పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ravi Rangarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ravi Rangarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2014, శుక్రవారం

Ravi Rangarao కవిత

రావి రంగారావు సాహిత్య పీఠం గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో 22న గుంటూరులో సీమాంధ్ర కవి సమ్మేళనం నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా సీమాంధ్ర చరిత్ర, సంస్కృతి, వైభవం...మననం చేసుకొనటానికి, అభివృద్ధి దిశలో పయనించటానికి ఒక చిన్న ప్రేరణగా సీమాంధ్ర కవి సమ్మేళనం ఈ నెల 22న గుంటూరులో గుజ్జనగుండ్ల, జె.కె.సి. కళాశాల ప్రాంగణంలోని ఆర్.వి.ఆర్.ఆర్.బి.ఎడ్. కళాశాలలో జరుగుతుంది. రావి రంగారావు సాహిత్య పీఠం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో నిర్వహింపబడే ఈ కవి సమ్మేళనంలో సీమాంధ్రకు చెందిన వివిధ జిల్లాల నుండి కవులు పాల్గొంటున్నారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. పాపినేని శివశంకర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రారు రావెల సాంబశివరావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. ఉన్నం వెంకయ్య, శాసన మండలి సభ్యులు శ్రీ కె.ఎస్.లక్ష్మణ రావు, ప్రముఖ విద్యావేత్త గద్దె మంగయ్య, ప్రొ. బూదాటి వెంకటేశ్వర్లు, డా. జి.వి.పూర్ణచంద్, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అద్దేపల్లి రామమోహనరావు మొదలైన వారు అతిథులుగా పాల్గొంటున్నారు.. వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతి, వైభవం, అభివృద్ధి... ఇతివృత్తాలుగా కవులు తమ కవితలు వినిపించే ఈ కార్యక్రమం ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు జరుగుతుంది.పాల్గొంటున్న కవు లందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ఇవ్వబడతాయి. ఉదయం 10 గం.కు ప్రారంభ సమావేశం, 11 గం.నుండి 1 గం.వరకు మొదటి కవి సమ్మేళనం, మధ్యాహ్నం భోజనం తరువాత 2 గం.నుండి రెండవ కవి సమ్మేళనం, 4 గం.నుండి 5 గం. వరకు ముగింపు సభ జరుగుతాయి. కవులు ఎలాంటి రుసుములు చెల్లించవలసిన పని లేదు. కవిమిత్రులు ఆహ్వాన పత్రికను అంతర్జాలం ద్వారా ఫేస్ బుక్ గ్రూప్ raavirangarao saahityapeetham నుండి పొందవచ్చు. (Sd.) సోమేపల్లి వెంకట సుబ్బయ్య (Sd.) రావి రంగారావు (గుంటూరు జిల్లా రచయితల సంఘం) (రావి రంగారావు సాహిత్య పీఠం) 9490776184 9247581825

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TehnOn

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (మానసిక వైద్యం) సరిగ్గా పని చేయకపోతేనే అవయవాల విలువ తెలిసేది, కాళ్లయినా కళ్ళయినా గుండెయినా లివరైనా... తలకాయ సరిగ్గా పనిచేయకపోతే ఎవ్వడూ పట్టించుకో డెందుకు!

