరి నా ప్రేమ. సందేహాల నడుమ ప్రశ్నగా నా ప్రేమ.. వదులుకోలేని బంధమై నాప్రేమ... ఒంటరిదైనా ...నీతలపుల ఊపిరితో.. అమరమే నా ప్రేమ.

by యం. శ్రీవల్లి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q2EsPq

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే... నేస్తమా..! @ రాజేష్ @ 04-04-2014 ప్రజలడిగినప్పుడు చేశావు నీవు కాంగ్రెస్ డ్రామా సీమాంధ్రలో నీకు స్థానమే లేదనుకున్నాక ఎందుకీ హైడ్రామా ఇపుడెవరడిగారు నీ రాజీనామా..! కావూరీ... సీనియర్ గా నీకిది న్యాయమా...!!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QKkH2U

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q2Es1S

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నిశ్శబ్ద యుద్ధం... పచ్చని చెట్టు నుండి ఆకులు రాలిపడినప్పుడల్లా ఓ నిశ్శబ్ద యుద్ధం ఎవ్వరికీ కనిపించకుండా కాలం మధ్యలో ఎవరో ధారగా పారబోసినట్టు కొన్ని ఆశల నిక్షేపాలు రహదారి నిండా ఆకులు తమకు తాముగా కాక ఏదోక సున్నిత పాదం కింద చిట్లుతుంటాయి నొప్పి తెలియకుండా ఆ క్షణం మళ్ళా ఓ సంఘర్షణ ఎవరూ ఆక్షేపించకుండానే నిధులన్నీ చెత్త కుప్పల్లో గనులుగా నేరేడు నీరాజనం కొంగ్రొత్త స్పర్శలో ఆ ఆకాశాన్ని ఇవాళ కూడా దులిపేదీ నీ చేతి కొనలే మేఘాలు మొరిగినప్పుడల్లా ఈ మనసు పుటాలకు ఇంకా మోజు తీరలేదు ఎన్ని మట్టి రాత్రులను శ్వాసించినా మరికొన్ని యుద్ధాలు నిశ్శబ్దంలోనే... తిలక్ బొమ్మరాజు 02.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPEmsi

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత

ఎండ మండిపోతుందని చెప్పేందుకు రాజేంద్రకుమార్ దేవరపల్లి,2-4-2014 ఎండ మండిపోతుందని చెప్పేందుకు మొహమాటమెందుకోయ్ కవీ!! తల మాడుతోందనీ కాళ్ళుకాలుతున్నాయని చెప్పేందుకూ సిగ్గేనా? దాహమవుతుందనీ దప్పికతీర్చమని అడిగేందుకు అడ్డంకేమిటోయ్ పిచ్చివాడా? చెప్పులో,గొడుగో,తలగుడ్డో ఇవన్నీ తాత్కాలికమేనోయ్ బాబు పైకప్పు పాడయ్యింది పద తాటితోపులవైపు వెళదాం.

by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4dB3

Posted by Katta

Vijay Kumar Svk కవిత

ఆధునిక కవిత్వంలో భావాన్ని ప్రకటించడానికి "ప్రతీకలు" బహుళంగా తోడ్పతున్నాయి. అయితే, ఈ ప్రతీక విధానంలో ఒక లోసుగుబాటు ఉంది. స్వభావ సిద్దంగానే వాటి అర్ధం అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని అందుకోడానికి కవితో చదువరికి సాదృశ్యమయిన భావన, దృష్టి అవసరం. లేకపోతె ప్రతీకలు అర్ధం కావు. అర్ధమైతే అపూర్వానందం. లేకపోతె అయోమయం. కవితలో ప్రతీకలు వాడేటప్పుడు కవులు అవి అర్ధమయ్యే వాతావరణాన్ని పరోక్షంగా అయినా కల్పించాలి. ---యం. రవీంద్రా రెడ్డి ( 'వచన కవిత్వం- అస్పష్టత ' నుండి)

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4bJj

Posted by Katta

Satya NeelaHamsa కవిత

కలిసి విడదీసాం ^^^^^^^^^ -సత్య మరి, జరిగిందేదో జరిగిపోయింది ఏది ఏమైనా మనమే కలిసి చేసేసాం నేనొక చోటా నువ్వొక పూటా వెరు వేరైనా విడివిడిగా ఒకే చందమామని కలిసి చూసేసాం నా నిరీక్షణ నీ దారి వేరువేరైనా ఒకరి తలపుల్లో ఒకరుగా కలిసి నడిచేసాం నా తలపు నీ మరుపు వేరు వేరైనా ఒకరి మనసుల్లో ఒకరం కలిసి మరిచేసాం నా తెగువా నీ బిడియం వేరువేరైనా ఎడభాటుకి మాత్రం కలిసి అడుగేసాం నా ఆవేదన నీ అలోచన వేరువేరైనా పంచుకున్న కాలాన్ని కలిసి మూసేసాం నా హరివిల్లూ నీ బొమ్మరిల్లూ వేరువేరైనా కలల సౌధాన్ని కసిగా కలిసి కూల్చేసాం నా విరహం నీ తమకం వేరువేరైనా తడబాటులో కన్నీరు కలిసి వదిలేసాం నా విడుపు నీ పట్టు వేరువేరైనా పెనవేసుకున్న కౌగిలి కలిసి విడదీసాం -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN

Posted by Katta

Arcube Kavi కవిత

పువ్వులు.----ఆర్క్యూబ్. పువ్వు చాటింపు వెయ్యది పూస్తుంది..అంతే ! రాలిపోతుంది అంతే నిశ్శబ్ధంగా.. * * కవులు కళాకారులు పరిశోధకులు ఇంకా.. అడవిలో జనతన సర్కార్.. అడవంత పూస్తరు అకాశమంత పూస్తరు సమాజమంత పరిమలిస్తరు ఒక చెమట చుక్కలా రాలిపోతరు పువ్వుల నిశ్శబ్దంగా..

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q2hFmJ

Posted by Katta

Kamal Lakshman కవిత

శుభోదయం ....! ప్రియమైన ముఖపుస్తక మిత్రులారా..! మనలో మాట..! మన దైనందిన జీవితంలో ఎవరైనా మన మనసులో హఠాత్తుగా గుర్తుకు రావటం , వారిని గురించి ఒక రెండు నిమిషాలు ఆలోచించటం , అందులోనూ వారిమీద ఆ సమయంలో సదభిప్రాయపు జ్జ్ఞాపకాలు కలగటం, వారిని పలకరించాలనుకోవటం, అందుకు వారికోసం ఒక అయిదు నిమిషాలు కేటాయించటం , దానికి ఒక అయిదు రూపాయలు వెచ్చించటం ఒక చిన్న విషయమే.( అయినా ఈ రోజుల్లో కష్టమే)....... ఎంతో ఆదుర్దాగా మనం ఫోన్ చేస్తే తీరా సదరు వ్యక్తి . ....ఏంటి ఇన్నిరోజులకు గుర్తొచ్చానా...? ఇంకా చావలేదులే బతికే ఉన్నానంటూ ... అని యేవో మాటలు అంటూ... దెప్పటం, నిష్టూరాలాడటం...మొదలెడతారు... మన మనసు ఒక్కసారిగా ఛీ ...ఎందుకు పలకరించాను రా బాబు నా ఖర్మ ...అని మూడ్ ఆఫ్ చేసుకుని బాధపడుతుండటం మనకు తరచుగా జరుగుతుంటుంది...ఇది చాలా చిన్న విషయమే కానీ ఈ రోజుల్లో నిజానికి ఇది ఎంతో పెద్ద విషయం.....( మరి ఇది ఇంత చిన్న విషయమే అయితే మనకున్న రెండు,మూడు వందలు లేదా వేల స్నేహ సంబంధాలకు ప్రతి రోజూ ఎందుకు ఫోన్ చేసి మాటాదలేకపోతున్నాం......??? ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే మనకు ఎవరైనా ఫోన్ చేస్తే కాస్తా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడితే పోలా....( వారు ఎలాంటి వారైనా, కారణాలు ఎన్ని ఉన్నా రెండు నిమిషాలు పక్కన పెట్టేసి).. ఇద్దరికీ హాయి ....ఏమంటారు...? నా మాటలు గమనిస్తే మీరు తప్పకుండా అవునంటారు.... ఉదయాన్నే నా మంచి మాట (ఈ చిన్న సుత్తి) విన్నందుకు థాంక్స్...లేకపోతే ఇప్పుడు నేను ఫీల్ అవుతానండోయ్ మరి........హ హ హ హ....ఉండనా మరి...!!! HAVE A VERY LAUGHING DAY..... మీ కమల్ 04.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHc4zv

