పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

రాగోల గుటికిళ్ళు మింగుకుంటు కంటినీళ్ళు తుడుసుకుంటు ఎప్పుడేమయితదని ఒకటే రంధి తెలిసిందే అయినా కుదరదని సంధి తన భయాలకే తానే బందీ ఇగ ఊకో నా తెలంగాణా ఆకలితో ఎండిపోయిన డొక్కలదరువు పొర్లాడిన బాధలమత్తడి పొక్కిలి పొక్కిలైన బతుకుతెరువు ఇయ్యాలకూడా తప్పని వలపోత తెల్లారనిచ్చేటట్టు లేదీరాత్రి గెదిమిన పసులమంద నడుమ పోరగాళ్ళు పడ్డట్టు పాసిపోతున్నందుకుగాదు సొమ్ములు పాసిపోతున్నందుకు వలిచిన బంగారుపొలుసులు రాలి దేవుడు దయ్యంలెక్క కనపడుతున్నడు నెయ్యమెవనికి కావాలె, నియ్యతెవరికి వుండాలె రెక్కల్ని నమ్మినోళ్ళను కూడా తరిమి ఏడిపిస్తారెందుకు నిలబడి ఎదురుచూసి తొవ్వల్నే పాతుకుపోయినయి కండ్లు తెగబడి బందూకులకెదురు తిరిగిన చేతులే కట్టుకున్నాయి చరిత్ర నవ్వుతుంటే కాలం వెక్కిళ్ళు పడుతున్నది ఎప్పుడు కూడా రాజ్యం ఎవడి జేబులోనో పలికే మాయాజూదం ఇగనన్న తెల్లారదా, ఇప్పటికన్నా మారదా? 17.02.2014

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gNDwdD

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: చేయబోకుమా...!! నీ కన్నుల కన్నీటి చెమ్మ నా నివాసం జారనీకుమా..! నీ మోమున తేజోమండలం నా నిత్య దీపారాధనం ఆరనీకుమా..! నీ హృదయ ఉచ్వాస నిశ్వాసనములు నా స్పందనా చందనం కరగనీకుమా..! నీ మదినేలు మమతల మల్లియ నా ప్రణయ నందనమున మెరిసిన కన్నియ చిదుమబోకుమా..! నీ పలుకుల మాధుర్యం స్వర్గమునకు నను కొనిపోయిన స్వరం మూగబోకుమా..! నీ ప్రణయపు సౌందర్య మహత్తు నా జీవన ఉషస్సు అడ్డుపెట్టబోకుమా..! 17/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cQVcRq

Posted by Katta

Abd Wahed కవిత

నియమనిబంధనలు చదివే అలవాటు అంతగా లేనందువల్ల, నియమాలకు కట్టుబడే పొరబాటు చేయలేని అలవాటు వల్ల ... కవిసంగమంలో ఒకే రోజు రెండు కవితలు పోస్టు చేయవచ్చో లేదో నాకు తెలియదు. ఒకవేళ పోస్టు చేసే అనుమతి లేకపోతే మరోసారి ఈ తప్పు చేసేవరకు మన్నించాలని ఆడ్మిన్స్ ని కోరుకుంటూ... పనిపాటా లేకుండా ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంకో గజల్ రాసి పోస్టు కూడా చేసేస్తున్నా.... - వాహెద్ మనసు దూదిలా తేలిపోవడమే కాదు వేరే ఉంది బతుకు హాయిగా గడిచిపోవడమే కాదు వేరే ఉంది నా కన్నీటిని నీ కనుచూపుతో తుడవాలనుకున్నా నా చూపుల్లో కాలిపోవడమే కాదు వేరే ఉంది ప్రేమశిఖరాల పైకెగబ్రాకినా నిలబడాలని లేదా సుమగంధాలు రాలిపోవడమే కాదు వేరే ఉందీ చేతికి దొరకక అద్దంలోతులో కనిపిస్తూ ఉన్నా ప్రతిబింబాలు పారిపోవడమే కాదు వేరే ఉంది వలపుతలపులే లోకంగా మారిపోతే నీ లోనా ప్రేమమత్తుగా వాలిపోవడమే కాదు వేరే ఉంది కురుల నీడలో చెంపలవెలుగులో నిశ్చింతలు భ్రమలే గుండెఎండలో మండిపోవడమే కాదు వేరే ఉంది ఆకలిదప్పుల తీరాల మధ్యన ప్రవహించే నదిలో ప్రేమగా దియా మునిగిపోవడమే కాదు వేరే ఉంది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fagi1w

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

-- చిరాశ // వస౦తమా!.. రావదేల?... // ******************************** వస౦తమా!.. రావదేల?.. వరూధినై తానొచ్చేను కోకిలమ్మా!.. కూయవేల?.. కూనలమ్మై తానొచ్చేను వెన్నెలమ్మా!.. రావదేల?.. తెల్లకలువై తను విచ్చేను మావికొమ్మా!.. చిగురి౦చవేల? మాఘమాస౦ ము౦చుకొచ్చేను ******************************** -- {17/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gvkpWe

Posted by Katta

గరిమెళ్ళ గమనాలు కవిత

// రాజేంద్ర ప్రసాదు // నీవేమి -నేనేమి // నిన్ను చూడక నా మది గది తలుపును తెరువకున్నదే నీవు నాతోన లేని ఈ క్షణమున నా నయనం ఏ దృశ్యమును చూడలేకున్నదే ఎందుకు ఎందుకు ఎందులకు ? నీవంటే అంట ఇష్టం ఎందులకు ? నీవుంటే ఆ ఉత్సాహం నా మనసుకు ఎందులకు ? నీతోటి ఉండినచో నా పలుకు అధికమగును నా స్వరము సుకుమారమగును నా గాత్రం ఏదో ఆలాపన చేయును ఎందుకు ఎందుకు ఎందులకు ? అదే నీవు ,లేదా నీ ఉనికి కాసేపు మాయమైనచో నా మనసు స్ధితి గతి తప్పును నా చేష్టలు ,నా కతీతంగా ప్రవర్తించును ఎందుకు ఎందుకు ఎందులకు ? నీ స్పర్శ చాలునే కదా నాలో జీవమును బ్రతికుంచుటకు నిన్ను తాకిన పావనము చాలును కదా నా శ్వాషకు ఊపిరినిచ్చుటకు ఎంత వెతికినా సమాధానం తప్పించుకొనుచున్నదే ఎంత ఆలోచించినా నా తలపులకు ,నా ఊహలకు మాయాజాలం కమ్ముచున్నదే అహో ! ఏమి ఈ వైపరీత్యము నాకు పైత్యము పట్టినదా ఏమి ? ఏమి ఈ నా మనో కుచలత్వము నీ జాప్యమునకు ఈ తాపము గుర్రుపట్టు చున్నదే అందకారమా ? మందకారమా ? ప్రేమ అనే పేరుతోన నా మనసు చేస్తున్న గారమా ఏమి ? చూచితివి కదా దేవీ నన్నూ , నా విడ్డూరమును మరి నీ ప్రేమ లడ్డును అందించగా రావేమి ? తేది : 17. 02. 2014