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tK2b6Z

Posted by Katta

29, మే 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (ఎండుటాకులకు కృతజ్ఞత) పాము కదిలి పోతుంటే గలగలా శబ్దం చేస్తూ ఎండుటాకులు హెచ్చరిస్తున్నాయి, పక్కనున్న మొక్కల మీది పువ్వులు ఎన్ని అనుభూతి కవితలు రాసుకున్నా నడక లెదుర్కొనే ప్రమాదాల్ని పసిగట్టి కూడా ప్రకృతిలోకి ముడుచుకుపోయే ప్రయత్నం... పచ్చి గడ్డి కోసం కక్కుర్తి పడి దారి తప్పిన గేదెలు, గేదెలు కాసే మురికి తలకాయలు అరణ్యంలో తమ దారి వెతుకులాట... మంత్రం వేసే పాముల నరసయ్యల సిద్ధాంతులు ఇంకా మైదానాల్లో బుసలుకొడుతూనే... చీకటి ఆసుపత్రుల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు దారి తెలిసే తప్పిపోయాయి... ఎన్నికలు గడిచిపోయాయి హమ్మయ్య! మొత్తానికి గేదెలు, కాపలావాళ్ళు తెల్లారేసరికి గూడెం చేరుకున్నారని అద్భుత మైన విజయ వార్త, ఎండుటాకులకు కృతజ్ఞత.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMM6fE

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Ravi Rangarao కవిత

డా.రావి రంగారావు (శిక్ష్మాసృతి) మురుగు నీరు నిలిచిపోవటంతో గట్టి రోడ్లు కూడా శిథిల మౌతున్నాయి, చాలా ముఖ్యం సరైన డ్రైనేజీ. 26-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3Ui8u

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (పని మనిషి) ఆధునిక భవనంలాంటి భువనంలో హాలులాంటి స్నేహితులు, మాస్టర్ బెడ్ రూమ్ వంటి భార్య, ఇతర బెడ్ రూముల్లాంటి బంధువులు, కిచెన్ లాంటి నాన్న, డైనింగ్ లాంటి అమ్మ... అన్నీ ఉన్నా సరే ముఖ్యం- టాయిలెట్ లాంటి పనిమనిషే.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fwS3I1

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు ( అనుదిన వ్యాయామం ) నేను ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వాకింగ్ చేస్తుంటా, ఒంటికి నలుపు రంగు పూసుకొన్న తెల్ల కోకిల “కూ”, “కూ” అంటూ వెన్నెల రాగాలు తీస్తున్నది... ఒంటి నిండా తెల్ల బొచ్చు అంటించుకున్న నల్ల కుక్క “కవ్”, “కవ్” అంటూ చీకటి గోల చేస్తున్నది... నేను ఆధునిక సౌకర్యాల హాలులో ప్రాణాయామం చేస్తుంటా, రోగాల గొడ్డళ్ళకు, ఇంగ్లీషు మందుల కత్తులకు బలైన పొలం తూలిపడటం, తట్టుకొని నిలబడటం అభ్యసిస్తున్నది... ముడతలు పడిన చర్మ ఖర్జూరం ఒలిచేసుకొని మనిషితనం కొత్త రూపాయల కుర్ర చర్మం తొడుక్కొని కులుకుతున్నది... నేను మా ముసినిపల్ పార్కులో మునుల్ని, ఋషుల్ని పిడికిళ్ళలో పెట్టుకొని కొత్త ధ్యానం చేస్తుంటా, పక్క అపార్టుమెంటులో ఆడుకుంటున్న పిల్లకాయలు సూర్యభవనాలకు, చంద్ర నక్షత్రాల వీధులకు కొత్త విద్యుత్తు అందిస్తున్నారు... బయటకు కదలొద్దని మనుషులు శాసించిన దేవుళ్ళు నిగ్రహాల విగ్రహాలలో పగలైనా నిద్రపోతూనే ఉన్నారు... ఇక నేనిప్పుడు సూర్యు డిచ్చిన రెక్కల్ని తొడుక్కొని గరుడ గమనంతో అవకాశ ఆకాశంలోకి బయలుదేరాను, సోదరులారా, రస హృదయ భావుకులారా, నన్ను ఉచితాసనంగానో, పదునైన ఆయుధంగానో చేసుకోండి, కదలకుండా చచ్చిపోతారో, కదులుతూ కంపల్ని నరుక్కుంటారో మీరే తేల్చుకోండి. 24-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8zUpb