Posted by Katta

Sasi Bala కవిత

వసంత హొయలు .......................శశిబాల ----------------------------------------------- వర్ణ వర్ణ శోభితమైన కుంకుమ వన్నెలతో వసంత లక్ష్మి బాలభానుని ఎర్రని కాంతిని పెదవులకు అద్దుకొని ఆధరాలు పూపరాగ మధువులనుకొని తుమ్మెదలు వాలుతుంటే తెమ్మెరలతో వాటిని తరమాలని ప్రయత్నిస్తున్నది కోయిలలను గారాం చేస్తే అవి గునగున లాడుతూ ముద్దుగా కూని రాగాలు తీస్తున్నాయి చిగురాకు ఊయలలూగే చిలుకలు చేసే శ్రావ్యమైన మేజువాణీలు ఎదలో మధుర భావనలు రేకెత్తిస్తున్నాయి కళకళలాడే కలువ కన్నెలు వసంత లక్ష్మి పాదాలకు పారాణి శోభలందిస్తున్నాయి చిలుకలు కొరికిన అరమగ్గిన జామపండ్లు తళుకులీనే ఆమె బుగ్గలను గుర్తు చేస్తూ మదిలో అలజడి సృష్టిస్తున్నాయి కోకిలలు ఆలపించే రాగాలు మదిలో మోహన గీతాలై పులకింతల గమకాలై పూలతలను కదలించి జలజలా నేలకు విరులను రాలుస్తున్నది అందాల రతి రాణి ముత్యాల పలువరుస వసంత కన్య కంఠసీమలో ముత్యాల సరమై ప్రకాశిస్తున్నది మన్మథుని విలంబానికి (ఆలస్యానికి ) అలిగిన ఆమని మోము కెంజాయ వర్ణాలను సంతరించుకొని వింత కాంతులను ప్రతిఫలిస్తున్నది ఆహా ఎంత మనోహర మీ వసంత శోభ (4 ఏప్రిల్ 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OgvkbL

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఐదు 1. నేల నా పొలం నింగి నా తలరుమాలు గాలి నా చెమటల ఆవిరి ఎండ నా వెచ్చని వూపిరి నా కన్నీళ్ళు ఇంకని సముద్రం 2. వాడిపోని వసంతాలన్నీ నా పొలంలోనే మరిగిపోని రాత్రింబవళ్ళు నా కంటిలోనే ఊపిరులూదే ఆశల సేద్యగాణ్ణి రేపటి నక్షత్రాల సోపతిగాణ్ణి పచ్చటి నేల, పచ్చటి నీరు, పచ్చటి ఎండ పచ్చటి చందమామ, పచ్చటి ఆకాశం నేనొక పచ్చటి వెలుగురాగాల ఏక్ తారను మిన్ను మన్నునేకం చేసిన పాటను 3. కైగట్టని దుక్కంలేదు, కైగట్టని నవ్వూలేదు కైగట్టరాని దేముంది ఈ లోకంలో ఊకుంచడానికయినా, చెప్పరాని బాధలయినా పట్టరాని సంతోషమయినా, పట్టి దాచుకున్న పచ్చరెక్క ముచ్చట్లయినా కైగట్టరానిదేముంది 4. పులకరించిపోయే కలలకు ఈ దేహం పలవరించిపోయే వూహలకు ఈ మోహం నేను నాకే చాలని విశ్వాన్ని నేను నాకే చిక్కని రహదారిని 5. నా లెక్కనె నా కవిత్వం కూడా నా పక్కనె నా కవిత్వం నీడ

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PhPfIf

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ॥ ఇప్పుడు మనసు కడుక్కోవాలి ॥ ---------------------------------- స్రవించని అశ్రువులతోనో, ఘనీభవించన రుధిరంతోనో కొంచెం నా మనసుని కడుక్కోవాలి ఇప్పుడు . దుర్గందాల దురాలోచనలనుంచి, భావ దారిద్ర్య దోరణలనుండి పునీతం చెయ్యాలి కొంచెం . గుప్పెళ్ళతో పిండైనా సరే గుప్పెడు గుండెను పదిలంగా కాపాడుకోవాలి వ్యర్దాలన్నీ వడకాచి. కొలిమిలో నిప్పులతో కడిగైనా మనసుకి అంటిన మలినాలను ఒక్కొక్కటిగా శుబ్రపరచాలి . ఈ వృద్ధ హృదయాన్ని రాలిపోయేలోగానైనా కొన్ని నీతి బిందువులలో శుద్ధి చేసి మళ్ళీ ఈ దేహంలో అమర్చాలి . కొన్ని గడియలు ఊపిరి ఆపైనా కొంత మానవత్వాన్ని నేర్పించి మరలా కొత్త జీవం నింపాలి సరికొత్త పునర్జన్మనివ్వాలి నా మనసుకు ! (02-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1op3xGR

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-3 Dt. 02-4-2014 మనసు పొరలో మానవత్వం పేరుకుంటే మంచిది పొరుగు వాని సామరస్యం కోరుకుంటే మంచిది సంసారమే ఒక సాగరం అని ఎప్పుడూ నైరాశ్యమేనా ఆత్మస్థైర్యమే నావగా నడిపించుకుంటే మంచిది దేశ రక్షణ నాది కాదని ఎప్పుడూ నిర్లక్ష్యమేనా ప్రతీ ఒక్కరు వీరగంధం పూసుకుంటే మంచిది దోపిడీలే వృత్తి అనుకొని ఎప్పుడూ దుర్మార్గమేనా మంచి అన్నది కొంచమైనా పంచుకుంటే మంచిది ఇంటిలోన ఆలుమగలు ఎప్పుడూ చిరుతగవులేనా పెరటిలోన శాంతి మొలకలు నాటుకుంటే మంచిది కులం కులమని కుమ్ములాటలుఎందుకోయి "చల్లా" సమత బడిలో ఓనమాలు దిద్దుకుంటే మంచిది

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1op3vP9

Posted by Katta

Sriramoju Haragopal కవిత

లో లోపల... 1. నీవెక్కడున్నా నిన్నెలా వినగలుగుతున్నాను నీవెక్కడున్నా నిన్నెలా కనగలుగుతున్నాను నిన్ను చుట్టివున్న గాలిలా నీ స్పర్శనీ, నీ వాసనల్నీ, నీ కోమలతను నిన్ను చూపించే వెలుగులా నీ సౌందర్యాన్నీ, నీ సహచర్యాన్నీ నేనెలా అనుభూతించగలుగుతున్నాను నేనెలా అనుభవించగలుగుతున్నాను నేను నీకన్నా వేరు కానని నేను నాకన్నా నీకే చేరువని ఎట్లా తెలిసిపోతున్నది ఎట్లా తడి నిండుతున్నది దూరాలు, నిశ్శబ్దాలు, కోపాలు, తాపాలు, అహాలు, అపోహలు, స్వార్థాలు, మోక్షాలు తెలియని ఎడమెరుగని ఇష్ట మోహం చావెరుగని సృష్టి దాహం కొండవాగు చలువల్లో, గోదారి అలల్లో, అడివిపూల కొండల్లో పసివాడిలా నన్ను పాలించే నిన్ను వొదలని నా ప్రేమే కదా నిజమిదే కదమ్మీ 2. అన్ని రుతువులు నువ్వే అన్ని స్వప్నాలు నువ్వే అన్ని సాధనలు నువ్వే నదినై నీలోకి సాగే నా యాత్ర శ్వాసనై నీలో స్పందించే నా కవిత్వం అన్నింట్లో నువ్వేరా ఇంక నేనెట్లా వేరురా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1op3xXb

Posted by Katta

Kavi Yakoob కవిత

బెంగాలీ కవి సుబోద్ సర్కార్ ప్రసంగం : కవిసంగమం పోయెట్రి ఫెస్టివల్ ఆగస్టు 15 ,2012 http://ift.tt/1pIPBoq