by గరిమెళ్ళ గమనాలు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNRqjN

Posted by Katta

Vamshidhar Reddy కవిత

వంశీ // interlude // ఉదయం ఏదోగాయానికి చర్మం గీరుకుపోయి కళ్ళెర్రబడ్డప్పుడు ఎందుకో తెలీదు నువ్ గుర్తొచ్చావ్ ఎప్పట్లాగే నీ నవ్వూ గుర్తొచ్చింది నువ్ ఉండుంటే గాయానికి ఉమ్మురాసి ముద్దుగా మొట్టేదానివని అనిపించగానే ఎందుకో కళ్ళమీంచి ముసినవ్వోటి వేళ్ళదాకా పాకి గాలికెగుర్తున్న వెంట్రుకల్ని వెనక్కి లాగింది.. భోంచేస్తూ టీ.వీ ఆన్ చేయగానే నువ్ నమ్మవ్ గానీ అచ్చూ నీలాగే , ఏం తిన్నావని అడగకిక "రన్-వే 9" లో బకార్డీ బ్రీజర్ తాగి చికెన్ వింగ్స్ తిన్నప్పట్లాగా నువ్ ఇంకా అలాగే సుతారంగా ఒక్కోమెతుకూ తింటూనే ఉండుంటావా, ఇక ఈ రోజంతా నన్నొదిలేలా లేవుగా కలలసంగీతంలోంచి, ఏడుపుగొట్టు మేఘాలు గొంతులోంచి సూదుల్ని వర్షిస్తున్నప్పుడు "విలియం కార్లోస్ విలియమ్స్" "లవ్ సాంగ్" చదివి బద్దలైపోవడం అనివార్య వరం... పిచ్చిగా లేదూ?? తెలిసిన జవాబులకు ప్రశ్నల్ని వెతుక్కోలేకపోవడం, we are not alone, even in our classified loneliness పరమానందాన్ని పరిచయించినవారే అపరదుఃఖంలోకీ దారిచూపగల్రు, అర్దభాగ నగ్నదేహపు కండరకోశాల్లోని క్షోభ్యతకు ఏదీ భాష?? ఏదా ఘోష.. మోహార్తిదీపాల్లో వెంట్రుకలంటించుకున్న బట్టతలగాళ్ళమేగా మగాళ్లమంతా.. ఎంతబావుణ్ణు తల్చుకోగానే అవతలివాళ్లకి తెలిసిపోతే బేషరతుగా ఇష్టపడ్డం బలహీనత కాదు ఎప్పుడూ కొంపలు మునగవ్, నువ్ ఎవర్తో ఉంటే నాకేం మన రంగులగతంలో మునిగి తేలడం పాటకీ పాటకీ నడుమ విరామం మాత్రమే, నువ్ ఇప్పుడు ఎదురైనా మనస్ఫూర్తిగా వెలుగుల్ని దాచుకోడం తెలిసాకా నువ్ ఎవర్తోఉంటే నాకేం నిన్ను ప్రేమిoచడానికి నీ ఆత్మ శకలమొకటి నా రక్తంలో కలిసాక.. ఎప్పుడూ కొంపలు మునగవ్ 17-02-14

by Vamshidhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cQ5qS7

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-28 ఆనందమే మనిషి అసలు ఆనందమే వాని స్వభావం ధనం,మద్యం,మాదకద్రవ్యం,రసానుభవం అది ఏదైనాకాని ప్రతిదాని వెనుకనున్న రహస్యం అంతిమంగా ఆనందాన్ని పొందడానికే కట్టుబాట్లలో ఉన్నప్పుడది లోకరీతి అవుతుంది... చెలియలికట్టదాటితే ఇక ఎవరి అనుభవాలు వారివే...! ------------------------------------------- 17-2-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cQ5ph1

Posted by Katta

Niharika Laxmi కవిత

(ఈ ప్రేమ ) రెండు మనసులను ముడివేసి ఏడడుగులకు దారితీసి , నూరేళ్ళ జీవితానికి నాంది పలికేది ఈ ప్రేమ ........ ! కులాలకు అతీతమైనది , మతాలకు అతీతమైనది , రూపురేఖలకు అతీతమైనది, ఈ ప్రేమ .................! చీకటిలో వెన్నెలలాగా , బాధలో ఓదార్పులాగా , ఒక్కసారి ఎదను చేరితే శాశ్వతంగా నిలిచిపోయేది ఈ ప్రేమ ................. ! ................... నిహారిక (17-02-14)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1guWXZf

Posted by Katta

Obul Reddy Tavva కవిత



by Obul Reddy Tavva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1guWXZ2

Posted by Katta

Sriarunam Rao కవిత

సంద్రమంత అభయం...వీరబ్రహ్మంతాతగారి వచనం అందుకేనేమో...ఆయన విశాఖతీరాన కొలువుదీరారు. ఎన్నితరాలు మారిపోతున్నా...ఎప్పటికీ... "తాతగారు" అని పిలిపించుకునే అమృతం ఆయన ప్రవచించిన కాలఙ్ఞానం. మనుషులందరూ ఒక్కటే అని నిరూపించగలగటమే భగవంతుని మార్గం అన్నది ఆ దేవుని స్వరూపం. రాబోయే తరాలెన్ని వున్నా తరగని విఙ్ఞానపు నిధిని అందించిన ఆ స్వామే విశ్వమానవ వంశానికి నిజమైన తాతగారు. శ్రీఅరుణం.

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXJtR1

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb||డెజావు|| ఏది గమ్యం? ఏది సత్యం? మిత్రమా! నాకేది మార్గం ? వేల వలలు పరచబడినవి అనంత దుఃఖపు లోతులున్నవి శిఖరమల్లే సంతోషమున్నది అంతులేనివై ఆశాపాశం శృంఖలాలై బంధించుచున్నవి. ఏది సత్యం? ఏది గమ్యం? మిత్రమా! నాకేది మార్గం ? రాగద్వేషం లోకపురీతై ప్రపంచమంతా కదనరంగమై అహంకారమే కాలసర్పమై కదలికలేని కబోదినైతిని వెలుగులు ఎరుగని నిశిధినైతిని ఏది మోహమో! ఏది మోక్షమో! కనుగొనలేక కన్నీరు కార్చితి. నన్ను నన్నుగా నిలిపే మంత్రం సర్వబంధాలు ఛేదించే తంత్రం ఎండమావులై మిగిలిన వైనం. ఏది గమ్యం? ఏది సత్యం? మిత్రమా! నాకేది మార్గం ? Oct 2012 17/2/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXJrbH

Posted by Katta

Santosh Kumar K కవిత

||నీ రాకతో|| నీ చిరునవ్వులో విరిసిన రంగులను చూసి కనులు మూసి బోసిపోయింది ఆ హరివిల్లు... నీ తలపుల్లో తలమునకలైన నా ఆలోచన అలుపెరగని ఊసుల కారగారంలో బందీగా మారిన నిమిషంలో... నా తీరే కొత్తగా ఉంది.. నీ ఉనికిని పసిగట్టిందేమో..! నా మనసు మౌనం వీడింది.. నీ మాటలను విన్నదేమో..! నా ఊహ ఊపిరి పోసుకుంది.. నీ శ్వాస తగిలిందేమో..! నా ప్రేమ తొలి అడుగులు వేసింది.. నీ నడకలో చేరిందేమో..! అలా నేను ప్రేమించటం మొదలుపెట్టిన క్షణం నుండి... కవ్వించే నీ కౌగిలిలో చేరుకోవాలని గమ్మత్తుల మత్తులో తూలుతూవున్నా..! సోయగాల పూలు పట్టుకోవాలని పులకింతతో నీ కురులవైపే చూస్తూవున్నా..! వెచ్చని ఒడిలో కాసేపు సేదతీరాలని చలిగాలిలో సైతం నీ చెంతకు చేరాలనుకుంటున్నా..! అంతటిలో తొలకరి మేఘమై చేరవచ్చి.. వేచిచూస్తున్న ఎదపై తేనెజల్లు కురిపించావు, మంచులా మారి ప్రణయ మారుతంలా వీచి.. కలలలో విహరిస్తున్న నన్ను పలకరించావు, పరిచయం చేసుకున్నావు, పునర్జన్మనిచ్చావు!! #సంతోషహేలి #Sanoetics http://ift.tt/1jvhwEF

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jvhwEF

Posted by Katta

Aruna Naradabhatla కవిత

మొగిలిపూల సుగంధం-సినారె __________________అరుణ నారదభట్ల కదిలే ఓ సాహిత్యాలయం పాటల పూదోట! పుట్టే ప్రతి చిగురూ నునులేత కాంతిరేఖే... విరిసే ప్రతి అక్షరం తన హృదయాన్ని తాకినందుకేమో మరో కాంతి పుంజమే! సినీ జగతిని వెలిగించిన పాలపుంత... ఎన్ని భావ చిత్రాలకు ఊటనిస్తుందో విశాల వృక్షంలా ఎన్ని గొంతుకలను తడిపిందో మిన్నంటే మనో వెలుగుతో....! ప్రేమగా కురిపించే అక్షరవానకు నల్లని మేఘమైనా చల్లని వెన్నెలైనా మత్తెక్కించే మల్లెలైనా ప్రజ్వలించే సూర్యుడైనా మరులు గొలిపే మకరందమై తన భావ గాంధర్వంలో కరిగిపోవాల్సిందే! మనో నాడులను వీణై మీటే పదబంధం ఎన్ని హృదయస్పందనల కలబోతో...మరి!! మదిని దోచే మాటల మూట పాటైనప్పుడు వినిపించే మృదంగ నాదం నిలువెత్తు ఆశా కిరణం ఆత్మవిశాసమై నడిచినప్పుడు మబ్బులు కిందికి దిగుతాయి.... ఆమని కోయిలలు కొత్తరాగాలు ఆలపిస్తాయి నింగిలోని చందమామ పగలే వెన్నెల కురిపిస్తుంది జగమే ఆయనకు ఊయలలూపుతుంది!! 17-2-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXyp6v