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (పాడు పడిన కారు) ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నో ఏళ్ల నుండి ఓ కారు పడివుంది అలాగే కదలకుండా... నడిపే డ్రైవరు నిర్వాకంవల్ల... దర్జాగా కూర్చొని శాసించే శక్తుల వల్ల... చిన్ని చిన్ని మరమ్మతులు వస్తే పట్టించుకోకపోవటంతో, ప్రయివేటు కారు మోజు పెరగటంతో... పడివుంది నిశ్చలంగా కారు తుప్పు పట్టిన నల్లని ఎముకల గూడులా... పనికిరాని దని పారేయరు, పాత ఇనప సామాను కొట్టుకు పడేయరు, పడివుంది ఆ కారు శవం- పైవాళ్ళెవరో వస్తే నిజాయితీకి ఆధారం ఆ కారట! పొద్దున్నే కళ్ళు తెరవగానే ప్రాంగణంలోని చెట్లు, మొక్కలు కారును చూసి కాసేపు రొజూ ఏడ్చి మళ్ళీ మామూలు పనుల్లో మునిగిపోతాయి, కారు శవాన్ని కన్నెత్తి కూడా చూడకుండా ప్రయివేటు ఏసి కారులో వచ్చే అయ్యగారి కోసం ఎంత కాలం గడుస్తున్నా ఎదురుచూస్తుంటాయి వెచ్చని సంపదలు... ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పడివున్న ఆ కారును చూసినపుడల్లా నాకు గుర్తుకొచ్చేది మన దేశం, మన దేశంలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం. 17-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qNOCUs

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (అమృతంతో పోల్చలేను...) ప్రేమను అమృతంతో పోల్చి ఎంత తప్పు చేసానో... అమృత మంటే అందమైన అబద్ధం, అదో ఎన్నికల వాగ్దానం... అమృత మంటే కల, ప్రేమంటే గొప్ప కళ... ప్రాణ మూలా లైన నీటిని, పాలను, తేనెను, పంచదారను... అమృతంతో పోల్చి వాటి పరువు తీశాను, జీవనాధారాలకు నేనో పెద్ద తప్పు చేశాను... నీటిని నీటితోనే పోల్చాలి, పాలను పాలతోనే చెప్పాలి, తేనె అయినా, పంచదార అయినా ప్రేమ నయినా ఎలాంటి మానవ సుమగంధాల నయినా... వాటిని వాటితోనే పోల్చాలి, వాటి కవే సాటి, మరి దేనితోను లేదు వాటికి పోటీ... రాత్రంతా దిగంబరంగా దిగులులో తడిసిన వాడికి ఉదయం ఓదారుస్తూ ఇచ్చే ఎండ వస్త్రాన్ని అమృతంతో ఎలా పోల్చను! తనువంతా ప్రాణాలై అంతర్లీన మైన మహా పంచ శక్తుల్ని అమృతంతో పోల్చి ఎలా దోషం మూటకట్టుకోను! ప్రియురాలి దర్శనాన్ని వెన్నెలతో పోలుస్తా, హాయిగా ఉంటుంది... తల్లి పెట్టే గోరుముద్దల్ని చందమామతో పోలుస్తా, చల్లగా ఉంటుంది... అమృతంతో మాత్రం పోల్చను, అమాయకుల్ని మోసం చేయను... ఎందుకురా బాబూ, అమృతం అమృతం అని కలవరిస్తారు! పోలికలు వద్దని కాదు- నీరో, పాలో, నేలో, గాలో, నిప్పో, ఉప్పో... మీ భావాలను చిత్రించటానికి సత్యమైన పోలికల్ని తీసుకోండి! సత్య మైన వార్తకు సత్యం కన్నా గొప్ప లక్షణం ఏముంటుంది చెప్పండి! 14-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwmJ2Z