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIPBoq

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

వేసవి విడిది రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ దప్పికతో ఆర్చుకుపోతున్న గొంతుకలు వడదెబ్బకు రాలిపడుతున్న పండుటాకులు నీరంటూ ప్రహింపనోపని కుంటలూ, వాగులూ, కాలువలు కరెంట్ రాకను చెప్పలేకపోతున్న కాలఘంటికల పంచాంగాలు తొలకరిజల్లులకోసం చేలగట్లమీదనే నిద్రపొతున్న వ్యవసాయం వేడిని తట్టుకునే సత్తువలేక మట్ట్టికుండల వైపు దీనంగా చూస్తున్న ఆరుబయట చొక్కలిప్పుకుని విసనకర్రలుగా వాడుకుంటున్న పల్లెజనం. నోరూరించే బంగినపల్లి మామిడి పళు,రసాలూ కొబ్బరి బోండాలూ చిటారుకొమ్మ మీదనుంచి బుట్త్టకెక్కిన చింతచిగురు రాత్రంతటినీ రసరాజ్యం చేసుకోండని నవ్వులతో సత్కరించే మల్లెలూ సంపెంగలూ సన్నజాజులూ రాత్రుళ్ళూ పగళ్ళూ నిద్రలేకుండా ని శాచరుల్లా వెంటపడి బతిమాలే నేతల అనుచరగణం ఇదేమి క్షోపరా అనుకుంటూ ఉస్సురనుకుంటూ రుతువునీడేరుస్తున్న గ్రీష్మ కోపతాపాలు. o4-o4-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5ikxB

Posted by Katta

Kavi Yakoob కవిత

మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం! ............................................................. నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసిపోయినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దు:ఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకు మించి కళ్ళు చెమర్చటం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు. దగ్గర..దగ్గర..అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి! ముద్దు పెట్టిన ప్రేయసి రైలెక్కి వెళ్ళిపోతున్నా కనురెప్పలు తడవవు. కన్నతండ్రి ముఖం మీద కడపటి పిడక పెట్టాక కూడా కన్నీరు ఉబకటం లేదు. కబేళాల్లో పశువుల్ని వదలి పోయినట్టు, తన్ని తగలేసే స్కూళ్ళల్లో శిశువుల్ని వదలి పోయినప్పుడు కూడా చెక్కిళ్ళు తడవటం లేదు. వ్యాధి సోకింది. మహమ్మారిలా పాకుతోంది. ఇంకినతనం. నీరింకిన తనం, కన్నీరింకిన తనం. ఇది సోకిన వాళ్ళు ఇక ఎప్పటికీ ఏడ్వలేరు. ఏడ్పును తిరగేస్తేనే కదా నవ్వు! కాబట్టి నవ్వలేరు కూడా. మందు కావాలి.స్ట్రెచర్‌ మీద రోగి ‘ఆక్సిజన్‌, ఆక్సిజన్‌’ అని అరిచినట్లు, నేడు మీరూ, నేనూ, అందరమూ ‘కన్నీళ్ళు, కన్నీళ్ళు’ అని కలవరిస్తున్నాం. ఎవరన్నా తపస్సు చెయండర్రా! ఏ దేవతయినా వచ్చి కడివెడు కన్నీళ్ళు ప్రసాదించి వెళ్ళిపోతుందేమో! ఇలాంటప్పుడే రోడ్డు మీద తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న ఎవరో ఒకతను ‘ఏడ్చుకుంటూ’ కనిపించాడు. అవును. అతడు అంతటి ఆరోగ్యవంతుడెలాఅయ్యాడు? రహస్యమేమిటో? అతడు క్రమం తప్పకుండా మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం తాగుతాడు. అవును కన్నీళ్ళే కవిత్వం. కవిత్వమే కన్నీళ్ళు. నేడు కవిత్వమొక నిత్యావసరం. అందుకే కవిత్వం మీద పడుతున్నారంతా. కవిత్వాన్ని ఎవ్వరూ రాయలేరు. రాస్తే అది కవిత్వం కాదు. కవిత్వం దానికదే రాయించుకుంటుంది. కళ్ళు చెమర్చిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కో జీవనదిలా ప్రవహిస్తున్నారు. వీరంతా కవిత్వ మహాసాగరంలో కలిసే చోటునే కవిసంగమం అని పిలుస్తారు. ఈ రసక్షేత్రంలో ఒక్కసారి మునిగితే చాలు మొత్తం పొడితనమంతా పోతుంది. భూమినీ, దేహాన్నీ, దేశాన్నీ, ఊరునీ, ప్రాంతాన్నీ కోల్పోయిన మేఘాలన్నీ ఒక్కసారిగా కరిగితే కలిగిన కుంభవృష్టిలో తడిసిన మహా దు:ఖాను భూతి కావాలంటే, ఈ క్షేత్రాన్ని దర్శించక తప్పదు. III III III ఎన్నో ఏళ్ళ ఎడతెగని ఎండ తర్వాత, వీధుల్లో పడుతున్న వానలో అన్నీ కొత్తగానే వుంటాయి. తప్పిపోయిన మిత్రుడు హఠాత్తుగా కనపడి ఆనందంతో డొక్కలో తన్నినట్టు ఒక పక్కకు తోసేసే గాలీ, నిప్పుల మీద సాంబ్రాణి కొచ్చిన పొగలా, నేల మీద వాడి చినుకులు లేపిన ధూళీ, అప్పుడే అలకవీడిన అమ్మాయి ముఖంలా తళుక్కు మన్న మెరుపూ, ఎదుట ఊదే సన్నాయి ఊపుకు రెచ్చిపోయిన డోలు దెబ్బలా, ఉలిక్కి పడ్డ ఉరుమూ..ఓహ్‌! తనువున్నది ఇలా తడిసిపోవటానికేనేమో! కవిత్వం తడిపేస్తుంది. కవిత్వం మీద కవిత్వం ముంచేస్తుంది. కవిసంగమం కవులు కవిత్వం మీద కవిత్వం రాశారు. మరోమారు నిర్వచించాలన్న కోరికతోనో, తమకు తెలుసంటూ దబాయించాలన్న వ్యూహంతోనో, రాసింది కవిత్వం అవునో కాదో అన్న అనుమానంతోనో కాదు. ఏహ్‌! నాకు కవిత్వం దొరికిందోచ్‌- అన్న సంబరంతో మాత్రమే రాశారు. నీరు మధ్యలో నేల తగిలితేనే కాదు, నేల మధ్యలో నీరు ఉబికినా సంబరమే. కవిత్వమే. ‘తేనెల చినుకులా/ ప్రభవించి ప్రవహించే ఏరులా/ చైతన్యపు జడిలా’ ఒకరికి దర్శనమిస్తే, ‘ఒక పువ్వు, ఒక పిట్ట కూత, ఒక దు:ఖాశ్రువు’లా ఇంకొకరికి సాక్షాత్కారిస్తుంది. ‘పసిబిడ్డల పకపకల్లో’ ‘తుపాకి మడమల మీద కునికిపాట్ల’లో అడ్డంగా దొరికిపోయిందీ, ‘రాళ్ళని మార్చేసి’ రహస్యంగా మాయమయిందీ కవిత్వమే. కొత్త తనం, పచ్చతనం, తాజాతనం, తడియారనితనం- తటిల్లతకు గురిచేస్తూంటే, లోతులూ, చెక్కుళ్ళూ, పదబంధాలూ, ప్రతీకలూ ఎవరిక్కావాలి? కొలతలకే అడుగులు; అనుభవాలకు తప్పటడుగులే. ఏ పసివాడూ ఒక్కలా నడవడు. అలా నడిస్తే అది మార్చింగే. దారితప్పితేనే కవిత్వం. దారిన వెళ్ళితే వచనమయిపోదూ! కవిత్వం ఆవహిస్తే అంతే. దారి తప్పించేస్తుంది. ‘తండ్రి చెప్పుల్లో కొడుకు కాళ్ళు పెడుతున్నప్పుడు’ పసివాడికి పెద్దరికం రాదు. కానీ ఆ సన్నివేశాన్ని మురిపెంగా చూసే తండ్రి మాత్రం ‘బాల్యంలోకి ఇట్టే జారుకుంటాడు’. బిడ్డ తాను అడుగులు వేస్తాడో లేదో తెలియదు కానీ, తండ్రి చేత తప్పటడుగులు వేయస్తాడు- అచ్చంగా కవిలాగే. ఇది మాయే. మంత్రమే. కాదు మరీ. ఎరిగిన ప్రపంచాన్ని ఎరగనట్టుగా, అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా వెళ్ళిపోవటం మాంత్రిక వాస్తవమే. కవిత్వం పూనితేనే కానీ అడగాల్సినవి అడగం. అంతవరకూ దాహమేసినప్పుడు రొట్టెనూ, ఆకలేసినప్పుడు నీటినీ అడిగే వుంటాం. పెళ్ళి కోరిక పుట్టినప్పుడు ‘తాళికట్టాలి ఓడబ్బు మూట తెచ్చిపెట్టు నాన్నా’ అని మారాం చేసే వుంటాం. తృప్తి ని అడగటం మాని, కీర్తికోసం దోసిలి పట్టే వుంటాం. చంటాడూ, కవీ అడగాల్సినవే అడుగుతారు. ‘నాకు కొంచెం బాధ కావాలి. గుండెల్ని పిండే నొప్పి కావాలి’ అంటారు. ఏడుస్తారు. మారాం చేస్తారు. గుక్కపడతారు. ‘ఏడిశాడు’ అని అందరి చేత అనిపించుకోవాలని చూస్తారు. అది తిట్టుకాదు. దీవెన. ‘ఇప్పుడే పుట్టాడు’ అన్నంత గొప్ప ఆశీర్వచనం. ఎవరికి వారు ఏకాకులుగా సుఖపడి చస్తున్న నగరాల్లో, పట్టణాల్లో, పట్టణ వేషం కట్టిన పల్లెల్లో దు:ఖం వరమే. అప్పుడు బాధను మించిన తోడు వుండదు. ఇలాగే బాధ పడాలని నియమం లేదు, ఎలాగోలా బాధపడవచ్చు. చిటికెన వేలు మీద చీమ తో కుట్టించుకుని మరీ బాధపడవచ్చు. ఆ క్షణానికి బతికి పోవచ్చు. బాధే ఉనికి. బాధే అస్తిత్వం. III III III నీరే జీవమంటారు. నీరున్న గ్రహాలను నిలువెల్ల తడిమిచూస్తుంటారు. నీటి చారికలుంటే బతికిన జాడలున్నట్లే. బతకటమంటే కదలటమే. కన్నీటి జాడలున్నచోట కవిత్వం తచ్చాడే వుంటుంది. చలించేవీ, చరించేవీ ఒక్కచోట వుండవు. ఈది ఈది సముద్రగర్భాన్ని తాకి వస్తాయి,ఎగిరి ఎగిరి గగనాన్ని చుంబిస్తి వస్తాయి. నాలుగు పాదాలా నడచి నేలను చదును చేస్తాయి. ముందు కాళ్ళు ఎత్తి జరిగిన పరిణామానికి చిహ్నంగా చప్పట్లు కొడతాయి. కవిత్వమూ అంతే. వెర్రికేకయి, ఉత్త మాటయి. స్వరమయి, పదమయి, వాక్యమయి, నాలుగు పాదాల పద్యమయి, గేయమయి, వచనమయి, నిర్వచనమయి జరుపుకున్న ఉత్సవమంతా కవిసంగమంలో కనిపిస్తుంది. చేపయి, పిట్టయి, కోతయి, మనిషయి- అన్నట్టుంది కదూ. నిజం కూడా అంతే. యుగానికో చలనం కాదు, చలనానికో యుగం. కొత్త యుగంలో కూడా పాత చలనశైలి కనిపిస్తుంటుంది. నేల మీద నిద్రపోతూ కూడా, కొమ్మ మీద నుంచి జారిపడ్డట్టు ఉలిక్కిపడి లేస్తాం. అదో మురిపెం. వచనకవిత్వమేలే అని వెళ్ళిపోతుంటామా? ఎక్కడో ఒక గేయం మధ్యలో తారసపడుతుంది. అంత్య ప్రాస ఆట పట్టిస్తుంది. కవిసంగమం లో ఈ ముచ్చట్లకేం లోటు లేదు. ‘నీ పెదాల మీద వాలాకే/ బహుశా-/ గాలి గమనించి వుంటుంది/పాటా,ప్రాణమూ తానేనని’ పలికే నిర్మల వచనంలాగానే కాదు, ‘ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలె నేనుంటే/ పుడకమీదున్నట్టి మెరుపు తానంటాడు’ అంటూ ఊయలూపే గేయంలాగానూ కవిత్వం పలకరిస్తూ వుంటుంది. అక్కడక్కడా అంత్యప్రాసలూ వుంటాయి, అంతర్లయలూ వుంటాయి. అహో! ఏమీ ఈ మాయాజాలం? అని ఆశ్చర్యపోనవసరంలేదు. ఇది అంతర్జాలం! కాల, స్థల సరిహద్దు రేఖల్ని చెరపకుండా ఒక చోటకు చేరటం అంత సులభం కాదు. ఎవరెక్కడున్నా,ముఖాముఖిగా, ఎకాఎకిన పలకరించుకుని, గిచ్చుకుని, మెచ్చుకుని, తిట్టుకునే సౌకర్యం ఎప్పుడో, ఏ గ్రామంలోనో, ఏ రచ్చబండ మీదో సాధ్యమయ్యేది. మళ్ళీ ఇన్నాళ్ళకు అంతర్జాలం అదే సౌఖ్యాన్ని అనుగ్రహించింది. ఊళ్లల్లో పొద్దెరగకుండా తిరిగే పోరగాళ్ళను కూడగట్టినట్టు, కవులను ఈ అనుక్షణ మాధ్యమంలోకి పోగేసుకొచ్చాడు యాకూబ్‌. తాను తప్పుకుంటూ కాయకు చోటిచ్చే పూవులా, యాకూబ్‌ ఇన్ని ఫలాలను విరగ కాయించాడు. ఎవరి ఈల వారిది, ఎవరి పాట వారిది. అన్నీ విభిన్న ఫలాలే. ఎవరి ప్రత్యేకత వారిది. కాపు కాయటమే కవితోద్యమం అయిపోయింది. కవిసంగమం అయిపోయింది. III III III అందరి అస్తిత్వాలు ఒక చోట కొలువు తీరటం ఉత్సవమే. వెన్నెముక వంచకుండా, తల దించకుండా వుండే మనుషుల్ని ఒకే చోట చూసినట్టుంది. స్త్రీ,దళిత,బహుజన,మైనారిటీ,ప్రాంతీయ వాదాల ప్రతినిథులు శిఖరాగ్ర సమావేశం పెట్టుకున్నట్టుంది. ఈ వాదాలను హెచ్చవేయగా హెచ్చవేయగా వచ్చిన మానవానుబంధమే ‘మనిషి టు ది పవర్‌ మనిషి’. నిజం చెప్పొద్దూ. వీటన్నింటినీ ఒక చోట పెట్టుకుని చూస్తుంటే, నాకు నేను దగ్గరయినట్టుంది; నా శత్రువెవరో నాకు తెలిసిపోయినట్టుంది; నేను చేయాల్సిన యుధ్ధం సిధ్ధమైనట్టుంది. కవి సంగమం కవే అన్నట్లు, ‘ఒక్క వాక్యం కోసమే పేజీల కొద్దీ రాస్తుంటాం.’ వాదాలన్నీ చేసేది కూడా ఒక్క వాక్యం చెప్పటం కోసమే: ‘మనిషి మనిషేరా!’ మనిషి పక్కనే మనిషి వుండాలి, మనిషి కింద మనిషి కాదు. పదం పక్కన పదం వుంటేనే ప్రతీ పదానికీ అస్తిత్వం, వెరసి అపురూపమైన కవిత్వం. అందుకే కిందకు జారిన ప్రతీ మనిషికీ క్రమం తప్పకుండా కవిత్వం పట్టిద్దాం!! -సతీష్‌ చందర్‌ 9 ఏప్రిల్‌ 2013 (కవిసంగమం 2012 కవిత్వ సంకలనం కోసం రాసిన ముందు మాట)