Posted by Katta

Vinjamuri Venkata Apparao కవిత

ఆత్మకథ ఎవర్నని యనుకొంటారో మీరు నన్ను! ఏను పఠాభిని ...... కాంగ్రేసు రాష్ట్రపతి స్థానానికోసం బాబూ సుభాసుబోసుతో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ పట్టాభిని గాన్నేను,మరో పఠాభిని; అయితే అతగాడికున్నంత ఉపజ్న నాకున్ లేదని తలపకండీ, గాంధీటోపీ జహ్వరుజాకట్ మీసాలు లేనంత మాత్రాన! పయిజమ్మాలు వేస్తాను కాబట్టి నన్ను మీరు షోదాయని సోషలిష్టని తిట్టబోకండి, ప్రఖ్యతంగానున్న కవిన్నేను; నాకు విచిత్రంబగు భావాలు కలవు నా కన్నులందున టెలిస్కోపులు మయిక్రోస్కోపు లున్నవి. నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుముల్ విరుగదంతాను, చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను; ఇంగ్లీష్ భాషాభాండారంలో నుండి బందిపోటుం జేసి కావాల్సిన మాటల్నుదోస్తాను. నా యిష్టం వచ్చినట్లు జేస్తాను అనుసరిస్తాను నవీనపంథా; కానీ భావకవి న్మాత్రము కాన్నే,నే నహంభావకవిని.( శ్రీ తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి గారు.)

by Vinjamuri Venkata Apparao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NY9muK

Posted by Katta

Abd Wahed కవిత

గాఢనిద్ర కనురెప్పను పలకరించి వెళ్ళింది కిటికీలో మబ్బుతునక పులకరించి వెళ్ళింది ఒంటిచెట్టు తలపాగా ఆకులన్నీ రాల్చేసీ జ్ఙాపకాల చిరుగాలి జలదరించి వెళ్ళింది కలల్లోన పెట్టుకున్న దీపంలా నవ్వుముఖం పగటిలోని రాత్రినంత తెల్లవార్చి వెళ్ళింది నల్లసిరా ఒలికినట్లు పెనుచీకటి వరదొచ్చీ పాతవెలుగు గోడలన్నీ కూలదోసి వెళ్ళింది గోడమీద వేలాడే బొమ్మల్లో అందాలను చెట్టుగాలి చేయిచాచి కావలించి వెళ్ళింది పడకమీద పరచుకున్న హాయిలాంటి దేహంలో దియా నేడు వయసుకూడ ఆవులించి వెళ్ళింది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nGeAWw

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఏటి ఒడ్డున చిన్ని చిన్ని చేతులు పేర్చుకున్న ఇసుక గోపురం ఓ అల నీటిపాయకు నేల పాలవుతుంది . . . రాత్రి స్వప్నాలు పోగుచేసుకొని సంధ్యల్లో కట్టుకునే స్వర్గాలు భళ్ళుమనే తెల్లవార్లలో కకలా వికలమవుతాయి . . అయినా . . మళ్ళీ మళ్ళీ చినబోయిన రేవు చెక్కిలి మీటే వానచుక్క . . మళ్ళీ మళ్ళీ నిదురోయిన రాత్రి చీకటిని గెలిచే పున్నమి . . మళ్ళీ గోపురాల్ని కట్టమంటాయి . . ! మళ్ళీ మళ్ళీ ఉదయపు హృదయాల్లో స్వప్నాల సాకారాలు మొదలు పెట్టబడతాయి . . ! నిర్మలారాణి తోట [ 17.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bEknvU

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ నన్నేప్పటికి అడుగకు @ _ కొత్త అనిల్ కుమార్ . తేది : 17 / 2 / 2014 రోజు రోజుకు పాత బడుతున్న మన ఇద్దరి అనుబంధం ప్రతి రోజు కొత్తగా పరిచయం చేసుకుంటున్న చిరాకులు...పరాకులు నీ నుదుటి చెమటలు చూడొద్దని భావించిన ఈ మనిషి అనుక్షణం వేధిస్తున్నడెమో ? ఈ సంసారపు బందిఖానాలో కష్టసుఖాల్లో పాలు పంచుకున్తనన్న నీ ఇష్టమయిన నేను కుటుంబ బాధ్యతల్లో నిన్ను ఒంటరిని చేశానేమో ఎప్పటికి నీ తోడుంటానని మాటిచ్చి చిన్నపాటి విరామలతో విసిగించానెమొ బరువైన హృదయం తో .. తేలికగా ప్రేమించాను . తేలికయిన ఈ జీవితాన్ని నీకర్పించాను. ఇష్టాఇష్టాల్ని సమానంగా పంచుకున్న్నమ్ కష్ట నష్టాల్ని భరించాం ఏమో ..? నా వాళ్ళ ఏమయినా కష్టాల్ని భరించావేమో పంచుకోడానికి..భరించడానికి... నాకెవరు లేరు మరి. నా ఆవేదనలు తట్టుకోలేక నిను వేధించిన నిజాన్ని ఒప్పుకుంటాను . ఆ ఆవేదనకు మూలం ఏమిటో ఆ హృదయ వేదనకు కారణం ఏమిటో నన్నేప్పటికి అడుగకు . చెప్పలేక కాదు చెప్పిన లాభం లేక .