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (కవితలు ఉగాదికి ప్రాణాలు) అంకెల మీద నడిచే ముళ్ళు గడియారానికి ప్రాణాలు... పొలాల మీద నడిచే నాగళ్ళు జగతికి ప్రాణాలు... చీకటి మీద నడిచే నక్షత్రాలు రాత్రికి ప్రాణాలు... పగలు మీద నడిచే ఎండలు కిరణాలకు ప్రాణాలు... తోటలో నడిచే బీజాలు పచ్చదనానికి ప్రాణాలు... ఋతువుల మీద నడిచే రుచులు కాలానికి ప్రాణాలు... మట్టి మీద నడిచే వానలు సృష్టికి ప్రాణాలు... సెల్ ఫోను మీద నడిచే శబ్దాలు అనుబంధాలకు ప్రాణాలు... తెర మీద నడిచే బొమ్మలు కథలకు ప్రాణాలు... మనసులో నడిచే భావనలు మూర్తిమత్వానికి ప్రాణాలు... దేశం మీద నడిచే సజ్జనులు పుణ్యానికి ప్రాణాలు... కవిసమ్మేళనంలో నడిచే కవితలు ఉగాదికి ప్రాణాలు. 28-03-2014 10.32 PM

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8fv7D

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (ఆవులు కనిపించే దేవతలు) పదిహేను ఆవుల్ని ఒక్కసారే ఎలా చంపారురా... ఆవు మాంసం కంటే అమ్ముకోటానికి ఇంకేదీ దొరకలేదా... ఆవంటే ఒక అమ్మ గుర్తుకు రావాలి ఆవంటే ఒక పచ్చని పండ్ల చెట్టు గుర్తుకు రావాలి ఆవంటే ఒక నడుస్తున్న నది... ఆవంటే ఒక పండుతున్న పొలం... అమ్మను చంపుకుంటాడా ఎవడైనా పచ్చి మాంసం అమ్ముకోవటం కోసం! పండ్ల చెట్టును నిలువునా నరుకుతాడా ఎవడైనా కట్టెలు మార్కెటులో సొమ్ము చేసుకోవటం కోసం! నది లేకపోతే నీవెలా బతుకుతావు! పొలం లేకపోతే నీవెలా నీ కుటుంబాన్ని పోషిస్తావు! ఆవు హిందువుల ఆరాధ్య దేవతని కాదు- ఒక మతానికి చెందిన పవిత్ర జంతువని కాదు- ఎలాంటి తప్పుడు కళ్ళజోళ్ళు లేకుండా చూడు, ఎలాంటి చెప్పుడు మాటల పుళ్ళు మనసులో లేకుండా ఆలోచించు... ఒక్క ఆవు ఉచ్చతో, పేడతో ఎలాంటి ఇతర ఎరువులు లేకుండా పదెకరాలు పండించవచ్చు... ఏటా వంద మంది మనుషుల్ని పోషించవచ్చు... కొన్ని ఓల్టుల విద్యుత్తు సృజించవచ్చు... కొన్ని వేల బాక్టీరియాల్నిధ్వంసించవచ్చు... కుటుంబ మంటే భార్య, పిల్లలు మాత్రమే కాదు- ఒక అవును పెంచినప్పుడే పరిపూర్ణ కుటుంబం... పెళ్ళాం బిడ్డల్ని చంపుకుంటే ఒక కుటుంబమే పోతుంది, ఒక ఆవును చంపితే కొన్ని కుటుంబాలు పోతాయి... ఆవును ధర్మం అని సత్యం అని ఎందుకన్నారో తెలుసురా మీకు! ఆవు లంటే మానవులను పోషించే అసలైన తల్లులు, ఆవు లంటే మనల్ని పాలిస్తూ కనిపించే దేవతలు. ( విజయనగరంలో పదిహేను ఆవుల్ని మాంసం కోసం చంపారన్న వార్త ఇప్పుడే టీవీలో చూసి...) 17-03-2014 5.59 PM

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBQdda

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (నేత్ర రుచులు) కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQ80wd

Posted by Katta

1, నవంబర్ 2012, గురువారం

డా. రావి రంగారావు // గుంటూరు-టు-విజయవాడ //


తెగ నరికిన చంద్రుడు
చక్కగానే నవ్వుతున్న వేళ
గుంటవూరులో “గుంటగ్రౌండ్”నుండి

నత్త నడకతో “బస్టాండ్” కు బయలుదేరాను,
పడమటి గుంటలో చంద్రుడు పడిపోతే
చీకటి నడక తర్వాత “ఎర్ర బస్” ఎక్కాను...