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fq5cWs

Posted by Katta

Krishna Mani కవిత

మనసు ********** నా మనసు అలల తాకిడికి నడి కడలిలో దిగింది అంతుపట్టని ఆలోచనల సుడిగుండంలో గమ్యం చేరని నిర్జీవిలా చేపల ఆకలికి ఆహారంగా కనిపిస్తుంది ! ఆకాశంలో గద్ద చూపులకు గురిగా మారాను నిశి రాత్రి అడవి సింహాలకు లేడి పిల్లలా దిక్కు తోచక తిరిగితిని పెద్ద పులి కామ చూపులకు బలినై నిలచితిని గాలి హోరుకు తెగిన గాలి పటమై ఎగిరితిని కొనజేరిన జీవితపు క్షణాలని గుండె కార్చిన నెత్తుటిలో మునిగితిని ! తల్లి చూపుకు దూరమైతి తండ్రి యదపై భారమైతి దూది పింజకు నీరు తగిలి అడుగు బడితి ! కృష్ణ మణి I 02-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbBQg

Posted by Katta

Annavaram Devender కవిత

పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది అన్నవరం దేవేందర్ .....................................తొవ్వ...02.04.2014 అవును పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది .కరీంనగర్ లో ఇది గత ఎనిమిది నెలలలు గా సాగుతంది .ఒక్కో పున్నం నాడు ఒక కవి ఇంటి డాబా మీద కవులంతా సాయంత్రం ఏడింటికి జమ అయితరు.గుండ్రగా కూసోని మనిషో కవిత సదువుతరు .అటేనుక ఆ కవితలన్నీ మల్లవచ్చే పున్నం కు పుస్తకంగా వస్తయి.తెలంగాణా రచయితల వేదిక జిల్లా శాఖ దీన్ని ఏర్పాటు చేస్తే సాహితీ సోపతి అచ్చోస్తది. ఇది ఇప్పుడు మహా అద్బుతంగా నడుస్తంది .ఒక్కో పున్నం కు అరవై ,డెబ్బై మంది కవులు వస్తుండ్రు .ఇందులో యువ కవులు పది పదిహేను దాక ఉంటరు.ఇలా కొత్తగా రాస్తున్నవారు హాజరవడం పాత వాళ్లకు ఆనందం అయితంది . మల్లా కవిత్వం కూడా కొత్త పుంతలతో రాస్తండ్రు .ఇలా కరీంనగర్ లో కవిత్వ వాతావరణం వెళ్లి విరుస్తుంది ఒక్కో కవి ఇంటి డాబా మీద ఎన్నీల కవిత్వం నడుస్తుంటే అక్కడికే పులిహోర ,బజ్జీలు ,సమోసా ,గుడాలు ,గారెలు ఇలా ఎదో ఉపాహారం వస్తుంది .ఆ రాత్రి సాహిత్య అనుభూతి తో గడుస్తుంది .కవిత్వం చదివే ఇల్లు ఇంటి పక్కాలు సుట్టాలు ఈ సమ్మేళనం ల పాల్గోటండ్రు.ఆతిథ్యం ఇచ్చే కవి ఇంటికి జిల్లాలోని కవులంతా కలిసి రావడం గొప్పగానే ఉంటంది .అపార్ట్ మెంట్ అయితే ఆ నివాసులు అంతా సమ్మేళనం కు వచ్చి కవిత్వం వినుడు .కవిత్వ సభల్లగా వేదిక లు ఉండయి .సుట్టు కూసునుడు రాత్రి తొమ్మిది దాటిందాకా కవిత్వం మాట్లడుకునుడు .ప్రతి సారి కొత్త వాళ్ళ తోని ప్రారంభిచుడు.ఆ తరువాత బస్సులెక్కి దూరం పోయేవాళ్ళు .అటేనుక లోకల్లున్న పాత కవులు ..ఇలా కరీంనగర్ కవిత్వం కొత్త పోకడలు పోతంది .దీన్ని ప్రేరణ గా ముంబై ,జనగాం ,సిద్ధిపేట లలో మొదలైతంది ...దీని పేరు ‘ఎన్నీల ముచ్చట్లు ‘ ఇది పత్రికల్లో బాగా ప్రచారం సుత అయ్యింది .నమస్తే తెలంగాణా బతుకమ్మ లో కవర్ పేజి ఆర్టికల్ .ఇండియన్ ఎక్స్ ప్రెస్ ల స్టేట్ పేజీల వచ్చింది v6 లో ప్రసారం అయ్యింది .దిన పత్రికల జిల్లా పెజీలనైతే పున్నం పున్నం కు వస్తంది .ఈ ప్రచారం తోని ఇదివరకు తెలువని కవులు ఎందరో కలుస్తుండ్రు .కవిత్వం సడువుతుండ్రు వచ్చే పున్నం కు పుస్తకం అచ్చు ల కవిత సూసుకున్టుడ్రు......... కవిత్వం కావాలె...కవిత్వం కావాలె ......ఎన్నెల ముచ్చట్ల కవిత్వం ల తడిసి పోవాలె ... జయ హో కవిత్వం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbDYb

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbEeF

Posted by Katta

Rajeswararao Konda కవిత



by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbCDR

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను;నా...// అర్ధరాత్రైనా టీవీ కట్టను ప్రకటనలు వచ్చినప్పుడల్లా సౌండు పెరుగుతుంది ఐనా నేనేమీ పట్టించుకోను నాదో లోకం అదో భయం ఐ లవ్యూ రస్నా అన్న చిట్టితల్లిని ఏ సినిమాలో ఎలా చూడాల్సివస్తుందోనని భయం రామాయణం సినిమాలో సీత ఇంకే ఏ సినిమాలో ఎలా నటిస్తుందోనని భయం క్రిష్ వచ్చి రక్షిస్తాడని ఏ పిల్లాడు మేడపైనుంచి దూకేస్తాడోనని భయం రాఖీ రోజు స్పెషల్ క్లాసు పేరు చెప్పి ఏ జంట ఏ పార్కులో దొరుకుతుందోనని భయం భయం; భయంగా నాదో లోకం నిర్బయ ఇంటికి ఎందుకు రాలేదని ఏవరైనా అడుతారేమోనని భయం రేప్ కేసుల్ని, గృహ హింస కేసుల్ని ఎందుకు వాదించావని అడుతారని భయం టీవీ సౌండ్ తగ్గించలేని భయం భార్యని తిట్టిన తిట్లు ఏవరినా వింటారని ఆమె ఏడుపు ఎవరికైనా వినపడుతుందేమోనని భయం నేనంటేనే నాకో భయం నాలో బయాన్ని కప్పెట్టి ఆశయాన్ని నిలుకోవాలని రాసేదే కవిత్వం నా భయం ఓ కవిత్వం నన్నూ ఓ రోజు మార్చదా అనే ప్రయత్నం.....01.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hyHeck

Posted by Katta

Rajeswararao Konda కవిత



by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLXkAd

Posted by Katta

Kamal Lakshman కవిత

చిత్ర విచిత్రం.................కమల్ ఆశ్చర్యం...ఆనందం..అద్భుతం...!!! గోవు వరాహానికి పాలియ్యటం..... దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వం, ఈ నాటికీ మానవుడి మేధకందని పద్మవ్యూహమే. అందులో ఇలాంటి చిత్ర విచిత్రాలన్నోకదా! మనుషులకన్నా పశువులు మేలు అని ఊరకే అనలేదేమో మన పెద్దలు అందుకు ఇది తార్కాణం కాదా! ఈనాటి మనుషులమైన మన నిజ జీవితాల్లోకి తొంగి చూస్తే,నిశితంగా పరిశీలిస్తే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు కులం, మతం,రాజకీయం అంటూ అడుగడునా అణువణువునా మన ప్రతి చర్యా (ముసుగులేవైనా ) వాటి అంతిమ లక్ష్యం మాత్రం డబ్బుల కోసం వేట..... ఇలా ఇందుగలదందు లేదు, ఎందెందు వెదకినా.... స్వార్థం... స్వార్ధం ....స్వార్ధం..అంటూ మన నర నరాన జీర్ణించుకుపోయిన ఈ పరిస్థితులలో..... పైన కనిపిస్తున్న ఈ దృశ్యం మనందరం తప్పకుండా చూడాలి.. చూసి ఒక్క క్షణం.. ఒక్క క్షణం... ఒక్క క్షణం... ఆలోచించాలి...!!! అవునంటారా...? కాదంటారా...? మీ కమల్ 02.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0OteD