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gu4JT2

Posted by Katta

Kavi Yakoob కవిత

వెన్నెలతో తీర్చిన వేట కొడవలిలా ఉండాలి కవిత్వం Published: Thursday, November 13, 2003, 23:53 [IST] Ads by Google ఎస్ఎంయు - డిఇ నుంచి 100% స్కాలర్‌షిప్ పొందండి. దరఖాస్తు చేసుకోండి! ''నన్నడిగితే కవిత్వం వెన్నెలతో తీర్చిదిద్దిన వేట కొడవలిలా ఉండాలంటాను'' అన్నారు దేవిప్రియ. అరవై దశకం చివర్లో ''పైగంబరులు'' పేరిట- 'జ్వాల' పత్రిక ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన అయిదుగురు కవుల్లో ఆయన ప్రముఖుడు. సుగంబాబు, కిరణ్‌బాబు, కమలాకాంత్‌, ఓల్గా మిగతా నలుగురు. ఈ అయిదుగురిలోనూ కవితాంశ ఎక్కువగా ఉన్నది దేవిప్రియలోనే. ఆయన గతంలో ప్రచురించిన ''అమ్మచెట్టు,'' ఇటీవల వేసిన పుస్తకం కూడా ఇందుకు సాక్ష్యం. అలాగే తొలినాళ్ల నుంచి నేటిదాకా దేవిప్రియ కొనసాగిస్తున్న మరో ప్రక్రియ కార్టూన్‌ కవిత్వం. దీన్నాయన 'చతుర కవిత' అంటారు. చదువుకునే రోజుల్లోనే ఆరుద్ర 'కూనలమ్మ పదాలు' ప్రభావంతో 'నాయనమ్మ పదాలు' ప్రారంభించిన దేవిప్రియ తర్వాత ప్రజాతంత్ర వారపత్రికలో 'సమాజానంద స్వామి' శీర్షిక నడిపించి పరిణతి సాధించారు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయన చెబుతున్న ''రన్నింగ్‌ కామెంటరీ'' అందరూ ఆనందిస్తున్నదే. కవి కె. శివారెడ్డి కూతురు పెళ్లికి స్వస్థలం గుంటూరు వచ్చిన దేవిప్రియతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు మీ ముందుంచుతున్నాను. ''నేను చాలా కష్టపడి సొంతు గొంతు వెతుకున్నవాణ్ని. తొలి రోజుల్లో ఛందస్సు నేర్చుకుని పద్యకవిత్వం సాధన చేశాను. నానా పాట్లు పడి ఓ కావ్యం కూడా రాశాను. అదెక్కడో పడి వుంది. ఆ తర్వాత మాత్రాబద్ధ కవిత్వం రాశాను. మీటర్‌ మీద నా మమకారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. అలాగే పాటలు కూడా రాశాను. అందులో కొన్ని ధవళ సత్యం లాంటి వాళ్ల ద్వారా బాగా పాప్యులర్‌ అయ్యాయి కూడా. అవన్నీ అయిన తర్వాతే వచన కవిత్వం జోలికి వెళ్లాను. అలాగే చదువుకునే రోజుల్లోనే నేను చతుర కవిత రాయడం మొదలు పెట్టాను. ఇవాళ్టికీ నిరంతరాయంగా కొనసాగిస్తున్నాను. నేను నిర్వహించిన శీర్షికలు 'సమాజానంద స్వామి,' 'రన్నింగ్‌ కామెంటరీ' మంచి ఆదరణకు నోచుకున్నాయి. అలాగే నేను రాసిన 'గరీబు గీతాలు' కూడా. అన్నిటికీ మించి విద్యార్థి దశలో నన్ను ప్రభావితుణ్ని చేసిన ఆరుద్రకు నా 'గరీబు గీతాలు' స్ఫూర్తినిచ్చి ఆయన చేత 'కేరామలక్ష్మి శతకం' చెప్పించడం నాకు చాలా తృప్తి నిచ్చింది'' అన్నారు దేవిప్రియ. ''ఆ మధ్యన నాకు ఓసారి కరీంనగర్‌లో ఏదో మీటింగ్‌కి వెళ్లాను. ఒకాయన అక్కడ నన్ను కలిసి వాళ్లమ్మాయి ''రన్నింగ్‌ కామెంటరీ'' పద్యాలన్నీ బైహార్ట్‌ చేసి చెపుతుందన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆయన కాస్త డిజాప్పాయింట్‌ అయినట్లున్నాడు. ఇంటికెళ్లి కూతురును తీసుకొచ్చేశాడు. ఆ పాప నా ''రన్నింగ్‌ కామెంటరీ'' పద్యాలను గడగడా వల్లించడం చూస్తే నాకే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నీ ముంచుకొచ్చేశాయి'' అంటూ వివరించారాయన. ''నేను గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో సి. నారాయణ రెడ్డి గారి 'నవ్వని పువ్వు', 'జలపాతం', 'నాగార్జునసాగరము', 'జాతిరత్నం' చదివాను. ఆ తర్వాత కర్పూరవసంతరాయలు వచ్చింది. నన్ను ఆధునిక కవిత్వం వైపు ప్రేరేపించినవి ఈ పుస్తకాలే. అప్పటికే నేను పద్యాలు రాసేవాణ్ని. ఆ ధోరణిలోనే ఉండేవాణ్ని. 'భారతి'లో నా పేరు అచ్చు కావాలన్నది అప్పట్లో నా ఏకైక లక్ష్యంగా వుండేది. నన్ను కాస్త మోడర్న్‌ స్కూల్‌ వైపు మళ్లించింది సినారె రచనలే. ఆ తర్వాతే నాకు సుగంబాబు ద్వారా శ్రీశ్రీ కవిత్వంతో పరిచయమైంది. మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు మేనిఫెస్టో సుగంబాబు దగ్గరే చూశాన్నేను. అప్పట్లో ఆయన గుంటూరులో కామత్‌ వాచ్‌ కంపెనీ నడిపించేవాడు- వయస్సులో మా కన్నా కొంచెం పెద్ద. మా కన్నా ముందు నుంచీ అభ్యుదయ కవిత్వం ధోరణి వున్నవాడు. అటు తర్వాత పైగంబరులు పేరిట రెండు పుస్తకాలు- యుగసంగీతం, యుగసంకేతం- వేసిన అయిదుగురు కవుల బృందానికి అయనే నాయకత్వం వహించా''రని అన్నారు దేవిప్రియ. ''నిజానికి అప్పటికే దిగంబరులు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపి ఉన్నారు. అయితే, మాకు-ముఖ్యంగా నాకు- దిగంబరుల భాషతోనూ, అభివ్యక్తి పద్ధతిలోనూ పేచీ వచ్చింది. చేతులు నేల మీద పెట్టి నడవడం ద్వారా ఎక్కువ మంది దృష్టిని ఎట్రాక్ట్‌ చెయ్యడం సాధ్యం కావచ్చు కానీ ఎక్కువ మంది సహచరులను కూడగట్టడం మాత్రం సాధ్యం కాదు. అలాంటి ఫీట్స్‌ ద్వారా జనం ఎమ్యూజ్‌ అవుతారు తప్ప ఎన్‌లైటెన్‌ కారన్నది నా అభిప్రాయం. రాజకీయ సామాజికాంశాల మీద సీరియస్‌ అభిప్రాయాలు ప్రకటించదల్చుకున్నవాళ్లు చెయ్యాల్సింది ఫీట్స్‌ మాత్రం కాదని మేం అందరం అనుకున్నాం. ఇక ఆ రోజుల్లో యువకవుల ఆలోచనల్లో పెద్ద వైవిధ్యం ఉండేది కాదు. దాదాపు ప్రతి ఒక్కరూ అభ్యుదయ భావాలు ప్రకటించిన రోజులవి. ఆదో యుగలక్షణం అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్‌ గురించే 'పైగంబరులు'గా మేం ఎక్కువ పట్టించుకున్నాం. పరుచూరి కోటేశ్వర రావు, ఆంజనేయులు తదితరులు తీసుకొచ్చిన ''జ్వాల'' పత్రిక మాకు మంచి ప్రాముఖ్యం-ప్రాచుర్యం కల్పించిం''దని దేవిప్రియ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ''మా రెండో పుస్తకం 'యుగసంకేతం' విడుదలయిన కొద్ది రోజులకే విరసం ఏర్పడింది. మేం అందరం ఆ సమావేశాలకు వెళ్లాం. చురుగ్గా పాల్గొన్నాం కూడా. అయితే విరసం ఆవిర్భావింలో మేం కనీసం క్యాటలిస్టు పాత్ర కూడా