పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Gajulapalli Madhava Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gajulapalli Madhava Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2014, గురువారం

Gajulapalli Madhava Reddy కవిత

గాజులపల్లి ||శూన్యం|| ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! గొంతునరం తెగనరికితే నీకైనా నాకైనా కారేది నెత్తురే పారేది నెత్తురే ఉరికొయ్యకి ఊగిస్తే నిన్నైనా నన్నైనా పోయేది ఊపిరే పోయేది ఊపిరే బ్రతకాలని ఆశలతో కబళించే ఆకలితో బ్రతిమాలే బానిసగా బ్రతుకంతా బాసటగా నీ యాతన నాకెరుకే నా దిగులు నీకెరుకే ఐశ్వర్యం నీకుంటే ఔదార్యం నాకుంది నీకున్న ఐశ్వర్యం నీ ఆయుస్సు పెంచినదా నాకున్న ఔదార్యం కష్టాలను కడతేర్చిందా ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! .....................................................06/03/2014

by Gajulapalli Madhava Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUsaTz

Posted by Katta

12, ఆగస్టు 2012, ఆదివారం

గాజులపల్లి || చైతన్య కవనం ||


నిస్సత్తువగా దాక్కోకు
నిజాయితీగా ముందుకురా
నిర్మొహమాటం నీలోఉంటే
నింగికి ఎగసే అలవైరా
నిస్సహాయంగా నిలుచోకు
మబ్బును తరిమే ఉరుమైరా
నిబద్ధతంటూ నీలోఉంటే
నియంతలాగా నిలబడురా

చావు బ్రతుకులు రెండే రెండు
చస్తూ బ్రతుకడమెందుకురా
సవ్వాల్ చేసే సత్తా ఉంటే
విజేతలాగా ముందుకురా

సమరానికి తెరలను తీసేలోపే
సహనం కత్తులు దూసే లోపే
నీలో తెలివికి మెలుకువ తేరా
భారత జాతికి ఖ్యాతిని తేరా

కోపం నిద్దుర లేయకముందే
ద్వేషం హద్దులు దాటక ముందే
నిటలాక్షుడిలా తపస్సు చేసి
కరుణను చిలికే కవ్వం తేరా

తనకై తానుగా బ్రతికే జనాల
స్వార్ధ గుణాలను దహనం చెయ్ రా
మనలో మనమై మమతల వనమై
పెరిగే పచ్చని ఒరవడి తేరా

మేఘం ఎందుకు పరుగెడుతుందో
నింగికి కుడా తెలియదురా
నెలకి దాహం తీర్చడానికని
చివరకి చినుకే చెప్పెనురా

చూపుకు చుక్కలు రాలవని
రెప్పలు మూయడం ఎందుకు రా
అవి రేపటి ఆశల గుర్తులని
గుర్తు పెట్టుకుని అడుగెయ్ రా

ఎందుకు నిజమే నిలదీస్తుందో
నీలో నీతికి ఎరుకే రా
అందుకు బయపడి జడిసేవాడు
వానపాముకి సమానము రా

మతాలు లేని రాజ్యం మనదని
కులాలు లేని జనాలు మనమని
అనాధలంటూ ఎవరూ లేరని
నినాద ధ్వనిలా ధనించి రా రా



*12-08-2012