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PofLQs

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | వీక్షణ కాంక్ష ---------------------------- చుట్టుపక్కలకి చూపులు ప్రసరించటం ఇంకాస్త తీవ్రతరం కావాలి, కనుమరుగౌతున్నవన్నీ కళ్ళలోకి పట్టేయాలి. కబోదికి కళ్ళు వస్తే, దృగ్గోచర ప్రపంచ రూపురేఖల్లో ధీర్ఘకాల దుఃఖిత మమకారంతో లీనమయ్యే రీతి చెందాలి: కొత్త కళ్ళుంటే బాగుండునని ఉంది. కళ్ళ నుంచి కాంతి పుంజం నలుదిక్కులా పరావర్తనం చెంది ప్రకృతి దర్పణంలో భాసిల్లే ప్రతిరూపాలు పలుకరిస్తుంటాయి రాతిలో రంగులు గమనిస్తున్నాను ఏటిలో కెరటాలు పసిగడుతున్నాను వింత ఆకృతులూ ఊహిస్తుంటాను మరి, ఇంకా ఎందుకీ వీక్షణ కాంక్ష? స్మృతి పథంలో దృశ్యాలు మనసు ఆవరణకి తేవాలి విస్పష్టమైన రూపాలని మరొకసారి పరిశీలించాలి తిరస్కృతి లో చేజార్చుకున్న జ్ఞాపకాలు ఉన్నాయేమో తరిచి చూడాలి చూపుని ఏమార్చి లోలోపల చోటుచేసుకున్న గురుతులని పదిలం గా పొదిగి వెలికి తీయాలి నా కనులకి అలవోకడ అలవాటు కావాలి రాతి గుండెలో కదలిక కనిపెట్టాలి ఉదాసీనత పట్టి పీడిస్తున్న మనిషిని చుట్టుముట్టాలి 'సగటు', 'మామూలు' కొలతల్లో మునిగిన వారికి 'శూన్యం', 'సంపూర్ణం', 'నిశ్శేషం' ఉంటాయని చూపగలగాలి మూగ/వోతున్న/ జీవుల వేదన కంటిపాపకి అందాలి సాగిపోతున్న కాల చరిత్ర ని కనులారా చదవాలి లోపలా వెలుపలా నడిచే యోచనలకి సమన్వయం కుదర్చాలి... 01/04/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0OtuZ