పోషించలేదన్నది నిజం. ఆ పరిణామానికి వేరే కారణాలున్నాయి. మాలో ఒకతను- కమలాకాంత్‌, 'సితార' అనే కలం పేరుతో కవిత్వం రాశాడు- విరసం సభల నాటికే వెనక్కి తగ్గాడు. నేను విరసం మీటింగ్‌కి వెళ్లాను కానీ ఆ సంస్థలో చేరలేదు. ఓల్గా, సుగమ్‌బాబు, కిరణ్‌బాబు విరసంలో చేరారు. నేను చేరకపోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఏదయినా సాహిత్యసంస్థలో చేరితే తప్ప సేవ చెయ్యలేమని నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అనిపించలేదు. అలాగే విరసం ఏర్పడేనాటికి నేను చాలా కుర్రాణ్ని. లోకంపోకడ బొత్తిగా తెలియనివాణ్ని. అంత పరిమిత పరిజ్ఞానంతో విరసంలో చేరాలనిపించలేదు. ఇప్పటికీ ఈ విషయంలో పశ్చాత్తాపం లేదు- పునరాలోచనా లేదు. నా కవిత్వమే అందుకు సాక్ష్యం'' అని ఆయన వివరించారు. ''నా సొంత అనుభవంతో చెబుతున్నాను. కవిత్వానికీ కార్యాచరణకీ మధ్య కొంత గ్యాప్‌ దాదాపు అనివార్యం. అలనాడు సుబ్బారావు పాణిగ్రాహి ఇప్పుడు గద్దర్‌ ఈ గ్యాప్‌ను చాలా మట్టుకు పూడ్చి వుండవచ్చు. వాళ్లు కేవలం మినహాయింపులే తప్ప సామాన్యతరహా కాదు. మామూలు మనుషుల విషయానికి వస్తే మాత్రం ఈ గ్యాప్‌ తప్పనిసరిగా వుంటుంది. ఇందులో విడ్డూరం గానీ, వింత గానీ ఏమీ లేదు. ఎటొచ్చీ ఎక్కువమంది ఈ విషయాన్ని ఇంత బహిరంగంగా ఒప్పుకోరు- చెప్పుకోరు. అంతే తేడా'' అన్నారు దేవీప్రియ. ''1970లో లెనిన్‌ శతజయంతి కవి సమ్మేళనం విజయవాడలో జరిగింది. నేనూ అందులో పాల్గొన్నాను. ఆనాడే అనిసెట్టి సుబ్బారావుగారితో పరిచయం అయింది. మద్రాస్‌ రమ్మని ఆయన ఆహ్వానించారు. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా వుండేది. కుటుంబాన్ని ఆదుకోకపోతే పోయె- కనీసం దాని మీద భారం పోపకపోతే అదే పదివేలు అనిపించేది నాకు. ఆ దృష్టితో మద్రాస్‌ ప్రయాణం కట్టాను. ఆ రోజుల్లో అనిసెట్టి గార్ని ''డబ్బింగ్‌ కింగ్‌'' అనేవాళ్లు. శ్రీశ్రీ, ఆరుద్రాదులు కూడా ఆయన ముందు దిగదుడుపే. ఆయన నాకు చాలా సాయం చేశారు. అవుట్‌హౌస్‌లో చోటిచ్చారు. దగ్గరుండి స్క్రిప్ట్‌ రచనలో ఓనమాలు దిద్దించారు. నేను మద్రాస్‌ వెళ్లిన కొద్ది రోజులకే ''ఆది పరాశక్తి'' అనే సినిమాకి నా చేత డైలాగ్స్‌ రాయించారు. పాత స్క్రిప్ట్స్‌ వెలికి తీసి వాటిల్లో మెరిట్స్‌ వివరించేవారు. మనిషి చాలా మర్యాదస్థుడు. రోమాంటిక్‌ కూడా. నన్నెంతో గౌరవించి, ఆదరించారు. అనిసెట్టి కంపెనీ నేను బాగా ఎంజాయ్‌ చేసేవాణ్ని. మద్రాసులో నాకు మరో మంచి కంపెనీ కాకరాల. పది పన్నెండు సినిమాలకి పని చేశాను. డబ్బులు కూడా చేతిలో ఆడుతుండేవి. కానీ మద్రాసు నచ్చినంతగా నాకు డబ్బింగ్‌ పని నచ్చలేదు. పైగా సినిమా నాకు గమ్యం కాదు. వీటన్నిటికీ తోడు అక్కడ వుండే రోజుల్లో నా గుండె గాయపడింది. ఇక ఉండలేక వచ్చేశాను'' అంటూ వివరించారాయన. ''గుంటూరు తిరిగి వచ్చేసిన తర్వాత అబ్బూరి రాజ్యలక్ష్మితో పరిచయమయి ప్రేమగా మారింది. వాళ్లు కన్వర్ట్‌ క్రిస్టియన్స్‌. డబ్బున్నవాళ్లు. నాకు అడ్రస్‌ లేదు. పైగా మతానికి ముస్లింని. పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో గాంధర్వం తప్పలేదు. హైదరాబాద్‌లో శివారెడ్డి దగ్గరకొచ్చేశాం. వి.వి. కాలేజీలో అతని కలీగ్‌ (ఇప్పుడు శ్రావ్య చిట్‌ఫండ్స్‌ యజమాని) జ్ఞానయ్య అప్పట్లో సాయం చేశారు. అలాగే అప్పట్లో ఏదో పత్రికలో పని చేస్తూ ఇంగ్లీషులో కవిత్వం రాస్తుండేవాడు - మల్లిక్‌ అని- ఆయన కూడా సాయం చేశాడు. కొద్ది కాలమే వున్నాం. అంతలో మా ఫాదర్‌ పోవడంతో గుంటూరు ప్రయాణం కట్టాల్సి వచ్చింది'' అన్నారు దేవిప్రియ. జర్నలిస్టుగా నేను మరో మజిలీ ప్రారంభించింది ఈ దశలోనే. నిజానికి విద్యార్థి దశ నుంచే నాకు స్థానిక పత్రికలతో సంబంధం ఉండేది. చిన్న పత్రికల్లో పెద్ద ఆస్తులు పోగొట్టుకున్న వడ్డెంపూడి హనుమంతరావుగారి గుంటూరు న్యూస్‌లోనూ, తెలుగుసీమలోనూ, తాడిశెట్టి ఆంజనేయులుగారి స్వతంత్రసందేశ్‌లోనూ రాసేవాణ్ని. కాలేజీలో కన్నా ఈ పత్రికల కార్యాలయాల్లోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేసేవాణ్ని. వాళ్లు నాకు అప్పట్లో ఇచ్చిన ఆదరణ, ప్రోత్సాహం మర్చిపోలేనివి. అయితే, అప్పుడు జర్నలిస్టు కావాలన్న ఆలోచన నాకు ఏ కోశానా లేదు. కానీ పెళ్లయి తిరిగి గుంటూరు వచ్చిన తర్వాతే ఈ దుర్బుద్ది తలెత్తింది. కిరణ్‌బాబు ప్రోత్సాహం మీద ఇ. శివారెడ్డి అనే పెద్దమనిషి పెట్టుబడిదారుగా గుంటూరు నుంచి 'నిర్మల' అనే మంత్లీ ప్రారంభించాం. నాకు తెలిసినంతవరకు స్క్రీన్‌ ప్రింటెడ్‌ కవర్‌ పేజీతో వెలువడిన తొలి తెలుగు పత్రిక అదే. అయితే ఎక్కువ కాలం రాలేదు. ఉషశ్రీ ఫిల్మ్స్‌ అధినేత చిన్నపరెడ్డిగారు శివారెడ్డిగారి కజిన్‌. నన్ను ఆయన దగ్గరికి పంపించాలని శివారెడ్డిగారు అనుకున్నారు. కానీ నాకే నచ్చలేదు. సరిగ్గా అదే రోజుల్లో వడ్డెంపూడి హనుమంతరావుగారు హైదరాబాద్‌ నుంచి ''ప్రజావాహిని'' అనే పొలిటికల్‌ వీక్లీ ప్రారంభించారు. దాని సంపాదకుడిగా తిరిగి భాగ్యనగరంలో అడుగు పెట్టాను. అది ఇన్‌స్టెంట్‌ సక్సెస్‌. కొద్ది రోజుల్లోనే బాగా పాప్యులర్‌ అయింది. కానీ ఆర్థిక కారణాల చేత అది మూత పడే ముహూర్తం వచ్చి పడడంతో తిరిగి చౌరస్తాలో నిలబడక తప్పదనిపించింది'' అంటూ దేవిప్రియ వివరించారు. ''ప్రజావాహిని వచ్చే సమయంలోనే సహాయత చిట్‌ఫండ్స్‌ ఎం.