చేతు లెత్తి ఆగమనే
చిన్న ఊళ్ళను మన్నిస్తూ
దారి కడ్డమై నిలిచే
విష సర్పాలను నలిపేస్తూ
నా పయనం
బస్సులో జనం...

ఆలోచనలతో తలను
తగలబెట్టేసుకుంటున్నాను
చలి “చెర్నకోల” దెబ్బలు
పులిని చీమ కుట్టినట్లు...

“మంగళ”గిరి చేరేసరికి
మసక వేకువ మొలుస్తోంది
కుర్రవాళ్లమ్మే “డైలీ” పేపర్లలో
ఎర్రక్షరా లింకా కనబడటం లేదు...

విజయవాడ దగ్గరపడింది
విజయం సాధించినట్లే,
బ్యారేజీ మీదుగా పోతూ నేను
తలలోని మంటల్ని నదిలోకి విసిరాను,
అపుడు “కృష్ణ నది”లా లేదు కృష్ణానది-
అరుణ ఉష్ణ జ్వాలా ప్రవాహం అది...

సహస్రానేక కరాలతో పరస్పరం
కౌగిలించుకుంటూ
కలిసి ప్రయాణిస్తూ
అదిగో! కనబడటం లేదా!
సూర్యుడు-
మండుతున్న నది హృదయంలో...
నది-
ప్రహించే సూర్యుని దేహంలో...

29, సెప్టెంబర్ 2012, శనివారం

డా. రావి రంగారావు // కవీ రైతూ దేశానికి రెండు కళ్ళు //

నాకూ మా నాన్నకూ తేడా లేదు
మా నాన్న హలం పొలంమీద పెట్టి అక్షరాలు రాస్తున్నాడు
నేను కలం కాగితమ్మీద పెట్టి ధాన్యం పండిస్తున్నాను...

మా నాన్న నేల గుండెలు కూలుస్తున్నాడని
నేను కాగితం శీలం చెరుస్తున్నానని
ఆయుధాలతో మే మిద్దరం హింసను ప్రేరేపిస్తున్నామని
మనస్సులకు కత్తులు కట్టుకున్నవాళ్ళు పొగబెడుతున్నారు
మన జాతి ప్రాణాలపై పగబడుతున్నారు...

నా కలంనుండి అక్షరాలు
ఆకలి చీకట్లను తొలగించే
వెలుతురు ధాన్యపు గింజలు,
ఈ గింజలకు విశ్వరూప శక్తి కలిగిస్తామని
చేతు లెత్తి పిలుస్తున్నాయి
ప్రజా హృదయ క్షేత్రాలు...

శ్రమ నంతా పచ్చని అమృతంగా మార్చి
పొలాల నిండు గుండెల్లో భద్రంగా ఉంచి
విషంబొట్టు దొంగలు రాకుండా చూసే
పల్లెపడుచు వడిసెల నా కలం...

ఎన్ని శిశిరాలు వెన్నుపోటు పొడిచినా
ఎన్ని పండుటాకుల అనుబంధాలు వదిలిపోయినా
ఎన్ని గొడ్డళ్ళు తనువును గాయపరిచినా
మళ్ళీ కొత్త చిగురులు తొడిగే చెట్లు
నా కలానికి బంధువులు...

నిద్రపోతున్న మొద్దుల్లాంటి
ఎద్దుల్ని మేలుకొలిపే
చెర్నకోల హెచ్చరికలు
నా కలానికి స్నేహితులు...