Posted by Katta

Abd Wahed కవిత

గత శుక్రవారం గాలిబ్ గజళ్ల సంకలనంలోని 14వ గజల్ మొదటి రెండు షేర్లను చూశాము. ఈ వారం కూడా అదే గజల్ లోని మిగిలిన షేర్లను చూద్దాం. ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ మూడవ షేర్. గర్ చే హూం దీవానా, పర్ క్యోం దోస్త్ కా ఖావూం ఫరేబ్ ఆస్తీన్ మేం దుష్నా పన్హాం, హాథ్ మేం నష్తర్ ఖులా నేను పిచ్చివాడినైనా, భరించాలా మిత్రుడి మోసం చొక్కాలో చురకత్తి, చేతుల్లో శస్త్రచికిత్సల కత్తి ఇందులో ఉన్న కొన్ని ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. గర్ అంటే అయినప్పటికీ అని అర్ధం. ఫరేబ్ అంటే మోసం, ద్రోహం వగైరా. ఆస్తీన్ అంటే చొక్కా చేయి. దుష్నా అంటే చురకత్తి. నష్తర్ అంటే శస్త్ర చికిత్సకు వాడే కత్తి. దోస్త్ అంటే మిత్రుడు. ఈ కవితలో ఒక సన్నివేశం కల్పించి చెప్పడం జరిగింది. గాలిబ్ తన ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చివాడయ్యాడు. అలాంటి పరిస్ధితిలో గాలిబ్ కు మిత్రుడైన ఒక వైద్యుడు గాలిబ్ కు సహాయం చేయడానికి, అతడి పిచ్చి బాగుచేయడానికి వచ్చాడు. అతని చేతిలో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి ఉంది. కాని అతడి చొక్కాలోపల మరో చురకత్తి ఉందని గాలిబ్ గమనించాడు. ఆ మిత్రుడు నిజానికి తనకు సహాయపడడానికి రాలేదని, మోసంతో చంపడానికి వచ్చాడని, ఎంత పిచ్చిలో ఉన్నా మిత్రుడి మోసానికి గురికావలసిన అవసరం లేదని అంటున్నాడు. ప్రేమవైఫల్యం వల్ల పిచ్చివాడిలా మారినప్పటికీ, మోసగాళ్ళ మోసానికి గురయ్యేది లేదని, తనకు సహాయం చేస్తామంటూ వచ్చేవారి నిజానిజాలు తాను గుర్తించగలనని ఈ పంక్తుల్లో చెప్పుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, ప్రేమవైఫల్యం వల్ల పిచ్చి పట్టింది. ప్రేమించిన అమ్మాయి దొరకనప్పుడు ఇక జీవించి ప్రయోజనమేమిటన్న భావం కూడా మనసులో ఉంది. అయినా మోసానికి గురయి, ద్రోహానికి గురయి ప్రాణాలు పోగొట్టుకోవడమేమిటి? చావడానికైతే చాలా మార్గాలున్నాయి. కాని మోసానికి బలయి చావడం మాత్రం ఎన్నటికి భరించలేనంటున్నాడు. మనిషిని నమ్మినవారే మోసగిస్తారు. మిత్రులే మోసం చేస్తారు. మోసపోవడం అన్నది ఒక పరాభవం లాంటిది. అలాంటి పరాభవాన్ని తాను భరించేది లేదని గాలిబ్ ప్రకటించాడు. పాతకాలంలో పిచ్చి, ఉన్మాదం వంటి రోగాలకు రక్తనాళానికి గాటు పెట్టడం ద్వారా వైద్యం చేసేవారు. అలాంటి శస్త్రచికిత్సను ఇక్కడ గాలిబ్ సూచించాడు. శస్త్రచికిత్సకు వాడే కత్తితో కూడా చంపవచ్చు, కాని గాలిబ్ చొక్కాలో చురకత్తిని గమనించానని చెప్పాడు. అంటే పైకి నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు సహాయం చేసే శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిలా ఉన్నప్పటికీ, లోపల దురాలోచనలు ప్రాణాలు తీసే చురకత్తులవంటివని ప్రతీకాత్మకంగా చెప్పాడు. బుగల్ మేం ఛురీ ముం మేం రామ్ రామ్ అని హిందీలో ఒక సామెత ఉంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అని తెలుగులో కూడా అంటాం. ఇలాంటి భావాన్నే గాలిబ్ చక్కని కవితలో అల్లాడు. ఈ రోజు రెండో కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ నాల్గవ షేర్ గో నా సమ్ఝూం ఉస్కీ బాతేం, గోనా పావూం ఉస్కీ భేద్ పర్ యే క్యా కమ్ హై కీ, ముఝ్ సు వో పరీ పేకర్ ఖులా ఆమె మాటలు అర్ధం కాకపోయినా, ఆమె అంతరంగం తెలియకపోయినా ఆ అప్సరస నాతో మాట్లాడుతోంది. అంతకన్నా ఏం కావాలి? ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. పరీ అంటే అప్సరస అని అర్ధం చెప్పుకోవచ్చు. పేకర్ అంటే రూపం అని అర్ధం. పరీ పేకర్ అంటే అప్సరస రూపమున్న అమ్మాయి. భేద్ అంటే రహస్యం. పావూం అంటే తెలుసుకోవడం, పొందడం వగైరా అర్ధాలున్నాయి. గో అంటే అయినప్పటికీ అని అర్ధం. ప్రేమ చిగురిస్తున్న రోజుల సన్నివేశాన్ని గాలిబ్ వర్ణించాడు. ఆయన ప్రేయసి అస్పరస వంటి రూపం కలిగిన స్త్రీ. ఆమె హావభావాలతో గాలిబ్ కు ఏదో చెబుతోంది. కాని ఆ మాటలు ఏవీ ఆయనకు అర్ధం కాలేదు. బహుశా ఆమె అందాన్నే చూస్తున్నాడు కాబట్టి అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. లేదా ఆమె గాలిబ్ కు తెలియని విదేశీ భాషలో మాట్లాడి ఉండవచ్చు. పర్షియన్లో ఒక సామెత ఉంది. జుబాన్ యార్ మన్ తుర్కీ వ మన్ తుర్కీ నా మీ దానమ్. అంటే అర్ధం, నా ప్రేయసి టర్కీ భాష మాట్లాడుతుంది. నాకు టర్కీ భాష రాదు. గాలిబ్ పరిస్థితి అదే. కాని గాలిబ్ కు ఆమె మాటలు అర్ధం కాకపోయినా ఫర్వాలేదు. ఆయన నిరాశపడే మనిషి కాదు. ఆమె ఏం చెబుతుందో అర్ధం కాకపోయినా ఫర్వాలేదని, అసలు ఆమె అంతరంగం అంతుబట్టకపోయినా ఫర్వాలేదని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి, తర్వాత అర్ధం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయం. తర్వాత ఆమె భాషను, ఆమె అంతరంగాన్ని అర్ధం చేసుకునే అవకాశాలు చాలా వస్తాయని ఆశిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆమె తనతో మాట్లాడుతుంది, తాను వింటున్నాడు. అది చాలు. ఇదే పెద్ద విజయం. ఇదే భావాన్ని మరో ఉర్దూ కవి కూడా చాలా చక్కగా చెప్పాడు. రాహ్ పే లగా తో లాయే హైం బాతోం బాతోం మేం ఔర్ ఖుల్ జాయేంగే దో చార్ ములాఖాతోం మేం ఇది చాలా సరళమైన కవిత. దీనికి అనువాదం కూడా అవసరం లేదు. మాటల్లో దారికి తెచ్చుకున్నాను. కొన్నాళ్లకు సంకోచాలు పోతాయి అన్నదే ఆ కవితకు భావం. ప్రేమికుల తొలిరోజుల పరిస్థితిని చాలా సున్నితంగా గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఈ రోజు మూడో కవిత గాలిబ్ సంకలనం లోని ఐదవ షేర్ హై ఖయాల్ హుస్న్ మేం, హుస్న్ అమల్ సా ఖయాల్ ఖుల్ద్ కా ఇక్ దర్, హై మేరీ గోర్ కే అందర్ ఖులా అందం గురించి ఆలోచనలు సదాచరణల భావాలే నా సమాధిలో తెరుచుకున్న స్వర్గ ద్వారాలే ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఖయాల్ అంటే ఆలోచన, మనోభావం. హుస్న్ అంటే అందం, మంచితనం, అందమైన ప్రేయసి, సూఫీతత్వంలో దీనికి అర్ధం దేవుడని కూడా ఉంది. ఎందుకంటే దేవుడు సౌందర్యవంతుడు. అమల్ అంటే ఆచరణ. హుస్నె అమల్ అంటే సదాచరణ. ఖుల్ద్ అంటే స్వర్గం. గోర్ అంటే సమాధి, దర్ అంటే ద్వారం. అందమైన తన ప్రేయసి గురించి ఆలోచనలు సదాచరణలను పాటించడంతో సమానమంటున్నాడు. ఇస్లామీయ విశ్వాసం ప్రకారం దేవుడిని విశ్వసించి మంచిపనులు చేసేవారు స్వర్గార్హత పొందుతారు. మనిషి మరణం తర్వాత అంత్యక్రియాలు ముగిసిన పిదప ఇద్దరు దైవదూతలు నకీర్, మున్కిర్ లు అతడి ముందుకు వస్తారు. మరణించిన ప్రతి మనిషిని ప్రశ్నించడానికి దేవుడు నియమించిన దైవదూతలు వాళ్ళు. ఆ మనిషి తన జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నింటి చిట్టా వారి వద్ద ఉంటుంది. చెడు పనులు చేసి మరణించిన వ్యక్తి