డి. అడుసుమిల్లి వెంకటేశ్వర రావుగారు హైదరాబాద్‌ నుంచే ప్రజాతంత్ర వార పత్రిక తీసుకొస్తుండేవాళ్లు. ఇప్పుడు ఇండియా టుడే ఎడిటర్‌ రాజేంద్ర అప్పట్లో ఆ పత్రిక చూస్తుండేవాళ్లు. ఆయనకి ఆంధ్రప్రభ వీక్లీలో ఉద్యోగం వచ్చిందప్పుడే. చూస్తూ చూస్తూ మంచి ఉద్యోగం వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ''ప్రజాతంత్ర''ను నట్టేట్లో ముంచిపోవడం న్యాయం కాదు. రాజేంద్ర డిలెమ్మాలో పడివుండగా ''ప్రజావాహిని'' మూతపడి నేను రోడ్డెక్కబోతున్న సమాచారం ఆయనకి తెలియవచ్చింది. ఎగిరి గంతేసి నా దగ్గరికొచ్చాడు. నేనూ ఎగిరి గంతేసి ప్రజాతంత్రలో వెళ్లి పడ్డాను. అప్పట్లో గోపాలశాస్త్రిగారు, దేవులపల్లి ప్రభాకరరావు, గుడ్లవల్లేటి రామారావుగారనుకుంటాను- ఆయనా ప్రజాతంత్ర కోసం రాస్తూండేవాళ్లు. నేను ఆ పత్రికలో చేరిన తర్వాత సి. ధర్మారావుగారు ఏక్టివ్‌రోల్‌ తీసుకోసాగారు. క్రమంగా టాబ్లాయిడ్‌ సైజ్‌ నుంచి డెమ్మీ వన్‌ ఎయిత్‌ సైజ్‌కి మార్చాం. తెల్ల కాయితం మీద కాస్ట్‌లీగా తీసుకొచ్చేవాళ్లం. ఇరవై వేల సర్క్యులేషన్‌తో బాగా నడిచింది. అందులో సినిమా మీద రియలిస్టిక్‌గా విమర్శ రాసేవాణ్ని. తనను సినిమా రంగం వైపు మళ్లించింది ఈ విమర్శలేనని బి.నర్సింగరావు అనేవారు. అలాగే అప్పట్లో కొన్ని సాహసాలు కూడా చేశాం. ఎమర్జెన్సీలో జైల్లో వున్న కె.వి. రమణా రెడ్డి రాసిన లెటర్‌ని స్మగుల్‌ చేయించి తెప్పించాం. దాన్ని ప్రజాతంత్రలో ప్రముఖంగా ప్రచురించాం. సహాయత ఎం.డి. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గురించి ఒక్క విషయం చెప్పాల్సి వుంది. పత్రిక యజమానిగా ఆయన ఆదర్శప్రాయమైన వ్యక్తి. సంపాదకుడిగా నాకు సంపూర్ణమయిన స్వేచ్ఛనిచ్చారు. 1975-78 మధ్య కాలంలో ప్రజాతంత్ర ఒన్‌మ్యాన్‌ షోగానే నడిచింది. అందుకు వ్యక్తిగతంగా ఏ.వీ. రావుగారే బాధ్యులని చెప్పా''లన్నారు దేవిప్రియ. ''మా భూమి'' సినిమా '78లో మొదలవడంతో నేను ఆ పనిలో బిజీ అయ్యాను. అది పూర్తయ్యాక ఆంధ్రజ్యోతి డైలీలో కొన్నాళ్లు రిపోర్టర్‌గా పని చేశాను. అప్పట్లో కె. రామకృష్ణ బ్యూరో చీఫ్‌గా వుండేవాడు. నేను ఉద్యోగంలో చేరిన రోజునే ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ప్రెస్‌ మీట్‌ జరిగింది. నాకే ఎసైన్‌మెంట్‌ వేసి పంపాడు రామకృష్ణ. అయితే ఎక్కువ కాలం కలిసి పనిచేయలేకపోయాం. జ్యోతి మంత్లీ ఎడిటర్‌గా మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లు అక్కడున్నానే తప్ప నాకు ఈ సారి మద్రాసేం నచ్చలేదు. తిరిగి హైదరాబాద్‌కి 'జ్యోతి'తో పాటే వచ్చేశాను. '81లో స్కైలెన్‌లో చేరి కొన్నాళ్లు పనిచేశాను. అంతలో ''రంగులకల'' సినిమా పని మొదలవడంతో స్కైలెన్‌ వదిలేశాను. మళ్లీ '83లో ఏబీకే, నంపాసాల చొరవ మీద తిరగి పత్రికల్లో అడుగు పెట్టాను. అప్పట్లో ఎలెక్షన్‌ స్పెషల్‌ తీసుకొచ్చారు ఆంధ్రప్రభ దిన పత్రికవాళ్లు. అందులో రన్నింగ్‌ కామెంటరీ మొదలు పెట్టాను. మోహన్‌ బొమ్మలు వేసేవాడు. మాది సూపర్‌హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. ఎలక్షన్‌ పేజీలోంచి ఫస్ట్‌ పేజీలోకి వచ్చింది రన్నింగ్‌ కామెంటరీ. ప్రఫుల్ల చంద్రరాయ్‌ పెట్టిన తెలుగుదేశం పత్రిక ఎడిటర్‌గా కొన్నాళ్లు పని చేశాను. కానీ, '84లో వచ్చిన 'ఉదయం' డెయిలీ నా జీవితంలో ఒక పెద్ద మలుపని చెప్పాలి. అందులో ఫీచర్స్‌ ఎడిటర్‌గా చేరాను. రెండేళ్లు వీరవిహారం చేశాను. '86లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ ఎడిషన్‌లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరడం -'89లో తిరిగి ఉదయం ఆదివారం అనుబంధం ఇన్‌చార్జిగా చేరడం-'93లో 'మనోరమ' ప్రారంభం చకచకా జరిగిపోయాయి. ఇందులో చాలా పరిణామాలు వాటంతటవే జరిగిపోయినట్లు అనిపించింది'' అని తలపోశారు దేవిప్రియ. ''కులస్పృహతో ఉద్యమాలు వచ్చేంత వరకూ సాహిత్యానికి సంబంధించీ, సమాజానికి సంబంధించీ కూడా ''విశ్వనరుడు'' అన్న భావనకే నేను ఓటేస్తూ వచ్చాను. అయితే క్రమంగా నేను మైనారిటీకి చెందినవాణ్నన్న స్పృహ నాకు కలిగేలా చేశాయి పరిస్థితులు. నా మట్టుకు నేను చాలా అభద్రత ఫీలవుతున్నాను. అయితే ఈ పరిస్థితులను ఈ కోణం నుంచి ప్రతిఘటించడం నూటికి నూరు పాళ్లు సరయిందేనా అనే విషయంలో సందేహాలు నాకు ఉన్న మాట నిజం'' అన్నారు దేవిప్రియ- నిజాయితీగా! ''చాలాకాలం పాటు నేను నా ఐడెంటిటీ విషయంలో- ప్రయత్నపూర్వకంగా- అన్‌ కాన్షియస్‌గానే ఉంటూ వచ్చాను. కానీ, నన్నలా ఉండనివ్వడం లేదు పరిస్థితులు. తొలిదశలో నాకు స్ఫూర్తి నిచ్చిన వాళ్లే కొందరు నన్ను తీవ్రంగా నిరాశ పరిచారు. కిందటి సంవత్సరం తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాను-నీకు తెలుసు. అప్పుడే మొదటిసారిగా నా ఫ్యామిలీ విషయంలో భయాందోళనలు చుట్టుముట్టాయి. మిత్రులనుకున్నవాళ్ల నిర్లిప్తత చూసేసరికి నిస్పృహ ముంచుకొచ్చింది. అది నెమ్మదిగా బిట్టర్‌నెస్‌గా కూడా మారి వుండవచ్చు''నని ఆయన అంగీకరించారు. ''మూడేళ్ల క్రితం గద్దర్‌ మీద నేనో డాక్యుమెంటరీ తీశాను. ''ద మ్యూజిక్‌ ఆఫ్‌ ఎ బ్యాటిల్‌షిప్‌'' అనే ఈ 96 నిమిషాల డాక్యుమెంటరీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో తిరుగుతోంది. హార్దికంగా నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. కానీ ఆర్థికంగా ఉపయోగపడలేదు. అదే కాస్త పించింగ్‌గా వుంది'' అన్నారు దేవిప్రియ. ''ఎప్పటికయినా ఆటోబయోగ్రఫీ రాయాలని ఉంది. తప్పకుండా రాస్తా''నన్నారాయన. ప్రస్తుతం అడ్వర్టయిజింగ్‌ రంగంలో బిజీగా ఉన్నానని, సినిమా రంగంలో మరికొన్ని ప్రయోగాలు చెయ్యాలని ఉందని దేవిప్రియ వెల్లడించారు. 'గుంటూరొస్తే గుండె బరువెక్కుతుంది' ''మాదసలు గుంటూరే. ఇక్కడికొస్తే సొంత ఇంటికి వచ్చినట్లే వుంటుంది. కానీ, ఎందుకో గానీ గుండె బరువెక్కుతుంది. నేను చదువుకునే రోజుల్లో ఇక్కడ చక్కని సాహిత్యవాతావరణం ఉండేది. ఇప్పుడు అలాంటిదేం కనిపించదు. అలాగే నేను చూస్తున్నప్పటి నుంచీ గుంటూరేం ఎదగలేదు. ఈ శ్టాగ్నేషన్‌ ఏదో ఒక రంగానికి పరిమితమయినది కాదు. ఇలాంటివి తల్చుకున్నప్పుడు బలే నీరసం అనిపిస్తుంది.'' అంటూ దేవిప్రియ వివరించారు. Read more at: http://ift.tt/1dZlq3T