ఎండిపోయిన మొక్కల ముఖాల చూచి
ఆదుర్దాగా పరుగెత్తుకొచ్చి
గలగలా ఆప్యాయంగా మాట్లాడుతున్న పంటకాల్వలు
నా ఆలోచనలు...

చిక్కిపోయిన నదీనదాలకు
కొత్త రక్తా న్నెక్కించటానికి
దివి నుండి భువికి దిగివచ్చే
వర్షం జల్లులు నా ఆశయాలు...

చిరునవ్వుల పువ్వుల
పత్తిచేనుమీద పడి
రక్తాన్ని పీల్చేస్తున్న దోమలగుంపు మీద
క్రిమిసంహారక మందులు చల్లటం నా ఆచరణ...

ఎవరైనా పాములుగా మారి
నా దారి కడ్డు వస్తుంటే
గోమాత లాంటి నా కలం
గరుత్మంతుడై వీక్షిస్తోంది...

నా కలం
పీడితునికి చిహ్నం,
శ్రమజీవనానికి సంకేతం,
సామాన్యుడికి ప్రతీక,
ధర్మానికి పతాక...

పాలిస్తున్న ఆవుల్నడిగి
దున్నిపెడుతున్న ఎద్దుల్నడిగి
పంటలు మోసే బండిని అడిగి
కన్న తల్లి నేలను అడిగి
ఓ కొత్త సిరా తెచ్చుకొంది నా కలం...

ఎండిన డొక్కల్ని చేరుకుందామని
బయలుదేరిన పంటను నిప్పుకళ్ళతో
భయపెట్టి దోచుకునే చీకటితో
నా కలం కుస్తీ పోటీ...

ఈ చీకటిని తొలగించటమే
నాకూ మా నాన్నకూ ఆరాటం,
తరతరాలుగా మేం చేస్తున్నాం
ఈ నేలమీద పోరాటం...

నాకూ మా నాన్నకూ తేడా లేదు
మా నాన్న హలం పొలంమీద పెట్టి కవిత్వం రాస్తున్నాడు,
నేను కలం కాగితమ్మీద పెట్టి వ్యవసాయం చేస్తున్నాను...

మా నాన్న హలంతో, నేను కలంతో
తూర్పుదిక్కు నుంచి బయలుదేరాము,
మార్పు కోసం కలిసిసాగాము,
మా మధ్య నడిచివస్తున్నాడు-
మా చిటికెనవేళ్ళు పట్టుకొని
దిక్కుల్ని పలకరిస్తూ చిరునవ్వుతో కిరణభానుడు
ప్రపంచాన్ని పాలించే రేపటి మా వారసుడు.

22, సెప్టెంబర్ 2012, శనివారం

రావి రంగారావు ( గుండె రాయి )


పొలం గట్టు గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
కన్న నేలను
ముక్కలుముక్కలుగా విడగొట్టుకుంటున్నానని !

కుండ గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
జీవన మృత్యు సారం సారాను
ఒళ్ళంతా నింపుకోవాల్సివస్తుందని...

కుండీ గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
పంటలు పండించలేని పచ్చదనాన్ని
నెత్తిలో దించుకొని మోయాల్సివస్తుందని...

తుపాకీ గుండు గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
ఎప్పుడు ఏ అమాయకుడి దేహవనంలో
మత్తగజంలా పడి ధ్వంసం చేయాల్సొస్తుందని...

“జెండా” సీత గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
ఎపుడు ఏ వేషంలో వచ్చి
ఏ రావణ హస్తం తనను అవిష్కరిస్తుందని...

ప్రపంచాని కంతా గుండె కొట్టుకుంటోంది-
“గుండె” ఉన్న ఈ మనిషికి తప్ప !

రావి రంగారావు ( విశ్వరూపం )


అవును, ప్రస్తుతం మేం
మీ కాళ్ళ కింద నలుగుతూన్న చలిచీమలమే,
రేపు ధనగర్వ సర్పాన్ని పట్టి పల్లార్చే
సాముహిక శక్తి మేమే...