పట్ల వారు చాలా కఠినంగా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే సదాచరణలు పాటించిన వారి పట్ల చాలా మృదువుగా వ్యవహరిస్తారు. అలాంటి మంచివారు, పుణ్యాత్ముల సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుంటుంది. దానివల్ల వారి సమాధిలో చీకటి ఉండదు. హాయిగా ఉంటుంది. గాలిబ్ అలోచనల్లో ప్రతిక్షణం అతడి ప్రేయసే ఉంది. అందమైన తన ప్రేయసి గురించి మాత్రమే అనుక్షణం ఆలోచిస్తున్నాడు. అంటే నిరంతరం తాను మంచిపనులు, సదాచరణలే చేస్తున్నానంటున్నాడు. కాబట్టి దైవదూతలు తీసుకొచ్చే ఆయన ఆచరణల చిట్టాలో అన్నీ మంచిపనులే ఉంటాయి. కాబట్టి సన్మార్గంలో జీవించిన వ్యక్తిగా యోగ్యత పొందుతాడు. చీకటి సమాధిలోనే అతని కోసం ఒక స్వర్గద్వారం తెరుచుకుంటుంది. ఈ కవితలో ఇస్లామీయ విశ్వాసాలను సూచనాప్రాయంగా గాలిబ్ ప్రస్తావించాడు. వాటిని అర్ధం చేసుకుంటే ఈ కవితను మరింతగా అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆది నుంచి జన్మించిన మానవులందరినీ దేవుడు ప్రళయానంతరం తీర్పుదినం రోజున మళ్ళీ బతికిస్తాడు. ప్రళయాన్ని ఖయామత్ అంటారు. అప్పటి వరకు చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారు. (ఇక్కడ ఇస్లామీయ విశ్వసాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారని రాశాను. అంత్యక్రియల్లో దహనమైన వారి గురించి ఇస్లామ్ ఏమంటుంది అన్న ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఇస్లామీయ విశ్వాసాల చర్చ లేదు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏమైనా, చనిపోయిన వారందరూ బర్జఖ్ అనబడే లోకంలో ఉంటారన్నది ఇస్లామీయ విశ్వాసాల్లో భాగం.) గాలిబ్ తాను ఎల్లప్పుడు తన ప్రేయసి ధ్యానంలో ఉండి మంచిపనులే చేసాను అంటున్నాడు. అయితే తనకు స్వర్గం దొరికేసిందని చెప్పడం లేదు. తన చీకటి సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుందని అంటున్నాడు. మరో విషయం ఏమంటే ప్రాణంగా ప్రేమించే ప్రేయసి ఆలోచన ఒక హాయి పవనం లాంటిది. సమాధి చీకటిలో కూడా ఆమె ఆలోచన వస్తే చీకటి సమాధి వెలిగిపోతుందన్న భావం కూడా ఈ పంక్తుల్లో ఉంది. గాలిబ్ పదప్రయోగం ఇక్కడ గమనించదగ్గది. సాధారణంగా ఏ మతంలో అయినా మంచిపనులంటే ఏవి, సత్యాన్ని పలుకడం, తోటివారికి సహాయపడడం, బలహీనులకు సహాయపడడం, దుర్మార్గానికి దూరంగా ఉండడం వగైరా. తన ప్రేయసి గురించిన ఆలోచనలను వీటన్నింటితో సమానంగా నిలబెట్టాడు. ఆ విధంగా మతంపై ఒకవిధమైన తిరుగుబాటు ధ్వనింపజేశాడు, కాని ఆ వెంటనే మతవిశ్వాసాల ప్రకారం స్వర్గం అనేది కేవలం ఖయామత్ తర్వాత మాత్రమే లభించేది, కాబట్టి తనకు స్వర్గం లభించిందని చెప్పలేదు. స్వర్గార్హత పొందానంటూ తన సమాధిలో ఒక ద్వారం తెరుచుకుందని రాశాడు. అంటే మతవిశ్వాసాలను అతిక్రమించనూ లేదు. ఈ సమతుల్యం గాలిబ్ కవితల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో అనవసరంగా మనోభావాలు గాయపడే వ్యక్తీకరణలకు దూరంగా ఉండడం అనేది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ గజల్ ప్రారంభం నుంచి ఈ కవిత వరకు ఎక్కడా సూఫీ తత్వం రాలేదు. కాని ఈ చివరి కవితలో లోతయిన సూఫీతత్వం కనబడుతుంది. ఒక కవిసమ్మేళనం గురించి వర్ణన, ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చి పట్టినా, బతకాలని లేకపోయినా నమ్మకద్రోహాన్ని భరించేది లేదన్న ప్రకటన, ఆ పిదప తన ప్రేయసితో మొదటి పరిచయం గురించిన ప్రస్తావనలు ఇంతవరకు గజల్ లోని ప్రతి కవిత వేర్వేరు కవితల్లా కనిపించాయి. కాని ఈ చివరి కవితని పరిశీలిస్తే వాటన్నింటిని అనుసంధానం చేసే సూత్రంలా కనిపిస్తుంది. సూఫీతత్వం ప్రకారం దేవుడే సౌందర్యం. సూఫీలు దేవుడిని ప్రేమిస్తారు. ఇప్పుడు పై కవితలో ప్రేయసి స్ధానంలో దేవుడిని ఉంచి అర్ధం చేసుకుంటే కవితకు అర్ధమే మారిపోతుంది. గాలిబ్ అనుక్షణం సౌందర్య ధ్యానంలోనే ఉన్నాడు. అంటే దేవుడి ధ్యానంలోనే ఉన్నాడు. దేవుడిని అనుక్షణం ధ్యానించే మనిషి ప్రతి పని మంచిపనే చేస్తాడు. ఆ విధంగా గాలిబ్ తన జీవితంలో ప్రతి క్షణం సదాచరణల్లో గడిపాడు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత అతడి చీకటి సమాధి దేదిప్యమానంగా వెలిగిపోతుంది. ఈ కవితను సూత్రంగా చేసుకుని గజల్ లోని మిగిలిన షేర్లను భావార్ధాన్ని తెలుసుకోవచ్చు. మొదటి రెండు షేర్లలో గాలిబ్ కవిసమ్మేళనం గురించి చెప్పిన వర్ణనలో చెప్పిన విషయాల్లోను నిగూఢంగా చక్రవర్తి దర్బారులో కవిసమ్మేళనం గురించి చెబుతూ ఇది శాశ్వతంగా ఉండేలా చేయమన్నాడు. కాని శాశ్వతంగా ఉండడమన్నది ఇహలోకంలో దేనికీ సాధ్యం కాదు. పరలోకంలో మాత్రము సాధ్యం. తర్వాత ఆకాశాన్ని ద్వారం తెరుచుకున్న మందిరంలా దేదిప్యమానంగా ఉందని వర్ణించడంలోను ఆధ్యాత్మికతను అంతర్లీనంగా ప్రస్తావించాడు. మిత్రద్రోహం గురించి చేసిన ప్రస్తావనలోను, చావు అది వచ్చినప్పుడు రానీ, కానీ మోసానికి బలయ్యేది లేదని చెప్పడంలో అంతర్లీనంగా ఇస్లామీయ విశ్వాసాల ప్రస్తావన ఉంది. మనిషిని మార్గం తప్పించే షైతాను మిత్రుడిలా నటిస్తూ మోసం చేస్తాడని, ఆ మోసానికి గురై దైవాగ్రహానికి పాల్పడరాదన్న భావం ధ్వనిస్తుంది. చివరి కవితను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మిత్రుడి మోసం అన్న కవిత మరింత లోతయిన కవిత. సాధారణంగా మతం, ధర్మం పట్ల అంత పట్టింపు లేకుండా గడిపేస్తున్నప్పుడు పొరబాట్లు జరగవచ్చు. మనిషిలో దేవుడికి తనపై కోపం వచ్చి ఉంటుందన్న ఆలోచనలు కూడా రావచ్చు. ప్రేయసి తిరస్కారం అన్న పదాలు ఇక్కడ దేవుడికి ఆగ్రహం వచ్చిందన్న భావంగా అన్వయించుకుంటే, మిత్రద్రోహానికి పాల్పడే వారెవరన్నది సులభంగా అర్ధం అవుతుంది. ఒకసారి దేవుడి అనుగ్రహం పట్ల నిరాశ చెందిన వ్యక్తిని దారి తప్పించడానికి షైతాను చాలా సులభంగా ప్రయత్నిస్తాడని, మిత్రుడిగా అంటే ఆలోచనల్లో దైవతిరస్కారమే మంచిదన్న భావాలు చొప్పించడం ద్వారా మనిషిని నాశనం చేస్తాడన్న భావం ఉంది. అలాంటి మోసానికి తాను గురిఅయ్యేది లేదని ప్రకటించాడు.అలాగే ప్రేయసి మొదటి పరిచయం గురించి చెప్పిన కవితలోను ఇదే సూఫీతత్వం ఉంది. మనిషి దైవగ్రంథం చదివినప్పుడు లేదా దేవుడి గురించి తెలుసుకుంటున్న మొదటిలో బహుశా అర్ధం కాకపోవచ్చు, కాని దైవం గురించి తెలుసుకునే ఆ అవకాశం కన్నా గొప్పేముందన్న భావం ఉంది. అంటే చివరి కవితను ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే మొత్తం గజల్ కొత్త అర్ధాలు తెలుస్తాయి. ఈ కవితలో పదడాంబికాలు లేవు. సరళమైన పదాలు. నిజానికి కవితలోని రెండు పంక్తులు రెండు వాక్యాల్లా కనిపిస్తున్నాయి. ఒక అత్యున్నత స్ధాయి ప్రేమను ప్రకటించేటప్పుడు పదడాంబికాల అవసరం లేదు. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4BxX6