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gu4GXs

Posted by Katta

Lingareddy Kasula కవిత

నా నాలుగవ కవితాసంపుటి 'ఇడుపు కాయితం ' ఆవిష్కరణకు మీ అందరికి ఇదే నా ఆహ్వానం

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dZlrF1

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || గతం నుంచి సూన్యింలోకి || ------------------------------------------------------ ఏంటో నేను పుట్టిన ఈ గడ్డపై నక్కి నక్కి బ్రతుకుతున్నా అందుకేనేమో నాలొని సంతోషాన్ని దొంగలించి భయాన్ని బదులుగా ఇచ్చారు నా మెదడుఓని లోని ఆలోచనల్ హత్య చేసి అనుభవాల బూడిద పూసుకున్న బైరాగిని " కొందరు జ్ఞాపకాల చురకత్తి గుండెల్లో గుచ్చి ఏం సాదించారో ఏంటో " నెట్టుటి మరకలు అంటిన నా మనసు అక్షరాలను ముందేసుకొని ఆనందాని వెతకాలని చూస్తే అక్కరలేని వేదన నన్ను వెక్కిరించింది మరచిన గతాన్ని తవ్వి చూడాలనున్నప్పుడల్లా కరుడు గట్టిన నిజం కదల్లేని స్థితిలో నన్ను ఒంటరిని చేసి వెక్కిరిస్తుంది ఈ సమాజంలో నేనెటు పోతున్నా కలానికి కాలానికి కవితకు అందని సూన్యింలోకి జారిపోతున్నా Note :- ఆంద్రా, కర్నాటక కవుల సమ్మేలనం లో నాకు రమ్మని ఆహ్వానం... అనంతపురం జిల్లా రాయదుర్గం లో 16 న ..ఆంద్రా, కర్నాటక కవుల సమ్మేలనం లో నాకు రమ్మని ఆహ్వానం రావడం ..మహా మహా కవుల మద్యి నేను ఓ కవితను చదివే అదృష్టం కలగడం నిజంగా మిరేకిల్ లా అనిపిస్తుంది నేను ఆ కవిసంగమంలో పాల్గోవడం చాలా అచ్చర్యంగా ఉంది ......ఏదో ఫేస్ బుక్ లో,బ్లాగ్ లో పిచ్చి కవితలు రాసుకునే నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించుకోలేదు...

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfGcja

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిసంగమం -సీరిస్ 13 గురించి :కొన్ని మాటలు ........................................................ దాదాపు 70నుంచి 80 మందిదాకా మిత్రులు హాజరయ్యారు. హెచ్చార్కె,ఖాదర్ మొహియుద్దీన్ ని చాలా కాలం తర్వాత కవిత్వం చదువుతూ ఉంటే వినడం. నాకు కూడా అదొక ఎగ్జయిటింగ్ అనుభవం. ఖాదర్ గారూ,హెచ్చార్కె తమ కవిత్వ అనుభవాల్ని పంచుకుంటూ,కవితలు చదువుతూ ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఖాదర్ తన ఇతర కవితలతో పాటు ' పుట్టుమచ్చ' దీర్ఘ కవితను వినిపించడం మరిచిపోలేని అనుభవం. హెచ్చార్కె మాటలు,కవితలు అద్భుతం. లోలోపలి ప్రపంచపు సంభాషణలా అన్పించింది -ఆయన మాట్లాడుతుంటే !. కవితల్ని,జీవితాన్ని అనుసంధానం చేస్తూ ఆయన కవిత్వం వినిపిస్తున్నప్పుడు ,ఆయనతో పాటు అందరూ ఒకానొక ట్రాన్స్ లో ఉన్నట్లుగా అనిపించింది. ఎన్నుకున్న కవితలు, వాటిలోని తాత్వికదృష్టి, కవిత్వం చేసిన విధానం -సింప్లీ సూపర్బ్. యువ కవిమిత్రులు విజయ్ కుమార్ svk, మధు ఇరువూరి తమ తమ కవితలతో ఆకట్టుకున్నారు. విజయ్ చదివిన కవితల్లోని నిగూఢత, కవితని నిర్మించే తీరు గొప్పగా అన్పించాయి. మధు కవితలకున్న ప్రత్యేకత సామాజిక దృష్టి. తనకున్న సామాజిక అవగాహనను ,ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న విధాన్ని తన కవితలుగా మలుస్తున్నాడు. వీరిద్దరూ మొన్నటి కవిత్వ పఠన అనుభవాన్ని జీవితాంతం మనసుల్లో పదిలంగా దాచుకుంటారు. మరో ప్రత్యేకత - చాలామంది కొత్తగా రాస్తున్నవాళ్ళు ,చదువుతున్నవాళ్ళు హాజరవ్వడం. సభ ముగిశాక వాళ్ళతో మాట్లాడినంత సేపు మనసు ఉప్పొంగింది. కవిత్వం పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, సభ జరిగాక కవిత్వ పఠనంపై తమ ఇంప్రెషన్స్, అనలైజ్ చేసిన విధానం -ఇవన్నీ కవిసంగమం శ్రమకోర్చి జరుపుకుంటున్న ఈ సీరీస్ కవిత్వ పఠనం గురించి గర్వంగా ఫీలయ్యేటట్లు చేసాయి. ఏదో కొత్తశక్తి అవహించినట్లుగా ఫీలయ్యాను. కవిత్వం కోసం ఇలా అందర్నీ కలుపుతూ,కలుస్తూ సాగడం; కవిత్వంపై ఇలా నిత్యం సీరిస్ సభలు నిర్వహించడం వలన ప్రయోజనం కలుగుతోంది అని అన్పించింది.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNcrev

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె *దాచిన వాన చినుకు* క్షణమో లేక సమయం యెంతో కాలం జూదం ఆట- మెలికపడిన మనసు తీగ కత్తరించు చేతులు- యుగాలు గడిచీ గుండెలో నీరు నిండి వొలికిపోతాయ్- నేను సముద్రం అప్పుడు- జతగా యెగురు పిట్టల దారి కోల్పోవడం తెలిసి నవ్వే ఆకాశం- *** నేనొక ఖాళీ నడకను కొన్ని ప్రియమైన పాదం గుర్తుల్ని వెతుకుతూ- 17/02/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gLuy0A

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

**పేరున్నా లేనిది** ఎప్పుడో కదలాడిన ఒక తెమ్మెర మళ్ళీ ఒకసారి చేరుకోలేని తెరై తెగులుతుంది ఏమడగను ఏం మాట్లాడను చూస్తూనే ఉండాలనిపిస్తూనే ఇక చూడకూడదనిపించే స్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా ఒకసారి నింపేసుకున్న హృదయం ఎంత తోడినా ఖాళీ అవదని తెలిసినా ఏతాం వెయ్యడానికే సరిపోదనిపించే బ్రతుకును ఎప్పుడైనా బ్రతికావా ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియనిది పోయినదేదీ దొరకదెందుకని తొందరగా 17.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gtr03x

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /గురువు ---------------------------- తెలుగు తప్ప వేరె భాష తెలియని మనసుకు రెక్కలు కట్టుకుని భళ్ళున ఆంగ్ల మాద్యమంలో పడ్డాను పదునెండు తరగతుల పిమ్మట బిక్కుబిక్కుమంటు నక్కి ఓ మూల కూర్చున్న ఈ దేహానికి ఆంగ్ల భాష భయం దయ్యాన్ని పారద్రోలిన నా గురువు ఇంగ్లీషును చండాడడానికి ఆయన నేర్పిన పన్నెండు సూత్రాలు నాకింకా గుర్తే The TEXT i wl never forget... its raining like cats and dogs అని చెబుతుంటే పిల్లులు,కుక్కలు పడడమేమిటా అని భోదపడని ఈ అవిటి మెదడుకు భారి వర్షం గూర్చి ఉదహరించి చప్పిన ఆ గురువును ఎలా మరిచేది కవిత్వం గురించి ఇంకా ఓనమాలు కూడా తెలియని వయసులో "యితర" కవితలు చదువుతూ తడిసిన హృదయంతో రాసిన భావాలు ఇప్పటికి పదిలమే జీవితాన్ని చదివిన గురువు జీవితం నేర్పిన గురువు పాదాభివందనం_/\_ ఈ చిన్ని కవిత ఆయనకు అంకితం. తిలక్ బొమ్మరాజు 17.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWUSAq

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

వేడుకలోను..వేదనలోను నిను వీడను నేను ..@శర్మ \17.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfb03y