అవును, ప్రస్తుతం మేం
అక్కడక్కడా పడివున్న గడ్డిపోచలమే,
రేపు అధికార మత్తగజం పెడరెక్కలు విరిచికట్టే
వెంటిమి మేమే...

అవును, ప్రస్తుతం మేం
చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న నక్షత్రాలమే,
రేపు చీకటి వ్యవస్థను సమూలంగా పెళ్ళగించే
సమైక్య సూర్యబింబం మేమే...

ఇదంతా పాత కథ గానే ఉంది నిజమే
ఓ కొత్త నిజం కూడా తెలుసుకో,

మీరు విసిరే వడగాడ్పులలో మా ఆలోచనల బీజాలు
గాలిలో కొట్టుకుపోతున్న మాట నిజమే ,
అనుకూల వర్షాలు వస్తాయ్...
రేపు భూమ్మీద ఎక్కడ చూచినా మా మొలకల ములుకులే...

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

డా. రావి రంగారావు || జీవ లక్షణం ||


ఒరే, సుఖా లన్నీ అనుభవిస్తూ
కష్టాలు తప్ప లేదనే వాడా!
గాలుల సుడిగుండాలకు చిక్కినా
పచ్చగానే నవ్వుతూనే వుంటుంది చెట్టని,
గొడ్డళ్ళ గూండాలు గాయపరుస్తున్నా
కొత్త చిగుళ్ళ ఆయుధాలతో తలెత్తుకొని ఎదిరించేది చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టు గర్భస్థ పిండాల్ని
ముక్కలుగా కోసుకొని తినేవాడా!
నీ కోసం జీవితాంతం
కడుపు పండించుకుంటూనే వుంటుంది చెట్టని,
తన ఆహారాన్ని
ఎవడినీ అడుక్కోదు చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టుకు చలనం లేదని వాగే
ఎదుగుదల ఆగిపోయిన వాడా!
పండ్లల్లో పువ్వుల్లో
కూరల్లో ధాన్యాల్లో
గింజల్లో పప్పుల్లో
చెట్టు కెంత చలనం వుందో
తెలుసా నీకు ?
చలనం లేదనిపించే భూమి
ఎంత వేగంతో సంచలిస్తుందో, సంచరిస్తుందో
తెలుసా నీకు ?

సరసరా పొలం దున్నుతున్న నాగలిలో
చెట్టు చలనం చూడు !
చీకటిని చీల్చుకుని సాగే దీపం వత్తిలో
చెట్టు సంచలనం చూడు !
చెట్టు విశ్వ ప్రయాణం తెలియాలంటే
చెట్టంత మనసు పెంచుకో ముందు !

కదులుతున్న చెట్టు కదలనట్లుగా
ఎందుకు నిలబడి వుందో తెలుసా !
ఆకలితో అలమటించి చస్తావని
నీ ఎదురుగానే వుంటుంది చెట్టు,
వద్దని గెంటుతున్నా వెళ్ళని
విశ్వాసం ఉన్న కుక్కలా
నీ ఇంటి ముందే నిలుచుంటుంది చెట్టు,
నీ ప్రాణాల్ని నిరంతరం కాపలా కాస్తుంది చెట్టు,
నీకు ఇల్లు కట్టిపెడుతోంది చెట్టు,
నీకు బట్ట చుట్టిపెడుతోంది చెట్టు,
నీకు దీపమై దారిచూపుతోంది చెట్టు,
కుర్చీయై నిన్ను అందాలా న్నెక్కిస్తోంది చెట్టు,
నువ్వు చచ్చాక కూడా
నీ తలదగ్గర వెలుగై
నిన్ను తగలేసేది కూడా చెట్టు...

ఒరే, చైతన్యహీనుడా !
నా దృష్టిలో
చెట్టు...సజీవి,
నీవు నిర్జీవి...