Posted by Katta

Radha Manduva కవిత

ఊటబావి మనసు ------------- నిర్జన నదీతీర ఒంటరి కుటీరానికి వెళ్ళాలని ఉంది ఊహాజగత్తులో రమ్యహర్మా్యలను నిర్మించాలని కాదు దూర తీరాలతో నాకు నిమిత్తమూ లేదు నాలోని అస్తవ్యస్త భావాలన్నింటినీ ఒకచోట చేర్చి చూసుకోడానికీ నాలో ఉన్న ఎత్తు పల్లాలను చదును చేసుకోవడానికీ మీద పడుతున్న దాహపు కోరికల అలల తీరాన్ని కనుగొనడానికీ వెళ్ళాలి - ఒక్కసారి ఆగి నన్ను నేను సంభాళించుకోవాలి సాంత్వన పొందాలి కాని అదేమిటో… బంధాల అనుబంధాల చటా్రల్లో భ్రాంతుల వలయాల్లో గతకాలపు జ్ఞాపకాల్లో చిక్కుకుని చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇక్కడిక్కడే ఊరుతోంది ఊటబావి మనసు ***

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PgHCBW

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఉగాది పోటీలో పాల్గొన్నా కవులందరూ తమ చిరునామాలు నా చాట్ బాక్స్ లో ఇవ్వ వలసినదిగా కోరుతున్నాం , నిన్నటి నిర్ణేత RVSS శ్రీనివాస గారు కొంతమంది విజేతలకు , మరియు శ్రీ యశస్వి గారు కవిత సంగమం వారు కొంతమందికి తమ విలువైన కవితా సంకలనాలు బహుమతి గా అందచేస్తాం అని తెలియచేసినారు . కావున దయచేసి తమ చిరునామా పూర్తీ వివరాలతో తెలియచేయ గలరు . కృష్ణా తరంగాలు పార్ధసారధి ఊటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKZwYy

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

'అక్షర ప్రవాస కోకిల - నాగరాజు రామస్వామి ఏప్రిల్ 2014 పూలకారు మీద కోకిల షికారు కొమ్మ కొమ్మన పుప్పొడి పొట్లం ఆమని మీటిన కలకంఠం అడవి పూచిన పూల పాట. వసంత గీతాన్ని మోసుకుంటూ వచ్చింది వలస కోకిల కొత్తపూలను హత్తుకోవాలని. ఇక్కడ మావిళ్లు లేవు వేపలు లేవు, పలాశలు లేవు లేవు మధుమాసపు మల్లెలు. ఐనా, వాడలేదు కోకిలమ్మ మొఖం! స్వర్ణ వర్ణ గోల్డెన్ రాడ్ ఎర్రని పూల తివాసి పరచింది నీలి రేకుల బ్లూ బోనెట్ స్నేహ హస్తం అందించింది ఒళ్ళంతా తెలి పూల పొంగై ఆపిల్ చెట్టు పలకరించింది ‘తొలి చిగురును’చూసేందుకు వలస పక్షి రాబిన్ తిరిగొచ్చింది ఆకు పచ్చని ఆహ్వానపత్రమై పొరుగు చైత్రం చిగురించింది. వసంత గీతమై వచ్చిన వలస కోకిల కొత్త పూలను గుండెకు హత్తుకుంది! March 22, 2014 6:58 PM (జయభేరి మొదటి భాగం – కవిత 8)వాకిలి' మార్చ్ 2014 సంచికలో లో వచ్చిన నా కవిత:

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dPo0A1

Posted by Katta

Veera Sanker కవిత

II వీర కవిత II - వీరశంకర్ గ్రామ సింహాలు మొరుగుతాయి సింహఘర్జనలనుకుని భ్రమపడుతూ.. శునకరాజం ఆ వీధికి తానే మృగరాజనుకుంటుంది ఎంగిలి మెతుకులకు ఆశపడుతూ.. వీధి కుక్క గుంటనక్కలా మాటేసి కూర్చుంటుంది మరెవ్వరూ తన రాజ్యంలోకి రాకూడదని.. అంతలోనే ఆ అతుకుల గతుకుల అహంభావపు అడ్డదారిని చదునుచేసుకుంటూ ఓ గజరాజం రాజసంగా ప్రవేశిస్తుంది రహదారిన. ప్రతి ఒక్కరూ ఎదిగొచ్చేలా ప్రతి ఒక్కరూ పయనించేలా ప్రతి ఒక్కరిలో ఆధునిక వికాసాన్ని వెలిగించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవ విలాసాన్ని లిఖించుకుంటూ ఈ రహదారిని ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తుంది. తన సామ్రాజ్యాన్ని ఎవరో దోచుకున్నట్టు ఆ గ్రామసింహం మొరుగుతూనే వుంటుంది.. భయపడి బెదిరించాలనుకుంటూనే రాళ్ళ దెబ్బలు తింటుంది..

by Veera Sanker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKx5dh

Posted by Katta