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || మనసు విప్పి మాట్లాడుకుందాం! || ఏ ప్రాంతం లో, ఏ సమాజంలో ఏ కులం మతం లో అయినా .... తిరిగిన ఏచోట చూసినా తెలియని ప్రపంచానికీ ఉన్న ప్రపంచానికి సరిహద్దు .... ఒక చిరునవ్వు మాత్రమే! ఎన్నో పేర్లు ఎన్నో రకాల ముఖాలు ఎన్నో రకాల హావభావాలు ఎన్నో రకాల జీవన సరళులు కానీ, నిజమైన భావోద్వేగం మాత్రం అందరిలోనూ ఒకేలా ఉండటం విచిత్రం ఆ అద్భుతం .... ప్రేమ ఒక పసి హృదయం నవ్వులో ఒక ఎదిగిన మనిషి కన్నీళ్ళలో చూసాను. చూస్తున్నాను. కల్మషరహిత పరిమళం .... ప్రేమను అప్పుడప్పుడూ అనిపిస్తుంది నీలో, నాలో .... ప్రతి ప్రాణిలో మననందరినీ ఏదో బంధం దారం పెనవేసుకునుందని ఒకరినొకరం అర్ధం చేసుకునేందుకు దోహదపడుతుందని అది ఎంతో సుక్ష్మంగా గుర్తించలేని చిరుగాలి లా ఆ గాలికి రగులే చిరు వెచ్చదనం లా దివ్యమైన ఒక అనుభూతి లా మానవ జీవన కావ్యపు పల్లవి లా తొలి రాగ బంధం శ్రావ్యతను వింటున్నట్లుంటుందని. ప్రతి జీవితం లో ఒక శాసనం అయి ప్రతి పురుషుడి హృదయం లో ఒక మహరాణి ప్రతి స్త్రీ హృదయం లో మహరాజు .... అయిన ఒక ప్రియ భావన ఏదో మనసు తలుపును తట్టి .... ఆ అస్తిత్వం తనను తాను కోల్పోయి లోతైన సముద్రంలో మునిగిపోవడంలో భయంకరమైన సునామీ .... తుఫాను బీభత్సానికి గురి కావడంలో ఆనందాన్ని ఇష్టపడే సున్నిత ఉద్వేగ భావనల సమ్మేళన సమీకరణాల వైశిష్ట్యం .... గురించి ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందామా! మనకు ఎంతో అవసరమైన ఆ విలక్షణ లక్షణం గురించి జీవించేందుకు తప్పనిసరి శ్వాస ను .... ప్రేమ ను గురించి సాటి మనిషిని పరామర్శించాల్సిన ఆవశ్యకత .... జీవన విధానం గురించి ఒక ప్రాణి మరో ప్రాణి పట్ల ప్రదర్శించాల్సిన నమ్మకం .... విశ్వాసం గురించి రాగ విపంచి హృదయ స్పందనలను గురించి మనసు విప్పి ఒక్కసారి, మరోసారి మాట్లాడుకుందామా! 17FEB14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKxv1p

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ \\ రాబందుల వెన్నెల వాన\\ ఎర్రబారిన అతి భయంకర ఆకాశంలో ఏవో పీనుగులను దూరదృష్టి వరించింది కామోసు నక్షత్రాల్లా ఎగురుతూ రాబందులు పగలే వెన్నెల కురిపిస్తున్నాయి! పాలెగాళ్ళ ఏలుబడిలో రాబడి ఎత్తుగడల పన్నాగాలకు బలిపశువులై పెనంమీద మాడిన ఊతప్పంలా ఈ మడుగుల్లో కుళ్ళుతున్న వాసన ముక్కులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దిమాకు యిసుమంతైనా లేని మట్టిబుర్రలు స్వబడుగుల బుర్రలపైనే దాష్టీకంచేస్తూ తోటివారి తోళ్ళు ఒలిచి బరిసెలకు జెండాలు కడుతూ స్వంత గుండె గుడెసెలకే నిప్పుల స్నానం చేయిస్తున్నాయి.! భూస్వామ్య - అర్థస్వామ్య - బూర్జువా తైనాతీల దశనుండి నయా పెట్టుబడిదారీ పడమటిగాలి సమాజగతిని వక్రగతిలో ఆకులు విరిగిన ధర్మ చక్రంలా ఆకులురాలిన చెట్టై పీక్కుతింటున్నా ! రానని మొరాయించే వరుణునికోసం ఎలా దిగిరాదో చూద్దమని సామాజిక స్పృహ ఒంటికాలితో శ్మశానం వద్దే నిరీక్షిస్తుంటే స్లో మోషన్‌లో గ్లోబలి గాడు ప్రతీ పక్షాలతో మిలాఖతై వామపక్షాలపై కక్షకట్టి అతి దారుణంగా నిలువరించాలనే తపనను 24/7 మీడియా మాయా జాలర్ల వలలో పట్టి, మసాలా నింపాలనుకుంటే ఎక్కడో పాతాళంనుండి విప్లవ బడబాగ్ని కడుపును చీల్చుకొచ్చే అంకురంలా తలెత్తేందుకు తటాలున మెరుపు వేగంలా గెరిల్లా వ్యూహంతో కలాలు హలాలై చివురించే మొలకలు కావాలి! సూటిగా సూదిమొనలతో గుచ్చుకొని పాదాలకిందనున్న విషనేత్రాన్ని చిదిమేయాలి! అందుకు మీరు నేను మనమందరం నేరుగా నేలలో ఇంకేలా పట్టుదల నీరు పోద్దాం! రాబందుల వెన్నెల వానని రాకాచంద్రకాంతులుగా మారుద్దాం! 17.2.2014 ఉ.6.36

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkwg0

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

గోవింద మాల వారణాసి రామబ్రహ్మం 17-2-2014 వికసించిన కమలములు నిండు సరసికి శాంతి నిండిన మానవులు నిండు అవనికి క్రాంతదర్శులైన జ్ఞానులు నిండు లోకమునకు శాంతి నిచ్చు గోవిందుడు నిండు మనసుకు

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkvZs

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // డ్యుయల్ సిం! // వైరుధ్యాలను పెంచి పోషించినవాడే వైవిధ్యాల గురించి మాట్లాడ్తాడు! విధ్వంసానికి మూలంగా నిల్చినవాడే విలయంపై విలపిస్తాడు! నిలువ నీడ లేకుండా చేసినవాడే నీ జీవనానికై నినదిస్తాడు! పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినవాడే బ్రాండ్ బాజా బారాత్ అంటూ వూదరగొట్టేస్తాడు! **** సహనానికి ప్రతీకలుగా నిల్చిన మనమే సాగర హారమై పోటెత్తితే... ఆచూకీ దొరకని శవంలా కొట్టుకుపోతాడు వాడు! 26.9.2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oElkat

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-66// ********************* 1. బ్యాగులకు చక్రాలొచ్చాయ్, ఎర్రచొక్కాలకు కన్నాలు పడ్డాయ్, రైల్వే స్టేషన్లో... 2. పనికిరానిదేముంది లోకంలో, పుట్టగొడుగుల కూరే ప్రత్యేకం, ఫైవ్ స్టార్ హోటల్లో... 3. కంచెగట్టి కాపలా పెట్టొచ్చేమో, పూలతోటకి... మరి పరిమళానికో, ప్రతిభకి అవరోధాలెక్కడివోయ్ 4. కుక్కకూడా భయపడుతోంది, ముక్క లాక్కుంటాడేమో మనిషని, పరాకాష్ఠలో స్వార్ధం... అంతటా మని,మని 5. మార్పు అనివార్యం, అనుకున్నప్పుడే మొదలవుద్ది, ఓర్పుకి పరీక్షా ప్రహసనం. 6. వడదెబ్బ తగిలినోడికి, నీడనిస్తే చెట్టుకేంటి నష్టం, ఉన్నప్పుడు లేనోడికిస్తే, ఏంటి కష్టం 7. కుండైపోద్దా మట్టి, కుమ్మరి నడుం ఒంచకపోతే, బాధ్యత తేలికే, బరువనుకోకపోతే 8. తిరుగుతుంటేనే చూస్తాం గడియారం, ఎంత గోప్పదైతేనేం వంశం, పనిచెయ్యకుంటే లేదోయ్ గౌరవం. 9. అనుకున్నది అవుతుంటే, అంతా మనసత్తా అనిపిస్తుంటుంది, ఆగిందో, కర్మసిద్ధాంతం మొదలవుతుంది. 10. బజారుసరుకా శీలం కొనేందుకు, నిజాయితీ రక్తంగా మారాలి, అది పొందేందుకు...... ========================== Date: 16.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MpQvYz

Posted by Katta