ఒరే, రెండు చేతుల యంత్రమా !
ఇకనైనా చెట్టును కొట్టకురా !

రావి రంగారావు // గుర్రాలను మోస్తున్న మనుషులు //


ఈ రోజు మనిషి
రోడ్డు మీద నడుస్తున్నా
ఏదో రూపాయల కట్ట దొరుకుతుందనే,
గునపంతో నేలను తవ్వినా
ఏదో లంకెల బిందెలు దొరుకుతాయనే,
ఆకాశంలో వెళ్తున్నా
ఏ కల్పతరువో అందుతుందనే,
మబ్బులు కమ్ముకువస్తుంటే
ఏవో బంగారం బిళ్ళలు కురుస్తాయనే ...
మనిషి కిప్పుడు వెయ్యి కళ్ళయినా చాలవు-
దేహకణా లన్నీ కళ్ళయితే ఎంత బాగుణ్ణు...

మనిషి మెదడు గురించి
పరిశోధిస్తున్న అమాయకులారా,
ఏ కణం వెతికినా
ఊడిపడేది సంపదల కోరికలే...

ఊళ్లో హత్యలు మానభంగాలు...
అందరూ నిద్రపోతున్నారు-
మేలుకొలపడం నా వల్ల కావడం లేదు-
ఇంతలో ఓ రూపాయి బిళ్ళ జారి కింద పడేసరికి
జనం లేచి ఒకటే వెతుకులాట...

మురికి నగర మైనా
విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నట్లు
ప్లాస్టిక్ బొమ్మలు కూడా
పచ్చనోట్ల వెలుతురు తగిలితే చాలు-
తుమ్మెద వరుడికి
అవే సౌగంధిక పుష్పాలు,
మధువు లేకపోయినా సరే,
పరిమళాలు పట్టుబడకపోయినా సరే...

డబ్బు చెట్ల నూడ్చి
కోసుకొచ్చుకొన్న రూపాయల “కొమ్మ”లతో
చక్కగా కాపురం చేయాల్సినవాళ్ళు
ఇంకా అధికఫలాలు కావాలని ముసలి చెట్లను వేధిస్తున్నారు,
గుడ్ల నీరు కుక్కుకుంటున్నాయి కాపు లేని చెట్లు,
ఉరితాటికి చిక్కుకుంటున్నాయి దిక్కు లేని కొమ్మలు...

సమాజం త్రాసులో
ఒక పల్ల్లెంలో సరస్వతిని
మరో పళ్ళెంలో పచ్చనోట్లు పెడితే
రూపాయల బరువే ఎక్కువని తేలిపోయింది,
సరస్వతిని నమ్ముకున్న సు”బుద్ధి”
రోడ్డుమీద దీనంగా పడిపోయింది...
సరస్వతి మెడకు తాడు కట్టి
పబ్లిగ్గా ఈడ్చుకుపోతున్న నోట్లకట్టలు,
దారి సుగమం చేస్తున్న పెద్దల పొట్టలు...

నిన్నటి దాకా సిగ్గుతో దూరంగా
ఎక్కడో పడివుండేది ఈ చీకటి కొండ,
ఇపు డీ కొండకు కాలం
డబ్బుతో పోసింది ప్రాణం,
ఏనుగులా లేచిన కొండ
దేశం మీద పడి దూకటం మొదలుపెట్టింది,
విద్యాలయాలను తొక్కుతోంది,
దేవాలయాలను గుద్దుతోంది,
మనిషికి మూడో కన్ను ప్రసాదించే
గ్రంథాలయాలను కుమ్ముతోంది...

డబ్బు గుర్రాన్ని ఎక్కి
విజయ విహారం చేయాల్సిన మానవుడా,
గుర్రాన్ని నీవే నెత్తి కెక్కించుకొని
మహానందంగా మోస్తున్నావా,
ఇప్పుడు కాకుంటే రేపటికైనా
ఆ గుర్రం తన్నక మానదు,
నీ తల పగలక తప్పదు.